ఒవైసీ దీపం వెలిగించు! నీకు జ్ఞానం వస్తుంది!

ఒవైసీ దీపం వెలిగించి చూడు దాని పవర్, వెలుగుతో పాటు నీకు జ్ఞానం వస్తుంది. ఆదివారం రాత్రి నీ దారుసలేంపైకి వెళ్లి చూడు ప్రజల స్పందన నీకు కనువిందు చేస్తాదంటూ బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పి. బండి సంజయ్ ఒవైసీపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీపం వెలిగించమంటే మతమౌఢ్యంతో చూడటం ఒవైసీ అవివేకనికి నిదర్శనమ‌ని ఆయ‌న అన్నారు.  ప్రధాని ఇచ్చిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నువ్వు ఆపితే ఆగే కార్యక్రమం కాద‌ది, గుర్తుంచుకో ఒవైసీ అంటూ సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అని ఆయ‌న ఆరోపించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లపై భౌతిక దాడులు, బూతులు తిట్టడం, ఉమ్మివేయడం వంటి ముర్కాపు చర్యల్ని ఎందుకు ఒవైసీ ఖండించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  వైద్యులకు కృతజ్ఞత తెలుప‌కుండా ఒవైసీ ముర్కుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.  ఒవైసీకి దమ్ముంటే డాక్టర్లపై, నర్సులు, పోలీసులు, ఆశావర్కర్లలపై దాడులను అడ్డుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

పాకిస్తాన్‌లో క‌రోనా మృతుల కోసం ప్ర‌త్యేక ఖ‌బ‌ర‌స్తాన్‌!

పాకిస్తాన్ ప్ర‌భుత్వం క‌రోనాతో చ‌నిపోయిన వారిని ఖ‌న‌నం చేయ‌డానికి ప్ర‌త్యేక ఖ‌బ‌ర‌స్తాన్ కోసం 80 ఎక‌రాల భూమి కేటాయించింది.  క‌రాచిలో ఈ స్మ‌శాన‌వాటికను సిద్ధం చేశారు. అంతే కాదు మృతుల‌ను పూడ్చిపెట్ట‌డానికి గొతుల‌ను కూడా త‌వ్వి సిద్ధంగా వుంచారు. మ‌రి కొన్ని స‌మాధులు త‌వ్వి సిద్ధంగా పెట్ట‌డానికి  ఏర్పాట్లు చేస్తున్నారు. భార‌త‌దేశంలో ప్ర‌ధాన మంత్రి మోదీ క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం అవ్వ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులో భాగంగానే జ‌న‌తా క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ప‌క్క‌నే వున్న పాకిస్తాన్‌లో క‌రోనాతో జ‌నం చ‌నిపోతుంటే అక్క‌డి ప్ర‌ధాని మృతుల కోసం ప్ర‌త్యేకంగా స్మ‌శాన‌వాటిక ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ స్టైలే వేరు.  క‌రోనాతో మృతి చెందిన వారిని ఖ‌న‌నం చేయ‌డం పాకిస్తాన్‌లో పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ట‌. ముస్లిం సాంప్ర‌దాయం ప్ర‌కారం మృత‌దేహానికి స్నానం చేయించ‌డం, కొత్త బ‌ట్ట‌లు చుట్ట‌డం, సుగంధ‌ద్ర‌వ్యాలు పోయ‌డం అలాంటివేవీ చేయ‌కుండా పాతిపెట్ట‌డాన్ని కొంత మంది మృతుల ప‌ట్ల చుల‌క‌న‌గా మాట్లాడుతూ వుండ‌టంతో దీనిపై ముస్లిం మ‌త‌పెద్ద‌లు ఫ‌త్వా ఇచ్చార‌ట‌. క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన వ్య‌క్తిని పాపాత్ముడుగా భావించ‌రాదు. అమ‌ర‌గ‌తి పొందిన అమ‌రుడుగా భావించాలి. అమ‌ర‌త్వం పొందిన వారికి ఖ‌న‌న సంస్కారాలు ఏమీ వుండ‌వు. అలా పూడ్చిపెట్ట‌వ‌చ్చ‌ని, వారికి ప్ర‌త్యేక ఖ‌బ‌ర‌స్తాన్‌లు ఏర్పాటు చేయ‌మ‌ని అక్క‌డి ముల్లాలు  స‌ల‌హా ఇచ్చార‌ట‌.

