తెరపైకి మళ్లీ పాత పంచాయతీ!

తెలుగు రాష్ట్రాల మద్య పాత పంచాయితీ  మళ్లీ కొత్తగా మొదలైంది. పోలవరం ఎత్తు  అంశాన్నిమళ్ళి తెరమీదకి తీసుకు వచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఇటీవలి గోదావరి  వరదలతో ఈ చర్ఛ పోలవరంపై చర్చ మళ్ళి మొదలైంది. పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముంపు ముప్పు పెరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అయితే మంత్రి పువ్వాడ వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి ఖండించారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్న అంబటి రాంబాబు  వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరి కాదన్నారు ఆయనకు హితవు పలికారు.  పోలవరం  గేట్లు   ఎత్తడంలో జాప్యం  వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని విమర్శించిన పువ్వాడ, గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా ఇదే పరిస్ధితి పునరావృతమౌతుందనీ అందుకే పోవలరం ఎత్తు తగ్గించాలన్నదే తమ డిమాండ్ అని పునరుద్ఘాటించారు పోలవరం స్పిల్ వెల్ 50,000 క్యుసేక్కులకి పెంచారు .ప్రాజెక్ట్ లో గరిష్టం గా 15 రోజులు నీటి మట్టం నిలవ ఉండే అవకాశం ఉంది. అందు వల్ల భద్రాచలాని కి ఎలాంటి ముప్పు ఉండదు. భద్రాచలం లో 80 అడుగుల కరకట్ట నిర్మాణం జరిగింది. పోలవరం తో సంభందం లేకుండా ప్రస్తుతం 50నుంచి60 అడుగుల నీటిమట్టం నమోదు అవుతోంది. పోలవరం నుంచి వచ్చే నీటి మట్టం 43 అడుగులని దాని వల్ల భద్రాచలానికి ఎటువంటి ముప్పు  ఉండదన్నది ఏపీ వాదన. పనిలో పనిగా పువ్వాడ కొత్త డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. భద్రాచలాన్ని ఆనుకుని  ఉన్న ఐదు గ్రామాలనూ తిరిగి తెలంగాణలో కలిపేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.   ఎటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపాలని, వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాలలో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ చేశారాయన. రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాల అంశాన్ని తెరమీదకు తేవడం పరిపాటిగా మారిందని ఏపీ విమర్శిస్తోంది. పోలవరం కారణంగా భద్రాచలంకు ముప్పు ఏర్పడుతుందన్న వాదనకు ఎలాంటి హేతుబద్ధత, శాస్త్రీయత లేదని చెబుతోంది. గతంలో కూడా గోదావరికి భారీ వరదలు వచ్చాయని,కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,కేంద్రం నిధులు సమకూరుస్తోందని,ఏదైనా కేంద్రం చేతిలోనే ఉందని ఏపీ చెబుతున్నది. రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చే ఇటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమజంసం కాదని అంటోది.

రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు

అస‌లే పాల‌నా లోపాల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు రిషికొండ రిసార్ట్ పున‌రుద్ధ‌ర‌ణ కేసు త‌ల‌కుచుట్టుకుంది. విశాఖలోని రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చట్టపరమైన అనుమతు లన్నీ తీసుకున్న తరు వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపింది.  ఆర్థిక, పర్యాటక అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవా లన్న దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దాఖలైన వ్యాజ్యాలను భారీ జరిమానాతో కొట్టి వేయాలని న్యాయ స్థానా న్ని అభ్యర్థించింది. జాతీయ హరిత ట్రిబ్యు నల్‌ (ఎన్‌జీటీ) నియమించిన నిపుణుల కమిటీ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి చట్ట ఉల్లం ఘనలు జరగ లేదని తేల్చినట్లు గుర్తు చేసింది.  రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు.  కాగా ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో  రెండు  ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖ లయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్ ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఆయ‌న‌ వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటిషన్ ను సి.జే నేతృత్వంలోని ధర్మాసనం  విచారణకు అనుమతించింది.   రుషికొండలో పర్యవరణ ఉల్లంఘనలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యూనల్ కు రఘురామకృష్ణం రాజు లేఖ రాసిన సంగతి విదితమే. దీంతో రుషికొండపై తవ్వకాలు పర్యవరణ కాలుష్యంపై స్టే విధిస్తూ హరిత్ర ట్రిబ్యూలన్ ఆర్డర్ దీంతో దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ కు వెళ్ళింది. సుప్రీకోర్టు దీనిపై స్పందిస్తూ దీనిపై ఏపి హైకోర్టులో పెండింగ్ ఉన్న పిటిషన్లతో ఇంప్లీడ్  అవ్వమని చెప్పింది. దాన్ని అనుస‌రించి ఇంప్లీడ్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశామని న్యాయవాది ఉమేష్ చంద్ర  తెలిపారు. దీనిపై న్యాయస్ధానం స్పందిస్తూ అనుబంధ‌ పిటిషన్ ను అనుమతించింది. కాగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని  కోర్టు అన్నిపిటిషన్ల విచారణను ఈ నెల 27కు వాయిదావేసింది రఘురామ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సి.జే నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

వర్షాభావ దేవేంద్రుడే కారణమంటూ తాశిల్దార్ కు రైతు ఫిర్యాదు

ఎవరైనా నగలు పోయాయనో, మొగుడు కొట్టాడనో, ఆస్తిగొడవలనో ఫిర్యాదులు ఇవ్వడం సహజం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ రైతు ఏకంగా ఇంద్రుడి మీదే ఫిర్యాదు చేశాడు. వర్షాలు సరిగా పడక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ వర్షాభావ పరిస్థితికి దేవతల దేవుడైన ఇంద్రుడే కారణమనీ, అతగాడిపై చర్యలు తీసుకోవాలనీ కొరుతూ ఏకంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ అధికారులు సంపూర్ణ సమాధాన్‌ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. మూడు రోజుల క్రితం అంటే శనివారం గోండా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కల్నల్‌గంజ్ తహసిల్దార్‌ నరసింహ నారాయణ్ వర్మకు ఝాల గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు ఇంద్రుడిపై ఫిర్యాదు చేశాడు. అయ్యా, కొన్ని నెలలుగా మా జిల్లాలో వానలు కురవడం లేదు. కరువు తాండవించడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, జంతువులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెలల పాటు వానలు కురిపించని ఇంద్ర దేవుడిపై తగిన చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని సుమిత్  ఫిర్యాదు అందుకున్న తహసిల్దార్‌ దానిని చదవకుండానే తగిన చర్యలు తీసుకోవాలంటూ  ఓ ముద్ర వేసి జిల్లా మెజిస్ట్రేట్‌కి పంపించేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో పాలక యంత్రాంగం కనీసం ఫిర్యాదు కూడా చదవకుండా ఈ స్థాయిలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఈ ఫిర్యాదు ఏంటి? ఇందులో ఏం రాశారు? ఇది ఏ విభాగానికి పంపించాలని? అనే విషయాలను కూడా తెలుసుకోకుండా తహసిల్దార్‌ ప్రవర్తించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఈ కంప్లైంట్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కంప్లైంట్‌లో తహశీల్దార్‌ సంతకం, స్టాంపు కూడా ఉన్నాయి.ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా ప్రభుత్వ అధికారులను నవ్వుల పాలు చేసింది. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ డా.ఉజ్వల్ కుమార్ తహసిల్దార్‌పై విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని కలెక్టర్ అన్నారు. కేసు విచారణ నిమిత్తం చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ జయ యాదవ్‌కు అప్పగించినట్లు తెలిపారు. విచారణ కోసం యాదవ్ కల్నల్‌గంజ్ చేరుకోనున్నారు.అయితే సదరు తహసిల్దార్‌ ఈ ఫిర్యాదు గురించి స్పందించారు. ఈ కంప్లైంట్ చూసి నేను షాక్ అయ్యా. ఇది ఫోర్జరీ చేశారు. అసలు అలాంటి ఫిర్యాదు నా వద్దకు రానే లేదు. ఆ ఫిర్యాదుపై కనిపించే ముద్ర నకిలీది. సంపూర్ణ సమాధాన్ దివస్‌లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేస్తాం. ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపించం.ఇదంతా ఎవరో కావాలనే పుట్టించారు. దీనిపై విచారణ జరుగుతోంది అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చారు. చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంక్వయిరీ చేసి ఏం రిపోర్ట్ ఇస్తారో చూడాలి.

