Read more!

English | Telugu

శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ అవుట్!

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికీ ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరని అడుగక.. సిరిసిరి మువ్వలోని ఈ సాంగ్  ప్రస్తుతం శృతి హాసన్ ( Shruti haasan)కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది. విశ్వ కథానాయకుడు కమల్ వారసురాలిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శృతి  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒక రకంగా చెప్పాలంటే హీరోలకి మోస్ట్ లక్కీయస్ట్  హీరోయిన్. మరి ఆ సాంగ్ కి తనకి ఉన్న లింక్ ఏంటో చూద్దాం.

కమల్ లాగే శృతి కూడా  డేర్ వెపన్. ప్రైవేట్ లైఫ్ ని దాచుకోదు. అంతా పబ్లిక్..  కరోనా యుగంలో శంతన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి సోషల్ మీడియాని ఫుల్ గా వాడుకున్నారు. పోస్ట్ లు పెట్టడం, ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ పెట్టడం, లైక్స్ కొట్టుకోవడం లాంటివి చేసారు. ఇరువురి ఫాలోవర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తు రిప్లై లు కూడా ఇచ్చే వారు.మరిప్పుడు  ఏమైందో తెలియదు. కొన్ని రోజులనుంచి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  సోషల్ మీడియా అకౌంట్స్ ని ఒకరికొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో ఇద్దరు విడిపోయారనే ప్రచారం జరుగుతుంది. 

శృతి గతంలో కూడా ఒక విదేశీ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది.పేర్లు అప్రస్తుతం గాని ఇంకో ఇద్దరితో కూడా డేటింగ్ చేసింది. సినిమాల పరంగా చూసుకుంటే రీసెంట్ గా ప్రభాస్  సలార్ లో మెరిసింది. ప్రస్తుతానికి సలార్ 2 ,చెన్నై స్టోరీ ప్రాజెక్ట్స్ తన ఖాతాలో ఉన్నాయి. గత సంవత్సరం సంక్రాంతికి అయితే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి ల్లో నటించి టాక్ అఫ్ ది ఇయర్ గా నిల్చింది. ప్రస్తుతానికి  ముంబై లోనే ఉంటుంది. బాలీవుడ్ లో  ఇప్పటివరకు  సుమారు ఏడు చిత్రాలకి పైగానే చేసింది.