ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ!

హైద‌రాబాద్ జిహెచ్ ఎంసి పరిధిలోని శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు, కార్పొరేటర్ల తో మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు తీరుపై  మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంద‌ని మంత్రి తెలిపారు. కార్పొరేటర్లు తమ డివిజన్ లలో ప్రతిరోజు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని సంబందిత అధికారుల దృష్టికి తెసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఈ సంద‌ర్భంగా సూచించారు. ప్రజలు ఇండ్ల లో ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. మార్కెట్ లు, దుకాణాలకు వెళ్ళినప్పుడు కనీస దూరం పాటించాలని మంత్రి మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు.  అధికారులు ధరల నియంత్రణ కోసం నిరంతర పర్యవేక్షణ జరపాలి. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి.  ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అందని వలస కూలీల వివరాలు తెలియజేస్తే వారికి బియ్యం నిత్యావసర వస్తువుల పంపిణీకి చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి భ‌రోసా ఇచ్చారు.

వలస కూలీలను ఆదుకునేందుకు దాతల విరాళాలు!

మహబూబాబాద్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వలస కూలీలను ఆదుకోవ‌డానికి విరాళాలు అందుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటించకూడదని సిఎం కేసిఆర్ ఇచ్చిన పిలుపుకు మంచి స్పంద‌న వ‌స్తోంది. తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ –శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కు శ్రీరామ్ ఏజన్సీస్ తరపున కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రావు లు 5 లక్షల రూపాయలను అందించారు.  న‌లందా డిగ్రీ కాలేజీ తరపున లక్ష రూపాయల చెక్కును కాలేజీ చైర్మన్ నూకల శ్రీరంగారెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, కరెస్పాండెంట్ డోలి సత్యనారాయణ అందించారు.  స్వర్ణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంట్రాక్స్ తరపున మరో 5 లక్షల రూపాయలను సిఎం సహాయనిధికి కొంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రావులు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు అందించారు.  వీటితో పాటు ఇతర వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తామన్నారు.  అందరి సంక్షేమం కోసం పాటుపడే సిఎం కేసిఆర్ గారు నేడు దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ అయ్యారని, ఇలాంటి నాయకుడు అన్ని రాష్ట్రాలకు ఉండాలని నేడే మీడియా ప్రతినిధులు, ఇతర నాయకులు చెప్పడం మనకు గర్వకారణమన్నారు. సిఎం పిలుపు మేరకు నేడు దాతలు ముందుకు రావడం సంతోషమని, మరికొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యంలో, గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి  సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.

నిజాముద్దీన్ మ‌ర్క‌జ్‌ లో క‌రోనా తిష్ట ఎలా వేసింది?

