శంకరన్న తిక్క కుదిరింది

      కంటోన్మెంట్ శాసనసభ్యుడు శంకర్రావు తిక్క కుదిరింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన శాసనసభ అభ్యర్థుల జాబితాలో శంకర్రావుకి స్థానం లేకుండా పోయింది. ఇంతకాలం శంకర్రావు చేసిన ఓవర్ యాక్షన్‌కి తగిన ఫలితం లభించింది. సోనియాగాంధీకి గుడి కట్టించినా, సోనియా రాహుల్ భజన నిర్విరామంగా చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు బతిమాలుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ వినిపించుకోలేదు. తనకు గానీ, తన కూతురికి గానీ టిక్కెట్ వచ్చేలా చేయమని తన బావమరుదులు, వీ బ్రదర్స్ అయిన వినోద్, వివేక్‌లను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. శంకర్రావు ఇప్పుడు సోనియమ్మని దేవత అంటాడో, దయ్యం అంటాడో చూడాలి. తాను కట్టించిన సోనియా గుడిని అలాగే వుంచి పూజలు చేస్తాడో, మొత్తం గుడినే కూల్చేస్తాడో వేచి చూడాలి.

ఇద్దరికీ బ్యాండ్ పడింది!

      ఇద్దరు తెలంగాణ నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. వారికి భారీ స్థాయిలో బ్యాండ్ పడింది. ఇటు ఇంటికూటికి, అడు బంతి కూటికి చెడ్డట్టు అయింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ శాసనసభ్యులు ఆకుల రాజేందర్‌కి అకస్మాత్తుగా బుర్ర తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి టీఆర్ఎస్‌లో చేరిపోయాడు. రాజేందర్‌కి మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ రావడంలో ఎలాంటి సమస్య లేదు. అయినా రాజేందర్ టీఆర్ఎస్ పంచన చేరాడు. టీఆర్ఎస్‌లో ఓ వారం రోజులు వున్న తర్వాత తనను మందకృష్ణ చంపుతానంటున్నాడని, రాజకీయాల్లో వుండనని హడావిడి చేశాడు. ఈయన పరిస్థితి ఇలా వుంటే టీడీపీలో బలమైన నాయకుడిగా వున్న మైనంపల్లి హనుమంతరావు తనకు మల్కాజ్‌గిరి స్థానం ఇవ్వలేదని అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి టిక్కెట్ ఇస్తామని దిగ్విజయ్ సింగ్ నుంచి హామీ కూడా పొందాడు. ఇంతలో ఆకుల రాజేందర్ తనకు జ్ఞానోదయం కలిగిందంటూ సోమవారం నాడు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దర్లో మల్కాజ్‌గిరి స్థానం ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదో ఏమోగానీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దర్నీ కాదని నందికంటి శ్రీధర్ అనే వ్యక్తికి ఆ స్థానం కేటాయించేసింది. దీంతో ఆకుల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు ఇద్దరికీ జాయింట్‌గా బ్యాండ్ పడింది.

