వెంకయ్యకి సారీ చెప్పిన ఎయిరిండియా..

కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రి వెంకయ్య నాయుడికి ఎయిరిండియా సారీ చెప్పింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ లేటయ్యింది. ఇక చేసేది లేక ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మీ వల్ల తాను అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయానని ట్వీట్టర్ ద్వారా ఎయిరిండియాకు చురకలు వేశారు. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు విమానం ఆలస్యమైన ఘటనపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన ఎయిరిండియా ఉన్నతాధికారులు పైలట్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాడని తెలిపింది. గుర్గావ్‌లో నివసించే పైలట్ కోసం ఉదయాన్నే కారు పంపామని అయితే తాను ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వేరే కారు చూసుకోవాలని పైలట్‌కు కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. పైలట్ మరో కారులో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాడు. అయితే అతడు కూడా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు. జరిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని..ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని ఎయిరిండియా వెంకయ్యకు తెలిపింది.

వివక్ష: హిందువుని సొంత ప్లేటు..గ్లాసు తెచ్చుకోమన్న ముస్లింలు

పాకిస్థాన్‌లో మతపరమైన వివక్ష ఎంతగా కొనసాగుతోందో తెలిపే ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా హిందూ మతానికి చెందిన ఓ పత్రికా విలేకరి పట్ల సహచర ఉద్యోగులే వివక్ష చూపించారు. ఎన్నాళ్లుగానో తమతో పాటే కలిసి పనిచేస్తున్న వ్యక్తి, హిందువని తెలియడంతో అతడిని తమతో కలిసి భోజనం చేయడానికి వీల్లేదంటూ దూరం పెట్టారు. అంతటితో ఆగకుండా ఇకపై తమతో భోజనం చేయాలంటే సొంతగ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఆదేశించారు.   పాకిస్థాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్‌కు చెందిన విలేకరి సాహిబ్ ఖాన్ ఓద్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఉద్యోగ జీవితం తొలుత ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది..అనంతరం హైదరాబాద్‌కు, ఈ ఏడాది ఏప్రిల్‌లో కరాచీకి బదిలీ అయ్యారు. అయితే సాహిబ్ ఖాన్ హిందువనే విషయం తెలిసిన తరువాత సహోద్యోగులు అతనిని దూరం పెట్టారు. అంతేకాదు..ఆఫీసులో భోజనం చేయాలనుకుంటే సొంతగ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఏఏపీ బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లాం ఆదేశించాడు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో అస్లాం స్పందించాడు. ఓద్ జ్వరంతో బాధపడుతున్నందునే సొంత గ్లాసు, ప్లేటు తెచ్చుకోవాలని చెప్పామని వివరించారు.

ఎవరెస్ట్ ఎక్కకుండానే ఫొటోలు మార్ఫింగ్.. మహారాష్ట్ర దంపతుల ఘనకార్యం..

  తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఏకంగా తాము ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించామని చెప్పుకున్నారు ఓ జంట. దినేష్, తారకేశ్వరీ రాథోడ్ గుర్తుండే ఉంటారు.ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి జంటగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వీరిద్దరి ఆకాశానికి ఎత్తేస్త్తూ పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది వీరిద్దరూ అసలు పర్వతం ఎక్కకుండానే మార్ఫింగ్ ద్వారా ఎవరెస్ట్ ఎక్కామని చెప్పుకున్నట్టు నిజం బయటపడింది. అసలు సంగతేంటో చూద్దాం.. మహారాష్ట్రకు చెందిన దినేష్, తారకేశ్వరీ రాథోడ్  'సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్' పేరిట సదస్సు జరుగగా... దాని ద్వారా ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి వెళ్లారు. అయితే వారు మాత్రం వెళ్లలేదు. కానీ ఫొటో మార్ఫింగ్ చేసి వెళ్లామని చెప్పుకున్నారు. దీనికి గమనించి.. అంజలీ కులకర్ణి, శరద్ కులకర్ణి, సురేంద్ర షల్కే, ఆనంద్ బన్సోడే తదితర పర్వతారోహకులు మహారాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో దినేష్ దంపతులను కమిషనర్ రష్మీ శుక్లా దీనిపై విచారణకు ఆదేశించారు.

