హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే మా నినాదం : సీఎం చంద్రబాబు

  విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైజాగ్‌లో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. విశాఖలో అద్బుతమైన వాతవరణం ఉంది.  శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళలు భద్రతలో అగ్రస్థానంలో ఉంది అని తెలిపారు. విశాఖ ప్రజల స్ఫూర్తిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు..హుద్‌హుద్ తుఫాను సమయంలో వైజాగ్‌ వాసులు చూపిన చొరవ, సేవాభావాన్ని ఎప్పటికీ మరువలేను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమం ప్రధాని బర్త్‌డే రోజు జరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో 11 ఏళ్లలోనే భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఏపీనీ నిర్మించడమే కు ప్రభుత్వ ధ్యేయం" అని అన్నారు.  ప్రజల హెల్త్‌కి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.  ప్రతి సంవత్సరం ఆరోగ్య రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్లు ఖర్చు చేస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో, పేదలకు అండగా నిలిచేందుకు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకొచ్చాం" అని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత హెల్త్ బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల కోసం ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.  టాటా, గేట్స్ ఫౌండేషన్‌ సహకారంతో 'ప్రాజెక్ట్ సంజీవని' ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. హైబీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు" అని ఆయన వివరించారు. గైనకాలజీ, ఈఎన్‌టీ, కళ్లు, డెర్మటాలజీ, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ఈ క్యాంపుల్లో అందుబాటులో ఉంటాయని చంద్రబాబు తెలిపారు.  

మోదీ పుట్టినరోజు సందర్భంగా లండన్‌లో లోకేశ్ ప్రార్థనలు

  ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ మంత్రి నారా లోకేశ్ లండన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు.  ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ  నాయకత్వం మరిన్ని ఏళ్లపాటు అందాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందన్నారు. ప్రస్తుతం తన లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేశ్, ప్రధాని పుట్టినరోజున ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆసియా కప్ నుంచి పాక్ వైదొలగుతుందా?

ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యచ్ లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఓటమి ఉక్రోషంతో పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ లేనిపోని వివాదాన్ని సృష్టించి ఐసీపీ ముందు ఓ డిమాండ్ పెట్టింది. టీమ్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రిఫరీని తొలగించాలన్నదే ఆ డిమాండ్. అయితే ఐసీసీ ఆ డిమాండ్ ను తోసిపుచ్చింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకోవాలన్ననిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. దీంతో పాక్ కు ఓటమిని మించిన పరాభవం ఎదురైంది. పుండుమీద కారం చల్లిన చందంగా ఐసీసీ తమ డిమాండ్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఒక ఎత్తైతే.. ఆసియాకప్ లో ఆడుతున్న జట్లేవీ కూడా పాకిస్థాన్ డిమాండ్ కు మద్దతు ఇవ్వలేదు. అంతేనా పాక్ మాజీ క్రికెటర్లు కూడా తన దేశ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంటా బయటా విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి అర్థంతరంగా వైదొలగడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ ఒంటరి అయిపోయింది. ఐసీసీ ఛీ కొట్టినా దులిపేసుకుని టోర్నీలో కొనసాగడమంటే ఉన్న కాస్త పరువునూ మంటగలుపుకోవడమే అవుతుందని భావిస్తున్న పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుందని అంటున్నారు.   యూఏఈ తో పాకిస్తాన్ బుధవారం (సెప్టెంబర్ 17) తలపడాల్సి ఉంది. అయితే పాక్ ఆటగాళ్లు ప్రీ మ్యాచ్ మీడియా సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో పాక్ టోర్నీ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లుగానే అర్ధం చేసుకోవాలని క్రీడాపండితులు అంటున్నారు. అయితే పాక్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడంతో  పాక్ ఆసియా కప్ టోర్నీలో కొనసాగుతుందా? వైదొలగుతుందా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.  