టీఆర్ఎస్ మూడో జాబితా

      టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మూడో జాబితాని విడుదల చేసింది. 8 ఎంపీ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తూ వుండగా, కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలోకి దిగుతున్నారు.   లోక్‌సభ అభ్యర్థులు.. మెదక్ - కేసీఆర్, పెద్దపల్లి - బాల్క సుమన్, జహీరాబాద్ - బీవీ పాటిల్, నిజామాబాద్ - కవిత, ఆదిలాబాద్ - నగేష్, హైదరాబాద్ - రషీద్ అలీ, మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఖమ్మం - బుడాన్ బేగ్‌షేక్. అసెంబ్లీ అభ్యర్థులు.. ఉప్పల్ - బేతి సుభాష్‌రెడ్డి, మలక్‌పేట్ - సతీష్ యాదవ్, చార్మినార్ - ఇనాయత్ అలీ, అంబర్‌పేట్ - ఎడ్ల సుధాకర్‌రెడ్డి, సనత్‌నగర్ - దండె విఠల్, యాకుత్‌పురా - ఎండీ షబ్బీర్ అలీ, ఎల్బీనగర్ - ఎం. రామ్మోహన్‌గౌడ్, కుత్బుల్లాపూర్ - కొలను హన్మంత్‌రెడ్డి, ఖైరతాబాద్ - మన్నే గోవర్థన్‌రెడ్డి, కార్వాన్ - ఠాకూర్ జీవన్‌సింగ్, గోషామహల్ - ప్రేమ్‌కుమార్‌దూత్, కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు, మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి, ఖమ్మం - జి. కష్ణ, వైరా - చంద్రావతి, పినపాక - శంకర్‌నాయక్, మధిర - బొమ్మెర రాంమూర్తి, నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా, మంచిర్యాల - దివాకర్‌రావు, నారాయణ్‌ఖేడ్ - భూపాల్‌రెడ్డి, కొడంగల్ -గుర్నాథ్‌రెడ్డి, ఆశ్వరావుపేట - ఎ. ఆదినారాయణ.

తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు

        రెండు రోజుల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయం 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.   జాబితా ఇలా ఉంది... జనగాం...పొన్నాల లక్ష్మయ్య, ఆందోల్...దామోదర రాజనరసింహ, మెదక్...విజయశాంతి, నిజామాబాద్ రూరల్... డి.శ్రీనివాస్, గజ్వేల్...నర్సారెడ్డి, సికిందరాబాద్... జయసుధ, సిర్పూర్...ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు... జి.వినోద్, మంచిర్యాల...గడ్డం అరవింద్ రెడ్డి, అసిఫాబా ద్... ఆత్రం సక్కు..., బోధ్...అనిల్, నిర్మల్...మహేశ్వర్ రెడ్డి, బోధన్...సుదర్శన్‌రెడ్డి,కామారెడ్డి...షబ్బీర్ అలీ, జుక్కల్...గంగారాం, కోరుట్ల... కొమిరెడ్డి రాములు, జగిత్యాల...జీవన్‌రెడ్డి, అంబర్‌పేట... వి.హనుమంతరావు, సనత్‌నగర్...మర్రి శశిధర్ రెడ్డి, నారాయణ పేట...వి.కృష్ణ, కొడంగల్...విఠల్‌రావు, జడ్చర్ల...మల్లు రవి, దేవరకద్ర...పవన్‌కుమార్, గద్వాల...డీకేఅరుణ, మక్తల్... రామ్మోహన్‌రెడ్డి, వనపర్తి...జి.చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్...దామోదర్ రెడ్డి, అలంపురం.. సంపత్‌కుమార్, అచ్చంపేట...వంశీకృష్ణ, కల్వకుర్తి...వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్...ప్రతాపరెడ్డి, హుజూర్‌నగర్...ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మిర్యాలగూడ...భాస్కరరావు, ఆదిలాబాద్...భార్గవ్ దేశ్‌పాండే, నిజామాబాద్ అర్బన్...సురేశ్ గౌడ్, సంగారెడ్డి..జగ్గారెడ్డి, ఎల్బీనగర్...సురేశ్‌రెడ్డి, కుత్బు ల్లాపూర్... కూన శ్రీశైలం గౌడ్, ఉప్పల్...కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,బాన్స్‌వాడ..బాల్‌రాజ్, పరిగి...రామ్మోహన్, ఎల్లారెడ్డి... వేదుల సురేంద్ర, ఇబ్రహీంపట్నం...మల్లేశ్, సిరిసిల్ల... కె.రవీంద్రరావు..., గోషామహల్...ముఖేశ్ గౌడ్, ఖానాపూర్... అజ్మీర్ హరినాయక్, వేములవాడ...బొమ్మ వెంకన్న, జూబ్లీ హిల్స్...విష్ణువర్ధన్‌రెడ్డి, ధర్మపురి...లక్ష్మణ్‌కుమార్, ముథోల్... విఠల్‌రెడ్డి, చార్మినార్...వెంకటేశ్, బహదూర్‌పురా...అబ్దుల్ నమి, మహబూబ్‌నగర్...ఒబేదుల్లా కొత్వాల్, యాకుత్‌పురా...సదానంద్ ముదిరాజ్, కంటోన్మెంట్...క్రిశాంత్, కొల్లాపురం...హర్షవర్ధన్‌రెడ్డి, సూర్యాపేట...ఆర్.దామోదర్ రెడ్డి, నకికేకల్...చిరుమర్తి లింగయ్య, స్టేషన్ ఘనపూర్...విజయరామారావు, వర్దన్నపేట్...శ్రీధర్, పరకాల...వెంకట్రామిరెడ్డి..., భూపాలపల్లి...గండ్ర వెంకటర మణారెడ్డి, ఖమ్మం...పువ్వాడ అజయ్, భద్రాచలం...కుంజా సత్యవతి, చొప్పదండి...సుద్దాల దేవయ్య, ఆర్మూర్... కేఆర్‌సురేశ్‌రెడ్డి, రామగుండం...సలీం పాషా, మంథని.. డి.శ్రీధర్‌బాబు, పెద్దపల్లి భానుప్రసాదరావు, కుత్బుల్లాపూర్...కూన శ్రీశైలం గౌడ్, శేరిలింగంపల్లి...భిక్షపతి యాదవ్, వికారాబాద్...గడ్డం ప్రసాద్, నారాయణ్ ఖేడ్...పి.కిష్టారెడ్డి, జహీరాబాద్...జె.గీతారెడ్డి, మల్కాజిగిరి...నందికంటి శ్రీధర్, ఎల్బీనగర్..డి.సుధీర్‌రెడ్డి, తాండూరు...నారాయణరావు..., ఖైరతాబాద్...దానం నాగేందర్, నాంపల్లి...వినోద్‌కుమార్, చాంద్రాయణ గుట్ట...అశ్విన్‌రెడ్డి, ములుగు...వీరయ్య..., మధిర...మల్లు భట్టి విక్రమార్క, నర్సాపూర్...సునీతా లక్ష్మారెడ్డి.., దుబ్బాక...ముత్యంరెడ్డి, రాజేంద్రనగర్..జ్ఞానేశ్వర్..., నాంపల్లి... వినోద్‌కుమార్, కార్వాన్...రూప్‌సింగ్, నాగార్జునసాగర్... కె.జానారెడ్డి, నల్లగొండ...కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డోర్నకల్... విద్యానాయక్, వరంగల్ వెస్ట్ స్వర్ణ..., ఈస్ట్...బస్వరాజు సారయ్య, సత్తుపల్లి...సంభాని చంద్రశేఖర్, మానకొండూరు...ఆరెపల్లి మోహన్, ధర్మపురి...లక్ష్మణ్‌కుమార్, దేవరకద్ర...పవన్‌కుమార్.