ఎవరి ఏడుపు వారిది..

  హైదరాబాద్ నుండి ఏపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27 నాటికి ఏపీ ఉద్యోగులందరూ ఏపీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందరూ రాజధానికి తరలివస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రాజధాని చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని పరిధిలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాకును ప్రారంభించారు.    ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణ ఉద్యోగ సంఘాలు దర్నా చేపడుతున్నాయి. ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సెక్రటేరియట్ కు పంపాలని ఏపీ సచివాలయం భవనం ముందు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తున్నాయి. ఏపీ సచివాలయంలో 234 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న తెలంగాణ నేటివ్ గా ఉన్న వారున్నారని, వారందరినీ రిలీవ్ చేసి తమ సచివాలయానికి పంపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక పక్క తెలంగాణ నుండి ఉద్యోగులు హ్యాపీగా రాజధాని వెళ్లగా.. ఇక్కడ మాత్రం తెలంగాణ ఉద్యోగులు దర్నా చేస్తూ కూర్చున్నారు. ఒకపక్క ఉద్యోగుల రాకతో ఏపీ రాజధాని కళకళలాడిపోతుంటే తెలంగాణ ఉద్యోగుల మాత్రం దర్నా చేస్తూ తమ కడుపు మంటను చూపిస్తున్నట్టున్నారు.

కళకళలాడుతన్న రాజధాని... తాత్కాలిక సచివాలయం ప్రారంభం

  హైదరాబాద్ నుండి ఏపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27 నాటికి ఏపీ ఉద్యోగులందరూ ఏపీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందరూ రాజధానికి తరలివస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రాజధాని చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని పరిధిలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాకును ప్రారంభించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు కొబ్బరికాయకొట్టి బ్లాకు ప్రారంభించారు. దీంతో ఉద్యోగుల రాకతో రాజధాని కళకళలాడిపోతుంది

స్వామి కౌంటర్లు మోడీకేనా..?

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించి ఆయనకు చురకలు అంటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా వ్యవస్థ కంటే తాము గొప్పవారమని అనుకుంటే అది తప్పు అని... పబ్లిసిటీ మోజుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని స్వామిపై పరోక్షంగా మండిపడ్డారు. అయితే ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వామి కాస్త వెనక్కి తగ్గుతాడులే అనుకుంటే.. మోడీకి పరోక్షంగా కౌంటర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శల బాణాలు వదిలారు.   "రాజకీయ నాయకులారా... కొత్త సమస్య: ఓ రాజకీయ నాయకుడు పబ్లిసిటీ కావాలని అనుకుంటే, 30 ఓబీ వ్యాన్లు ఇంటి బయట ఉంటాయి. చానళ్లు, ప్రచార డబ్బా కొట్టే వారి నుంచి 200 మిస్డ్ కాల్స్ వస్తాయి"  అంటూ పరోక్షంగా మోడీకి కౌంటర్ ఇచ్చారు. మరి స్వామి వ్యాఖ్యలపై బేజీపీ నేతలు ఎలా స్పందిస్తోరో.. ముఖ్యంగా మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.     కాగా ఈమధ్యకాలంలో స్వామి వరుసపెట్టి అందరిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నుండి మొదలు  పెట్టి ఆఖరకి ఇప్పుడు పరోక్షంగా మోడీపై కూడా పరోక్షంగా కామెంట్లు వేసే స్థాయికి వెళ్లారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

బురిడి బాబా బుట్టలో ఐఏఎస్ అధికారి కూడా....

  లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించి దాదాపు 1.33 కోట్లు టోకరా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న బురిడి బాబా చెబుతున్న విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికే ఎంతో మందిని బురిడి కొట్టించిన బాబా వలలో ఏపీ కేడర్ కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నాడట. శివానంద మాయమాటలు నమ్మిన ఆ ఐఏఎస్ అధికారి బాబాకు రూ.50 లక్షలు సమర్పించుకున్నాడట. చేతిలో డబ్బులు పడగానే మాయమైన బురిడీ బాబా తనను నిలువునా ముంచాడని గుర్తించినా... ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఆ ఐఏఎస్ అధికారి నోరు విప్పేందుకు భయపడుతున్నారట.

7వ వేతన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం...

  కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోదం తెలిపింది. ఈరోజు దీనిపై చర్చించిన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ.. 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోద ముద్ర వేసింది. అయితే నివేదికను యథాతథంగా అమలుచేస్తుందా.. లేక ఏమైనా మార్పులు చేసిందా అనే సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. ఒకవేళ యథాతథంగా అమలు చేస్తే ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57 నుంచి 2.7కు పెరగనుంది. అంటే కొత్తగా చేరినవారి జీతం రూ. 18,000 నుండి రూ.23,000 వరకూ చేరుతుంది.  సుమారు 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 1 నుంచి కొత్త వేతనాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

సిద్ద రామయ్యను శపించాడంట..

  కర్ణాటక సీఎం సిద్దరామయ్య కారుపై కాకి వాలినందుకే ఆయన కారును మార్చి వేరే కారు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు పలు రకాలుగా విమర్శించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మరో తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. సిద్దరామయ్యను ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి శపించాడంట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమని అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ఇంటి వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సిద్దరామయ్య కారులో వెళుతుండగా వచ్చి అతనికి పూజ చేసిన ఓ వస్త్రాన్ని ఇచ్చాడంటా. అయితే దానిని సీఎం స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను ముఖ్యమంత్రిని శపించాడట. అయితే ఈ విషయాన్ని సీఎం గారు పెద్దగా పట్టించుకోకపోయినా కార్యకర్తలు మాత్రం ఆందోళనలు చెందుతున్నారు. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు.

తెలంగాణ హైకోర్టు.. మరింత ముదిరిన వివాదం..

తెలంగాణలో హైకోర్టు వద్ద ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది.  హైకోర్టులో న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ తరుపు న్యాయాధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ న్యాయమూర్తులు, లాయర్లు మూడు రోజుల నుండి హైకోర్టు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన హైకోర్టు.. నిన్న 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు వారి సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వచ్చే నెల 15 వరకు సామూహిక సెలవులు పెట్టారు.   మరోవైపు న్యాయవాదులు చలో హైకోర్టుకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాయర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో హైకోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. న్యాయవాదులను అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. మొన్న గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లుగానే ఈ రోజు కూడా న్యాయాధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

మహిళా క్యాబ్ డ్రైవర్ మృతి.. కారణం అదేనా..?

  తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ గా రికార్డ్ సృష్టించిన తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ భారతి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అనుమానాస్పద స్థితిలో మరణించిన ఈమె మృతిపై పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె ఈమధ్యనే లింగమార్పిడి చేయించుకుందని.. గత కొంత కాలంగా తను ఒక మహిళతో కలిసి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య విభేధాలు తలెత్తడంతో ఆమె వేరే అతనితో వెళ్లిపోయిందని... అప్పటినుండి ఒంటరిగా ఉంటూ మానసికి ఒత్తిడికి గురైందని.. దీంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు ఆమె ఓ పిల్లాడిని దత్తత తీసుకోవాలని చూసిందని.. దీని గురించి ఓ లాయర్ ను కూడా సంప్పదించి ఇటీవలే వివరాలు అడిగి తెలుసుకుందని.. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని తెలుపుతున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఉగ్ర కలకలం..ఉలిక్కిపడిన హైదరాబాద్

దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మన భాగ్యనగరంలోనే దొరుకుతున్నాయి. ముష్కరులకు హైదరాబాద్ సేఫ్ జోన్‌గా మారిపోవడంతో చాలా మంది ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కుట్రను ఎన్‌ఐఏ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని..వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ నుంచి ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. స్థానిక పోలీసుల సాయంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేపట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు

ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రపంజా

టర్కీలోని ప్రముఖ పట్టణం అటాటర్క్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ముగ్గురు ఉగ్రవాదులు విమానాశ్రయంలోకి చోరబడి ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపి ఆ తర్వాత తమని తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 36 మంది మరణించగా..150 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడటాన్ని గమనించిన భద్రతా దళాలు వారిని పట్టుకునేలోపే ఘోరం జరిగిపోయింది. మృతుల్లో టర్కీ వాసులతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఐసిస్ ఉగ్రవాదులే దాడులకు పాల్పడి ఉంటారని టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిం తెలిపారు. టర్కీ దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, భారత ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

వెంకయ్య నాయుడికి కోపం వచ్చింది.

  కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి కోపం వచ్చింది. అంతలా వెంకయ్యకు ఎవరు కోపం తెప్పించారబ్బా అని అనుకుంటున్నారా.. ఇంకెవరూ ఎయిర్ ఇండియా సంస్థ. ఎయిర్ ఇండియా కస్టమర్లను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది కేంద్రమంత్రులను కూడా ఇబ్బందికి గురి చేస్తుంది. వెంకయ్య నాయుడు నిన్న ఓ పని నిమిత్తం హైదరాబాద్ రావల్సి ఉండగా.. అందుకు ఆయన విమానం కోసం ఎయిర్ పోర్టులో గంట సేపు వెయిట్ చేశారు. అయితే ఎంత సేపటికి ఫ్లైట్ రాకపోవడంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ..తన ఆగ్రహాన్ని తెలిపారు. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు. విమానయాన సంస్ధల్లో ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు మంత్రి వెంకయ్య నాయుడు హితవుపలికారు. మరి ఎయిర్ ఇండియా వెంకయ్యకు సమాధానం చెబుతుందో లేదో చూడాలి.    

కేజ్రీవాల్ మాదిరిగా చేస్తున్నారు కేసీఆర్..

  కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కేసీఆర్ పై విమర్సల బాణాలు వదిలారు.  తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా, కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్లో ఉండటానికి విభజన చట్టం కల్పించిందని.. అది కూడా తెలియకుండా..ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. చంద్రబాబు చొరవతోనే హైకోర్టు విడిపోతుందని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. వాస్తవాన్ని పక్కనబెట్టి కేజ్రీవాల్ మాదిరిగా, ధర్నాలు, నిరసనలు తెలిపితే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని సదానందగౌడ అభిప్రాయపడ్డారు.

స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..ఇది గమనించారా.?

స్మార్ట్‌ఫోన్.. ఈ ఆధునిక యుగంలో ఇది లేకుండా నిమిషం కూడా ఉండలేమంటే అతిశయోక్తి కాదు. ప్రొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేవరకు స్మార్ట్‌ఫోన్ లేకుంటే..అసలు ఆ మాటే ఊహించలేం. టెక్నాలజీకి రెండు వైపులా పదునుంటుంది. ఎంత సౌకర్యాన్నిస్తుందో..తేడా వస్తే అంతు చూస్తుంది. అలాంటి మరో ముప్పు తాజాగా స్మార్ట్‌ఫోన్ విషయంలో వెలుగులోకి వచ్చింది. అదేపనిగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారిలో బొటనవేలు పరిమాణం పెరుగుతుందట...సహజసిద్ధంగా జరిగే పెరుగుదల కాకపోవడంతో దీనికి కండరాలు సిద్ధంగా ఉండవు. దీంతో అంతర్గతంగా గాయాలవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా 18 నుంచి 34 వయసున్న యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించారు.