ఐ ఫ్లూ లేదా కండ్ల కలక ఎందుకు వస్తోంది?

వాతావరణంలో వచ్చే మార్పులతో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందడం సర్వసాధారణం, అయితే కళ్లలో కండ్లకలక అంటే ఐ ఫ్లూ వచ్చినట్లయితే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఐ ఫ్లూ అనేది వేగంగా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్, ఇది ఈ సీజన్‌లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఐ ఫ్లూని కండ్లకలక అని కూడా అంటారు. ఇందులో కళ్లలో మంట, నొప్పి, ఎర్రబడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రధాన కారణం అలెర్జీ రియాక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు, కానీ ఎక్కువగా ఇది పిల్లలను ప్రభావితం చేస్తుంది. అసలు కంటి ఇన్ఫెక్షన్స్ ఎలా వ్యాపిస్తాయి?? వీటి లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి?? పూర్తిగా తెలుసుకుంటే.. కంటి ఇన్ఫెక్షన్ సాధారణంగా ఒక కంటి నుండి మొదలై మరో కంటికి వ్యాపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంటే..  వర్షం కారణంగా గాలి ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించే క్రిములు, బ్యాక్టీరియా పెరుగుతాయి. ఐ ఫ్లూ అనేది ఒక అంటు వ్యాధి,  ఇది సోకిన చోటును తాకడం ద్వారా ఇది  వ్యాపిస్తుంది. అందువల్ల,  అన్నీ తాకుతూ మధ్యలో కళ్ళను తాకాల్సి వస్తె ముందు మీ చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.  కళ్ళను మళ్లీ మళ్లీ తాకకుండా జాగ్రత్త పడాలి.    కంటి ఫ్లూ ఇన్ఫెక్షన్, కంటిలో తీవ్రమైన నొప్పి, ఎరుపు, పసుపు రంగులో జిగటగా ఉండే పదార్థం, దురద, చూపు మసకబారడం, మంటగా అనిపించడం, చూపులో ఇబ్బంది, కళ్లు అతుక్కోవడం, కంటిలో ఏదో కదలడం వంటి లక్షణాలు ఉంటాయి.  కళ్ళ కలక వచ్చినప్పుడు  శుభ్రంగా,  చల్లటి నీటితో కళ్ళను కడగాలి.   డాక్టర్ సూచించిన ఐ డ్రాప్స్ వేయాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.  చేతులు కడుక్కోకుండా కళ్లను తాకవద్దు, కళ్ళు రుద్దడం మానుకోవాలి. ఇది అంటు  వ్యాధి కాబట్టి  కంటి ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉండాలి. ఈ కండ్ల కలక కొనసాగినన్ని రోజులు రోజూ ఉపయోగించే టవల్, బట్టలు, బెడ్ షీట్, గ్లాసెస్, కంటి అలంకరణ వస్తువులు, కంటి చుక్కలు విడివిడిగా ఉంచుకోవాలి.   వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. రెప్ప వేయడానికి ఇబ్బందిగా ఉన్నా తరచుగా రెప్పవేయడం అలవాటు చేసుకోవాలి. కళ్లను ఎప్పుడూ రుద్దకూడదు.  దురద వస్తే  శుభ్రమైన నీటినీ కళ్ళ మీద  చిలకరిస్తూ  శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలంలో తడవడం, స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడం మానుకోవాలి.  కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే, వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.   కాంటాక్ట్ లెన్స్‌లను వాడే ప్రతిసారీ వాటిని  చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. చిన్నపిల్లలు తరచుగా చేతులు కడుక్కోనేలాను , వారు కళ్లను తరచుగా తాకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. కంటి ఫ్లూ వస్తే ఏమి చేయాలంటే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా,  కంటి ఫ్లూ వస్తే, బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తులకు  వ్యాప్తి చెందేలా  చేస్తుంది. కళ్లకు ముదురు అద్దాలు పెట్టుకుని మాత్రమే బయటకు వెళ్ళాలి.  వ్యాధి సోకితే, కరచాలనం చేయవద్దు,  బహిరంగ ప్రదేశాలలో ఏవి పడితే వాటిని తాకవద్దు. కుదిరితే  శానిటైజర్  ఉపయోగించడం ఉత్తమం. ఏ ఆహారం తీసుకోవాలంటే.. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ కూడా చాలా ముఖ్యం. విటమిన్ ఎ, విటమిన్ బి,  విటమిన్ సి పుష్కలంగా ఉండే  ఆహారాలను  రోజువారీ తీసుకోవాలి.  ఐ ఫ్లూ మూడు-నాలుగు రోజుల్లో దానంతటదే నయం అవుతుంది, అయితే నయం కాకుండా ఉంటే, ఇన్ఫెక్షన్ సమస్య పెరుగుతోందని అర్థం. ఇది  చూడటంలో ఇబ్బంది కలిగిస్తుంది. మంచి నేత్ర వైద్యునిని కలవడం అవసరం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మీ స్వంతంగా ఎటువంటి మందులు తీసుకోకూడదు.  డాక్టర్ సలహా లేకుండా కంటి చుక్కలు వాడకూడదు. వైద్యుల సలహా లేకుండా వాడే  ఔషధం లేదా కంటి చుక్కలు కంటి ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ సమయంలో రోజ్ వాటర్, ఇతర ఉత్పత్తులు ఏవీ కూడా కళ్లలో పెట్టకూడదు.                                     *నిశ్శబ్ద.

అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా.. అయితే ఇదే మీ సమస్య కావచ్చు!