ఐదు రోజుల్లోనే మూడు వేల వెంటిలేటర్ల తయారీ 

* మెడ్ టెక్ జోన్ చీఫ్ జితేందర్ శర్మ చేస్తున్న అద్భుతం-విస్మయం లో అధికార యంత్రాంగం  * కరోనా కిట్స్ పై పరిశ్రమల మంత్రిది, ముఖ్యమంత్రిదీ తలో మాట!  * 2016 నుంచి ఇప్పటివరకూ, మెడిటెక్ జోన్ లో తయారీ సామర్ధ్యమున్న కంపెనీలే లేకపోవడం గమనార్హం   కేవలం 5 రోజుల స్వల్ప కాలిక వ్యవధిలో, మూడు వేల వెంటిలేటర్ల తయారీ , అలాగే వాటి పంపిణీ సాధ్యమా? సాధ్యమేనంటోంది ఘనత వహించిన ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్ ( ఏ.ఎం. టీ. జెడ్.).  కిందటి నెల-అంటే, మార్చ్ లో వెంటిలేటర్లు, కోవిడ్ కిట్స్, ఇఫ్రారేడ్ ధర్మో గన్స్ సరఫరాకు టెండర్ పిలిచిన  ఏ.ఎం. టీ. జెడ్ , ఆ టెండర్ ను ఏప్రిల్ 10 వాయిదా వేస్తున్నట్టు మార్చ్ ౩౦ న వెల్లడించింది. వెంటిలేటర్లు, కోవిడ్ కిట్స్ తయారీకి పరిశ్రమల శాఖ మంత్రి విశాఖ మెడ్ టెక్ జోన్ కు రూ. ౩౦ కోట్లు విడుదల చేశారు. ఏప్రిల్ 15లోగా మూడు వేల వెంటిలేటర్లు, 25 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్స్ తయారు చేయాలని నిర్దేశం. ఏప్రిల్ 10 కి టెండర్ వాయిదా వేసి 15 నాటికి ఇన్ని వేల వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్స్ ఏవిధంగా తయారు చెయ్యగలరు.  టెండరు ఖరారు కాక ముందే మెడ్ టెక్ జోన్ లో 4 కంపెనీలకు కంపెనీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పరిశ్రమల శాఖలు అనుమతి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కేవలం అసెంబ్లింగ్ పనులకే అనుమతులు ఇవ్వడం గమనార్హం. మెడ్ టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ మాత్రం వైద్య పరికరాలన్నీ ఇక్కడే తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. మెడ్ టెక్ జోన్ లో కోవిడ్ కిట్స్ తయారీకి అనుమతి పొందిన మాల్ బయో అనే కంపెనీని నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ వైరాలజీ ఇప్పటికే రెజెక్ట్ చేసింది. కానీ సదరు కంపెనీ మాకు త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పుకుంటోంది.  గతంలో ఒక్క వెంటిలేటర్ తయారీ అనుభవం కూడా లేని ఎస్ఎంటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇలాంటి సమయంలో వెంటిలేటర్ల తయారీ పనిని అప్పగించడం ఏంటో శర్మ గారికే తెలియాలి. ఫినిక్స్ అనే సంస్థకు ఇంక్యుబేటర్ల తయారీలో మాత్రమె అనుభవం ఉంది. ఇంతవరకూ ఈ పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు తయారు చెయ్యలేదు. గ్రీన్ ఓషన్ రీసెర్చ్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇన్ఫ్రారెడ్ ధర్మల్ గన్స్ తయారీ కాంట్రాక్ట్ తీసుకుంది. ఈ సంస్థకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కేవలం అసెంబ్లింగ్ పనులకే అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇంత అత్యవసర పరిస్తితుల్లో ధర్మల్ గన్స్ ను చెన్నైలో ఉన్న ఈ సంస్థ నుంచే నేరుగా కొనుగోలు చేస్తే సమయం ఆదా అవుతుంది. కానీ జితేంద్ర శర్మ, ఈ అత్యవసర సమయం లో,  ఇక్కడ మాత్రం తయారు చేయించాలని చూడడం ప్రజల ప్రాణాలతో చేలగాటమాడటమేనని ప్రభుత్వం లోని కీలకమైన అధికారులే అంటున్నారు.  ఒక పక్కన పరిశ్రమల శాఖ మంత్రి ఏప్రిల్ 15నాటికి పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ కిట్స్ అందుబాటులోకి వస్తున్నాయని ప్రకటనలిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం కరోనా కిట్స్ కోసం కేంద్రాన్ని అభ్యర్దిస్తున్నారు. ఈ పరస్పర విరుద్ద ప్రకటనల మర్మం ఎంతో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. అసలు మెడ్ టెక్ జోన్ లో తయారీ సామర్ధ్యమున్న కంపెనీలే లేకపోవడం కొసమెరుపు.

అత్యవసర సిబ్బందికి పూర్తి జీతాలు: జగన్

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవల సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. కోవిడ్‌ –19 నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య-ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నివారణకు వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ... ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు తన నిర్ణయాన్ని జగన్ వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకోండి!

