వామ్మో .. ఇదేం ప్రమాణం 

ఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకమండళ్లు కొలువు దీరాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణా స్వీకారాలు అట్టహాసంగా జరిగాయి. అయితే తిరుపతి కార్పొరేషన్  లో మాత్రం నవ్వులపాలయ్యే ఘటన జరిగింది. 29వ డివిజన్ నుంచి గెలిచిన ఆదిలక్ష్మి ప్రమాణం పెద్ద ప్రహాసనంలా మారింది. అధికారి చెబుతుండగా ప్రమాణం చదవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆదిలక్ష్మి. వరుసగా ఆమె అన్ని తప్పులే చెప్పారు.  అధికారి చెబుతున్న ప్రతి వాక్యాన్ని తప్పుగానే చదివారు ఆదిలక్ష్మి. భారత్, పాలన వంటి చిన్న చిన్న పదాలను కూడా ఆమె సక్రమంగా చెప్పలేకపోయారు. తప్పులు మీద తప్పులు చదువుతూ తెలుగును  ఖూనీ చేశారు. ఒక దశలో అదికారులు చెప్పినదానికి ఆమె మాట్లాడినదానికి పొంతనలేకుండాపోయింది. ఆదిలక్ష్మి తీరుతో  ఆమెతో ప్రమాణం చేయించిన అధికారి కూడా తప్పులే చదవాల్సి  వచ్చింది.  ఆమె ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాకపోవడంతో .. చివరికి అధికారులు మమా అనిపించేలా ఆమెతో ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు. తిరుపతి కార్పొరేటర్ ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆదిలక్ష్మి తీరుపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వారు ప్రజలకేం సేవ చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేటర్ తో పాటు అధికారి తప్పులు చదవడంపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. జగనన్న రాజ్యంలో ఇలాంటివి కామనే అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.  

వైసీపీలోకి జేసీ బ్రదర్స్! జగన్‌కు జై కొట్టిన ప్రభాకర్‌రెడ్డి..

జేసీ బ్రదర్స్. నిప్పులాంటి నాయకులు. ఎవరికీ తలొంచరు. మాటలు తూటాల్లా వదులుతారు. కడుపులో ఉన్నది ఉన్నట్టు బయటకు అనేస్తారు. వారి నోటి నుంచి ఒక మాటొస్తే.. అది వారి మనసు నుంచి వచ్చినట్టే. తాడిపత్రిలో తిరుగులేని నేతలు. లేటెస్ట్‌గా మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికై తాడిపత్రిలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఛైర్మన్ అయిన వెంటనే జగన్‌కు జై కొట్టి మరింత సంచలనంగా నిలిచారు. జేసీ బ్రదర్స్ అంత ఈజీగా మరొకరికి జై కొట్టరు. వాళ్లు నిజంగా అభిమానిస్తేనే.. అతను తమ వాడని అనుకుంటేనే.. బయటకు ప్రకటిస్తారు. తాడిపత్రిలో అదే జరిగిందంటున్నారు. తాను మున్సిపల్ ఛైర్మన్ కావడానికి జగన్ హెల్ప్ చేశాడని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్ తలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను మున్సిపల్ ఛైర్మన్ అయ్యే పరిస్థితి లేదన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని అన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం, గుండాయిజం ఇక ఉండదన్నారు.  నిన్నటి దాకా జగన్ అంటే ఒంటి కాలిపై లేచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి సడెన్‌గా సీఎం జగన్‌ను పొగడటం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ కేసులు మీద కేసులు ఎదుర్కొని, జైలుకూ వెళ్లొచ్చి.. జగన్‌ను ఢీకొట్టి తాడిపత్రి మున్సిపాలిటీ దక్కించుకొని.. కొదమసింహంలా నిలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డిలో సడెన్‌గా ఈ మార్పు ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.  సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు జేసీ. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే.. ఆయనలో కూడా విలువలు ఉన్నాయన్నారు. ఆ విషయాన్ని తాను ఈరోజు స్పష్టంగా గమనించాన్నారు. త్వరలో సీఎం జగన్‌ని కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఛైర్మన్ అయిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వరం మార్చడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు. జేసీ సోదరులను కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా.. ఎన్నికలు ఏవైనా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి అండ ఉన్నా లాభం లేదని జేసీ బ్రదర్స్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడి.. కష్టాలు తెచ్చుకోవడం కంటే.. సర్దుకుపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారంటున్నారు.  ఇక తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ ఫ్యామిలీకి ఇటీవలే పెద్ద ఎత్తున చిన్నపాటి యుద్ధమే జరిగింది. జేసీ ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు పెద్దారెడ్డి. అలాంటి పెద్దారెడ్డితో సయోథ్యకు సైతం సై అంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఆత్మాభిమానానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి జేసీ బ్రదర్స్‌లో ఒక్కసారిగా ఇలాంటి మార్పు రావడం వారు పార్టీ మారుతున్నారనటానికి సంకేతం అంటున్నారు. మరోవైపు, రాష్ట్రమంతా గెలిచాం కదా ఒక్క తాడిపత్రి పోతే ఏంటి అన్నట్టు మాట్లాడారు మంత్రి బొత్స. అంటే, వైసీపీ నుంచి సైతం వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని అంటున్నారు. సీఎం జగనే తన గెలుపునకు సహకరించారని స్వయంగా జేసీ ప్రభాకర్‌రెడ్డే చెబుతుంటే.. ఇక ఇంతకంటే వేరే ఆధారం ఇంకేం కావాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు, జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు చూస్తుంటే.. త్వరలోనే జేసీ బ్రదర్స్ టీడీపీ వీడి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

స్టూడెంట్ తో శోభనం.. లేడీ టీచర్ దారుణం.. 