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకూ తబ్లీగీ జమాత్‌కు చెందిన ఒక కార్యక్రమం మలేసియా, కౌలాలంపూర్‌లోని ఒక మసీదులో  జరిగింది.  ఆ కార్యక్రమానికి హాజరైన త‌బ్లీక్ జ‌మాత్ స‌భ్యుల  ద్వారా ఆగ్నేయాసియాలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు విస్త‌రించింది. మలేసియాలో బయటపడిన కరోనా పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివే. బ్రూనైలో బయటపడ్డ మొత్తం 40 కరోనా కేసుల్లో 38 మంది ఇదే మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని అల్ జజీరా రిపోర్ట్ చెప్పింది.  ఈ మసీదులో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సింగపూర్, మలేసియా సహా భార‌త్‌లో వైరస్ వ్యాపించింది. తెలంగాణలో కరోనాతో చనిపోయిన ఆరుగురు ఢిల్లీ జ‌మాత్ కార్యాల‌యం నుంచి రావ‌డంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్  పతాకశీర్షికల్లో నిలిచింది. అస‌లు ఈ డెడ్లీ వైర‌స్ క‌రోనా ఢిల్లీ మ‌ర్క‌జ్‌లో ఎలా తిష్ట వేసింది. అస‌లు ఇంత మంది ముస్లింలు ఎందుకు ఇక్క‌డ స‌మావేశం అయ్యారు? త‌బ్లీక్ జ‌మాత్ మ‌ర్క‌జ్ 1920 నుంచీ నడుస్తున్న ఒక మత సంస్థ. దిల్లీలోని నిజాముద్దీన్ దీని హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం సంస్థ. దీని సెంటర్లు 140 దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో జ‌మాత్ హెడ్‌క్వార్ట‌ర్ కార్యాల‌యం ఇది. ఏడాది పొడుగునా ఇక్క‌డ జ‌మాత్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయి. మార్చి నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల అంత‌ర్జాతీయ ఇస్త‌మా ఇక్క‌డ జ‌రిగింది. విదేశాల నుంచి కూడా ప్ర‌తినిధులు వ‌చ్చారు.  జ‌మాత్ మ‌ర్క‌జ్ సమీపంలో నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్, ఆ పక్కనే ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా కూడా ఉన్నాయి.  ఢిల్లీ మ‌ర్క‌జ్‌లో మార్చి 13 నుంచి 15 వ‌ర‌కు జ‌రిగిన మూడు రోజుల స‌మావేశాల్లో దాదాపు 2 వేల 500 మంది పాల్గొన్నారు. వెయ్యి మంది వెళ్లి పోయారు. 1500 మంది అక్క‌డే వున్నారు. ఆ త‌రువాత జ‌రిగిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో బ‌య‌టికి వెళ్ల‌లేక వీరంతా అక్క‌డే వుండిపోయారు. ప్ర‌స్తుతం ఈ 1500 మందిని  మర్కజ్ భవన్ లో క్వారంటైన్ లో ఉంచిన‌ట్లు సి.ఎం. కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీ పోలీసులు నిజాముద్దీన్ మొత్తం ప్రాంతాన్ని సీజ్ చేశారు.   నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ నుంచి వెళ్లి పోయిన వెయ్యి మందిలో విదేశీయులు ఎంత మంది?  భార‌తీయులు ఎంత మంది? ఏ రాష్ట్రాల వారు వున్నారు? అందులో తెలుగువారంత మంది? ఎంత మందికి పాజిటివ్ వ‌చ్చి వుంటుంది. వారెంత మందికి అంటించి వుంటారు? ఇవి ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళి జ‌మాత్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌వారు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.  అయితే వీరు ఎంత మందికి ఈ వైర‌స్ అంటించి వుంటార‌నేది ప్ర‌స్తుతం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారు, వారిని క‌లిసిన వారు స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చి వైద్య స‌ల‌హా తీసుకుంటే మ‌ర‌ణాల్ని కొంత వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చు. ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన వారు భ‌య‌ప‌డి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఇది అంద‌రికీ చుట్టుకుంది. భారత్‌లోని అన్నిజిల్లా కేంద్రాల్లో జ‌మాత్‌ 'మర్కజ్'లు ఉన్నాయి. వీటిలో ఏడాది అంతా ఇజ్తెమా జరుగుతూనే వుంటుంది. అంటే జ‌మాత్‌ను అనుస‌రించే ముస్లింలు వస్తూపోతూ ఉంటారు. ప్రతి ఇజ్తెమా 3 నుంచి 5 రోజులు నడుస్తుంది. ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారు జిల్లా కేంద్రంల్లో వున్న మ‌ర్క‌జ్ మ‌సీదుల్లో జ‌రిగే ఇస్త‌మాలో పాల్గొని వుంటే ప‌రిస్థితి దారుణంగా వుంటుంది. ఆస‌క్తి క‌ర‌మైన విష‌యం ఏమంటే మార్చి 13వ తేదీ జ‌మాత్ స‌మావేశాలు ప్రారంభం అయిన రోజున  కేంద్ర ఆరోగ్యశాఖ "కరోనా హెల్త్ ఎమర్జెన్సీ కాద"ని ప్రకటించింది. 15వ తేదీ స‌మావేశాలు ముగిశాయి.  అయితే 16వతేదీ అన్ని మతసంస్థల్ని మూసివేస్తూ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాన్స్‌పోర్ట్ లేక‌పోవ‌డంతో 1500 మంది వ‌ర‌కు ఇక్క‌డే వుండిపోయార‌ని జ‌మాత్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వైరస్ వార్తలు వెల్లడైన తర్వాత కూడా 70,000పైగా విదేశాలనుండి తరలి వచ్చిన వారిని దేశమ్మీదకు వదిలేసిన ప్ర‌భుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఢిల్లీ నిజాముద్దీన్ త‌బ్లిక్ మ‌ర్క‌జ్ అద్దం ప‌డుతోంది. కౌలాలంపూర్‌లోని ఒక మసీదులో అంటుకున్న ఈ వైర‌స్ త‌బ్లీక్ జ‌మాత్‌కు చెందిన వ్య‌క్తి ద్వారా ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు చేరుకుంది. కేంద్ర‌ప్ర‌భుత్వం విదేశాల నుంచి వ‌చ్చిన వారిని క‌ట్ట‌డి చేసిన‌ట్లైతే మ‌న‌కు ఈ దుర్గ‌తి ప‌ట్టేది కాదు.

కేవలం 12 గంటల్లోనే భారత్ లో 240 కరోనా కేసులు

మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ మరింత పెరుగుతోంది. గత 12 గంటల్లోనే దేశంలో 240 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేసింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,637కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం 1,466 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 133 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్కరోజులోనే కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా కరోనా బారిన పడ్డ ఈ 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారేనని తెలుస్తోంది.