ఏం గురుః ఇది ఆంగ్ల అభ్యాసన యాప్‌. వారం రోజులపాటు ఉచిత లైవ్‌ తరగతులను అందిస్తుంది. కేంబ్రిడ్జిలో చదివిన వారు వీటిని బోధిస్తున్నారు. వీరే కాదు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అనేక సంస్థలు ఉచిత సేవలు అందిస్తున్నాయి. ప్రముఖ సంస్థలైన బైజూస్‌, వేదాంటు, టాపర్‌, అన్‌ అకాడమీ, ఎక్స్‌ట్రామార్క్స్‌, అప్‌గ్రేడ్‌, విడు, ఇంపార్టస్‌ వంటి సంస్థలు నెల, రెండు నెలలకు ఉచిత సేవలు అందిస్తున్నాయి.  బైజూస్‌: ఏప్రిల్‌ 30 వరకు పూర్తి లైబ్రరీకి ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. ఉచిత లైవ్‌ తరగతులు అందిస్తోంది. టాపర్‌: 5 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులందరికీ లైవ్‌ తరగతులు. వేదాంటు: నిపుణులైన ఉపాధ్యాయులతో లైవ్‌ తరగతులు. స్టడీ మెటీరియల్‌, పరీక్షలు, ప్రశ్నలు, లైవ్‌లోనే సందేహాల నివృత్తి. వేదాంటు నుంచి కంటెంట్‌ను ఉపయోగించుకొని ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు బోధించవచ్చు. ఎక్స్‌ట్రామార్క్స్‌ : ఏప్రిల్‌ 30 వరకు ఈ యాప్‌ ఉచిత సేవలు అందిస్తుంది. లైవ్‌ కోసం నెలకు రూ.2 వేలతో ఛార్జింగ్‌ చేసుకోవాలి. అన్‌ అకాడమీ: యూపీఎస్సీ, రైల్వే, బ్యాకింగ్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత ఉపన్యాసాలు(లెక్చర్స్‌) అందిస్తోంది. ఈ ప్లాట్‌పామ్‌ నుంచి 20వేల ఉచిత లైవ్‌ క్లాసులు అందిస్తుంది. విద్యా సంస్థలు తమ లైవ్‌ తరగతులను అన్‌ అకాడమీలో నిర్వహించేందుకు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా విద్యా సంస్థలు తమ ఆన్‌లైన్‌ తరగతులను ఏర్పాటు చేయడానికి ఇది సహాయం చేస్తుంది. అప్‌గ్రేడ్‌: కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఉచిత లైవ్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తోంది. విడు: లైవ్‌ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. పాఠశాలల నుంచి తరగతులను ఇంటికి లైవ్‌లో ఇచ్చేందుకు సహాయం అందిస్తుంది. ది గేట్‌ అకాడమీ: ఇంజినీరింగ్‌ విద్యార్థులు, గేట్‌కు సన్నద్ధమయ్యే వారికి ఏప్రిల్‌ 30 వరకు ఉచిత వీడియో తరగతుల సదుపాయం కల్పిస్తోంది. స్కూల్‌గురు ఎడుసర్వ్‌: ఉన్నత విద్యకు సంబంధించి మొదటి మూడు నెలలు ఉచితంగా అందిస్తుంది. ప్లే ఆబ్లో: ప్రాథమిక పాఠశాలలకు గణితం, ఆంగ్ల వ్యాకరణంపై ఈ యాప్‌తో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయొచ్చు. ఏప్రిల్‌ నెల చివరి వరకు ఈ సదుపాయం అందిస్తోంది. ఇంపార్టస్‌: లైవ్‌ ఆన్‌లైన్‌ అభ్యాసం కోసం రూపొందించిన ‘వినూత్న’ వర్చువల్‌ తరగతులను అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులు తమ సందేహాలను ఉపాధ్యాయులతో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. స్టూమాజ్‌: కళాశాల, విద్యార్థులకు లైవ్‌ వెబ్‌నార్లను అందిస్తోంది. క్యాటలిస్ట్‌ గ్రూప్‌: వివిధ పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. లెర్న్‌నెక్స్ట్‌: వీడియో పాఠాలు, ప్రాక్టీస్‌ పరీక్షలను ఉచితంగా అందిస్తోంది. సింప్లీలార్న్‌: కృత్రిమ మేధస్సు, మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌డాట, సైబర్‌ సెక్యూరిటీలాంటి ఉచిత కోర్సులను అందిస్తోంది. మైండ్‌స్పార్క్‌: విద్యార్థులందరికీ 60రోజుల ఉచిత ప్రవేశం.