రాజకీయాల్లో రాజయోగం దక్కాలంటే 13  ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని  ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఆ వృద్ధ రాజకీయ నాయకుడు 13  ఏళ్ళ బాలికను పెళ్లి చేసుకునే సీను రంగం సినిమాలో చూసే ఉంటారు. మూఢ నమ్మకాలను నమ్మేవాళ్లున్నంత కాలం ఇలాంటి తప్పులకు తలుపులు తెరుచుకుంటాయి.  అక్షరం రాని వాళ్లు మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు బుద్ది గడ్డి తింటుంది. అలాగే  విద్యాబుద్ధులు నేర్పే  ఓ ట్యూషన్ టీచర్ బుద్ధి కూడా  గడ్డి తిన్నది. జన్మకుండలిలో దోషం తొలగిపోతుందనే నమ్మకంతో 13 ఏళ్ల బాలుడిని ఓ టీచరమ్మ పెళ్లి చేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జలంధర్‌లోని బస్తీ భవ ఖేల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంట్లోనే ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ యువతికి ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో.. ఆమె కుటుంబం కూతురుకి పెళ్లి కావడం లేదన్న బెంగతో ఓ పూజారిని కలిసింది. ఆ యువతి జాతకాన్ని పరిశీలించిన పూజారి.. మీ అమ్మాయి జన్మకుండలిలో దోషం ఉందని, ఆ దోషం తొలగిపోవాలంటే ఓ బాలుడితో పెళ్లి తంతు జరిపించాలని సూచించాడు. సదరు యువతి ఇలాంటివన్నీ నమ్మొద్దని తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సింది పోయి ఆమె కూడా పూజారి చెప్పినట్టుగానే చేసింది. ఆమె ట్యూషన్‌కు వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని ఈ ఉత్తుత్తి పెళ్లికి వరుడిగా ఎంపిక చేసుకుంది. వారం రోజుల పాటు మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉండాలని.. క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ బాలుడి తల్లిదండ్రులకు ఈ టీచరమ్మ చెప్పింది. అనుకున్నట్టుగానే.. ఆ బాలుడిని వరుడిగా కూర్చోబెట్టి అతనితో ఈ టీచరమ్మ మూడు ముళ్లు వేయించుకుంది. అయితే.. ఈ పెళ్లి గురించి అంతా రహస్యంగా ఉంచడంతో ఎవరికీ తెలియలేదు. ఆ బాలుడికి కూడా ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఇంటికి వారం రోజుల తర్వాత ఇంటికి పంపారు. ఆ బాలుడు ఇంటికెళ్లి జరిగిన బాగోతమంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు బస్తీ భవ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఉత్తుత్తి పెళ్లయినప్పటికీ పెళ్లిలో జరిగే హల్దీ-మెహిందీ వేడుక, పెళ్లి తర్వాత శోభనం రాత్రి తంతు కూడా పూర్తి చేశారని తేలింది. ఆ తర్వాత.. ఆ టీచర్ గాజులు పగులగొట్టి ఆమెను విధవగా ప్రకటించారని తెలిసింది. ఇలా చేస్తే.. దోషం తొలగిపోయి ఆమెకు పెళ్లి కుదురుతుందని ఆ పూజారి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. తొలుత.. బాలుడి తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీచరమ్మ ఒత్తిడితో తర్వాత కేసు ఉపసంహరించుకున్నారు.

మళ్లీ కంటైన్మెంట్ జోన్లు.. కొవిడ్ కల్లోలం..

మళ్లీ కంటైన్మెంట్ జోన్లు. ప్రతీరోజూ 50వేల RTPCR టెస్టులు. డైలీ కరోనా బులెటిన్. కొవిడ్ చర్యలపై హైకోర్టు తాజా ఆదేశాలివి. తెలంగాణలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని సర్కారును ఆదేశించింది హైకోర్టు. కొవిడ్‌ కేసులు ఎక్కువ వచ్చే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది. నిత్యం 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.  గత ఫిబ్రవరి వరకూ నిత్యం వంద లోపు కరోనా కేసులు నమోదవగా.. తాజాగా రోజుకు 200లకు పైనే పాజిటివ్ కేసులు వస్తుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటం.. పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్లు విధించడం.. కొవిడ్ తీవ్రతకు నిదర్శనం. సెకెండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో తెలంగాణలోనూ భారీగా కరోనా కేసులు నమోదవడం ఆందోళనకరం. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయని.. పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రోజూ 50వేల పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని అన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేప్రచార సమయంలో, పోలింగ్ రోజు కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. త్వరలో హోలీ పండగ కూడా రాబోతోందని.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదేం న్యాయం జగన్ రెడ్డి గారు.. 