  ఎప్పుడూ అలసటగా, బలహీనంగా ఉంటున్నారా??, కాళ్లూ చేతులూ జలదరిస్తున్నట్లు అనిపిస్తున్నాయా?  కండరాలు బలహీనపడుతున్నాయా? నడవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం మీ నుండి వస్తే, మీ శరీరంలో విటమిన్-బి లోపం ఉందని అర్థం. ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం  వంటి ఇతర పోషకాల మాదిరిగానే, శరీరానికి మెరుగైన పనితీరు కోసం బి విటమిన్లు కూడా అవసరం. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చేలా పనిచేస్తుంది. అందుకే విటమిన్ బి లక్షణాలు, దాని ప్రాధాన్యత, దాని వనరులు, మొదలైన విషయాలు  తెలుసుకుంటే.. విటమిన్ బి లోపం లక్షణాలు.. B విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అలసట, బలహీనత, శక్తి లేకపోవడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు, బలహీనమైన కండరాలు ఉంటాయి. నడవడంలో ఇబ్బంది, స్టేబుల్ గా ఉండలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.  దీని లోపం కారణంగా  బెరిబెరి, పెల్లాగ్రా లేదా రక్తహీనత వంటి వ్యాధులతో సహా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇవి కాకుండా, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. విటమిన్ B అనేది 8 రకాల విటమిన్ల సమూహం. పెద్దవారిలో ఈ కింద పేర్కొనబడిన మోతాదులో విటమిన్ బి అవసరం అవుతుంది.. 1.1-1.2mg థియామిన్ (B1) 1.1-1.6mg రిబోఫ్లావిన్ (B2) 14-16mg నియాసిన్ (B3) 4-6mg పాంతోతేనిక్ యాసిడ్ (B5) 1.3-1.7mg పిరిడాక్సిన్ (B6) 25–30µg (మైక్రోగ్రాములు) బయోటిన్ (B7) 400µg (μg) ఫోలేట్ (B9) 2.4 mcg సైనోకోబాలమిన్ (B12) చాలా మంది విటమిన్ బి గుడ్లు, చికెన్, మాంసం లేదా చేపలు వంటి నాన్-వెజ్ ఆహారాల్లో మాత్రమే లభిస్తుందని అనుకుంటారు, కానీ ఇది తప్పు. వాస్తవానికి, ఈ పోషకంతో నిండిన అనేక శాఖాహార ఆహారాలు ఉన్నాయి. అనేక ఆకుపచ్చ ఆకు కూరలలో  ఫోలేట్ (B9) ఉంటుంది. బచ్చలికూర, ఆకుకూరలు వంటి వాటిలో బి విటమిన్ 39 శాతం వరకు ఉంటుంది. అయితే వీటిని లైట్ గా ఆవిరి చేయాలి తప్ప ఎక్కువ ఉడికించకూడదు. పోషకాలు నాశనం అవుతాయి.  ఒక కప్పు (240 ml) పాలు రోజువారీ అవసరాలలో 26% రిబోఫ్లావిన్‌తో పాటు ఇతర B విటమిన్‌లను అందిస్తాయి. పాలు ఇతర పాల ఉత్పత్తులు B విటమిన్లకు మంచి మూలం. చిక్‌పీస్.. వీటినే  నల్ల శనగలు అంటారు.  అలాగే పచ్చి బఠానీలు వంటి చిక్కుళ్ళు ఫోలేట్‌తో నిండి ఉంటాయి. వీటిలో థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, B6 వంటి ఇతర B విటమిన్‌లు  కూడా ఉంటాయి.  పెరుగులో రిబోఫ్లేవిన్, బి12 పుష్కలంగా ఉంటాయి. 163 గ్రాముల పెరుగు రోజువారీ అవసరాలలో 18% B2 మరియు 26% B12ని అందిస్తుంది. ఇది కాకుండా, క్యాల్షియం, ప్రోటీన్ కూడా పెరుగులో పుష్కలంగా లభిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో పాంతోతేనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.  1 ఔన్స్ (28 గ్రాముల) విత్తనాలలో  40% పాంతోతేనిక్ ఆమ్లాన్ని అందించగలవు. ఇది కాకుండా, నియాసిన్, ఫోలేట్ B6  కూడా వీటిలో ఉంటాయి.  కాబట్టి కేవలం మాంసాహరంలోనే ఈ విటమిన్లు లభిస్తాయని అనుకోకుండా శాఖాహారులు కూడా పైన చెప్పుకున్న పదార్థాల ద్వారా వీటిని పుష్కలంగా పొందచ్చు.                                      ◆నిశ్శబ్ద.

ఈ మూడు లక్షణాలు కనబడితే శరీరంలో రక్తప్రసరణ సరిగా లేదని అర్థం!

శరీరం ఆరోగ్యంగా ఉండాలన్న, అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా అన్ని అవయవాలకు తగినంత రక్త ప్రసరణ అవసరం. రక్త ప్రసరణకు ఆటంకం కలిగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిని లైట్ గా తీసుకుంటే  అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణలో సమస్యల కారణంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం,  అధిక రక్తపోటు వంటి కొన్ని అంతర్గత  ఆరోగ్య సమస్యల  ప్రమాదాన్ని కూడా  పెంచుతుంది. రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడితే.. రక్త ప్రసరణ మొత్తం శరీరానికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన అవయవాలకు ఆక్సిజన్ ను,  అవసరమైన పోషకాలను నిర్వహిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకుంటే దాదాపు అన్ని అవయవాలపై దుష్ప్రభావాలుంటాయి. రక్త ప్రసరణ సమస్యపై శ్రద్ధ చూపడం  చాలా ముఖ్యం. రక్తప్రసరణ సమస్య ఉంటే  ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే.. ఉష్టోగ్రతలో మార్పులు.. తరచుగా చేతులు,  కాళ్ళు చల్లగా మారిపోతూ ఉంటే  ఉంటే అది శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని లక్షణం.  శరీరంలో రక్తం ఆరోగ్యకరమైన  వేగంతో ప్రవహించలేనప్పుడు అది చర్మం, చేతులు,  కాళ్ళ నరాల చివరలలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఈ కారణంగా కాళ్లు, చేతుల వేళ్ళ చివర్లు చల్లగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మెదడు పనితీరుకు ఇబ్బంది.. పేలవమైన రక్తప్రసరణ మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది, ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడం,  ఏకాగ్రత మందగించడం వంటి సమస్యలకు కారణమవుతుంది. మెదడుకు రక్తం సరిగా సరఫరా కాకపోతే  ఆక్సిజన్ ప్రవాహం కూడా మందగిస్తుంది. దీని వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ధూమపానం వంటి అలవాటు  సాధారణ రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి. చర్మం  రంగులో మార్పులు.. శరీరంలోని కణజాలాలలో రక్తం సరిగ్గా ప్రసరించనప్పుడు చర్మంపై స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో మొదట చర్మం సాధారణం కంటే పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. కొందరిలో రక్తప్రసరణ సమస్య వల్ల చర్మంపై నీలి మచ్చలు కూడా ఏర్పడతాయి.  ముక్కు, పెదవులు, చేతులు,  కాళ్ళతో సహా  ఇతర భాగాలలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ప్రాణానికి తీవ్రమైన ప్రమాదముందని అర్థం. ఈ మూడు లక్షణాలు తరచుగా కనిపిస్తూ ఉంటే శరీరంలో రక్తప్రసరణ చాలా దారుణంగా ఉందని అర్థం. ఇది ప్రాణానికి ఎంతో ప్రమాదం.                                                                          *నిశ్శబ్ద.

