కల్తీ...కల్తీ...కల్తీ...ఎటు చూసినా కల్తి
posted on May 27, 2023 @ 9:30AM
కల్తీ ...కల్తీ ...కల్తీ... ఎటు చూసినా కల్తి గాలి కల్తీ,నీరు కల్తీ,పాలు కల్తీ,తినే తిండి కల్త్ఘీ,నెయ్యి కల్తీ,పళ్ళ లో కల్తీ కూరాగాయలలో కల్తీ,అసలు కల్తీ కి కాదేది అనర్హం అన్న చందాన సర్వం కల్తీ చేసేస్తూ ప్రజాల ప్రణాలను హరిన్చేస్తున్నారు కల్తీ బాబులు.అసలు ఇందులో ఏది అస్లీ ఏది నకిలీ అన్నదే పెద్ద ప్రశ్న? అసలు ప్రకృతి ని ఎలాగో కల్తీ చేసేసారు మానవుడు. అయితే సృష్టిలో కల్తీ లేనిది ఒక్క తల్లి పాలలోనే అంటే అతిశయోక్తి కాదు.ఇది నిజం. అని నమ్మక తప్పదు. తల్లిప్రేమలో నాన్న ప్రేమలో కల్తీ ఉండదు.ప్రియుడి ప్రేమలో.ప్రియురాలి ప్రేమలో కల్తీ ఉండచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెలలో ప్రపంచ ఆహార సంరక్షణ దినోత్సవం రూపం లో జరుపుకుంటారు.దీనిలక్ష్యం ప్రజలు సురక్షిత మైన ఆహారపు అలవాట్ల పట్ల కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి ఈ సందర్భంగా ప్రజలు నకిలీ ఆహార పదార్ధాల బారిన పడకుండా కల్తీ ఆహారాపదార్ధాలను ఎలా గుర్తించాలో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. మార్కెట్ లో మనకు లభ్య మయ్యే చాలా రకాల వస్తువులలో కల్తీ కలుస్తోందన్న విషయం తెలుస్తోంది.అందులో ను అది పండ్లు కవాచ్చు పప్పు దినుసులు కావచ్చు.గోధుమలు,మసాలాలు, పాలు,కూరాగాయలలో రక రకాల రసాయనాలు వాడుతూ వాటిని రూపొందిస్తున్నారు.కల్తీ చేసిన ఆహార పదార్ధాలు తినడం వల్ల చాలా ప్రామాదం అని దానివల్ల తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు స్పష్టం చేసారు.కల్తీ చేసిన వాంతులు.లివర్ కిడ్నీ,ఉదర సంబంధిత రోగాలు,వస్తే తీవ్ర ప్రభావం ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి సమస్యనుండి రక్షణ పొందాలంటే అసలు నకిలీ వస్తువులను గుర్తించాలి.వాటిని గురించి తెలుసుకోవడం అత్యవసరం.
కల్తీ పాలను ఎలాగుర్తించాలి?
పాలలో కేవలం నీళ్ళు మాత్రమే కలవడం లేదు.పాలను చిక్కగా చేసేందుకు దీనిలో డిటర్జెంట్,లేదా సింథటిక్,పాలు గుర్తించాలంటే 1/2 కప్పులో తక్కువ నీళ్ళు కలపండి.ఇందులో నురుగు వచ్చిందంటే ఇందులో డిటర్జెంట్ కలిపి నట్లే.సింథటిక్ పాలు గుర్తించాలంటే పాలను వెళ్ళ మధ్యలో రాయడం ద్వారా అది సబ్బు లాగా కనిపిస్తుంది.అలా పాల కల్తీని గుర్తించవచ్చు. మరీ క్రుత్రిమ పాల వ్యాపారం లో కొత్త కొత్త పద్దతులు అవలం బిస్తున్నారు. వ్యవసాయం లో వాడే ఉరియా ఎరువులు,ఫెవికాల్ కలిపి పాల కల్తీకి పాల్పడుతున్నారు.
నకిలీ పసుపు ను ఎలాగుర్తించాలి?
ఒక గ్లాసు నీరు తీసుకోండి.అందులో కొంచం పసుపు పొడి కలపండి ఒక వేళనీటి రంగు పసుపు రంగులోకి మారుతుంది.పసుపు గ్లాసు కింది భాగానికి చేరుకుతుంది.కల్తీ ఉన్న పసుపు రంగు నీటిలోకి మారుతుంది.ఆనీళ్ళు పసుపు పచ్చరంగులో ఉంటుందని గుర్తించండి.
కల్తీ పండ్లను గుర్తించడం ఎలా?
పండ్లు,కూరగాయలలో అన్నిటికన్నా ఎక్కువ కల్తీ జరుగుతుంది.ముఖ్యంగా మనం తినే యాపిల్ పండు బాగా మెరుస్తూ ఉంటుంది.అలా మెరిసేందుకు మైనం లేదా ఇతర వేజిలేన్ రసయనాలు రాయడం వల్ల ఇదినిజమో కాదో తెలుసు కోడానికి మీ వద్ద ఉన్న చాకును మెల్లగా దించండి.గట్టిగా ఉంటె చాకు త్వరగా దిగదు అంతకు ముందే అప్పటికే కొన్ని రకాల వేజిలేన్ మైనం రాయడం వల్ల మెత్తగా ఉండడం వల్ల చాకు త్వరగా దిగుతుంది.