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం రాజకీయ దుమారం రేపుతోంది. చంద్రబాబుపై 166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్‌విత్‌ 34, 35, 36, 37 ఐపీసీలతోపాటు.. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌) (జి)లపైనా కేసు పెట్టారు. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.  గత ప్రభుత్వంలోని కొందరు పరపతి ఉన్న పెద్దలు మోసం చేసి, చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా రైతుల భూములు లాక్కున్నారని ఆళ్ల తన ఫిర్యాదులో తెలిపారు. అయితే దేశంలో మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించడం అక్రమమంటున్న జగన్ రెడ్డి సర్కార్... గత ఏడాదిగా చేస్తున్నది ఏంటనే చర్చ వస్తోంది.  ఇళ్ల పట్టాల పంపిణి చేపట్టిన వైసీపీ సర్కార్.. ఇందు కోసం రైతుల భూములకు అక్రమంగా లాగేసుకుంది. అసైన్డు, డీ పట్టా స్థలాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్నా... వారిని బెదిరించి తాము చేయాల్సింది చేసేసింది. ఇక్కడ అక్కడా అని లేదు రాష్ట్రమంతా అదే తీరు. శ్రీకాకుళం నుంచి కడప వరకు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ లాగేసుకున్నారు. గోదావరి జిల్లాల్లో పచ్చని పొలాలను కూడా లాగేసుకున్నారు, ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములన్ని దాదాపుగా పేదలు, దళితులవే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్‌ రెడ్డిలు గతంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను..  జగన్ రెడ్డి సర్కార్ బలవంతంగా లాక్కుంది.  ఏపీలో ఇళ్ల పథకం కోసం… 30 లక్షల 75వేల 755 మంది లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి ఒక సెంటు స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఇందుకోసం రూ. 23,535 కోట్ల విలువైన 68,361.83 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో ప్రభుత్వ భూమి 25, 120.33 ఎకరాలు ఉండగా.. 25,359.31 ఎకరాల భూమిని 10వేల 150 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే ప్రభుత్వ భూమి అని చెబుతున్న దాంట్లో మెజార్టీ అసైన్డ్, డీ పట్టా భూములే. పసుపు కుంకమ కింద ఇచ్చిన భూములను వదల్లేదు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే.. గ్రామసభలు పెట్టకుండానే లాకున్నారు. పేదలు, దళితుల వినియోగంలోని  పంట పొలంలో ఉండగానే  బలవంతంగా సేకరించారు. ప్రభుత్వ ఆదేశాలతో స్థలాల వేటలో ఉన్న రెవెన్యూ అధికారులు.. రాత్రికి రాత్రే  యంత్రాలతో వచ్చి పొలాలను దున్నేశారు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా పంటనంతా ధ్వంసం చేశారు. పోలీసుల అండతో ప్లాట్లుగా చేయడానికి చదును చేశారు. రైతులు లేని సమయం చూసి రాత్రికి రాత్రే పంటనంతా నాశనం చేశారు. నేలకు వాలిపోయిన తమ కష్టాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ముందుగా చెబితే పంటనైనా కాపాడుకొనేవారమని గొల్లుమన్నారు. భూములు పోయిన బాధతో కొందరు రైతులు, పేదలు , దళితులు ప్రాణాలు కూడా తీసుకున్నారు.  పేదలు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను లాక్కోవడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ తీరుపై భగ్గుమన్నారు. పేదల భూములు లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. అయినా పట్టించుకోకుండా బలవంతంగా వేలాది ఎకరాలు సేకరించింది జగన్ సర్కార్. దీనిపైనే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములు తీసుకోవడం నేరమంటూ చంద్రబాబుపై కేసు పెడితే.. వేలాది ఎకరాల అసైన్డ్ , దళితుల భూములు సేకరించిన జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీస్తున్నారు. ఐదేళ్లు సుపరిపాలన అందించిన చంద్రబాబును ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు క్రియేట్ చేసి.. ఆ ఉచ్చును చంద్రబాబు మెడకు బిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుపై గతంలోనే హైకోర్టులో విచారణ జరగ్గా.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం కూడా తేల్చేసింది. సంబంధంలేని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. ప్రతిపక్ష నేతను భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం వైసీపీ సర్కారు దిగజారుడుతనమే అంటున్నారు టీడీపీ నేతలు.   అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకి ఇచ్చిన నోటీసులే సీఎం జగన్‌కు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. సీఎం  జగన్ ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో పేదలైన దళితుల నుండి అతికిరాతకంగా, బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లను జగన్‌తో పాటు రెవిన్యూ మంత్రి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ల పైనా పెట్టి నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. దళితుల నుండి సీఎం అసైన్డ్ భూములను లాక్కున్న వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో తాను సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని  చెప్పారు. ఒకవేళ సీఐడీ అధికారులు జగన్‌పై కనుక కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని హర్షకుమార్ హెచ్చరించారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం కోసం దళితులను బలిపశువులుగా చేసిన జగన్‌కు జోహార్లు అంటూ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నందిగ్రామ్ గరం ..గరం !