లైట్లు ఆపేస్తే, గ్రిడ్ కూలిపోతుందని గడుగ్గాయిల తప్పుడు ప్రచారం 

* డొమెస్టిక్ లైటింగే కాదు, గ్రిడ్ చాలా అవసరాలు తీరుస్తుందని జెన్కో అధికారుల స్పష్టీకరణ  * ప్రధాని 9 నిమిషాల జ్యోతి ప్రజ్వలన ప్రతిపాదనను ఎడ్వాంటేజ్ తీసుకున్న సోషల్ మీడియాఫేక్ వీరులు  ఎద్దు ఈనిందంటే, దూడను కట్టేయమన్నాట్ట వెనుకటికో పరమానందయ్య శిష్యుడు. అలానే ఉంది, ప్రధాని ఏదో జనాల్లో సమైక్య భావన నింపేందుకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేయాలని పిలుపునిస్తే, ఆ పని చేయబాకండి .... గ్రిడ్ కూలిపోతుందంటూ కొందరు సోషల్ మీడియా ఫేక్ వీరులు, విస్తారంగా తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. అయితే, ఆ ప్రచారం ఫేక్ అంటూ జెన్కో ఇంజనీర్లు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నెల  5 న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు, దీపాలను వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు తో, విద్యుద్దీపాలు ఆపివేస్తే, గ్రిడ్ ఫెయిల్ అవుతుందంటూ విద్యుత్ శాఖ ఇంజనీర్ల పేరిట సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో లో వాస్తవం లేదని  సీనియర్ ఇంజనీరు స్పష్టం చేశారు. ఆ ఫేక్ ప్రకటన ప్రజలను, ప్రభుత్వాలను పక్కదోవ పట్టించే విధంగా ఉందని సీనియర్ ఇంజనీర్లు అంటున్నారు. " 5 వ తేదీ రాత్రి 9 గంటల కు ఇలా చేస్తున్నప్పుడు, లైట్లు ఆపివేయమని ప్రధాని  మాకు సూచించారు. కానీ, ఇప్పటికే, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్‌లో ఉన్నందున, మాకు గ్రిడ్‌లో దేశీయ లోడ్లు మరియు అవసరమైన సేవల లోడ్లు మాత్రమే ఉన్నాయి. (ప్రస్తుత) లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40% కన్నా తక్కువ కాబట్టి, గ్రిడ్‌లోని అన్ని లైట్ల ఆకస్మిక (ఏకకాలంలో) స్విచ్-ఆఫ్ చేయడం విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం).  కాబట్టి, దయచేసి, ఫ్రిజ్‌లు,ఫ్యాన్స్ మరియు ఎసిలు వంటి కొన్ని లోడ్‌లను ఆన్‌లో ఉంచమని ప్రజలకు సలహా ఇవ్వండి.  గ్రిడ్ కూలిపోతే, రోగులకు చికిత్స చేస్తున్న అన్ని ఆసుపత్రులు వారి క్లిష్టమైన విద్యుత్ సరఫరాను కోల్పోవచ్చు.  గ్రిడ్‌ను సేవ్ చేయడానికి దయచేసి దీన్ని అందరికీ ఫార్వార్డ్ చేయండి," అంటూ విద్యుత్ ఉద్యోగుల పేరిట ఒక ప్రకటన సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని ఆంధ్ర ప్రదేశ్ జెన్కో కు చెందిన సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. చాలా మంది తమ ఇళ్లల్లో -ఎల్ ఈ డీ బల్బులు వాడుతున్నారు, వాటి వల్ల విద్యుత్ వినియోగం ఎలాగు తక్కువే ఉంటుందని వారు వివరిస్తున్నారు. డొమెస్టిక్ లైటింగ్ స్విచ్ ఆఫ్ చేయటం ఒక్కదాని వల్లనే, గ్రిడ్ కుప్ప కూలుతుందని వస్తున్న ప్రచారం లో వాస్తవం లేదని కూడా సీనియర్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. " డొమెస్టిక్ లైటింగ్ లోడ్ కే కాకుండా, ఇతరత్రా చాలా లోడ్స్ కు కూడా గ్రిడ్ ఫీడ్ చేస్తూ ఉంటుందనీ, లోడ్ బ్యాలెన్సింగ్, జెనెరేషన్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి ఎప్పుడూ టీమ్స్ సన్నద్ధం గానే ఉన్నాయనీ, అందువల్ల గ్రిడ్ కూలిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కూడా జెన్కో ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. షబ్ స్టేషన్ స్థాయిలోనే అడ్రెస్ చేయగల అంశాలను భూతద్దంలో చూసి, ప్రధాని ప్రతిపాదించిన 9 నిమిషాల కార్యక్రమం పై లేనిపోని అపోహలు సృష్టించవద్దని కూడా సీనియర్ ఇంజనీర్లు విజ్ఞపి చేశారు.

మందు షాపులు ఓపెన్‌ అంటూ నకిలీ జీవో...

తెలంగాణలో వైన్‌షాపులు ఓపెన్‌ చేస్తున్నారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఉప్పల్‌ విజయపురి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫేక్‌న్యూస్‌ షేర్‌ చేసిన వారిని పోలీసులు హెచ్చరించారు. మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల పేరిట విడుదలైన జీవో అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎక్సైజ్‌ డీఎస్పీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జీవో కాపీని పోలిన నకిలీ కాపీని తయారు చేసి వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైన్‌షాపులు, కల్లు దుకాణాలను మూసివేశారు.