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు మృతి

  నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామ సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాద  ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడు మంది కారులోనే  మృతి చెందారు. నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఒక పాప మొత్తం 7 మంది చనిపోయినట్లు తెలుస్తుంది.  ఈ కారును అనంతసాగరం మండలం పరమటి కంభంపాడు ఇసుకరీచ్ నుండి ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. చనిపోయిన వారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రం వారి వీధి కి చెందినవారుగా తెలిసింది..  చనిపోయిన వారి సమాచారం మేరకు మృతులు టి రాధా, శేషం సారమ్మ, నల్లగొండ లక్ష్మి, శేషం తేజ, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. మరొకరి పేరు తెలియవలసి ఉంది.. ఆత్మకూరులో ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.  

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం అంటే ఇదేగా ట్రంపూ!

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించడం అంటే ఏమిటో ఇప్పటికి అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే ఒక్క సారిగా విదేశీ వర్కర్ల విషయంలో  యూటర్న్ తీసుకున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. అమెరికా ఫస్ట్ అంటూ దేశంలోకి విదేశీయుల ప్రవేశంపై ఇష్టారీతిగా ఆంక్షలు విధించి.. బయటవారిని రానివ్వం అంటూ గప్పాలు పలికిన ట్రంప్ అదే నోటితో విదేశీ వర్కర్లకు స్వాగతం పలకాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆయన స్వయంగా విదేశీ వర్కర్లకు స్వాగతం పలుకుతామని  ప్రకటించడంతోనే  ట్రంప్ బేలతనం అందరికీ అవగతమైంది. అనుభవం అయితే తప్ప  ట్రంప్ కు తత్వం బోదపడలేదన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  ఇంతకీ అసలేమైందంటే.. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ కంపెనీ అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తోంది. అక్కడ పని చేయడానికి అమెరికాలో అమెరికాలో వర్కర్లు లేకపోవడంతో.. ఆ కంపెనీ వర్కర్లను దక్షిణ కొరియా నుంచే తీసుకువెళ్లింది. అయితే అలా దక్షిణ కొరియా నుంచి వచ్చిన వర్కర్లను అమెరికా యంత్రాంగం నిబంధనల పేరుతో అడ్డుకుంది. బంధించింది. దీంతో దక్షిణ కొరియా షార్ప్ గా రియాక్టైంది. తమ దేశానికి చెందిన వర్కర్లను స్వదేశానికి తీసుకువెళ్లిపోయింది.  అంతే కాదు.. హ్యుండయ్ కంపెనీ... అమెరికాలో పెట్టుబడుల విషయంలో పునరాలోచనలో పడింది. ఇదే విషయాన్ని బాహాటంగా ప్రకటించింది. దీంతో ట్రంప్ ఉలిక్కిపడ్డారు. హ్యుండయ్ కనుక అమెరికాలో పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయడం అంటూ జరిగితే..  ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచీ కూడా పెట్టుబడి దారులు అదే దారిలో నడుస్తాయన్న భయం ట్రంప్ ను వణికించేసింది. ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టేందుకు ముందువెనుకలాడుతున్నాయి.  దీంతో వెంటనే ట్రంప్ దేశం లోకి విదేశీ వర్కర్లను అనుమతిస్తామంటూ ప్రకటన చేసేశారు.    

ఆయన ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే!

ఆయన ఏ పని చేపట్టినా ముడుపులు తీసుకోవలసిందే. ముడుపులు అందని పనులను ఆయన ఏ పనీ చేయరు. చివరికి తనతో పాటు అదే ఆఫీసులో పని చేసే తోటి ఉద్యోగులైనా సరే తమ పని కావాలంటే ఆయనకు ముడుపులు చెల్లించాల్సిందే. ఫైల్ ముందుకు కదలాలంటే ఆయన ఎవరైనా సరే ఆయన చేతులు తడపాల్సిందే. ఆయనే విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్.పైన చెప్పింది అవినీతిలో ఆయన ట్రాక్ రికార్డ్ గురించి. ఇప్పటి వరకూ పలు కీలక పోస్టులలో పన చేసిన అంబేడ్కర్‌ ముడుపుల బాగోతం ఎట్టకేలకు పండింది. గచ్చిబౌలి, నార్సింగి మణికొండ ప్రాంతాల్లో  విద్యుత్ శాఖలో  దాదాపు 12 ఏళ్లుగా  కొనసాగుతున్న విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ను ఏసీబీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.   అంబేడ్కర్ మార్కెట్ విలువ ప్రకారం 300  నుంచి 500 వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ను అరెస్టు చేసిన పోలీసులు అంతకు ముందు అంటే మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో   తని ఖీలు నిర్వహిం చారు. అంబేడ్కర్‌ బినామీ నివాసంలో 2.18కోట్ల రూపాయల నగదును గుర్తించారు.  ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పని చేస్తున్న అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. శేరిలింగపంల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరా బాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికా రులు గుర్తించారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఆరంతస్తుల బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తర్ కెమికల్స్ పేరిట కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్లాట్స్, 1 ఫామ్ ల్యాండ్ అలాగే 2 ఫోర్ వీలర్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పటాన్ చెరువు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి  బినామీ సతీష్‌ ఇంట్లో  2.18 కోట్ల రూపాయలను ఏసిబి స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆస్తుల విలువ 300 నుంచి 500 వందల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 

హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం

హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. బంగారం దుకాణాలే లక్ష్యంగా ఐటీ అధికారులు  హైదరాబాద్ లో సోదాలు   నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం నుంచి ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఏకకాలంటలో 15 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.  సికింద్రాబాద్ లోని బంగారం వ్యాపారి జగదీష్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు, లెక్కకు మించిన ఆస్తులు, నగలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. మరోవైపు వరంగల్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇక బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. ఈ సోదాలలో  క్యాప్స్ గోల్డ్ కంపెనీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసి రిటైల్ షాపులకు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే  పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారని చెబుతున్నారు.  అంతే కాకుండా పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఆచార్య ఎస్.వి.రామారావు కన్నుమూత

ప్రముఖ సాహితీ విమర్శకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ ప్రొఫెసర్ ఆచార్యులు, ఆర్ట్స్ మాజీ  డీన్ ఆచార్య ఎస్.వి.రామారావు ఇక లేరు. తీవ్ర  అస్వస్థతతో బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు.  1941 జూన్ 5న వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లో జన్మించిన ఆచార్య ఎస్వీ రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యాపకుడిగా 1966  చేరారు.  ఆచార్యుడిగా, శాఖ అధ్యక్షుడిగా పాఠ్యాంశ నిర్ణాయక మండలి అధ్యక్షుడిగా,ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ గా సేవలందించి 2001లో పదవీ విరమణ చేశారు.  డాక్టర్ సి నారాయణ రెడ్డి పర్యవేక్షణలో తెలుగులో సాహిత్య విమర్శ-అవతరణ వికాసాలు అనే అంశంపై పరిశోధన చేసి 1973లో డాక్టరేట్ పొందారు. 23 గ్రంథాలు వెలువరించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య విమర్శ పురస్కారాన్ని, శ్రీకృష్ణదేవరాయ భాషనిలయం నుంచి దాశరథి పురస్కారాన్ని, జీవీఎస్ సాహిత్య పీఠం నుంచి విమర్శ పురస్కారాన్ని ,బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారాన్ని, బి.ఎన్.శాస్త్రి పురస్కారం,సారస్వత పరిషత్తు పురస్కారం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం వంటి అనేక గౌరవాలు అందుకున్నారు.  ఆయన పర్యవేక్షణలో 19  మంది పిహెచ్డీ పరిశోధన, 15 మంది ఎంఫిల్ పరిశోధన పూర్తి చేశారు.  తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యునిగా, ట్రస్టు సభ్యునిగా, కేంద్ర సాహిత్యకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎస్.వి.రామారావు సేవలందించారు.  ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికా నుంచి గురువారం (సెప్టెంబర్ 18) రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ఎస్వీ రామారావు అంత్యక్రియలు శుక్రవారం (సెప్టెంబర్ 19) న జరుగుతాయి.  ఆచార్య ఎస్వీరామారావు మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి, డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, ట్రస్టు సభ్యుడు చింతపల్లి వసుంధరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సారస్వత పరిషత్కు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. మంగళవారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం(సెప్టెంబర్ 16) శ్రీవారిని మొత్తం 63 వేల 607 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 856 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 87 లక్షల  రూపాయలు వచ్చింది.