ఐదు  రాష్టాలలో  అసెంబ్లీ ఎన్నికలు  జరుగతున్నా, దేశం మొత్తం దృష్టి  మాత్రం ఒక్క పచ్చిమ బెంగాల్’ మీదనే కేద్రీకృతమై వుంది.అందుకు కారణం ఏమిటో ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. అటు మోడీ ఇటు మమత మధ్య పోటీగా సాగుతున్న బెంగాల్ ఎన్నికలలో ఇరు వైపుల నుంచి ఫిరంగుల మోత హోరెత్తిస్తోంది. మోత మోగుతోంది. అంతే కాకుండా బెంగాల్ ఫలితాల ప్రభావం బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, దేశ రాజకీయాలపైనా ఆ ఫలితాలు  ప్రభావం చూపుతాయి. అందుకే బెంగాల్’ ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అదలా ఉంటే, బెంగాల్ రాజకీయాలను ‘చారిత్రక’ మలుపు తిప్పిన నందిగ్రామ్ ఇప్పుడు మరో మారు, మరో చారిత్రక ఆవిష్కరణకు వేదిక కాబోతోంది.అందుకే, ఇప్పుడు ఇటు బెంగాలీలతో పాటుగా దేశం మొత్తం కూడా, బెంగాల్ ఫలితాలపై ఎంత అసక్తి చూపుతోందో, నందిగ్రామ్ సంగ్రాంపై కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తోంది. మూడు పదులకు పైగా, బెంగాల్’ను ఏలిన వామపక్ష కూటమిని గద్దెదించి, మమతా బెనర్జీని పీఠం ఎక్కించిన భూపోరాటానికి నందిగ్రామ్ కేంద్ర బిందువు అయితే,ఆ ఉద్యమాన్ని మమతా బెనర్జీ, సువేందు అధికారి జోడు గుర్రలుగా ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు, సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరి, మమతపై పోటీకి తొడకొట్టడంతో సీన్ మారిపోయింది.  ఇప్పుడు అదే నందిగ్రామ్ ఎన్నికలబరి నుంచి, ఆ ఇద్దరు ఉగ్ర నేతలు తలపడుతున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకుని, డీ అంటే డీ అంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో నందిగ్రామ్’పై రాజకీయ వీక్షకులు,విశ్లేషకుల చూపు పడింది. ఇదలా ఉంటే, ఇప్పుడు ముందున్న మహా సంగ్రామానికి ట్రైలర్ అన్నట్లుగా, నామినేషన్ల దగ్గరే, ఇద్దరు నేతలు, ఇరు పార్టీలు రాజకీయం రక్తి కట్టిస్తున్నారు. మమత బెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి అది దాడో, లేక ప్రమాదమో కానీ, నామినేషన్ వేసి బహిరంగ సభ  వేదిక వద్దకు చేరుకున్న ఆమె కారు దిగుతున్న సమయంలో ఆమె కాలుకు గాయమైంది. ఆమె రెండు రోజులు ఆసుపత్రిలో ఉండి, వీల్ చైర్’లో బయటకు వచ్చారు, వీల్ చైర్ ప్రచారం సాగిస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన విచారణలో అది ప్రమాదమే అని తేలింది. అయినా,   తృణమూల్ దాన్ని దాడిగానే భావిస్తోంది.అంతే కాదు, అది మమతపై జరిగిన హత్యా ప్రయత్నంగా ప్రచారం చేసుకుంటోంది. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది. మరోవంక బీజేపే, అదంతా డ్రామా అని కొట్టి పారేసింది. అదలా  ఉంటే,తప్పుడు వివరాలతో నామినేషన్ దాఖలు చేశారంటూ ఇటు మమత అటు మమతా ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీ తమఫై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను దాచిపెట్టారని సువేందు అధికారి తరపున బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీ నామినేషన్ రద్దు చేయాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.అందుకు జవాబుగా అన్నట్లుగా సువేందు అధికారికి రెండు నియోజక వర్గాల (నందిగ్రామ్,హల్దియా)లో ఓట్లున్నాయని, ఇలా రెండు నియోజక వర్గాల్లో ఓటు హక్కు ఉండడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేక కాబట్టి, సువేందు అధికారి నామినేషన్ రద్దు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది.   దీంతో ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలో అస్తికర చర్చ జరుగుతోంది.అయితే, అన్నీ తెలిసిన అనుభవజ్ఞులు మాత్రం, ఏమీ జరగదు,ఎవరి నామినేషన్ రద్దు కాదు. ఇదంతా ఎన్నికల ఆటలో మామూలు వ్యవహారమే అంటున్నారు. అయితే నందిగ్రామ్ ఓటర్లు మాత్రం ఒకరిని ఓడించి, రద్దు పద్దులో చేరుస్తారని అంటున్నారు.  

కొలువుదీరిన కొత్త మేయర్లు..

ఏపీలో మొత్తం 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి అయింది  కొన్ని చోట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాఫీగా సాగింది.  విజయవాడ - మేయర్‌గా భాగ్యలక్ష్మీ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ విశాఖపట్నం - మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ విజయనగరం-  మేయర్‌గా విజయలక్ష్మి డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి మచిలీపట్నం-  మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ (తొలి రెండేళ్లు), చిటికిన వెంకటేశ్వరమ్మ (చివరి మూడేళ్లు) డిప్యూటీ మేయర్లుగా తొలి రెండున్నరేళ్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, చివరి రెండున్నరేళ్లు డిప్యూటీ మేయర్లుగా శీలం భారతి, మాడపాటి వెంకటేశ్వరమ్మ తిరుపతి - మేయర్‌ డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణ చిత్తూరు - మేయర్‌గా అముద చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ గుంటూరు - మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు ప్రకాశం - ఒంగోలు కార్పొరేషన్ మేయర్‌గా గంగాడ సుజాత డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ (బుజ్జి) కడప - మేయర్‌గా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నిక డిప్యూటీ మేయర్‌గా షేక్ ముంతాజ్ బేగం (మైనార్టీ విభాగం) అనంతపురం- కార్పొరేషన్ మేయర్ వసీం సలీం  డిప్యూటీ మేయర్‌గా దాసరి వాసంతి సాహిత్య

అక్కడ మందుగోలీ.. ఇక్కడ మసాజ్‌.. నేతల సేవే ప్రజాసేవా?

