నెహ్రూ పూలదండ.. కన్యగానే మిగిలిపోయిన బాలిక

జార్ఖండ్ నదీ పరివాహక ప్రాంతంలోని దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్‌లో పనిచేసిన బుద్నీ మెహజన్  సంతాలీ తెగకు చెందిన అమ్మాయి.వీళ్లది ప్రత్యేక కల్చర్. 1959 డిసెంబరులో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ  బుధ్ని పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.  నెహ్రూ బుద్నీకి పూలమాల వేసి స్వాగతం పలికారు. పూల మాలతో చేసే సన్మానం వివాహం క్రింద పరిగణిస్తారు సంతాలీలు. సంతాలీ సంప్రదాయాల ప్రకారం, ఆమెకు నెహ్రూ పూలమాల వేయగానే భార్యగా మారిపోయింది. ఇది బుద్నీకి శాపం లా పరిణమించింది. సంతాలి సంప్రదాయం ప్రకారం నెహ్రూ భార్యగా ప్రకటించబడింది, ఒక వ్యక్తి ఒక స్త్రీకి పూలమాల వేయగానే ఆమెతో అతని వివాహం అయినట్టేనని  పరిగణించాల్సి వస్తుంది.. సాంప్రదాయాల ప్రకారం, సంతాలీ యేతర  వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆమెను సంఘం నుండి బహిష్కరించారు. నేను ప్రధాని నెహ్రూకి పూలమాల వేయలేదని సంతాలి తెగవారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది.  నేను కేవలం అతనికి కరచాలనం ఇచ్చాను.  ఈ చిన్న పొరపాటు వల్ల నేను మా గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని  అప్పట్లో బుధ్ని స్టేట్ మెంట్ ఇచ్చింది. నేను నా సంఘం నుండి బహిష్కరించబడ్డాను. నేను డివిసి పవర్‌హౌస్‌లో వర్కర్‌ని.  అయితే, 1962లో డివిసి నన్ను ఉద్యోగం నుండి తొలగించింది. ” 1985లో అప్పటి ప్రధాని, నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ బుధ్ని కోసం వెతికారట. ఆ తర్వాత భిలాయ్‌లో తనను కలవాల్సిందిగా రాజీవ్ ఆహ్వానించారని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది.  జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన పత్రాలను పరిశోధిస్తున్నప్పుడు రాజీవ్ కు  బుధ్ని గురించి తెలిసింది.

బీజేపీ తేల్చేసింది!.. తెలుసుకోవలసింది తెలుగుదేశం, జనసేనే!

ఏపీలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. ఏవో ఏవేవో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ పై చార్జిషీట్లు అంటూ హడావుడి చేస్తున్నా.. బీజేపీ వాస్తవంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కు మద్దతుగానే ఉండాలన్న కృత నిశ్చయంతో ఉందని తేలిపోయింది. ఇంకా అమయాకంగా జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ మా మిత్ర పక్షం.. రాష్ట్రంలో మరో సారి వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కాలం గడిపేయడం వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోవడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందుకోసం బీజేపీ పెద్దలతో మాట్లాడతాను అని పవన్ ఇప్పటికీ అనడం అమాయకత్వమేనంటున్నారు. బీజేపీకి ఏపీలో  కనీసం ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదన్నది తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్న భయం, అనుమానంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీలు కమలం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ జరుగుతోంది. కర్నాటక ఫలితాల తరువాతనైనా ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం అంత సులభం కాదని ఆ పార్టీలు తెలుసుకోవాలని, సొంత బలం, పోల్ మేనేజ్ మెంట్ పై గట్టిగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు.తాజాగా.. మోడీ సర్కార్ రెవెన్యూ లోటు నిధులు అంటూ ఏపీ కి 10,460. 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదేమీ ఇప్పటి లోటు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన లోటు. ఆ లోటును భర్తీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అప్పట్లో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఎన్ని సార్లు హస్తిన పర్యటించారో.. ఎన్ని సార్లు స్వయంగా మోడీని కలిసి విజ్ణప్తి చేశారో లేక్కే లేదు. తరువాత తరువాత మోడీ చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అది వేరే సంగతి. నిధుల కోసమే, విభజన హామీల అమలు కోసమే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయేతో గొడవ పడింది. బయటకు వచ్చేసింది. అంతేనా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి మంత్రులు రక్షణ నిధులను ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అలాంటిది కేంద్రానికి ఇప్పుడు హఠాత్తుగా ఏపీ  మీద కాదు కాదు జగన్ సర్కార్ మీద ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చేసింది. అడగకుండా పెట్టకుండా.. జగన్ ఆర్థిక కష్టాలు తీర్చేయడానికి ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేసేసింది. దీంతో ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ కు ఆర్థిక చీకాకులు లేకుండా సహకారం అందించింది. ఇది చాలదన్నట్లూ ఎప్పుడడిగితే అప్పుడు అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా చేతిలో పట్టుకుని రెడీగా నిలుచుంటోంది. దీంతో ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో.. ఆ పార్టీ ఎటువైపు ఉంటుందో, ఎవరికి మద్దతుగా నిలుస్తోందో? నిలుస్తుందో అందరికీ పూర్తిగా అర్ధమైపోయింది. అసలు ఇప్పుడేమిటి? గత నాలుగేళ్లుగా బీజేపీ ఎలాంటి దాపరికం లేకుండా తన వైఖరి ఏమిటో చెబుతూనే వస్తోంది. జనసేనానికే ఇంకా పూర్తిగా అర్ధమైనట్లు కనిపించడం లేదు. అలాగే తెలుగుదేశం కూడా జనసేన అధినేత బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఏపీలో వైసీపీకి వ్యతిరేక వైఖరి తీసుకునేల ఒప్పించగలరన్న ఆశ అంటూ ఏమైనా ఉంటే దానిని వదిలేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.  

The Wonder that is India!