కేజ్రీవాల్ నోటి దురద

      ఈసారి ఎన్నికలలో తనకి, తన పార్టీకి అంత సీన్ లేదని అర్థం కావడంతోపాటు ఎక్కడకి వెళ్ళినా నిరసనలు, అవమానాలు ఎదురవుతూ వుండటంతో అరవింద్ కేజ్రీవాల్‌కి అయోమకంగా వున్నట్టుంది. తిరిగేకాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. ఆమ్ ఆద్మీ పార్టికి ఓట్లేయండంటూ అడగడానికి ఢిల్లీలోని గల్లీగల్లీలో తిరుగుతున్న కేజ్రీవాల్ కాళ్ళు హ్యాపీగా వున్నాయి. అయితే ఎవరో ఒకర్ని తిట్టందే ఊరుకోని నోరు మాత్రం సందర్భం కోసం ఎదురుచూస్తూ వుంటుంది. అందుకే కేజ్రీవాల్ వీలు దొరికితే తన నోటి దురద తీర్చుకుంటూ వుంటారు. సోమవారం ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనం నుంచి తప్పించుకని పారిపోవడానికి తానేమీ ఎవరి కూతుర్నీ లేవదీసుకుని పోలేదని అన్నారు. విద్యావంతుడు, సంస్కారవంతుడని కేజ్రీవాల్‌ విషయంలో కొంతమందికి వున్న భ్రమలు ఈ వ్యాఖ్యలతో తేలిపోయాయి. రాజకీయ పరంగా ఘాటైన విమర్శలు చేయవచ్చుగానీ, మరీ నేలబారు తరహాగా మాట్లాడ్డం కేజ్రీవాల్ లాంటి వ్యక్తికి తగదని పలువురు అంటున్నారు.

కట్టు తప్పుతున్న బీజేపీ క్యాడర్!

      కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పార్టీ. పార్టీ అగ్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పైనుంచి కింది వరకు అన్ని శ్రేణుల్లోని నాయకులు క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తారు. అయితే కాంగ్రెస్‌ని వ్యతిరేకించీ వ్యతిరేకించీ బీజేపీ కార్యకర్తలు కొన్ని కాంగ్రెస్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నట్టు వున్నారు. అది కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని కార్యకర్తలు. తెలుగుదేశంతో భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకత్వం ఎన్నిక పొత్తు కుదుర్చుకుంటే తెలంగాణలో వున్న స్థానిక నాయకత్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.   కొంతమంది ధర్నాలు గట్రాలు చేస్తే, మరికొందరు తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. తెలుగుదేశంతో పొత్తు తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తూ వుంటే, తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ, అగ్ర నాయకత్వం నిర్ణయాన్నే ప్రశ్నిస్తోంది. ఈ వర్గం వెనుక వున్నది బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డే అన్నది బహిరంగ రహస్యమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు కుదిరితే రాష్ట్రంలో పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఇన్ఫీరియార్టీ కిషన్ రెడ్డిలో మొదటి నుంచీ కనిపిస్తోంది. అందువల్లే తెదేపాతో పొత్తును కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకించేలా కిషన్‌రెడ్డి కీ ఇచ్చి వదిలారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్తల నుంచి ఎదురైన ప్రతిఘటనను, క్రమశిక్షణా రాహిత్యాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలలను అంతం చేయడానికి, మోడీని ప్రధానమంత్రిని చేయడానికి బీజేపీ అగ్ర నాయకత్వ నానా తంటాలూ పడుతూ వుంటే జనంలో పార్టీ చులకన అయ్యేలా కట్టు తప్పి వ్యవహరిస్తున్న వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మోడీ గొంతుకి ఏమైంది?

      భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గొంతు బొంగురుపోయింది. ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పటి నుంచి నరేంద్ర మోడీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే వున్నారు. రోజుకి అయిదారు బహిరంగ సభల్లో మాట్లాడుతూనే వున్నారు. ఇంకా పార్టీ మీటింగ్స్ లో, తనను కలవటానికి వచ్చేవారితో మాట్లాడ్డం అదనం. సోమవారం నాడు బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ మాట్లాడినప్పుడు ఆయన గొంతు బొంగురుపోయి వినిపించింది. మాట్లాడేది నరేంద్ర మోడీయేనా అనిపించేలా ఆయన గొంతు మారిపోయింది. ఎన్నికల ప్రచారం మరింత వేడి పుంజుకుంటున్న సమయంలో మోడీ గొంతు బొంగురుపోతూ వుండటం పట్ల భాజపా శ్రేణులు కలవరపడుతున్నాయి. మోడీ గొంతులోంచి వచ్చే తూటాల్లాంటి మాటల ప్రభావం గొంతు పాడవటం వల్ల తగ్గిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. మోడీ దీని నివారణకు తగిన వైద్య సహకారం తీసుకోవాలని కోరుకుంటున్నారు.

