తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (సెప్టెంబర్ 26) అందజేశారు. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో 1994 బ్యాచ్‌కి చెందిన  ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.    శివధర్‌ రెడ్డి వచ్చేనెల1వ తేదీన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.  పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన శివధర్ రెడ్డి తప కెరీర్‌లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు.  శివధర్ రెడ్డి ఐక్యరాజ్యస సమితి శాంతి పరిరక్షణ వింగ్‌లోకూడా పనిచేశారు.ప్రస్తుతం శవధర్ రెడ్డి తెలంగాణ  ఇంటలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నారు.   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలే కలాన్‌ గ్రామానికి చెందిన శివధర్‌రెడ్డి. విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేసి ఆయన కొద్ది కాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో   అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఎఎస్పీగా పని చేశారు.  అలాగే గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా  పనిచేశారు.  2014-2016 మధ్య తెలంగాణకి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.    మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్ శివధర్ రెడ్డి హయాంలోనే జరిగింది.   

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. సంప్రదాయాన్ని దాటకుండా.. మాగంటి  గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన  ఆ సీటును ఆయన సతీమణి మాగంటి సునీతకే కేటాయించారు. దీంతో జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న సందిగ్ధతకు కేసీఆర్ తెరవేశారు.  అనవసర ఊహాగానాలకు తెరదించుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముందుగానే మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల సానుభూతితో పాటు.. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కీలక సామాజిక వర్గ మద్దతు కూడా లభిస్తుందన్న అంచనాతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.  అలాగే  పార్టీ తరపున నిర్వహించిన సర్వేల్లోనూ   మాగంటి కుటుంబానికి అవకాశం ఇస్తేనే బెటర్ అని తేలిందని, దీంతో ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా  కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారని అంటున్నారు.  మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు. ఇందులో మొదటి సారి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందగా, తరువాత రెండు సార్లు  బీఆర్ఎస్ తరపున గెలిచారు.  ఏవరు ఔనన్నా కాదన్నా, జూబ్లీ బైపోల్ లో విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం.  తాము పుంజుకుంటున్నామనీ,  మళ్లీ ప్రజాదరణ పొందుతున్నామనీ నిరూపించుకోవాలంటే జూబ్లీ బైపోల్ లో విజయం తప్పని సరి. ఎందుకంటే ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుంది. అంతే కాకుండా ఆ స్థానంలో మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కూడా సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ ను బైపోల్ లో కోల్పోతే.. పార్టీ క్యారడ్ స్థైర్యం పూర్దిగా దిగజారిపోయే అవకాశం ఉంది.  అందుకే కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ, అన్నివిధాలుగా ఆలోచించే.. ఇప్పుడు అభ్యర్థిని కూడా ప్రకటించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

ఇండియాపై ట్రంప్ మరో దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్ వార్ ను మరింత ఉధృతం చేశారు. తాజాగా భారత్ నుంచి దిగుమతి అయ్యే  ఔషధాలపై పై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.   గత ఏడాది  అమెరికా ఇండియా నుంచి దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను దిగుమతి చేసుకుంది కాగా  అమెరికాలోనే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహా యింపు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం ఇండియన్ ఫార్మా కంపెనీలపై తీవర ప్రభావం చూపనుంది.  భారత్ నుంచి అమెరికాకు అధికంగా జెనరిక్ మెడిసెన్స్ ఎగుమతి అవుతాయి.  చాలా వరకూ ఇండియన్   ఫార్మాస్యూటికల్ కంపెనీలకు తమ మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం  అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారానే వస్తున్నది.   దీంతో ఈ కంపెనీలపై ట్రంప్ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.  