If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism, pluralist society, peace and harmony are at stake and with no light end of the tunnel, people often ask, what will happen? What next? For all those prophets of doom and naysayers, there is nothing to get worry or agitated about. The beauty of Indian democracy lies in its course correction. Like the proverbial Phoenix, India as a democratic entity, has always raised from the dust and ashes. This is proven on many an occasions. A cursory look at our past, from the ancient times to the modern days, show that India has the ability to correct itself and move forward with no regrets. Several eminent Britishers, its prominent leaders have predicted that India will wither away soon after it gets its freedom from the British rule. But it did not happen. General elections were held in India between 25 October 1951 and 21 February 1952. They were the first elections to the Lok Sabha after independence in August 1947.[1][2][3] It was conducted under the provisions of the Indian Constitution, which was adopted on 26 November 1949. Elections to most of the state legislatures took place simultaneously. A total of 1,949 candidates competed for 489 seats in the Lok Sabha. More than 173 million people out of an overall population of about 360 million were eligible to vote, making it the largest election conducted at the time. Voter turnout was 45.7%. The Indian National Congress (INC) won a landslide victory, winning 364 of the 489 seats and 45% of the total votes polled. This was over four times as many votes as the second-largest party. Jawaharlal Nehru became the first democratically elected Prime Minister of the country. The entire world watched with keen interest how India could hold its free and fair elections? Sukumar Sen, an unsung hero of Indian democracy, the then Chief Secretary of West Bengal was given this mammoth task of the first Election Commissioner of India. Former Chief Election Commissioner S Y Quraishi in an article gave a detailed account of the way the first elections were conducted.  “A month after he was appointed in March 1950, the Representation of the People Act was passed in Parliament, which provided the framework for the elections, mainly the electoral rolls. A year later, the Representation of the People Act, 1951 was passed dealing with all the remaining matters about the conduct of elections. It is not clear why the two Acts were given the same name. It was decided that the electoral process would be started as early as 1951. It was mandated that any Indian citizen 21 years or above of age residing in a particular constituency for more than 180 days would be eligible to vote from that constituency. It is significant that poor and backward as India was, it still gave its people, men and women, an equal vote, while it took the so-called greatest democracy, the US, 144 years and the UK 100 years to give equal voting rights to women. In a country with a massive illiteracy (84%) with key identification documents missing from lakhs of residents due to the turmoil of the Partition, this was perhaps a significant challenge. The first elections saw 53 registered political parties (including 14 national parties) competing for 489 seats for the Lower House of Parliament. At the time of independence, there were 17 provinces of British India, which were reorganized into states, and then there were princely states, 565 of them, dotting the country. These had to be reconfigured into the existing provinces, which ultimately led to 14 new states and six union territories, which formed independent India. This reorganisation was the first challenge the Constituent Assembly Secretariat (CAS), the body in charge of preparing the electoral rolls, faced, before the Election Commission of India was created and took over the task. The second challenge it faced was the aftermath of Partition riots, refugees and rehabilitation. The Bengal and Punjab borders were virtually porous, with refugees coming in almost every day throughout the later months of 1947 and even after. There was widespread confusion amongst both administrators and the masses regarding where exactly the international borders between India and Pakistan were. It was in the midst of this confusion that the CAS undertook the task of preparing the first electoral rolls for registering 173 million first-time voters two years before the Election Commission came into existence. This made the formidable task of Sukumar Sen easier. Not to be missed in this exercise is the foresight of the bureaucracy of the Constituent Assembly Secretariat led by B.N. Rau, the Constitutional Adviser (CA), to start advance action. The other staff members who were directly and continuously involved in the work of the preparation of the electoral rolls, in what came to be known as the Franchise Section, were the joint secretary, S.N. Mukerjee and under secretaries, KV Padmanabhan and PS Subramaniam who joined in late 1948 and then took over from Rau. Interestingly, as Ornit Shani observes, the CAS made the Indians voters before they even became citizens.” This amply proves that India can get over any obstacle; problem and can find its own way of solving the issues and emerging out successfully. As far as India voters, political leadership are concerned, they also have the uncanny way of standing up to the problem and finding out the right solution at the right time. After the sad demise of Pandit Nehru, one of the architects of Indian freedom movement and founding father of independent India, there was the question who can succeed Pandit Nehru and take the country forward on a progressive path? There came albeit for short term, Lal Bahadur Shastri who in his brief time had consolidated the Indian polity.  Since there was no formidable opposition to the Congress, it was virtually ruling all the states and the Centre. In the Congress Party's parliamentary leadership election held in early 1966 (upon the death of Shastri), she defeated her rival Morarji Desai to become leader, and thus succeeded Shastri, after his death, as Prime Minister of India. Senior leaders like K Kamaraj, Nijalingappa and other supported Indira Gandhi as she was the daughter of Jawaharlal Nehru and she had been Congress president in the past and had also been Union Minister for Information in Shastri Cabinet. The senior leaders wrongly presumed that her administrative and political inexperience would compel her to dependent on them for support and guidance. The Kamaraj plan was also part of the seniors’ strategy. But it was not be.  During her long stint, Indira Gandhi took several good measures to put the country on the right track. She nationalized Banks, abolished the Privy Purses, and the most historical action was creation of Bangla Desh liberating it from the East Pakistan clutches. Riding high over her popularity, Indira Gandhi though she would rule the country forever and the success had gone into he head (as is happening in the case of PM Modi now). Faced with adverse Court verdict, Indira Gandhi clamped the Emergency in 1975. Under these trouble and trying times, people in India gave their verdict loud and clear in 1977 general elections. Through out the length and breadth of the country (barring united AP) voted for the Janata government. Who would have thought that leaders like Jayaprakash Narain, Morarji Desai leaders in their advance age to young fire brands like George Fernandez, Mohan Dharna, Kumaramanlam, would lead the anti Indira agitation. Who would ever imagined that extremely opponent political parties like the extrme right Jana Sangh to the extreme left parties would come under on Umbrella and raise the revolt against an Iron lady like Indira? But the course correction had taken place, thanks to people in India, though not 100 per cent literate but cent present wise. When Janata government failed at the Centre with severe internal bickering among the leaders, the wise and clever people in India have once again lived up to the expectations and voted Indira Gandhi back to power. Soon after he tragic death, her son Rajiv Gandhi became the PM and in the next general elections, the india masses gave a astounding victory to Rajiv Gandhi by giving the Congress 404 of the 514 seats in 1984 and a further 10 in the delayed elections. In all 414 seats out of 514 seats! A record neither Pandit Nehru nor Indira Gandhi had and no one till date broke that record!

మోడీ చెబుతున్న న్యూ ఇండియా పయనమెటు?