ఈ 7వ్యాధులు సైలెంట్ గా శరీరాన్ని మృత్యువు ఒడిలో పడేస్తాయి!

ప్రతి వ్యాధికి ఏవో కొన్ని లక్షణాలు ఉండనే ఉంటాయి. చాలావరకు ఈ లక్షణాల ఆధారంగా జబ్బును ముందుగానే తెలుసుకుని చికిత్స చేయించుకుని ఆర్థిక, ప్రాణ నష్టాన్ని తగ్గించుకుంటు ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలేవీ లేకుండా శరీరంలోకి చాపకింద నీరులా ప్రవేశించి సైలెంట్ గా ప్రాణాలను కబళించే  జబ్బులు ఉంటాయి. ఇవి తీవ్రమైన స్థాయికి వెళితే తప్ప బయటపడవు.  ఇవి చాలా ప్రాణాంతకమైనవిగా పరిగణించబడతాయి. ఇలాంటి 7 జబ్బుల గురించి గురించి తెలుసుకుంటే.. మధుమేహం.. తీపి పదార్థాల మీదా, బయటి ఆహారాల మీద మోహం కాస్తా మధుమేహానికి దారితీస్తుంది. ఇది నయం చేయలేని వ్యాధి, దీని కారణంగా మూత్రపిండాలు, గుండె తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రపంచంలో చాలా మంది  ప్రీ-డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. వీరికి తమకు మధుమేహా వ్యాధి ప్రారంభమైందనే విషయం అస్సలు తెలియదు. ఈ వ్యాధికి  ప్రారంభ లక్షణాలు ఏంటనేవి కూడా ఇప్పటివరకు ఎెవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో మధుమేహం వచ్చింది అని ఎప్పుడో శరీరానికి నష్టం కలిగిన సమయంలో బయటపడుతూ ఉంటుందే తప్ప ముందస్తు లక్షణాలతో దీన్ని గుర్తించలేము. గుర్తించిన తరువాత దీన్ని నయం చేయలేము. అధిక కోలెస్ఠ్రాల్.. శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలు. నిపుణులు హెచ్‌డిఎల్‌ను మంచి కొలెస్ట్రాల్ గా, ఎల్‌డిఎల్‌ను చెడు కొలెస్ట్రాల్ గా అభివర్ణించారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఎలాంటి ప్రత్యేక సంకేతాలను కలిగి ఉండదు.  ఈ కారణంగా ఇది గుండె సంబంధ సమస్యలను, ఇతర శారీరక అనారోగ్యాలను పెంచుతుంది. ఇది ప్రాణాంతకంగా  మారుతుంది.  రెగులర్ గా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే ఈ సమస్య పెరగకుండా నియంత్రించగలదు. ఫ్యాటీ లివర్.. కొలెస్ట్రాల్  ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం కుళ్లిపోతుంది. ఇది  చాలా నెమ్మదిగా జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో  రోగికి ఎలాంటి చిన్న క్లూ కూడా లభించదు. ఈ వ్యాధిని ఫ్యాటీ లివర్ వ్యాధి అంటారు . ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఇది తీవ్రరూపం దాలుస్తుంది. దీన్ని బట్టి ఇది మగవారిలో ఎక్కవగా వస్తుందని చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటు.. సిరలు కుంచించుకుపోవడం లేదా సిరలలో అడ్డంకి ఏర్పడటం  వల్ల రక్తం ప్రవహించే మార్గానికి ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా గుండె మరింత ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా, రక్తపోటు పెరుగుతుంది.  గుండెపోటు  స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది. బోలు  ఎముకల వ్యాధి.. ఈ వ్యాధి ఎముకలను బోలుగా చేస్తుంది. ఇది కాల్షియం,  విటమిన్ డి లోపం వల్ల ఏర్పడుతుంది. దీని వల్ల చిన్న గాయం అయినా ఎముక విరిగిపోతుంది. ఇది ఎముకలను చాలా బలహీనం చేస్తుంది.   క్యాన్సర్.. క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది  ఒక ప్రాణాంతక వ్యాధి, దీనిలో శరీరంలో ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతూ వెళుతుంది.  దీని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.  ఏదైనా పని చేసినప్పుడు అలసిపోయినట్టో, నీరసంగా అనిపించినట్టో ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని గుర్తించడం కష్టం. చేయి దాటిపోతే తప్ప ఈ వ్యాధి బయటపడదు. ఆ సందర్భంలో ఈ వ్యాధి భయంకరమైన లక్షణాలను బయటకే వ్యక్తం చేస్తుంది. స్లీప్ ఆప్నియా.. ఇది నిద్రకు సంబంధించి ప్రాణాంతకమైన  జబ్బు. ఈ జబ్బులో శ్వాస ఆగిపోతుంది,  నిద్రలో స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. దీని రోగులు స్ట్రోక్,  ఆకస్మిక మరణానికి  గురయ్యే ప్రమాదం ఎక్కువ  ఉంది. ఇందులో పేషెంట్ కు వేగంగా గురక పెట్టే సమస్య కూడా ఉండొచ్చు.                                                       *నిశ్శబ్ద.

