అంత వరకూ గడ్డం తీయను.. జగన్ టెన్షన్
posted on Nov 6, 2015 @ 1:49PM
వైసీపీ అధ్యుక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఎలాగూ జగన్మోహన్ రెడ్డికి పర్యటనలు, ఓదార్పు యాత్రలు మామూలే.. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి జగన్ తన సొంతం నియోజక వర్గమైన పులివెందులలో పర్యటించడానికి మాత్రం అసలు కారణం వేరే ఉందట. అది ఎవరో కాదు జగన్ రాజకీయ ప్రత్యర్ధి, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డే నట. సతీష్ రెడ్డికి జగన్ సంబంధం ఏంటనుకుంటున్నారా.. ప్రస్తుతం కౌన్సిల్ లో డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న సతీష్ రెడ్డి పులివెందులో విస్తృతంగా పర్యటిస్తూ తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో తన నియోజక వర్గం గురించి అంతగా పట్టించుకొని జగన్ కు ఇప్పుడు టెన్షన్ మొదలైందట. అంతేకాదు పులివెందులలోని తన నియోజక వర్గంలో ఉన్న 50 వేల ఏకరాల భూమికి నీరందించే వరకూ తను గడ్డం తీయనని సతీష్ రెడ్డి ప్రతిజ్ఞ కూడా చేశాడట. అంతే సతీష్ రెడ్డి దూకుడు చూసిన జగన్ ఇప్పుడు తన నియోజక వర్గంలో ఎక్కడ బలం తగ్గిపోతుందో అని అలెర్ట్ అయి పులివెందులలో పర్యటించారట. మరి ఇది నిజమో? కాదో?.. ఏ ఉద్దేశ్యంతో జగన్ పర్యటించారో అయనకే తెలియాలి.