వైబ్రెంట్ గుజరాత్ అంటూ భారీ ప్రచారంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి పదవికి ప్రమోషన్ పొందిన నరేంద్ర మోడీ.. ఇప్పటికీ భారత దేశానికి తాని తాను నిర్దేశిస్తున్న మోడల్ గుజరాత్ అనే చెబుతుంటారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని దాకా తన ప్రస్తానంలో సహకరించిన స్వరాష్ట్ర అధికారులు, నేతలనెవరినీ ఆయన మరచిపోలేదు. దేశంలోని ఏ  కీలక ప్రభుత్వ శాఖ, ఏ ప్రభుత్వ సంస్థ అధిపతులను తీసుకున్నా వారంతా గుజరాత్ కు చెందిన వారే అనడంలో సందేహాలకు తావివ్వని విధంగా మోడీ జాగ్రత్త పడ్డారు. ఇంతకీ అసలు ఆ వైబ్రెంట్ గుజరాత్ లో ఏం జరుగుతోంది. మోడీ ఎక్కడకు వెళ్లినా.. ఎందు కాలిడినా పొగిడేది గుజరాత్ ను గుజరాత్ సంస్కృతినే. ఇప్పటికీ ఆయన వ్యతిరేకులు మోడీ భారత ప్రధాని అయినా ఆయన తీరు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఉంటుందని ఎద్దేవా చేస్తుంటారు. అందుకు ఉదాహరణగా కేటాయింపుల్లోనూ, నియామకాల్లోనూ, బడ్జెట్ లోనూ గుజరాత్ కు ఆయన అగ్రతాంబూలం ఇవ్వడాన్ని ఎత్తి చూపుతుంటారు. మోడీ భారత్ కే మోడల్ గా చెబుతున్న గుజరాత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి మచ్చుతునకగా ఇటీవల ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ ఘోర ఉదంతాన్ని చెప్పుకోక తప్పదు.  మన దేశంలో సతీ సహగమనం దురాచారాన్ని 1829లో రద్దు చేశారు. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా గుర్తింపు పొందని రాజా రామ్ మోహన్ రాయ్ సతీ సహగమనానినికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన ఫలించి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రద్దు చేశారు. అయితే ఆ దురాచారం మళ్లీ గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట అంతరించిపోయిన సతీ సహగమనం ( భర్త చనిపోతే ఆ చితిపైనే  ఆత్మాహుతి చేసుకోవడం) గుజరాత్ లో  బలవంతంగా అమలు చేయబోతే ప్రతిఘటించీ ఫలితం లేని ఓ అబల శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. 28 ఏళ్ల ఓ హిందూ యువతి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అత్తింటి వారు ఆమెను  సతీసహగమనం చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో  శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. ఇంతకీ మోడీ చెబుతున్న న్యూ ఇండియా ఎటువైపు సాగుతున్నట్లు? మోడీ గుజరాత్ మోడల్ .. భారత దేశాన్ని ఏ నాగరికత వైపు తీసుకు వెడుతున్నట్లు? 

మన ప్రధాని కాలర్ పట్టుకునే హక్కు కలిగింది

 ఒకసారి నెహ్రూ పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన కాందీశీకులు నివాసముండే ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ సమయంలో నెహ్రూకు ఊహించని సంఘటన ఎదురైంది. నెహ్రూ పర్యటిస్తున్న సమయంలోనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా నెహ్రూ కాలర్ పట్టేసాడు. నిర్ఘాంత పోవడం నెహ్రూ వంతయ్యింది. కొంత షాక్ కు గురయ్యారు కూడా. ‘‘ఆజాదీసే హమే క్యా మిలా?’’ (స్వాతంత్ర్యం రావడం వల్ల మనకు  ఏం దొరికింది?) అంటూ కాలర్ పట్టుకుని  గట్టిగా  నిలదీశాడు అతను.  నెహ్రూ నింపాదిగా సమాధానమిచ్చారు. ‘‘మన ప్రధాని కాలర్ పట్టుకునే హక్కు కలిగింది’’ అని నవ్వుతూ నెహ్రూ సమాధానమిచ్చారు. 

బందరెళితే.. బందరే!

బందరు పోర్టు శంకుస్థాపన చివరికి ఒక ప్రహసనంగా తయారైంది. ఇప్పటికే రెండు సార్లు పునాదిరాయి పడిన బందరు పోర్టుకు మళ్లీ పునాదిరాయి పడింది. ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణానికి నోచుకోకపోవడం బందరు పోర్టు ప్రత్యేకత. బందరు పోర్టు శంకుస్థాపన కథ కొంత విచిత్రంగానే ఉంటుంది. బందరులో పోర్టు నిర్మాణానికి తీర ప్రాంతం అనువైనదని వందల సంవత్సాల ముందే నిర్ణయించారు.   అయితే తూర్పు తీర ప్రాంతంలో అనేక మేజర్ పోర్టులు ఉండటంతో  బందరు పోర్టు ఆలస్యమవుతూ వచ్చింది. 2009 ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2008 ఏప్రియల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. 2009 ఎన్నికలలో గెలిచిన వైఎస్ఆర్ అదే సంవత్సరం సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. 2014 ఎన్నికల ముందు జరిగిన హడావుడి పోర్టు నిర్మాణం వైపు సాగలేదు. పోర్టుకు సంబంధించిన స్థల సేకరణకు చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు, అక్కడ నుంచి ముడి ఇనుప ఖనిజం ఎగుమతులు భారీగా జరుగుతూ ఉండడంతో మిగిలిన పోర్టుల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లలేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం హయాంలో తిరిగి పోర్టుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి ముఖ్యమం్రతి చంద్రబాబునాయుడు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పాటు పోర్టు పనులను అటకెక్కించింది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే పాలన అంటూ ఖజానా ఖాళీ చేసిన జగన్ ప్రభుత్వం బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి భారీ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించలేకపోయింది. వేల కోట్ల ఖర్చు అయ్యే ఇలాంటి ప్రాజెక్ట్ లు ప్రారంభించడం  జగన్ సర్కార్ కు అసాధ్యమే అయింది. అయితే మే 22వ తేదీన బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్ గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా పోర్టు పేరెత్తని జగన్ ఎన్నికల ముందు పోర్టు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.  గతంలో జరిగిన శంకుస్థాపనలకు ప్రత్యక్ష సాక్షి అయిన పేర్ని నాని ఈ సారి కూడా జగన్ త బందర్ పోర్టు పనులను మరోసారి ప్రారంభించారు. అయితే 2008లో ప్రారంభించిన వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించగా, 2014లో పనులు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి పదవికి దూరమయ్యారు.  2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు అనంతర ఎన్నికలలో  ఓటమి పాలయ్యారు. తాజాగా అదే పోర్టును శంకుస్థాపన చేసిన జగన్ కు రానున్న ఎన్నికలలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.  ఏది ఏమైనా బందరు సెంటిమెంట్ ఈ సారి కూడా పని చేస్తుందని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 

ఇక డ్రామా ఆపేయ్.. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశం?