కర్నూలు జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలు జిల్లాలో ఈ రోజు 3 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలు నగరం  రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో  ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయి.. నోస్సం తో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. మొత్తం 449 సాంపిల్స్ టెస్టింగ్ కు పంపగా, అందులో ఢిల్లీ జమాత్ కు వెళ్లి జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్ 338 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నిన్న రాత్రి , ఈ రోజు ఉదయం అనంతపురం, తిరుపతి కరోనా ల్యాబ్ ల  నుండి 90 రిపోర్టులు వచ్చాయని, ఈ రోజు సాయంత్రం మరిన్ని రిపోర్టులు వస్తాయి.. రిపోర్టులు వచ్చిన తరువాత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం అన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించండని కలెక్టర్ వీరపాండియన్ కోరారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో..కర్నూలు రోజా వీధి  చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్,  అవుకు, బనాగనిపల్లె పట్టణాల్లో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ ప్రకటించాం అని కలెక్టర్ చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి..వారికి కరోనా టెస్ట్ లు చేయించడానికి, టోటల్ శానిటేషన్ చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమీషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపిడిఓ లకు ఆదేశాలను ఇచ్చినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ  మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం.. ఆ ప్రాంతమంతా క్రిమి సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి... ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి...కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్,  తహశీల్దార్, ఎంపిడిఓ లకు సమాచారం ఇవ్వండి అని కలెక్టర్ కోరారు. కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు అన్నారు. కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం అని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు.

తబ్లిగ్‌ జమాత్‌ సభ్యులు నర్సును వేధించడం నిజమే : దర్యాప్తులో తేల్చిన పోలీసులు

క్వారంటైన్‌లో ఉన్న ఐదుగురు సభ్యుల అర్ధనగ్న విన్యాసాలు ఆశ్లీలపాటలు, హావభావాలతో నర్సుపట్ల ప్రవర్తన కేసు నమోదు చేసిన పోలీసులు క్వారంటైన్‌లో ఉన్న తబ్లిగ్‌ జమాత్‌ సభ్యులు తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారన్న నర్సుల ఆరోపణలు నిజమేనని ఘజియాబాద్‌ పోలీసు తేల్చారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగ్‌ జమాత్‌కు హాజరైన పలువురు సభ్యులు కరోనా వైరస్‌ సోకడంతో వారిని పలుచోట్ల క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురిని ఘజియాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురు సభ్యులు అక్కడ విధులు నిర్వహిస్తున్న తమ పట్ల అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారని బాధిత నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘బాధిత వ్యక్తుల్లో ఒకడు ఫ్యాంట్‌ తీసేసి ఆసుపత్రిలో తిరుగుతున్నాడు. మరికొందరు అసభ్యకరమైన పాటలు పాడుతూ వికారమైన హావభావాలు ప్రదర్శిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మేమిచ్చిన మందు తీసుకోవడం లేదు’ అంటూ బాధిత నర్సులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన ఘజియాబాద్‌ పోలీసులు నర్సుల ఆరోపణలు నిజమేనని తేల్చారు. బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 269, 270, 271, 294, 354 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ఆరుగురు సభ్యులను ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. నర్సులను వేధించిన బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఆవో దియా జెలాయే : ప్రధాని ట్వీట్‌

క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలగించాలని ప్రధాని మోదీ శుక్రవారం వీడియో సందేశం ఇచ్చారు. అయితే శ‌నివారంనాడు ప్ర‌ధాన‌మంత్రి తన ట్విట్టర్‌లో మరో పోస్టును పెట్టారు. ఆవో దియా జలాయే అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వినిపించిన ఓ కవితను ఆ ట్వీట్‌లో పోస్టు చేశారు. ఆవో ఫిర్‌సే దియా జెలాయే అంటూ అటల్ ఆ కవిత వినిపిస్తారు. క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి సంఘీభావంగా అన్ని లైట్లను పూర్తిగా ఆర్పివేసి.. దీపాలను, కొవ్వొత్తులను వెలగించాలని ప్రధాని పిలుపు ఇచ్చారు.

