వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించే ఈ పండుగ చివరి రోజు మహిళలు పెద్ద ఎత్తున సమీకరించి సాంప్రదాయ ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. రంగురంగుల పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు.హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, సరూర్‌నగర్‌ పరిసరాలు వెలుగులతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకంగా సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం విశేష ఆకర్షణగా నిలిచింది. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మను నిర్మించి గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా ఈ వేడుకను నిర్వహించారు.  ఒకేసారి 1,354 మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ కొత్త రికార్డును సృష్టించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి వేడుక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.హనుమకొండ, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ సహా పలు జిల్లాల్లోనూ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను ఆడుతూ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. మరోవైపు సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాయి. 

డొనాల్డ్‌ ట్రంప్ మరో సంచలన నిర్ణయం

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ సినిమా పరిశ్రమను కాపాడే లక్ష్యంతో విదేశాలలో నిర్మించే అన్ని మూవీలపై100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. హాలీవుడ్ ఇండస్ట్రీ నశించిపోతుందని ఇతర దేశాల ప్రోత్సాహకాల కారణంగా అమెరికాలో షూటింగ్‌లు తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు.  ఈ సుంకం విధింపుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిస్తుంది.  చిన్నారుల వద్ద నుంచి క్యాండీని లాక్కున్నట్లు.. అమెరికా చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు చేజిక్కించుకున్నాయని ఆరోపించారు. భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో హాలీవుడ్‌ సినిమా, టెలివిజన్‌ నిర్మాణం యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు మళ్లుతోంది. కారణం – అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్న భారీ పన్ను సబ్సిడీలు. దీంతో ఆ దేశాల్లో షూటింగ్‌ ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు ఇతర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుండగా, ఈ పరిణామాల నడుమ ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాకు సినిమా రంగం విస్తరిస్తున్న వేళ, అమెరికాలో కూడా భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాలు, పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. అయితే ట్రంప్‌ నిర్ణయం వల్ల తెలుగు సినీ పరిశ్రమపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇప్పటికే భారత ఎగుమతులపై 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.  

స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు

  తిరుమల  శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమ‌వారం  శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం. స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో  వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో ముర‌ళీకృష్ణ‌,  సీఈ సత్యనారాయణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు నిలిపివేత

  బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. 16 రోజులుగా మత్స్యకారులు పరిశ్రమ ఏర్పాటు వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి వచ్చిన హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని పరిశ్రమ పనులు ఆపేయాలని ఆందోళనలు చేయటంతో పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.  అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజ్యపేటలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా  నిరసనలో సేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రమాదకర అతి కాలుష్యకరమైన బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ వల్ల మత్స్య సంపద హాని కలుగుతుందని, పరిశ్రమ వ్యర్ధాలు వల్ల మత్స్య సంపద నాశనం అయిపోద్దని, గాలి,నీళ్లు, సహజ సంపద కలుషితం అవుతుందని అన్నారు. పరిశ్రమ నిర్మాణాన్ని అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. 

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  ప్రజలకు సద్దుల బతుకమ్మ సందర్బంగా మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూలను పూజించే  గొప్ప సంస్కృతికి తెలంగాణ నెలవని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లందరికీ ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధాననికి, ఐక్యతకు నిదర్మనమన్నారు.  బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటడానికి సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మందికి మహిళలతో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహింస్తుదని ఆయన తెలిపారు.  తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకొని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణ కు ప్రత్యేకమని చెప్పారు. కష్టాలన్నీ తొలగి, ప్రతి ఇల్లూ   సుఖసంతోషాలతో నిండేలా, ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు.

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల నక్షత్రం సందర్బంగా సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.  ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను కూడా ఆయన అమ్మవారికి అర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. సీఎం చంద్రబాబు రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.  

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్

  టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున  సజ్జనర్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక కొత్త మార్పు శకం ప్రారంభమైంది. ఆర్టీసీ బ్రాండ్‌ను మళ్లీ ప్రజల్లో స్థాపించేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ‘మన ఆర్టీసీ’ అనే నినాదం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపే ప్రయత్నం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసి, ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపరిచారు. ఆదాయ వనరులను పెంచే దిశగా సరుకు రవాణా సేవలను విస్తరించి, ప్రత్యేకంగా కార్గో సేవలను ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు.

