తిరస్కరణ ఓటుకీ గుర్తు: హైకోర్టు
posted on Apr 7, 2014 @ 1:05PM
ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ వుంటారు. ఈసారి ఎన్నికలలో ‘ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు’ అనే ఆప్షన్ కూడా ఉంది. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. దీన్ని ఇంగ్లీషులో ‘నోటా’ అని పిలుస్తున్నారు. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లో ‘నోటా’ ఆప్షన్ కూడా వుంచారు. అయితే గ్రామీణులకు ఈ ఆప్షన్ అర్థం కాలేదు. అందుకే హైకోర్టు జోక్యం చేసుకుని, త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో నోటా ఆప్షన్ మీటకి ఒక గుర్తును కేటాయించాలని, దానివల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు ఆ ఆప్షన్‌ని వినియోగించుకునే అవకాశం వుంటుందని హైకోర్టు ఎన్నికల కమిషన్‌కి సూచించింది. ‘నోటా’ ఓటుకి ఎన్నికల కమిషన్ ఏ గుర్తును కేటాయిస్తుందో చూడాలి.