బాక్స్ లో బాలుడు.. అయ్యో పాపం..
posted on Mar 18, 2021 @ 12:31PM
ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదంటారు. తల్లి త్యాగానికి వెలకట్టలేం అంటారు. తల్లి ప్రేమ ఆకాశమంత అంటారు. కానీ ఓ పసివాడి చావుకి కన్నా తల్లే కారణం అయింది. ఆ పసివాడు చేసిన పాపం ఆ తల్లి కడుపునా పుట్టమేనా? కొంత మంది ఐదు నిమిషాల సుఖం కోసం.. అసువులు బాస్తున్న ఎందరో పసికందులు.. తల్లి కడుపు ను జయించి విజేతలుగా పుట్టి.. అజేతలుగా అసువులు బాస్తున్నారు. పురిట్లోనే పసివాళ్లు ప్రాణాలు విడుస్తున్నారు.
ఏ తల్లి అయినా మూడు తన బిడ్డను గర్భంలో దాచుకుంటుంది. ఊయలలో వేసి జోల పడుతుంది. లేదంటే తల్లి వడిలో దాచుకుని పలు పడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును అట్టపెట్టెలో పెట్టి రోడ్డు మీద పడేసింది ఓ కసాయి తల్లి .. తొమ్మిది నెలలు తల్లి చీకటి గర్భంలో ఉన్న ఆ పసికందు వెలుగులోకి రాగానే ప్రాణాలు విడిచాడు.
అప్పుడే పుట్టిన పసికందును అట్టపెట్టెలో పెట్టి రోడ్డు పై వదిలి వెళ్లిన ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ డీఆర్ డీఎల్ శివాజీ చౌక్ వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అక్కడ ఉన్న స్థానికులు అట్టపెట్టలో పసికందును చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించగా ఆ శిశువు అప్పటికే మరణించాడు. ఆ పసిబిడ్డ చనిపోయాక అట్టపెట్టలో పెట్టి పారేశారా, లేక అట్టపెట్టలో పెట్టిన తరువాత చనిపోయాడా అనేది తెలియదు. ఆ పసికందు ఎలా చనిపోయాడు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచంలో పుట్టుక చావు సహజం కానీ అభం శుభం తెలియని. పుక్కుపచ్చలారని పసికందులను చంపే హక్కు ఎవరు ఇచ్చారు. ఆజ్ఞనపు అందరకు పోకడగలు ఇంకెంత కాలం..