ఓజీపై అంబటి యూటర్న్

ఒకే మాట మీద నిలబడటం అన్నది వైసీపీ ఎకో సిస్టమ్ లో లేనే లేదు. నిన్న ఔనన్నది కాదనడం.. కాదన్నది ఔనన్నడం ఆ పార్టీలో మామూలే. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి నేతలు, శ్రేణుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకు రాజకీయాలే కాదు, కులం, మతం, వర్గం ఇలా ఏదీ మినహాయింపు కాదు. తాజాగా సినీమాలు కూడా మినహాయింపు కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రుజువు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినీమా తాజాగా విడుదలైంది. విడుదల కు ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓజీపై, పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే గంటల వ్యవధిలోనే మళ్లీ యూటర్న తీసుకుని యథాప్రకారంగా పవన్ పై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆయన నటించిన సినీమానూ విమర్శించారు. అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు సీనీ, రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.   ఇంతకీ ఏం జరిగిందంటే..ఓజీ సినీమా విడుదలకు ముందు అంబటి రాంబాబు ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ.. పవన్ కల్యాణ్ ఈ సినిమాను కసిగా చేశారనీ, బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనీ పేర్కొన్నారు. అయితే గంటల వ్యవధిలోనే మాట మార్చారు. ఆ మేరకు ఓ ట్వీట్ చేస్తూ పవన్ సినిమా సక్సెస్ కావాలన్నది తన ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం అంటూ పేర్కొన్నారు. దీనిపై జనసైనికులు, పవన్ అభిమానులూ మండి పడుతున్నారు.  సోషల్ మీడియా వేదికగా అంబటిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంబటి కపటత్వానికి ఇది నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా మాట మార్చడంలో వైసీపీ ఆనవాయితీని అంబటి మరోసారి రుజువు చేశారని అంటున్నారు. 

నీరుకొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం

అమరావతిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా  అమరావతి సమీపంలోని నీరుకొండపై   భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. నీరుకొండ 300 అడుగుల ఎత్తు కలిగి ఉంది. విగ్రహ నిర్మాణం కోసం 100 అడుగుల ఎత్తున్న బేస్ నిర్మించి,  ఈ బేస్ పై 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అంటే మొత్తం 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందన్న మాట.  ఇక ఈ విగ్రహం   బేస్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు, మ్యూజియం, మినీ థియేటర్,    కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం వద్దకు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహ నిర్మాణం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇలా ఉండగా  దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  స్మారకాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపొందిం చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆకాంక్షకు అనుగుణంగా..  నీరుకొండ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు ఏర్పాటు కానుంది.   10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్నిఏర్పాటు చేయనున్నారు.    

భారీ వర్షాలు.. రేవంత్ సమీక్ష

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్, ఉన్నతాధికారులతో శుక్రవారం (సెప్టెబర్ 26) సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ముసురుపట్టినట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండు రోజులూ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే   అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం  చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని ఆదేశించారు. 

పవన్ కు అస్వస్థత.. వైద్య పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్ కు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. మంగళగిరిలో ఉంటూనే నాలుగు రోజులుగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా జ్వర తీవ్రత తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ కు బయలు దేరారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటారు. జనసేనాని అస్వస్థతతో ఉన్నారన్న వార్తతో జనసైనికులతో పాటు ఆయన అశేష అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళనా అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే జ్వరం వచ్చిందని అంటున్నారు.  

ఆక్షేపించడానికేం లేకేనా.. బాబు వయస్సుపై జగన్ వ్యాఖ్యలు?

తెలుగు దేశం పార్టీ అధినేత,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన దార్శనికతను  రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఈ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ  అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను  ఉపయోగించిన తీరును మేధావులూ, ప్రగతి కాముకులు ప్రశంసిస్తూనే ఉంటారు. ప్రస్తుతిస్తూనే ఉంటారు. దీంతో జగన్ కు చంద్రబాబుపై విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు వయస్సుపై కామెంట్లు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. ఇక ఆయన వయస్సు విషయానికి వస్తే.. ఇప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్లు. అయితేనేం.. 27ఏళ్ల నవయవ్వనులను మించిన ఉత్సాహం. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేద్దామన్న తపన ఆయనలో నిత్యం ప్రస్ఫుటిస్తుంటాయి. అటువంటి నారా చంద్రబాబునాయుడిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆయన    ముసలాయన  అంటున్నారు. ఆయనను వృద్ధుడు అనడం ద్వారా ఆయనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది తెలియదు కానీ..  చంద్రబాబు మాత్రం  తాను నిత్యయవ్వనుడినని తన తీరుతో, పని విధానంతో  పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజలు సైతం ఆయన ఉత్సాహాన్ని, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న ఉత్సుకతను, నిబద్ధతను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తున్నారు.  అదే సమయంలో   జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  అత్యంత అరుదుగా తప్ప పర్యటన చేసే వారు కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ లకే పరిమితం అవుతున్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు.  అయితే చంద్రబాబు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమౌతూ ప్రజాక్షేత్రంలో, అధికారిక కార్యక్రమాలలో నిరంతరం బిజీగా ఉంటారు. ఉంటున్నారు. అందుకు ఉదాహరణగా బుధవారం (సెప్టెంబర్ 24) గురువారం(సెప్టెంబర్25) ఆయన బిజీ షెడ్యూల్ ను గమనిస్తే సరిపోతుంది.    ముందుగా బుధవారం చంద్రబాబు క్షణం తీరిక లేని షెడ్యూల్ ను చెప్పుకుంటే.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాథాకృష్ణన్ కు విమానాశ్రయంతో స్వాగతం పలకడం తో మొదలైంది.  ఆ తరువాత చంద్రబాబు సకుటుంబ సమేతంగా  మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. అక్కడ నుంచి.. విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు.  ఆ తరువాత గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు. అక్కడ నుంచి తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక గురువారం (సెప్టెంబర్ 25) ఉదయమే ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి అమరావతి చేరుకుని అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నారు. సాయంత్రం డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో కూడా ఆయనలో ఎక్కడా అలసట చ్ఛాయలు కూడా కనిపించలేదు. ముఖంపై చిరునవ్వు చెరగలేదు.  ఒక రోజు పర్యటిస్తే రోజుల తరబడి ప్యాలెస్ కే పరిమితమయ్యే జగన్ చంద్రబాబు వయస్సుపై వ్యాఖ్యలు చేయడమేంటంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. 

క్విడ్ ప్రోకో నిజమే.. అడ్జుకేటింగ్ అథారిటీ

వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియా సంస్థ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది.   దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ కు కడప జిల్లాలో 407 హెక్టార్ల భూమిని అప్పటి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన ఈడీ.. దాల్మియా సిమెంట్స్ కు సున్నపురాయి గనుల కోసం కడప జిల్లాలో భూముల కేటాయింపునకు ప్రతిగా దాల్మియా సంస్థ జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని నిర్ధారణకు వచ్చిన ఈడీ ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుందని,  ఈ లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరిగింటూ కేసు నమోదు చేసింది.   కాగా ఈడీ ఆస్తుల జప్తును సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ  అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది.  ఎడ్జుకేటింగ్ అథారిటీ  ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.  

జల సంరక్షణ.. దేశంలోనే తెలంగాణ టాప్

జలసంరక్షణలో  దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది.  కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల సంచాయ్ తాజాగా ప్రకటించిన ర్యాంకులలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.  2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 5,20,362 వాన నీటి సంరక్షణ పనులు చేపట్టింది.  వీటిలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ వంటి పనులు ఉన్నాయి. కాగా  జల సంచాయ్ జన భాగీదారి  ర్యాంకుల్లో భాగంగా దేశంలో 67 జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో  తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలలకు అవార్డులు లభించాయి. వీటిలో రెండు కోట్ల  రూపాయల రివార్డు విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాలు టాప్ లో ఉన్నాయి. అలాగే వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలకు కోటి రూపాయల రివార్డులు,  భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు పాతిక లక్షల రూపాయల రివార్డులు దక్కాయి.   కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు గెలుచుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతోషం హర్షం వ్యక్తం చేశారు.  జలసంరక్షణలో ఈ మూడు జిల్లాలూ దక్షిణ భారతదేశంలోనే టాప్ లో ఉన్నాయని పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామి పనుల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ నిర్మించినందువల్లే కేంద్రం అవార్డుల వచ్చాయని   పంచాయతీరాజ్   సీతక్క చెప్పారు. అవార్డులు, రివార్డులు సాధించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, నల్లోండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ,మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ,జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్ విజేంద్రబోయి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లను మంత్రి సీతక్క అభినందించారు.

