నటసింహం ఆప్తుడు తన్నులు తిన్నాడు

సింహం గుడ్డిదైతే ఎలుకలు ఎకసెక్కాలాడాయంట...! ఇప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా కళ్ళుమూసుకున్న నటసింహం పరిస్థితి కూడా అలాగే తయారైంది. నటసింహం నిజంగానే సింహమే... కానీ ఆయన చుట్టు వున్నది మాత్రం ఎలుకలు కాదు... ఏకంగా పందికొక్కులు... ఇసుకను బొక్కేసే పందికొక్కులు. శాండ్‌ని శాండ్‌విచ్‌లాగా మింగేసే ప్రయత్నంలో ఆ పందికొక్కుల కీచులాటలు నటసింహం ప్రతిష్టకే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వచ్చాయి. అసలింతకీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకే బంగారమైపోయింది. బెల్లం వున్న చోట ఈగలు మూగినట్టు ఇసుక వున్న చోట ఇసుక బకాసురుల మాఫియా మూగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రముఖుడు నటసింహం చుట్టూ తిరిగే ఒక వ్యక్తికి తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఇసుక ర్యాంపు మీద కన్నుపడింది. నటసింహం పేరు చెప్పి ఆ ఇసుక ర్యాంపును బినామీ పేరుతో సొంతం చేసుకున్నాడు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఆ ఇసుక ర్యాంపు కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం కొంతమందిని పార్టనర్లుగా చేర్చుకున్నాడు. సొంత పార్టీలో ఎవరూ లేనట్టుగా ప్రతిపక్ష హోదాకూడా లేని ఓ పార్టీకి చెందిన వ్యక్తిని ఒక పార్టనర్‌గా చేర్చుకున్నాడు. ఆ పార్టనర్ మరెవరో కాదు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆత్మకి ఆత్మబంధువుగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తికి స్వయానా బావమరిది. వీళ్ళంతా కలసి ‘నటసింహం’ పేరు ఉపయోగించుకుంటూ మూడు జేసీబీలు ఆరు లారీల్లాగా ఇసకని రొల్లుకున్నారు.. ఇంతవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాతే అసలు ప్రాబ్లం వచ్చింది. ఈమధ్య తూర్పు గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపు  ద్వారా వచ్చిన కొన్ని కోట్ల రూపాయలని మన నటసింహం గారి తాలూకు వ్యక్తి  గప్‌చుప్‌గా తన జేబులో వేసేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సదరు బావమరిది ఆవేశంతో రగిలిపోయాడు. నువ్వు జేబులో వేసుకున్న డబ్బులో నా వాటా నాకివ్వు అని డిమాండ్ చేశాడు. అయితే నటసింహం తాలూకు మనిషి ఈ డిమాండ్‌ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. రేపు మాపు అని తిప్పుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడు.. లెక్కలు చెప్పడు... డబ్బులు గట్టిగా అడిగితే ఎక్కువగా మాట్లాడితే నటసింహంతో నీ గురించి బ్యాడ్‌గా చెబుతా అని బెదిరించడం మొదలెట్టాడు. దాంతో బావమరిది గారికి ఫుల్లుగా కోపం వచ్చేసింది. నటసింహం తోకలాంటి సదరు వ్యక్తినిహైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌కి పిలిపించాడు. అక్కడ అతన్ని ఆ ఎడాపెడా తన్నాడు. దాంతో ఈ విషయం పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ అంశంలో ఇద్దరూ ఇసుక మింగే పందికొక్కులే. కాకపోతే ఈ పందికొక్కులకారణంగా సింహం లాంటి నటసింహానికి చెడ్డపేరు వస్తోంది. నటసింహం ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండా తనచుట్టూ చేర్చుకోవడం వల్ల వాళ్ళు ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతూ నటసింహానికి చెడ్డపేరు తెస్తున్నారు. నటసింహానికి తోకలాగా వుండే వ్యక్తిని వైఎస్సార్ ఆత్మకి బామ్మర్ది కొట్టాడన్న విషయం ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మార్మోగుతోంది. ఈ విషయం నలుగురికీ తెలిసినా నటసింహానికి తెలియకపోవడం ఆశ్చర్యకరమే.  అందువల్ల మచ్చలేని చంద్రుడి లాంటి నటసింహం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జూలు విదల్చాలని, తన చుట్టూ వున్నవాళ్ళు చేస్తున్న అవకతవకలను అరికట్టాలని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేవాళ్ళని దూరంగా పెట్టాలని ఆయన్ని అభిమానించేవారు కోరుకుంటున్నారు.