నకిలీ నల్ల మిరియాలు...
మనం తీసుకునే ఆహారం లో ముఖ్యమైన దినుసులలో ముఖ్య మైనవి మిరియాలు లేదా నల్ల మిరియాలు అంటారు.దీనిని కల్తీ కోవలోకి చేర్చిన ఘనత మనవాళ్ళదే. నకిలీ నల్ల మిరియాల ను ఎలా గుర్తించాలి ముఖ్యంగా పోప్పాయి పండులోని గింజలు నల్ల మిరియాలలో కలపడం వల్ల అసలు మిరియాలు నకిలీ మిరియాలకు తేడా తేలియదు.అసలు నకిలీ మిరియాల లో ఉన్న తేడా గుర్తించాలంటే. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో నల్ల మిరియాలు వేయండి.౩,లేదా 4 నిమిషాల తరువాత పోప్పాయి గింజలు తేలిపోతాయి.
నకిలీ నెయ్యిని గుర్తించడం ఎలా?
కల్తీ లేని నెయ్యి సహజంగా పూస పూస గా ఉంటుంది.మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనిని కల్తి చేసేందుకు బంగాళా దుంప పేస్ట్,లేదా అరారోట్ లేదా రీ ఫైండ్ నూనె డాల్డా ను కలిపి నెయ్యిగా అమ్ముతూ ఉంటారు.ఇటీవలి కాలం లో జంతువుల కలేబరాల నుండి సైతం తీసిన నేతిని కల్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.కాగా స్వచ్చమైన అవ్వునేయ్యి లేదా కల్తీ నెయ్యి ని గుర్తించాలంటే నెయ్యిలో అయుదిన్ సొల్యుషన్ కలపండి.దీనిరంగు నీలి రంగులోకి మారుతుంది అందులో గంజి పొడి కలిపి నట్లుగా తెలుస్తుంది.
ఎర్రటి ఖారం నకిలీఖారం గుర్తించడం ఎలా?
అసలైన ఎర్రటి ఖారం గుర్తించాలంటే ఒక గ్లాసు నీళ్ళలో మిర్చి పొడిని కలపండి.ఎర్రటి మిర్చి పౌడర్ నీటిలో తేలితే అది నకిలీది కాదని.ఒకవేళ నీలాలో మునిగి పోతే ఆ మిర్చి పొడి కల్తీది నకిలీదిగా భావించాలి.
నకిలీ ఇంగువను గుర్తించడం ఎలా?
నకిలీ ఇంగువకూడా నకిలీ నెయ్యి నూనె వేడిలో వేసినప్పుడు కొంత ఎర్రగా మారుతుంది.అది నకిలీ ఇంగువగా చెప్పవచ్చు.మరో పద్దతిలో ఇంగువను కాల్చి నప్పుడు అంటుకుంటుంది.నిప్పు త్వరగా అంటుకుంటుంది.అది నకికీది కాదనిఆర్ధం. నకిలీ ఇంగువ అంటుకోదు. ఈ విధంగా నకిలీ అసిలీ ఇంగువను ఆర్ధం చేసుకోవచ్చు.
అసలైన కోవా ను గుర్తించడం ఎలా?
హిందీలో దీనిని మావా అని అంటారు అంటే మనం స్వీట్స్ లో వాడే కోవా,కలాకండ్, రసగుల్లా,గులాబ్ జాం,కోవా కజ్జి కాయి వంటి వి తయారు చేసేందుకు వాడతారు. కోవాలో అసిలి నకిలీ కివా ఎదో గుర్తించడం కష్టం. అసలు కోవా తెల్లగా ఉంటుందని.మరోరకం కోవా కొంచం పసుపు పచ్చటి రంగులో ఉంటుందని అది కల్తీ కోవాగా పేర్కొన్నారు.దీనితో పాటు చేతిలో నలపడం ద్వారా అసలైన కోవా చేతిని విదిచిపెడుతుంది.నకిలీ కోవా అయితే చేతిని అంటి పెట్టుకుని ఉంటుంది.
నకిలీ తేనె...
ఈ రోజుల్లో తేనె పేరుతో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. ముఖ్యంగా పుట్టతేనే అంటూ గిరిజన ఏ జేన్సీ ప్రాంతాలలో తేనెలో బెల్లం కలిపి ఆమీస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తేనె నకిలీధా అసలైన తేనెను గుర్తించడం అవసరం.ఒక గ్లాసు నీళ్ళలో ఒక చంచా తేనె కలపండి మీరు వేసిన తేనె నీటిలో అలాగే ఉండి పోతే అది స్వాచమైన తేనె అని అటు ఇటు కదులుతూ నీటిలో కరిగి పోయే తేనెను నకిలీ తేనెగా గుర్తించారు.ఆ రకంగా మీరు తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండకుంటే మీరు అనారోగ్యం పాలు కావడం ఖాయం. ప్రపంచా ఆహార బద్రత దినోత్సవం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు. ఆరోగ్యా ప్రాప్తి రాస్తూ.