ఇది కరోనా సమయం... మతపరమైన సదస్సులకు దూరంగా ఉండండి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పిలుపు మానవాళి మనుగడ కోసం చేపడుతున్న  లాక్ డోన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్  హరిచందన్ పేర్కొన్నారు. చివరి రోజు వరకు ఎటువంటి వెసులు బాటు లేకుండా దీనిని పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని, ఆమేరకు మత పెద్దలు ప్రజలకు తగిన సూచనలు చేయాలని హరిచందన్ పిలుపు నిచ్చారు. సాధారణంగా మత పరమైన కార్యక్రమాల వల్ల సమూహాలు ఏర్పడతాయని తాజా పరిస్ధితులలో ఇది ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదన్నారు. కరోనా కారణంగా లాక్ డోన్ కొనసాగుతున్న వేళ గవర్నర్ గౌరవ హరిచందన్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరమే కీలకం అయినందున ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలని, అవసరమైతే మరికొందరికి సామాజిక దూరం ఆవశ్యకతను సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించటమే దేశ పౌరులుగా సమాజానికి చేయగలిగన సేవ అని గవర్నర్ ప్రస్తుతించారు. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వైద్య సేవలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కొన్ని ప్రాంతాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది విధులను అడ్డుకోవటం వంటివి చేస్తున్నారన్న సమాచారం ఆందోళణ కలిగిస్తుందని , ఈ తరహా పరిస్ధితులు ఏమాత్రం వాంఛనీయం కాదని రాష్ట్ర రాజ్యాంగాధినేత స్పష్టం చేసారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వారు ఎంతో కష్టపడుతున్నారని వారిని ప్రోత్సహించేలా సమాజం వ్యవహరించాలని గవర్నర్ అన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  కృతనిశ్చయం, సంయమనం ప్రాతిపదికన కరోనా వైరస్ కు చరమగీతం పాడాలన్న ప్రధాని పిలుపు లభిస్తున్న స్పందన అపూర్వమైనదని, కరోనా అతి వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తుండగా,  లాక్ డోన్ కాల పరిమితి ముగిసే వరకు  బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధికమించగలుగుతామన్నారు. స్వచ్ఛంధ సంస్ధలతో పాటు రెడ్ క్రాస్, ఎన్ సిసి, స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటి వ్యవస్ధలు కీలక బాధ్యతలు నిర్వర్తించటం ముదావహమన్నారు. అయా సీజన్ల మేరకు జరగవలసిన వ్యవసాయపనులను వాయిదా వేయలేమని, ఈ పరిస్ధితిలో వారికి ప్రభుత్వం అందించిన మినహాయింపును అత్యంత జాగ్రతగా వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ పనులలో సైతం సామాజిక దూరం అవసరమని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వ తీసుకుంటుందని గవర్నర్ అన్నారు. 

విజయవాడ లో పోలీస్ కమిషనర్ పర్యటన

కరోనా పాజిటివ్ సోకి మృతిచెందిన  వ్యక్తి  ప్రాంతాన్ని  విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లోని  ప్రజలలో ధైర్యంనింపేందుకు ఆ ప్రాంతంలో  ఆయన పర్యటించారు.  విజయవాడ లో మోత్తం16 కేసులు నమోదు అయ్యాయి..11కేసులు ఢీల్లి నిజాముద్దీన్ సమావేశం లో పాల్గొన్నవారు, ఐదుగురు విదేశాలనుండి వచ్చినవారు ఉన్నారని ద్వారకా తిరుమలరావు చెప్పారు. " పాజిటీవ్ కనపడిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నాం. డీల్లి సదస్సు కు వెళ్ళి వచ్చిన కుమ్మరి పాలెం సెంటర్ కు చెందిన వ్యక్తి కుటుంబ సెభ్యులు పాజీటివ్ బారిన పడ్డారు.. అతని తండ్రి చనిపోయారు.ఎవరిని తప్పు పట్టటంలేదు.. డిల్లి సదస్సు కు వెళ్ళి వచ్చిన వారు వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరిక్షలు నిర్వహించుకోవాలి.చాల మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి పరిక్షలు చేయించుకుంటున్నారు. మిగతావారు కూడా ముందుకు రావాలి. మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మాకు ముఖ్యం. విజయవాడ నగరంలో  కొన్ని ప్రాంతాలలో కర్ప్యూ విధించాం," అని కూడా పోలీస్ కమిషనర్ చెప్పారు. కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించామనీ, రాష్ట్రంలో కరోనా తోలి మరణం విజయవాడ లో జరగడం బాధాకరమని అన్నారాయన. " ముందుగానే హెచ్చరించాం.. వారు పట్టించుకోక పోవటం అతనికి ఇతర వ్యాదులు ఉండటంతో ఆటను మరణించాడు," అని ఆయన చెప్పారు.

ఢిల్లీ మసీదుల్లో 800 మంది విదేశీయులు

నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ ప్ర‌క‌టించింది. అయితే తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొని లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయిన 2,300 మందిని క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో 800 మందికి పైగా విదేశీ తబ్లిగీ జమాత్‌ కార్యకర్తలు వెలుగులోకి వచ్చారు. రాజధాని నలువైపుల్లోని వివిధ మసీదుల్లో వీరిని గుర్తించారు. మొదట 187మంది విదేశీ జమాత్‌ కార్యకర్తలు, 24 మంది దేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రాణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ మొత్తంలో విదేశీ కార్యకర్తలు బయటపడ్డారు. వీరిని హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. మరో రెండు రోజుల్లో వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. భయంకరమైన విషయం ఏంటంటే 800 మంది విదేశీయుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారు చాలా మందికి వైరస్‌ను అంటించి ఉంటార'' ని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.

12 రకాల కూరగాయలు 100/- రూపాయాల‌కే!