రేపు హస్తినకు సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యహ్నం 12.30 గం.లకు బయలుదేరి 1.30 గం.లకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గం.లకు సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడుపై ప్రసంగించనున్నారు. కాగా నేడు ముఖ్యమంత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకోని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

మిథున్ రెడ్డి కి కండీషన్డ్ బెయిలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఈ కుంభకోణం కేసులో ఏ4న ఉన్న మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి  కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసి అనంతరం రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 29) ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.   రెండు ష్యూరిటీలు, రూ. 2 లక్షల పూచీకత్తుతో ఆయనకు బెయిలు మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, వారంలో రెండు సార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ షరతులతో కూడిన బెయిలుపై మిథున్ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 30) రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

నారా లోకేష్ కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

దుబాయ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది.  ఆ విజయం కూడా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుపై. దాదాపు 41 ఏళ్ల తరువాత ఆసియాకప్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇదే తొలిసారి. అటువంటి కీలక మ్యాచ్ లో భారత్ చొమటోడ్చినా కంఫర్ట్ బుల్ గా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లినా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సరే అది పక్కన పెడితే ఈ విజయంలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి నాలుగు ఓవర్లలోనే అత్యంత కీలకమైన అభిషేక్ వర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ ల వికెట్లు కోల్పోవడంతో టీమ్ ఇండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో గ్రూపు దశలోనూ, సూపర్ ఫోర్ లోనూ పాకిస్థాన్ తో రెండు సార్లు తలపడిన టీమ్ ఇండియా ఆ రెండు మ్యాచ్ లలోనూ అలవోకగా గెలిచింది. అయితే కీలకమైన ఫైనల్ లో తడబడుతోందా? అన్న ఆందోళన టీమ్ ఇండియా అభిమానుల్లోనూ వ్యక్తమైంది. అయితే తిలక్ వర్మ మాత్రం పట్టుదలతో ఆడి భారత్ కు అద్భుత విజయాన్ని అందించింది. నంబర్ 4గా బరిలోకి దిగిన తిలక్ వర్మ చివరి వరకూ క్రీజ్ లో నిలిచి, అజేయంగా 69 పరుగులు చేశాడు. జట్టుకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అటువంటి తిలక్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.ఇంతకీ తిలక్ వర్మ లోకేష్ కు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే.. అతడి క్యాప్.  లోకేష్ అన్నా.. ఇది నీ కోసమే అంటూ తన క్యాప్ పై రాసి సంతకం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు.  తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడిని చేసిందంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొన్న లోకేష్ ‘తమ్ముడూ.. నీవిచ్చిన ఆ అపురూపమైన బహుమతిని నీ చేతుల మీదుగా అందుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులూ తెగ వైరల్ అవుతున్నాయి.  

