జగన్ అవినీతి తెలియదు: దినేష్‌రెడ్డి
posted on Apr 7, 2014 @ 12:18PM
పదవిలో ఉన్నంతకాలం బాగానే సంపాదించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ పోలీస్ బాస్ దినేష్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చకున్న విషయం తెలిసిందే. వైకాపా తీర్థం పుచ్చుకోగానే దినేష్‌రెడ్డి పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడ్డం మొదలెట్టేశారు. ఈసారి ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న దినేష్‌రెడ్డి జగన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఆ ప్రయత్నాలో భాగంగానే ఆయన జగన్‌ని బుద్ధిమంతుడు అని అనేశారు. జగన్ అమాయకుడట. అవినీతి అంటే అస్సలు జగన్‌కి ఎంతమాత్రం తెలియదని అంటున్నారు. జగన్‌కి వ్యతిరేకంగా నమోదైన కేసులన్నీ దురుద్దేశ పూరితంగా పెట్టినవేనని ఆయన అన్నారు. పాపం దినేష్‌రెడ్డి అమాయకుడైనా అయి వుండాలి లేదా జనాన్ని అమాయకులని అనుకుంటూ అయిన వుండాలి.