పరువు నిలువునా గంగలో కలిసిపోయింది. వివేకా హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీరు పార్టీ పరువునే కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ పరువును కూడా మంటగలుపుతోందన్న భావన తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది. అయ్యిందేదో అయ్యింది. ఇక ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు.. తిన్నగా సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన సందేశం అవినాష్ కు చేరిందని అంటున్నారు. ఆ సందేశాన్ని కూడా వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ద్వారా పంపారని అంటున్నారు. సోమవారం (మే22) కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన విజయమ్మ అవినాష్ తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అవినాష్ తో ఆమె కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే అవినాష్ ను  ఇక ఈ హై డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టి సీబీఐ విచారణకు హాజరవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. సూచన కాదు దాదాపుగా ఆదేశించారనే అంటుంటున్నారు. ఒక వేళ సీబీఐ అరెస్టు చేసినా కంగారు పడాల్సిన అవసరం లేదనీ, అక్రమాస్తుల కేసులో తన బిడ్డ జగన్ 16 నెలలు జైలులో ఉండి రాలేదా అని కూడా విజయమ్మ అవినాష్ కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ అవినాష్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారిందనీ, అలాగే  జగన్ కూ చెడ్డపేరు వచ్చిందనీ, ఇక ఫుల్ స్టాప్ పెట్టకుంటే నివారించలేనంత నష్టం జరుగుతుందని విజయమ్మ అవినాష్ కు నచ్చ చెప్పిట్లు వైసీపీ శ్రేణులే అంటున్నాయి. అయితే చివరి ఆశగా సుప్రీంలో అవినాష్ దాఖలు చేసిన నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని అవినాష్ విజయమ్మతో అన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంలో కూడా అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. ఇక అవినాష్ ఏం నిర్ణయం తీసుకుంటారని అంతటా ఉత్కంఠ నెలకొంది.  కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడు మూతలు, ‘హైడ్రామా’తో జనంలో చెడ్డపేరు వస్తోందని సీఎం జగన్‌ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘రచ్చ’కు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే... ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్‌ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది’’ అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

ఇక అరెస్టే.. సుప్రీంలో అవినాష్ కు చుక్కెదురు

సుప్రీం కోర్టులో  అవినాష్ కు చుక్కెదురైంది. చివరి ఆశ కూడా ఆవిరైపోయింది. సీబీఐ అరెస్టును నుంచి అవినాష్ కు సుప్రీంలో కూడా రక్షణ లభించలేదు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  విచారించేలా ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది.   ఇక అవినాష్ కు సీబీఐతో దాగుడుమూతలు అడే అన్ని దారులూ మూసుకుపోయాయి.  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి  గతంలో అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన రెగ్యులర్ బెంచ్.. వేసవి సెలవుల దృష్ట్యా దీనిపై నిర్ణయం ప్రకటించకుండా జూన్ 5కు విచారణ వాయిదా వేసింది. దీంతో ఆ వెకేషన్ బెంచ్ లో తన ముందస్తు బెయిలుపై విచారణ పూర్తయ్యే వరకూ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని సుప్రీంను ఆశ్రయించారు. అవినాష్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం అవినాష్ విజ్ణప్తిని తోసి పుచ్చింది. అవినాష్ ముందస్తు బెయిలుపై ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ అప్పటి వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు మాత్రం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఇక ఏ క్షణంలోనైనా సీబీఐ అవినాష్ ను అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయి.   

బిఆర్ఎస్ స్టాండ్ మారింది

డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్  సంసిద్దమైంది.  అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలోని 119 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.  కర్ణాటక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ స్ట్రాటజీ మారింది. ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీతో  పూర్తి వైరంతో ఉన్న కెసీఆర్ ఫలితాల తర్వాత చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ప్రతీరోజు మోడీపై వివర్శనా స్త్రాలు సంధించే బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ మీద అస్ట్రాలను ఎక్కుపెట్టింది. కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలుపొందడమే దీనికి కారణం. కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోవడంతో కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రచారం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీలను ఏకం చేసే కార్యక్రమాలను కేసీఆర్ ప్రస్తుతానికి నిలుపుదల చేశారు.  పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో బిజెపి, బిఆర్ఎస్ వైరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి  లేదు.  అవసరమైతే పొత్తుల అంశం పరిశీలిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం మిత్ర పార్టీల్లో మజ్లిస్ పార్టీ  మద్దత్తు బిఆర్ఎస్ కు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు క్లారిటీ ఉంది కానీ కేసీఆర్ కి క్లారిటీ లేదు. .  ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకోవాలని కెసీఆర్ యోచిస్తున్నారని వినికిడి.   2014,2019లో కెసీఆర్ ఒంటరిగానే పోటీ చేశారు. రెండు పర్యాయాలు అధికారంలో వచ్చారు. వరుసగా మూడోసారి అధికారంలో రావాలని చూస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని కెసీఆర్ ఎత్తుగడ.  మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని సిగ్నల్స్ అందుతున్నాయి. ఎందుకంటే పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఎలాంటి చొరవ చూపించని కెసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మిత్ర పార్టీలు శత్రు పార్టీలుగా మారకపోవచ్చని కెసీఆర్ నమ్మకం. ఎందుకంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు బిజెపి ప్రధాన శత్రువు. బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లోపాయికారి పొత్తు పెట్టుకున్నట్లేనని రాజకీయ  విశ్లేషకులు అంటున్నారు.  కర్ణాటక ఫలితాల తర్వాత కెసిఆర్ వామపక్షాలతో మిత్రత్వం గూర్చి ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమని ఉభయ కమ్యూనినిస్ట్ పార్టీల నేతలు కూనంనేని సాంబశివరావ్, తమ్మినేని వీరభధ్రం బహిరంగంగానే కెసీఆర్ ను విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మా పార్టీలు బలంగా ఉన్నాయి. ఎక్కువ స్థానాలు గెలుపొందుతాం. ఫలితాల తర్వాత హంగ్ వచ్చే అవకాశం ఉంది. హంగ్ వస్తే కెసిఆర్ మమ్మల్ని   సంప్రదించొచ్చు అని ఈ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. 

హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు!

హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ఓ ఐపీఎస్ అధికారికి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిందంటూ డింపుల్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించిన డింపుల్.. అధికార దుర్వినియోగంతో తప్పులను దాచలేరు అని కామెంట్ చేసింది.  జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో డింపుల్ హయాతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ వాహనాన్ని ఆయనకు డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే డింపుల్, డేవిడ్ లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. అయితే పదేపదే డీసీపీ వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్ లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారట. అంతటితో ఆగకుండా డింపుల్ తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టగా, ఈ ఘటనలో ఆయన కారు ముందు భాగం దెబ్బతిన్నదట. దీంతో డింపుల్ పై చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులకు సమర్పించాడు. పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డింపుల్ తీరు మారలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఈ వివాదంపై డింపుల్ స్పందన మరోలా ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు దాచిపెట్టాలని చూస్తున్నారని, సత్యమేవ జయతే అంటూ ఆమె ట్వీట్ చేసింది. 