టీ టీడీపీ సమావేశం.. చంద్రబాబు వస్తారా?రారా?

  ఈరోజు టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా వరంగల్ ఉపఎన్నిక ప్రచారం.. ప్రచారంలో వ్యూహాల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. వరంగల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వచ్చేది? రానిది? ఈ సమావేశంతో తేలిపోతుంది. అయితే వరంగల్ ఉపఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందని నేతలు భావిస్తున్నారు.. ఈనేపథ్యంలో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి.. ఎలాగైనా ప్రచారానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన రైతు..? కావాలనే చేశారు.. టీఆర్ఎస్

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున పసునూరి దయాకర్ బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు పసునూరి తరుపున ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన కడియం శ్రీహరికి ఓ చేధు అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసునూరి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఇతర టీఆర్ఎస్ నేతలు శాయంపేట మండలానికి వెళ్లారు. అయితే అక్కడ కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై ఓ రైతు చెప్పు విసిరాడు. దీంతో కార్యకర్తలు అతనిని పోలీసులకు అప్పగించారు. అయితే రైతు మాట్లాడుతూ తమకు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని.. అందుకే కోపంతో చెప్పు విసిరానని చెప్పాడు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కుట్రలో భాగమే అని.. కావాలనే ప్రతిపక్షాలు ఇలా చేయించాయని మండిపడుతున్నారు. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీపై రైతులు మాత్రం కోపంగానే ఉన్నారన్నది నిజం. రైతుల ఆత్మహత్యలపై అధికార పార్టీ వ్యవహరిస్తున్నతీరుకు అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కావాలని చేయించారు అని ఆరోపిస్తున్నా.. రైతులు మాత్రం నిజంగానే కోపంతో ఉన్నారు.. ప్రత్యేకంగా వారితో చేయించాల్సిన అవసరం లేదు.. వారికి ఎక్కడికి వెళ్లినా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వకతప్పదు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి మౌనం.. ఎందుకో?

రేవంత్ రెడ్డి.. తెలంగాణ టీడీపీ నేతల్లో.. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పగల, వాక్చాతుర్యం ఉన్న ఏకైక వ్యక్తి. విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగల సత్తా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డే. అందుకే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అసలు డౌట్ ఏంటంటే.. ఎక్కడ సందు దొరుకుతుందా.. ప్రతిపక్షాలను తన మాటలతో ఎప్పుడు ఏకీ పారేద్దామా అని చూసే రేవంత్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ గా ఉండటం. అసలు ఈ సైలెంట్ కు కారణం ఏంటి.. అంటే సైలెంట్ ఉంటూ భవిష్యత్ కార్యచరణలకి వ్యూహాలు పన్నుతున్నారు.. లేకపోతే తుఫాను వచ్చే ముందు ఇలాగే సైలెంట్ గా ఉంటుందని చూపెడుతున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇప్పటికే అవరావతి శంకుస్థాపన కార్యక్రమం వల్ల నిప్పు, ఉప్పులా ఉండే సీఎంలు కాస్త స్నేహ బంధానికి దారి తీశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కూడా ఏం అనలేని పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు టీడీబీ-బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ ఓట్ల తొలగింపుపై చేసిన ధర్నాలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఏది ఏమైనా టీడీపీ కంచు అయిన రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండటం వెనుక అసలు కారణం ఏంటో?

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ మట్టి సత్యాగ్రహం

  కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా నేతలు మొత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. అంతేకాదు ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే కేంద్రం తక్షణం ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయాలంటూ ఈ నెల 9, 10 తేదీల్లో  అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, 15 నుండి 20 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో మట్టి సత్యాగ్రహాలు నిర్వహించాలని నిర్ణయించున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సి. రామచంద్రయ్య మాట్లాడుతూ.. కాపులను బీసీలోకి చేర్చాలన్న చిత్తశుద్ది చంద్రబాబుకు లేదని.. పుట్టస్వానికమిషన్ నివేదిక ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించవచ్చని.. చంద్రబాబు కావాలనే కాలయాపన చేస్తున్నారని అన్నారు.

వరంగల్ ఉపఎన్నిక.. బీజేపీ-టీడీపీ అభ్యర్ధిపై అసంతృప్తి?