మైండ్ డైట్‌తో మానసిక సమస్యలన్నీ మాయమవుతాయి!

మైండ్ అనే పేరు కలిగి ఉండటం వల్ల ఇది పక్కాగా మెదడుకు మేలు చేసే డైట్ అని ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఈ మైండ్ డైట్ అనేది కేవలం మెదడుకు ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. ఈ మైండ్ డైట్ న్యూరోడెజెనరేటివ్ సమస్యల ప్రభావాన్ని తగ్గించడంలో, మెదడు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఈ మైండ్ డైట్ ను మెడిటరేనియన్ -డాష్ డైట్ అని పిలుస్తారు. అసలీ డైట్ లో ఏమి తినాల్సి ఉంటుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?  పూర్తీగా తెలుసుకుంటే.. మైండ్ డైట్ లో తినేవేంటంటే.. మైండ్ డైట్ లో సాధారణంగా తృణధాన్యాలు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, బెర్రీలు, చిక్కుళ్లు, గింజలు, చేపలు, ఆలివ్ నూనె.. మొదలైనవి వినియోగిస్తుంటారు. మైండ్ డైట్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే.. రోజూ తీసుకునే ఆహారంలో మైండ్ డైట్ చేర్చుకోవడం వల్ల మెదడు సంబంధ సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మైండ్ డైట్ వల్ల అన్నింటికంటే ముఖ్యంగా మతిమరుపుకు మరొక భయంకరమైన స్టేజ్ అయిన అల్జీమర్స్ ప్రమాదాన్ని 53శాతం తగ్గించుకోవచ్చు. ఈ డైట్ లో తీసుకునే బెర్రీలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, గిండలలో యాంటీఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ నుండి మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తప్పనిసరి.. సాల్మన్ వంటి చేపలలో ఉండే కొవ్వులో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. మైండ్ డైట్ లో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ప్రముఖమైంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని,అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మాత్రమే కాకుండా మెదడు కణాల వాపు తగ్గించడంలోనూ ఈ మైండ్ డైట్ సమర్థవంతంగా పనిచేస్తుంది. పోషకాలే ప్రధానం.. మైండ్ డైట్ లో మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విటమిన్-ఈ, ఫోలేట్, బి-విటమిన్లు వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి మనిషి మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. అభిజ్ఞా పనితీరుకు తోడ్పడతాయి. వివిధ రకాల మెదడు సంబంధ, నాడీ సంబంధ వ్యాదుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్ వంటివి కూడా ఈ డైట్ లో భాగంగా ఉంటాయి. ఇవి మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి శాఖాహారులు మైండ్ డైట్ లో వీటిని తీసుకుని ఫలితాలు పొందవచ్చు.                                                              *నిశ్శబ్ద.  

స్నేహమేరా ఆరోగ్యం! (ఫ్రెండ్ షిప్ డే స్పెషల్)

మంచి స్నేహితుడు పక్కనుంటే మనసు బాగుంటుందనేది అందరికీ తెలిసిన మాటే! కానీ ఇప్పుడు స్నేహితులు కేవలం మన మనసుకి తోడుగా మాత్రమే కాదు... ఆరోగ్యానికి రక్షగా కూడా నిలుస్తారని నిరూపిస్తున్నాయి సవాలక్ష పరిశోధనలు. నలుగురు మంచి నేస్తాలు ఉన్నవాడి జీవితం నాలుగు కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు...   గుండె పదిలం: ఆ మధ్య స్వీడన్‌కు చెందిన కొందరు పరిశోధకులు దాదాపు మూడేళ్లపాటు శ్రమించి 13,600 మంది మీద పరీక్షలు సాగించి తేల్చిన విషయం ఏమిటంటే... స్నేహితులు ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు 50 శాతం తక్కువగా ఉంటుందట. కారణం! స్నేహితులు ఉండటం వల్ల మనలో ఉండే ఒత్తిడి శాతం తగ్గిపోతుందట. ఒత్తిడి వలన గుండె ధమనులు పూడుకుపోతుంటాయనీ, అదే ఒత్తిడిని ఇతరులతో పంచుకోవడం వల్ల, గుండె తన పని తాను సాఫీగా చేసుకుపోతుందనీ తేలింది.   నాజూకైన నేస్తాలు ఇప్పుడు ఎవరిని కదిపినా ఊబకాయం గురించే మాట్లాడుతున్నారు. ఊబకాయం వల్ల ఈ ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం ఉంది... అంటూ తెగ ఊదరగొట్టేస్తున్నారు. కానీ మీకో సంగతి తెలుసా! మన స్నేహితులు సన్నగా ఉంటే మనం కూడా సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. 2007లో దాదాపు 12,000 మందిని ఏళ్ల తరబడి పరిశీలించి తేల్చిన అంశం ఇది. ఒక వ్యక్తి నడుము కొలత నిదానంగా అతని స్నేహితుల నడుము కొలతకి అనుగుణంగా మారిపోవడానికి 57% అవకాశం ఉందని ఈ పరిశోధన తేల్చింది. కారణం! సాధారణంగా మన నేస్తాల జీవన విధానాన్ని చూసి మనం కూడా ప్రభావితం చెందుతాం. వారి ఆహారపు అలవాట్లు, వ్యాయామపు అలవాట్లు చూసి మనం కూడా అలా మారితే బాగుండే అని అంతరాత్మ తెగ పోరుతుంటుంది. అయితే ఇది కేవలం మంచి అలవాట్ల విషయంలోనే కాదు, చెడు అలవాట్లకి కూడా వర్తిస్తుంది.   ఎవ్వరూ పట్టించుకోకపోయినా! కొంతమందికి చొరవ లేకపోవడం వల్లనో, మరే కారణం చేతనో కానీ అందరూ దూరం పెడుతూ ఉంటారు. దానివల్ల వారిలో ఆత్మన్యూనత పెరిగిపోతుంది. ఒత్తిడి అంతకంతకూ పేరుకుపోతుంది. కానీ ఇలాంటి వారికి ఒకరిద్దరు మంచి మిత్రులు ఉంటే, సమాజమంతా తనను వెలివేసినా తట్టుకోగలరని తేలింది. 2011లో నెదర్లాండ్స్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా!   జీవితకాలం మెరుగుపడుతుంది:  మంచి స్నేహితులు ఉన్నవారు సుదీర్ఘకాలం జీవించే అవకాశం చాలా ఎక్కువని తేలింది. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి- స్నేహంతో ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించగలడం. రెండు- తను కూడా ఈ సమాజంలో భాగం, తనని కూడా గుర్తించేవారు ఉన్నారు అన్న భావనలతో తన ఆరోగ్యం పట్ల తెలియకుండానే శ్రద్ధ వహించడం. ఇలాంటి కారణాల వల్ల రక్తపోటు అదుపులో ఉండటం, రోగనిరోధకశక్తి మెరుగుపడటం, క్రుంగుబాటు నుంచి తేరుకోవడం వంటి ఎన్నో లాభాలు చేకూరుతాయట.   మతిమరపు దూరం: స్నేహితులు ఎవ్వరూ లేకుండా ఒంటరితనంలో కూరుకుపోయేవారిలో మతిమరపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం 65 ఏళ్లు దాటిని ఒక 2000 మంది మీద ఒక ప్రయోగాన్ని చేశారు. వీరి మెదడు పనితీరునీ, సామాజిక సంబంధాలనీ బేరీజు వేస్తూ ఒక మూడేళ్ల పాటు అందరినీ నిశితంగా పరిశీలించారు. చివరికి తేలిందేమంటే- తాము ఒంటరితనంతో కుంగిపోతున్నమని మొదట్లో చెప్పినవారిలో 13 శాతం మంది మతిమరపు వంటి లక్షణాలతో బాధపడటం మొదలుపెట్టారు. స్నేహితులతో కలిసిమెలసి ఉండేవారు మాత్రం ఎలాంటి మతిమరపూ లేకుండా హాయిగా ఉన్నారు.     - నిర్జర.

సగానికి పైన జబ్బులన్నీ దీనివల్లే!

శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లు  సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ  ఆహారం నుండి సులభంగా పొందవచ్చు, అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని  క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. అయితే అదే ఆహారం విషయంలో చేసే పొరపాట్ల కారణంగా   శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది శరీరంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.  మెగ్నీషియం కూడా  అలాంటి  మూలకమే..  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం. మెగ్నీషియం లోపం అనేక వ్యాధుల సమస్యల ప్రమాదాన్ని  పెంచుతుంది . మెగ్నీషియం  మెదడు,  శరీరం  రెండిటికీ ముఖ్యమైనది. ఇది గుండె, రక్తంలో చక్కెర స్థాయిలు,  మానసిక స్థితి సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఆకు కూరల నుండి గింజలు, బీన్స్ వరకు ఎన్నో ఆహారాలలో కనిపిస్తుంది. అసలు మెగ్నీషియం లోపం ఎందుకు ఎలా వస్తుంది?? ఆహారంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అందరికీ ఎందుకు సలహా ఇస్తారో.. దాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుంటే..  శరీరంలో మెగ్నీషియం లోపం.. పెద్దలు వారి శరీరంలో 25 గ్రాముల మెగ్నీషియం కలిగి ఉంటారు, వీటిలో అస్థిపంజర వ్యవస్థ 50-60% నిల్వ చేస్తుంది. మిగిలినవి శరీరంలోని కండరాలు, కణజాలాలు,  ద్రవాలకు ఉపయోగం. మెగ్నీషియం లోపం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి బోలు ఎముకల వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, నరాల సంబంధిత రుగ్మతలతో పాటు రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతుంది.  మెగ్నీషియం ఎందుకు అవసరం?? విటమిన్-డి, కాల్షియంతో పాటు ఎముకలకు మెగ్నీషియం  కూడా అవసరం. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి మెగ్నీషియం అవసరమవుతుంది. మెగ్నీషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతను పెరుగుతుంది,  రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-డి స్థాయిలను నియంత్రించడంలో  కూడా సహాయపడుతుంది. కాబట్టి మెగ్నీషియం శరీరానికి చాలా వసరం. మధుమేహాన్ని నియంత్రిస్తుంది..   టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగపడతాయి.. మెగ్నీషియం గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  మెగ్నీషియం లోపం ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుంది. అయితే మెగ్నీషియం ను సప్లిమెంట్స్ కంటే ఆహరంతో తీసుకోవడం ఎంతో మంచిది.  మెగ్నీషియం కోసం ఏమి తినాలి? మగవారికి ప్రతిరోజూ 400-420 గ్రాముల మెగ్నీషియం  అవసరం అయితే ఆడవారికి 340-360 గ్రాములు అవసరం.  గింజలు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి అనేక ఆహారాలలో మెగ్నీషియం అధిక స్థాయిలో ఉంటుంది. అవకాడో, బంగాళదుంప, అరటిపండు మొదలైన వాటి నుంచి కూడా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని తీసుకుంటే మెగ్నీషియం లోపాన్ని నివారించవచ్చు.                                            *నిశ్శబ్ద.

ఈ లక్షణాలు వుంటే గుండె పరీక్ష చేయించుకోవాలి.. లేకపోతే ప్రాణాలకు ముప్పే

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బు ఒకటి. గణాంకాల ప్రకారం కరోనరీ హార్ట్ డిసీజ్ (CAD) అనేది గుండె జబ్బులలో అత్యంత సాధారణ సమస్య. ఇది 2021లో 3.75 లక్షలకు పైగా మరణాలకు కారణమైంది. 20, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి  20మందిలో ఒకరు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం గణనీయంగా ఉంది.  దురదృష్టవశాత్తు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఈ సమస్య ఎదురైన మొదట్లో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లాలంటే భయపడతున్నారు, సమస్య ఏమీ లేదులే అనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా  సకాలంలో రోగనిర్ధారణ  జరగడం లేదు. అదే సకాలంలో సమస్య నిర్థారణ జరిగితే  తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, రోగి ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇదివరకే  గుండె జబ్బులు లేకపోయినా, ప్రతి ఒక్కరూ తమ గుండెను సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష చేయించుకోవడం నేటికాలపు పరిస్థితులలో మంచిదని వైద్యులు చెబుతున్నారు. యువతలో గుండె జబ్బుల సమస్య.. యువతలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఇందులో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్,  అధిక రక్తపోటు ప్రధానమైనవి. అమెరికన్లలో గుండె జబ్బుల బారిన పడుతున్నవారిలో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  ధూమపానం మొదలయిన వాటిలో కనీసం ఒకదానిని అయినా అలవాటుగా  కలిగి ఉన్నారు. గుండెలో సమస్య ఉండవచ్చని సూచించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎదురైన మరుక్షణమే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. తరచుగా ఊపిరి ఆడకపోవడం..  తరచుగా శ్వాస ఆడకపోవడాన్ని ఎదుర్కుంటున్నట్టైతే  అది గుండె సమస్యకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను వైద్యపరంగా డిస్ప్నియా అంటారు. ఈ  పరిస్థితి తీవ్రమైన సమస్యగా  పరిగణించబడుతుంది, ఈ సమస్య ఎదురైనప్పుడు  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.  గుండె సంబంధిత, శ్వాసకోశ సమస్యలు తరచుగా ఇంటి పనులు చేయడం,  మెట్లు ఎక్కడం వంటి పరిస్థితుల వల్ల  తీవ్రమవుతాయి. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి కూడా  గుండెలో సమస్య ఉండవచ్చని చెప్పడానికి  ప్రధాన సంకేతంగా పరిగణింపబడుతుంది. పదేపదే  వచ్చే ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ నొప్పిని పెయిన్ కిల్లర్లు ఇతర  మందులతో అణిచివేసేందుకు ప్రయత్నించకూడదు. కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు తరచుగా పెరిగిన వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగులే తరచుగా శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇటువంటి లక్షణాలను తేలికగా తీసుకోవడంలో పొరపాటు చేయకూడదు. ఒకే తరహా జీవనశైలి.. ఒకే తరహా  జీవనశైలి లేదా  రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండాల్సి వస్తుంటే  అలాంటి సమయాల్లో  జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండెకు హాని కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తపర్సరణ వ్యవస్థ మందగిస్తుంది.ఇలాంటి వారు  గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఈ ప్రమాదం  దుష్ప్రభావాలు దరిచేరకుండా ఉండేందుకు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.                                                                    *నిశ్శబ్ద.

ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఊపిరితీసే ఈ క్యాన్సర్ ను నియంత్రించకపోతే కష్టమే..

మానవ శరీరంలో ఊపిరితిత్తులు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీర శ్వాస వ్యవస్థకు మూలకారణం. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ను గ్రహించి, కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఇవి సహాయపడతాయి. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోతే శరీరానికి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించి  ఎదురయ్యే సమస్యలలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముఖ్యమైనవి. ఇవి చాలా తీవ్రమైన సమస్యలుగా కూడా పరిగణించబడతాయి. ఒకప్పుడు ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. ధూమపానం, మధ్యపానం అలవాట్లు ఉన్నవారికి వస్తుందని అనుకునేవారు. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రస్తుతం యువతను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 1వ తేదీన ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణా చర్యలు మొదలైన వాటి గురించి చర్చిస్తారు. ఏ కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందో తెలుసుకుంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ చరిత్ర ఏమిటంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రస్తుతకాలంలో ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ఇది మనిషిని కబళించే వరకు బయటపడదు. దీని కారణంగా ఈ సమస్య వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. మొదట్లో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి సరైన ఆధారాలేవీ లభించలేదు. కానీ 1940- 50 సంవత్సరా మధ్య  చేసిన పరిశోధనలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ధూమపానం వల్ల కలుగుతుందని సాక్ష్యాలను చూపించినప్పుడు   నికోటిన్,  పొగాకు వల్ల  దుష్ప్రభావాలు కలుగుతాయని  ప్రజలు  గ్రహించారు. 21వ శతాబ్దం నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత జబ్బులు సాధారణ మరణాల పట్టిక స్థాయిలో  నమోదయ్యాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్  లక్షణాలు..  తరచుగా దగ్గు లేదా న్యుమోనియా సమస్య చికిత్స తీసుకున్న తర్వాత కూడా తిరిగి వస్తుంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్  ప్రారంభ లక్షణాలుగా  పరిగణించబడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్  అత్యంత సాధారణ లక్షణాలలో  ఎప్పుడూ దగ్గు వేధిస్తూ ఉంటుంది. ఇంకా  శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, బొంగురుపోవడం, అనూహ్యంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు  జీవనశైలిలో  అనేక  అలవాట్లు  కారణం అవుతాయి. ఈ అలవాట్ల నుండి జాగ్రత్త పడితే తప్ప ఈ సమస్యను దూరం పెట్టలేరు. ఎక్కువ మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమయ్యే అలవాట్లు.. ధూమపానం ..  smoking kills అని, smoking causes throat cancer అని ఇలా ప్రతీ సిగరెట్ ప్యాకెట్ మీదా బోలెడు  హెచ్చరిక రాసి ఉంటారు. ఇలా రాసినా కూడా ధూమపానం అంటే పడిచచ్చేవాళ్లు ఉన్నారు. సిగరెట్లు లేదా ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్,  క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)కి ప్రధాన కారణం. సిగరెట్ పొగ శ్వాసనాళాలను కుచించుకుపోయేలా  చేస్తుంది.  శ్వాస తీసుకోవడాన్ని  కష్టతరం చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. కాలక్రమేణా, సిగరెట్ పొగ ఊపిరితిత్తుల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇండోర్ కాలుష్యం.. పేలవమైన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ (IAQ) కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మనందరం రోజులో ఎక్కువ సమయం ఇళ్లు, ఆఫీసుల్లోనే గడుపుతాం కాబట్టి గాలి నాణ్యత సరిగా లేకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాధారణంగా బయటి గాలి చాలా కలుషితమని అనుకుంటాం. కానీ ఇంటి లోపల గాలి బయటి గాలి కంటే ఎక్కువ  కలుషితమవుతుంది.  దీని కోసం గదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవడం ఎంతో అవసరం. కిటికీలు, తలుపుల ద్వారా గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. గాలిని ఫిల్టర్ చేసే మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి.  ఇంటి చుట్టు ప్రక్కల గాలి కాలుష్యానికి కారణమయ్యే వాతావరణాన్ని నిషేదించాలి.  కలుషిత నీటిలో , ముఖ్యంగా తాగే నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . దేశంలోని పలు ప్రాంతాలలో నీటిలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువగా ఉండటం ఆరోగ్య నివేదికలను కలవర పెడుతున్నవిషయం. కొన్ని ఆసక్తికర విషయాలు.. జర్మన్ వైద్యుడు ఫ్రిట్జ్ లిక్కింట్ తన స్వదేశంలో ధూమపానానికి వ్యతిరేకంగా పోరాడాడు. అతను ప్రచురించిన ఒక నివేదిక  ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు,  ధూమపానానికి మధ్య అధిక సంబంధాన్ని రుజువు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 1.80 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారు, అయితే 2.21 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.  చాలా చిన్నవిగా కనిపించే ఈ రెండు సమస్యలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని సరిదిద్దుకోవడం ఎంతో అవసరం.                                                               *నిశ్శబ్ద.

