Read more!

English | Telugu

నాగ చైతన్యతో పెళ్లి..గౌన్ రీమోడల్ చేయించిన సమంత

సమంత (samantha) కి సంచలనానికి చాలా దగ్గర సంబంధం ఉంది.  ఒక రకంగా వైఫై లా  తన చుట్టు తిరుగుతుంది. ఒకప్పుడు తన సినిమాలు మాత్రమే మాట్లాడేవి. ఇప్పుడు పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతున్నాయి.తను కూడా అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  లేటెస్ట్ గా ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు అది సంచలనం గా మారింది.  

సమంత  ఒక గౌన్ ని రీ మోడల్ చేయించింది. పైగా అది అలాంటి ఇలాంటి గౌన్ కాదు. పెళ్లి గౌను. నాగ చైతన్య తో జరిగిన పెళ్ళిలో  ధరించింది. తెలుపు రంగు కలర్ లో ఒక అరుదైన డిజైన్ తో తయారు చెయ్యబడింది. అప్పట్లో అది  చాలా మందిని ఆకర్షించింది. ఇప్పుడు సమంత  తెల్ల గౌన్ ని  నలుపు రంగులోకి మార్చింది. దాన్ని ధరించి ముంబైలో జరిగిన ఒక అవార్డు కార్యక్రమానికి హాజరయ్యింది. వాటికీ సంబంధించిన  ఫోటోలని ఇనిస్టాగ్రమ్ లో కూడా  షేర్ చేసింది.  నాకున్న అలవాట్లలో పాత దుస్తుల్ని రీమోడలింగ్ చేసుకోడం కూడా ఒకటి అనే పోస్ట్ కూడా చేసింది. దీంతో పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతానికి ఆమె చేతిలో ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. సిటాడెల్ (citadel) అనే హిందీ వెబ్ సిరీస్ మాత్రమే ఉంది.ఇటీవలే ఎల్లే లీడర్స్ ఆఫ్ చేంజ్ గా ఎంపిక అయ్యింది. ఆ అవార్డు అందుకోవడానికే ముంబై  వెళ్ళింది. ఏ మాయ చేసావు తో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా అందరి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె చివరి చిత్రం విజయ్ దేవరకొండ  ఖుషి..డిజాస్టర్ గా నిల్చింది