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ-టీడీపీ తరుపున దేవయ్య ను రంగలోకి దించుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో మాత్రం బీజేపీపై ఆపార్టీలో ఉన్న పలువురు నేతలే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు ఈ ఎన్నికకు టీడీపీ-బీజేపీ నేతలు మేమంటే మేము అని పోటీ పడినా మిత్రపక్షం ఉంది కాబట్టి.. టీడీపీ ఆ అవకాశం బీజేపీకే ఇచ్చింది. అయితే ఈ విషయంలో నెగ్గిన బీజేపీ మాత్రం.. బరిలో సరైన అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో మాత్రం విఫలమైందని అనుకుంటున్నారు. పోటీకి ఎవరూ దొరకనట్టు ఎక్కడో అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐకు టికెట్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ కూడా ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అసలే తమకు రావాల్సిన సీటు బీజేపీ కి రావడంతో అసంతృప్తితో ఉన్న నేతలు.. ఏదో పైకి తాము అభ్యర్ధి పోటీకి కృషి చేస్తామని చెప్పినా.. బీజేపీ సరైన నాయకుడిని ఎంచుకోవడంలో పొరపాటు చేసిందని.. ఆ నాయకుడి కోసం ఎంత ప్రచారం చేసినా దండగే అని భావిస్తున్నారంట. అంతేకాదు ఆ స్థానంలో ఇంకా బలమైన నాయకుడికి అవకాశం ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ కు గట్టి పోటి ఉండేదని భావిస్తున్నారు. మొత్తానికి బీజేపీ అత్యుత్సాహం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకునేలా ఉంది.

భూసేకరణతో నాకు సంబంధం లేదు.. కేఈ

ఏపీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి వ్యవహారం ఆపార్టీలోని నాయకులకే అర్ధంకాని పరిస్థితిలో ఉంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు విమర్సలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు పార్టీ నేతలు. కేఈ రీసెంట్ గా భూసేకరణపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భూసేకరణ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అది వేరే మంత్రి చూసుకుంటున్నారని.. ఆయనకు అధికారులను సప్లయ్ చేయడమే పని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అసలు కేఈ ఇలా ఎందుకు మాట్లాడారని పార్టీలో చర్చజరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు రెవెన్యూ శాఖలో అవకతవకలు జరగుతున్నాయని కేఈని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అంతేకాదు అప్పట్లో కేఈ స్థానంలో మరొకరిని కూడా నియమిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు కేఈ పై చర్చ మొదలైంది. మరి మొత్తానికి కేఈ కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో? లేక యాదృచ్ఛికంగా చేస్తున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న సంగతి మాత్రం అర్దమవుతోంది.

అసలు కాంగ్రెస్ రాజయ్యకు టికెట్ ఇవ్వకుంటే..?సారిక బతికుండేదా?

కాలం కలిసిరానప్పుడు ఏం చేసిన ఏం ప్రయోజనం ఉండదు..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఉంది. అసలే రాష్ట్ర విభజన చేయడంవల్లో పూర్తి ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఏదో ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతుందనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు రాజయ్య వ్యవహారం ఒకటి తలనొప్పిగా తయారైంది. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు చనిపోయిన నేపథ్యంలో ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నాయి. అయితే అంతా బానే ఉన్నా ఇప్పుడు ఒక విషయం గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. అది రాజయ్య టికెట్ గురించి. అసలు కాంగ్రెస్ పార్టీనే కనుక రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని అనుకుంటున్నారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజయ్యకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాజయ్య నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే రాజయ్య కోడలు సారిక అంతకు ముందే అధిష్టానానికి లేఖ రాసిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఆలేఖ ఏమైందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజయ్యకు టికెట్ ఇచ్చింది. అయితే రాజయ్యకు వరంగల్ లో ఉన్న తన ఇంటి నుండి నామినేషన్ వేయాలనే సెంటిమెంట్ ఉండటంతో.. ఎప్పటినుండో వరంగల్ రాని రాజయ్య నామినేషన్ వేయడానికని వచ్చారు. అయితే అక్కడ కోడలు సారికతో రాజయ్య గొడవపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవ కూడా సారిక లేఖ రాసినందుకే రాజయ్య గొడవ పడ్డాడని అంటున్నారు. ఆ గొడవ జరిగిన తరువాతే ఈ దారణమైన ఘటన చోటుచేసుకుంది. దీంతో అసలు కాంగ్రెస్ పార్టీనే కనుక రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే ఇలాంటి ఘోరం జరుగుండేది కాదని అంటున్నారు. అంతేకాదు గతంలోనే సారిక.. మామ రాజయ్య, అతని కుటుంబసభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అది ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు అలాంటి రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎలా టికెట్ ఇస్తుందని.. గృహహింస కేసు కింద కోడలిని వేధిస్తున్నట్లుగా చార్జిషీటు కూడా నమోదైన రాజయ్య తప్ప ఇంకేవరూ లేరా? అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజయ్య ఎఫెక్ట్ ఎక్కడ పార్టీ మీద పడుతుందా అని టెన్షన్ పడుతుంది. ఏదో పైకి మేకపోతు గాంభీర్యం చూపించినా లోపల మాత్రం టెన్షన్ మామూలే. ఇప్పటికే రాజయ్య కుటుంబంలో జరిగిన ఘటన గురించి ప్రచారంలో ఎక్కడా మాట్లాడొద్దని.. ఒకవేళ మాట్లాడిన సానుభూతి కలిగే మాటలు మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్నారు నేతలు. అంతేకాదు పార్టీనుండి రాజయ్యను సస్పెండ్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఎన్నివిధాలా ప్రయత్నించినా ప్రజల్లో పడిన భావనను తొలగించాలంటే కుసింత కష్టమైన పనే.