టీడీపీ ఫస్ట్ లిస్ట్

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభలకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపరచడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. పొత్తు కారణంగా పార్టీలోని కొంతమందికి న్యాయం జరగలేదని, వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితా ఇదే..   టీ.టీడీపీ అభ్యర్ధులు వీరే... బాన్సువాడ- రెడ్యానాయక్‌ బాల్కొండ- ఏలేటి మల్లికార్జునరెడ్డి బోధన్‌- ప్రకాశ్‌రెడ్డి జగిత్యాల- ఎల్‌.రమణ మంథని- కర్రు నాగయ్య పెద్దపల్లి- విజయరమణారావు మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ నారాయణఖేడ్‌-విజయపాల్‌రెడ్డి జహీరాబాద్‌- నరోత్తమ్‌ గజ్వేల్‌- ప్రతాప్‌రెడ్డి కూకట్‌పల్లి- మాధవరపు కృష్ణారావు ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి రాజేంద్రనగర్‌- ప్రకాశ్‌గౌడ్‌ తాండూరు- ఎం.నరేష్‌ సనత్‌నగర్‌- తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చాంద్రాయణగుట్ట- ప్రకాశ్‌ ముదిరాజ్‌ అచ్చంపేట- పి.రాములు దేవరకొండ- బిల్యా నాయక్‌ మిర్యాలగూడ- వెంకటేశ్వర్లు హుజూర్‌నగర్‌- వంగాల స్వామిగౌడ్‌ సూర్యాపేట- పటేల్‌ రమేష్‌రెడ్డి భువనగిరి- ఉమామాధవరెడ్డి మహబూబాబాద్‌- బాలూచౌహాన్‌ నర్సంపేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల- చల్లా ధర్మారెడ్డి ములుగు- ధనసరి అనసూయ(సీతక్క) టీ.టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు: ఆదిలాబాద్- రమేష్‌రాథోడ్‌ జహీరాబాద్‌- మదన్‌మోహన్‌రావు మహబూబాబాద్‌- బానోతు మోహన్‌లాల్‌

టీఆర్ఎస్ టిక్కెట్: పైసలుంటే చాలు భై!

      టీఆర్ఎస్‌లో టిక్కెట్ కావాలంటే పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినవాళ్ళు, త్యాగాలు చేసినవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదని, బాగా డబ్బుండాలి, లేదా వేరే పార్టీకి చెంది వుండాలని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. కేసీఆర్ విడుదల చేసిన మొదటి, రెండు లిస్టులను చూసి కడుపు మండిన తెరాస నాయకులు సొంత పార్టీ మీద, పార్టీ నాయకుడు కేసీఆర్ మీద గుర్రుగా వున్నారు. కేసీఆర్ విడుదల చేసిన రెండు లిస్టుల్లోనూ సగానికి పైగా పార్టీకి చెందని వారు, బాగా డబ్బుండి సడెన్‌గా ఊడిపడినవారే వున్నారని  విమర్శిస్తున్నారు. డబ్బులుంటే చాలు సీటు ఇచ్చే పరిస్థితి టీఆర్ఎస్‌కి రావడం బాధాకరమని అంటున్నారు. పార్టీ కోసం జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, పార్టీని అభివృద్ధి చేయడానికి నిద్రాహారాలు మాని కృషి చేసిన వారికి మొండిచెయ్యి చూపించారని విమర్శిస్తున్నారు. ఇలా మోసం చేసిన పార్టీకి ఈ ఎన్నికలలో సహకరించడానికి మనసు రావడం లేదని అంటున్నారు.

రాష్ట్ర విభజన: కేంద్రానికి హైకోర్టు నోటీసు!