హ‌మ్మ‌య్య‌.. శాంతించిన వ‌రుణుడు

ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతున్న వ‌ర్షాలు కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గింది. ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 54వేల అడుగుల‌కు చేరుకుంది. కానీ ఇక్క‌డ మూడో  ప్ర‌మాద హెచ్చరిక మాత్రం కొన‌సాగుతోంది. 53 అడుగుల లోపు త‌గ్గితేగాని ఈ హెచ్చ‌రికను అధికారులు ఉపసంహ రించ‌రు.   మొత్తంమీద జిల్లాలోని ఏడు మండ‌లాల్లో 71 గ్రామాలు ఇంకా జ‌ల‌దిగ్భంధంలోనే ఉన్నా యి. 12వేల‌కు పైగా ఇళ్లు ముంపున‌కు గురికాగా సోమ‌వారానికి 11 వేల ఇళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి, పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలకు రహదారి లేకపోవడంతో ఆర్మీ హెలికాప్టర్‌ ద్వారా నిత్యావసర సరుకులను తీసుకెళ్లారు. 114 గ్రామాలకు చెందిన 27,778 మంది వరద బాధితులకు 79 పునరావాస కేంద్రాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. గోదావరి వరద ఉగ్రరూపం దాల్చి తిరిగి తగ్గుముఖం పట్టినా రామాలయం పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, పలు దుకాణాలు ఇంకా గోదావరి వరద నీటలోనే మునిగి ఉన్నాయి. ఉత్తర ద్వార ప్రాంగణం, మిథిలా స్టేడియం వద్ద కూడా ఇంకా వరద నీరు నిలిచిపోయింది. సీఎం కేసీఅర్ రివ్యూలో మందలించినా జిల్లా యంత్రాంగం తీరు మారలేదు. స్పెషల్ అధికారులు భారీ ఎత్తున వ‌ర‌ద‌ వస్తోందని తెలిసినా ముందే సింగరేణి మోటార్లను తెప్పించడంలో నిర్లక్ష్యం వహించారు. సీఎం కేసీఅర్ సూచన చేసినా వరద నీరు ఎత్తి పోయడంలో అధికారులు విఫలమయ్యారు. ఇలా వుండ‌గా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 6,24,610 క్యూసెక్కులకు చేరింది. 85 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. సరస్వతీ బ్యారేజ్ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 17,744 క్యూసెక్కులు కాగా.. దీనికి చెందిన 66 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తు న్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి  తీవ్రస్థాయిలో వరదలొచ్చిన నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని బొమ్మాపూర్‌ శివారులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కర కట్ట కోతకు గురైంది. 30 మీటర్ల మేర గండి పడింది. దీంతో సుమారు 25 ఎకరాల్లోని పంటల్లో ఇసుక మేట లు వేసింది. బ్యారేజీ కరకట్టకు వినియోగించిన మట్టితోపాటు రివిట్‌మెంట్‌కు వినియోగించిన బండరాళ్లు పంట చేలల్లో వచ్చి చేరాయి.  ఇప్పుడు వ‌ర‌ద‌ తీవ్రత తగ్గి.. చేను వద్దకు చేరుకున్న రైతులు ఇసుక మేట లను చూసి ఆందోళనకు గురయ్యారు. ఇసుక మేటల కారణంగా పత్తిమొక్కలు పూర్తిగా చనిపోయాయని బాధ‌ప‌డుతున్నారు.  రెండు రోజుల క్రితం బ్యారేజీ ఇదే కరకట్ట  బెగ్లూర్‌ శివారులోని  ఆంజనేయస్వామి ఆలయం వద్ద 50 మీటర్ల మేర కోతకు గురైంది. వరదలు తగ్గితే  ఇంకా ఎన్నిచోట్ల  కోతకు గురై ఉంటుం ద‌నే విషయం బయటపడుతుందని రైతులు అంటున్నారు.

ఐక్యత విచ్ఛిన్నం.. కమలానిదే ఆధిపత్యం

విపక్షాల ఐక్యత విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్రపతి ఎన్నికలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావడంలో విఫలమయ్యాయి. విపక్షాలన్నీ కలిపి నిలబెట్టిన అభ్యర్థికి తామే పూర్తిస్థాయి మద్దతును అందివ్వలేకపోయాయి. అంతే కాకుండా ముందు ముందు కూడా తాము ఏకతాటిపైకి రావడం, కలిసి కమలాన్ని ఢీకొనడం సాధ్యమయ్యే పని కాదని చెప్పకనే చెప్పేశాయి. దీంతో ఎవరు ఎన్ని కబుర్లు చెపపినా విపక్షాల ఐక్యత ఎండమావి వంటిదేనని తమ చేతలతో మరోసారి రుజువు చేసేశాయి.   జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి సమావేశం నిర్వహించినా.. అభ్యర్థిని ప్రకటించినా.. ఆ అభ్యర్థి తనకు మద్దతునిచ్చే పార్టీలను కలిసినా.. అవి చివరికి వచ్చే సరికి ఎవరిదారి వారిదే అన్నట్లుగా చీలిపోయాయి.  ఎంతలా అంటే  బిజెపి నాయకత్వంలని ఎన్డీఏ కూటమి నిలిపిన రాష్ట్రపతి అభ్యర్థికే తమ మద్దతు అంటూ విపక్షాల్లోని కొన్ని పార్టీలు బహిరంగంగా ప్రకటించేశాయి.   2024లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలలో కూడా కాషాయ పార్టీని గట్టిగా ఎదుర్కొనే విషయంలో విపక్షాలు కలిసి సాగుతాయన్న నమ్మకాన్ని ఆ పార్టీలన్నీ కలిసికట్టుగా వమ్ము చేశాయి.    రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడకముందే విపక్షాల నేతలు పోటా పోటీగా బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలు ఎవరికి వారు వేర్వేరుగా చేశారు. బిజెపిని నిలువరించాలన్న ఉద్దేశం కంటే విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించాలన్న తహతహే వాటిలో అధికంగా కనిపించింది.  బిజెపియేతర పార్టీలతో కూటమి, అని థర్డ్ ఫ్రంట్ అని సంకేతాలిచ్చారు.  ముఖ్యమంత్రులతో డిల్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. కానీ, నిర్వహించలేదు. చివరకు బిజెపి అభ్యర్థికే మద్దతు ప్రకటించి తమ మధ్య సఖ్యతలేదంటూ పరోక్షంగా వెల్లడించారు. చివరకు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ప్రతిపక్షాలతో అధికార పక్షం ఓ మారు సంప్రదిస్తే మేము ఆలోచించే వాళ్ళం.. అని ప్రకటన చేసి తమలోని సమన్వయలోపాన్ని కనిపించకుండా  జాగ్రత్త పడ్డాయి.  విపక్షాల తరపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సయోధ్య కుదరలేదు. శరద్ పవార్ ను అభ్యర్థిగా పలువురు ప్రతిపాదించినా.. ఆయన పోటీకి ససేమిరా అన్నారు. దీంతో మరో అభ్యర్థి కోసం వేట సాగించారు. జూన్ నెలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు దాదాపు 17 రాజకీయ పార్టీలతో డిల్లీలో పశ్చిమ బంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్‌‌జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్‌‌ఎస్‌పీ, ఐయూఎంఎల్, ఆర్‌‌ఎల్‌డీ, జేఎంఎం పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, జేడీఎస్ నుంచి హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ నుంచి శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్, ఎస్పీ నుంచి అఖిలేశ్ తదితరులు పాల్గొన్నారు. శిరోమణి అకాళీదళ్, ఆప్​, టీఆర్ఎస్, టిడిపి, వైఎస్సార్‌‌సీపీ, బీజేడీ పార్టీలు హాజరుకాలేదు. జెఎంఎం, శివసేనలు సమావేశంలో పాల్గొని అనంతరం బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. తటస్థంగా ఉన్న పార్టీలు బిజెపి నిలిపిన అభ్యర్థికి మద్దతును ప్రకటించాయి. దీంతో బిజెపియేతర పార్టీల్లోని కొన్ని పార్టీలు బిజెపికి సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటాయనేది పరోక్షంగా సంకేతాలను వెల్లడించినట్టుగా ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ అవగాహనతో ఏర్పడిన ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తన మద్దతును బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రం విపక్షాల అభ్యర్థిగా మమతాబెనర్జీ నిలిపిన యశ్వంత్ సిన్హాకు ప్రకటించిది. మహారాష్ట్రలోనూ శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ పార్టీలు ఒక జట్టుగా ఉన్నాయి. ఇటీవలి వరకు కూడా ఈ మూడు పార్టీలు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సిఎంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్, ఎన్సీపిలు మద్దతిచ్చిన అభ్యర్థికి కాదనీ బిజెపి అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించింది శివసేన. దీంతో భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు బిజెపితో స్నేహగీతం పాడటం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో విపక్షల మధ్య సఖ్యత లేదనీ, విపక్షాల్లోని కొన్ని పార్టీలు బిజెపితో కలిసి రాజకీయ ప్రయాణం సాగించే అవకాశలు లేకపోలేదనేది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం. మరి ఏ పార్టీలు కాంగ్రెస్ తో ఉంటాయో..? ఏ పార్టీలు ఒంటరిగా ఉంటాయో..? ఏ పార్టీలు బిజెపితో సాగుతాయో వేచి చూడాలి.