అంత వరకూ గడ్డం తీయను.. జగన్ టెన్షన్

వైసీపీ అధ్యుక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఎలాగూ జగన్మోహన్ రెడ్డికి పర్యటనలు, ఓదార్పు యాత్రలు మామూలే.. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి జగన్ తన సొంతం నియోజక వర్గమైన పులివెందులలో పర్యటించడానికి మాత్రం అసలు కారణం వేరే ఉందట. అది ఎవరో కాదు జగన్ రాజకీయ ప్రత్యర్ధి, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డే నట. సతీష్ రెడ్డికి జగన్ సంబంధం ఏంటనుకుంటున్నారా.. ప్రస్తుతం కౌన్సిల్ లో డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న సతీష్ రెడ్డి పులివెందులో విస్తృతంగా పర్యటిస్తూ తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో తన నియోజక వర్గం గురించి అంతగా పట్టించుకొని జగన్ కు ఇప్పుడు టెన్షన్ మొదలైందట. అంతేకాదు పులివెందులలోని తన నియోజక వర్గంలో ఉన్న 50 వేల ఏకరాల భూమికి నీరందించే వరకూ తను గడ్డం తీయనని సతీష్ రెడ్డి ప్రతిజ్ఞ కూడా చేశాడట. అంతే సతీష్ రెడ్డి దూకుడు  చూసిన జగన్ ఇప్పుడు తన నియోజక వర్గంలో ఎక్కడ బలం తగ్గిపోతుందో అని అలెర్ట్ అయి పులివెందులలో పర్యటించారట. మరి ఇది నిజమో? కాదో?.. ఏ ఉద్దేశ్యంతో జగన్ పర్యటించారో అయనకే తెలియాలి.

మహేశ్ అంటే ఏంకాదు.. నేనంటే తప్పా?.. అలీ

కమెడియన్ అలీ యాంకరింగ్ సంగతి అందరికి తెలిసిందే. స్టేజ్ ఎక్కాడంటే ఎదో ఒక కాంట్రవర్సీ లేకుండా మాత్రం ఉండటంలేదు. తను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కామెంట్ చేయడం.. అందరితో తిట్టించుకోవడం సరిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే ఇది మరీ ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు తన వివాదంలోకి పాపం మహేశ్ బాబును కూడా లాగేలా ఉన్నాడు అలీ. రీసెంట్ గా అనుష్క నటించిన సైజ్ జీరో సినిమా ఆడియో రిలీజ్ అయిన సంగతి తెలసిందే. ఈ ఆడియా ఫంక్షన్లో అలీ అనుష్క తొడల గురించి కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో అలీపై అందరూ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు ‘మహేష్ బాబు కూడా ఖలేజా సినిమాలో అనుష్క తొడల మీద కామెంట్ చేసాడు. అప్పుడు ఎవరూ ఆ విషయాన్ని తప్పుబట్టలేదు.. ఇప్పుడు నేనంటే వివాదం చేస్తున్నారు అంటూ సమాధానం చెప్పాడట. మొత్తానికి అలీ తనతో పాటు ఈ వివాదంలో పాపం మహేశ్ ను కూడా ఇరికించేలా ఉన్నారు.

