కిరణ్ కి సాయిప్రతాప్ బైబై
posted on Apr 7, 2014 @ 12:59PM
మాజీ క్రికెటర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో వికెట్లు టపటపా పడిపోతున్నాయి. కిరణ్ పార్టీ పెట్టడానికి ఉత్సాహం ఇచ్చి, కాంగ్రెస్‌లో నుంచి బయటకి రావడానికి కారణమైన వాళ్ళందరూ ఇప్పుడు మెల్లగా బయటకి జారుకుంటున్నారు. నిన్నగాక మొన్న పితాని సత్యనారాయణ జారుకుంటే, ఇప్పుడు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ వికెట్ పడింది. పార్టీకి ఉపాధ్యక్షుడు కూడా అయిన సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజంపేట నుంచి మళ్ళీ కాంగ్రెస్ టిక్కెట్ పొందబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మారడం వెనుక సాయి ప్రతాప్ వ్యూహమేంటో అర్థం కావడం లేదు. జై సమైక్యాంధ్ర పార్టీలోనే వుంటే ఎన్నికలలో ఓడిపోయినా పరువు దక్కి వుండేది. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఓటమి దక్కడంతోపాటు జనాల్లో పరువు కూడా పోతుంది.