ఒకప్పుడు ప్రజాసేవ చేసిన వారికే పదవులు. ఇప్పుడు నేతలకు సేవ చేసిన వారికే అందలాలు. తమకు ఎవరు ఊడిగం చేస్తే వారికే ఉన్నత స్థానాలు. వేరే అర్హతలు ఏవీ అవసరం లేదు. స్వామి భక్తి ప్రదర్శిస్తే చాలు. కోరుకున్న సీటు కోరి వరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి.  రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. కేసీఆర్‌కు మాత్రం బాగా కావలసిన వాడు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ప్రజల కోసం పోరాడలేదు. అయినా, రాజ్యసభ సభ్యులు అయిపోయారు. ఆయనకు ఉన్న అర్హతల్లా కేసీఆర్ మనిషి కావడం మాత్రమే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ గులాబీ బాస్ వెంటే ఉన్నాడట. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో ఆయన్ను వీల్ ఛైర్‌లో తీసుకెళ్లింది ఆయనే. సీఎం కేసీఆర్‌కు నిత్యం మందుగోలీలు ఇచ్చేది కూడా ఆయనే అట. ఈ ఆరోపణ చేసింది మరెవరో కాదు. అప్పటి టీఆర్ఎస్ నేత కొండా సురేఖనే స్వయంగా ఈ మాట అన్నారు. అలాంటి మందుగోలీలు ఇచ్చే సేవకుడికి.. పార్లమెంట్ పెద్దల సభకు పంపిన పెద్ద మనిషి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కొంచెం అంటూ ఇటూగా.. ఏపీలోనూ ఇదే సీన్. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఫిజియోథెరపిస్టు గురుమూర్తు. అప్పటి వరకూ అతను వైసీపీ సభ్యుడు కూడా కాదు. ఫిజియోథెరపిస్టుగా ఆయన తిరుపతి వాసులకు చేసిన సేవ కూడా ఏమీ లేదు. అయినా.. ఏరికోరి మరీ తిరుపతి సీటు ఆయన్ను వరించింది. అందుకు గురుమూర్తికి ఉన్న అర్హతల్లా.. జగన్‌కు పాదసేవ చేయడమే. అదేనండి.. పాదయాత్ర సమయంలో జగన్‌కు ఫిజియోథెరపిస్టుగా ఉండటమే. సుదీర్ఘ పాదయాత్రలో జగన్‌ వెంటే ఉన్నారు గురుమూర్తు. నడకతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. జగన్‌ కాళ్లకు ఎప్పటికప్పుడు మసాజ్ చేస్తూ.. సపర్యలు చేస్తూ వచ్చారు. అప్పుడు తనకు చేసిన పాదసేవకు మెచ్చి.. ఇప్పుడు గురుమూర్తిని తిరుపతి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని అంటున్నారు.  ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి? ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయని సీనియర్లు వాపోతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, సమస్యలపై పోరాడుతూ.. చుట్టూ జనం, మధ్యలో మనం అనేలా ఉన్న నేతలనే చట్టసభలకు పంపించే వారు. కానీ, ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేసీఆర్‌కు సేవ చేసినందుకు గాను సంతోష్ కుమార్‌ను రాజ్యసభకు పంపితే.. తనకు పాదసేవ చేసినందుకు గాను ఫిజియోథెరపిస్టు గురుమూర్తికి పార్లమెంట్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇలా తెలుగు రాష్ట్రాలు.. ఇద్దరు నేతలు.. దొందు దొందే అంటున్నారు నిజమైన ప్రజాస్వామ్యవాదలు.

అసెంబ్లీ లో హరీష్ రావు పాట..

చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’ అంటూ  నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాసిన పాటని మంత్రి హరీష్ రావు  వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఈ పాట పాడారు.   నల్లగొండలో ప్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ప్లోరోసిస్ బారిన పడడంలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించిందని హరీశ్ రావు అన్నారు. మిషన్ భగీరథ పథకం నల్గగొండ ప్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడిందని ఆయన అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండాకాలం వస్తే.. మహిళలు కుండలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదని.  ఆదిలాబాద్ ఆదివాసి ప్రాంతంలో జనం కలుషిత నీరు తాగి డయేరియా కారణంగా మరణించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్లలోనే తాగునీటి కష్టాలు తీర్చారని . ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని, మిషన్ భగీరథ పధకం ద్వారా  రాష్ట్రంలోని అన్ని అవాసాలకు శుద్ధి చేసిన సురక్షిత నీరు ఇంటింటింకి నల్లాల ద్వారా అందుతున్నాయని హరీశ్ రావు తెలిపారు. 

ఒక్క పాయింట్ కోసం.. రెజ్లర్ రితిక ఫొగట్ సూసైడ్

ఒక్క పాయింట్. ఒకే ఒక్క పాయింట్. ఆమె ఓడిపోయేలా చేసింది. ఫైనల్‌లో ఒక్క పాయింట్ తేడాతో టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశకు లోనైన ఆ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోరాటానికి, గెలుపునకు మారు పేరైన ఫొగట్ ఫ్యామిలీలో ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం.  బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ దంగల్ గుర్తుందిగా. ఆ సినిమా మహావీర్ ఫొగట్ కుటుంబ నిజజీవిత కథ. ఆ గీతా, బబిత ఫొగట్‌ల కజిన్ సిస్టర్ రితిక ఫొగట్(17). ఆమె సైతం మంచి రెజ్లరే. మహావీర్‌ ఫొగాట్‌ అకాడమీలో రితిక ఐదేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. తాజాగా జరిగిన స్టేట్ లెవెల్ జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో రితిక పోటీ పడింది. మంచి ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 14న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. మహావీర్ ఫొగట్ ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. పోరాటానికి మారు పేరైన ఫొగట్ ఫ్యామిలీ మెంబర్.. ఇలా నిజజీవితంలో ఫైటింగ్ స్పిరిట్‌ను మరిచి సూసైడ్ చేసుకోవడం విషాదకరం. 

