స్వామికార్యం స్వకార్యం చూసుకొచ్చిన పొన్నాల
అంధకారాంద్రప్రదేశ్‌ను ప్రజలు ఎక్కువ కాలం సహించరని తెలుసుకున్న కిరణ్‌కుమార్ సర్కారు విద్యుత్ ఉత్పత్తి విషయమై కేంద్రంతో మాట్లాడటానికి గానూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిన్నీమధ్యూస్ , విద్వుత్ శాఖమంత్రిని ,పొన్నాలను పంపారు. వీరంతా కేంద్రానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. తక్షణమే స్పందించిన కేంద్రం గెయిల్ సంస్థద్వారా 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఇవ్వడానికి అంగీకరించింది.
కాగా ఈ ఒప్పందం తరువాత పొన్నాలలక్ష్మీనారాయణ, కేంద్రమంత్రి నారాయణస్వామిని సీక్రెట్‌గా కలుసుకున్నారని తెలిసింది. సీనియర్ మంత్రిగా ప్రాజెక్టుల టెండర్‌లలో అక్రమాలు జరిగాయని సిబిఐ పొన్నాలను కూడా పిలచి విచారణ చేపట్టింది. అవసరమైతే మరో సారి రావాల్సి వుంటుందని కూడా సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కోరారు. అందువల్ల సీబిఐ మానిటరింగ్ అంతా నారాయణస్వామి పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయనను కలిసారని తెలుస్తుంది.
మరో సారి సిబిఐ పిలుపు రాకుండా చూసుకుంటానికే ఇలా నారాయణస్వామిని కలిసారని తెలుస్తుంది. హోమ్ మినిస్టర్ గా చిదంబరం ఉన్నప్పటికీ ఆయన నుండి సిబిఐ కార్యకలాపాలను వేరు చేసి నారాయణస్వామికి కేంద్రం బాద్యతలు అప్పగించింది. ఈ నేపధ్యంలో పొన్నాల నారాయణస్వామిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.