నల్గొండ జిల్లాపై  కెసీఆర్ స్పెషల్ ఫోకస్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే విధంగా ప్రచార సరళిని కొనసాగిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనాయకులు. వీళ్లు తలచుకుంటే జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ నల్గొండ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.   మంగళవారం నల్లగొండ జిల్లాలో 3 కీలకమైన బహిరంగ సభలను నిర్వహించబోతోంది. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మరోసారి బీఆర్ఎస్‌నే గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించబోతున్నారు. ఈ సభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచి నల్గొండలో వర్షం పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది.   మరోవైపు కీలక మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సీఎం కేసీఆర్ బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇప్పటికే వెల్లడికావడంతో సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై దృష్టిపెడుతున్నారు. మూడో సారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నాల్లో ఉన్న బీఆర్ఎస్ ఒక్కో సీటును కీలకంగా భావిస్తోంది. ఈ కారణంగానే తమ అభ్యర్థులపైనే పూర్తిగా వదిలి వేయకుండా.. అధినాయకత్వం కూడా శ్రద్ద పెడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ సీట్లలో సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇక్కడ అభ్యర్థులను మార్చాల్సిందే అన్న డిమాండ్ అసమ్మతి నాయకుల నుంచి వచ్చింది. కానీ, సిట్టింగ్ ఎమ్మల్యేలకు బి ఫామ్ లు ఇచ్చింది. దీంతో కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మరో ముగ్గురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవరకొండలో సైతం మున్సిపల్ చైర్మన్ , మాజీ చైర్మన్, మరికొందరు సీనియర్ నాయకలు సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక విధంగా కాంగ్రెస్ లోకి వరదలా వెళ్లిపోయారు. ఇదే పరిస్థితి నల్లగొండ నియోజకవర్గంలోనూ ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ పట్టు జారిపోకుండా కాపాడేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. దీనిలో భాగంగానే నల్గొండపై దృష్టి పెట్టినట్లు విదితమవుతోంది. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సీనియర్ నాయకులంతా ఉమ్మడి నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి మినహా మిగిలిన నాయకులు పోటీ చేస్తున్నారు. టీపీసీసీ మాజీ చీఫ్, సీడబ్ల్యూసీ సభ్యడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. సీఎల్పీ మాజీ నాయకుడు, పార్టీ సీనియర్ కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి ఈ సారి నాగార్జున సాగర్ నుంచి బరిలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో మారు మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీలో ఉన్నారు. ఒక విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం జరగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమ్మకానికి భారత పౌరుల బయోమెట్రిక్ డేటా!?

దేశంలో పౌరుల వ్యక్తిగత భద్రతకు బాధ్యత వహించాల్సిన కేంద్రం చేతులెత్తేసిందా? కేంద్ర సంస్థల వద్ద గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత డేటా అమ్మకానికి సిద్ధమైపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య భద్రత దృష్ట్యా సేకరించిన పౌరుల బయో మెట్రిక్ వివరాలు డార్క్ వెబ్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఆ వెబ్ సైట్ ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో షాక్ కు గురైన ప్రభుత్వ వర్గాలు వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాయి. కోవిడ్ సమయంలో ఐసీఎమ్ఆర్, ఎన్సీఐ సేకరించిన డేటా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చేరాయి. ఈ విరాలు అక్కడ నుంచే లీక్ అయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ వివరాలు ఎలా లీక్ అయ్యాయి. ఎవరి ద్వారా లీక్ అయ్యాయి అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. ఇలా ఉండగా మొత్తం 81 కోట్ల 5 లక్షల మంది  భారత పౌరుల బయో మెట్రిక్ డేటాను డార్క్ వెబ్ విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించడమే కాకుండా ఆందోళనకు గురి చేస్తున్నది. ఆధార్ వివరాల గోప్యత ప్రమాదంలో ఉందన్న అనుమానాలు గతం  నుంచీ వ్యక్తమౌతున్నా కేంద్రం పట్టిచుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌరుల వ్యక్తిగత వివరాలు లీక్ అవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. 

మద్యం కేసులో బెయిలు కోసం ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఒక దాని వెంట ఒకటిగా కేసులు నమోదు చేసి చంద్రబాబును జైలుకు పరిమితం చేయాలన్న వైసీపీ కుట్ర, కక్ష సాధింపు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు అవుతుందని ముందే ఊహించిన జగన్ సర్కర్ ఏసీబీ ద్వారా మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా అక్రమంగా అనుమతులిచ్చారంటూ మరో  కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా పేర్కొంది. కాగా దీనిపై చంద్రబాబు తరఫు  న్యాయవాదులు ముందస్తు బెయిలు కోసం ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  ఇలా ఉండగా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. అవి ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదని హైకోర్టు పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిలు కనుక ఆసుపత్రికే పరిమితం కావాల్సి ఉంటుందని హైకోర్టు  షరతు విధించింది. అలాగే చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కోర్టు  జోక్యం చేసుకోబోదనీ, కేంద్రం నిబంధనల మేరకు ఆయనకు సెక్యూరిటీ అమలు చేయాలని పేర్కొంది. అలాగే మెయిన్ బెయిటు పిటిషన్ పై ఈ నెల 10న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.  

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌  మంజూరైంది. ఆయన నాలుగు వారాలు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిలు పిటిషన్ పై సోమవారం (అక్టోబర్ 30) వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పు మంగళవారానికి రిజర్వ చేసిన సంగతి తెలిసిందే.  చంద్రబాబు ఆరోగ్యం రిత్యా బెయిలు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిలు రావడంతో ఆయన ఈ రోజు సాయంత్రానికి రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయనను నేరుగా ఆసుపత్రికి తరలిస్తారా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తీర్పు కాపీ బయటకు వచ్చిన తరువాతే ఆ విషయంపై స్పష్టత వస్తుంది.  ఇలా ఉండగా నిన్న హైకోర్టులో మధ్యంతర బెయిలుపై వాదనల తరువాత కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేస్తుందన్న విషయంలో వైసీపీ సర్కార్ కు అనుమానం వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆయనను సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ లక్ష్యం మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబును ఏ3గా పేర్కొంటో మరో కేసును రెడీ చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారంటూ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే స్కిల్ కేసుతో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు నమోదు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ మరో కేసు పెట్టింది.  ఇలా బాబు పై ఒకదాని వెనుక మరొక కేసులు వేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చంద్రబాబంటే ఐటీ ..ఐటీఅంటే చంద్రబాబు!