తమిళనాడు విద్యావిధానమే తెలంగాణకు ప్రేరణ.. రేవంత్

దక్షిణాది రాష్ట్రాల విద్యావిధానాలకు తమిళనాడే ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  తెలంగాణలో అతి త్వరలో తమిళనాడులోలా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని అములు చేస్తామని చెప్పారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో  గురువారం (సెప్టెంబర్ 25) జరిగిన మహా విద్యా చైతన్య ఉత్సవ్‌కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన దేశ చరిత్రలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అన్నాదురై, కామరాజ్ నాడార్,  కరుణానిధి వంటి యోధులకు జన్మస్థలమైన తమిళనాడు రాష్ట్రం మాకు అదర్శమన్నారు. క‌రుణానిధి విజ‌న్‌ను  స్టాలిన్, ఉద‌య‌నిధిలు అనుసరిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ కామ‌రాజ్ ప్లాన్‌ అమలు చేశారన్నారు.  కామ‌రాజ్ త‌మిళ‌నాడులో తీసుకువ‌చ్చిన‌ విద్యా విధానాన్నే దేశం అనుస‌రిస్తున్నదన్న రేవంత్ రెడ్డి  త‌మిళ‌నాడు పేద‌ల‌కు సీఎం స్టాలిన్ అండ‌గా ఉన్నారని ప్రశంసించారు. ఇక సామాజిక న్యాయం అమలులో తెలంగాణ, తమిళనాడుల మధ్య సారూప్యతలు న్నాయన్నారు. మాజీ సీఎం కరుణానిథిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీల‌కు 42 శాతం, ఎస్సీ, ఎస్టీల‌కు 27 శాతం ఇలా మొత్తం 69 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.   

మళ్లీ గులాబి గూటికి కోనేరు

కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది.  మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన కోనేరు కోనప్ప.. ఆ తరువాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు.  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు సమక్షంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బఅనే చెప్పాలి.  కోనేరు కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 25) స్వామి వారిని మొత్తం 67 వేల 388 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం కోటీ 74 లక్షల రూపాయలు వచ్చింది. 

ఈడీ విచారణకు నటుడు జగపతి బాబు

సాహితీ ఇన్ ఫ్రా కేసులో  నటుడు జగపతిబాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.   గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను నాలుగు గంటలకు పైగా విచారించారు. ఇంతకీ విషయమేంటంటే.. సాహితీ ఇన్ ఫ్రా తరపున హీరో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో జగపతిబాబు, సాహితీ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు   ప్రశ్నించారు.   సాహితీ ఇన్ ఫ్రాపై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట   కొనుగోలుదారుల నుంచి  భారీ మొత్తం వసూలు చేసి చేసి మోసాలకు పాల్పడిందనీ, ఆ డబ్బులను అక్రమంగా తరలించిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది.  ఈ దర్యాప్తులో సాహితీ ఇన్ ఫ్రా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో  పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీస్ తో పాటు  తన దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.   ఫ్రీలాంచ్ విల్లా, ఫ్లాట్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా దాదాపు 700 మంది కస్టమర్ల నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.  ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా ఎండి లక్ష్మీ నారాయణ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.   ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడి అధికారులు ఈ కంపెనీ తరఫున పలు ప్రకటనలు ఇచ్చిన నటుడు జగపతి బాబుకు నోటీసులు ఇచ్చి గురువారం (సెప్టెంబర్ 25) విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే   జగపతిబాబు ఈడీ ఎదుట హాజయర్యారు. సాహితీ ఇన్ ఫ్రా ప్రకటనలలో నటించినందుకు జగపతి బాబు తీసుకున్న సోమ్ము ఎంత, ఆ సొమ్ము చెల్లింపు ఎలా జరిగింది అన్న విషయాలపై జగపతిబాబును ఈడీ విచారించినట్లు సమాచారం.  

బాలయ్య వ్యాఖ్యలకు చిరు కౌంటర్.. తన చొరవవల్లేనని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.  సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి బృందం అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలవటానికి వెళ్లినప్పుడు  అవమానం జరిగిందన్న బాలయ్య.. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ దిగివచ్చారనడం కరెక్ట్ కాదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్ట్ అయ్యారు.  బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. టికెట్ల పెంపుపై కొందరు నిర్మాతలు నన్ను కలిశారు. సినిమా ఖర్చు పెరుగుతుండటంతో.. టికెట్లపెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు కోరడంతోచొరవ తీసుకున్నానని వివరించారు.   అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే తాను వెళ్లినట్లు స్పష్టం చేశారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారనీ..   సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించి,  సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పానని చిరంజీవి వివరించారు. కోవిడ్ వల్ల అయిదుగురే రావాలంటే, తాము పది మంది వస్తామని చప్పాననీ, అందుకు జగన్ అంగీకరించారని అన్నారు.  అప్పట్లో బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్న చిరంజీవి..   తాను  గట్టిగా మాట్లాడితే జగన్ దిగివచ్చారన్నది కూడా అబద్ధమేనన్నారు.  సీఎం అయినా, సామాన్యుడైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతానన్నారు. అప్పట్లో తన చొరవ వల్లే టికెట్ల ధరలు పెరిగాయి చిరంజీవి పేర్కొన్నారు. ఇందుకు అక్కడున్నవారంతా సాక్ష్యులేనని వివరించారు.  తాను నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు పెరిగాయని గుర్తు చేశారు 

చిరు గట్టిగా మాట్లాడారనడం అవాస్తవం.. అసెంబ్లీలో బాలయ్య

జగన్ హయాంలో తెలుగుసినీ ప్రముఖులకు అవమానం జరిగిందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాటకృష్ణ అన్నారు. అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 25) మాట్లాడిన ఆయన జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు.  అప్పట్లో సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగినా ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారన్నారు.  సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్‌తో జరిగిన సమావేశానికి తనకు ఆహ్వానం అందినా వెళ్లలేదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా  చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని బీజేపీ సభ్యుడు కామినేని అన్నారు. అయితే కామినేని వ్యాఖ్యలను ఖండించిన బాలకృష్ణ  ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదనీ, చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగొచ్చాడని అనడం కరెక్ట్ కాదనీ స్పష్టం చేశారు. అప్పట్లో చిరంజీవిని  అవమానించారన్నది ఓకే... కానీ ఆయన చెబితే జగన్ దిగొచ్చారన్నది మాత్రం వాస్తవం కాదన్నారు.   అలాగే ఇటీవల విడుదల చేసిన ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉండటంపై కూడా బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. 

ఆసియా కప్ ఫైనల్ లో దాయాదుల ఢీ

ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ భారత్ తలపడనున్నాయి. గురువారం (సెప్టెంబర్ 26) సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై 11 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది.  ఇప్పటి వరకూ పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్థాన్ ఫైనల్ కు చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై చెమటోడ్చి గెలిచింది.  ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 11 పరుగుల ఆధిక్యతతో పాకిస్థాన్ గెలిచి.. ఫైనల్ కు చేరుకుంది.  ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ లో భారత్ తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 28) జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇది మూడో సారి అవుతుంది. గ్రూప్ స్టేజిలో ఒకసారి, సూపర్ ఫోర్ స్టేజిలో రెండో సారి ఇరు జట్లూ తలపడ్డాయి. ఆ రెండు సార్లూ కూడా భారత్ సునాయాస విజయాలను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.    ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి ఓడించాలని చూస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ గత ఓటములకు ప్రతీకారం తీర్చుకుని ఆసియా కప్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.   టీమిండియా ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా, పాకిస్థాన్   2 సార్లు   ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది      ఆసియా కప్ 2025లో టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ సాధికార విజయాలతో జోరుమీద ఉంది.  పాకిస్థాన్ అయితే మూడు మ్యాచ్ లలో విజయం సాధించి రెండింటిలో పరాజయం పాలయ్యింది.  

సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు ఊరట

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో  భారీ ఊరట లభించింది.   కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలో  ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై స్మితా సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం (సెప్టెంబర్ 25)న సభా సభర్వాల్ పై నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యా తీసుకోవద్దంటూ ఆదేశాలుజారీ చేసింది.  ఇదేవిషయమై ఇప్పటికే  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వంటి నాయకులకు కూడా హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ ఆవిర్భావం తరువాత అధికారం చేపట్టిన   కేసీఆర్    అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి. రేవంత్ రెడ్డి   నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అక్రమాలపై విచారణకోసం జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్   ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచి చర్చించింది. ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, ఆర్థిక అవినీతి, టెక్నికల్ లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వంటి అనేక అంశాలని కమిషన్ నివేదికలో పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ  మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ సీ మురళీధర్ రావు వంటి అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులని పేర్కొంది. బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్యాబినెట్ ముందు పెట్టకపోవడం, బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడం వంటి  విషయాలలో స్మితా సభర్వాల్ ను కూడా కమిషన్ నివేదికలో తప్పుపట్టింది.   ఈ నివేదికలో తన పేరు ప్రస్తావించబడటానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ ఈ నెల 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   నివేదికలో తన పేరును తొలగించాలని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించి,  ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దనీ,  ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో కలిపి స్మితా సభర్వాల్ పిటిషన్ ను కూడా విచారి స్తామనీపేర్కొంది.