ఈ పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది..

ఇప్పటి ప్రజలలో పోషకాహార లోపం చాలా ఎక్కువ. ఈ కారణంగా చాలామంది విటమిన్, ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ఈ  సప్లిమెంట్ల వల్ల శరీరం తాత్కాలికంగా ధృఢంగా మారుతుందే తప్ప దీర్ఘకాల బలాన్ని ఇవ్వదు. అందుకోసం ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఖర్చుతో కూడుకున్నదని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. అందరికీ అందుబాటులో లభించే ప్రోటీన్ ఫుడ్ లు ఉన్నాయి. వీటిలో నాలుగు గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నాలుగు ప్రోటీన్ ఫుడ్స్ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం ఉక్కులా మారుతుందని స్వయానా ఫిట్ నెస్ ట్రైనర్లే చెప్పడం గమనార్హం. ఇంతకూ శరీరానికి కావలసిన పోషకాలను సమృద్దిగా అందించే ఫుడ్స్ ఏంటో తెలుసుకుంటే.. కాయధాన్యాలు.. కాయధాన్యాలు ప్రోటీన్ కు మంచి మూలం. 50గ్రాముల నల్లశనగలు, సోయాబీన్, వేరుశనగలు తీసుకోవాలి. మరొకవైపు 50గ్రాముల పెసలు నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నానిన తరువాత వీటిని ఒక వస్త్రంలో వేసి మొలకలు తెప్పించాలి. ఈ మొలకలను అన్నింటినీ బాగా మిక్స్ చేసి మూడు నుండి నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. వీటిలో రోజులో అప్పుడప్పుడు తినాలి. ఇలా చేస్తే శరీరానికి కావలసినంత బలం చేకూరుతుంది. ఇది శరీరాన్ని ఉక్కులాగా మార్చే పదార్థం కూడా. పాలు, పెరుగు, జున్ను.. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి  100 గ్రాముల వరకు జున్ను తీసుకోవచ్చు. లేకపోతే అరలీటర్ పాలు లేదంటే 400గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. వీటి ద్వారా ప్రోటీన్ పుష్కలంగా లబిస్తుంది. సోయా.. సోయా ఇప్పట్లో చాలా విరివిగా వాడుతున్నారు. సోయా గ్రాన్యుల్స్ నుండి సోయా చుంక్స్ అని సోయా పిండి అని సోయా నూడిల్స్ అని చాలా రకాలుగా ఉంటున్నాయి. అయితే శాఖాహారం తినేవారికి సోయాబీన్స్ సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది ఒక్కటే ఎన్నో రకాల పోషకాలను భర్తీ చేస్తుంది. 60-80గ్రాముల సోయా బీన్ లో బోలెడు ప్రోటీన్ ఉంటుంది. నట్స్.. పుట్టగొడుగులు.. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మొదలైనవి నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ గుప్పెడు నట్స్ తిననవచ్చు. అలాగే 100గ్రాముల పుట్టగొడుగులు కూడా ప్రోటీన్ ను భర్తీ చేస్తాయి. ఈ నాలుగు ఆహారాలు రోజులో తప్పకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటే పోషకాహార లోపం మీనుండి పరిగెత్తి వెళ్లిపోతుంది. శరీరం ఉక్కులా ధృఢంగా మారుతుంది.                                                *నిశ్శబ్ద.

యువతలో స్ట్రోక్ ప్రమాదానికి ఈ మూడే ముఖ్య కారణం!