వ‌ర‌ద క‌ష్టాలు.. ఒడ్డునే ప్ర‌స‌వం

అకాల వ‌ర్షాలతో వాగులు, వంక‌లూ పొంగి పొర్లుతూన్న‌వేళ‌, గ్రామాలు, కుగ్రామాల్లో ప్ర‌జ‌లు ప్రాణ‌భీతితో వ‌ణుకుతున్న‌వేళ ఓ శిశువు జ‌న‌నం ఓ గ్రామాన్ని భ‌యాందోళ‌న‌ల నుంచి ఆనందోత్సాహంలోకి తెచ్చింది. క‌న్నీళ్ల నుంచీ ఆనంద‌భాష్పాలు పంచుకునేలా చేసింది. క‌ష్టాల మ‌న‌సుకు ర‌వ్వంత ఊర‌ట‌నిచ్చింది.  గాంధారి వాగు దాటుతోన్న‌స‌మ‌యంలో ఓ గ‌ర్భిణి ప్ర‌స‌వించింది. అస‌లే ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌తో వాగులూ అడ‌వి బిడ్డ‌ల‌ను ఖంగారెత్తిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న వారి ప‌రిస్థితి మ‌రీ దారుణం.. ఆస్ప‌త్రేలేవీ ద‌గ్గ‌రా దాపు ఉండ‌వు. వాగులు దాటి వెళ్లాల్సిందే. ఈమ‌ధ్య‌ భారీవ‌ర్షాలు అటుగా దాటి వెళ్ల‌డానికీ చాలా ఆలోచించి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సిన ప‌రిస్థితుల్లో ఉన్నా రంతా. స‌రిగ్గా ఈ ప‌రిస్థితులు, ఈ ఆందోళ‌న స‌మ‌యంలోనే ఓ గ‌ర్భిణికి నొప్పులు వ‌చ్చి ఆస్ప‌త్రికి తీసికెళ్లాల్సి వ‌చ్చింది. ఆమె ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి మండ‌లం హ‌ర్కాపూర్ పంచాయ‌తీ మామిడి గూడు  గ్రామానికి చెందిన ఉయిక.  ఆమెను  గాంధారి వాగు దాటించి ఆస్ప‌త్రికి తీసికెళ్లాలి. గ్రామస్థులు  ఆమెను ఇంద్ర వెల్లి పీహెచ్‌సీకి  తరలించేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఆమెను, బిడ్డ‌ను కాపాడ‌గ‌ల‌మ‌న్న ధైర్యం, వారిలో ఆ త‌ల్లి ఆనందాన్ని చూడ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం.. వెర‌సి వాగును దాట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌న్న ప‌దింత‌ల ధైర్యాన్నిచ్చింది. అంతే  రెండ‌ డుగులు వేసారో లేదో ఆమెకు భ‌రించ‌లేని నొప్పులు  ఆరంభ‌మ‌య్యాయి. అంతే  ఆమె మ‌రుక్ష‌ణం గ‌ట్టు మీద‌నే  ప్ర‌స‌వించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్‌సీ హెచ్‌ఈవో అశోక్‌, వాల్గొండ  ఏఎన్‌ఎం  జానా బాయి, ఆశా కార్యకర్త  మైనాబాయి వాగు దాటి వెళ్లారు.   గ్రామస్థుల సహాయంతో తల్లీ, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్‌లో ఇంద్రవెల్లి పీహెచ్ సీ కి తరలించారు.  త‌ల్లీ బిడ్డా క్షేమ‌మ‌ని తెలిసి మామిడిగూడు గ్రామ‌స్తుల్లో ఆనందం ఆకాశాన్నంటింది. 

వరద ముంపునకు శాశ్వత పరిష్కారమేది?

గోదావరి నదిలో ఉవ్వెత్తున వరదనీరు పోటెత్తి ప్రహిస్తోంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో అల్లాడిపోతున్నారు. వరద విలయంతో వందలాది లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక, తలదాచుకోవడానికి చోటు లేక తల్లడిల్లిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయల పంటలు నీటమునిగాయి. వేలాది పశువులు, పెంపుడు పక్షులు, సామాగ్రి వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వెళ్లేందుకు నిర్మించిన శబరినదిపై వంతెన పైనుంచి కూడా వరదనీరు ప్రవహిస్తోంది. భద్రాచలం క్షేత్రంలో వరదనీరు ముంచెత్తేసింది. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయిలో 71 అడుగులకు చేరుకుంది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద గోదావరి ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దిగువన తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పోటెత్తి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరదనీరు సుమారు 21 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 బ్యారేజీ గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి  23 లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో 41 పర్యాయాలు గోదావరి నదిలో భారీ వరదలు ముంచెత్తాయి. వరద పోటెత్తినప్పుడల్లా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అన్నింటినీ పోగొట్టుకుని అతలాకుతలం అయిపోతూనే ఉన్నారు. 1853 నుంచీ చూసుకుంటే.. ధవళేశ్వరం వద్ద రికార్డు స్థాయిలో అత్యధికంగా 1986 ఆగస్టు 16న 35.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డయింది. అంతకు ముందు 1953 ఆగస్టు 19న రెండో అత్యధిక వరదగా నమోదై 30 లక్షల క్యూసెక్కులు ప్రవహించింది. 2006 ఆగస్టు 7వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 28.5 లక్షల క్యూసెక్కుల వరద రికార్డయింది. 1990 ఆగస్టు 25న 27.8 లక్షల క్యూసెక్కుల వరదనీరు, 2010 ఆగస్టు 9న 20.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు నమోదైంది. ఇక తాజాగా గోదావరికి వచ్చిన వరద 21 నుంచి 22 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. అంటే.. గోదావరి నది చరిత్రలో 41 సార్లు వచ్చిన వరదల్లో ఈసారా నాలుగో లేదా ఐదో అతిపెద్ద వరదగా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. పదుల సార్లు గోదావరి వరదలు పోటెత్తి గ్రామాలకు గ్రామాలనే ముంచేసి, లక్షల కోట్ల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నా.. వేలు, లక్షల మూగజీవాలు మృత్యువాత పడుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏమి చేశాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటికి చుట్టం వచ్చిన తర్వాత పొయ్యి వెలిగించినట్టు ఏవో తాత్కాలిక చర్యలే తప్ప వరదలతో జననష్టం, ఆస్తి నష్టం జరగనివిధంగా ప్రభుత్వాలు శాశ్వతంగా చేసిన ప్రయత్నాలేవీ లేవనేది బాధితులందరి నోటా వినిపిస్తున్న విమర్శ. వరదలు ముంచెత్తుకు వచ్చిన తర్వాత నది కరకట్టలపై కొన్ని ఇసుకబస్తాలు వేయడమే తప్ప ఏటి గట్లను పటిష్టంగా ఏర్పాటు చేసే దిశగా ఏ ఒక్క ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదనేది వాస్తవం అంటున్నారు. వరదనీరు ఊళ్లను ముంచెత్తిన తర్వాత బాధిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అరకొరగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. వరదపోటు ఎక్కువైనప్పుడు ఆర్మీని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నాయి తప్ప బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా ఉపేక్షిస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా వరద కష్టాల నుంచి తమను శాశ్వతంగా బయటపడేసేందుకు సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను బాధితులు వేడుకుంటున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టు జెల్ల 

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై మంగళగిరి సీఐడీ పోలీ సులు నమోదు చేసిన కేసును కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈడీబీ సీఇవోగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ  జాస్తి కృష్ణ కిషోర్‌పై గతంలో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈడీబీ  సీఈవోగా ఉన్న ప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని గతంలో సర్కార్  ఆయనపై  సస్పెన్షన్  వేటు వేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల పదవీ కాలానికి ఆర్థిక అభివృద్ధి మండలి  సీఈవోగా కృష్ణకిషోర్ పని చేశారు.  పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని కేసు నమోదు చేశామ‌ని, అలాగే కృష్ణ కిశోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీకి  వైసీపీ ప్ర‌భుత్వం ఆదే శాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సీఐడీకి సూచించిన ప్రభుత్వం విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిశోర్‌కు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద  సీఐడీ  కేసులు నమోదు చేసింది. తనపై నమోదైన కేసుపై జాస్తి కృష్ణకిషోర్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కేసులపై ఆధారాలు సమర్పించ డంలో సీఐడీ విఫలమైందని పేర్కొంది. తాజాగా ఈ కేసులన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

వరద ముంపులో యానాం.. ఆకలి దప్పులతో జనం హాహాకారాలు

గోదావరి మహోగ్ర రూపం యానాం వాసులను అతలాకుతలం చేసేసింది. యానాంకు వరద పోటు ఏటా ఉండేదే. అయినా గోదారి తల్లికి మామీద అనుగ్రహమే కానీ ఆగ్రహం లేదు అన్నది అక్కడి వారి నమ్మకం, విశ్వాసం. అలాగే ఈ వరద కూడా అనుకున్నారు. కానీ కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద యానాం వాసుల నమ్మకాన్ని వమ్ము చేసేసింది. ఏటా ఉండేదా కదా అని ఇళ్లల్లోనే ఉండిపోయిన వారు వరద ఉగ్రరూపాన్ని చూసి వణికి పోతున్నారు. గుడారాల్లోనూ, తమ నివాసాల డాబాలపైకి చేరి ప్రాణాలనైతే కాపాడుకున్నారు కానీ, తిండీ, నీరు లేక అల్లాడిపోతున్నారు.   భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. పలు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.అడుగు బయట పెట్టలేని పరిస్థితి.. అక్కడ పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోయింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. అర్ధరాత్రి నీరు రావడంతో ఉలిక్కి పడిన ప్రజలు సూర్యోదయం వరకు బిక్కుబిక్కుమంటు గోడలు, డాబాలపై కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నారు.ఆకలితో ఆపన్న హస్తం ఎదురు చూసిన వారికి మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావుతో పాటు పలు స్వచ్చంద సంస్థలు సహాయం చేస్తునా, ఆ  సాయం పరిమితమే. అది కొందరికే అందుతోంది. మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం తమని పరామర్శించడానికి రాలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తము కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  గోదావరి నదిలో నీరు తగ్గడంతో పలు గ్రామాల్లో వరద 2 అడుగులు మేర తగ్గింది.  అయినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి, పి.గన్నవరం, అయినవిల్లి  మండలాల్లోని పలు గ్రామాల్లోని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకంగా మామిడి కుదురు మండలంలోని లంక గ్రామ వరద బాధితులు భోజనాల కోసం ఘర్షణ పడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.  ఆకలితో అలమటిస్తున్న బాధితుల ఆపన్నహస్తం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి.పెదపట్నం లంక గ్రామంలో వరద బాధితులకు గత ఆరు రోజులుగా కనీసం మంచినీళ్లు అందలేదని చెబుతున్నారు.   గత వారం రోజులగా వరద ముంపులోనే పీక లోతు నీటిలో ఆకలితో అలమటిస్తున్నామని,మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని లంక గ్రామాల్లోని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందన సరిగా లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తమను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జ‌గ‌న్ పాల‌న  పాపాల మ‌యం..  లోకేష్‌

