అనంతలో వైసీపీ దుశ్శాసన పర్వం!
posted on Feb 24, 2021 @ 10:06AM
పంచాయితీ ఎన్నికలు ముగిసిన ఆగని వైసీపీ నేతల దాడులు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన దుశ్యాషణుడ్ని తలపించేలా చేసింది. బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులతో ఆగక మహిళలపై కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో పద్మ మొన్నటి పంచాయతీ పోరులో తాను రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరుడు విజయం సాధించాడని.. ఆ విజయోత్సవాన్ని తన ఇంటి వద్ద జరిపారని చెప్పింది. పెద్ద ఎత్తున టపాసులు కాల్చగా ఆ శబ్దానికి తమ గొర్రెలు భయపడటంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశానని, దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు తన ఇంటిపై రాళ్లతో దాడి చేశారని, విచక్షణారహితంగా దుర్భాషలాడారని వాపోయింది. అంతటితో ఆగకుండా చీర లాగి జాకెట్ చించారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తుంగోడు, కోనతొట్టి పల్లి గ్రామనికి చెందిన దాదాపు 200మంది.. మాజీ సర్పంచి నారాయణరెడ్డి, వాలంటీర్ ప్రతాపరెడ్డి, బాబు, మధుసూదన్ రెడ్డి తదితరులపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘం దండు వీరయ్య వర్గం జిల్లా కార్యదర్శి జీకే ప్రకాష్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో సంబరాలు చేసుకోవడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దళితులపై సర్పంచ్ అభ్యర్థులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గెలిచిన అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ప్రజలకు న్యాయం చేయవలసింది పోయే ఈ దాడులు చేయడం దారుణమన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.