      రాష్ట్ర విభజన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం మే మొదటి వారంలో విచారించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో విభజన మీద అనేక కేసులు దాఖలయ్యాయి. అయితే హైకోర్టు ఈ దశలో ఈ అంశపై కేసులు తీసుకోలేమని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు రాష్ట్ర విభజన కేసుల విషయంలో స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది ఒక శుభపరిణామమని సమైక్యవాదులు అంటున్నారు.

మళ్ళీ కాంగ్రెస్‌లోకి ఆకుల రాజేందర్

      కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మళ్ళీ పార్టీ మారారు. ఈసారి ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్‌లోకే చేరారు. పది రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి మారిన ఆకుల రాజేందర్ పేరును టీఆర్ఎస్ తన తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మందకష్ణ మాదిగ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల రాజేందర్ ఇప్పడు మళ్ళీ కాంగ్రెస్‌లో చేరి సంచలనం సృష్టించారు. దీంతో ఆయనకు మళ్ళీ మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఆయనకి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. అయితే ఇక్కడో తిరకాసు వుంది. మల్కాజిగిరి తెలుగుదేశం నాయకుడు ఈరోజే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకి మల్కాజిగిరి ఎమ్మెల్యే స్థానం నుంచి టిక్కెట్ ఇవ్వనున్నట్టు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. తాజాగా ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఇప్పుడు మల్కాజిగిరి టిక్కెట్ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

తిరస్కరణ ఓటుకీ గుర్తు: హైకోర్టు

      ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ వుంటారు. ఈసారి ఎన్నికలలో ‘ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు’ అనే ఆప్షన్ కూడా ఉంది. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. దీన్ని ఇంగ్లీషులో ‘నోటా’ అని పిలుస్తున్నారు. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లో ‘నోటా’ ఆప్షన్ కూడా వుంచారు. అయితే గ్రామీణులకు ఈ ఆప్షన్ అర్థం కాలేదు. అందుకే హైకోర్టు జోక్యం చేసుకుని, త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో నోటా ఆప్షన్ మీటకి ఒక గుర్తును కేటాయించాలని, దానివల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు ఆ ఆప్షన్‌ని వినియోగించుకునే అవకాశం వుంటుందని హైకోర్టు ఎన్నికల కమిషన్‌కి సూచించింది. ‘నోటా’ ఓటుకి ఎన్నికల కమిషన్ ఏ గుర్తును కేటాయిస్తుందో చూడాలి.

కిరణ్ కి సాయిప్రతాప్ బైబై

      మాజీ క్రికెటర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో వికెట్లు టపటపా పడిపోతున్నాయి. కిరణ్‌ పార్టీ పెట్టడానికి ఉత్సాహం ఇచ్చి, కాంగ్రెస్‌లో నుంచి బయటకి రావడానికి కారణమైన వాళ్ళందరూ ఇప్పుడు మెల్లగా బయటకి జారుకుంటున్నారు. నిన్నగాక మొన్న పితాని సత్యనారాయణ జారుకుంటే, ఇప్పుడు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ వికెట్ పడింది. పార్టీకి ఉపాధ్యక్షుడు కూడా అయిన సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజంపేట నుంచి మళ్ళీ కాంగ్రెస్ టిక్కెట్ పొందబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మారడం వెనుక సాయి ప్రతాప్ వ్యూహమేంటో అర్థం కావడం లేదు. జై సమైక్యాంధ్ర పార్టీలోనే వుంటే ఎన్నికలలో ఓడిపోయినా పరువు దక్కి వుండేది. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఓటమి దక్కడంతోపాటు జనాల్లో పరువు కూడా పోతుంది.