హైదరాబాద్‌లో మహిళల మృతదేహాలు కలకలం

  హైదరాబాద్ నగరంలో రెండు వేరువేరు ప్రాంతాల్లో మహిళ మృతదే హాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి... ఓ మహిళ మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేయగా మరో మహిళ మృతదేహాన్ని సంచిలో పెట్టుకొచ్చి రైల్వేస్టేషన్ వద్ద వదిలి వేసి వెళ్లారు. ఈ రెండు ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో ఓ మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది... డెడ్ బాడీని చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.  హుటా హుటిన పోలీసులు క్లూస్టింగ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద కి మహిళను తీసుకువెళ్లి హత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.. ఈ యువతి వయసు 20 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసుల అంచనా... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు... ఈ నేపథ్యంలోని పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ.... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు... మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్ పురా డెడ్ బాడీని చూసిన స్థానికులు సమాచారం అందించారని రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.... వెంటనే ఘటనాస్థ లానికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించాము. డెడ్ బాడీని మహిళా డెడ్ బాడీగా గుర్తించాం.. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురలో పడవేసినట్టుగా అనుమానిస్తున్నామని ఇన్స్పెక్టర్ అన్నారు. డెడ్ బాడీ కుళ్ళిన స్థితిలో ఉంది.. మర్డర్ జరిగి రెండు మూడు రోజులు అయి ఉండవచ్చునని ఇన్స్పెక్టర్ అన్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.  డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలిస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి... అనంతరం హత్య చేసినట్టు అనుమా నిస్తున్నాం. అంతేకాకుండా మేము స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. క్లూజ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్, అలానే  ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.అసలు మృతురాలు ఎవరు.. ఆమెను ఎవరు హత్య చేశారు...? అనే కోణంలో దర్యాప్తు కొనసాగించామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు... ఇదిలా ఉండగా మరోవైపు చరపల్లి పోలీస్టేషన్ పరిధిలో ని రైల్వే స్టేషన్ సమీపంలో గోనే సంచిలో మహిళా మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. చర్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గుర్తుతెలియని కొందరు దుండగులు చర్లపల్లి రైల్వే స్టేషన్ గొడ వద్ద మహిళ మృతదేహం పడేసి వెళ్ళిపోయారు. సంచిలో మృతదేహం కనిపించడంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దుండగుల కోసం వేట కొనసాగించారు.  

డెలివరీ బాయ్స్ వీరంగం... కస్టమర్‌పై మూకుమ్మడిగా దాడి

  హైదరాబాద్ నగరంలో కొంత మంది యువకులు గంజాయి సేవించి... ఆ మత్తులో రోడ్ల మీద నానా హల్చల్ సృష్టిస్తున్న ఘట నలు ఎన్నో జరు గుతున్నాయి. ఇటువంటి ఘటనే మరొకటి చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీరు ఏదైనా వస్తువు కోసం ఆర్డర్ చేస్తున్నారా తస్మా జాగ్రత్త.... ఇదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? పూర్తిగా వివరాలు చదవండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ బస్తీలో నివాసం ఉంటున్న సందీప్ అనే వ్యక్తి పెన్సిల్ కిట్ మరియు పెరుగు ప్యాకెట్ కోసం జిప్టోలో ఆర్డర్ చేశాడు... ఆన్లైన్ పేమెంట్ కూడా చేశాడు. అయితే సందీప్ ఆర్డర్ చేసిన వస్తువులు రాలేదు. దీంతో సందీప్ డెలివరీ బాయ్ కి ఫోన్ చేసి తన వస్తువులు ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నించాడు... అందుకు ఆ జిప్టో  బాయ్ విఎస్టి ఎస్పీ గార్డెన్స్ వద్ద ఉన్న జిప్టో హబ్‌కు వచ్చి మాట్లాడమని చెప్పాడు. దీంతో సందీప్ వెంటనే విఎస్టీ వద్ద ఉన్న జిప్టో హబ్ వద్దకు వెళ్లాడు.  సందీప్ అడిగిన ప్రశ్నకు జిప్టో సిబ్బందితో పాటు డెలివరీ బాయ్స్ సరైన సమాధానం ఇవ్వకపోగా ఒక్కసారిగా సందీప్ పై దాడికి పాల్ప డ్డారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు , ఎనిమిది మంది గంజాయి మత్తులో రోడ్డుమీద వీరంగం సృష్టిస్తూ సందీప్ ను చితకబాదారు.. ఈ దాడిలో సందీప్ కు తీవ్ర గాయాల య్యాయి. అయితే ఈ దాడికి సంబం ధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్, రాజు తో పాటు ఇంకొందరు  తనపై దాడి చేశారని... సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.  