అవును, ఆయనేమీ దేవుడు కాదు, ఇంద్రుడు కాదు , చంద్రుడు కాదు. ఎందరో నాయకుల్లో ఆయనొకరు, కానీ, ఎక్కడెక్కడి నుంచో, ఎవరెవరో వచ్చి ఆయన కోసం గళం విప్పడం ఏమిటి? కులం గోత్రాలతో, రాజకీయ రంగులతో  సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన విభిన్న వర్గాల ప్రముఖులు, సామాన్యులు ఒకటిగా ఆయన కోసం గళం విప్పడం ఏమిటి?  నిజంగా నడుస్తున్న చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం. ఒక అద్భుత దృశ్యం. రాజకీయ కక్షతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్రలో చిక్కుకుని,యాభై రోజులకు పైగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన దృశ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గొప్ప తనాన్ని మరో మారు గుర్తు చేసింది. మరో  మారు ప్రపంచం కళ్లకు కట్టింది.  అవును, రెండురోజుల క్రితం ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సైబర్ టవర్స్ రజతోత్సవ’ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందు చూపుకు దర్పణంగా నిలిచింది. ఎప్పుడో,పాతికేళ్ళ నాడు కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై నిలిచిన దృశ్యం దర్శనమిచ్చింది. చంద్రన్నకు ఐటీ వందనం చేసింది. తెలుగు యువత హైటెక్  భవితకు బంగరు బాటలు పరిచిన  విజనరీకి వందనం చేసింది. వందనం చేయటమే కాదు. గళం విప్పింది. గర్జించింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు యువకులే కావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా పెల్లుబుకిన అభిమానం కొత్త చర్చకు తెర తీసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువ కిశోరాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తామని.. సంఘీభావాన్ని ప్రకటించటంతో పాటు.. ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు ఇప్పడు ఎక్కడున్నా, ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నరనే విషయాన్ని ఈ ఈవెంట్ రుజువు చేసింది. వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు జై కోట్టారు.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు పెద్ద ఎత్తున వినిపించాయి. నిజానికి ఆదివారం జరిగింది, చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు పండగో, పెళ్లిరోజు వేడుకో కాదు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమం కాదు. అసలు రాజకీయాలతో సంబంధమే లేని  కార్యక్రమం. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అవుతున్న వేళ.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమలో  పలువురు మాట్లాడిన మాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా ఉన్నాయి. అందుకే, బావోద్రేకంతో ఒకరిద్దరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా, మాట్లాడిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు దార్శనికత   గురించే మాట్లాడారు.  ఆయన ముందు చూపుతో నాటిన విత్తు ఈరోజు ఏ విధంగా మహా వట వృక్షమై, తమవంటి లక్షల మందికి  ఎలా నీడను అందిస్తున్నదో, దేశ  విదేశాల్లో తాము సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆదర్శంగా నిలిచారో వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు నడకను, నడతను దగ్గర నుంచి చూసిన పెద్దలు, ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు. జనసామాన్యం చంద్రబాబును తమ తల్లిదండ్రులతో, అంత కన్నా మిన్నగా దేవుడితో సమానంగా ఎలా చూస్తారో సోదారహరంగా వివరించారు. ఒక డ్రైవర్ రోజూ తాను అన్నం తినే ముందు తల్లిదండ్రులతో సమానంగా భావించే చంద్రబాబు కోసం ఓ ముద్ద వదిలి మరీ తాను తింటాడు. తెలుగు ఇళ్లళ్లో వ్రతాలు, పూజలూ చేయడం కద్దు. అలా చేసిన ప్రతి సారీ దేవుడి ఆకును ఉంచి.. వండిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే చంద్రబాబు విజన్ వల్ల తమ జీవితాలు నిలబడ్డాయని భావించచే ప్రతి ఉద్యోగీ, వారి కుటుంబం చంద్రబాబును దేవుడితో సమానంగా భావిస్తారనడానికి ఆ డ్రైవర్ తాను తినే ముందు ఒక ముద్దను చంద్రబాబుకు నైవేద్యంగా సమర్పించడమే నిదర్శనం.    నిజానికి, హైటెక్ సిటీ అంటే, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రమే గుర్తు కొస్తారు. ఆ నిజాన్ని ఎవరూ కాదన లేరు.  నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత కూడా  తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అంటే ఆది చంద్రబాబు చలవే  తప్ప మరొకటి కాదు. ఐటీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. చంద్రబాబు మానస పుత్రిక విజన్ 2020 పుణ్యానే, ఈరోజున హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది. అయితే  ఆ రోజుల్లోకి వెళితే ఒక నొక సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్నట్లుగా  ఆరోజుల్లో విజన్ 2020 అంటే.. 420 అని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజున కళ్ళ ముందు కనిపిస్తున్న విజన్ 2020 ఫలాలను ఎవరూ కాదన లేరు..  ఎవరో కాదు..అసలు ఎవరిదాకానో ఎందుకు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సైతం.. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన కృషే కారణమని ఒక సారి కాదు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అందుకే, ఈరోజున చంద్రబాబు నాయుడుకు ఐటీ రంగం జేజేలు పలుకుతోంది. బాబంటే ఐటీ ..ఐటీఅంటే బాబు అంటోంది ఐటీ ప్రపంచం.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ బండి సంజయ్.. హెలికాప్టర్ కేటాయింపు.. రోజూ మూడు సభలలో ప్రసంగాలు!

కాస్త ఆలస్యంగానైనా బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో బీజేపీ నిస్తేజంగా మారిపోవడానికి కారణాలను గుర్తించింది. తెలంగాణ ఎన్నికలలో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. ఎన్నికల ముంగిట తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ప్రతికూలంగా మారింది. అప్పటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా జోరు మీద ఉన్న పార్టీ.. బండి సంజయ్ ను పార్టీ అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాత తడబడింది. వెనుకబడింది.   ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన విషయాన్ని గుర్తించిన అమిదత్ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్‌‌ను కొనసాగించాలని హైకమాండ్ ఆదేశించింది. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుగా ఆయన   హెలికాప్టర్ కేటాయించింది.  బండి సంజయ్ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తారని, ఆయనకు సహకరించాలని కేంద్ర హోం  మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీని ఆదేశించినట్లు తెలుస్తోంది.అంతకు ముందు బండి సంజయ్‌తో అమిత్ షా ప్రత్యేకంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమన్వయంతో కృషి చేయాలని ఆ సందర్భంగా అమిత్ షా బండి సంజయ్ కు సూచించారని అంటున్నారు.   రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించింది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పలు ఎన్నికల్లో ఎన్నడు లేని విధంగా విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్‌కి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ హెలికాప్టర్ వినియోగించనున్నారు. సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు తెలుస్తోంది అయితే, కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్ నిలవడంతో ప్రతిరోజూ రెండు సభల్లో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ చేరుకుని నియోజకవర్గంలో ప్రచారం చేపడతారని అంటున్నారు.  బీజేపీ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ ను మించి ఉండాలనీ, కేసీఆర్ కు దీటుగా బండి సంజయ్ ప్రసంగాలు ఉండాలని అమిత్ షా బండికి సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

తెలుగుదేశంకు కాసాని రాజీనామా

తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.   తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంతా సిద్ధం చేసుకున్నాక.. పోటీ చేయొద్దని చంద్రాబాబు నిర్ణయించడం తనను బాధించిందని కాసాని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేయడం లేదని తాను కార్యకర్తలకు చెప్పలేననీ, అన్ని విధాలుగా ఎన్నికలకు వారిని సన్నద్ధం చేసిన తరువాత పోటీ లేదంటూ వారికి ముఖం చూపలేకే   రాజీనామా చేశాననీ తెలిపారు.   ఈసారి పోటీ చేయాల్సిందే అని తెలంగాణలోని పార్టీ కేడర్ మొత్తం కోరుతోందని పేర్కొన్నారు. ఇలా ఉండగా కాసాని గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనీ, తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయకపోవడాన్ని సాకుగా చూపి రాజీనామా చేశారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, కాసాని ఏ పార్టీలో చేరతారో అని ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.  అంతే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గంపగుత్తగా బీఆర్ఎస్ కు కట్టబెట్టేసేందుకు కాసాని జ్ణానేశ్వర్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఏఎస్ రావు ఆరోపించారు. తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయదన్న చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ కు చెప్పడానికి అన్న సాకుతో ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేక సమావేశంగా కాసాని మార్చేశారని ఆయన ఆరోపించారు.  తెలంగాణ లో పార్టీ బలంగా లేదు. పైగా చంద్రబాబు జైలులో ఉన్నారు. ఇది పోటీ చేసే సందర్భం కాదు. అందుకే పోటీకి పెట్టి నాయకులను ఆర్దికంగా నష్టపరచకూడదన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ సారి తెలంగాణలో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారని తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు నాయకులు భావిస్తుంటే.. వారిని పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి కాసాని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

గుండెల మీద తన్నాడు..!

రాజన్న ముద్దు బిడ్డ  జగన్‌ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు ఆ రాజన్న భార్య  విజయమ్మ, కుమార్తె వైయస్ షర్మిల.. పెద్ద యజ్జమే చేశారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. జగనన్ను ముఖ్యమంత్రి యోగం పట్టించేందుకు పెద్ద యాగమే చేశారు. అదీ కూడా  ఎంతగా అంటే  జగన్.. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉంటే.. జగనన్న వదిలిన బాణమంటూ..   సోదరుడి కోసం రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వారి తల్లి   విజయమ్మ సైతం అడుగు కలిపారు.  అలాగే ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా  జగన్ సైతం పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో వైయస్ జగన్‌కి  షర్మిల, వైయస్ విజయమ్మ అండ.. దండ గా నిలిచారు. అంతేకాదు..  షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారితో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించి.. తన బావమరిది, వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్ర పరిస్థితులు ఏమో కానీ ముఖ్యంగా మన స్థితిగతులు మారిపోతాయని.. వారికి ఎరేసి మరి చెప్పారు. అలా వారితోపాటు  కాలం కూడా జగన్‌కి కలిసొచ్చింది.  2019 ఎన్నికల పలితాల్లో జగన్ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. దీంతో జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశారు.. దీంతో జగన్ బాబు.. జగన్ బాబు అంటూ పలికే ఆయన కన్నతల్లి  విజయమ్మ, జగనన్న జగనన్న అనే వైయస్ షర్మిల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.  కానీ వారి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సీఎం జగన్ అనిపించుకొన్న కొద్ది రోజులకే..   విజయమ్మ,  షర్మిల పక్క రాష్ట్రానికి పయనమయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్సా టీపీ అంటూ కొత్త పార్టీని  షర్మిల స్థాపించినా.. ఆ పార్టీని..  షర్మిలను జగన్ నిరాదరణకు గురి చేసిశారు. అలాగే   షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా.. ప్రజలు పట్టించుకోకపోవడంతో.. ఆ పాదయాత్రకు వైయస్ షర్మిల   పెట్టేశారు..  తాజాగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగడంతో.. ఈ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామంటూ  షర్మిల ప్రకటించిన విషయం విదితమే. దాంతో పార్టీలో నేతలు లేరు, కేడరూ లేదు. అలాంటి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటూ.. ఆమె కన్న తల్లి  విజయమ్మ ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ప్రముఖ సిద్దాంతి అద్దేపల్లి హనుమంతరావు నివాసానికి చేరుకొని..  షర్మిల రాజయోగంపై ఆరా తీశారు. అనంతరం స్థానిక శాసన సభ్యుడు, సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి   చేరుకొని... యోగ క్షేమాలు  ఆరా తీశారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి   జగన్ అనుసరిస్తున్న వైఖరిపై బాలినేని.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో  విజయమ్మకు వివరించే ప్రయత్నం చేశారు. అంతలోనే మాట  అందుకొన్న వైయస్ విజయమ్మ.. తనతో వైయస్ జగన్ సరిగ్గా మాట్లాడడమే లేదని.. తనను,  షర్మిలను అసలు పట్టించుకోవడం లేదంటూ బాలినేని ఫ్యామిలీ ఎదుటే ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు బాలినేని సైతం తన పట్ల సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై   విజయమ్మకు వివరించడంతో.. ఇద్దరూ తమకు జరుగుతున్న అన్యాయం, అవమానం ఒకరికొకరు ఏకరువు పెట్టుకొన్నట్లు పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి.. అవుతున్నాయి.  దీంతో నెటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగనన్నను అందలం ఎక్కిస్తే.. ప్రజలకే కాదు మనకు సైతం అందకుండా పోయాడని వారు పేర్కొంటున్నారు. విశ్వసనీయత, మాటతప్పం, మడమ తిప్పం లాంటి సెంటిమెంట్ డైలాగులు వాడే   జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొన్నారని వారు వ్యంగ్యంగా అంటున్నారు. ముఖ్యమంత్రిగా  జగన్.. సభల్లో, బహిరంగ సభల్లో స్టేజీలెక్కి అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు అంటూ షిక్కటి చిరునవ్వుతో చెప్పే మాటలన్నీ వట్టి కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని అంటున్నారు.  అయినా జగనన్న కోసం అంతలా పాదయాత్ర చేస్తే.. ఆ తర్వాత సొంత చెల్లినే దూరం పెట్టిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలంటూ నెటిజన్లు.. సోషల్ మీడియాలో పదాలు కోసం వెతుక్కోవడం గమనార్హం. ఆస్తి తగాదాలు, నామినేటేడ్ పోస్టులు వంటి వాటి వల్ల సొంత చెల్లిని దూరం పెట్టాడంటే అనుకోవచ్చు. కానీ కన్నతల్లి వైయస్ విజయమ్మని  సైతం ఈ జగనన్న పట్టించుకోవడం లేదంటే.. మహానేత, తండ్రి  రాజశేఖరరెడ్డి గుండెల మీద సీఎం జగన్ తన్నినట్లే అన్న ఓ ప్రచారం   సోషల్ మీడియలో జోరందుకొంది.  ఇక అధికారం.. అధికారం.. అధికారం.. ఈ అధికారం అనే అందలం ఎక్కగానే.... అప్పటి వరకు సాయం చేసిన వాళ్లని.. సాయపడిన వాళ్లని.. మరిచిపోతారా? అనే సందేహం సైతం నెటిజనులలో వ్యక్తమవుతోంది.

చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిలు పిటిషన్ పై  తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. దీనిపై వాదనలు పూర్తయ్యీయా. తీర్పు మంగళవారం (అక్టోబర్ 31న)న వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాల రిత్యా మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్  విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు సమర్పించారు. ఆయన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆయన కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టై 50 రోజులు దాటిందనీ, ఇంత వరకూ ఈ కేసులో కొత్తగా పురోగతి లేదనీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.   కాగా  ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు మంగళవారం (అక్టోబర్ 31)కు వాయిదా వేసింది. ఇలా ఉండగా.. చంద్రబాబు రెగ్యులర్ బెయిలు పిటిషన్ పై వాదనలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం తరఫు న్యాయవాది, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి సమయం కోరారు. దీంతో ఈ కేసుపై వాదనలు ఎప్పుడు వినేదీ కూడా మంగళవారం (అక్టోబర్ 31) నిర్ణయం తీసుకుంటామని  హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. కాగా ఇదే కేసులో చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వచ్చే నెల 8వ తేదీలోగా వచ్చే అవకాశం ఉంది. 

బీజేపీలో మోడీ స్వామ్యం.. రాష్ట్రాలలో నాయకత్వం శూన్యం

ప్రాంతీయ పార్టీలను మించి బీజేపీలో వ్యక్తిపూజ పెరిగిపోతున్నదా? ఏకస్వామ్యం రాజ్యమేలుతోందా? ఇంత కాలం కుటుంబ పార్టీలు అంటూ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలపై   విమర్శలు గుప్పించిన మోడీ.. కాంగ్రెస్ డైనాస్టీని ఎత్తి చూపిన మోడీ.. ఇప్పుడు అంతకు మించీ బీజేపీలో  సర్వం తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మోడీ తీరు కారణంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల వేడి జోరందుకుంది. అయితే బీజేపీలో ఆయా రాష్ట్రాలలో బీజేపీలో మాత్రం ఒక విధమైన నిస్తేజం కానవస్తోంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రచారం నుంచి ప్రతి విషయం పార్టీ అధిష్ఠానం కనుసన్నలలోనే నడవాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక నాయకత్వం దాదాపుగా నిర్వీర్యమైపోయింది. పార్టీ రాష్ట్రాల అధ్యక్షులను ఇష్టారీతిగా మార్చేయడం, ఆ మార్పు చేర్పులలో ప్రాంతీయ నాయకుల పాత్ర ఇసుమంతైనా లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీకి నాయకత్వమన్నదే లేకుండా పోయింది.  పార్టీ రాష్ట్ర శాఖలపై హైకమాండ్ పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రాలలో పట్టు ఉన్న నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయడం, అందుకోసం రాష్ట్రాల అధ్యక్షులనే కాదు, మాజీ ముఖ్యమంత్రులను సైతం పక్కన పెట్టేయడంతో  బీజేపీ రాష్ట్రాలకు చెందని పార్టీగా మారిపోయింది. బీజేపీ అంటే జాతీయ స్థాయిలో పలుకుపడి కలిగిన పార్టీకే పరిమితమైపోయింది.   ప్రాంతీయ నాయకులు లేని కొరత ఇప్పుడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆయా రాష్ట్రాలలో  పలుకుబడి ఉన్న నేతలకు పక్కన పెట్టేయడంతో ఇప్పుడు ఎన్నికలలో వారి కొరత తీర్చేందుకు రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన పరిస్థతి ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని బీజేపీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారం అంతా మోడీ చుట్టూ కేంద్రీకృతమై ఉండటంతో స్థానిక నేతలకు పనిలేకుండా పోయింది. ప్రజలలో పలుకుబడీ పలుచనైంది.  ముందుగా తెలంగాణ విషయానికి వస్తే..  తెలంగాణలో బీజేపీని దౌడు తీయించి, అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగే పరిస్థితికి తీసుకువచ్చిన బీసీ నేత బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి... ఇప్పుడు అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటించింది. అయితే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి అధికారం కోసం పోటీ పడే పరిస్థితి నుంచి రాష్ట్రంలో హంగ్ వస్తే కనీసం చక్రం తిప్పితే చాలనుకునే పరిస్థితిని దిగజారింది. మరీ ముఖ్యంగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు పార్టీ అధిష్ఠానం అనుకూలంగా వ్యవహరించిందన్న భావన పార్టీ శ్రేణుల్లోనే కాదు.. సామాన్య జనంలో కూడా వ్యక్తం అయ్యింది.  అయితే పార్టీ శ్రేణులలో ఆ భావనను తొలగించేందుకు బీజేపీ హై కమాండ్ ఏ మాత్రం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం తెలంగాణలో అధికార రేసులో బీజేపీ వెనుకబడడానికి బీజేపీ హై కమాండ్ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఛత్తీస్ గఢ్ విషయానికి వస్తే.. అక్కడ ప్రజలలో మంచి పలుకుబడి కలిగిన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను పక్కన పెట్టడంతో  ఆ రాష్ట్రంలో బీజేపీ బాగా వెనుకబడింది. రమణ్ సింగ్ ను వ్యతిరేకించే బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకత్వాన్ని ప్రోత్సహించిన బీజేపీ హైకమాండ్ వైఖరి కారణంగా.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత మటుమాయమైపోయింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపకుండా పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతోనే బీజేపీ స్వయంగా తన పతనాన్ని తానే శాసించుకున్నట్లైంది. రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి. అక్కడ బలమైన నేత వసుంధరారాజెను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి.. గెహ్లాట్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే బలమైన నేత లేని పరిస్థితిని స్వయంగా బీజేపీ అధిష్ఠానమే తీసుకువచ్చింది.    నిజానికి  రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల విసిగిపోయిన ప్రజానీకం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తు న్నారు. అయితే ఆ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి అవకాశం లేని పరిస్థితులను బీజేపీ హై కమాండే తీసుకువచ్చింది.ఇక మధ్య ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ప్రజాభిమానాన్ని కోల్పోయిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తూ.. పార్టీని బలహీనపరిచింది. మిజోరంలో త్రిముఖ పోటీలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడా మిత్రపక్షంతో సయోధ్యలేని పరిస్థితుల్లో ఎదురీదుతోంది. ఈ ఐదు రాష్ట్రాలలోనూ కూడా స్థానిక నాయకత్వాన్ని బీజేపీ హై కమాండ్ నిర్వీర్యం చేసిన కారణంగానే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ విషయంలో బీజేపీ ఏ విమర్శలైతే చేసిందో... ఇప్పుడు అవే విమర్శలను సొంత పార్టీ నుంచే బీజేపీ ఎదుర్కొంటోంది.  