పరారీ యత్నాల్లో అవినాష్.. అస్పత్రి సీన్ అందుకేనా?

అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే.. వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని ఆయనే స్వయంగా అంగీకరిస్తున్నట్లుగా అనిపించకమానదు. లేకుంటే సీబీఐ అరెస్టు చేస్తుందేమోనని అంతగా భయపడాల్సిన అవసరమేంటో అర్థం కాదు. ఇదే వివేకా హత్య కేసులో స్వయానా ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.   ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందన్న ప్రచారమూ చేసుకున్నారు. అయినా సీబీఐ ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించి మరీ జైలుకు తరలించింది. మరి తన వద్దకు వచ్చే సరికి అవినాష్ ఎందుకు వణికిపోతున్నారు. పెద్ద గ్యాంగ్ స్టర్ లా మూకలను అడ్డుపెట్టుకుని ఎందుకు దాక్కుంటున్నారు. తల్లి అనారోగ్యం పేరు చెప్పి ఒక ఆస్పత్రినే యుద్ధభూమిగా మార్చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద పరిస్థితి చూస్తే.. ఆ ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులను హోస్టేజీలుగా పట్టుకుని జగన్ రెడ్డి సీబీఐ తన వద్దకు రాకుండా నిలువరిస్తున్నారా? అన్న అనుమానం కలుగక మానదు. ఇక ఆయన చివరి ఆశ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ విచారణ. ఆ విచారణలో కూడా అవినాష్ కు  ఊరట లభించకుంటే..ఇక ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లడమే తరువాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పులివెందుల నుంచి తల్లిని కర్నూలు తీసుకు వచ్చే విషయంలో కూడా ఆయన సీబీఐ సహా అందరినీ కన్ఫ్యూజ్ చేసేలాగే వ్యవహరించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ఆయన కనుక తన తల్లిని కర్నూలు తీసుకువస్తున్నట్లు ముందుగానే సీబీఐకి సమాచారం ఇచ్చి బయలుదేరి ఉంటే.. విశ్వభారతి ఆసుపత్రి అవినాష్ అనుచరుల కబ్జాలోకి వెళ్లే అవకాశం వారిచ్చి ఉండేవారు కాదని, అప్పుడు అవినాష్ కు తప్పించుకునే అవకాశాలు ఉండేవి కావనీ అంటున్నారు. ఒక వైపు సీబీఐ బృందాలు ఛేజ్ చేస్తుండగా అండర్ గ్రౌండ్ కు వెళ్లే అవకాశం ఉండదన్న భావనతోనే ఆయన విశ్వభారతి ఆస్పత్రిలో షెల్టర్ తీసుకున్నారనీ, సుప్రీంను ఆశ్రయించడం, 27 వరకూ గడువు ఇవ్వాలంటూ సీబీఐని కోరడం ఇవన్నీ కూడా తప్పించుకునే వ్యూహంలో భాగమేనని అంటున్నారు. సుప్రీం కోర్టులో ఒక వేళ ఆయనకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు విచారణ పూర్తయ్యే వరకూ అరెస్టు నుంచి రక్షణ లభిస్తే.. ఆ సమయంలో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి ఉద్దేశమే లేకుంటే.. అవినాష్ ఈ పాటికే సీబీఐ విచారణకు హాజరై ఒక వేళ సీబీఐ ఆయనను అరెస్టు చేసినా న్యాయస్థానాలలో బెయిలు కోసం ప్రయత్నించే వారనీ అంటున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లి బయటకు వచ్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అందుకు భిన్నంగా సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారంటే వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సీబీఐ ఇప్పటికే సేకరించిందన్న సమాచారం ఆయనకు అందడమే కారణమంటున్నారు. అందుకే సీబీఐ అధికారులు తన సమీపానికి కూడా రానీయని విధంగా అవినాష్ రెడ్డి తనకు రక్షణగా ఆస్పత్రి వద్ద తన అనుచరులు, వైసీపీ మూకలను మోహరింపచేశారని అంటున్నారు.  

జగన్ నెత్తిన మోడీ పాలు.. ఏకంగా 10,460. 87 కోట్లు ఇచ్చేశారు!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. ఏం చేసినా మిమ్మల్ని ఆదుకోవడానికి కేంద్రంలో మేమున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి..  కొన్ని నెలలపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత భారీ ఊరట కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద రూ.10,460. 87 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ  అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ నెల 19న ఆదేశాలిచ్చారు. నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అయితే  ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. జగన్ సర్కార్ కు అండగా, ఆర్థిక దన్నుగా కేంద్రం ఆ నిధులను విడుదల చేసింది.   రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులు విడుదలైనా అవి  విడతల వారీగా కేవలం పప్పు బెల్లాలకు తప్ప మరెందుకూ పనికి రాని విధంగా విడుదల చేసే శారు.  ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది అదీ ఆంధ్రప్రదేశ్ కు మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తొలి సారి. అదీ తన ఆర్థిక అరాచకత్వం కారణంగా ఏపీ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో పడిన సమయంలో.. మోడీ సర్కార్ జగన్ పై అపార కరుణ చూపి.. కోరకుండానే  ఏకంగా పది వేల 460. 87 కోట్లు విడుదల చేసింది.   రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూలోటు నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి  తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా కొంత మొత్తాన్ని విదిల్చినట్లుగానే విడుదల చేసిన కేంద్రం.. మిగిలిన సొమ్ముకు కొర్రీలు వేసింది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు, వనరుల భర్తీపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో.. 2014-15 సంవత్సర వనరుల అంతరానికి (గ్యాప్) సంబంధించి కేంద్ర బడ్జెట్లో పరిహారం చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు రూ. 16.078 కోట్లు తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15లో రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్లు కలిపి మొత్తం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది. ప్రామాణిక వ్యయం ఆధారంగా.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని 2016 సెప్టెంబరులో చెప్పింది. అయితే ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2018లోనూ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు జరిపింది. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ.16,078.76 కోట్లుగా పరిగణించాలని కోరింది. నాటికి చెల్లించని (పెండింగ్) బిల్లులు పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఒకటో తారీకు వస్తే చాలు.. ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి.. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు ఎలా.. ఇబ్బడిముబ్బడిగా ..ప్రకటించిన సంక్షేమ పథకాలకు నిధులు ఎలా తేవాలని .. సతమతమైయ్యే జగన్ ప్రభుత్వానికి ..కేంద్రం మంజూరు చేసిన నిధులు..ఎంతో ఊరటను ఇస్తాయి. నిధుల కోసం కాళ్లరిగేలా తిరిగిన చంద్రబాబును పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు ఇలా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడంపై రాజకీయ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో దత్తపుత్రుడు జగన్ ను ఆదుకునేందుకు మోడీ ఉదారంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!