కరోనా కాలంలోనూ బ్యాంకుల విలీనం.. చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంకు

భారత్ లో మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిగింది. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు నాలుగూ.. చిన్న బ్యాంకులను తమలోకి విలీనం చేసుకున్నాయి.  కరోనా కారణంగా బ్యాంకుల విలీనం నిలిచిపోయే అవకాశముందని అందరూ భావించినా.. ముందుగా ప్రకటించినట్టుగానే విలీనం జరిగిపోయింది.   ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లోకి విలీనం అయ్యాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది. అలాగే, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోనూ, అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులోనూ విలీనం అయ్యాయి. ఇక ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. ఈ విలీనంతో, తెలుగు రాష్ట్రాల్లో పురాతన బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకు చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది.

ప్రైవేటు ఉద్యోగుల జీతాలు వస్తాయా?

మనందరం లక్ష్మణ రేఖ గీసుకుని లాక్ డౌన్ ఆచరించాలి, ప్రజల ఆరోగ్యంకోసమే ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ సహకరించాలి.. దేశం మునుపెన్నడూ ఎదుర్కోని ఇలాంటి విపత్కర పరిస్తితులను అర్ధం చేసుకుని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. మానవతా దృక్పదంతో లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. ఇదీ..లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ మాట్లాడిన..మాటలు. చేసిన విన్నపాలు. కానీ మన ముఖ్యమంత్రుల తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంది. మొన్న కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 75, 60, 50, 10 శాతం మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఒక రోజు వ్యత్యాసంతో నేనున్నాను, నేనువిన్నాను, నేను చూసాను అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఉద్యోగుల జీతాలను రెండు విడతలుగా చేల్లిస్తామంటూ జీఓ జారీ చేసారు.  ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓలో ముఖ్యమంత్రి దగ్గర్నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకూ అందర్నీ చేర్చారు కానీ..కుప్పలు తెప్పలుగా ఉన్న సలహాదారుల జీతాల గురించి ఒక్క అక్షరం కూడా లేకపోవడం గమనార్హం. వీరికి జీతాలు ఇస్తున్నారో, లేదో స్పష్టత ఇవ్వకపోవడం పట్ల జీతాల్లో కోతలు పడ్డ వేతనజీవులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంచితే ప్రయివేటు యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. తప్పనిసరిగా జీతాలు చెల్లించాల్సిందే అని స్పష్టం చేసిన ప్రభుత్వాలు మాత్రం ఉద్యోగులకు జీతాల్లో కోతలు పెడితే ప్రయివేటు సంస్థలు దీన్ని సాకుగా చూపవా? ప్రభుత్వమే వేతనాలు ఇచ్చే పరిస్తితుల్లో లేనప్పుడు మేమెక్కడినుంచి ఇవ్వగలం అని ఆనవా? అన్న సందేహాలు ప్రయివేటు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్నాయి.

ఎం.ఎల్.ఏ అబ్బయ్య గారూ... ఇంతకీ సభ్యసమాజానికి ఏమి మెసేజ్ ఇద్దామనీ!