రెండు గంటలకు రూ. 11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్

  రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌  తన పార్టీ విరాళాల గురించి వస్తోన్న ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు కన్సల్టెన్సీ సేవలతో రూ. 241 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. వీటిలో రూ. 30.95 కోట్లు  జీఎస్టీ రూ. 20 కోట్లు , ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చెల్లించి.. తన సొమ్మను పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు వివరించారు. తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకానొకదశలో రెండు గంటలకు రూ.11 కోట్లు తీసుకున్నా. ఇది ఈ బిహార్‌ కుర్రాడి శక్తి’’ అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేశారు.  డొల్ల కంపెనీల నుంచి విరాళాలు వస్తున్నాయని ఆరోపించిన వారికి మీడియా ఎదుట గట్టి కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి గురించి మాట్లాడుతూ.. 1995లో ఓ హత్య కేసులో ఆయన దోషిగా తేలారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాను మైనర్‌నంటూ తప్పుడు పత్రాలు సమర్పించడం వల్ల ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు.   తాను సంపాదించిన నిధులు వృత్తిపరమైన ఫీజుల ద్వారానే వచ్చాయని, వాటిపై జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లించి పార్టీకి విరాళాలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘డొల్ల కంపెనీల నుంచి డబ్బులు వచ్చాయన్న ఆరోపణలు నిరాధారమని’’ మీడియా ఎదుట ప్రశాంత్ కిశోర్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి గురించి మాట్లాడుతూ.. 1995లో హత్య కేసులో ఆయన దోషిగా తేలినా, తప్పుడు పత్రాలతో శిక్ష తప్పించుకున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పదో తరగతి పూర్తిచేయని వ్యక్తి డిగ్రీ పట్టా పొందడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ రెండింటినీ ప్రశాంత్‌ తీవ్రంగా విమర్శించారు. ‘‘కాషాయ పార్టీ నేతలు లాలూ కంటే ఎక్కువ అవినీతి చేస్తున్నారు’’ అని ఆరోపించారు. లాలూ కుటుంబంపై విమర్శలు చేస్తూ.. ‘‘ప్రజలు పిల్లల భవిష్యత్తు ఎలా చూసుకోవాలో లాలూ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ 9వ తరగతి కూడా పాస్‌ కాలేదు. అయినా ఆయనను బిహార్‌ ‘రాజు’ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినా ఉద్యోగం దొరకడం లేదు’’ అని పీకే దుయ్యబట్టారు.  

జగన్ డిజిటల్ బుక్.. తొలి ఫిర్యాదు మాజీ మంత్రి విడదల రజినిపైనే

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆర్భాటంగా డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించారు. ఈ బుక్ లో వైసీపీ కార్యకర్తలు తమను వేధించిన వారిపై ఫిర్యాదులు నమోదు చేస్తే.. తాను అధికారంలోకి వచ్చాకా, వారి సంగతి తెలుస్తానని అన్నారు. చాలా మంది ఈ డిజిటల్ బుక్ ను గత ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ కు మక్కీకి మక్కీ కాపీ అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అది పక్కన పెడితే జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ బమూరాంగైందన్న సెటైర్లు సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. ఇప్పుడు వేధింపులపై ఫిర్యాదులు నమోదు చేయండి అంటూ.. జగన్ డిజిటల్ బుక్ ను ఇలా ప్రారంభించారో లేదో.. అలా  ఆ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఎవరిపైనో తెలుసా? వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిపై. ఔను డిజిటల్ బుక్ లో నమోదైన తొలి ఫిర్యాదు విడదల రజినీ పైనే..  జగన్ హయాంలో విడదల రజినిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు ఇలా లెక్కలేనన్ని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు విడదల రజినీపైనే రావడంతో జగన్ డిజిటల్ బుక్ సొంత పార్టీ వారిపై వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకుంటుదా అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతున్నది. ఇంతకీ రజినిపై ఫిర్యాదు ఏమిటంటే..  చిలుకలూరిపేటలో ఎన్నో అరాచకాలు చేసిన విడుదల రజనీ టీడీపీ వారినే కాదు.. సొంత పార్టీకి అండగా ఉండే వారిని కూడా టార్గెట్ చేశారు. నవతరం  అనే పార్టీకి స్వయం ప్రకటిత అధ్యక్షుడైన   రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. 2022లో  రజినీ మంత్రిగా ఉన్న సమయంలో  తన కార్యాలయం, నివాసంపై దాడులు చేయించారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. ఈ దాడికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన  ఆ ఫిర్యాదుకు జోడించారు.  విడదల రజినిపై చర్యలు తీసుకుంటేనే వైసీపీ కార్యకర్తలు జగన్ ను నమ్మతతారనీ, లేకపోతే కార్యకర్తలలో జగన్ విశ్వాసాన్ని కోల్పోతారని ఆ సుబ్రహ్మణ్యం అంటున్నారు.  వాస్తవానికి చిలుకలూరిపేట  ఎమ్మెల్యేగా విడదల రజిని ఉన్న సమయంలోనూ, అలాగే ఆ తరువాత జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలోనూ  రజినిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అంతెందుకు ఆమె మరిదిని పోలీసలు అరెస్టు చేశారు కూడా.  అధికారంలో ఉన్నప్పుడు ఆమె సొంత పార్టీ వారిపై కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో రజినిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడంతో.. ముందు ముందు వైసీపీ నేతలపైన డిజిటల్ బుక్ లో మరెన్ని ఫిర్యాదులు నమోదౌతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ నుంచి సైతం ఆమెపై ఫిర్యాదులు తప్పడం లేదు. ఆమె చేసిన దందాల కారణంగా పేటలో అయితే గెలలేరని గుంటూరుకు పంపించారు. అక్కడ అసలు ఘోరంగా ఓడిపోవడంతో..తనకు పేటనే మంచిదని చెప్పి మళ్లీ అక్కడికే ఇంచార్జ్ గా వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు.