కాంగ్రెస్‌లోకి మైనంపల్లి

      తెలుగుదేశం, బీజేపీ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు వల్ల కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నరసరావుపేట అసెంబ్లీ సీటు విషయంలో కోడెల శివప్రసాదరావు నుంచి అలకని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని మల్కాజిగిరి శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వున్న మైనపల్లి హనుమంతరావు ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో హర్టయ్యారు. వెంటనే కాంగ్రెస్ తలుపులు తట్టారు. దాంతో ఢిల్లీ నుంచి ఆయనకి పిలుపు రావడం, ఢిల్లీకి వెళ్ళడం, దిగ్విజయ్ సింగ్‌ని కలవటం, కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.

టీడీపీ, బీజేపీ పొత్తు: ఫ్రస్టేషన్‌లో టీఆర్ఎస్

      టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడంతో రెండు పార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడ ఈ కలయిక దేశానికి మేలు చేసేదని అంటున్నారు. అయితే రాష్ట్రంలోని మిగతా పార్టీలు మాత్రం ఫ్రస్టేషన్‌లో పడిపోయాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఏడుస్తుంటే, ఉప ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో ఏడుస్తోంది. అలా పొత్తు కుదిరిందో లేదో ఇలా ప్రెస్‌మీట్ పెట్టేసిన హరీష్‌రావు తన ఫ్రస్టేషన్‌ని, టీఆర్ఎస్‌ నాయకుల ఫ్రస్టేషన్‌ని బయట పెట్టేశారు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం అదేదో దారుణం అన్నట్టుగా మాట్లాడారు. కాసేపు చంద్రబాబుని తిట్టి తన బీపీని తగ్గించుకున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా వుంటే బాగుండేదని బీజేపీకి హితవు చెప్పారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు తెలంగాణలో తమ పుట్టిని పూర్తిగా ముంచేసే అవకాశం వుందని టీఆర్ఎస్ భయపడుతోందన్న విషయం అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జగన్ అవినీతి తెలియదు: దినేష్‌రెడ్డి

      పదవిలో ఉన్నంతకాలం బాగానే సంపాదించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ పోలీస్ బాస్ దినేష్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చకున్న విషయం తెలిసిందే. వైకాపా తీర్థం పుచ్చుకోగానే దినేష్‌రెడ్డి పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడ్డం మొదలెట్టేశారు. ఈసారి ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న దినేష్‌రెడ్డి జగన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఆ ప్రయత్నాలో భాగంగానే ఆయన జగన్‌ని బుద్ధిమంతుడు అని అనేశారు. జగన్ అమాయకుడట. అవినీతి అంటే అస్సలు జగన్‌కి ఎంతమాత్రం తెలియదని అంటున్నారు. జగన్‌కి వ్యతిరేకంగా నమోదైన కేసులన్నీ దురుద్దేశ పూరితంగా పెట్టినవేనని ఆయన అన్నారు. పాపం దినేష్‌రెడ్డి అమాయకుడైనా అయి వుండాలి లేదా జనాన్ని అమాయకులని అనుకుంటూ అయిన వుండాలి.

బీజేపీ మేనిఫెస్టో: శ్రీరామనవమి గిఫ్ట్!

      భారతీయ జనతాపార్టీ శ్రీరాముడికి శ్రీరామనవమి కానుకని తన మేనిఫెస్టోలో ప్రకటించింది. రామాలయ నిర్మాణ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని, నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే మైనారిటీల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. 52 పేజీలున్న మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ విడుదల చేశారు. దేశప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బీజేపీ మేనిఫెస్టో వుందని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో తయారీ కోసం మురళీ మనోహర్ జోషీ ఆధ్వర్యంలోని 17 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. ఉపాధి కల్పన – పోలీసుల, న్యాయ పరిపాలన విభాగాల్లో సంస్కరణలు – మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం – అందరికీ ఆహార భద్రత – బ్లాక్ మనీ నివారణ – బ్రాండ్ ఇండియా రూపకల్పన – ప్రతి ఒక్కరికీ సాగు – తాగు నీరు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.