* లండన్ లో జన సమ్మర్ధం గా ఉండే ప్రాంతం లో కుమార్తె పుట్టినరోజు వేడుకలు....  * క్వారంటైన్ ను గాలికి వదిలేసి, కిక్కిరిసిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అబ్బయ్య చౌదరి  "Back to place where I worked 15 years ago @ Red-lion Court , London Bridge.Grabbed food at the famous @ London Bridge borough market.Celebrated my princess Aashritha 8th birthday," అంటూ ఫిబ్రవరి 21 వ తేదీన దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి పెట్టిన ఫేస్ బుక్ పోస్టింగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన కుమార్తె 8 వ జన్మదినాన్ని లండన్ లో ఆయన జరుపుకునే సమయానికే అక్కడ, ఆ దేశం లో కరోనా కు సంబంధించిన హెచ్చరికలు విస్తారంగా జన బాహుళ్యానికి చేరాయి. అయినా కూడా, క్వారంటైన్ పాటించకుండా, ఆయన జనసమ్మర్థం తో కూడుకున్న ఆ లండన్ బ్రిడ్జి ప్రాంతం లోని రెడ్ లయన్ కోర్టు లో తన కుమార్తె బర్త్ డే వేడుకలు చేసుకోవడం, 15 ఏళ్ల క్రితం తానూ అక్కడ పని చేసిన విషయాన్నీ 'ముఖ పుస్తకం ' ద్వారా గుర్తు చేసుకోవడం, నెటిజన్లను విస్మయపరిచింది.  అంతే కాదు, ఆయన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, సెల్ఫ్ క్వారంటైన్ పాటించిన దాఖలాలు కూడా కనపడలేదు. పై పెచ్చు, మార్చ్ 2 వ తేదీ న ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి లో పలువురిని పరామర్శించారు కూడా. ఆ తర్వాత, మార్చ్ 7 వ తేదీన దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెం పార్టీ కార్యాలయం లో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అదే రోజున, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , ఇంకా పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొన్నారు. ఇదే ప్రోగ్రాం లో డెప్యూటీ సి ఎం ఆళ్ళ నాని, ఏలూరు ఎం. పి . కోటగిరి శ్రీధర్ కూడా పాల్గొన్నారు.  ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, విదేశీ పర్యటన చేసి వచ్చిన దెందులూరు ఎం ఎల్ ఏ, తాను  విజిట్ చేసిన దేశం కూడా కరోనా బారిన పడిందని, అక్కడ అప్పటికే క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుసుకోలేనంత అజ్ఞానం లో ఉండటం. దానికి తోడు, స్వదేశం వచ్చిన తర్వాత అయినా, క్వారంటైన్ పాటించకుండా, విస్తారంగా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆస్పత్రులు సందర్శించడం చేశారు. ప్రజా సేవ విషయం లో ఆయనకున్న తపనను, తహతహ ను, నిబద్ధతనూ ఎవరూ ప్రశ్నించరు కానీ, పది మందికి జాగ్రత్తలు చెప్పాల్సిన ఆయనే, వాటిని కన్వీనియెంట్ గా విస్మరించడం ఇప్పడు హాట్ టాపిక్ గామారింది. పై పెచ్చు ఆయన పాల్గొన్న ప్రతి ఈవెంట్ నూ కూడా, అంటే లండన్ లో జరిగిన ఆయన కుమార్తె పుట్టినరోజు వేడుక దగ్గర నుంచి, స్వదేశం లో ఆయన పాల్గొన్న అని కార్యక్రమాలనూ ఆయన సోషల్ మీడియా హ్యాండ్లర్లు ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లతో సహా పోస్ట్ చేస్తూ రావడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ, సభ్యసమాజానికి జగన్ సర్కార్, ఆయన ఎం ఎల్ ఏ లూ ఏం మెసేజ్ ఇద్దామనీ అని జనాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.

ద‌ర్గా సాక్షిగా అబ‌ద్దాలా? డిప్యూటీ సి.ఎం.గారు!

మీడియా కుట్ర అంటూ డిప్యూటీ సి.ఎం. అంజాద్ బాషా ప్ర‌తికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. " నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది.అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది.ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను.మరుసటి రోజు సీఎం గారిని కలిశాను...4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను.ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం," అంటూ చెప్పుకొచ్చిన అంజాద్ బాషా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా అని ప్రశ్నించారు. "కనీసం నా వివరణ కూడా అడగలేదు.ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని  మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాల‌న్నారు. అంతే.. సోష‌ల్ మీడియాలో నిజాముద్దీన్ ద‌ర్గాకు మంత్రి వెళ్లిన ఫొటోలు మార్చి 2 వ తేదీన పోస్ట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఎక్క‌డికీ వెళ్ల‌లేద‌న్నారుగా మంత్రిగారు నిజాముద్దీన్ ద‌ర్గాకు ఎలా వెళ్లారు. ఈ ఫొటోలు ఏమిటి?  దీనిపైన కూడా వివ‌ర‌ణ ఇస్తే బాగుండేది. మార్చి 2వ తేదీ మీరు ఢిల్లీలో వున్న‌ట్లు మీరే చెప్పారు. ద‌ర్గా సాక్షిగా అబ‌ద్దాలాడ‌డం క‌రెక్టేనా? అది వేరు మీరు త‌బ్లీక్ జ‌మాత్ మ‌ర్క‌జ్‌కు వెళ్ల‌క పోవ‌చ్చు... ద‌ర్గాకు వెళ్ళారా?  లేదా? దీనిపై డిఫ్యూటీ సి.ఎం. స‌మాధానం ఏమిటి? భ‌య‌ప‌డ‌డం ఎందుకు. వాస్త‌వాలు చెప్పండి.

రాజభోగం... 20మంది మహిళలతో!

'రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా?' అని సామెత. అలాగే, రాజు తలచుకోవాలని కానీ సపర్యలు చేసే చెలికత్తెలకు కొరత ఉండదు. థాయ్‌ల్యాండ్ రాజు మహా వజ్రలాంగ్ కార్న్ అదే పని చేశాడు. తనతో పాటు 20 మంది మహిళలను వెంటబెట్టుకుని జర్మనీలోని స్టార్ హోటల్ కి వెళ్లాడు. కరోనా క్రైసిస్ టైమ్‌లోనూ రాజ భోగాలను వదులుకోవడానికి ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. అసలు, ఉన్నట్టుండి రాజుగారు థాయ్‌ల్యాండ్ వదలి, జర్మనీ వెళ్లడానికి కారణం కూడా కరోనాయే. ఎక్కడ కరోనా తనకు సోకుతుందేమోననే భయంతో సొంత దేశం వదిలి వెళ్లిపోయాడు. జర్మనీలో ఫోర్ స్టార్ హోటల్ మొత్తాన్నీ ఒక్కడే బుక్ చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే ఈ వార్త బయటకొచ్చింది. అయితే... అందులో 20మంది మహిళలు, కొంతమంది సేవకులతో దిగినట్టు జర్మనీ పత్రికలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అన్నట్టు రాజుగారికి నలుగురు భార్యలు. ప్రస్తుతం వాళ్లు రాజుతో ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటివరకు థాయ్‌ల్యాండ్‌లో 1500లకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మార్చి నెల వేతనంలో 50% వాయిదా...

మార్చి నెల వేతనంలో 50% వాయిదా వేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GO Ms. No. 26 dated 31-03-2020 ను ఆర్థిక శాఖ విడుద‌ల చేసింది. గ్రాస్ శాలరీలో.. 50% వాయిదా వేస్తున్న‌ట్లు జి.వో. విడుద‌ల చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100%,  అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు 60%(IAS,IPS,IFS..etc),  ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా), నాల్గో తరగతి ఉద్యోగులకు 10%. ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ వాయిదా. ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50% గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.  ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు.  తదుపరి ఉత్తర్వులు విడుదల అయ్యే వరకు ఈ GO కొనసాగుతుంద‌ని పేర్కొన్నారు.  కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని.. అందుకే ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సమకూరిన తరువాత మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.