టీటీడీ ప్రతిష్టను భూమన కరుణాకర్ రెడ్డి దెబ్బతీస్తున్నారు : భానుప్రకాష్ రెడ్డి

  వైసీసీ మాజీ ఎమ్మెల్యేే భూమన కరుణాకర్ రెడ్డి  తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌ భూమన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రైవేట్‌ శిల్పా క్వార్టర్స్ ఉండేది. పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడు. బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడంతో.. ఆ రాతి విగ్రహాన్ని అక్కడే ఉంచారు. గత పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది. నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.  గతంలో తిరుమల ఆలయంలోని  రాములవారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయింది. మూడున్నర సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మతు చేశాం’’ అని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు హెచ్చరించారు.  భూమన మాటలను, ఆరోపణలను నమ్మవద్దని ఆయన భక్తులను విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక...అసత్య ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగట్టుకున్నాడు  బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ అన్నారు. మహావిష్ణువు విగ్రహానికి‌.... అసంపూర్ణమైన శనిభగవానుడి విగ్రహానికి తేడా తెలీదని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం, మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో....భూమన కరుణాకర్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని  మరో బోర్డు సభ్యుడు దివాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణమని భూమన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అలిపిరి వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. అది అసలు విష్ణుమూర్తి విగ్రహమే కాదని, శిల్పి మధ్యలో వదిలేసిన అసంపూర్తి శనీశ్వరుడి విగ్రహమని తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం

  తెలంగాణలో నాలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.  ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వ  పట్టణ రవాణా సలహాదారుగా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌ను  అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ చీఫ్ రేషనింగ్‌ అధికారిగా ఎం.రాజారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్‌  నియమితులయ్యారు.  

రూ.11.50 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లోని మాధ‌వా హిల్స్ ఫేజ్‌-2లో పార్కు స్థ‌లాన్ని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లంలో స్థానికంగా ఉన్న వాళ్లు గోడ‌లు క‌ట్టి.. షెడ్డులు వేశారంటూ హైడ్రా ప్ర‌జావాణిలో మాధ‌వాహిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులో ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుల‌ను స్థానిక అధికారుల‌తో క‌ల‌సి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి... పార్కు స్థ‌లంగా నిర్ధారించుకున్న హైడ్రా.. వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. ఈ భూమి విలువ దాదాపు రూ.11.50 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.  పార్కును కాపాడిన‌ట్టు పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