సీఐడీ నోటీసులపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 

అమరావతి అసెంబ్లీ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఆర్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులివ్వగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41A కింద నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది చట్ట, న్యాయ విరుద్ధమని, ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోర్టును న్యాయవాదులు కోరారు. శుక్రవారం ఉదయం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.  రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించేలా దళితులపై ఒత్తిడి తెచ్చారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీలోని సెక్షన్ 41 (ఏ)(1) ప్రకారం నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది సీఐడీ.  ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ.. ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులకు ఆయన తన దగ్గరున్న వివరాలు అందించారు. 

తెలంగాణ బడ్జెట్ విశేషాలు..

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థికశాఖ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు.  2021-22 ఏడాదికి సంబంధించిన రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లుతో  మంత్రి హరీష్ రావు బడ్జెట్  ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధి , సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. రంగాల వారీగా బడ్జెట్ కేటాయిపు  రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు బడ్జెట్‌లో ముఖ్యాంశాలు: వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు వైద్యారోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లు సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు హోంశాఖ‌కు రూ. 6,465 కోట్లు డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ. 610 కోట్లు ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ. 400 కోట్లు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ. 2,363 కోట్లు సాంస్కృతిక ప‌ర్యాట‌క రంగాల‌కు రూ. 726 కోట్లు ఐటీ రంగానికి రూ. 360 కోట్లు మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు బడ్జేతేర నిధులతో కలిపి ఆర్టీసీకి రూ. 3000 కోట్లు అట‌వీశాఖ‌కు రూ. 1,276 కోట్లు దేవాల‌యాల అభివృద్ధి, అర్చ‌కులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమ కోసం రూ. 720 కోట్లు ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ. 1,730 కోట్లు విద్యారంగం: విద్యారంగ అభివృద్ధికి నూత‌న ప‌థ‌కం కోసం రూ. 4 వేల కోట్లు పాఠ‌శాల విద్య‌కు రూ. 11,735 కోట్లు ఉన్న‌త విద్యారంగానికి రూ. 1,873 కోట్లు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం: సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ. 1000 కోట్లు ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు బీసీల సంక్షేమం: నేత‌న్న‌ల సంక్ష‌మం కోసం రూ. 338 కోట్లు బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 5,522 కోట్లు మైనార్టీ సంక్షేమం: మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 561 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు మ‌హిళా, శిశు సంక్షేమం షీ టాయిలెట్ల‌కు రూ. 10 కోట్లు మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు మొత్తంగా మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు ప‌ట్ట‌ణాల అభివృద్ధి: ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 500 కోట్లు ప‌ట్ట‌ణాల్లో వైకుంఠ‌ధామాల నిర్మాణానికి రూ. 200 కోట్లు ప్రతి పట్టణంలో గజ్వేల్ తరహా మోడల్ మార్కెట్. సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి: ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు సుంకిశాల వ‌ద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు మూసీ న‌ది పున‌రుజ్జీవం కోసం, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 200 కోట్లు ఓఆర్ఆర్ ప‌రిధిలోని కాల‌నీల తాగునీటి స‌ర‌ఫరా కోసం రూ. 250 కోట్లు వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ. 250 కోట్లు ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ. 150 కోట్లు మొత్తంగా పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు ప‌రిశ్ర‌మ‌లు : ప‌రిశ్ర‌మ‌ల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 3,077 కోట్లు ర‌హ‌దారులు, భ‌వ‌నాల నిర్మాణం ఆర్ అండ్ బీ రోడ్ల‌కు రూ. 800 కోట్లు పంచాయ‌తీరాజ్ రోడ్ల‌కు రూ. 300 కోట్లు స‌మీకృత క‌లెక్ట‌రేల్లు, జిల్లా పోలీసు కార్యాల‌యాలు, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ల నిర్మాణానికి రూ. 725 కోట్లు ఆర్వోబీ, ఆర్‌యూబీల‌కు రూ. 400 కోట్లు మొత్తంగా రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌కు రూ. 8,788 కోట్లు ఇతరములు: రీజిన‌ల్ రింగ్ రోడ్డు భూసేక‌ర‌ణ‌కు రూ. 750 కోట్లు పౌర విమాన‌యాన అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు తొలిసారిగా రాష్ర్ట ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 500 కోట్లు ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ. 248 కోట్లు పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 29,271 కోట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు గా కేటాయించారు. ఈ బడ్జెట్ పై   

అటెండర్‌ కోడలు మేయర్‌.. డ్రైవర్ డిప్యూటీ మేయర్..

తిరుపతి కార్పొరేషన్‌లో ఆసక్తికర విషయాలు. మాజీ అటెండర్ కోడలే ఇప్పుడు మేయర్. ఒకనాటి డ్రైవరే ప్రస్తుత డిప్యూటీ మేయర్. కాలచక్రం గిర్రున తిరగడంతో ఈ రాజకీయ సిత్రాలన్నీ సాధ్యమయ్యాయి.  తిరుపతి కార్పొరేషన్ తొలి మేయర్‌గా డాక్టర్ శిరీష ఎన్నికయ్యారు. అదే కార్పొరేషన్‌లో ఒకప్పుడు అటెండర్‌గా పని చేసిన మునెయ్య కోడలే ప్రస్తుత మేయర్ శిరీష. మునెయ్య  ముప్పై ఏళ్ల పాటు తిరుపతి మున్సిపల్‌ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పని చేశారు. దఫేదార్‌గా ఆరేళ్ల క్రితం రిటైర్‌ అయ్యారు. అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు డాక్టర్‌ శిరీష మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య ఆనందం వ్యక్తం చేశారు. స్తున్నారు.  మునెయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు డాక్టర్‌ మునిశేఖర్‌ భార్యే డాక్టర్‌ శిరీష. ఆమెది కడప జిల్లా కొర్రపాడు. 1980లో జన్మించిన శిరీష తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల నుంచి 2011లో డీజీవో కంప్లీట్ చేశారు. కొంతకాలం తిరుపతిలో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. పీడియాట్రీషియన్‌ మునిశేఖర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతో పాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. కౌన్సిలర్‌గా గెలిచి తిరుపతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ సైతం ఒక్కోమెట్టు ఎక్కుతూ రాజకీయంగా ఎదిగిన వారే. ఏడవ తరగతి వరకు చదువుకున్న ఆయన డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. 1985లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1994లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చేశారు. 2002లో తిరుపతి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కౌన్సిలర్‌గా గెలిచారు. ప్రస్త్తుతం 14వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై.. డిప్యూటీ మేయర్‌గా మారారు.