కరోనాకు మతం రంగు పులమకండి: ముహమ్మద్ రఫీఖ్ 

* ఏపీ జమాఅతె ఇస్లామి హింద్ అధ్యక్షుడి విజ్ఞప్తి  ప్రపంచ దేశాలు కరోనా ఉపద్రవానికి అల్లల్లాడుతున్నా కూడా  భారత ప్రభుత్వం ఏ విధమైన  ముందస్తు చర్యలు చేపట్టకుండా మార్చి 19 వరకు నిమ్మకు నీరెత్తినట్లు గా ఉండి‌ అకస్మాత్తుగా  లాక్ డౌన్ ప్రకటించడం వలన అనేక సమస్యలు తలెత్తాయని ఏ పీ జమాఅతె ఇస్లామి హింద్ అధ్యక్షుడు ముహమ్మద్ రఫీఖ్ పేర్కొన్నారు. "ప్రభుత్వం ఇదే లాక్ డౌన్ ని మార్చి పదో తేదీనుండే అమలు పరచి ఉంటే ఢిల్లీ లో మత పర ప్రార్ధనలు జరిగేవే కావు,ఈ వైరస్ ఇంతిలా వ్యాపించేది కాదు. అలాగే ఢిల్లీ వార్తల పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి , ప్రజలు ప్రత్యేకించి నెటిజన్లు వాస్తవ సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి," అని కూడా ఆయన సూచించారుఇప్పుడు  కేవలం  నిజాముద్దీన్  పేరు  మాత్రమే  ఎందుకు, అని ఆయన ప్రశ్నించారు.  ఇండియాలో  కూడా  కరోనా  వైరస్  వ్యాప్తి  చెందకుండా జాగ్రత్తలు  తీసుకోవటం  మొదలుపెట్టారు , హఠాత్తుగా  లాక్  డౌన్ ప్రకటించటం  జరిగింది . ఈ  లాక్  డౌన్  జరిగినప్పుడు  ఒక  రాష్ట్రం  వారు  వేరే  రాష్ట్రంలో  ఉన్నారు. వీరు  ఇప్పుడు  ఏం చేయాలి ? వీరిని  తమ  తమ  ప్రదేశాలకు  పంపించే  బాధ్యత  ప్రభుత్వంది  కాదా ? ఢిల్లీ  తబ్లిగ్   నిజాముద్దీన్ లో  వందల మంది చిక్కుకుని ఉన్నారు !  లాక్ డౌన్ ప్రకటనకు ముందు జరిగిన కార్యక్రమం అదీను సంవత్సరాలుగా  జరుగుతున్న ఆధ్యాత్మిక  కార్యం , మరి  ఢిల్లీ  ప్రభుత్వం  వారిని  పంపే  ప్రయత్నం  ఏం  చేసిందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ నిజాముద్దీన్  విదేశాల  నుండి  వచ్చిన  వారు  కూడా  ఉన్నారు !   ఇది సంవత్సరాలుగా  జరుగుతున్న కార్యక్రమం,దేశంలో ఇంకా ఎన్నో మతాల ఆధ్యాత్మిక కార్యక్రమాలూ జరిగాయి,  అన్ని  ప్రదేశాలలో  వ్యాపారం  రీత్యా , ఉద్యోగం  రీత్యా , పర్యటన రీత్యా  అనేక  మంది  విదేశాల  నుండి  వచ్చిన వారు  ఉన్నారు. ఇది  పెద్ద  నేరంగా మీడియా ఎందుకు  చూపిస్తుంది ? దేశంలో  ఎన్ని  కరోనా  కేసులు  ఉన్నాయి ? అందరూ  నిజాముద్దీన్  వెళ్లి  వచ్చిన  వాళ్లేనా?  అమెరికా  లాంటి  దేశంలో  కరోనా  తాండవిస్తుంది   నిర్మూలించటానికి  అన్ని  రకాల  ప్రయత్నాలు  జరుగుతున్నాయి . కరోనా  ఇప్పుడు  పూర్తి  ప్రపంచ సమస్య దీనిని  దేశాలు  మతాలకతీతంగా  పోరాటం  చేయవలసిన  సమయం . నిజాముద్దీన్  పేరు  ముందు  పెట్టి  మత  రాజకీయాలు  చేయటం  వలన   దేశం  నుండి  కరోనాను  పారద్రోలగలమా ? మేధావులు  ఆలోచించాలి.  తబ్లీగి  జమాత్  ఒక  ఆధ్యాత్మిక  సంస్థ , మానవులను  సృష్టికర్తతో కలపటానికి  ప్రయత్నిస్తున్న  జమాత్  అటువంటి జమాత్ పై మీద  సోషల్  మీడియాలో  విమర్శలు చేయటం  ఎంత వరకు సబబు ? తబ్లీగి  జమాత్  బాధ్యులు  మొదటి నుండే  ప్రభుత్వాన్ని  కోరుతున్నారు  ఇక్కడ ఉన్న  వారందరిని  సురక్షితంగా  తమ  తమ  ప్రదేశాలకు  పంపమని? హఠాత్తుగా  లాక్  డౌన్  ఎవరి  నిర్ణయం ? కేసులు  ఎవరి  మీద  పెట్టాలి ? ఈ  రకంగా  చూస్తే  ప్రపంచం  మొత్తంలో  ఎంత మందికి  కరోనా  ఉంది ? ఎంత మంది ప్రాణాలు  కోల్పోయారు ఎంత  మంది  మీద  కేసులు పెట్టాలి అని ఆయన ప్రశ్నించారు. కరోనా  విజృంభిస్తున్న  సమయంలో   ఒక  వర్గానికి  చెందిన  నిజాముద్దీన్ వారిపై   సోషల్  మీడియాలో  విషం  చిమ్మటం ఎంతవరకు  సబబు! కఠినమైన కరోనాకు లేని మతవిభజన మనుషులమైన మనకు అవసరమా ప్రతి  భారతీయుడు ఆలోచించాలని ఆయన కోరారు.

పచ్చ మీడియా కుట్ర అంటూ మండిపడ్డ అంజాద్ బాషా 

* తప్పుడు వార్త రాసినందుకు క్రిమనల్ కేసు పెడతానంటూ వార్నింగ్  * డెప్యూటీ సి ఎం గా నాపరాతి అడుగు ఢిల్లీ లో నమోదైంది, చెక్ చేసుకోండి: అంజాద్ బాషా  తన పైన, ఈ ప్రభుత్వంపై పచ్చ మీడియా పెద్ద కుట్రకు తెరలేపిందని డెప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయన్నారు. " నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది.అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది.ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను.మరుసటి రోజు సీఎం గారిని కలిశాను...4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను.ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం," అంటూ చెప్పుకొచ్చిన అంజాద్ బాషా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా అని ప్రశ్నించారు. "కనీసం నా వివరణ కూడా అడగలేదు.ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని పచ్చ మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను.. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి...పచ్చ మీడియా రాసిన పిచ్చి రాతలను నమ్మొద్దు," అని విజ్ఞప్తి చేశారు.

మారటోరియం లేదూ...మట్టిగడ్డలూ లేవు!