మంత్రి నారాయణ చొరవతో 18 మంది యువకులకు పునర్జీవం

    మంత్రి పొంగూరు నారాయణ చూపిన చొరవ 18 మంది యువకుల ప్రాణాలకు పునర్జీవం ప్రసాదించింది. మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో సురక్షితంగా ఆపదలో ఉన్న వారిని అధికారులు బయటకి తీసేందుకు తెల్లవారుజాము వరకు కృషి చేసి ఫలితం రాబట్టారు. అసలేం జరిగిందంటే. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన 18 మంది యువకులు సమీపంలోని పెన్నా నదిలోకి సోమవారం సాయంత్రం వెళ్లారు. వారు వెళ్లిన సందర్భం ఏదైనాప్పటికీ ఊహించని పరిణామానికి గురయ్యారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నా నది ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో రెండు వైపులా నీరు రావడంతో యువకులు పెన్నా నదిలో మధ్యలో చిక్కుకున్నారు. దిక్కుతోచని స్థితిలో సహాయం చేయమని బంధువులకు ఫోన్లు చేసి ఆర్తనాదాలు పెట్టారు.  అయితే ఈ విషయాన్ని యువకుల తల్లిదండ్రులు స్థానిక డివిజన్‌లో టీడీపీ ఇన్చార్జిలకు తెలియజేశారు. వెంటనే వారు పెన్నా నదిలో 18 మంది యువకులు చిక్కుకున్నారన్న విషయాన్ని నారాయణకు తెలియజేశారు. వెనువెంటనే అప్రమత్తమైన మంత్రి ఆ యువకులను రక్షించేలా సహాయ చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. అలాగే అన్ని శాఖల అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు నిరంతరం టైం టు టైం అప్డేట్ కనుక్కుంటూ మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేస్తూ వచ్చారు.  ఈ క్రమంలో నెల్లూరు ఆర్డీవో, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పందించి రెస్క్యూ టీమ్ ద్వారా మంగళవారం తెల్లవారుజాము సమయానికి 18 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ విషయాన్ని టిడిపి శ్రేణులు, ఆయా శాఖల అధికారులు మంత్రి నారాయణ కు తెలియజేశారు. అనుకోని పరిస్థితుల్లో పెన్నా నదిలో చిక్కుకున్న యువకులను చాకచక్యంగా కాపాడిన ఆయా శాఖల అధికారులను, ప్రమాదం అని తెలిస్తే వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులను మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తమ బిడ్డలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ తమకు భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ కు యువకుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతేనేం తన నియోజకవర్గ ప్రజల మన్నలలో పొందిన నారాయణ ప్రజా సంక్షేమమే ద్యేయంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.

రామ్ గోపాల్ వర్మపై మరో కేసు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. ఈ సారి ఈ కేసు మాజీ ఐపీఎస్ అధికారిని అంజనాసిన్హా ఫిర్యాదు మేరకు నమోదైంది అంజనా సిన్హా తన ఫిర్యాదులో దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్‌ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని   పేర్కొన్నారు.  దహనం వెబ్‌సిరిస్‌కు రామ్‌గోపాల్‌వర్మ  నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.  2022లో దహనం వెబ్ సీరిస్ వచ్చింది. మొదట ఎంఎక్స్ ప్లేయర్ ‌లో విడుదలైంది. అయితే తరువాత తొలగించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్, ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్య అనంతర ప్రతికార నేపథ్యంలో రూపొందింది.  1990 బ్యాచ్‌కు చెందిన అంజనా సిన్హా   రాయలసీమలో ఎస్పీగా, డీఐజీగా పనిచేశారు అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్‌సిరీస్‌లో ఉపయోగించారన్నది ఆమె అభియోగం. అంజనా సిన్హాప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ డైరక్టర్ గా ఉన్నారు. తన అనుమతి లేకుండా తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్ లో వినియోగించారని అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దహనం సిరీస్ మొత్ం హింసాత్మక దృశ్యాలతో, సెక్సువల్ కంటెంట్ తో కూడుకుని ఉందన్న అంజనా సిన్హా  ఆ సినిమాలో తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని ఉపయోగించడం ద్వారా  గౌరవ ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగిందనీ, తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు రాదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.   ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 

వివేకా హత్య కేసు.. బెయిల్ రద్దు పిటిషన్లు మళ్లీ ట్రయల్ కోర్టుకు!

వివేకానందరెడ్డి హత్య కేసులో  విచారణ ఓ అంతులేని కథలా సాగుతోంది. ఈ కేసులో నిందితుల బెయిలు రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన బెయిలు పిటిషన్ పై ఈ దశలో నిర్ణయం తీసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బెయిలు రద్దు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సునీతకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు కోరుతూ డాక్టర్ సునీత మళ్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నారు. డాక్టర్ సునీత దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 16) విచారించింది. గత విచారణ సందర్రభంగా సుప్రీం కోర్టు ఎంత మంది బెయిల్స్ రద్దు చేయాలి అని ప్రశ్నించడమే కాకుండా గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేసిందనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ వ్యాఖ్యనించడంతో పాటు డాక్టర్ సునీత, ఆమె భర్త, అలాగే సీబీఐ ఎస్పీ రాం సింగ్ లపై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. దీంతో సుప్రీం కోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయని అంతా భావించారు.