మైదుకూరులో మెగా డ్రామా.. వైసీపీకే ఛైర్మెన్ గిరి..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినా.. ఆ పార్టీకి అధికార దాహం తీరడం లేదు. టీడీపీ మెజార్టీ సీట్లు గెలిచిన మున్సిపాలిటీలను అడ్డదారుల్లో కైవసం చేసుకుంటోంది. సొంత సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలోని  మైదుకూరు  మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. మైదుకూరులో మొత్తం 24 వార్డులు ఉండగా.. టీడీపీ 12 వార్డులు గెలిచింది. వైసీపీ 12 వార్డులు గెలవగా.. జనసేన అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు.  టీడీపీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించకుండా అడ్డదారులు తొక్కింది. టీడీపీ నుంచి ఆరో వార్డులో గెలిచిన షేక్ మహబూబి, జనసేన అభ్యర్థి బాబులు ప్రమాణ స్వీకార  ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. షేక్ మహబూబి రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. ఆమెను వైసీపీ నేతలే దాచి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అభ్యర్థి కూడా ఓటింగ్ కు రాకుండా వైసీపీ నేతలు బెదిరించారని  తెలుస్తోంది. ఇద్దరు సభ్యుల గైర్హాజరుతో మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్నికకు 22 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే హాజరయ్యారు. దీంతో వైసీపీ బలం 13కు పెరగగా.. టీడీపీ 11కు పడిపోయింది. దీంతో  మైదుకూరు  చైర్మెన్ పీఠం వైసీపీ వశమైంది.  మైదుకూరు పురపాలక సంఘం ఛైర్మన్ గా మాచునూరు చంద్ర, వైస్ ఛైర్మన్గా మహబూబ్ షరీఫ్ ఎంపికయ్యారు. అయితే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా అక్రమ పద్దతుల్లో అధికార పార్టీ చైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంపై జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలను గెలుచుకున్నా... ఇలా అడ్డదారులు తొక్కడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.  

ఒకడేవొక్కడు మొనగాడు.. తాడిపత్రి మెచ్చిన తోపు..

12 కార్పొరేషన్లు. 75 మున్సిపాలిటీలు. అన్నిచోట్లా వైసీపీ స్వీప్. ఆ ఒక్కటి మినహా. అదే తాడిపత్రి. తామే తాడిపత్రి తోపులమంటూ.. తమనెవరూ టచ్ చేయలేరంటూ.. జేసీ బ్రదర్స్ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. అనుకున్నట్టే అధికారపార్టీకి ఎదురొడ్డి మరీ తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేశారు. ఏపీ అంతటా ఒక లెక్క.. తాడిపత్రిలో మరోలెక్క అంటూ.. మీసం మెలేశారు జేసీ బ్రదర్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఫలితాల తర్వాత తీవ్ర ఉత్కంఠను రేపిన తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తాడిపత్రిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదు. టీడీపీ అభ్యర్థులకు గాలం వేయడం, వారిని బెదిరింపులకు గురి చేయడం లాంటి కుతంత్రాలు జేసీ రాజకీయ చాణక్యం ముందు పని చేయలేదు. తాడిపత్రిలో టీడీపీ తరఫున 18మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఒక సీపీఐ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆ ఇద్దరూ టీడీపీనే మద్దతు ప్రకటించారు. మొత్తం 20మంది కౌన్సిలర్లతో టీడీపీ రహస్య శిబిరం కొనసాగించింది. వైసీపీ సైతం పోటీ శిబిరం ఏర్పాటు చేసి నువ్వా నేనా అంటూ రాజకీయం నెరిపారు. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డికి ఎక్స్‌అఫీషియో ఓటింగ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడం.. వైసీపీకి రెండు ఎక్స్అఫీషియో ఓట్లు ఉండటంతో ఉత్కంఠ పెరిగింది. టీడీపీ కౌన్సిలర్లపై అధికార పార్టీ ఎంతగా ఒత్తిడి తెచ్చినా.. వారెవరూ జేసీని వీడలేదు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి మున్సిపాలిటీని ఎలాగైనా సొంతం చేసుకొని సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. వరుస కేసులతో తనను వేధిస్తున్న అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని పంతం పట్టారు. అందుకే, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఈసారి కౌన్సిలర్‌గా బరిలో దిగారు. తనతో పాటు తన వారినీ గెలిపించుకొని.. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓడిన చోటే మళ్లీ అందలం ఎక్కి.. తాడిపత్రిలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు జేసీ బ్రదర్స్. జేసీనా మజాకా...

బాక్స్ లో బాలుడు.. అయ్యో పాపం.. 

ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదంటారు. తల్లి త్యాగానికి వెలకట్టలేం అంటారు. తల్లి ప్రేమ ఆకాశమంత అంటారు. కానీ ఓ పసివాడి చావుకి కన్నా తల్లే కారణం అయింది. ఆ పసివాడు చేసిన పాపం ఆ తల్లి కడుపునా పుట్టమేనా? కొంత మంది ఐదు నిమిషాల సుఖం కోసం.. అసువులు బాస్తున్న ఎందరో పసికందులు.. తల్లి కడుపు ను జయించి విజేతలుగా పుట్టి.. అజేతలుగా అసువులు బాస్తున్నారు. పురిట్లోనే పసివాళ్లు ప్రాణాలు విడుస్తున్నారు.  ఏ తల్లి అయినా మూడు తన బిడ్డను గర్భంలో దాచుకుంటుంది. ఊయలలో వేసి జోల పడుతుంది. లేదంటే తల్లి వడిలో దాచుకుని పలు పడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును అట్టపెట్టెలో పెట్టి రోడ్డు మీద పడేసింది ఓ కసాయి తల్లి .. తొమ్మిది నెలలు తల్లి చీకటి గర్భంలో ఉన్న ఆ పసికందు వెలుగులోకి రాగానే ప్రాణాలు విడిచాడు.      అప్పుడే పుట్టిన పసికందును అట్టపెట్టెలో పెట్టి రోడ్డు పై వదిలి వెళ్లిన ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ డీఆర్ డీఎల్ శివాజీ చౌక్ వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అక్కడ ఉన్న స్థానికులు అట్టపెట్టలో పసికందును చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించగా ఆ శిశువు అప్పటికే మరణించాడు. ఆ పసిబిడ్డ చనిపోయాక అట్టపెట్టలో పెట్టి పారేశారా, లేక అట్టపెట్టలో పెట్టిన తరువాత చనిపోయాడా అనేది తెలియదు. ఆ పసికందు ఎలా చనిపోయాడు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలో పుట్టుక చావు సహజం కానీ అభం శుభం తెలియని. పుక్కుపచ్చలారని పసికందులను చంపే హక్కు ఎవరు ఇచ్చారు. ఆజ్ఞనపు అందరకు పోకడగలు ఇంకెంత కాలం..    

విశాఖ వైసీపీలో చిచ్చు! జగన్ కు వ్యతిరేకంగా నిరసన 

విశాఖపట్నం కార్పొరేషన్ లో పాగా వేశామని సంబరపడుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు తగిలింది. జీవీఎంసీ  మేయర్ ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. మేయర్ రేసులో ముందు నుంచి ప్రచారంలో ఉన్న వంశికృష్ణ యాదవ్ కు కాకుండా మరో మహిళకు  అవకాశం ఇవ్వడం వైసీపీలో కలకలం రేపుతోంది. జీవీఎంసీ ఔట్ గేట్ వద్ద వంశీ కృష్ణ శ్రీనివాస్ అనుచర వర్గం ఆందోళనకు దిగింది. వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మహిళలు కంటతడిపెట్టుకున్నారు.  సీఎం జగన్,  ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవీఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగడంతో  పరిస్థితి ఉద్రిక్తం మారింది.  విశాఖ మేయర్‎గా వైసీపీ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌గా జీఎం శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  విశాఖ మేయర్ పదవి దక్కకపోవడంపై వంశీ కృష్ణ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానొక  దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వెగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ...నిరసన చేసిన అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్ ఓదార్చారు.

పోలీసులు పొరపాటున చంద్రబాబు సోదరి ఇంటికి వెళ్లారట...

ఏపీలో రాజధాని అమరావతి అస్సైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడంతో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క నిన్న ఇదే విషయంలో టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ నివాసాలలో సిఐడి దాదాపు ఏడు గంటలపాటు సోదాలు జరిపిన సంగతి తెల్సిందే. దీంతో ఎపుడు, ఎక్కడ పోలీసులు సోదాలు చేస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   ఇది ఇలా ఉండగా  చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సోదరి హైమావతి ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తమను తాము పోలీసులమని కాపలాదారుకు చెప్పి ఇంటి ఆవరణలోకి వెళ్లారు. అయితే,ఆ ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండడంతో బారు బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.   ఈ ఘటన తరువాత హైమావతి ఇంటి వద్ద కాపలాదారుగా ఉన్న రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుతో పాటు   సీసీటీవీ పుటేజీలను రవి పోలీసులకు అందించాడు. అయితే ఈ ఘటనపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని..  అయితే తమ సిబ్బంది పొరపాటున నారావారిపల్లెకు బదులుగా కందులవారి పల్లెకు వెళ్లారని వివరణ ఇచ్చారు. చంద్రబాబు సోదరి హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో పోలీసులు పొరపాటున ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు. అయితే అదే పేరు కదా అని చెప్పి హోమ్ మంత్రి సుచరిత గారి ఇంటికి వెళ్ళలేదు..  ఇంకా నయం... అంటూ  తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేసున్నారు.  

భారత్ లో భారీగా కరోనా కేసులు

భారత్‌లో కరోనా మళ్ళీ పరుగులు తీస్తుంది. మహమ్మారి కరోనా మరోసారి తన పంజా విసురుతుంది. రోజు రోజుకి వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10.63లక్షల పరీక్షలు చేయగా.. 35,871 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,63,025కు చేరి.. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది.   మరోవైపు కరోనా మరణాలు మంగళవారంతో పోలిస్తే గత రోజు కొంతమేర తగ్గాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 188 మరణాలు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 172మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,216కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  2,52,364 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 20లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా వేసిన వారి సంఖ్య  3,71,43,255  కి చేరింది.