రాజకీయ ప్రచారానికి ప్రభుత్వోద్యోగుల వినియోగం.. బీజేపీకి రోల్ మోడల్ జగనేనా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక విలక్షన రాజకీయనాయకుడు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా ఉందన్న సంగతిని ఆయన విస్మరించడమే కాకుండా.. అధికారులూ, కేబినెట్ సహచరులూ కూడా మరిచిపోయేలా చేయగలిగారు. ప్రభుత్వానికీ, అధికార పార్టీకీ మధ్య ఉన్న గీతను ఆయన చెరిపేశారు. ఆ రెండూ వేరువేరు కదా అంటే.. అలా ఎలా అవుతుంది అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన ప్రసంగాలన్నీ విపక్షాలపై విమర్శలు గుప్పించడానికే పరిమితమౌతాయి. ఇక అధికారులు సైతం పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా లేదన్నట్లుగానే పార్టీ నేతలు, కార్యకర్తల మాటకే విలువనిచ్చి తరలిస్తుంటారు.  సంక్షమం అటూ జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసే బహిరంగ సభలన్నీ కూడా వైసీపీ ప్రచార కార్యక్రమాలుగానే ఉంటాయి. ఆయా సభలలో ఆయన విపక్షాలు, విపక్ష నేతలపై విమర్శలకే సమయం అంతా కేటాయిస్తుంటారు. ఆ సభలన్నీ ప్రభుత్వ వ్యయంతో అంటే ప్రజాధనంతోనే  నిర్వహిస్తారు. ఇక ప్రభుత్వ యంత్రాంగమంతా వైసీపీ కోసమే పని చేస్తుంటాయి. ఇందుకు ఉదాహరణగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని  చెప్పుకోవచ్చు. పార్టీ  నేతలు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు జరిగిన లబ్ధి ఇదీ అని చెప్పుకోవడానికి నిర్దేశించిన ఈ కార్యక్రమంలో నేతల కంటే అధికారుల హడావుడే ఎక్కువగా కనిపిస్తున్నది. వైసీపీ నాయకులతో పాటు అధికారులూ ఇంటింటికీ తిరిగి ప్రజలకు అందిన సంక్షేమాన్ని చెప్తున్నారు. అధికారులు రాజకీయ నాయకులకు అసిస్టెంట్లుగా, వారి తరఫున మాట్లాడే  వారిగా వ్యవహరిస్తున్నారు. సరే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  వైసీపీ నేతలకు ఎదురైన పరాభవాన్ని పక్కన పెడితే.. అధికార యంత్రాంగాన్ని ఇష్టారీతిగా వాడేసుకోవడం వైసీపీతోనే ప్రారంభమైందని చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కోసం ఇష్టారీతిగా వాడేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క జగన్ ప్రభుత్వమేనని చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది చట్ట ప్రకారం కూడా నిషిద్ధం. ఈ విషయంలో జగన్ సర్కార్ పై విపక్షాల విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాల్సిన కేంద్రం కూడా.. ఇదేదో బాగున్నట్లుందే అని అదే దారిలో నడవడానికి రెడీ అయిపోయింది. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలంటే జగన్ మార్గమే రోల్ మోడల్ అని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందుకే జగన్ తరహాలోనే అధికార యంత్రాంగాన్ని వాడేసుకుని ప్రయోజనం పొందేలా కార్యక్రమాన్ని రూపొందించింది. గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మోడీ సర్కార్ సాధించిన విజయాలను  ప్రభుత్వ ఉద్యోగులతో  కమిటీలను వేసి మరీ ప్రచారం చేయడానికి రెడీ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించింది. వచ్చే నెల 20 నుంచి జనవరి 25 వరకూ మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారానికి ఒక కార్యక్రమం రూపొందించింది. ఈ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో  కూడిన కమిటీలను దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి రక్షణ శాఖ ఉద్యోగులను కూడా వినియోగించుకోవడానికి సైతం మోడీ సర్కార్ వెనుకాడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలు, ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం.  అయితే ఏపీలో ఈ నిషేధిత కార్యక్రమాన్ని జగన్ సర్కార్ కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగిస్తోంది. దీంతో జగన్ సర్కార్ నే ఆదర్శంగా తీసుకున్న చందంగా ఇప్పుడు మోడీ సర్కార్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలకూ, ప్రచారానికి వినియోగించుకోవడానికి రెడీ అయిపోయింది.  తాను నిత్యం ప్రవచించే భారత రాజ్యాంగం, విలువలకు తిలోదకాలిచ్చి  ఇలా ప్రభుత్వ ఉద్యోగుల చేత తన విజయాలను ప్రచారం చేయించుకోవడాన్ని మోడీ ఎలా సమర్ధించుకుంటారో చూడాల్సి ఉంది. 

హై కమాండ్ వద్ద ఇప్పటికీ సోము వీర్రాజు మాటే చెల్లుబాటు?

నోటితో పలకరించి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది  బీజేపీ ఏపీ  శాఖ పట్ల  ఆ  పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టను  పాతాళానికి దిగజార్చేశారంటూ సోము వీర్రాజును  ఆ పదవి నుంచి తప్పించి పార్టీ రాష్ట్రపగ్గాలను పురంధేశ్వరికి అప్పగించిన బీజేపీ హై కమాండ్ ఇప్పటికీ సోము వీర్రాజు  మాటకే ఎక్కువ విలువ ఇస్తోందా, జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పురంధేశ్వరి  ఎన్ని  ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఆమెకు కంఠశోష మాత్రమే మిగిలేటట్లు చేస్తోందా అంటే  పరిశీలకులు అవుననే విశ్లేషిస్తున్నారు.  ఏపీ అడ్డగోలు అప్పులు, నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర విత్త  మంత్రి నిర్మలా  సీతారామన్ కు పురంధేశ్వరి గణాంకాలు, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిలోనే పార్లమెంటు సాక్షిగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక  విధానాలు  భేష్ అంటూ నిర్మలా  సీతారామన్ కితాబిచ్చారు. అందుకు  ఆమె ఆర్బీఐ నివేదికను చూపారు. అది కూడా పాక్షిక నివేదికే అన్న ఆరోపణలు, విమర్శలూ అప్పట్లోనే వచ్చాయి. అయితే  సాంకేతికంగా ఎప్పుడో మూడు నెలల ముందు ప్రశ్నకు ఆమెకు గతంలో అందిన సమాచారం మేరకే సమాధానం ఇచ్చారని పార్టీ వివరణ ఇచ్చుకుంది. అది   పక్కన పెడితే.. ఏపీలో మద్యం విధానం పెద్ద కుంభకోణం అంటూ ఆధారాలతో సహా నివేదికను అందించి, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని పురంధేశ్వరి డిమాండ్ చేసినా ఇంత వరకూ హైకమాండ్ నుంచి స్పందన లేదు. అయితే  సోము వీర్రాజు సిఫారసు మేరకు మాత్రం ఓ కేంద్ర కార్పొరేషన్  చైర్మన్ పదవిని మాత్రం ఆఘమేఘాల మీద కట్టబెట్టారు. దీనిపై పురంధేశ్వరి తన  అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకమాండ్ కు లేఖ  రాశారు. అవును ఇప్పుడు ఏపీ బీజేపీలో వర్గపోరు పీక్స్ లో ఉంది. జనంలో కొద్దిపాటి  ఆదరణ కూడా లేని పార్టీలో వర్గ పోరు మాత్రం తారస్థాయిలో ఉంది. పొకాకు బోర్డు చైర్మన్ గా ప్రకాశం  జిల్లాకు చెందిన యశ్వంత్ ను  నియమిస్తూ  బీజేపీ  హై కమాండ్ తీసుకున్న నిర్ణయం ఏపీ వ్యవహారాలలో బీజేపీ హై కమాండ్ ఇప్పటికీ సోము వీర్రాజు మాటకే విలువనిస్తున్నదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. యశ్వంత్ పార్టీలో చేరి మూడేళ్లైంది. కిసాన్ సెల్ రాష్ట్ర పధాన  కార్యదర్శిగా పని చేస్తున్నారు.  అటువంటి యశ్వంత్ ను పొగాకు బోర్డు చైర్మన్ గా నియమించడం వెనుక బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సిఫారసు ఉందని అంటున్నారు. ఈ నియామకం విషయంలో  పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరికి కనీస సమాచారం కూడా లేదని అంటున్నారు.   బీజేపీలో ఎవరికైనా కార్పొరేషన్ పదవులు రావాలంటే.. సంబంధిత వ్యక్తికి చెందిన  రాష్ట్ర శాఖ అధ్యక్షుడి  సిఫారసు అవసరం అన్న నిబంధన ఉంది. కానీ సోము గతంలో చేసిన సిఫారసునే పరిగణనలోనికి తీసుకున్న బీజేపీ హై కమాండ్ ప్రస్తుత అధ్యక్షురాలికి  కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా  నిర్ణయం తీసుకోవడంపై పురంధేశ్వరి  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  పార్టీ జాతీయ సంఘటనా మంత్రి బీఎల్ సంతోష్‌జీకి ఫోన్ చేసి, తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా,  ఈ నియామానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని ఆమె గట్టిగా కోరినట్లు చెబుతున్నారు.   చూడాలి మరి బీజేపీ ఏపీలో పోగాకు బోర్డు చైర్మన్ పదవి వివాదాన్ని అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందో? సోము సిఫారసుకే విలువనిచ్చి నోటిఫికేషన్ జారీ చేస్తుందా? పురంధేశ్వరి అభ్యంతరాన్ని పరిగణనలోనికి తీసుకుని నియామకాన్ని వెనక్కు తీసుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.

