బీజేపీ రథసారధులు వీరే ..
posted on Feb 24, 2021 8:56AM
ఏపీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో బీజేపీ స్పీడ్ పెంచింది. కమలం కనుసన్నల్లో రాష్ట్రాన్ని నడిపేందుకు కరసేవకులు సిద్ధమవుతున్నారు. అందుకు ఏపీ బీజేపీ సర్వం సిద్ధం చేస్తుంది. మున్సిపల్ , పరిషత్ ఎన్నికలను గెలుపును దృష్టిలో పెట్టుకుని. రాష్ట్రములో 13 జిల్లాలకు 13 రామ బాణాలను వదిలింది. జిల్లాల వారీగా ఇంచార్జీల నియమిస్తూ వారికి బాధ్యత అప్పగించారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.
ఉత్తరాంధ్ర బాధ్యతలను జీవీఎల్ నరసింహరావు, కె.హరిబాబు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, కాశీవిశ్వనాథ రాజులకు అప్పగించారు. గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ.. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌బాబు.. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్, పార్థసారథి, వరదాపురం సూరిలను నియమించారు. చూడాలి మరి సోమా వీర్రాజు 13 జిల్లాల ఇంచార్జీల పంచతంత్రం ఏమవుతుందో. జగన్నాటకం లో బీజేపీ జెండా ఎగురుతుందో, ఎండకట్టుకుపోతుందో, అంత కరసేవకుల పనితీరు మీదనే ఆధారపడి ఉంది.