* స్టేట్ బ్యాంక్ మినహా చేతులెత్తేసిన మిగిలిన బ్యాంకులు  *మూడు నెలల కిస్తీ చెల్లింపుల మినహాయింపు పై ఆర్ బీ ఐ తో పాటు, బ్యాంకుల ఉదేశ్య పూర్వక మౌనం  మారటోరియం లేదు..మట్టి గడ్డలూ లేవు అంటూ... బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు పెదవి విరుస్తున్నారు. .. నాలుగు రోజుల నాడు మన దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఒక మూడు నెలల పాటు నెలసరి కిస్తీల బాధ నుంచి తప్పించుకుందామనుకున్న  మధ్య తరగతి సగటు జీతగాళ్లతో బ్యాంకుల ఇన్ స్టాల్మెంట్ ఆట మొదలైంది. ఏప్రిల్ నెల కిస్తీల తాలూకు మెసేజ్ లతో , ఇప్పటికే మధ్యతరగతి మొబైల్స్ దిగాలు ముఖాలు పెట్టేశాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మినహా, మిగిలిన బ్యాంకులేవీ కూడా అసలు మారటోరియం ఊసే ఎత్తడం లేదు. స్టేట్ బ్యాంకు కూడా హౌసింగ్ లోన్ వరకే మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపు నకు మినహాయింపు ఇస్తోంది.  నిజానికి, కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట. ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం  సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ.  ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును.  అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది.  హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది.  అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది.  ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట. ఇన్ని విషయాల మీద ఇంత చక్కని క్లారిటీ ఇచ్చిన ఆర్ బీ ఐ, ఇప్పుడు బ్యాంకులు మారటోరియం ను అపహాస్యం చేస్తుంటే మాత్రం, చోద్యం చూస్తోంది. మధ్యతరగతి జీవి ని పరిహాసం చేస్తున్నట్లుంది ఆర్ బీ ఐ వైఖరి....

ఢిల్లీ నుంచి వ‌చ్చిన ​603 మంది లెక్క తేడాకొడుతోంది!

​ఢిల్లీ లో జరిగిన మతపరమైన ప్రార్ధనలలో 603 మంది పాల్గొని, నగరానికి  తిరిగి వచ్చారు.  ​వారి ఆరోగ్య స్థితిని తనిఖీ చేసేందుకు పోలీస్,  జీ హెచ్ ఎం సి, రెవిన్యూ వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన   200 బృందాలు జి హెచ్ ఎం సి పరిధిలో తనిఖీ చేస్తున్నాయ‌ని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ​ ​అత్యంత పకడ్బందీగా  చేపట్టిన ఈ తనిఖీ ప్రక్రియను  జోనల్ కమీషనర్లు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నట్లు జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ​జి హెచ్ ఎం సి కమీషనర్ ఆయా జోన్లలో పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  ​ ​ఈ బృందాలు  కోవిద్ -19 లక్షణాలు కనిపించిన వారిని గాంధీ హాస్పిటల్ కు తరలిస్తున్నాయి. ​ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారి  కుటుంబ సభ్యులను కూడా  హోం క్వారెంటైన్ చేస్తున్నాయి .   ​​వృద్దులు, తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారిని, ఇండ్లలో తక్కువ స్థలం వున్న వారిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలిస్తున్నాయి. ​ ​నేడు  463 మంది ఇండ్లను తనిఖీ చేశారు. వారిలో 74 మందికి ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు కనిపించుటతో పరీక్షల నిమిత్తం గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ కు తరలించారు. ​348 మందిని హోం క్వారెంటైన్ చేయగా, మరో 41 మందిని ప్రభుత్వ క్వరెంటైన్ కు తరలించారు.  ​మిగిలిన వారి అడ్రసులు సరిగా లేనందున,వారి ఆచూకీకీ  వాకబు చేస్తున్నారు.

2000 మందికి చేసిన కరోనా టెస్టుల‌న్ని నెగటివ్

హాజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ లో దాదాపుగా 2000 మందికి చేసిన కరోనా టెస్టు లు అన్ని నెగటివ్ (-VE ) అని వచ్చాయి. ఒక్కళ్లకు కూడా కరోనా లేదని స్పెషల్ ఆర్మీ డాక్టర్ల బృందం నిర్ధారించింది. గత వారం రోజులుగా హాజరత్ నిజాముద్దీన్ లో టెంట్ క్యాంప్ వేసి పరీక్షలు నిర్వవ్యాహిస్తున్న ఆర్మీ డాక్టర్ల బృందం. దాదాపు 300 మంది విదేశీయులు, మరియు 1700 మంది స్వదేశీయుల లాలాజలం శాంపిల్స్ ను పరీక్షించిన డాక్టర్ల బృందం అన్ని నెగటివ్ కేస్ లే అని తేల్చి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది.. దేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  వారిని వారి వారి ప్రాంతాలకు పంపే పనిలో నిమగ్నమైన అధికారులు. ఇక మీడియా లో వస్తున్న కథనాలను గొళ్ళెం పడ్డట్లే...