తమిళనాడు ప్ర‌భుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్ధం తమిళ సర్కార్ సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి ఇంటికి చేరే విధంగా రూ.100లకే కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీని ప్రారంభించింది. ముఖ్యంగా కోయంబత్తూర్‌ మార్కెట్‌లో ప్రజల రద్దీని తగ్గించేందుకు రూ.100లకే 12 రకాల కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఎస్పీ వేలుమణి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎవరూ ఇళ్లనుంచి అడుగుబయటపెట్టలేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌లలో కూడా సరుకు దొరకని స్థితి ఏర్పడింది. కూరగాయలు, పాలు, పండ్లు ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయాలంటే ప్ర‌జ‌లు అవస్థలు పడుతున్నారు. ప్ర‌జ‌ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోవై కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా ఈ ప్యాకేజ్‌లను ప్రజల ఇళ్ల వద్దకే చేరుస్తామని మంత్రి ఎస్పీ వేలుమణి తెలిపారు.

ఇద్ద‌రు మిన‌హా మృతులంతా ఢిల్లీ వెళ్లొచ్చిన వారే!

మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా వైరస్‌ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11 మరణాల్లో ఇద్దరు మినహా మిగతావారంతా ఢిల్లీ మ‌ర్క‌జ్ కి వెళ్లివచ్చిన వారేకావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడతోంది. తెలంగాణలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ఇంతకుముందే ప్రకటించింది. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను, వారితో కాంటాక్ట్‌ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. శుక్రవారం పరీక్షల్లో 75 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య 229కి చేరింది. ఇప్పటి వరకు 11 కు చేరుకున్న కరోనా పాజిటివ్ మృతులు. జిల్లాల వారీగా నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఇలా ఉంది. హైద్రాబాద్- 603, ఆదిలాబాద్-30, కొత్తగూడెం -11, జగిత్యాల-25, జనగామ- 4, భూపాలపల్లి- 1, గద్వాల -5, కరీంనగర్ -17, ఖమ్మం -27, మహబూబాబాద్- 6, మహబూబ్ నగర్- 11, మంచిర్యాల- 10, మెదక్ -2, మేడ్చల్ -2, ములుగు- 2, నాగర్ కర్నూల్- 4, నల్గొండ -45, నిర్మల్ 25, నిజామాబాద్- 80, పెద్దపల్లి- 6, సిరిసిల్ల- 9, రంగారెడ్డి- 13, సంగారెడ్డి- 22, సూర్యాపేట- 3, వనపర్తి- 3, వికారాబాద్- 7, వరంగల్ రూరల్- 1, వరంగల్ అర్బన్- 38, యాదాద్రి భువనగిరి- 4.

సామూహిక సంకల్ప శక్తి  సమీకరణ! యత్భావం తత్ భవతి!

ఒక్క గడ్డిపోచ ఏనుగును బంధించలేవు... అదే ఒక వెయ్యి గడ్డిపోచలు కలిస్తే మహా బలమైన ఏనుగును సైతం భందిస్తాయి.... భావన ఎంత బలంగా ఉంటుందో భవతి అంత బలంగా ఉంటుంది. అంటే మనం ఎం జరగాలని ఎంతబలంగా సంకల్పిస్తామో భవతి అంటే జరగబడేది కూడా అంతే బలంగా ఉంటుంది.. కేవలం ప్రదాని ఒక్కరే కరోన వైరస్ నశించాలని  సంకల్పిస్తే సరిపోతుందా....? కాదు మనమందరం అదే సంకల్పాన్ని బలంగా సంకల్పిస్తే కరోన ఏంటి ఏదైనా జరగడానికి సాధ్యమే..... మరి దీపాలు ఎందుకు ముట్టించాలి.....ఆయన ఏమన్నారు మన ఆత్మశక్తి దేనికంటేనూ భలహీనమైంది కాదు...అన్నారు అలాగే మన ఆత్మ శక్తి ని గుర్తుచేసుకోవడానికే ఆ దీపపు కాంతి...నిదర్శనం...నేను శరీరము కాదు...ఆత్మజ్యోతిని.....అన్న బలమైన నమ్మకంలోంచి ఆ 9 నిమిషాలూ మనం మనసా...వాచా కర్మణా.. మన బలమైన సంకల్పాన్ని... ఆత్మకాంతిని,,,,ఈ విశ్వంలోనికి విడుదల చేసినట్లయితే.... ఆ బలమైన  సామూహిక ఆత్మశక్తి ఈ విశ్వంలోకి విడుదల అవుతుంది....మనం ఏ సంకల్పం తో అయితే విడుదల చేశామో...ఆ సంకల్ప దిశవైపే ఆ విడుదల అయిన శక్తి ప్రయాణిస్తుంది... ఏ రకమైన సంకల్పాలో ....ఆ రకమైన వాస్తవాలు... ఇదే యోగ సిద్ధాంతం యొక్క ప్రాథమిక నియమము... మనం  మన సంకల్ప శక్తిని వైరస్ ఈ భూమిని వదిలి వెళ్లాలని విడుదల చేయబోతున్నాం...ఆ విడుదలైన శక్తి అదే వాస్తవాన్ని మోసుకొస్తుంది... ఇది పక్కా....ఆధ్యాత్మిక శాస్త్రం... అందరూ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు మీరు మీ ఆత్మ స్పృహలో ఒక దీపాన్ని వెలిగించి.... ఆ దీపపు వెలుగులో మీ అంతర్ముఖంలో మీరు ఆత్మగా... మీ ఆత్మశక్తిని మీ పరిపూర్ణమైన ఏక సంకల్పంలో 9 నిమిషాల పాటు ప్రశాంత స్థితిలో....మీ శక్తిని విడుదల చెయ్యాలి....అంతే.

