రాష్ట్రానికి టెటనస్ బ్యాక్టీరియా ముప్పు?
posted on Jul 19, 2012 @ 3:30PM
రాష్ట్ర రాజధానిలో పేరుగాంచిన గాంధీ హాస్పిటల్‌లో టెటనస్ బాక్టిరియా ట్రేస్ అయ్యింది. టెటనస్ సోకినవారికి కండరాలు అన్నీ బిగుసుకు పోతాయి. దీనివల్ల ఫిట్స్ వస్తుంది. నాడీవ్యవస్త దెబ్బతింటుంది. ఈ బాక్టీరియా సోకిన వారికి ముఖకండరాలన్నీ గట్టిపడి తినటానికి ఉండదు. శ్వాసతీసుకోవడం కష్టగా ఉంటుంది. ఈవ్యాది తీవ్రత వల్ల గుండెకండరాలు కూడా గట్టిపడి చనిపోయే అవకాశం ఉంది. పిల్లలు చాలా త్వరగా ఈ వ్యాది బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి గాను భారత ప్రభుత్వం గర్బిణీలకు టీకాలు అన్ని ప్రాధమిక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది.
ప్రసవ సమయంలో ఈ వ్యాధిసోకి బాధితురాలు చనిపోయే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్నే స్ధానికంగా గుర్రపు వాతం అంటారు. భారతదేశం నుండి ఈ వ్యాధిని తరిమికొట్టాం అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ వ్యాధి కారక బాక్టీరియా గాంధీ హాస్పిటల్ కనుగోవటం తీవ్రంగా కలవరపెడుతుంది. పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా మూడునెలల వయస్సునుండి 10 సంవత్సరాలవరకు 5 దఫాలుగా టీకాలు వేయడం జరుగుతుంది. ఏది ఏమైనా బాక్టీరీయా ద్వారా త్వరగా వ్యాప్తిచెందుతున్న ఈ వ్యాధి నివారణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.