'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ
గణపతి(అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తుంటాడు. అతని తమ్ముడుకి పెళ్ళయ్యి, ఒక పాప కూడా ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగమున్నా, పెళ్లి వయసు దాటిపోతున్నా గణకి మాత్రం వివాహం జరగదు. 50 సంబంధాలు చూసినా ఏదీ సెట్ అవ్వదు. బంధువులు, తెలిసినవాళ్లంతా "పెళ్ళెప్పుడు", "పప్పన్నం ఎప్పుడు పెడతావు" అని అడుగుతూనే ఉంటారు. అలాంటి గణ, అనుకోకుండా వివాహాలు కుదిర్చే హ్యాపీ మాట్రిమోనీని సంప్రదిస్తాడు.