న్యూయార్క్ లో145 కోట్ల రూపాయలతో భవంతిని కొనుగోలు చేసిన అపరకుబేరుడు
posted on Sep 15, 2025 9:27AM
అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన రియలయ్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశాలలో అత్యంత ఖరీదైన ఆస్తుల కొనుగోలులో భాగంగా తాజాగా అమెరికాలో విలాలవంతమైన భవంతిని కొనుగోలు చేశారు. న్యూయార్క్ నగరంలోని ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని దాదాపు 17.4 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. భారత కరెన్సీ ప్రకారం ఆ విలువ దాదాపు 145 కోట్ల రూపాయలు ఉంటుంది.
'ద రియల్ డీల్' నివేదిక ప్రకారం ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికా విభాగం కొనుగోలుచేసింది. ఈ భవంతిని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, లగ్జరీ హోమ్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని విక్రయానికి పెట్టారు. తాజాగా, ముకేశ్ అంబానీ కుటుంబం ఈ భవంతిని సొంతం చేసుకుంది.
బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం. ప్రస్తుతం ముకేశ్ అంబానీ సుమారు రూ.8.2 లక్షల కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలో సంపన్నులు జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు.