దుర్గ గుడి అసలు దొంగలెవరు?

దుర్గ గుడి అవినీతి యవ్వారం బెజవాడ రాజకీయాల్లో కాక రేపుతోంది. దేవాలయాల ప్రక్షాళణే ప్రభుత్వ లక్షమని మంత్రి వెల్లంపల్లి అంటున్నారు. మంత్రి వెల్లంపల్లే అసలు దొంగని టీడీపీ నేతలువిమర్శిస్తున్నారు. దుర్గ గుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి చెబుతున్నారు. మరి ఈవోను ఎందుకు రక్షిస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇలా విజయవాడ వేదికగా మంత్రి వెల్లంపల్లి, టీడీపీ నేత బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. దొంగల‌ను దాచే సంస్కృతి గత టీడీపీ ప్ర‌భుత్వానిదని.. అవినీతికి తావులేకుండాపారదర్శక పాలన జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఆల‌యాల్లో రాజ‌కీయ‌ల‌కు, అవినీతికి ఆస్కారం లేదన్నారు మంత్రి.  అటు వెల్లంపల్లిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దుర్గగుడిలో జరిగిన ఏసీబీ సోదాల్లో అసలు దొంగ వెల్లంపల్లిని వదిలేశారన్నారు. దుర్గుగుడిలో మాయమైన చీరలు వెల్లంపల్లి ఇంటిలో, ఆయన దుకాణంలో ఉంటాయన్నారు.  దేవాలయంలోని స్టోర్‌లోని సరుకులు కూడా శ్రీనివాస్ ఇంటికే చేరుతాయని ఆరోపించారు. వెల్లంపల్లిని తక్షణమే అరెస్ట్ చేసి, విచారిస్తే దేవాలయాల సాక్షిగా ఆయన సాగిస్తున్న దోపిడీ బయటపడుతుందని తెలిపారు. దేవుడి సొమ్ము రూపాయి కూడా తినలేదని దుర్గమ్మ సన్నిధిలో తన బిడ్డలపై ప్రమాణం చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పగలడా? అని సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యత వహించి వెల్లంపల్లి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీని ఓడించి అమరావతి రాజధాని ఇక్కడే అని చాటి చెప్పాలన్నారు బుద్దా వెంకన్న.   

మావోయిస్టుల దగ్గర డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లు! తెలంగాణలో పంజా విసరబోతున్నారా?

తెలంగాణలో మావోయిస్టులు బలోపేతం అయ్యారా? పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారా? రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారా ? అంటే కొన్నిరోజులుగా ఏజెన్సీలో వెలుగుచూస్తున్న ఘటనలతో నిజమనే సమాధానమే వస్తోంది. తాజాగా ములుగు జిల్లాలో బయటపడిన మావోయిస్టుల డంప్ తో పోలీసు శాఖ కలవరపడుతోంది. ఖాళీ బీరు బాటిళ్లు..వెదురు బొంగులతో మావోయిస్టులు బాంబులు తయారు చేస్తున్నట్లు బహిర్గతమైంది. డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లను మావోయిస్టులు తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఐఈడీలను రూపొందిస్తున్నట్లు అక్కడ దొరికిన వస్తువులను బట్టి తెలుస్తోంది. ఖర్చు తక్కువ, మన్నిక ఎక్కువ కావడంతో ఖాళీ బీరు బాటిళ్లు.. వెదురు బొంగులతో మైన్లను తయారు చేస్తున్నారని ములుగు పోలీసులు అంచనాకు వచ్చారు. నిఘా పెరగడంతో పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారడంతో.. అడవిలో  లభించే వస్తువులతోనే బాంబులు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.   ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో భద్రతా దళాలే లక్ష్యంగా కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా ల్యాండ్‌ మైన్‌లను పాతుతున్న మిలీషియా కమాండర్‌, డిప్యూటీ కమాండర్‌ సహా.. ఏడుగురిని  పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లవిచారణలో ఈ కీలక విషయాలు తెలిశాయంటున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో మిలీషియా కమాండర్‌ ఉండుం పాండు, డిప్యూటీ కమాండర్‌ ముచ్చిక భీమయ్య, మిలీషియా సభ్యులు సోడి లక్ష్మయ్య, మాడవి అడమయ్య, మాడవి భుద్ర, మాడవి ఐతయ్య, మాడవి కోసగా గుర్తించారు. వీరంతా జెల్ల, పామునూరు, చెలిమల గ్రామాలకు చెందినవారు. దర్యాప్తులో వీరంతా.. తాము మావోయిస్టు అగ్రనేతలు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఆదేశాలతో బాంబులను అమరుస్తున్నట్లు అంగీకరించారు. పట్టుబడిన మిలీషియా టీమ్ నుంచి తొమ్మిది ల్యాండ్‌మైన్స్‌, 80 మీటర్ల కార్డెక్స్‌ వైర్‌, 50 డిటోనేటర్లు, వాకీటాకీ, వెదురు బొంగుతో పేల్చే డైరెక్షనల్‌ మైన్‌, నాలుగు బాణాలు, 8 విల్లులు, కరెంటు వైర్‌,బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ తెలిపారు. బీరు బాటిళ్లు, వెదురు బొంగులతో తయారు చేసిన బాంబులతో కూడా విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నారనే విషయం మిలీషియా సభ్యుల విచారణలో వెల్లడైందని వివరించారు. సాధారణ ల్యాండ్‌ మైన్‌ 3 నుంచి 4 కిలోల బరువు ఉంటే.. బొంగులతో తయారు చేసేవాటి బరువు చాలా తక్కువ. అడవుల్లో ఒకచోటి నుంచి మరో చోటికి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. డైరెక్షనల్‌ మైన్స్‌కూడా ఎక్కువ బరువు ఉంటాయి. వాటి స్థానంలో వెదురుతో తయారు చేసినవి బరువు తక్కువగా.. తయారు చేయడం సులభంగా ఉంటుంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. చర్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిని  ఇంద్రావతి దళ సభ్యురాలు పద్దం మున్ని అలియాస్‌ అలియాస్‌ నిర్మల, మావోయిస్టు కొరియర్‌ జర్సుల బన్సీగా గుర్తించారు. గతంలో తెలంగాణ మావోయిస్టులకు కేంద్రంగా ఉండేది, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలో మావోయిస్టులకు పట్టు ఉండేది. అప్పట్లో ఏజెన్సీ గ్రామాలన్ని భయం నీడలో ఉండేవి.మావోయిస్టుల సంచారం, పోలీసుల కూంబింగ్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపించేంది. ఎన్ కౌంటర్లు భారీగా జరిగేవి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత మావోయిస్టు కదలికలు పెద్దగా లేవు. అయితే గడిచిన ఏడాది కాలంగా తిరిగి మావోయిస్టులు తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అరాచక పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు ఎక్కువయ్యాయనే విమర్సలు వస్తున్నాయి. దొరలు,భూస్వాములు మళ్లీ గ్రామాల్లోకి చేరి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. పెదపల్లి జిల్లాలో ఇటీవలే జరిగిన న్యాయవాద దంపతుల హత్య కలకలం స్పష్టించింది. ప్రశ్నించే వారే టార్గెట్ అవుతున్నారు.  తెలంగాణలో జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లోనూ అసహనం కన్పిస్తోంది. దీన్నే అస్త్రంగా చేసుకుని మళ్లీ బలోపేతం కావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కొంత కాలంగా భారీగా రిక్రూట్ మెంట్ జరిగిందనే సమాచారం వస్తోంది. మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉండటం వల్లే ఏజెన్సీలో పోలీసుల మోహరింపు పెరిగిందంటున్నారు. గత ఏడాది డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా అదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాదు మావోయిస్టుల కదలికలపై కేంద్రం హెచ్చరికలతో ఛత్తీస్ గడ్, తెలంగాణ , సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. మొత్తంగా మావోయిస్టుల కదలికలు పెరగడంతో తెలంగాణలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది. 

సర్పంచ్ గా గెలిచాడు.. ఆ విషయం తెలియకుండానే మరణించాడు..

అతను ఎన్నికల్లో గెలిచాడు, అదే రోజు జీవితంలో ఓడిపోయాడు. సర్పంచ్ గా గెలిచావు రామావతారం అనే వార్త ఆయన చెవిన పడకముందే ఆయన ఆశయాన్ని గెలిపించిన ఓటర్ల బలాన్ని విడిచివెళ్ళింది ఆయన ప్రాణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం సర్పంచ్‌గా గెలుపొందిన నేడు ఆకస్మికంగా మృతి చెందారు. పోలింగ్ ముందు రోజే బ్రైన్ స్ట్రోక్‌తో రామావతరం ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల్లో 56 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. గెలుపొందిన విషయం కూడా తెలియకుండానే ఆయన  మృతి చెందడం విషాదకరం. జనసేన మద్దతుతో ఆయన సర్పంచ్‌గా విజయం సాధించారు.  

కిడ్నాప్ డ్రామా స్టూడెంట్ సూసైడ్.. కట్టుకథే చంపేసింది!

కీసరలో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్. యువతిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్లు. గ్యాంగ్ రేప్ చేసి.. పోలీసులు రావడంతో పొదల్లో వదిలేసి పారిపోయారు. ఇదీ పది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన కేసు. కట్ చేస్తే ఆ మార్నాడు మరో వర్షన్. గ్యాంగ్ రేప్ కాదు, ఆ యువతే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పొదల్లోకి వెళ్లింది. గంజాయి తాగి వారితో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. పోలీసులను చూసి భయపడి కిడ్నాప్ డ్రామా ఆడింది. ఇలా ఇంకో ప్రచారం. ఈ రెండూ నిజాలు కావు. పోలీసుల విచారణలో మూడూ రోజుల తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. ఇంటి నుంచి పారిపోయేందుకు ఆ యువతి ఆడిన డ్రామా అదని పోలీసులు తేల్చారు. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ కేసుపై విపరీత ప్రచారం జరగడంతో పరువు పోయిందని భావించిన ఆ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్ ఘటన మరింత కలకలంగా మారింది. 19 ఏళ్ల తెలిసీ తెలియని వయసు. అబద్దాలు చెప్పడం ఆమె హాబీ. కిడ్నాప్ కథలంటే ఎంతో ఇష్టం. చంచల మనస్తత్వం. ఏ సమస్య వచ్చిందో ఏమో గానీ.. ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకుంది. అదే పని చేసింది. అంతలోనే తల్లి నుంచి పదే పదే ఫోన్లు రావడంతో.. డ్యామిట్, ఆమె కథ అడ్డం తిరిగింది. అది ఆత్మహత్యకు దారి తీసింది. కిడ్నాప్‌ నాటకం.. నలుగురు ఆటో డ్రైవర్లు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని పోలీసులకు చెప్పిందంతా కట్టుకథ అని ఆ తర్వాత తేలింది. తొలుత బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సామూహిక అత్యాచారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించాక అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చారు. తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు బృందం సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేసింది. కిడ్నాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్‌ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా పోలీసులు నిర్ధారించారు. అప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ ను మరోసారి ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్‌ఎల్‌నగర్‌లో దిగలేదని, వేరే స్టాప్‌లో దిగిందని అతను చెప్పాడు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్‌స్టాప్‌ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు పోలీసులు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్య సమయంలో వివిధ ప్రాంతాల్లో ఆమె ఒంటరిగానే తిరిగినట్టు గుర్తించారు. పోలీసులు ఆధారాలతో సహా ఆ యువతిని ప్రశ్నించడంతో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనపై అత్యాచారం జరగలేదనే నిజం ఒప్పేసుకుంది. తాను ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకున్నానని.. అంతలోనే అమ్మ నుంచి ఫోన్ రావడంతో అలా అబద్దం చెప్పానని అంగీకరించింది. ఆటో డ్రైవర్ల మీద కోపంతో వారిని ఇరికించే ప్రయత్నం చేశానని చెప్పిందా యువతి.   ఈ కట్టుకథ.. ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసేలా చేసింది. ఈ విషయం విస్తృతంగా ప్రచారం జరగడం.. కొన్ని రోజుల పాటూ అంతా దీని గురించే చర్చించుకోవడంతో ఆమె పరువు పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఫార్మసీ విద్యార్థిని బుధవారం ఉదయం నిద్ర మాత్రంలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఘట్ కేసర్ ఆసుప్రతికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కిడ్నాప్ ఘటన ఎంత సంచలనంగా మారిందో.. యువతి చనిపోవడమూ అంతే కలకలం స్పష్టిస్తోంది. తెలిసీ తెలియక ఆమె ఆడిన అబద్దం.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

జగన్ కు అమరావతిపై సడెన్ లవ్వు అందుకేనా..

ఏపీలో అధికారం చేపట్టిన తరువాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని భుజాన వేసుకుంది. రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ స్మశానం అని కొందరు, ఎడారి అని మరికొందరు వైసిపి నేతలు నిందిస్తూ దాడి చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో తనకున్న రోడ్ రోలర్ మెజారిటీని అడ్డుపెట్టుకుని మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ పాస్ చేయించుకుంది. అయితే ఈ వ్యవహారంపై అమరావతి రైతులు హైకోర్టు తలుపు తట్టడంతో ప్రస్తుతానికి విశాఖకు రాజధాని మార్పుకు బ్రేక్ పడింది.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలపై హడావిడి మొదలెట్టేశారు. అక్కడ నిర్మాణాలు నిలిచిపోయిన విషయం ఇపుడే తమ దృష్టికి వచ్చిందన్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. వాటిని పూర్తి చేయడానికి నిధులు అవసరం కాబట్టి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వమే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆ భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం జరిగే నిర్మాణ పనులతో సందడిగా ఉండే అమరావతి ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యం అయింది ఈ దశలో నిర్మాణ పనులు ఆపివేస్తే వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా ఇన్నాళ్లు పట్టించుకున్న పాపం పోలేదు అయితే సడెన్ గా అక్కడి నిర్మాణాలు పూర్తి చేయాలనుకుంటున్నామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. జగన్ ప్రభుత్వం తాజా ప్రకటనపై ఇటు రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. నిధులు సమీకరించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మే పరిష్టితిలో లేరు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరేకారణం. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టని సర్కార్ ఇంత హఠాత్తుగా హడావిడి చేయడం చూసిన జనం.. ఈ హడావిడి వచ్చే నెల 10 వరకు మాత్రమే అంటున్నారు. దీనికి కారణం అమరావతిని అనుకుని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీలలో మార్చి 10 న ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గెలిచేందుకే.. అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నామన్న ఫీలర్ జనంలోకి పంపించడానికే ఈ ప్రకటనలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఎన్నికలు పూర్తయేవరకు ఈ హడావుడి ఉంటుందని ఆ తర్వాత మళ్లీ.. జగన్ అమరావతి ఊసే ఎత్తరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క రాష్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. దీంతో అంత మొత్తం అప్పు ఎవరు ఇస్తారన్నది పెద్ద సందేహంగా మారింది. అంతేకాకుండా రుణాలివ్వడానికి బ్యాంకులేవీ సుముఖంగా లేవు. అంతేగాకుండా ప్రభుత్వం ఇప్పటికే ఇటువంటి ప్రకటనలు పలుమార్లు చేసింది. కొన్ని కమిటీలు వేసి.. ఈ భవనాలను ఎలా వాడుకోవాలనే పరిశీన కూడా జరిపారు. చివరికి వీటిని పూర్తీ చేసి అమ్ముకుందామని కూడా ఆలోచన చేశారు. మరోపక్క ఇప్పటికిప్పుడు ఇక్కడ నిర్మాణాలు పూర్తీ చేయాలంటే పాత కాంట్రాక్టర్లకు దాదాపు ఆరు వందల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటికి ముందుగా ఫండ్స్ సర్దుబాటు చేయాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీసం ప్రయత్నాలు చేసినట్లుగా లేదు .జగన్ సర్కార్ అమరావతిని ఒక నిరర్థక ఆస్తిగానే జమ కడుతోందని ప్రజలు ఇప్పటికి నమ్ముతున్నారు. దీంతో తాజాగా జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజలను మభ్యపెట్టే రాజకీయమేనని.. అక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ఉద్దేశ్యం ఎంతమాత్రం ప్రభుత్వానికి లేదని ప్రజలు నమ్ముతున్నారు.

చుండూరు చరిత్రే చెప్పుతో దాడికి కారణమా?

బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డిపై చెప్పుతో దాడి. అది కూడా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ లో. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది లైవ్ లో చూస్తుండగా జరిగిన ఈ దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టింది ఏ మామూలు వ్యక్తో కాదు. అమరావతి జేఏసీ కన్వీనర్. ప్రొఫెసర్ కొలికిపూడి శ్రీనివాసరావు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పాఠాలు చెప్పే మేథావి. జేఏసీ కన్వీనర్, విద్యావంతుడైన శ్రీనివాసరావు అంత సడెన్ గా ఎందుకిలా ప్రవర్తించాడనేది ఆసక్తికరం.  అప్పటి వరకూ డిబేట్ సాఫీగానే సాగింది. ఒక్కసారిగా మాటలు దాడి మొదలైంది. అమరావతి జేఏసీ కన్వీనర్ ను పెయిడ్ అర్టిస్ట్ అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు.. టీడీపీ ఆఫీసులో పని చేసుకో అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు... కాలి చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి ముఖంపై కొట్టారు. వెంటనే చర్చకు బ్రేక్ పడింది.  అంతటితో ఆగలేదు శ్రీనివాసరావు ఆగ్రహం. బ్రేక్ టైమ్ లో మరోసారి దాడి చేశారని అక్కడి వారు చెబుతున్నారు. మళ్లీ చెప్పు తీసుకొని విష్ణవర్థన్ రెడ్డిని చెడామడా బాదేశారట. లైవ్ లో ఎడమ కాలి చెప్పుతో కొడితే.. బ్రేక్ సమయంలో కుడి కాలి చెప్పు తీసి.. కసి తీరా కొట్టారట. ఛానల్ సిబ్బంది వచ్చి శ్రీనివాసరావును ఆపే ప్రయత్నం చేసినా ఆయనలో ఆగ్రహం అంత తొందరగా శాంతించలేదట. అమరావతి జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ అయిన కొలికిపూడి శ్రీనివాసరావులో అంతటి ఆగ్రహం, ఆక్రోశం అంతకు ముందెప్పుడూ కనిపించలేదు. అనేక సార్లు టీవీ చర్చల్లో పాల్గొన్న ఆయన తన వాగ్ధాటితో, సబ్జెక్ట్ తో అందరినీ మెప్పించారే కానీ, ఇప్పటిలా ఇంతకు ముందెప్పుడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. ఆయన ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, వివాదరహితుడు. అలాంటి శ్రీనివాసరావు అంతలా రెచ్చిపోవడానికి కారణమేంటనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఆసక్తికర మూలాల్లోకి దారి తీస్తోంది.  కొలికిపూడి శ్రీనివాసరావు దళితుడు. ఆయనది గుంటూరు జిల్లా చుండూరు గ్రామం. ఇప్పటి కోపానికి అప్పటి దారుణానికి సంబంధం ఉందని కొందరు అంటున్నారు. 1991లో చుండూరులో జరిగిన మారణకాండ ఆ గ్రామవాసుల గుండెల్లో ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఆ మానని గాయం ఇలా అగ్నిపర్వతంలా బద్దలైందని అంటున్నారు. ఆనాడు చుండూరులో జరిగిన ఘటనను మరోసారి గుర్తు చేస్తున్నారు.  1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు (రెడ్లు) దళితవాడపై దాడి చేశారు. వేట కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలతో దళితులను దారుణంగా చంపేశారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలో చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగా సంచిలో కుక్కి కాలువలో పడేశారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడేశారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది. 16 ఏళ్ల తర్వాత 2007లో ప్రత్యేక కోర్టు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులు హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లగా 21మంది నిందితులకు విధించిన శిక్షను రద్దు చేసింది హైకోర్టు. ఇలా చుండూరు ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాయని మచ్చు.  ఆ చుండూరు బిడ్డే ఈ కొలికిపూడి శ్రీనివాసరావు. ఆనాటి దారుణం ఆ గ్రామవాసుల మాదిరే ఆయనలోనూ నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుందని అంటున్నారు. అందుకే ఆయనలో కట్టలు తెగిన ఆగ్రహం కనిపించిందని చెబుతున్నారు. ఒకనాడు ఏ అగ్రవర్ణాల చేతిలోనైతే తమ వారు బలయ్యారో.. ఆ వర్గం నేత మరోసారి తనపై మాటల దాడి చేస్తుండటాన్ని శ్రీనివాసరావు సహించలేకపోయాడు. క్షణికావేశానికి లోనై.. లైవ్ షో లో విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశారని ఆ వర్గం వారి మాట. అసలు కారణం ఏదైనా.. నేటి శ్రీనివాసరావు దాడితో ఆనాటి చుండూరు ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ లో తెగ చర్చ జరుగుతోంది.

అనంతలో వైసీపీ దుశ్శాసన పర్వం!

పంచాయితీ ఎన్నికలు ముగిసిన ఆగని వైసీపీ నేతల దాడులు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన దుశ్యాషణుడ్ని తలపించేలా చేసింది.  బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులతో ఆగక మహిళలపై  కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో పద్మ  మొన్నటి పంచాయతీ పోరులో తాను రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరుడు విజయం సాధించాడని.. ఆ విజయోత్సవాన్ని తన ఇంటి వద్ద జరిపారని చెప్పింది. పెద్ద ఎత్తున టపాసులు కాల్చగా ఆ శబ్దానికి తమ గొర్రెలు భయపడటంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశానని, దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు తన ఇంటిపై రాళ్లతో దాడి చేశారని,  విచక్షణారహితంగా దుర్భాషలాడారని వాపోయింది. అంతటితో ఆగకుండా చీర లాగి జాకెట్ చించారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తుంగోడు, కోనతొట్టి పల్లి గ్రామనికి చెందిన దాదాపు 200మంది.. మాజీ సర్పంచి నారాయణరెడ్డి, వాలంటీర్ ప్రతాపరెడ్డి, బాబు, మధుసూదన్ రెడ్డి తదితరులపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘం దండు వీరయ్య వర్గం జిల్లా కార్యదర్శి జీకే ప్రకాష్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో సంబరాలు చేసుకోవడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దళితులపై సర్పంచ్ అభ్యర్థులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గెలిచిన అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ప్రజలకు న్యాయం చేయవలసింది పోయే ఈ దాడులు చేయడం దారుణమన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   

మీ బరువు అమాంతం తగ్గాలంటే...

ఊబకాయం ప్రపంచంలో కరోనా తరువాత అత్యంత ప్రమాదకరమైనది అని నిపుణులు తేల్చారు. అయితే ఇప్పటి వరకు మీ శరీరానికి లైపో సక్షన్, నాన్ లైపో సక్షన్, బెరియా ట్రిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్విజివ్, పద్దతిలో సర్జరీలు చేస్కో నక్కరలేదని బరువుతగ్గడం కోసం టీలు, న్యుట్రీషియస్ డైట్ తో బరువుతగ్గడం వల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్ కు చెక్ చెప్పవచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఈ మేరకు యు సి ఎల్ కు చెందిన ఒబేసిటీ ఎండోక్రోనాలజీ సెంటర్ కి చెండిన ప్రొఫెసర్ బట్టర్ హం పరిశోదనా బృందానికి నాయకత్వం వహించారు. యు సి ఎల్ పరిశోదన తరువాత యు సి ఎల్ వెయిట్ మేనేజ్మెంట్ పై   2000 మంది పై 16 దేశాలలో ట్రైల్స్  నిర్వహించారు. దేశంలో 1/3 వంతు అంటే 35% ప్రజలు తీసుకున్న కొత్త మందు 20% బరువును తగ్గించింది. అని బట్టర్ హాం స్పష్టం చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన  న్యు ఇంగ్లాండ్ జనరల్ ప్రచురించింది. వైద్య శాస్త్రజ్ఞ్యులు చేసిన ఈ పరిశోదనకుగాను ప్రజల ప్రశంశలు అందుకున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారికీ  ఈ పిల్ ఒక వరమనే చెప్పాలి. ప్రొఫ్ బట్టర్ హం మాట్లాడుతూ ఒబేసిటీతో బాధపడుతున్నవారి జీవితంలో మార్పు తెచ్చిందని అనడంలో ఆతిశయోక్తి లేదని బట్టర్ హం అభిప్రాయపడ్డారు. SEMAAGLUTIDE తీసుకున్న 75% మంది 2.4 ఎం జి  తీసుకున్నారని 10% బరువు తగ్గారని మరే ఇతర మందు బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషించిన దాఖలాలు లేవని బట్టర్ హం తెలిపారు. ఇది నిజంగా ఊబకాయానికి వరదాయని వంటిదని అన్నారు. మొట్ట మొదటి సారిగా  ఊబకాయాన్ని మందుల ద్వారా తగ్గించగలిగామన్నారు. అయితే ఇప్పటివరకు బరువు తగ్గడానికి సర్జరీ ఒక్కటే మార్గమంటూ చేసిన ప్రకటనకు చెక్ పెట్టినటే అని బట్టర్ హం అభిప్రాయ పడ్డారు. ఊబకాయం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు ఇప్పటివరకు . కోవిడ్ 19పై మాత్రమే దృష్టి పెట్టామని వైరస్ తో పాటు ఊబకాయం కూడా మరణానికి కారణమే అని బట్టర్ హం  స్పష్టం చేసారు. దీనికి తోడు డయాబెటిస్, గుండె సమస్యలు, లివర్ సమస్యలు క్యాన్సర్ లు కూడా మందు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ అంశాన్ని యు కే  ఆరోగ్య విధానంలో చేర్చామన్నారు. ఒబే సిటీ పై నిర్వహించిన ట్రయిల్  లో 15.3% కేజీలు తగ్గారని ఇది కొంత మేర రిస్క్ తగ్గిస్తుందని అన్నారు. ఈ పరిశోధనలో  APPTETIKTE REGULATING విధానం వల్ల మెదడులో ఆహరం తినాలన్న కోరికను తగ్గిస్తుందని హార్డ్ డిసీజ్, డయాబెటిస్, రక్తంలో కొవ్వు రక్తంలో చక్కెర శాతాన్ని, రక్తపోటు వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని బట్టర్ హం వివరించారు.                                                                                           యునివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ కు చెందిన ఇన్వెస్టి గేటర్ ప్రొఫ్ జాన్ విల్డింగ్ మాట్లాడుతూ ఊబకాయానికి అత్యంత అధునాతన చికిత్స అందించిందని అన్నారు. ఊబకాయానికి చేసే చికిత్సకు అనుమతిస్తూనే SEMAAGLUTIDE డయాబేటిస్ కు ఈ మందు తక్కువ మోతాదులో వాడుతున్నారని అన్నారు. డాక్టర్లకు ఇప్పటికే ఈమందు ఎలా వినియోగించాలో తెలుసునని. 1990 లోనే హమ్ము స్మిత్ ఆసుపత్రిలో జి ఎల్ పి1  కింద ల్యాబొరేటరీ లో  పరీక్షించామన్నారు. అప్పుడే దీనిని ఒబే సిటీ రోగులకు అత్యంత ప్రభావంతంగా పని చేస్తుందని  గుర్తించినట్లు చెప్పారు. ఈ పిల్ ద్వారా సేమా గ్లుటైడ్ ను రెగ్యులేటరీ ఊబకాయానికి అనుమతించించాలని కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్  ఎక్స్ లెన్స్ యురోపియన్ మెడికల్ ఏజెన్సీ యు ఎస్ ఎ కు చెందిన ఎఫ్ డి ఎ అనుమతించింది . దీనితో ఈ మందుకు అధిక ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. మూడవ విడత ట్రైల్స్ల్స్ లో 1961 మంది  వ్యక్తుల పై 1 ౦ 5 కేజీలు  ఉన్నవారికి ఇన్సులిన్ వాడుతున్న వారికీ 9 4.3% మంది ట్రైల్స్ల్స్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. 6 8 వారాలపాటు సాగిన పరిశోదన 2018 నాటికీ ముగిసిందని అన్నారు. ట్రైల్స్ లో పాల్గొన్న వారికీ ఫోన్ కౌన్సిలింగ్  లేదా డైటిషియన్స్ నాలుగు వారాల ఒకసారి క్యాలరీలు తగ్గించేందుకు ప్రయత్నం చేసారని శరీర వ్యాయామం పై దిశ నిర్దేశం చేసారు. దీనివల్ల దాదాపు 1 5 . 3 % బరువు గణనీయంగా తగ్గగలిగారని SEMAA GLUTIDE కు క్లినికల్ గా అనుమంతి లభించిందని అన్నారు. మొదటి రెండవ దశల్లో బాగా పనిచేసిందని మూడవ దశలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు.  సేమా గ్లుటైడ్ చికిత్సతో ఒబెసిటీ తగ్గించవచ్చు.  నోసర్జరీ నో సైడ్ ఎఫెక్ట్స్ సక్షన్, జస్ట్ ఒక్క పిల్ అంతే మీ బరువు అమాంతం తగ్గుతారు అంటున్నారు శాస్త్రజ్ఞులు.

బీజేపీ రథసారధులు వీరే ..

ఏపీ మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీ స్పీడ్ పెంచింది. కమలం కనుసన్నల్లో రాష్ట్రాన్ని నడిపేందుకు కరసేవకులు సిద్ధమవుతున్నారు. అందుకు ఏపీ బీజేపీ సర్వం సిద్ధం చేస్తుంది. మున్సిపల్ , పరిషత్ ఎన్నికలను  గెలుపును  దృష్టిలో పెట్టుకుని. రాష్ట్రములో 13 జిల్లాలకు 13 రామ బాణాలను వదిలింది. జిల్లాల వారీగా ఇంచార్జీల నియమిస్తూ వారికి బాధ్యత అప్పగించారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.  ఉత్తరాంధ్ర బాధ్యతలను జీవీఎల్‌ నరసింహరావు, కె.హరిబాబు, మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథ రాజులకు అప్పగించారు. గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ.. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌బాబు.. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్‌, పార్థసారథి, వరదాపురం సూరిలను నియమించారు. చూడాలి మరి సోమా వీర్రాజు 13 జిల్లాల ఇంచార్జీల పంచతంత్రం ఏమవుతుందో. జగన్నాటకం లో బీజేపీ జెండా ఎగురుతుందో, ఎండకట్టుకుపోతుందో, అంత కరసేవకుల పనితీరు మీదనే ఆధారపడి ఉంది.   

టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ  భయం! 

శాసన మండలి ఎన్నికల్లో  ముఖ్యంగా విద్యావంతులు, ఉపాధ్యాయులు ఓట్లుగా ఉండే పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో గతంలోనూ తెరాస ఓడిపోయింది.అయినా,పార్టీ నాయకత్వం అంతగా పట్టించుకోలేదు. భయపడలేదు.కానీ, ఇప్పుడు, ఓటమిని ఉహించుకునే ఆందోళనకు గురవుతున్నట్లు, నాయకుల హావభావాలు, మాటతీరు స్పష్టం చేస్తోంది. ఒక విధంగా చూస్తే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల షాక్ నుంచి పార్టీ నాయకత్వం ఇంకా తేరుకున్నట్లు లేదు. అందుకే కావచ్చు, తాడును చూసి పామనుకుని భయపడినట్లు ప్రతి చిన్నా పెద్ద విషయానికీ భయపడుతోంది.  మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం అభ్యర్ధి ఎంపిక విషయంలో చివరి నిముషం వరకు నిర్ణయం తీసుకోలేక, చివరాఖరుకు, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందాన, స్వర్గీయ పీవీ నరసింహ రావు, పలుకుబడి, ప్రతిష్టల మీద భారం వేసి అయన కుమార్తె సురభి వాణీదేవిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. పీవీ శత జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపధ్యంలో, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావించి ముఖ్యమంత్రి ఆమెకు అవకాశం ఇచ్చారో లేక ‘గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్లుగా ఎటూ ఓడిపోయే సీటే కదా అని ఇచ్చారో ఏమో గానీ, ఆదిలోనే హంసపాదుఅన్నట్లుగా ఆమె నామినేషన్’ఘట్టంలోనే, కథ అడ్డం తిరగింది.నామినేషన్ పత్రంలో తప్పులు దొర్లిన కారణంగా, రిటర్నింగ్ అధికారులు ఆమెను వెనక్కి పంపారు. చివరకు నామినేషన్ చివరి రోజున ఆమె నామినేషన్ దాఖలు చేశారు.అయినా, ప్రతి దానికి  ముహూర్తాలు, మంచీ చెడులు, చూసుకోవడానికి అలవాటుపడిన పార్టీ పెద్దలు కొందరు ఇదేదో  అపశకునం అని కలత చెందుతున్నారు. పత్రాలు సక్రమంగా లేక ఆమె నామినేషన్ దాఖలు చేయలేక పోవడంతో సోషల్ మీడియాలో వ్యంగ వ్యాఖ్యలు బాగా ట్రోల్ అవుతున్నాయి. బహుభాషా కోవిదుడు,మహా మేథావి పీవీగారి కుమార్తె స్వయంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మంచి విద్యావంతురాలు. పైగా చదువుల తల్లి పేరుపెట్టుకున్న ఆమె, నామినేషన్ పత్రాలను సక్రమంగా నింపలేక పోవడం  ఏమిటని విమర్శలు వినవస్తున్నాయి.  అలాగే  ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజనక వర్గం అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి  నామినేషన్ సందర్భంగానూ అపశ్రుతి చోటు చేసుకుంది.  నామినేషన్ సందర్భంగా నల్లగొండ పట్టణం చేసిన భారీగా కటౌట్లు, జండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.ఇందుకు సంబందించి బిజెపి నాయకులు పిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ హామీ ఇచ్చారు.అలాగే  ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన విషయాన్ని, కేంద్ర ఎన్నికల సంఘానికి  రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి ఫ్లెక్సీల తొలగించారు. సెంటిమెంట్’కు పెద్దపెట్ట వేసే పల్లా ... ఇతర పెద్దలు ఇది కూడా అపశకునంగానే భావిస్తున్నారు. చివరకు ఫలితాలు ఎలా వస్తాయో ... ఏమో గానీ, అధికార పార్టీలో వెనకటి ధీమా, ధైర్యం అంతగా కన్పించడం లేదు.  ప్రత్యర్దులే తెరాస ప్రధాన బలం మంది ఎక్కువైతే  మజ్జిగపలచ బడుతుంది...ఎన్నికలబరిలో పోటీ చేసే ప్రత్యర్ధుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అధికార పార్టీ విజయావకాశాలు అంతగా మెరుగు పడతాయి. ఇప్పడు నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి అధికార తెరాస అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు.సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు అధికార పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. మంత్రి జగదీశ్వర రెడ్డి గెలుపు బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలనే వ్యూహంతో చిన్నా పెద్ద తేడాలేకుండా, స్వతంత్ర అభ్యర్ధులు సహా ప్రత్యర్ధులు వేసే ప్రతి అడుగును గమనించి వ్యూహ ప్రతివ్యూహాలు అల్లుతూ ముందుకు సాగుతున్నారు.అయితే,ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికే, అరడజను మంది వరకు ప్రత్యర్ధులు బరిలో దిగడం అధికార పార్టీకి అడ్వాంటేజ్ పాయింట్’గా అందరూ భావిస్తున్నారు. అలాగే, టూ మెనీ కూక్స్ స్పాయిల్’ ది డిష్’ అన్నట్లుగా పెద్ద సంఖ్యలో బరిలో దిగిన అభ్యర్ధులు,తమ ఓటమిని తామే కొనితెచ్చుకుంటారనే మాట వినవస్తోంది.  ఈ ఎన్నికలలో గత ఎన్నికలలో రెండవ స్థానంలో ఉన్న బీజేపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి,గతంలో హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి పీవీ నరసింహ రావును ఓడించిన సీనియర్ బీజేపీ నాయకుడు జగ్గారెడ్డి కుమారుడు ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్సీ, రాముల్ నాయక్, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా జయసారధి రెడ్డి, తెలంగాణ జనసమితి అభ్యర్ధిగా ఆపార్టీ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధిగా ఆ పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమలతో పాటుగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శంకర్ గౌడ్, జగమెరిగిన తెరాస ఆగర్భ శత్రువు తీన్మార్ మల్లన్న స్వంతంత్ర అభ్యర్ధులుగాపోటీ చేస్తున్నారు. ఇందులో ఒక కాంగ్రెస్ మినహా మిగిలిన వారంతా గత ఐదారు నెలలుగా, క్షేత్ర స్థాయిలో తిరిగి, ఇటు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని, అటు ప్రచారాన్ని సమాంతరంగా సాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారంలో కాసింత వెనక బడింది. అయితే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర నాయకులు దూకుడు పెంచి ప్రచారం సాగిస్తున్నారు. ఇక అధికార పార్టీ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. అలాగే, బీజేపీ కూడా, ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఒక ఇంచార్జిని నియమించి ప్రచారం సాగిస్తోంది. అలాగే, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్  ఇప్పటికే రండు మూడు పర్యాయాలు మూడు జిల్లాలలో పర్యటించారు. అలాగే,  రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులు రంగంలోకి దిగుతున్నారు.అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం అధికార పార్టీకి ప్రధాన అడ్వాన్టేజ్’ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.      అయితే 2015 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం జిల్లాల్లో గతంలో 2 లక్షల 81 వేల138 మంది ఓటర్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 4 లక్షల 92 వేల 943కు పెరిగింది. ఇది కొంత వరకు ప్రతిపక్షాల చెవులకు ఇంపుగా వినిపించే మాటే అయినా కొత్త ఓటర్లు ఎటు మొగ్గుచుపుతారు అనే ప్రశ్న ..  అలాగే ఉంది.

అక్కడ హస్తం.. ఇక్కడ కమలం స్వీప్ 

ఉద్యమాలు జరుగుతుంటాయి,ఎన్నికలు వచ్చి పోతుంటాయి,దేని దారి దానిదే.ఒకదానికొకటి సమాంతరంగా సాగిపోతుంటాయి. మొన్నటి పంజాబ్,నిన్నటి గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అదే చెపుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగతున్న సమయంలోనే పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. పంజాబ్’లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరేసింది. విజయ దుందుభి మోగించింది. ఏడింట ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను హస్తం పార్టీ ఎగరేసుకు పోయింది. ఏడవ కార్పొరేషన్’లో సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపేకి ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ దక్కకలేదు.మరోవంక  ఒక్క  ‘మోగా’ మున్సిపల్ కార్పొరేషన్ మినహా, మిగిలిన అన్ని కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. చివరకు, 53 ఏళ్లలో ఎప్పుడు గెలవని ‘బటాల’ మున్సిపల్ కార్పొరేషన్’లోనూ జనం హస్తానికి జై కొట్టారు. 53 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం సొంతం చేసుకుంది. ఈ ఘన విజయం,రైతుల ఆందోళన పుణ్యమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అలాగే, బీజేపీ వ్యతిరేకత విషయంలో కొంచెం అధిక ఉత్సాహాన్ని చూపే వామపక్ష పార్టీలు, మేథావులు, మహా మేథావులు అంతం కాదిది ఆరంభం మాత్రమే, ఇక బీజేపీ కథ ముగిసినట్లేనని సంబురాలు చేసుకున్నారు.  అయితే నిండా నెల రోజులు తిరగకుండానే, గుజరాత్’లో ఇంచుమించుగా అదే సంఖ్యలో, అదే మున్సిపల్ కార్పొరేషన్’కు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ, శేషం అనేది లేకుండా, సంపూర్ణంగా మొత్తం ఆరు కార్పొరేషన్లను, శుభ్రంగా స్వీప్ చేసింది. అంతేకాదు, పంజాబ్’లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించిందో, గుజరాత్’లో కమలం అంతకంటే ఘనంగానే విరబూసింది. వడోదరాలో 76 కు 69, రాజ్కోట్లో  72 కు 68, జామ్ నగర్లో  64 కు 50, భావనగర్’లో  52 కు 44 గెలుచుకుంది. సూరత్’, అహ్మదాబాద్’లో కూడా కమల దళం మూడింట రెండు వంతుల మెజారిటీ గీత దాటేసింది. నిజానికి, బీజేపీ ఈ ఆరు కార్పొరేషన్లలో దశాబ్దానికి పైగా పాతుకు పోయింది. కొత్తగా గెలిచింది ఏదీ లేదు. అయితే, మొత్తం కార్పొరేషన్ స్థానాల్లో 80 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవడం విశేషం. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఆరు ప్రధాన నగరాల్లోనూ అడ్రస్ గల్లంతైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు అనుకున్న అహ్మదాబాద్ లోని జమల్పూర్, మక్తంపూర్ వార్డులు సహా మొత్తం 7 వార్డులో ఎంఐఎం విజయం సాధించి, గుజరాత్’లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే, గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ఆద్మీ పార్టీ సూరత్’లో అనూహ్యంగా 27 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్’ ను తుడిచేసింది.   సో ... ఈ ఫలితాలను కొంచెం లోతుగా విశ్లేషించుకుంటే, ఎన్నికల ఫలితాలను ఉద్యమాలు కొంత వరకు ప్రభావితం చేస్తే చేస్తాయి, కానీ, దేశ రాజకీయ ముఖ చిత్రాన్నేమార్చివేసే శక్తి సామర్ధ్యాలు అన్ని ఉద్యమాలకు ఉండవు.పంజాబ్, గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మరోసారి అదే నిరూపించాయి ..దట్సాల్.

పరుగులు పెట్టిన ముఖ్యమంత్రి! 

ఛత్తీస్ గఢ్ లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ షూట్ కలకలం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ఉన్నతాధికారులను పరుగులు పెట్టించింది. పోలీసులకు చుక్కలు చూపించింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాకు చెందిన వధువు, వరుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఆ రాష్ట్రానికి చెందిన రాయ్ పూర్ సిటీకి వచ్చారు. ఆ సిటీలో ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా “AW 109 Power Elite” అనే హెలికాప్టర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ పాల్గొన్నారు. అయితే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అనంతరం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు చూసిన ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి  భూపేష్ బాగల్ అవాక్కయ్యారు. రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ఏవీయేషన్ డైరెక్టర్, స్థానిక పోలీసులు కంగుతిన్నారు. అందుకు కారణం వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోల్లో ఉన్న హెలికాప్టర్ ను సీఎం భూపేష్ బాగల్ ఉపయోగిస్తారు. దీంతో హుటాహుటీనా సీఎం భూపేష్ బాగల్ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్థికి విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా సీఎం భూపేష్ బాగల్ డ్రైవర్ యోగేశ్వర్ సాయిని రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దేవ్ సాయి బంధువు , తన స్నేహితుడు హెలికాప్టర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో యోగేశ్వర్ సాయిని విధుల నుంచి తొలగించారు. ప్రీ వెడ్డింగ్ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి వికాస్ తివారీ రాష్ట్ర డీజీపీకి డీఎం అవస్థీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి భద్రతలో లోపాలు తలెత్తుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి వినియోగించే హెలికాప్టర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగడం ఆందోళనగా ఉంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

బీజేపీ నేత విష్ణుపై లైవ్ లో చెప్పు దాడి 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారి తప్పుతున్నాయి. రాజకీయ నాయకులు దూకుడే ప్రధాన అయుధంగా మార్చుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు తెగబడుతున్నారు. దాడులకు కూడా వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజకీయ నేతలు నోరు తెరిస్తే బండ బూతులే వస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు.. తిట్ల పోటీ పెట్టుకున్నట్లుగా.. విపక్ష నేతలపై అసభ్య పదాలను ఉపయోగిస్తున్నారు. ప్రజల ఛీదరించుకుంటున్నా తమ తీరు మార్చుకోవడం లేదు. లైవ్ డిబేట్లలోనూ ఘోరంగా తిట్టుకుంటున్నారు. గొడవలు పడుతున్నారు. వీక్షకలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా కొట్టుకునే వరకు వెళుతున్నారు.  రాజకీయ నేతల దిగజారి పోయి వ్యవహరిస్తుండగా... తమ అసమ్మతి, నిరసనను తెలిపేందుకు ప్రత్యక్ష ప్రసారాలను కొందరు వేదికగా మార్చుకుంటున్నారు. తమ అభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని చెప్పటానికి అస్త్రంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. అమరావతిపై ఓ టీవీ ఛానెల్ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. అమరావతిపై సీఎం జగన్ ఆలోచన మారిందా అన్నది అంశం. ఈ చర్చలో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు, బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు.  అమరావతిపై సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయానికి సంబంధించి శ్రీనివాస్, విష్ణు మధ్య ఘాటుగా చర్చ జరిగింది. చివరకు అది వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. అమరావతి జేఏసీ కన్వీనర్ ను పెయిడ్ అర్టిస్ట్ అని సంబోంధించారు విష్ణు. టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు.. టీడీపీ ఆఫీసులో పని చేసుకో అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు... తన కాలి చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి ముఖంపైకి విసిరేశారు. ఇదంతా లైవ్ లో వచ్చింది.  ఘటనతో చర్చలో పాల్గొంటున్న మిగితా నేతలతో పాటు లైవ్ షో చూస్తున్న జనాలు షాకయ్యారు. బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిని అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు చెప్పుతో కొట్టిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. అమరావతిపై అడ్డగోలుగా మాట్లాడినందువల్లే దాడి చేశారని కొందరు చెబుతుండగా.. లైవ్ డిబేట్ లో చెప్పుతో దాడి చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

అసెంబ్లీ ఎంత సేఫ్? 

తెలంగాణ అసెంబ్లీ భవనం స్వల్పంగా కూలింది. తూర్పు వైపు ఉన్న ఎలివేషన్ పెద్ద శబ్దం చేస్తూ పడిపోయింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం పైకప్పు గోపురం కూలి కిందపడింది. భవనం పెచ్చులు ఊడిపడటంతో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. శిధిలాలు గార్డెన్ ఏరియాలో పడటంతో ప్రమాదం తప్పింది.  తెలంగాణ అసెంబ్లీ భవనం ఘటనపై శాసన సభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు స్పందించారు. ఏటా గోడలు, సీలింగ్ నుంచి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమన్నారు. అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపడతూ ఉందన్నారు. ప్రధాన స్ట్రక్చర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని, పటిష్టంగా ఉందని చెప్పారు. అధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిత్యం శాసనసభ భవనంతో పాటుగా అనుబంధ కార్యాలయాలు ఉన్న భవనాలను పరిశిలిస్తున్నారని.. ఎనీ టైమ్ అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామని అన్నారు.  తెలంగాణ అసెంబ్లీకి వందేళ్ల చరిత్ర. ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ కాలంలో 1905లో పనులు ప్రారంభమై.. 1913 డిసెంబర్‌ లో భవన నిర్మాణం పూర్తయింది. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో భవనం అందుబాటులోకి వచ్చింది. మొదట్లో దీన్ని ‘మహబూబియా టౌన్‌హాల్‌’గా పిలిచేవారు. తర్వాతి కాలంలో ఇది అసెంబ్లీ అయ్యింది. ప్రజల చందాలతో ఈ భవనాన్ని నిర్మించడం విశేషం.    అసెంబ్లీ భవనం పాత బడటంతో కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. గతేడాది సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. అయితే కోర్టు చిక్కులతో  అది ఆగిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ భవనంలోని ఎలివేషన్ శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో భవనం భద్రత ప్రశ్నార్దకంగా మారింది. 

6,7,8.. బడి గంట మోగిందోచ్..

తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనాతో మూత పడిన  స్కూళ్లు, కాలేజీలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ కాలేజీలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో 9,10వ తరగతి విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్తున్నారు. తాజాగా 6 నుంచి 8వ తరగతులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 6 నుంచి 8వ తరగతి క్లాసులను ఫిబ్రవరి 24, బుధవారం నుంచి  ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మార్చి 1లోపు పూర్తిస్థాయిలో పాఠశాలల్లోనే బోధన జరుగుతుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.  అయితే, పిల్లలను స్కూల్ కు పంపడం, పంపించకపోవడాన్ని తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేసింది. అందరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. మాస్కులు, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని విద్యాశాఖ స్పష్టంచేసింది.

మార్చి7న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్? తొలి విడతలోనే తిరుపతి, సాగర్ ! 

దేశంలో మరో ఎన్నికల నగారా మోగబోతోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది.  అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోడీ.. మార్చి తొలివారంలోగా మినీ సంగ్రామం మొదలవుతుందని చెప్పారు.  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ మార్చి 7లోగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు."2016లో ఈ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 4న విడుదలైంది. ఈ సంవత్సరం నా అంచనాల మేరకు మార్చి 7లోగా షెడ్యూల్ ను ఈసీ ప్రకటిస్తుంది" అని మోడీ వ్యాఖ్యానించారు. మార్చి మొదటి వారంలో  కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోడీ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆరు పరివర్తన ర్యాలీలను నిర్వహించగా, ఇది అతిపెద్ద ర్యాలీ అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కోల్ కతాలో మోడీ సభ  ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సీఈసీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇటీవల సీఈసీ సభ్యులు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడి అధికారులతో ఎన్నికల సన్నద్దతపై సమీక్షించారు. ప్రస్తుతం కేరళలో లెఫ్ట్, బెంగాల్ లో టీఎంసీ, అసోంలో బీజేపీ, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నా.. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో సోమవారం సర్కార్ కూలిపోయింది.    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు షెడ్యూల్ రానుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరగనుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ సెప్టెంబర్ 16న చనిపోయారు. మార్చి 16తో ఆయన చనిపోయి ఆరు నెలలు ముగియనుంది. ఇక్కడ మార్చి 16 లోపు ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. దీంతో మార్చి7న ప్రకటించే షెడ్యూల్ లో తొలి విడతలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

ఆర్టీసీపై అంతా అబద్ధం.. బయటపడిన విజయసాయి బండారం 

ఆంధ్రప్రదేశ్ లో మాయల మరాఠీ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తిమ్మిని బమ్మి చేయడంలో ఆయన నెంబర్ టూ. ట్విట్వర్ లో నిత్యం ఏదో ఒక కామెంట్లు పెట్టడం ఆయన స్టైల్. సీఎం జగన్ భజన చేయడంతో పాటు రాజకీయ విమర్శలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలోనూ ముందుంటారు. లేటెస్ట్ గా ఏపీఎస్ఆర్టీసీ విషయంలో విజయసాయి చేసిన ట్వీట్ ఆయనకే బూమరాంగ్ గా మారింది. జగన్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ లాభాల బాట పట్టిదంటూ సొంత డబ్బా కొట్టి.. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ స్టేట్ మెంట్ తో అడ్డంగా బుక్కై పరువు పోగొట్టుకున్నారు. ఇటు విజయసాయి ట్వీట్.. అటు ఆర్పీ ఠాకూర్ క్లారిటీ.. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.    సీఎం గారి దూరదృష్టి వల్ల ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకొచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్టీసీని తన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. జగన్ గారు ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఒక్క ప్రభుత్వ సంస్థనైనా ఇలా నిలబెట్టావా చంద్రబాబూ? అంటూ ఫిబ్రవరి 15న విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.  కట్ చేస్తే.. లేటెస్ట్ గా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఏపీఎస్ఆర్టీసీ 6వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు ఆర్పీ ఠాకూర్. కార్గో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. డీజిల్ ధరలు పెరిగి అదనపు భారం పడుతోందన్నారు. ఖర్చులు తగ్గించాలని.. కష్టపడి పనిచేయాలని సిబ్బందికి సూచించారు. వర్కర్స్‌కు రావాల్సిన బకాయిలన్ని విడుదల చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ.  ఆర్టీసీ వ్యవహారాలు చూసే ఎండీ.. సంస్థ 6వేల కోట్ల నష్టాల్లో ఉందంటే.. ఎంపీ విజయసాయి మాత్రం జగన్ చొరవతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిదంటూ ప్రజలను తప్పుదారి పట్టించడంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి కాపాడాల్సింది పోయి.. ఇలా అబద్దాలు ప్రచారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సమయం లేదు మేడమ్..! కేసీఆర్ తీసిన గోతిలో.. 

మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నిక. సరిగ్గా మూడు వారాల ముందు అధికార పార్టీ అభ్యర్థి ప్రకటన. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం. బీజేపీకి సిట్టింగ్ సీట్. అది గెలవడం గులాబీ పార్టీకి సవాలే. మొదట టీఆర్ఎస్ కు అభ్యర్థే దొరకలేదు. ఆ తర్వాత అతికష్టం మీద పీవీ కూతురు వాణీదేవిని వెతికి తీసుకొచ్చి మరీ పోటీలో నిలిపారు. ఆమె రాజకీయాలకు కొత్త. తండ్రి పేరు చెప్పక పోతే ఆమెను ఎవరూ గుర్తు పట్టరు. రాజకీయ అనుభవం శూన్యం. ఇప్పటి వరకూ బహిరంగ వేదికలపై మాట్లాడటం, ప్రసంగించడం చేయలేదు. అయినా.. గట్టి పోటీ ఉండే నియోజకవర్గంలో వాణీదేవిని బరిలో నిలిపారు కేసీఆర్. ఆ సీటు గెలిచేందుకేనా? కనీసం పోటీ అయినా ఇవ్వగలరా? ఓడిపోయే స్థానంలో వాణీదేవీని నిలబెట్టడం ఎలా వ్యూహాత్మకం అవుతుంది? ఇలా అనేక ప్రశ్నలు. కేసీఆర్ తీరుపై అనేక అనుమానాలు.  రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో  బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి, బలమైన నేత రామచంద్రరావు పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గతంలో గెలిచిన వ్యక్తి. ఆయనకి వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి చిన్నారెడ్డి సవాల్ విసురుతున్నారు. ఇంతటి గట్టి పోటీ ఉన్న స్థానంలో ఎలాంటి రాజకీయ పరపతి లేని వాణీదేవిని బరిలో నిలిపితే.. ఆమె ఏ మాత్రం పోటీ ఇస్తారనేది సందేహమే.  మరోవైపు సమయమూ మించిపోతోంది. నామినేషన్ల ఆఖరి తేదీకి మూడు రోజుల ముందు మాత్రమే వాణీదేవి పేరును ప్రకటించారు కేసీఆర్. ఎన్నికల ప్రచారానికి  గట్టిగా రెండు వారాల టైమ్ కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడమంటే మాటలు కాదు. అందులోనూ రాజకీయాలకు కొత్త అయిన వాణీదేవికి ఇది మరింత కష్టం. గతంలో మాదిరి కేవలం కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు చూసి ఓటు వేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రభుత్వ వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తోంది. జనాలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్ కు బుద్ది చెబుతామా అన్నట్టు కసిగా ఉన్నారు. దుబ్బాక ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇంతటి వ్యతిరేక పరిస్థితుల్లో వాణీదేవిని పోటీలో దించి ఆమెకు అన్యాయం చేస్తున్నారనే ప్రతిపక్షాల మాట సమంజసంగానే ఉందని అంటున్నారు.  రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం భౌగోళికంగా అతి పెద్దది. 3 జిల్లాలు.. 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉంది. సుమారు 5 లక్షలకు పైగా ఓటర్లు. పట్టభద్రుల నియోజక వర్గం కావడంతో ఉద్యోగులు, నిరుద్యోగులే అదికం. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, నియామకాల అంశంలో నిరుద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. వీళ్లు అధికార పార్టీకి ఓటేసే అవకాశం అతి తక్కువేనని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పథకాల గురించి వారికి వివరించాలన్నా ఎంతో సమయం, పకడ్బందీ ప్రచారం అవసరం. బీజేపీ అభ్యర్థి రామచంద్రారావు తన పదవీ కాలం ముగియక ముందునుంచే ముందస్తు ప్రచారం ప్రారంభించేశారు. పోటీలో నిలిచిన నాగేశ్వరరావు పరిచయం, ప్రచారం అవసరం లేని అభ్యర్థి. ఇక కాంగ్రెస్ కేండిడేట్ చిన్నారెడ్డి జగమెరిగిన నేత. ఇంతటి హేమాహేమీల మధ్య కొత్తగా వచ్చిన వాణీదేవి ప్రచారం ఎలా చేస్తారనేది ఆసక్తికరం.  నియోజకవర్గమంతా తిరిగేందుకు ఆమెకు సమయమే లేదు. రెండు వారాల్లో మూడు జిల్లాలను చుట్టేయడం మాటలు కాదు. మరోవైపు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్న సిట్టింగ్ కేండిడేట్ పల్లా రాజేశ్వరరావు పేరును ఎంతో ముందుగానే ప్రకటించారు గులాబీ బాస్. నెలల ముందు నుంచే పల్లా రాజేశ్వర రెడ్డి  ప్రచారంలో దూసుకుపోతున్నారు. సభలు, సమావేశాలతో విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన పల్లా ఇలా జోరు మీదుంటే.. అదే అధికార పార్టీకి చెందిన మరో అభ్యర్థి వాణీదేవీకి మాత్రం ఏం చేయాలో, ప్రచారం ఎలా నిర్వహించాలో అర్థం కాని పరిస్థితి. అందుకే నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆమె ప్రచారానికి వెళ్లలేదు. ఒకవేళ ఎలాగోలా ప్రిపేర్ అయి ప్రచారం చేద్దామన్నా.. సమయం లేదు మిత్రమా అంటున్నారు పార్టీ వర్గాలు. పీవీ కూతురుగా అభ్యర్థి పేరైతే ప్రజల్లోకి విస్తృతంగా  వెళ్లింది కానీ.. ఆమెకు ఎందుకు ఓటు వేయాలో.. ఓటు వేస్తే ఎలాంటి పాలన అందిస్తారో.. ఓటర్లకు వివరించేందుకు టైమ్ సరిపోయేలా లేదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లకు వాణీదేవి గెలుపు బాధ్యతలు అప్పగించినా.. అభ్యర్థి ఓటు అడిగితేనే ఓటర్లు స్పందిస్తారు. కనీసం అందుకు కూడా సమయం సరిపోయేలా లేదు. ఇదంతా కేసీఆర్ చేజేతులారా చేసిందో..? లేక  విపక్షాలు ఆరోపిస్తున్నట్టు వాణీదేవిని బలిపశువు చేస్తున్నారో..?..