ఏపీలో అరాచకత్వం శ్వైర విహారం చేస్తోందా? పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వీల్లేకుండా అడ్డుకుంటున్న అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలను నిలువరించడంలో విఫలమైన ఏపీ పోలీసులు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు బృందం కోరినా సహకారం అందించకుండా అధికార పార్టీకి కొమ్ము కాసి మాయని మచ్చను మిగుల్చుకున్నారు. సీబీఐకి ఏపీ పోలీసులు సహకారం అందించకపోవడమే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ కోరినా, అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే కర్నూలులో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనీ, కంట్రోల్ చేయడం తమ వల్ల కాదనీ చేతులెత్తేయడంతో ఏపీ పోలీస్ ప్రతిష్ట మంటగలిసింది.  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సెక్షన్ 30, సెక్షన్ 144 పేరిట ఆంక్షలు విధించి ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టనీయకుండా నిర్బంధాలు అమలు చేసే పోలీసులు.. ఒక హత్య కేసు నిందితుడికి రక్షణ కవచంలా నిలబడటం, సీబీఐని ఆ సమీపంలోకి రాకుండా మోహరించిన ఆయన అనుచరుల్ని  అక్కడి నుంచి మాత్రం చెదరగొట్టడం అటుంచి వారి అడుగులకు మడుగులొత్తుతున్న విధంగా వ్యవహరించడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో పోలీసు శాఖకు జీతం ఇస్తున్నది ప్రభుత్వమా? లేక అధికార వైసీపీ పార్టీయా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.   అవినాష్ అనుచరులు, వైకాపా కార్యకర్తలు మీడియాపైన దాడులు చేస్తూ, కెమెరాలు ధ్వంసం చేస్తూ, అల్లర్లకు, దౌర్జన్యానికి తెగబడుతున్నా ప్రేక్షక పాత్ర వహించిన పోలీసుల తీరు చూస్తుంటే.. ఏపీలో అరాచకత్వం రాజ్యమేలుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్ రెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు ఆందోళన చేయటంతో ఆ సందులోని దాదాపు పది ఆసుపత్రులు, క్లినిక్ కు వచ్చే వందల మంది రోగులు, వారి బంధువులు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు.  జిల్లా ఎస్పీ తలుచుకుంటే గంటల వ్యవధిలో వారందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. కర్నూలు నగరంలోనే 5 పోలీసుస్టేషన్లు, చుట్టుపక్కల మరో 15 వరకూ పోలీసు స్టేషన్లున్నాయి. ఎస్పీ ఆధీనంలోనే వందల మంది ఏఆర్ సిబ్బంది ఉంటారు. కర్నూలు నడిబొడ్డున ఏపీఎస్సీ బెటాలియన్ కూడా ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా గంటల వ్యవధిలోనే భారీగానే బలగాల్ని రప్పించొచ్చు. కనీసం రెండు, మూడు గంటల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులను ఎస్పీ చాలా సులువుగా తీసుకొచ్చి విశ్వభారతి ఆసుపత్రి వద్ద అల్లర్లు, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. అందులోనూ కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ కు ఎస్పీగా ఇదే తొలి పోస్టింగ్. అటువంటి ఆయన.. అవినాష్ రెడ్డి నీడను తాకినా శాంతి భద్రతలకు విఘాతం కులుగుతుంది.. తాము నియంత్రించలేమని చేతులెత్తేశారంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయిందో అవగతం చేసుకోవచ్చు. సీబీఐకి సహాయ నిరాకరణ చేయటం వల్ల కెరీర్ పై మచ్చ పడుతుందని తెలిసి కూడా కర్నూలు ఎస్పీ అలా వ్యవహరించారంటే ఆయనపై ఒత్తిడి ఏస్థాయిలో ఉందో ఇట్టే అవగతమౌతుంది.   ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బిహార్ లో నెలకొన్న పరిస్థితుల్ని తలదన్నేలో జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  

బీసీ మంత్రం.. అన్ని పార్టీలదీ అదే తంత్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బీజేపీలో వేడి పెరిగింది. అయితే, ప్రస్తుత అస్థిర పరిస్థితులలో ఈ ఉత్సాహం, ఈ వేడి ఎంతకాలం ఉంటుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడవలసిందే కానీ, ఉహించి ముందస్తు జోస్యం చెప్పలేమని పరిశీలకులు సైతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.  అయితే, 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య పోలిక పొంతన ఉండే అవకాశం లేదని, ఈ రెండు ఎన్నికల నడుమ టీఆర్ఎస్ – బీఆర్ఎస్’లకు మధ్య ఉన్నంత  వ్యత్యాసం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కీలకంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్, ఈ ఎన్నికలలో సైలెంట్. అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ కూడా సెంటిమెంట్ ప్రస్తావన తీసుకురావడం లేదు. తెచ్చాం, ఇచ్చాం క్లెయిమ్స్ జోలికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే  అత్యవసరం అయితే తప్ప సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడం లేదు.  అది ముగిసిన అధ్యాయం అన్న విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ అని చెప్పుకుంటూ హస్తం ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను కోరుతోంది. ఇక బీజేపీ అయితే, మోదీ మంత్రం.. అమిత్ షా తంత్రం తప్పించి మరో విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించదు.  సో ... తెలంగాణ తొలి రెండు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపిన తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటికీ చాలా వరకు కనుమరుగైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సెంటిమెంట్ ను ఉపయోగిం చుకుని ఇంతవరకు గరిష్ట ప్రయోజనం పొందిన బీఆర్ఎస్  కొత్త బాట పట్టింది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ఉద్దేశంతో  పార్టీ పేరుతొ పాటుగా పంథాను మార్చుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్   స్టేట్ స్టేజి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారా? అన్నవిధంగా ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాల పైన కేద్రీకరించారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి, కొత్త అధ్యాయానికి తెర తీస్తున్నాయని పరిశీలకులు భావిస్తునారు.  అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం లేక పోయినా, మూడు  ప్రధాన పార్టీలు  బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ క్యాస్ట్ కార్డును  మరీ ముఖ్యంగా బీసీ కార్డును ప్రధాన అస్త్రం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను తమవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో మూడు పార్టీలూ  అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ తెలంగాణ  ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది  పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ  పేరుతో ఈ విషయాలన్నీ ప్రచారం చేస్తామని కమల దళం చెబుతోంది. అలాగే  అతి త్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించేందుకు కూడా  బీజేపీ సిద్ధమవుతోంది. అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో బీసీ  జనాభా అధికంగా ఉండడంతో సహజంగానే అన్ని పార్టీలు బీసీ ఓటు మీద కన్నేసి  బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిజానికి, తెలంగాణలో ఇంతవరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ వరాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు ఎటువైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీసీలు ఎటు మొగ్గుచుపుతారు, అనేది కీలకంగా మారింది.