నేను రాజకీయం చేయను... కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు

* హైదరాబాదులో చంద్రబాబు మీడియా సమావేశం * కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయలేకపోతున్నారని విమర్శలు * ఇప్పటికే అనేక లేఖలు రాశానని వెల్లడి దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాను ఈ విషయంపై రాజకీయం చేయబోనని, కానీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం కరోనా విపత్తు నిర్వహణలో విఫలమవుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన రీతిలో కరోనా పరీక్షలు చేయలేకపోవడం వల్ల, వాస్తవాలు మరుగునపడిపోయి ఎక్కడికక్కడ వ్యాపించే పరిస్థితులు వచ్చాయని వివరించారు. దాని పర్యవసానమే పదుల సంఖ్యలో కేసులు ఒక్కసారిగా వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. కరోనా టెస్టు సెంటర్లు తక్కువగా ఉన్నందువల్ల, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒక కరోనా వ్యక్తి బయటికి వెళితే 6 రోజుల్లో 3,600 మందికి వ్యాపింపచేయగలడని హెచ్చరించారు. కరోనాపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి అనేక లేఖలు రాశానని, ఇంకా రాస్తానని చంద్రబాబు చెప్పారు. కరోనా నివారణలో ఈ ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

మర్కజ్ నిజాముద్దీన్ ఘటన వెనుక వాస్తవాలివే.. పరిస్ధితి ఎందుకు చేదాటిపోయిందంటే..

వందేళ్ల చరిత్ర కలిగిన మర్కజ్ నిజాముద్దీన్ ఏటా సమావేశాలు నిర్వహిస్తుంటుంది. చర్చలు, నమాజులు వంటి కార్యక్రమాలు ఇక్కడ సర్వసాధారణం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి హాజరయ్యే వారి కోసం ఏటా సమావేశాల తేదీలను ముందే ఖరారు చేస్తారు. ఈసారీ తేదీలు ముందే ఖరారు అయ్యాయి. కానీ 21న ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పిలుపుతో మధ్యలోనే ఆపేశారు. అప్పటికే వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు సమావేశాల్లో బిజీగా ఉన్నారు.  జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమాత్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మర్కజ్ రాత్రి 9 గంటల వరకూ ఎవరినీ బయటికి పంపలేదు. తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. జనతా కర్ఫ్యూ ముగిసినా, తర్వాత రోజు ఉదయం లాక్ డౌన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి పలువురు విదేశీయులు వెళ్లిపోయారు. కానీ దేశీయంగా ఉన్న వారు మాత్రం పూర్తిగా వెళ్లలేకపోయారు. అప్పటికే కొందరు విదేశీయుల్లో కరోనా లక్షణాలు ఉండటంతో వారు ఇతరులకు అంటించారు.  లాక్ డౌన్ ఉన్నందున అక్కడే ఉండిపోయిన వందలాది మందిని ఖాళీ చేయాలని స్ధానిక అధికార యంత్రాంగం మధ్యలో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ ఉన్నందున స్వస్ధలాలకు వెళ్లేందుకు వీలుగా వీరికి పాస్ లు మంజూరు చేయాలని మర్కజ్ నిర్వాహకులు కోరడంతో అధికారులు 17 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయినా కొందరు వెళ్లలేకపోయారు. 28న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించాగా.. వీరిలో కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరిని క్వారంటైన్ కు పంపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉండగానే మర్కజ్ లో జనం మర్కజ్ లో ఉండటంపై ఫేస్ బుల్ లో పోస్టులు వెలిశాయి. దీంతో కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వాధికారులతో చర్చిస్తున్నట్లు మర్కజ్ సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఆదేశించడంతో మర్కజ్ ఇవాళ మరోసారి వివరణ ఇచ్చింది. విదేశీయులకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రటకన తర్వాత వెంటనే పంపకపోవడమే కొంప ముంచినట్లు తెలుస్తోంది.

అమెరికా, చైనాలకు ఏపీ నుంచి ఆక్వా ఎగుమతులు 

*సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకున్న ఏపీ ఆక్వా రంగం  *69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందన్న అధికారులు.  విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్‌ నుంచి 4 కంటైనర్లతో, అమెరికా, చైనాలకు ఆక్వా ఉత్పత్తులు ప్రారంభమైనట్టు అధికారులు చెప్పారు. ప్రాససింగ్‌ కేంద్రాల్లో వర్కర్స్‌ పాసుల జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లతో మాట్లాడుతున్నామని  ఫిషరీస్‌ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వారినుంచి వచ్చే సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారంకోసం పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలని సీఎం ఆదేశం. కోవిడ్‌ –19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ.. ఆమేరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చూడాలన్న సీఎం. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6గంటల నుంచి 11 గంటలవరకూ, మిగిలిన ప్రాంతాల్లో 6 గంటలనుంచి 1 గంటవరకూ సమయం పాటించాలని ముఖ్యమంత్రో సూచించారు.