జగన్ ఇక ప్యాకప్.. తేల్చిచెప్పేసిన ఐప్యాక్ సర్వే!

అయిపాయే... ఇంతవరకు వాళ్ళూ వీళ్ళూ చెపితే  ఏమోలే వాళ్ళూ వీళ్ళూ చెప్పినవి మనం ఎందుకు నమ్మాలి అని సరిపెట్టుకున్న వైసీపే నేతలకు ఇప్పడు  ప్రశాంత్ కిశోరే చేతులు ఎత్తేయడంతో  నిజం ఏమిటో తెలిసి వచ్చింది. ఓటమి తధ్యమనే సత్యం బోధపడింది.  అవును. ఐ ప్యాక్ (ప్రశాంత్ కిషోర్) నిర్వహించిన తాజా సర్వే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎటు మొగ్గుచూతున్నారో తేల్చి చెప్పేసింది. ఏపీ ఓటరు పల్స్  ఏమిటో నిగ్గుతేల్చింది. ఇప్పటికిప్పుదు కాదు ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఏపీలో అధికార  వైసీపీకి ఓటమి ఎదురు దెబ్బ తప్పదని  అదికూడా అలాంటి ఇలాంటి ఎదురుదెబ్బ కాదు దిమ్మతిరిగే ఎదురదెబ్బ తప్పదని ఐ ప్యాక్ తాజా సర్వే తేల్చి చెప్పింది.  నిజానికి సర్వేలతో పనిలేకుండానే వైసీపీ ఓటమి అనివార్యమనే నిజం ఆ పార్టీలో ఒక్కరికి మినహా అందరికీ  ఇప్పటికే తెలిసిపోయింది. క్షేత్ర స్థాయిలో  వాస్తవ పరిస్థితి  ఏమిటన్నది అందరికంటే వైసీపీ నాయకులకే కొంచెం ఏమిటి.. చాలా ఎక్కువ తెలుసు. అయితే మీటలు నొక్కితే ఓట్లు రాలతాయనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి  సర్వేల పేరిట తనను తాను మోసం చేసుకుంటూ, ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులనూ మోసం చేస్తూ వచ్చారు.  అయితే ఇప్పడు, ఐప్యాక్  లేటెస్ట్ సర్వేతో వైసీపీ నాయకులకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న పీకే తాజ్ సర్వే పై వైసీపీలోనే  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇతకీ ఈ సర్వే  ఏమి చేపుతోందంటే, తెలుగుదేశశం, జనసేన కలిసి పోటీ చేస్తే ఈ కూటమికి ఏకంగా 144 స్థానాలు దక్కుతాయని స్పష్టం చేసింది. మరో వంక వై నాట్ ..175 అంటున్న జగన్ రెడ్డికి గరిష్టంగా 31 సీట్లు మించి  వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఇంతవరకు మీటల మీద పెట్టుకున్న ఆశలు  పనిచేయని పరిస్థితి రాష్ట్రంలో ఉందనీ, సంక్షేమ పథకాలు జగన్‌ని కాపాడలేకపోతున్నాయని ప్రశాంత్‌ కిశోర్‌ సర్వే తేల్చిచెప్పింది.  నాలుగేళ్లుగా రాష్ట్రంలో  పడకేసిన అభివృద్ధి, కనీసం రాజధాని ఏదో కూడా తేల్చుకోలేని స్థితి , పోలవరం ఆగిపోవడం లాంటి అంశాలు జగన్‌కి శాపంగా మారాయని పీకే  సర్వేలో  తేలింది.  ఇక చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కూడా వైసీపీ అవకాశాలను గట్టిగా దెబ్బతీసిందని   ప్రశాంత్‌ కిశోర్‌ బృందం తేల్చి చెప్పింది. చంద్రబాబు అరెస్ట్  తర్వాత దేశ విదేశాల్లో ఆయనకు  లభిస్తున్న మద్దతు. వ్యక్తమవుతున్న సానుభూతి, అన్నిటినీ మించి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మరో సారో మరింతగా వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనలో కట్టు తప్పి, ఆగాధంలోకి కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించాలంటే  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి తీరాలన్న  భావన ప్రజలలో  బలంగా వ్యక్తమౌతోందని ఈ సర్వే పేర్కొంది. ఇటు రాజధానిపై జగన్‌ నాలుగేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా వైసీపీ పుట్టి ముంచనుందని పేర్కొంది. సీపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి యూ టర్న్‌ తీసుకున్న జగన్‌పై ఉద్యోగులు ఆవేశంతో రగిలిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.. వారి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి.ఇలా అన్ని వర్గాల్లో కట్టలు తెంచుకుంటున్న అసంతృప్తిని పసిగట్టిన పీకే ..ఐ ప్యాక్ ప్యాకింగ్ కు రెడీ అయిపోయిందని అంటున్నారు.  ఇలా అన్ని రంగాలు కుదేలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.  దీంతో  ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రశాంత్‌ కిషోర్‌ సర్వే తేల్చిందనీ.. తమకు ఓటమి ఖాయమన్న విషయం ఆ సర్వేతో సంబంధం లేకుండానే తెలిసిపోయిందనీ వైసీపీ నాయకులే అంటున్నారు.

ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో ప్రమాద తీవ్రత వెంటనే తెలియరాలేదు.  విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉండగా,  దానిని అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.   విశాఖపట్టణంలోని కేజీహెచ్, విమ్స్‌లో వైద్య బృందాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణం నుంచి ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు పంపించారు. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నేపథ్యంలో  రైల్వే శాఖ  పలు రైళ్లు  రద్దు చేసింది. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌‌మోహన్‌రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

తెలంగాణలో బీజేపీ ఖాళీ అయిపోతోందా?