బ‌రిలో నిల‌వ‌లేనివారు ఎంత‌టి ప‌నిక‌యినా సిద్ధ‌ప‌డ‌తార‌న్న‌ది అనాదిగా గ‌మ‌నిస్తున్న‌దే. ఇది రాజ‌కీయా ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు అతుకుతుంది. అధికారంలో వున్న‌వారికి తాము ఏద‌యినా చేయ‌గ‌ల‌మ‌న్న గుడ్డి ధీమా వ‌చ్చేస్తుందేమో, అబద్ధాల‌తో అవినీతి అక్ర‌మాల‌తో, దాడుల‌తో అధికారాన్ని ప‌ట్టుకుని ఊగులాడ టానికి సిద్ధ‌ప‌డ‌టం జ‌గ‌న్ స‌ర్కార్ బాగా నిరూపిస్తోంద‌ని విప‌క్షాలు ఇప్ప‌టికే దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ పాపాలు శిశుపాలుడి పాపాల వ‌లె పండిపోయాయ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సీఎం జ‌గ‌న్ పై మండిప‌డ్డారు.  మూడేళ్ల పాల‌న ప్ర‌జాద‌ర‌ణకు ఏమాత్రం నోచుకోలేదు, పైగా అన్ని ప‌థ‌కాలు, కార్యక్ర‌మాలు విఫ‌ల‌మై ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌ను తిట్టుకుంటున్నారు, ఇక ఏమాత్రం భ‌రించే స్థితిలో లేర‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌యింది. ఈ కార‌ణంగా జ‌గ‌న్‌లో అసంతృప్తి పెరిగిపోయి దాడుల‌కు దిగుతున్నార‌ని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న హ‌త్యారాజ‌కీయాల‌కు, గూండాల దాడుల‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని లోకేష్ ఆరోపించారు.   రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం మీరు చేయిస్తున్న హ‌త్య‌లు, దాడులే మీ ప‌త‌నానికి దారులు. రొంపిచ‌ర్ల మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ గూండాల ప‌నే అని లోకేష్ అన్నారు.  బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే వైసీపీ స‌ర్కారు దే బాధ్య‌త వ‌హించాల‌ని,  దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భ‌ర్త పాల్గొన్నాడంటే..వైసీపీ  రౌడీమూక‌లు ఎంత‌గా బ‌రితెగించాయో అర్థం అవుతోంద‌ని,  ఫ్యాక్ష‌న్‌ మ‌న స్త‌త్వం  ర‌క్తంలోనే ఉన్న‌ద‌ని, అందుకే  జ‌గ‌న్‌ పాల‌న‌లో ప‌ల్నాడు ప్రాంతం ర‌క్త‌సిక్త‌మ‌వుతోందని లోకేష్ మండిప‌డ్డారు.  ఇక‌నైనా హ‌త్యారాజ‌కీయాలు, దాడులు  ఆపండి. లేదంటే ఇంత‌కి నాలుగింత‌లు మూల్యం చెల్లించేం దుకు సిద్ధంగా వుండండి. జ‌గ‌న్‌రెడ్డి అధికారం, పోలీసులు అండ‌గా వున్నార‌ని రెచ్చిపోతున్న వైసీపీ నేత లకు ఇదే చివ‌రి హెచ్చ‌రిక‌. మేము తిర‌గ‌బ‌డితే, మీ వెంట వ‌చ్చేది ఎవ‌రు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మ‌ల్ని కాపాడేదెవ‌ర‌ని నారా లోకేష్ అన్నారు.

జాతి వివ‌క్ష‌త ఇంకానా.. మ‌నం మ‌నుషుల‌మేనా

ఇంగ్లీషువారు అంద‌రికీ అంట‌గ‌ట్టింది క్రికెట్ పిచ్చి. దీనికి కుల‌మ‌తాలు, భాషా, దేశ‌, ప్రాంతీయ విభేదాలేమీ లేవు. క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు, చ‌దువును ప‌క్క‌న పెట్టే వీరాభిమానులు అనేక‌మంది. అస‌లు దేశాల మ‌ధ్య విభేదాల‌ను, ద్వేష‌భావాన్ని తొల‌గించే శ‌క్తి క్రికెట్‌కే వుంద‌ని ఆమ‌ధ్య ఎవ‌రో ఒక రాజ‌కీయ‌వేత్తే అన్నారు. ఇది నిజం. గ‌తంలో పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డిన ప్ర‌పంచ‌క‌ప్ పోటీలో భార‌త్ గెలిచిన‌పుడు కెప్టెన్ ధోనీని నీ హెయిర్ స్ట‌యిల్ బావుంద‌య్యా అన్నారు పాక్ ప్ర‌ధాని! అంతా ఆశ్చ‌ర్యంతో, ఆనందంతో న‌వ్వుకున్నారు. అలాంటిది ఇంగ్లండ్ లో ఈమ‌ధ్య జాతివివ‌క్ష కామెంట్లు వినిపించి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా పోలేద‌న్న‌ది నిరూపించింది.  ఆ మ‌ధ్య ఇంగ్లండ్ ఎడ్గ్‌బాస్ట‌న్‌లో భార‌త్‌, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ జ‌రిగింది. మ‌న‌వాళ్లు ఎక్క‌డున్నా ఒకేలా గోల చేస్తారుగ‌దా. అలా భార‌త్ జ‌ట్టు వీరాభిమానుల సంఘం స‌భ్యులు అక్క‌డ స్టేడియంలో జాతీయ ప‌తాకం వూపుతూ గోల గోల చేశారు. కార‌ణం భార‌త్ బ్ర‌హ్మాండంగా ఆడుతున్న స‌మ‌య‌మది. భార‌త్ అనేకాదు, ఎవ‌రి జ‌ట్టుకు వారి వీరాభిమానులు అలానే గోల చేస్తుం టారు. ఇది చాలా స‌హ‌జ దృశ్యం. కానీ తెల్ల‌వారికి మాత్రం ఇలాంటివి బొత్తిగా న‌చ్చ‌వు. ఇప్ప‌టికీ వారి మ‌న‌సులు మ‌లిన‌మే. ఇంకా వారిలో జాతివివ‌క్ష‌త ఉంది. ఇలాంటి స‌మ‌యంలో అది బ‌య‌ట‌ప‌డుతుంది.  ఎడ్గ్‌బాస్ట‌న్‌లో జ‌రిగిన టెస్ట్ నాలుగో రోజు భార‌త అభిమానుల‌మీద ఆంగ్లేయులు తిట్ల వ‌ర్షం కురిపించారు. స్టేడియంలోని హాలీస్ స్టాండ్ వేపు వున్న ఒక భార‌తీయ ప్రేక్ష‌కుడిని జాతిపేర గ‌ట్టిగానే చాలా అస‌హ్యంగా దూషించాడు  ఓ తెల్ల‌వాడు. ఆ దూష‌ణ‌లు విన్న అత‌ని కుటుంబం అక్క‌డి నుంచి బ‌య‌టికి రావాల్సి వ‌చ్చింది. అయితే ఇది గ‌మ‌నించిన మ‌రి కొంద‌రు ఇంగ్లీషు ప్రేక్ష‌కులు మాత్రం ఆ కుటుంబం జాగ్ర‌త్త‌గా స్టేడియం బ‌య‌టికి వెళ్లేందుకు స‌హాయ‌ప‌డ్డారు.  కాగా  ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, వార్‌విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్ల‌బ్ అధికారులు ఈ సంఘ‌ట‌న గురించి వాక‌బు చేసి ఆ వ్య‌క్తుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇది ఊహించ‌నిద‌ని దీన్ని మ‌రీ పెద్ద‌ది చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. వారి దేశంలో జ‌రిగింది గ‌నుక వారికి ప్ర‌తిష్టాభంగం క‌ల‌గ‌కుండా సంఘ‌ట‌న‌ను తొక్కేశారు. ఇంత‌కంటే దారుణం మ‌రొక‌టి వుండ‌దు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం అనాగ‌రికం. ప్ర‌పంచ దేశాలు అభివృద్ధి ప‌ధంలో ముందడుగు వేస్తున్న కాలంలో ఇంగ్లండ్ లో ఇంకా ఇలాంటి ఆలోచ‌న‌లు వుండ‌డం మాన‌వ‌స‌మాజం హ‌ర్షించ‌దు.