చేగూర్ గ్రామాన్ని తనికీ చేసిన కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం చేగూర్  గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్,  సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ లు సందర్శించారు. చేగూర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల మహిళ కరోనాతో నేడు ఉస్మానియా  ఆసుపత్రిలో మహిళ మృతి మరణించింది. అయితే ఆసుపత్రి రికార్డ్ లో ఈమె వయస్సు 55 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తరువాత పరీక్షల్లో కరోనా  పాజిటివ్ గా రిపోర్ట్ లోవచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ అమయ్ కుమార్ చేగూర్ గ్రామానికి కమీషనర్ సజ్జనార్ ఇతర అధికారులతో కలసి హుటాహుటిన చేరుకున్నారు. మృతురాలి నివాసం,  పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావకపు మందును విస్తృతంగా స్ప్రే చేయించారు. మృతురాలి తో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లో ఎవరెవరున్నారో వారిని గుర్తించి సిపార్డ్ లోని క్వారంటైన్ కేంద్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన వారిని తమ ఇళ్లలోనే క్వారంటైన్ చేపట్టాలని సూచించారు. కలెక్టర్ అమయ్ కుమార్ తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్,  వైద్య,  ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 

బావురుమంటున్న భాగ్యనగరం...

ఈనగరానికి ఏమయింది ? థియేటర్లలో ఈ యాడ్ చూసినపుడు.. ఏం కాలేదులే తీసెయ్యండయ్యా అని అనుకున్న వారు అనేక మందున్నారు.. మరిప్పుడు.. ఈ నగరానికి ఏమైంది?.. కరోనా వచ్చి కర్ఫ్యూ కోరల్లో కొట్టుమిట్టాడుతోంది.. భాగ్యనగరమంతాబావురుమంటోంది..వీధుల్లో వచ్చే పోయే వాహనాలు వట్టిపోయాయి..ఆ వాహన ప్రవాహం రోజంతా రయ్ రయ్ మని సాగేది..రోడ్లు దాటాలంటే బ్రహ్మ ప్రళయమే అయ్యేది..ఇపుడు ఇటూ అటూ చూడకుండా దాటిపోయే దారులయ్యాయి. బయటకు వెళ్లే బస్సులన్నీ బందయ్యాయి..ప్రయివేటు వాహనాలు సైతం పడకేశాయి..ఆటో రిక్షాలన్నీ అడ్రసు లేకుండా పోయాయి.. రహదారుల్లో రాకపోకలు రద్దయి పోయాయి.. విపత్తు లెన్నింటికో ఎదురొడ్డి నిలిచిన కలం యోధుల కలాలూ కరోనా కరోనా అంటూ కలవర పడుతున్నాయి..ప్రతిరోజూ పాజిటివ్, నెగటివ్ కేసుల లెక్కలు రాసేసుకుంటున్నాయి..కాంక్రీట్ జంగిల్లో కానరాని జనసంచారం . అంతటా అలుముకుంది నిశ్శబ్ద వాతావరణం..ఆలు మగలు అందరూ ఇళ్లకే పరిమితం..కడిగిన చేతులనే కడిగేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగి తేలుతున్నారు.. చూసిన వాటినే టీవీల్లో చూసేసుకుంటున్నారు..ఇమ్యూనిటీ కోసం ఇష్టమైనవన్నీ తినేస్తున్నారు..మరచిపోయిన దేవుళ్లను మననం చేసుకుంటున్నారు..అయినా.. అందరికీ అదోరకం భయం..అదే.. కరోనా వచ్చి కాటేస్తుందనే కలవరం.. అందుకే మళ్లీ..      ఈ నగరానికి ఏమైంది? కాదు.. ఈ రాష్ట్రానికి ఏమైంది? కాదు కాదు.. ఈ దేశానికి ఏమైంది?కానేకాదు.. ఈ ప్రపంచానికి ఏమైంది? అని అడిగితే.. కరోనా ఓ శాపమై కూర్చుంది.. అయితే శాప విమోచనం అనేదీ ఉంటుంది..అయితే.. అదెప్పుడంటూ ఆశగా ఎదురు చూడడమే అందరి వంతయింది.