బీజేపీ మేనిఫెస్టో: శ్రీరామనవమి గిఫ్ట్!
posted on Apr 7, 2014 @ 12:02PM
భారతీయ జనతాపార్టీ శ్రీరాముడికి శ్రీరామనవమి కానుకని తన మేనిఫెస్టోలో ప్రకటించింది. రామాలయ నిర్మాణ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని, నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే మైనారిటీల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. 52 పేజీలున్న మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ విడుదల చేశారు. దేశప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బీజేపీ మేనిఫెస్టో వుందని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో తయారీ కోసం మురళీ మనోహర్ జోషీ ఆధ్వర్యంలోని 17 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. ఉపాధి కల్పన – పోలీసుల, న్యాయ పరిపాలన విభాగాల్లో సంస్కరణలు – మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం – అందరికీ ఆహార భద్రత – బ్లాక్ మనీ నివారణ – బ్రాండ్ ఇండియా రూపకల్పన – ప్రతి ఒక్కరికీ సాగు – తాగు నీరు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.