సమరానికి దేవరగట్టు సిద్ధం!

కర్రల సమరం అనగానే గుర్తుకు వచ్చే పేరు దేవరగట్టు. ఏటా దసరా పండుగ సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవం పేరిట కర్రల సమరం జరుగుతుంది. ఈ ఏడు కూడా ఈ సమరానికి సర్వం సిద్ధమైంది. దసరా పండుగ రోజు అర్ధరాత్రి జరిగే ఈ సంప్రదాయ సమరానికి ఒక చరిత్ర ఉంది.   పూర్వం దేవరగట్టు కొండ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసుకునేవారు. మణి, మల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునే రుషులను వేధిస్తూ నానా బాధలూ పెట్టే వారు.  దీంతో ఋషులు తమ గోడును పరమశివునికి మొరపెట్టుకోగా, ఆయన ఆ రాక్షసులను వధించి పురుషులను రక్షించారని స్థల పురాణం చెబుతోంది. ఈ సందర్భంగా అక్కడ వెలిసిన మాల మల్లేశ్వర స్వామిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా పండగ రోజు పూజించుకుంటూ ఉంటారు. అయితే స్వామివారు కొండ మీద వెలిసినప్పటికీ కిందికి వచ్చి భక్తుల  కోరిన కోరికలు తీరుస్తారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,  నేరకిని, నెరకిని తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు కిందికి వచ్చిన మాల మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తొలతగా తమ గ్రామాలకు తరలించేందుకు కర్రలతో సమరం చేస్తారు.   దీనినే బన్నీ ఉత్సవం అంటారు. ఆయా గ్రామ ప్రాంతాల ప్రజలందరూ ఈ సమరంలో ఎంతో నియమ నిష్టలతో పాల్గొంటారు. అయితే ఈ ఉత్సవంలో దెబ్బలు తగిలిన రక్త గాయాలు అయినా కేవలం పసుపు మాత్రమే పూసుకుని తిరిగి బన్నీ ఉత్సవాల్లో పాల్గొంటారు. మరీ ప్రాణంతమైన గాయాలు అయితే తప్ప ఆసుపత్రులకు వెళ్ళరు. అయితే కొన్ని సందర్భాలలో ఈ కర్రల సమరంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో  బన్నీ ఉత్సవాన్ని ఆపేందుకు, కనీసం..  హింసకు తావు లేకుండా జరుపుకులా  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక దశలో పోలీసులు ఈ సాంప్రదాయ కర్రల సమరంపై నిషేధం కూడా విధించారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని వదులుకోబోమని తెగేసి చెప్పారు. పోలీసుల ఆంక్షలు, నిషేధం దారి నిషేధానిదే.. అన్నట్లుగా సంప్రదాయంగా జరిగే కర్రల సమరం యథావిథిగా జరుపుకుంటున్నారు స్థానికులు.  తీవ్రమైన పోలీసు నిర్బంధం   ఉన్నప్పటికీ అర్ధరాత్రి 12 గంటలకు దాటంగానే ఒక్కసారిగా వేలాది మంది కర్రలతో ఆ ప్రాంతాన్ని చేరుకొని తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు కానీ అధికారులు కానీ ఏమీ చేయలేక వారికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయవలసిన పరిస్థితి. దీంతో కర్రల సమరం సమయంలో ఎవరికి గాయాలైనా.. ఎటువంటి ప్రాణాపాయం  సంభవించకుండా అక్కడే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్సను అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కర్రల సమరంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా భారీగా బద్దవస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు.  ఇక ఉత్సవం సందర్భంగా పాటించే నియమాలు, నిష్టల విషయానికి వస్తే.. ఉత్సవానికి ముందు అమావాస్య నుంచి దీక్షను చేపట్టి కంకణ ధారణ చేసుకుంటారు. కంకణ ధారులైన వారు బన్నీ ఉత్సవం ముగిసే వరకు  కాళ్లకు చెప్పులు వేసుకోరు. మద్యం మాంసం ముట్టరు.  బ్రహ్మచర్యం పాటింస్తారు. ఇక దసరా రోజున అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని  తీసుకువెళ్లడానికి  నెరణికి, కొత్తపేట, నెరణికి తాండా తదితర గ్రామాల ప్రజలు  రెండు గ్రూపులుగా ఏర్పడి.. స్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లే  సమరం చేస్తారు.  ఉత్సవ విగ్రహం తిరిగి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు అత్యంత నియమనిష్టలతో పాటిస్తారు.  ఈ విధంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం అత్యంత కట్టుబాట్ల మధ్య, సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది .

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షురూ!

తెలంగాణ రాజకీయాల్లో  పెను సంచలనంగానూ, తీవ్ర చర్చనీయాంశంగానూ మారిన  ఎమ్మెల్యేలపై అనర్హత   పిటిషన్లపై  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు.  ఈ విచారణ సోమవారం (సెప్టెంబర్  29) అసెంబ్లీ భవనంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు విచారణ మొదలైంది.  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం  కింద జరుగుతున్న ఈ విచారణకు తొలుత‌ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తనఅడ్వకేట్లతో కలిసి హాజరయ్యారు.  ఆయన తరువాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు తమతమ అడ్వకేట్లతో కలిసి విచారణకు హాజరయ్యారు.  అలాగే ఈ పిటిషన్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్‌ కూడా  విచారణకు హాజరౌతారు. ఎమ్మెల్యేల అనర్హత విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంక్షలు కూడా విధించారు. ఈ భద్రతా ఏర్పాట్లూ, ఆంక్షలూ వచ్చే నెల 6వ తేదీ వరకూ అమలులో ఉంటాయి.   

విద్యుత్ వినియోగదారులకు ఆ డబ్బు వెనక్కు!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్(ఏపీఈఆర్సీ) చరిత్రలో తొలి సారిగా విద్యుత్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు అంటూ రిఫండ్ ఇవ్వనుంది. వైసీపీ హయాంలో అత్యంత భారంగా మారిన విద్యుత్ చార్జీల కారణంగా నానా ఇబ్బందులూ పడిన విద్యుత్ వినియోగదారులకు రిఫండ్ ద్వారా గొప్ప ఊరట కలిగించనుంది. 1999లో ఈఆర్సీ ఏర్పడిన తరువాత ఇలా రిఫండ్ ఇవ్వడం ఇదే తొలిసారి.   2023లో  ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) విధానం కింద విద్యుత్ పంపిణీ సంస్థలు  వినియోగదారుల నుండి అధికంగా డబ్బు వసూలు చేశారని ఏపీఆర్ఈసీ నిర్ధారణకు వచ్చింది. . డిస్కమ్ లు యూనిట్‌కు 40 పైసలు వసూలు చేయడం ద్వారా దాదాపు 2,787 కోట్ల రూపాయలను రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రిఫండ్ ను యూనిట్ కు 13 పైసల చొప్పున నవంబర్ 2025, అక్టోబర్ 2026 మధ్య కాలంలో దశలవారిగా సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీ నిర్ణయించింది.   వైసీపీ హయాంలో  2021–22, 2023–24 మధ్య ట్రూ అప్ చార్జీల పేరుతో  విద్యుత్ వినియోగదారులపై దాదాపు  18,567 కోట్ల రూపాయల భారం మోపింది ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పట్లో జగన్ ప్రభుత్వం వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసిన అదనపు చార్జీలను రిఫండ్ చేయాలని నిర్ణయించింది.  దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

హక్కుల కోసం పీవోకేలో ప్రజాందోళన.. మరో జెన్ జడ్ కానుందా?