త్యాగాలు స‌రే.. గ్రాఫ్ పెంచుకుంటేనే టిక్కెట్‌!

పూర్వం రాజుల‌కైనా, ఇప్ప‌టి సీఎంల కైనా అధికార‌పీఠం ఇబ్బందిక‌ర‌మైన‌దే. త‌మ ప్ర‌త్యేక‌త‌లు చాటు తూ పాల‌న‌లో అద్భుతాలు చేస్తూ ప్ర‌జాభిమానాన్ని పొందితేనే నాలుగు కాలాలు పాల‌న స‌వ్యంగా సాగు తుంది. అలాగాకుండా త‌న‌కుతోచిన విధంగా త‌న మాట అంద‌రూ వినాలి, త‌న మాటేశాస‌నం అంటే మాత్రం పీఠం ఎక్కించిన‌వారే దించేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇదుగో ఇలాంటి ప‌రిస్థితే ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి ఎదుర‌యింది. ఆయ‌న ఇటీవ‌లి పాల‌నా వ్య‌వ‌హ‌రాలు ఏవీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేదు. అన్ని రంగాల్లోనూ అనుకున్న విధంగా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. దీనికి తోడు మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించే కార్య‌క్ర‌మం చేస్తుండ‌ డంతో వారు జ‌నాల్లోకి వెళ్లి  ప్ర‌భుత్వ అద్భుత కార్య‌క్ర‌మాలు ప్రచారం చేయ‌డంలోనూ విఫ‌ల‌మై తిట్లు తింటూ వెన‌క్కి మాడిన మొహాల‌తో వ‌స్తూండ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఇపుడు వైసీపీ నేత జ‌గ‌న్ మ‌రింత కొత్త‌గా హెచ్చ‌రించారు. సోమ‌వారం జ‌రిగి న స‌మావేశంలో  జ‌గ‌న్ ఆగ్ర‌హం బ‌య‌ట‌పెట్టారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో ప్ర‌జల్ని ఆక‌ట్టుకుంటూ త‌మ గ్రాఫ్ పెంచుకుంటేనే వ‌చ్చేసారి టికెట్ గెలుచుకుంటార‌న్న హెచ్చ‌రిక చేశా రు. అంతే మ‌ళ్లీ అంద‌రిలో భ‌యం రెండింత‌ల‌యింది.  రాష్ట్రంలో ఇటీవ‌ల స‌ర్వేలు నిర్వ‌హించిన సంస్థ‌లు ఏతావాతా తేల్చిందేమంటే ఈప‌ర్యాయం వైసీపీకి ఛాన్సు బ‌హుత్ క‌ష్ట్ అని. అది మీడియా ద్వారానే సీఎంకీ చేరి సీట్లో నిల‌క‌డ‌గా కూర్చోలేని ప‌రిస్థితి వ‌చ్చిం ది. దీంతో ఆయ‌న అంద‌రిమీదా కారాలు మిరియాలు నూరుతున్నారు. పైగా ఇటీవ‌లి పార్టీ ప్లీన‌రీ వ‌ల్ల పెద్ద‌గా అనుకూలత సాధించ‌క‌పోగా విమ‌ర్శ‌లే బాగా విన‌ప‌డ్డాయి. ఇక ఇపుడు నోరు పారేసుకున్న నేత‌లు త‌మ గ్రాఫ్‌ను ఎలా పెంచుకోవాలో గ‌ట్టిగానే ఆలోచించాలి. ఇటీవ‌లి దాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క‌.. అన్న తిట్టిపోశాడు.. తప్ప‌దు తిమ్మిని బొమ్మిని చేసి గ్రాఫ్ పెంచుకోవాలి. కానీ హ‌ఠాత్తుగా పెరిగిపోవ‌డానికి అదేమ న్నా పెన్సిల్‌తో గీత పెంచ‌డ‌మా?   మంత్ర‌లు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో బుద్దిగా మ‌ళ్లీ తిరుగుతూ ప్ర‌జల‌కు త‌మ త‌ప్పిదాల‌ను తామే అంగీక‌రిస్తూ, క్ష‌మాప‌ణ‌లు కోరుకుంటూ ఈసారికి ఇలా వ‌దిలేయ‌మ‌ని కోరుకోవాలి. అప్ప‌టికీ ప్ర‌జ‌లు, ఓట‌ర్లు అంగీక‌రించితే వీరంతా అదృష్ట‌వంతులే. కానీ ఆ ప‌రిస్థితి అస్స‌లు కాన‌రావ‌డం లేదు.  జ‌గ‌న్  గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం పై  మ‌రోసారి వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు.  అది అతి ఘోరంగా విఫ‌ల మ‌యింద‌న్న‌ది ఆయ‌న‌కీ తెలిసొచ్చింది.  ప్ర‌జ‌లు అన్నిప్రాంతాల్లోనూ మ‌నం ఓట్లు వేసి గెలిపిం చిన పెద్ద‌మ‌నుషుల‌న్న గౌర‌వం కూడా లేకుండా, మామూలు లోక‌ల్ లీడ‌ర్ల‌ను చూసినంత చుల‌క‌న‌గానే చూస్తున్నారు. తిట్టారు, తొడ‌గొట్టి స‌వాలు చేశారు, ఒక్క మంచి ప‌నిచేశారా, ఓట్లు కోసం రావ‌డం త‌ప్పా అని మూడేళ్ల ఆగ్ర‌హాన్ని ఒక్క‌సారి కుమ్మ‌రించి మ‌రీ పంపారు. వెళ్లిన వారంతా భ‌యంతో, అవ‌మాన భారంతో నాయ‌కుని వ‌ద్ద‌కు వెళ్లి ఆ మిగిలిన తిట్లూ తిన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ గ్రాఫ్ ఎంత‌ని పెంచుకోవాలి?  అస‌లు ఎదురుగా క‌న‌ప‌డితేనే నాయ‌కునికి వీరి ప‌ట్ల చిరాకేస్తోంది. ఇక ఎన్నిక‌లు ఆట్టే దూరంలో లేవు గ‌నుక ఇక‌నైనా వెళ్లి మ‌ళ్లీ జ‌నాన్ని బుజ్జ‌గించే ప‌ని చూడండి  అని మ‌రో సారి జ‌నంలోకి తోసేసారు జ‌గ‌న్‌. పార్టీకోసం, త‌న కోసం త్యాగాలు చేశార‌ని ద‌యాదాక్షిణ్యాలు చూపించే ఛాన్స్‌కూడా లేద‌న్న‌ది జ‌గ‌న్ ఆగ్ర‌హం తాత్ప‌ర్యం. అందువ‌ల్ల అలా జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా వున్నామ‌ని, వారి ద‌య‌కు పాత్రుల‌య్యామ‌ని అనుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులూ ఇక ఈ కొద్దికాలం గ‌ట్టిగా త‌మ కోస‌మైనా శ్ర‌మించాల్సిన అవ‌స రం ఎంతైనావుంది. లేక‌పోతే  నాయ‌కుడు, పార్టీతో పాటు ప్ర‌జ‌లు త‌మ‌ని వ‌దిలేయ‌డం ఖాయ మ‌న్న‌ది ఈ స‌రికే వారంతా గ్ర‌హించే ఉండాలి.  ఎందుకంటే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ అనే కార్య‌క్ర‌మంలో పార్టీ నిర్దేశించిన మార్గ ద‌ర్శ‌కాల ప్ర‌కారం 15 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే పొల్గొంటున్నార‌ని 50 మంది అస‌లు వారి ఇంటి గ‌డ‌పే దాట‌లేద‌ని జ‌గ‌న్ ఆగ్రహించారు.  కార్యక్రమం నెలలో 16-20 రోజులు పాల్గొనాలని స్పష్టం చేశారు. 20 రోజులలో కనీసం ఆరు లేదా ఏడు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని జగన్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో 87 శాతం మందికి ప్రభుత్వం లబ్ధి చేసిందన్నారు. అందుకే మొత్తం 175 స్థానాలూ సాధించడం కష్టం కాదన్నారు. విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించాలని ఎమ్మె ల్యేలు కోరినా  సీఎం స్పందించలేదు. ‘సీఎం డెవల్‌పమెంట్‌ ఫండ్‌’ కింద నియోజకవర్గ అభివృద్ధికి రెండు కోట్లు.. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున విడుదల చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానని జగన్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు విజిట్‌ చేసిన 2 రోజుల్లో రూ.20 లక్షల నిధులు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.   పట్టభద్రుల స్థానాల్లోనూ వైసీపీ పోటీపట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈసారి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుదామని వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇప్పటి వరకూ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారికి బయటి నుంచి మద్దతిస్తూ వస్తున్నామ ని.. ఈసారి వైసీపీ తరఫున మనమే అభ్యర్థిని బరిలో కి దింపుదామని అన్నారు. కాగా..  నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని వైసీపీ ప్రకటించింది. తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన ఈయన వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అనుచరుడు. ఈయన భార్య సుస్మితారెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్‌ను టీడీపీ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికలకు అప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తుండడం విశేషం.