‘త్రిపుర’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

తారాగణం: స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్. సంగీతం : కుమరన్, దర్శకత్వం : రాజ్ కిరణ్, నిర్మాతలు : ఎ చినబాబు, ఎమ్ రాజశేఖర్. ‘త్రిపుర’ ఒక హారర్ కామెడీ థ్రిల్లర్. కథ విషయానికి వస్తే, పల్లెటూరిలో ఎంతో అందమైన జీవితాన్ని గడిపే త్రిపుర (స్వాతి) అనే అమ్మాయిని డాక్టర్ నవీన్ చంద్ర ఎంతో ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు. ఆ తర్వాత ఈ జంట నగరంలో కాపురం పెడుతుంది. వీరు అద్దెకు వుంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లో దయ్యం వుందని తెలుస్తుంది. ఆ దయ్యం వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, దాని బారి నుంచి వారు ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో స్వాతి చక్కని నటనతో ఆకట్టుకుంది. హీరో నవీన్ చంద్ర తన పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్ తన మార్క్ చూపించాడు. ఈ హారర్ కామెడీని దర్శకుడు రాజ్ కిరణ్ ప్రతిభావంతంగానే డీల్ చేశాడు.

దావూద్ గ్యాంగ్ గుట్టు విప్పుతా.. చోటా రాజన్

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను భారత్ తీసుకొచ్చారు. ఇండోనేషియాలో బాలి జైల్లో ఉన్న చోటా రాజన్ ను ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించారు. అయితే ఎయిర్ పోర్ట్ లో దిగగానే చోటా రాజన్ భూమిని ముద్దాడారు. కాగా ఎయిర్ పోర్ట్ నుండి చోటా రాజన్ ను జైలుకు తరలించేందుకు డమ్మీ కాన్మాయ్ ను వాడింది. అయితే చోటా రాజన్ తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పిన కారణంగా అతని కేసులపై విచారణను బాధ్యతను సీబీఐకి అప్పగించారు. దీంతో చోటారాజన్ పై ఉన్న అన్ని కేసులు సీబీఐకి బదీలీ చేశారు. చోటా రాజన్ పై మొత్తం ముంబైలో 75, ఢిల్లీలో 10 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో చోటా రాజన్ విచారణ జరపనున్నారు.. అంతేకాదు దావూద్ గ్యాంగ్ గుట్టు విప్పుతానని చోటా రాజన్ చెప్పాడు.

మంత్రి... ఆయన భార్య కంత్రీ

  కర్ణాటక రాష్ట్ర మంత్రి ఆంజనేయ లంచం కేసులో చిక్కుకున్నారు. ఆయన స్వయానా లంచం తీసుకుంటే అన్ని జాగ్రత్తలూ తీసుకునేవారే. కానీ ఆయన భార్యగారు లంచం తీసుకోవడంలో అజాగ్రత్తగా వుండటం వల్ల మీడియాకి దొరికిపోయారు. ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఒక టెండర్ని మంత్రిగారికి చెప్పి తనకే దక్కేలా చూడాలని కోరుతూ ఒక వ్యక్తి మంత్రి గారి భార్యను ఆశ్రయించారు. మంత్రిగారిని మించిన కంత్రీగారు అయిన ఆ భార్యామణి సరేనని అతనికి అభయం ఇచ్చింది. దాంతో ఆ వ్యక్తి ఆమెకు ఏడు లక్షల రూపాయల లంచం ఇచ్చాడు. టోటల్‌గా ఏంటంటే, ఇదంతా స్టింగ్ ఆపరేషన్లో రికార్డు అయింది. సదరు వ్యక్తి మంత్రిగారి కంత్రీకి ఇచ్చిన డబ్బు కూడా అసలు కాదు.. పక్కా నకిలీవి. ఈ ఉదంతం అంతా కర్ణాటక టీవీ ఛానళ్ళలో ప్రసారం అయింది. దీంతో ప్రతిపక్షాలు మంత్రిగారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఆంజనేయ మాత్రం తన భార్యకి ఏ పాపమూ తెలియదని, తమ మీద ఏదో కుట్ర జరిగిందని వాపోతున్నాడు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టనైతే పెట్టారు కానీ ఇప్పటి వరకూ ఆయన ఎన్నికల్లో నిలిచింది లేదు. అయితే ఇప్పుడు త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో తన పార్టీ నుండి అభ్యర్ధులను బరిలోకి దించేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల గుర్తింపు వచ్చాక పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ పోటీ చేస్తే స్వతంత్రంగా పోటీ చేస్తారా లేక.. బీజేపీ-టీడీపీ కూటమితో బరిలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందకుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ-టీడీపీ తో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారట. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించారట. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.