కావాలంటే షారుఖ్ పాక్ వెళ్లిపోవచ్చు
దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పై ఆర్ఎస్ఎస్ నాయకురాలు సాద్వి ప్రాచీ మండిపడ్డారు, దేశంలో పరమత సహనం అవసరమన్న షారుఖ్... కావాలనుకుంటే పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు, షారుఖ్ ఖాన్ పాక్ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని, ఆయనను కఠినంగా శిక్షించాలని సాద్వి ప్రాచీ డిమాండ్ చేశారు, మత అసహనం పెరిగిపోతుదంటూ పలువురు మేధావులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో సాద్వి ప్రాచీ కామెంట్స్ మరింత దుమారం రేపే అవకాశం కనిపిస్తున్నాయి.