టీడీపీ ఫస్ట్ లిస్ట్
posted on Apr 7, 2014 @ 3:18PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభలకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపరచడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. పొత్తు కారణంగా పార్టీలోని కొంతమందికి న్యాయం జరగలేదని, వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితా ఇదే..
టీ.టీడీపీ అభ్యర్ధులు వీరే...
బాన్సువాడ- రెడ్యానాయక్
బాల్కొండ- ఏలేటి మల్లికార్జునరెడ్డి
బోధన్- ప్రకాశ్‌రెడ్డి
జగిత్యాల- ఎల్.రమణ
మంథని- కర్రు నాగయ్య
పెద్దపల్లి- విజయరమణారావు
మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
నారాయణఖేడ్-విజయపాల్‌రెడ్డి
జహీరాబాద్- నరోత్తమ్
గజ్వేల్- ప్రతాప్‌రెడ్డి
కూకట్‌పల్లి- మాధవరపు కృష్ణారావు
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి
రాజేంద్రనగర్- ప్రకాశ్‌గౌడ్
తాండూరు- ఎం.నరేష్
సనత్‌నగర్- తలసాని శ్రీనివాస్‌యాదవ్
చాంద్రాయణగుట్ట- ప్రకాశ్ ముదిరాజ్
అచ్చంపేట- పి.రాములు
దేవరకొండ- బిల్యా నాయక్
మిర్యాలగూడ- వెంకటేశ్వర్లు
హుజూర్‌నగర్- వంగాల స్వామిగౌడ్
సూర్యాపేట- పటేల్ రమేష్‌రెడ్డి
భువనగిరి- ఉమామాధవరెడ్డి
మహబూబాబాద్- బాలూచౌహాన్
నర్సంపేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల- చల్లా ధర్మారెడ్డి
ములుగు- ధనసరి అనసూయ(సీతక్క)
టీ.టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు:
ఆదిలాబాద్- రమేష్‌రాథోడ్
జహీరాబాద్- మదన్‌మోహన్‌రావు
మహబూబాబాద్- బానోతు మోహన్‌లాల్