పెంపుడు కుక్క‌ను క‌లిసిన ఉక్రెయిన్ కుటుంబం

కుక్క‌ల‌కు మ‌నిషికి స్నేహ‌బంధం అనాదిగా వుంది. పెంపుడు కుక్క‌కు య‌జ‌మానిప‌ట్ల ఉండే విధేయ‌త‌కు గొప్ప సాక్ష్యం కేథ‌రినా త్యోవా కుటుంబమే. ర‌ష్యా ద‌ళాలు ఉక్రెయిన్‌పై దాడులు జ‌రిపిన‌ పుడు త్యోవా కుటుంబం కూలిపోయిన ఇంటిని విడిచి దూరంగా వెళ్ల‌వ‌లసి వ‌చ్చింది. నాలుగు నెల‌ల త‌ర్వాత యుద్ధ‌వాతావ‌ర‌ణం త‌గ్గేస‌రికి తిరిగి వ‌చ్చింది. చిత్రంగా వారి పెంపుడు కుక్క వారి కోసం ఆ శిధిలాల వ‌ద్దే ఎదురుచూస్తూ క‌న‌ప‌డింది.  ఉత్త‌ర ఉక్రెయిన్ లోని కీల‌క విమానాశ్ర‌యం వున్న హోస్తోమెల్‌పై ర‌ష్యా దాడి చేసింది. ఆ ప‌ట్ట‌ణంలో 35 సంవ‌త్స‌రాల బంగారం వ్యాపారి త్యోవా ఆమె కుటుంబం భ‌య‌ప‌డి ప‌ట్ట‌ణం విడిచి వెళ్లాల‌నుకున్నారు. ఆమె త‌న భ‌ర్త అలెగ్జాండ‌ర్‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వెళి పోయారు. కానీ వారు ఆ భ‌యాందోళ‌న‌ల్లో వారి పెంపుడు కుక్క సైబేరియ‌న్ హ‌స్కీని వ‌దిలేశారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వ‌దిలే శారు.. అనుకోవ‌చ్చు. అయినా వారికి అది త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ హ‌స్కీ త‌ప్ప‌కుండా త‌మ కోసం ఎదురుచూస్తుంటుంద‌ని త్యోవా న‌మ్మింది. కానీ వారికి ఆ త‌ర్వాత నుంచి తెలిసిన వార్త‌ల అనుస‌రించి వారి ప్రాంతం అంతా రాళ్ల గుట్ట‌లుగా మారింద‌ని. దాంతో త్యోవాకు హ‌స్కీ గురించిన బెంగ ప‌ట్టుకుంది. మ‌ధ్య  ఉక్రెయిన్ ప్రాంతంలోని  వినిత్సాలో త‌మ స్నేహితుల ఇంట్లో త్యోవా కుటుంబం త‌ల‌దాచుకుంది.  తొమ్మిదేళ్ల హ‌స్కీ మాత్రం అక్క‌డే ఆ శిధిలాల‌మ‌ధ్య తిరుగుతూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అటూ ఇటూ చూస్తూ, రాళ్ల‌మ‌ధ్య దొరికిన‌ది తింటూ రోడ్డుమీద‌కి వ‌స్తూ పోతూ బేల‌గా చూస్తూ నాలుగు నెల‌ల గ‌డిపింది. నాలుగు నెల‌ల త‌ర్వాత ఆ మ‌ధ్య త్యోవా కుటుంబం త‌న ప‌ట్ట‌ణానికి వ‌చ్చింది. ఆమెకు ముందుగా స‌గం కూలిన ఇల్లు కాకుండా హ‌స్కీ బ‌తికే వుందో లేదో చూడాల‌ని ఇంటివేపు కూతురుతో పాటు ప‌రుగులు తీసింది. కొద్దిదూరంలో హ‌స్కీ త‌న య‌జమానురాలు రావ‌డం చూసి ప‌రుగు ప‌రుగున వెళ్లి కాళ్ల‌ను చుట్టేసింది. దాని ఆనందానికి అంతేలేదు. త్యోవాకు గుండె భారం త‌గ్గింది. అమాంతం దాన్ని ఎత్తుకుని ముద్దుల‌తో ముంచెత్తింది. త్యోతా ఐదేళ్ల కూతురు త‌జిసియా అయితే హ‌స్కీని ఎత్తుకుని ప‌రుగులు తీసింది, ఆడింది, దాని తోక లాగి హ‌స్కీ ఆట‌పట్టించింది. హ‌స్కీ మాత్రం త‌జిసియా పాదాలు నాకి న‌న్నొద‌ల‌ద్ద‌న్న‌ది!

పవన్ పాలిటిక్స్ కి పనికి రాడు.. కేఏ పాల్

కేఏ పాల్ ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎత్తేస్తారా, ఎవరిని ఎప్పుడు విమర్శలతో ముంచెత్తుతారో కనీసం ఆయనకైనా తెలుసా అన్న అనుమానం ఆయన మాటలు విన్న ఎవరికైనా కలగక మానదు. ఎవరేమనుకున్నా, ఎంతగా నవ్విపోతున్నా ఆయన తన బాణీని మార్చుకోరు. పూటకో అంశం, గంటకో సమస్యతో ఆయన మీడియా ముందుకు వచ్చి హాస్యాన్ని పండిస్తూనే ఉంటారు. ఒకే సమయంలో ఒకే వ్యక్తిని పొగడ్తలతో ముంచేయగలరు, విమర్శలతో చెరిగేయగలరు.  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్.. విమర్శలతో ఫైర్ అయిన నాయకుల జాబితాలో ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా చేరిపోయారు. పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ తొమ్మిది పార్టీలతో కలిసిన పవన్ కల్యాణ్ అసలురాజకీయాలకే పనికి రాడని కేఏపాల్ అభిప్రాయపడ్డారు. పునర్విభజన చట్టంలోని హామీల అమలు డిమాండ్ తో బుధవారం (జులై20)న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధీక్ష నిర్వహించనున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుకేఏ పాల్ఆ సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఒక వైపు పవన్ రాజకీయాలకు పనికి రాడని విమర్శిస్తూనే  తన దీక్షకు జనసేన మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ పై విమర్శలతో చెలరేగిపోయిన పాల్ ఇప్పుడు తన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా అదే కేసీఆర్ ను మీడియా ముఖంగా కోరారు. అలాగే ఏపీలో అధికార పార్టీ, విపక్ష పార్టీల మద్దతునూ కోరారు. మద్దతు కోరుతూనే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్నీ, ఏపీలో జగన్ ప్రభుత్వాన్నీ కూడా విడిచి పెట్టలేదు. పవన్ కల్యాణ్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే అప్పులు చేస్తూ మందుకువెళితే రాష్ట్రాలు శ్రీలంకలా మారిపోవడం ఖాయమన్నారు. అలాగే కేంద్రం అప్పులపై కూడా ఆయన ధ్వజమెత్తారు. దేశాన్ని శ్రీలంక, వెనిజులా బాటలో మోడీ నడిపిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్‌లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సెకండ్ ఛాన్స్ ఇచ్చేదే లే!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం, స్కెచ్ సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాక్కాదు.. 175 కు 175 అనే మైండ్ గేమ్’ తో దూసుకు పోతున్నారు.  అయితే, రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారా? అంటే, లేదని చెప్పేందుకు పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదని  వైసీపీ నాయకులే గుసగుసలు పోతున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు ఇలాగే ఉంటే, ఇలాగే మైండ్ గేమ్ ఆడుతూ పోతే చివరకు బొక్క బోర్లా పడడం ఖాయమని అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశలన్నీ నవరత్నాల మీదనే ఉన్నాయి. అలాగే, సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ  తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని, అనుకుంటున్నారు. ఆశ పడుతున్నారు. అయితే  క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నగా ఉందని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ, సంతృప్తి చెందిన దాఖలాలు  అయితే లేవని అంటున్నారు. అది కూడా ఎవరో బయటి వారు కాదు, వైసీపీ జెండామోస్తున్న  వైసీపీ నాయకులు, కార్యకర్తలే, అంటున్నారు.  ఇంకో ఛాన్స్ అంటే  ప్రజలు నో .. ఛాన్స్ అంటున్నారని, వైసీపే నాయకులే వాపోతున్నారు.   జగన్ రెడ్డి, మాట తప్పను, మడమ తిప్పను అంటే నిజమే అనుకుని, అయన వెంట నడిచిన జనాలే ఇప్పడు, జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని అంటున్నారు.  రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రావడం లేదు. ఒకసారి కాదు, రెండు మూడు సార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా, పత్రికల ఆఫీసుల నుంచి  అడ్వర్టైజ్మెంట్ బిల్లులు వస్తున్నాయే, తప్ప టెండర్లు వేసేందుకు, కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు. ఇది దేనికి సంకేతం, ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదని చెప్పేందుకు నిదర్శనం కాదా అని వైసీపీ క్యాడర్,నాయకులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, కొండలా  పెరిగిపోతున్నాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక, కాంట్రాక్టర్లు ఆందోళనలు  చేయడమే కాదు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా జగనన్న పట్టించుకోవడం లేదని, చివరకు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు, నామినేషన్ పనులు కేటాయించినా, క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు, వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకున్న పార్టీ నాయకులు  నామినేషన్ పనులంటే వద్దు పొమ్మంటున్నారు. ఇది దేనికి సంకేతం. ముఖ్యమంత్రి మీద సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు విశ్వాసం సన్నగిల్లింది అనేందుకు నిదర్శనం కాదా, అని వైసేపీలోనే చర్చ జరుగుతోందంటే, జగన్ రెడ్డి విశ్వాస స్థాయి, ఎంతగా దిగజారిందో వేరే చెప్పనక్కర లేదని అంటున్నారు.   అలాగే, వైసీపీ   సర్పంచ్‌లు కూడా, పదవులు వదిలి పెట్టి పారి పోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలైన సర్పంచ్‌లు మీరిఇచ్చిన పదవి కోదండం, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే తాజాగా ప్రభుత్వ భూములు  ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాధుడే కనిపించడం లేదు. అది కూడా ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్, వైజాగ్ మహానగరంలోనే, ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో  సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది  లేక  దరఖాస్తు  గడువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఫలితం లేదు.నో రెస్పాన్స్.. ముఖ్యమత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా వుందని .. మురిసి పొతున్నారు.  ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండగా వుందో, అయన మీద ప్రజల విశ్వసం ఎ స్థాయిలో వుందో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’ ప్లాట్స్ కథే చేపుతోందని అంటున్నారు.  రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయలేదు.చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు.  నిజానికి,  రేపో మాపో రాజధాని అయ్యే నగరంలో స్థలం అంటే, ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకు పోతారు.. కానీ, వైజాగ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా వుంది.. అంటే.. జగన్ రెడ్డి  మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు అందుకే జనం జగన్ ను నమ్మడం లేదని, వైసీపీ నాయకులే అంటున్నారు.  ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేరని అంటున్నారు. మీటలు నొక్కి నోట్లు  వేశాం.. ఓట్లేందుకు  వేయరు అంటూ జగన్ రెడ్డి తమను కట్ట బానిసల కంటే హీనంగా చూపుతున్నారని, పేదరికాన్ని పరిహాసం చేస్తున్నారని. అందుకే జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేదే లేదని  అంటున్నారని, వైసేపీ క్యాడర్ అంటున్నారు. అందుకే, జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ .. అంటే ఇచ్చేదే లే.. అనే సమాధానమే ఏపీ అంతటా వినిపిస్తోంది.