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో  జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పాకిస్థాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా పీవోకే ప్రజలపై రాజకీయ, ఈర్థిక అణచివేతకు పాల్పడుతోందని ఆరోపిస్తూ అవామీ యాక్షన్ లీగ్ పిలుపు మేరకు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.  సోమవారం (సెప్టెంబర్ 29) నుంచీ షట్టర్ డౌన్, వీల్ జామ్  పేరుతో నిరవధిక బంద్‌ పాటిస్తున్నట్లు అవామీ యాక్షన్ లీగ్ పేర్కొంది. పాకిస్థాన్  ఆక్రమణ నుంచి విముక్తి కావాలంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రజాందోళనకు నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ లీగ్  38 డిమాండ్లలో ప్రజాందోళనకు నాయకత్వం వహిస్తున్నది. వాటిలో ప్రధాన డిమాండ్ పీవోకే అసెంబ్లీలో  పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా ముందుకు తీసుకువచ్చింది.  అలాగే గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలనీ,   విద్యుత్ చార్జీలను తగ్గించాలని కూడా జనం కోరుతున్నారు. ఏడు దశాబ్దాలుగా పీవోకే ప్రజలు కనీస ప్రాథమిక హక్కులు కూడా లేకుండా దుర్భర జీవితాలను గుడుపుతున్నారనీ, ఇప్పుడు హక్కుల కోసం నినదిస్తూ ఆందోళనకు దిగారనీ అవామీ యాక్షన్ లీగ్ చెబుతోంది. ఇప్పటికైనా పీవోకే ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వకుంటే ప్రజాగ్రహం మరింత పెచ్చరిల్లడం తథ్యమని హెచ్చిరించింది.   ఇలా ఉండగా పీవోకేలో ఆందోళనలను అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పీవోకే అంతటా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పెద్ద ఎత్తున దళాలను తరలించింది. అంతే కాకుండా ఆదివారం (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి నుంచీ పీవోకే వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. పీవోకేలోకి ఎవరూ ప్రవేశించకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా దిగ్బధనం చేసింది.  మరో వైపు పీవోకే అధికారులు అవామీ యాక్షన్ లీగ్ ప్రతినిథులతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  దీంతో పీవోకేలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజైన సోమవారం (సెప్టెంబర్ 29) ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. ఇక సాయంత్రం స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఇక  తిరుమల శ్రీ వేంకటేశ్వ రస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 28) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు     గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవలో వాహనం   ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త  బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తించారు.   వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడ వాహనంపై తిలకించి పులకించారు.   

మోగిన స్థానిక నగారా!

తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా మోగింది.  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ ను సోమవారం (సెప్టెంబర్ 29) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయి. తొలి రెండు దశలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు,  ఆ తరువాత మూడు దశలలో వార్డు, సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతాయి.  ఈ నెల  30లోగా  స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు ప్రభుత్వం కూడా తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని తెలిపింది.  దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 23, 27 తేదీలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు  నవంబర్ 11న కౌంటింగ్ జరిపి ఫలితాలను విడుదల చేస్తారు.  ఇక వచ్చే నెల 31, నవంబర్ 4, 8 తేదీలలో వార్డు, సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. గ్రామపంచాయతీల ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.   రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం 42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనే.  అయితే రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.  

క్రీడారంగంలో ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీ

ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఐదు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేైసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు, అభినందనలూ  వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ టీమ్ ఆండియాను అభినందిస్తూ  చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (సెప్టెంబర్ 29) రాత్రి పాకిస్థాన్ పై టీమ్ ఇండియా సాధికార విజయాన్ని నమోదు చేసి సంబరాలు జరుపుకుంటున్న వేళ.. ప్రధాని మోడీ పాకిస్థాన్ పై ఆసియాకప్ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ తో పోలుస్తూ ట్వీట్ చేశారు.   ఇండియా విజయాన్ని నమోదు చేసిన కొద్ది సేపటికే మోడీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆపరేషన్ సిందూర్ ను ప్రస్తావించారు. పహల్గామ్ దాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ తో ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్న ప్రధాని మోడీ.. ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయాన్ని క్రీడా రంగంలో ఆపరేషన్ సిందూర్ గా అభివర్ణించారు.