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఒక్కరొక్కరుగా అగ్రనేతలు దూరం అవుతున్నారు. తెలంగాణలో అధికారమే  తరువాయి అంటూ ఆర్భాటంగా ఇతర పార్టీల నుంచీ చేరికల  కోసం ఏకంగా  చేరికల క మిటీనే ఏర్పాటు చేసి, ఆ కమిటీ సారథ్య బాధ్యతలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటలకు అప్పగించినా కూడా.. ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేవారికి విశ్వసనీయత కలిగిన ఆప్షన్ గా కనిపించడం లేదు సరికదా ఇప్పటికే పార్టీలో ఉన్న వారు కూడా మునిగిపోయే నావను ఎలా నమ్ముకుంటాం అనుకుంటున్నారో ఏమో ఒక్కరొక్కరుగా  పార్టీని వీడుతున్నారు. అలా వీడుతున్నట్లు ప్రకటిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన రాష్ట్ర బీజేపీ నాయకులకే కాదు, ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గతంలో  తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి కారణం.. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే అప్పట్లో బీజేపీయే సరైన పార్టీగా కనిపించిందనీ, అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భావించి, శాసన సభ్యత్వాన్ని కూడా వదులుకుని రాజీనామా చేసి బీజేపీలో చేరాననీ గుర్తు చేసిన ఆయన ఇప్పుడు బీజేపీని వీడడానికి కూడా అదే కారణం చెప్పారు.  బీఆర్ఎస్ తో గట్టిగా తలపడుతుందని భావించిన బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఆ కారణంగానే పార్టీ వీడుతున్నానని అన్నారు.  ఈ వ్యాఖ్యలతో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బలం చేకూర్చారు.  ఇప్పుడు తాజాగా  మాజీ ఎంపీ  వివేక్  కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. రేవంత్ రెడ్డితో ఆయన దాదాపు గంటన్నర పాటు చర్చలు జరపడమే కాకుండా, అందుకు సంబంధించిన పొటో కూడా విడుదల చేయడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.  మాజీ ఎంపీ వివేక్ సోదరుడు ఇప్పటికే బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.   మొయినాబాద్‌ లోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవంత్, వివేక్ భేటీ  ఫలవంతమైందనీ, ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఇక లాంఛనమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి.  కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి ఇంత కాలం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ముక్త తెలంగాణ దిశగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

తెలంగాణలో పోటీకి తెలుగుదేశం దూరం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నుంచి తెలుగుదేశం తప్పుకుంది. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం కోసం ఖమ్మం సభతో శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ పరిస్థితులన్నీ సానుకూలమైన తరువాత హఠాత్తుగా పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ఆ పార్టీకి ప్రజాభిమానం వెల్లువలా పోటెత్తినా.. ప్రస్తుత పరిస్థితుల్లో  తెలంగాణలో పార్టీని సమన్వయం చేయడం, అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగినా ప్రచారం చేయడానికి, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై కాన్సట్రేట్ చేసే పరిస్థితి లేదన్న అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధినేత ఈ సారికి పోటీకి దూరంగా ఉండటమే మేలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని శనివారం(అక్టోబర్ 28) రాజమహేంద్రవరంలో తనను ములాఖత్ ద్వారా కలుసుకున్న కాసాని జ్ణానేశ్వర్ కు తెలియజేశారు. అధినేత నిర్ణయాన్ని కాసాని ఆదివారం (అక్టోబర్ 29) హైదరాబాద్ లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అధినేత అరెస్టు, రాష్ట్రంలో పార్టీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం కారణంగా ఆయన ఉద్వేగానికి లోనైనట్లు కనిపించింది. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అయితే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ గుర్తుతో పోటీకి అనుమతిస్తే.. అన్నీ తామే చూసుకుంటామనీ, పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని వారి సందర్భంగా ఉద్వేగంగా చెప్పారు. ఈ విషయంలో ఒక సారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో సంప్రదించాలని కాసానిని కోరారు. ఈ మేరకు అక్కడికక్కడే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టారు.  దాదాపు ఏడాదిన్నర కిందట తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామంటూ నారా చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన ప్రజాదరణ చూసి రాజకీయ పార్టీలే ఆశ్చర్యపోయాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణను, ప్రతిష్టను, బలాన్ని అప్పటి వరకూ తక్కువ అంచనా వేసిన పార్టీలు తమ వైఖరి మార్చుకున్నాయి. ఖమ్మం సభ తరువాత హైదరాబాద్ లో మరో సభ నిర్వహించి సత్తా చాటిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ.. అక్కడ నుంచీ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై దృష్టి సారించింది. తెలుగుదేశంలోకి చేరికలు పెరిగాయి.  విభజన తరువాత వివిధ కారణాలతో పార్టీని వీడి వెళ్లిన తెలంగాణ నేతలంతా సొంత గూటికి చేరుతారన్న అంచనాలు పెరిగాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పూర్వవైభవం సంతరించుకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనకు గురయ్యాయి.  ఈ సారి తెలంగాణలో తెలుగుదేశం కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని అంతా భావించారు. ఇంత కాలం తెలుగుదేశం ఓటు బ్యాంకుతో అధికారాన్ని అనుభవిస్తున్న అధికార బీఆర్ఎస్ లో అన్ని పార్టీల కంటే ఎక్కువ ఆందోళన వ్యక్తం అయ్యింది.  సరిగ్గా ఈ సమయంలోనే ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసింది. దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి ఒక్క సారిగా అగమ్యగోచరంగా మారిపోయింది.  చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో  వెల్లువెత్తిన నిరసనలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అధికార బీఆర్ఎస్ పై జనంలో ఆగ్రహం పెల్లుబికింది. దాంతో పరిస్థితిని గమనించిన కేటీఆర్ గొంతు సవరించుకున్నారు. చంద్రబాబు  అరెస్టును ఖండించారు.  ఇక బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు పలువురు చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా.. ఆయన అరెస్టును నిరసిస్తూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు  చంద్రబాబు క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లు కోర్టుల్లో  వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బయటకు రాకుండా చేస్తున్నారన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అగ్ర నేతలంతా.. చంద్రబాబు న్యాయపోరాటానికి సంబంధించి అంశాలలోనూ, అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలో  నిరసన కార్యక్రమాలలోనూ, అలాగే ఓటర్ల జాబితాలోని అవకతవకలను వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడంలోనూ నిమగ్నమైపోయారు. ఈ నేపథ్యంలో సరిగ్గా నెల రొజులలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం లేకపోవడంతో పోటీ నుంచి వైదొలగడమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చింది.   

జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్.. ఏపీలో జరుగుతున్నది అదేనా?!

జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్  డెనైడ్, ఇది అందరికీ తెలిసిన నానుడి. అంటే, ఆలస్యంగా అందే న్యాయం అన్యాయంతో సమానం. న్యాయదేవత  ప్రవచించిన న్యాయశాస్త్ర మూల సూక్తుల్లో, ఈ నానుడి అత్యంత ముఖ్యమైనది. అందుకే న్యాయ స్థానాల్లో, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లో,ఈ సూక్తి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే, ఇంతలా వాడుకలో ఉన్న ఈనానుడి  న్యాయ సూక్తి  ఎంతవరకు అమలవుతోంది  అంటే వచ్చే సమాధానం మాత్రం మౌనమే. అంతే కాదు ఈరోజున న్యాయవ్యవస్థ, న్యాయస్థానాలు ఎదుర్కుంటున్నప్రధాన సమస్య, విమర్శ కూడా ఇదే.   అందుకే, భారత ప్రధాన న్యాయమూర్తి మొదలు భారత ప్రధాన మంత్రి వరకు ఎందరో పెద్దలు, ఇదే సూక్తిని పదే పదే నొక్కి నొక్కి చెపుతుంటారు. అయినా, జరగకూడని, అన్యాయం  జరిగి పోతూనే వుంది. న్యాయవిచారణలో జాప్యం కారణంగా ఎందరో ఏ నేరం చేయని వారు సైతం రిమాండ్ లో జైళ్ళలో మగ్గుతున్నారు. విలువైన జీవితాలను కోల్పోతున్నారు.  ఈ రోజున దేశంలోని న్యాయస్థానాల్లో లక్షలు కాదు కోట్లలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఎంత మంది నిర్దోషులు నిదితులుగా విచారణ ఎదుర్కుంటున్నారో   రోజులు, నెలలు, సంవత్సరాలుగా,  జైళ్లలో మగ్గుతున్నారో  లెక్కలేదు. ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని అన్నారు. చట్టంలో సంక్లిష్టతలను తొలిగించి, అందరికీ అర్థమయ్యే విధంగా, చట్టాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంతో పాటుగా, సులభతర న్యాయం ఈజ్ ఆఫ్ జస్టిస్  లక్ష్యంగా చట్టాలను సవరించ వలసిన అవసరం ఉందని మోడీ అన్నారు.   అలాగే,భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అనేక సందర్భాలలో పెండింగ్ కేసుల విషయంలో విచారం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో 1970ల నాటి కేసులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, జుడిషియల్ క్లాక్ పదేళ్ళు ముందుకు పరుగులు తీయాలని అన్నారు. అయితే, వాస్తవంలో ఏం జరుగుతోందో  జుడిషియల్ క్లాక్   ఎంత వేగంగా కదులుతుందో, చూస్తూనే ఉన్నాం. అది కూడా ఎక్కడో కాదు. మన ఆంధ్ర ప్రదేశ్ లోనే చూస్తున్నాం.  అద్ర ప్రదేశ్ లో  2019 అసెంబ్లీ  ఎన్నికలకు ముందు రెండు కీలక నేరాలు తెరపై కొచ్చాయి. అందులో ఇకటి అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ‘కోడికత్తి’ దాడి కేసు రెండోది అదే జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఈ రెండు కేసులు కూడా రాజకీయాలతో ముడి పడినవే. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినవే. అయినా  ఈ కేసుల్లో ఇంతవరకు దోషులెవరో తేలలేదు.  నిజానికి, బాబాయ్ మర్డర్ కేసుతో పోలిస్తే, కోడి కత్తి కేసు చాలా చాలా చిన్న కేసు. అయినా, బాబాబ్ మర్డర్ కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, అదే కేసులో ఏడవ నిందితుడు,అవినాష్ రెడ్డి తండ్రి   వైఎస్‌ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం హెల్త్ గ్రౌండ్ పై బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలయ్యారు.  వివేకా హత్య కేసుతో పోలిస్తే, కోడికత్తి కేసు చాలా చిన్న కేసు. కాదు కాదు వివేకా హత్య కేసుతో పోలిస్తు కోడికత్తి కేసు అసలు కేసే కాదు. అయినా ఐదేళ్ళ క్రితం వైజాగ్ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కు మాత్రం ఇంతవరకు బెయిల్ రాలేదు. దీంతో దాదాపు ఐదేళ్లుగా బెయిల్ లేకుండా  అతను జైల్లోనే మగ్గిపోతున్నారు. ఇదెక్కడి న్యాయం?  కానీ  న్యాయశాస్త్ర మూల సూత్రం, (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్  డెనీడ్)కు మాత్రం ఈ జాప్యం పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఇంకో దుర్మార్గం, మహా దుర్మార్గం ఇంకొకటుంది.  ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే సరిపోతుందని, కానీ జగన్ రెడ్డి  ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదని అతని కుటుంబం, లాయర్ ఆరోపిస్తున్నారు.  అవును ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు, కానీ,  ఎక్కడో ఇంగ్లాండ్ లో చదువుకుంటున్న తమ బిడ్డలను చూసోచ్చేందుకు.. అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొని వారితో ఆనందం పంచుకునేందుకు  సమయం చిక్కిన ముఖ్యమంత్రికి, పక్కనే ఉన్న జగన్ రెడ్డి ఇష్ట నగరం వైజాగ్ వెళ్లి, కోర్టులో వాగ్ములం ఇచ్చే సమయం లేదా  అన్నది  శ్రీను తల్లి తండ్రులే కాదు , సామాన్యులు కుడా అడుగుతున్న ప్రశ్న.  నిజానికి, సమయం చిక్కక పోవడం కాదు, శ్రీను బయటకు వస్తే కోడికత్తి అసలు కథ బయటకొస్తుంది, అందుకే జగన్ రెడ్డి, కోర్టుకు రావడం లేదు  అనేది అనుమానం  కాదు  అందరికీ తెలిసిన నిజం. అయితే, ఇక్కడ ప్రశ్న జగన్ రెడ్డి కోర్టుకు రావడం, రాక పోవడం కాదు, ఒక పాతికేళ్ల యువకుడిని కేవలం ముఖ్యంత్రికి సమయం లేదన్న కారాణంగా బెయిల్ ఇవ్వకుండా జైలుకు పరిమిత చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పడు న్యాయదేవత ముందున్న ప్రశ్న.

చంద్ర బాబు కోసం!

స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ఆదివారం (అక్టోబర్ 29) న ‘కళ్లు తెరవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆ కార్యక్రమంలో భాగంగా  ఆదివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 గంటల వరకూ ఐదు నిముషాలు  కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని తెలుగుదేశం  పిలుపునిచ్చింది. అలా చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది.  స్కిల్ డెవలప్‌మెంట్‌లో కుంభకోణం జరిగిందని.. అందులో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సెప్టెంబర్ రెండో వారంలో ఆయన్ని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన అక్కడే  ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.    మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ క్రమంలో అక్టోబర్ 23న విజయదశమి రోజున మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకు ముందు అంటే అక్టోబర్ 15న న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం చేపట్టింది. అదే విధంగా అక్టోబర్ 7వ తేదీన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక సెప్టెంబర్ 30న మోత మొగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇవన్నీ రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టారు. ఇంకోవైపు చంద్రబాబుని అరెస్ట్ చేసి 50 రోజులు పూర్తి కావోస్తోంది. సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.  ఇక చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో.. ఆ విషయాన్ని తట్టుకోలేక 105 మంది మరణించారు.   చంద్రబాబు అరెస్ట్ అక్రమమని నినదిస్తూ.. ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్పూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.