అమ్మో గుండెలుతీసిన బంట్లు...  ర‌ఘురామ‌

అధికారంలో ఉన్నంత‌మాత్రాన అద్భుతంగా పాల‌న సాగిస్తార‌ని లేదు. కొన్ని పొర‌పాట్లు, కొన్ని తెలిసీ త‌ప్పుత‌డ‌క‌లూ చేస్తుంటారు. అలాగ‌ని అన్నింటినీ క‌ళ్లుమూసుకుని అంగీక‌రించ‌డం, అద్భుతం అని భ‌జ‌న‌చేయ‌డం కొంద‌రివ‌ల్ల కాదు. అధికారులు, మంత్రులూ తాన అంటే తందానా అనాల‌నీ లేదు. ఎవ‌రో ఒక‌రు త‌మలో త‌ప్పిదాల్ని నాయ‌కునికి తెలిసేలా చేయాలి. అదే నిజ‌మైన పాల‌నా ద‌క్ష‌త‌కు నిద ర్శ‌నం. అదే ప‌ని వైసీపీ ఎం.పి రఘురామ‌రాజు చేశారు. వైసీపీ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం అమ్మ‌కాల విషయం లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను వైసీపీ  ఎంపీ  బ‌య‌ట‌పెట్టారు. త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలో వున్నం త మాత్రాన అన్నీ దాచాల‌ని లేదుగ‌దా. పైగా  రాష్ట్రంలో 30 వేల టర్నోవర్ కలిగిన మద్యం అమ్మకాలను నగదు చెల్లింపుల ద్వారా విక్రయిస్తూ తమది మచ్చలేని పరిపాలన అని ఎలా చెప్పుకుంటామ‌న్నారు. అయినా త‌మ‌ది అవినీతి ర‌హిత పాల‌న అని చెప్ప‌డానికి ఎంతో ధ‌ర్యం కావాల‌ని, గుండెలు తీసిన బంటులు కావాల‌ని వైసీపీ ఎంపీ. ఎద్దేవా చేశారు.  అస‌లు త‌మ ప్ర‌భుత్వం విక్ర‌యిస్తున్న మ‌ద్యం ప్రాణాంత‌క‌మైన‌ద‌ని కేంద్రానికి ర‌ఘురామ రాజే ఫిర్యాదు చేయ‌డంతో పాటు ఏకంగా శాంపిల్స్ కూడా అంద‌జేశారు.  రాష్ట్రంలో మద్యం సేవించి 5000 మంది మృతి చెందినట్లుగా పవన్ కళ్యాణ్  పేర్కొన్నారని, అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉండే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో రంగు, రుచి ,వాసన కోసం ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.  రాష్ట్రంలో డిస్టలరీను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎవరు అని ఎన్ని మార్లు ప్రశ్నించిన, ప్రభుత్వ పెద్దల నుండి సమాధానం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆడాన్ డిస్టలరీ నీ అల్లుడుదని అందరూ అంటున్నారని, నీదని ఎవరు అనడం లేదని విజయసాయి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  ఆడాన్ డిస్టలరీ కంపెనీ డిస్టలరీలను లీజు తీసుకున్నదో చెప్పాలన్నారు. ఊరు పేరు లేని బ్రాండ్లను తయారు చేస్తూ, రాష్ట్రంలో మద్యాన్ని నగదు రూపంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నది నిజం కాదా?  అని పవన్ కళ్యాణ్  ప్రశ్నిస్తే తప్ప అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.  రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ  టిడిపి నేత‌ చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన నేత  పవన్ కళ్యాణ్ అన్నమాటలను తప్పేమున్నదని, అలాగే మీడియా రాష్ట్ర ప‌రిస్థితుల మీద  కథనాలలో అబద్ధం ఏమున్నది  ఫ‌లానా విషయంలో తప్పు అని  చెబితే అంగీకరించడానికి సిద్ధమన్నారు.  

ఆడలేక మద్దెలు ఓడు!

ఏపీలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైనా, జనం అష్టకష్టాలూ పడుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదనీ, పట్టించుకోవడం లేదనీ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మంత్రి అంబటి మాత్రం తమ ప్రభుత్వం వరద సమయంలో అద్భుతంగా పని చేసిందనీ, ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందనీ చెబుతున్నారు. పోలవరం కాపర్ డ్యాం ఎత్తు పెంచి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత మాదేనని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే వరద బాధితులకు రేషన్ తో పాటు రెండు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకూ తమది మాత్రమేనని చెప్పు కుంటున్నారు. ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రుల ప్రకటనల సంగతి ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో ప్రజలు మాత్రం  వరద ముంపునకు గురైన  తమను ప్రభుత్వం తమ ఖర్మకు తమను వదిలేసిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  ప్రజల నిరసన సెగలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ప్రజా నిరసనల గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు ఎమ్మెల్యేలు తాను ఆదేశించినా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓ 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే  ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనీ, మిగిలిన వారు అసలు పట్టించుకోనే పట్టించుకోవడం లేదనీ ఆగ్రహవం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమంపై సోమవారం సమీక్షించిన జగన్ ఎమ్మెల్యేల తీరుపై తవ్ర అసహనం వ్యక్తం చేశారు. గడప గడపకూ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లకు గడపగడపకూ కార్యక్రమమే గీటురాయని జగన్ స్పష్టం చేశారు. పని తీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్లిన వారికే టికెట్లని జగన్ స్పష్టం చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో జనం సమస్యలపై నిలదీస్తున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భంగానే చెప్పేశారు. అప్పట్లో రూ.2 కోట్లు విడుదల చేస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇది జరిగి మూడు నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. అసలు లోపం తన దగ్గర పెట్టుకుని మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం లాభమని సమీక్షా సమావేశంలోనే పలువురు ఎమ్మెల్యేలు గొణుక్కున్నారని సమాచారం. ఆడలేక మద్దెలు ఓడు అన్న చందంగా నిధులు విడుదల చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేయండి అంటూ ఆదేశాలు జారీ చేసి.. మళ్లీ అవి పరిష్కారం కావడం లేదని చిటపటలాడటమేమిటని ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో మధన పడుతున్నారు. మీట నొక్కేసి అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నానని గప్పాలు కొట్టుకుంటే సరిపోదనీ, క్షేత్ర స్థాయిలో పథకాల కోతలపై జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాగ్నిని గమనించాలని ఎమ్మెల్యేలు అంటున్నారు. అయతే ఈ విషయాన్ని నేరుగా అధినేతకు చెప్పేదెలా అని మధన పడుతున్నారు. బెజవాడ కార్పొరేషన్ నిధుల గురించి కొందరు అడిగితే అవే వస్తాయిలే అని తేలిగ్గా కొట్టిపారేయడాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మంత్రి శంకరనారాయణను నిలదీసిన మహిళపై మద్యం కేసు పెట్టడమేమిటని కూడా పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమస్యపై నిలదీసినప్పుడు దానిని పరిశీలించి పరిష్కరించాల్సినది పోయి కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలలో మరింత పలుచన కావడం ఖాయమని వారు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. జగన్ చెప్పినట్లు ఇంక 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికైనా అధినేత తీరు మారకపోతే.. ఆయన టిక్కెట్లు ఇవ్వకపోవడమే ఎమ్మెల్యేలే మహద్భాగ్యంగా భావించే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రజా విశ్వాసం కోల్పోయిన జగన్ సర్కార్..!

ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి  ఆ ప్రభుత్వం తన పథకాలను వివరించడానికి ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లు నిలదీసే తీరులోనూ, ఏవైనా పనులకు టెండర్లు పిలిస్తే వాటికి వచ్చే స్పందనలోనూ.. ఇంకా చెప్పాలంటే ఆదాయం కోసం భూములు వేలానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంలోనూ తెలుస్తుంది. ఆ విధంగా చూస్తే  ఏపీలోని  జగన్ సర్కార్ పై జనాలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి ఒకటి రెండూ కాదు వందల ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు  పనులకు టెండర్లు వేయడం లేదు. గతంలో చేసిన పనులకు సొమ్ముల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అంతెందుకు  వైసీపీ నేతలు కూడా కనీసం చిన్న చిన్న పనులను  నామినేషన్ కింద చేపట్టడాని కూడా ముందుకు రావడం లేదు. ఇఖ  జగనన్న లే ఔట్లు అంటూ ప్రభుత్వం స్థలాలను అమ్మడానికి చూస్తుంటే వాటిని కొనడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. మూడు రాజథానులలో ఒకటైన  పాలనా రాజధాని అని  చెబుతున్న విశాఖలోనే ప్రభుత్వ ప్లాట్లను కొనుగోలు చేయడానికి  ఎవరూ ముందుకు రావడం లేదు.   జగనన్న లే ఔట్ల పేరుతో  విశాఖలో  రెండు వేల ప్లాటను జగన్ సర్కార్ వేలానికి పెట్టింది. ఇందుకోసం భారీగా ప్రచారం కూడా చేసింది. తీరా వేలం నిర్వహిస్తే  కనీసం  రెండు వందల  మంది కూడా ఆన్ లైన్ లో అప్లై చేయలేదు. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి  విడతగా కట్టాల్సిన డబ్బులు కట్టిన వారు కేవలం 70 మందే.      జగనన్న లేఔట్ల పేర  ప్రభుత్వం నేరుగా అమ్ముతున్నా జనం కొనడాగిని ముందుకు రాకపోవడం ఎలా చూసుకున్నా ఈ ప్రభుత్వంపై జనంలో విశ్వాసం లేదనే తేటతెల్లమౌతున్నది. ఎందుకంటే ప్రభుత్వమే విక్రయించే స్థలాలకు  క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలూ రావు. అని జనం భావిస్తారు. కానీ జగన్ సర్కార్ విక్రయానికి పెట్టిన లే ఔట్లను కొనుగోలు చేయడానికి జనం నుంచి  స్పందన లేకపోవడమే ప్రభుత్వ విశ్వసనీయత ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్ధమౌతుంది. అదే గత  తెలుగుదేశం ప్రభుత్వం  అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే భారీ స్పందన వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్లాట్లు మొత్తం అమ్ముడు పోయాయి. జగన్  ప్రభుత్వం భూముల విక్రయానికి వేలం వేస్తే జనం  కనీసం పట్టించుకోవడం లేదు.  గడపగడపకూ  మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలిసిందే. ప్రజల్లో జగన్ సర్కార్ పలుకుబడి పూర్తిగా పడిపోయిందనడానికి ఇవే నిదర్శనాలని విపక్షాలు అంటున్నాయి. ఎప్పుడూ విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్  ఇప్పుడు తన సర్కార్ పైనే జనాలు విశ్వాసం కోల్పోయారనడానికి కనిపిస్తున్న తార్కానాలపై ఏం చెబుతారని ప్రశ్రిస్తున్నారు.

జగన్ సర్కార్ కు ఇక దబిడి దిబిడే.. తప్పుడు కేసులపై పోరాటానికి న్యాయాధికారుల ఫోరం!

జగన్ కు సొంత పార్టీ ఎంపీ నుంచి  ఎదురౌతున్న  సెగ  ఇంతింత కాదు. నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు వదిలేదే అంటూ జగన్ సర్కార్ తప్పిదాలనూ, పరిమితికి మించి  తీసుకున్న అప్పులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేసులు పెట్టినా, సీఐడీ పోలీసులు  భౌతికంగా హింసించినా ఆయన తగ్గడం లేదు. పైపైచ్చు మరింత స్పీడుగా ముందుకు సాగుతున్నారు. కేంద్రం, రాష్ట్ర  ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రొకొ అన్నట్లుగా ఇంత కాలం సాగిన  హనీమూన్ పిరియడ్ కు ఇక తెరపడిందని అన్నారు. నాకు మద్దతు  కావాలి..  నీకు అప్పులు కావాలి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో  మోడీ సర్కార్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోకూడదన్న  రీతిలో వ్యవహరించడం వల్ల  ఏపీలో జగన్ సర్కార్ విషయంలో  చూసీ చూడనట్టు వదిలేసిందా?, ఒక విధంగా  క్విడ్ ప్రోకొ అన్న చందంగా  కేంద్రం  రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయా?  అంటే వైసవీపీ  ఎంపీ రఘురామ కృష్ణం  రాజు ఔననే అంటున్నాయి. రాష్ట్రపతి  ఎన్నిక అయిపోయింది కనుక  ఇక  ఏపీలోని జగన్ సర్కార్ కు ఇక  దబిడి దిబిడేనని వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు అన్నారు. ముందు ముందు అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం  ఏపీ  సర్కార్ పట్ల కఠినంగా వ్యవహరించే  అవకాశం ఉందని పేర్కొన్నారు.    రాజ్యాంగ  విరుద్ధంగా  లిక్కర్ కార్పొరేషన్ పేరిట ఇప్పటికే 8500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారని, మరో రెండు వేల కోట్ల రూపాయలను తీసుకోబోతున్నారని తెలిపారు. రాష్ట్రం కేంద్రం విధించిన 28 వేల కోట్ల రూపాయల రుణ పరిమితిని మించి ఇప్పటికే  38 500 కోట్ల రూపాయల రుణాలు తీసుకుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు   జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలా?, వెళ్ళక్కర లేదా? అన్న పిటీషన్ పై వాదనలు ముగిసి ఇప్పటికే 200 రోజులు గడుస్తున్నదని చెప్పారు. అయినా కోర్టు ఇంకా తీర్పు వెలువరించలేదని, ఒకవేళ తీర్పు అంటూ వస్తే… జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావాలనే  వస్తుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. కోర్టు హాజరై, నిలబడవలసి వస్తుందని అన్నారు. వ్యవస్థలన్నింటిని చాలా వరకు మ్యానేజ్ చేస్తున్నారని, కోర్టుకు వెళ్లాలా ?వద్దా? అన్న విషయాన్ని హైకోర్టు చెప్పదని, దర్యాప్తు సంస్థ ప్రశ్నించదని రఘురామ అన్నారు. తాను వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వాదనలు ముగిసి కూడా 200 రోజులైందన్న ఆయన, పిటిషన్ స్వీకరిస్తారా?, కొట్టివేస్తారా?? అన్నది ఇంకా తేల్చి చెప్పలేదన్నారు. హైకోర్టులో కొట్టివేస్తే,   సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. హైకోర్టులో ఈ ఆర్డర్ పెండింగ్ లో ఉందని, సిబిఐ కొట్టేసిందన్నారు. సిబిఐ కోర్టు , దర్యాప్తు సంస్థ… జగన్మోహన్ రెడ్డి , కోర్టు కు ఎందుకని హాజరు కావడం లేదని ప్రశ్నించడం లేదని అన్నారు. తన పట్ల  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  క్రూరంగా వ్యవహరించిన జగన్ సర్కార్ శారీరకంగా హింసించి, భౌతికంగా లేకుండా  చేయాలని చూశారనీ, ఏ  మాత్రం నిలబడని చెత్త కేసులు పెట్టారని ఆయన అన్నారు. తన ఇంటి వద్ద, రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన పోలీస్ కానిస్టేబుల్ ను, తన రక్షణ సిబ్బంది గా ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులకు అప్పగించారన్నారు. అయితే సిగ్గు లేకుండా జగన్ మోహన్ రెడ్డి తనపై తప్పుడు కేసులను పెట్టించి, సిఆర్పిఎఫ్ అధికారులతో మాట్లాడి తన రక్షణ సిబ్బంది గా ఉన్న ఇద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేయించారని చెప్పారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ విషయములోనూ ఇదే టెక్నిక్ ను ఉపయోగించే అవకాశం లేకపోలేదు అన్నారు. కుదిరితే రామ్ సింగ్ సస్పెండ్ చేయించడం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మంత్రి శంకర్ నారాయణ గడప గడపకూ అంటూ విచ్చిన సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి    లక్ష్మీబాయిపై అనే మహిళపై తప్పుడు కేసు పెట్టారని రఘురామకృష్ణం రాజు  అన్నారు. గత ప్రభుత్వంలో  వచ్చిన పింఛన్ ఇప్పుడు ఎందుకు తీసేశారని అడగడం తప్పా అని నిలదీశారు.   ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కేసులను బనాయిస్తారొనన్న ఆందోళనలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు  ఉన్నారన్నారు. తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు న్యాయాధికారుల ఫోరం ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ప్రధానమంత్రి హాజరవుతున్న సభకు ఆహ్వానం అందినా, స్థానిక ఎంపీకి ఆహ్వానం అందలేదన్న కారణంగా సభకు వెళ్లకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకోవడం  చాలా గొప్ప విషయమన్నారు.