రాహుల్ హామీలకు సిద్దూ బ్రేక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్యా మధ్య  మరో మహా సంగ్రామం  జరిగింది. ఆ మహా సంగ్రామంలో సిద్దరామయ్య విజయం సాధించారు. సీఎం రేసులో గెలిచిన ఆయన ముఖ్యమంత్రిగా, ఓడిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరితో పాటుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.   నిజానికి కనీసం పాతిక మందితో ప్రమాస్వీకారం చేయించి, మొదటి రోజునుంచే హామీలఅమలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశించారు. రాహుల్ ఆదేశాలను పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక నేతలకు చేరవేశారు.అయితే  ఏ వర్గానికి ఎన్ని మంత్రి పదవులు అనే లెక్క తేలక  పోవడం వల్లనో ఏమో  ప్రస్తుతానికి ఎనిమిది మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.  ముఖ్యమంత్రి కుర్చీకోసం నాలుగైదు రోజుల పాటు హోరాహోరీగా పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంత్రి పదవుల విషయంలోనూ అదే   స్పూర్తి కొనసాగిస్తున్నారు. కుర్చీలాట కారణంగా  ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  వారం రోజులకు కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పది మందితో పాక్షిక మంత్రి మండలి కొలువు తీరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో  పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటు ఎప్పుడు జరుగ్తుంది అనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. మంత్రి పదవుల కోసం అంతర్గతంగా వస్తున్న ఒత్తిళ్ళకుతోడు కాంగ్రెస్ గెలుపునకు కొమ్ము కాసిన ముస్లిం మైనార్టీ వర్గాలు,అలాగే, ఇంకా అనేక ఇతర  వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అదలా వుంటే...  ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రిమండలి  ప్రమాణ స్వీకార వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు గ్యారెంటీల ప్రస్తావన చేశారు.  ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన ఒకటి రెండు గంటల్లో జరిగే మంత్రిమండలి తొలి సమావేశంలోనే  ఆమోదముద్ర పడుతుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఒక విధంగా ఆ క్షణం నుంచే ఐదు హామీలు అమలు జరిగినట్లే అనుకోవచ్చనే రీతిలో భరోసా కల్పించారు.  అయితే  రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. అయితే ఐదు హామీల అమలకు మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందే కానీ  హమీల అమలుకు పచ్చ జెండా అయితే ఊపలేదు. ఐదు హమీల అమలుకు సంవత్సరానికి రూ 50,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. అయినా ఐదు హమీలను అమలు చేసి తీరతామని, వచ్చే మంత్రి మండలి సమావేశంలో విధివిధానాలు ప్రకటించి  హామీల అమలుకు శ్రీకారం చుడతామని  మీడియా సమావేశంలో చెప్పారు.అంటే  ఒక విధంగా, రాహుల గాంధీ హామీలకు సిద్దరామయ్య బ్రేకులు వేశారు. ఫస్ట్ నుంచి నెక్స్ట్ కు పోస్ట్ పోన్ చేశారు.  కాగా, ఈ ఐదు హామీలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను గట్టిగ్గా ఆకట్టుకున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే అధిక మెజారిటీ సాధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ,  ప్రియాంకా వాద్రా మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని హామీలను వెంటనే అమలు చేస్తామని ఇచ్చిహామీని ప్రజలు ముఖ్యంగా మహిళలు నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. అయితే తొలి మంత్రి మండలి సమావేశంలో సూత్రప్రాయ ఆమోదంతో సరిపెట్టడంతో ప్రజల్లో అప్పుడే అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఆర్థిక అవరోధాలు ఎన్ని ఎదురైనా, హామీలు అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో హామీల అమలుకు రూ.50,000 కేటాయించడం కష్టమేమీ కాదని, 13 మార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనుభవం ఉన్న సిద్దరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు హామీలు అమలు చేసినా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోదు. ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అసలే రాదని సిద్దరామయ్య పేర్కొనారు. రాష్ట్ర అప్పులపై ప్రతి సంవత్సరం రూ.56, 000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పుడు, హమీల అమలుకు రూ. 50,000 కోట్లు ఇవ్వలేమా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే, సిద్దరామయ్య చెప్పిన లెక్కల ఆధారంగా చూసినా రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు పైగా రాష్ట్ర అప్పులపై వడ్డీల చెల్లింపు, ఐదు హామీల అమలుకు ఖర్చుచేస్తే ఇక  ఉద్యోగుల జీత భత్యాలు, విద్యా, వైద్యం, వంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కర్ణాటక మరో ఏపీలా అప్పుల కుప్పగా మారుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

స్పీకర్ సీబీఐ చీఫ్ కే జవాబుదారీనా?

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 అంటుంటే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాత్రం 175 షూర్ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 కి 175 స్థానాలలోనూ విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఇష్టాగోష్టిగా విలేకరులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంపై  ఎదురైన ప్రశ్నకు ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఆ వ్యవహారం సీబీఐ చూసుకుంటుంది. నీకెందుకు? నాకెందుకు?  అంటూ మండి పడ్డారు.  నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా..?   నీకు నేను సమాధానం చెప్పాలా? మాకు అదే పనా? మీ హద్దులు మీకు ఉంటాయ్... మా హద్దులు మాకు ఉంటాయంటూ స్పీకర్ తమ్మినేని ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు.  సీఎం జగన్ అభివృద్ధి మరచి నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చుపెడుతున్నారు కదా అన్న ప్రశ్నకు కూడా స్పీకర్ గారికి కోపం తన్నుకొచ్చింది.   రాష్ట్రంలో ఇన్ని పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు ఎలా వచ్చాయి?  ప్రశ్నించే ముందు విలేకరులకు  స్పష్టత ఉండాలి.. అది లేకుంటే చెప్పింది రాసుకుపోవాలి అంటూ ఒకింత వ్యగ్యం జోడించి మరీ వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలపై కూడా  స్పీకర్ తమ్మినేని సీతారాం కస్సుబుస్సులాడారు.  కొంచెం ఓపిక పట్టండి.  కొడితే గూబ గుయ్యిమంటాది. ఇలా అలా కాదు. వీర మహాబాదుడు ఉంటుంది. ప్రజల కోసం పని చేస్తున్న  ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదేం ఖర్మ అని అంటారా వాళ్లు..? ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇటీవల  అధాకార పార్టీ నాయకులలో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లుంది.  ప్రజా సమస్యపై ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం అటుంచి..  అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రశ్నించిన వారిపై  చేయి చేసుకోవడానికీ వెనుకాడటం లేదు.  ఏపీలో అస్తవ్యస్త పాలనపై ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్న నేతలకు భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తుండటంతో ఆందోళన, భయంతో ప్రశ్నించే వారిని టార్గెట్ చేసుకుని నోటికీ, చేతికీ పని చేబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 వడ్డించే వాడు మనవాడైతే...

వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆఖరి బంతిలో కూర్చున్నా ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. ప్రస్తుతమున్న తెలంగాణ భవన్ కు తోడు కోకపేట కార్యాలయం ఓపెన్ అయ్యింది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, డబ్బులు కట్టి కొనుగోలు చేసిన భూములను సైతం తిరిగి ఇవ్వని కెసిఆర్ తన పార్టీ కార్యాలయాలకు భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ. కోకాపేటలో బీఆర్ఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించడం దారుణమన్నారు. రూ.550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్పీ.  విలువైన హైదరాబాద్ భూములను కెసీఆర్ కొట్టేస్తున్నారని ఆయన బలమైన వాదన.  మంత్రివర్గ నిర్ణయాన్ని కెసీఆర్ మేనల్లుడు, మంత్రి టి హరీష్ రావ్ వెల్లడించారు. మంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ఇతర మంత్రులు హర్షధ్వానాలు చేశారు.  నిరుడు హెచ్ఎండిఏ ఆక్షన్ నిర్వహించింది. ఈ ఆక్షన్ లో ఎకరం 60 కోట్ల రూపాయల బిడ్డింగ్ ప్రాసెస్ గా నిర్ణయించింది. ఈ లెక్కన కోకాపేట భూమి విలువ అక్షరాల రూ 660 కోట్ల రూపాయలు.  కానీ కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది రూ 37 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా మోసం, దగా అని ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి.  ఈ భూమిని కాజేయడానికి బిఆర్ఎస్ తెలివిగా పార్టీ కార్యాలయంతో పాటు వ్యక్తిత్వ వికాస క్లాసులు, నాయకులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాలయం కావాలని కోరింది.  మే 12వ తేదీన అప్లయ్ చేసింది. వారం రోజులలోపు క్యాబినేట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదం తెలపడం, ప్రభుత్వ ఉత్తర్వు జారీ కావడం చకచకా జరిగిపోయింది. ఈ జీవో నెంబర్ ఎంత అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు. నాలుగు కోట్ల మంది మా వెనక ఉన్నారు అని చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు కోట్ల మందికి జీవో నెంబర్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటో?  ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు పంచే జీవో జీవో 2018లో విడుదలైంది. కెసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుని హడావిడిగా జీవో జారి చేసింది. ఈ జీవో కూడా గోప్యంగా ఉంచింది ప్రభుత్వం. అన్ని జిల్లా కార్యాలయాలు స్వంత భవనాల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే బంజారాహిల్స్ బిఆర్ ఎస్ కార్యాలయం ఉన్నప్పటికీ కొత్తగా మరో బిఆర్ఎస్ భవన్ కోకాపేటలో సేకరించడంలో ఆంతర్యం క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం అయి ఉండాలి. హైదరాబాద్ భూములను కారు చౌకగా కొట్టేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద లావాదేవీలు ప్రభుత్వం తెలంగాణా భూములతో చేస్తున్నప్పుడు పారదర్శకత అవసరం లేదా? జీవోను ఎందుకు ఎందుకు రహస్యంగా ఉంచుతుంది ఈ ప్రభుత్వం. 

రాష్ట్రంలో ప్రభుత్వం వుందా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా, కారా? ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో   సంబంధం వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? ఇప్పడు ఇవేవీ ప్రధాన ప్రశ్నలు కాదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా? అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అవును  కర్నూల్  ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి  శ్రీ లక్ష్మి చికిత్స పొదుతున్న విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఈ ఉదయం నుంచి సాగుతున్న తమషా చూస్తే ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వుందా? పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహం కలగక మానదు.  అవును హత్య కేసు విచారణ పూర్వాపరాలు ఇతర విషయాలను పక్కన పెట్టినా  ఇదేమిటి, కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరించక పోవడం ఏమిటి? అధికార పార్టీ నాయకులు , కార్యకర్తలు, చివరకు ఏమ్మేల్యేలు, మాజీలు అస్పుపత్రిని తమ నిర్భండంలోకి తీసుకుని, సామాన్య ప్రజలు, రోగుల రాకపోకలకు అంతరాయం కల్పించినా,  శాంతి భద్రతల సమస్య సృష్టించిన స్థానిక పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడం దేనికి సంకేతం? ఈ పరిస్థతిని చూస్తే  రాష్ట్రంలో ప్రభుత్వం వుందా .. లేదా అనే సందేహం రాక మానదు.   నిజానికి, వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అనేక నిందలు మోస్తూ కూడా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి  ఇవ్వవలసిన  గౌరవం.. కాదు కాదు అంతకంటే ఎక్కువే ఇచ్చింది. ఒకసారి కాదు, అనేక మార్లు సీబీఐ విచారణకు హాజరు కాకున్నా, చూసీ చూడనట్లు వదిలేసింది. అనేక వెసులుబాట్లు కల్పించింది. ఉదారంగా వ్యవహరించింది.  చాలా చాలా లాంగ్ లాంగ్ రోప్ ఇచ్చింది. అయినా, ఆయన సహకరించక పోవడంతో అరెస్ట్ అనివార్యమని భావించిందో ఏమో కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకడుగు ముందుకు వేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావసిన గౌరవ ఎంపీ ఆఖరిక్షణంలో వారి తల్లి శ్రీ లక్ష్మి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేక పోతున్నానని  లేఖ రాశారు. అయితే ఆయన ఆఖరి క్షణంలో విచారణకు హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇలాగే.. ఏవో కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. మరో వంక  సీబీఐ విచారణ నుంచి వెసులుబాటు పొందిన అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినా ఎక్కడి కక్కడ ఆయనకు  చుక్కెదురవుతోంది. మరో వంక రాష్ట్ర పోలీసులు సహకరించని నేపధ్యంలో కేంద్ర బలగాల రక్షణలో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.. అదే జరిగితే రాష్ట్ర పోలీసు ప్రతిష్టే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మరింతగా దిగాజరుతుందని అంటున్నారు. అంతే కాదు  ఇటీవల హైదరాబాద్ లో మధ్య ప్రదేశ్ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, ఒక  ఎంపీని అదే తరహాలో కేంద్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగితే అది రాష్ట్రానికి తలవంపులుగా నిలిచి పోతుందని అంటున్నారు.