Read more!

ఇద్దరికీ బ్యాండ్ పడింది!

 

 

 

ఇద్దరు తెలంగాణ నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. వారికి భారీ స్థాయిలో బ్యాండ్ పడింది. ఇటు ఇంటికూటికి, అడు బంతి కూటికి చెడ్డట్టు అయింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ శాసనసభ్యులు ఆకుల రాజేందర్‌కి అకస్మాత్తుగా బుర్ర తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి టీఆర్ఎస్‌లో చేరిపోయాడు. రాజేందర్‌కి మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ రావడంలో ఎలాంటి సమస్య లేదు. అయినా రాజేందర్ టీఆర్ఎస్ పంచన చేరాడు. టీఆర్ఎస్‌లో ఓ వారం రోజులు వున్న తర్వాత తనను మందకృష్ణ చంపుతానంటున్నాడని, రాజకీయాల్లో వుండనని హడావిడి చేశాడు. ఈయన పరిస్థితి ఇలా వుంటే టీడీపీలో బలమైన నాయకుడిగా వున్న మైనంపల్లి హనుమంతరావు తనకు మల్కాజ్‌గిరి స్థానం ఇవ్వలేదని అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి టిక్కెట్ ఇస్తామని దిగ్విజయ్ సింగ్ నుంచి హామీ కూడా పొందాడు. ఇంతలో ఆకుల రాజేందర్ తనకు జ్ఞానోదయం కలిగిందంటూ సోమవారం నాడు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దర్లో మల్కాజ్‌గిరి స్థానం ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదో ఏమోగానీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దర్నీ కాదని నందికంటి శ్రీధర్ అనే వ్యక్తికి ఆ స్థానం కేటాయించేసింది. దీంతో ఆకుల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు ఇద్దరికీ జాయింట్‌గా బ్యాండ్ పడింది.