మహేశ్ అంటే ఏంకాదు.. నేనంటే తప్పా?.. అలీ
posted on Nov 6, 2015 @ 11:48AM
కమెడియన్ అలీ యాంకరింగ్ సంగతి అందరికి తెలిసిందే. స్టేజ్ ఎక్కాడంటే ఎదో ఒక కాంట్రవర్సీ లేకుండా మాత్రం ఉండటంలేదు. తను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కామెంట్ చేయడం.. అందరితో తిట్టించుకోవడం సరిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే ఇది మరీ ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు తన వివాదంలోకి పాపం మహేశ్ బాబును కూడా లాగేలా ఉన్నాడు అలీ. రీసెంట్ గా అనుష్క నటించిన సైజ్ జీరో సినిమా ఆడియో రిలీజ్ అయిన సంగతి తెలసిందే. ఈ ఆడియా ఫంక్షన్లో అలీ అనుష్క తొడల గురించి కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో అలీపై అందరూ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు ‘మహేష్ బాబు కూడా ఖలేజా సినిమాలో అనుష్క తొడల మీద కామెంట్ చేసాడు. అప్పుడు ఎవరూ ఆ విషయాన్ని తప్పుబట్టలేదు.. ఇప్పుడు నేనంటే వివాదం చేస్తున్నారు అంటూ సమాధానం చెప్పాడట. మొత్తానికి అలీ తనతో పాటు ఈ వివాదంలో పాపం మహేశ్ ను కూడా ఇరికించేలా ఉన్నారు.