ఢిల్లీ మసీదుల్లో 800 మంది విదేశీయులు
posted on Apr 4, 2020 @ 12:42PM
నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొని లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన 2,300 మందిని క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో 800 మందికి పైగా విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు వెలుగులోకి వచ్చారు. రాజధాని నలువైపుల్లోని వివిధ మసీదుల్లో వీరిని గుర్తించారు.
మొదట 187మంది విదేశీ జమాత్ కార్యకర్తలు, 24 మంది దేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రాణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ మొత్తంలో విదేశీ కార్యకర్తలు బయటపడ్డారు. వీరిని హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు.
మరో రెండు రోజుల్లో వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. భయంకరమైన విషయం ఏంటంటే 800 మంది విదేశీయుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారు చాలా మందికి వైరస్‌ను అంటించి ఉంటార'' ని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.