కొన్ని సంవత్సరాల  క్రితం వరకు పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధులను వృద్ధాప్య సమస్యలుగా చెప్పేవారు.  ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మరచిపోయినా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నా అప్పుడే ముసలాడివైపోయావా ఏంటి? అని అంటుంటారు. ఇది కాస్త వెటకారంగా అనిపిస్తుంది కానీ ఇందులో నిజం అదే..  ఇవన్నీ వృద్దాప్యంలో శరీర సామర్థ్యం తగ్గడం వల్ల ఏర్పడేవి. కానీ  ఇప్పుడు యువత కూడా వీటి బారిన పడుతున్నారు. ప్రస్తుతం యువతలో పెద్ద సంఖ్యలో  ఈ ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడులో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో పక్షవాతం,  మరణానికి కూడా దారి తీస్తుంది. ఏ వయసు వారైనా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని  కూడా  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నరాల సమస్యలు కూడా అనేక రకాల సమస్యలను పెంచుతున్నాయి. యువకులలో స్ట్రోక్ రావడానికి,  వృద్ధులలో స్ట్రోక్ రావడానికి కారణాలు ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే వృద్దులలో వయసు పైబడటం వల్ల ఈ సమస్య వస్తే, యువతలో  ఇతర కారణాల వల్ల వస్తుంది.  స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు యువతలో ఈ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఈ కింది సమస్యలు స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి.  అధిక రక్తపోటు సమస్య.. యువతలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణమైనదిగా కనిపిస్తుంది. చాలా మంది ఉడుకు రక్తం, అందుకే ఆవేశపడతారు అని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న స్థితిలో, ధమనుల గోడలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో  చీలిక ఏర్పడటం లేదా  రక్త సరఫరాకు అడ్డుపడటానికి దారితీస్తుంది. ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి అథెరోస్క్లెరోసిస్‌కు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణమని తేలింది. ఇప్పట్లో అధిక రక్తపోటు 20-40 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది  మందిలో  ఒకరిని  ప్రభావితం చేస్తోంది. మధుమేహం.. నేటికాలం యువతలో మధుమేహం సమస్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది. అది కూడా స్ట్రోక్ రిస్క్‌తో ముడిపడి ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువ. మధుమేహం సమస్య  నరాలను ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.  ధూమపానం... యువతకు ధూమపానం ఒక ఫ్యాషన్ గా తయారయింది. సిగరెట్ తాగేవారు హీరోలన్నట్టు, అసలైన మగాళ్లు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ ధూమపానం  స్ట్రోక్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. 2018 అధ్యయనం ప్రకారం  15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల మగవారిని సుమారు మూడు సంవత్సరాల పాటు పరిశీలించింది. ఇందులో ప్రతిరోజూ సిగరెట్ తాగే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు. ధూమపానం స్ట్రోక్‌కు దారితీసే అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది.  శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ఉండే కణాలకు నష్టం చేకూరుస్తుంది. రక్త నాళాలు చిక్కగా లేదా ఇరుకైనవిగా మారుస్తుంది. కాబట్టి ఈ మూడు విషయాల్లో యవత జాగ్రత్తగా ఉంటే స్ట్రోక్ ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు.                                                           *నిశ్శబ్ద.

శాకాహారులలో విటమిన్ బి-12 లోపమా...ఈ మూడు ఆహారాలతో భర్తీ చేయచ్చు...

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో విటమిన్-బి12 ఒకటి, ఇది  శరీరంలోని రక్తం,  నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వ్యక్తులకు బలహీనత, తిమ్మిరి, నడవడానికి ఇబ్బంది, వికారం, బరువు తగ్గడం, చిరాకు, అలసట,  హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ విటమిన్  దీర్ఘకాలిక లోపం మెదడు దెబ్బతినడానికి,  రక్తహీనతకు కూడా దారితీస్తుంది. అందుకే ఈ విటమిన్ ను  శరీరానికి కావసినంత అందించడం చాలా ముఖ్యం.  చాలామంది  విటమిన్ బి-12 కేవలం మాంసాహారంలో లభిస్తుందని అనుకుంటారు. దీనికి తగ్గట్టు ఈ విటమిన్ బి-12లోపం ఎక్కువగా శాకాహారులలోనే ఏర్పడుతుంటుంది.  అయితే శాకాహారులు కూడా విటమిన్ బి-12 ను  సులువుగానే పొందవచ్చు. కేవలం మూడు పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఈ విటమిన్ లోపాన్ని జయించవచ్చు.  ఇంతకూ ఈ విటమిన్ బి-12  సులువుగా లభ్యమయ్యే మూడు ఆహారాలు ఏవో తెలుసుకుంటే.. అరటిపండు.. అరటిపండు అత్యంత పోషకాలు,  విటమిన్లు అధికంగా ఉండే పండ్లలో ఒకటి. అరటిపండ్లు తీసుకోవడం ద్వారా విటమిన్ బి12  చాలా సులువుగా పొందగలుగుతాం. రోజులో శరీరానికి కావలసిన బి-12 విటమిన్ ను భర్తీ చేయడంలో అరటిపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది అందరికీ, అన్ని సీజన్ లలో అందుబాటులో ఉంటుంది. ధర కూడా తక్కువ.  అరటిపండులో విటమిన్లతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మలబద్ధకం,  అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. మొత్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి అరటిపండుకు ఉంది. బీట్ రూట్.. బీట్‌రూట్‌లో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. దీనిని విటమిన్ బి12 పవర్‌హౌస్ అంటారంటే బీట్ రూట్ బి-12 విటమిన్ కు ఎంత మంచి ఆప్షనో అర్థం చేసుకోవచ్చు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరగడం, రక్తహీనతను తొలగించడం,  రక్తపోటు సమస్యను తగ్గించడం  వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్-బి12 లోపం వల్ల కలిగే సమస్యలను   సులభంగా అధిగమించవచ్చు. శనగలు.. చికెన్, ఇతర  మాంసాహారం తీసుకునేవారికి  బి-12 విటమిన్ సమృద్దిగా అందుతుంది. అయితే మాంసాహారం తీసుకోని  వారికి బీట్రూట్, అరటిపండుతో పాటు శనగలు ఉత్తమ ఎంపిక. నల్ల శనగలు విటమన్ బి-12 ను సమృద్దిగా కలిగి ఉంటాయి.   విటమిన్-బి12తో పాటు ఫైబర్, ప్రొటీన్లు,  అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. శరీరం ఐరన్  గ్రహించే శక్తిని  పెంచడంలో,  ప్రోటీన్ ను గ్రహించడంలో శనగలు  దోహదం చేస్తాయి. శనగలు మొలకలు తెప్పించి తినడం లేదా నానబెట్టిన శనగలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.                                                                     *నిశ్శబ్ద.

మధుమేహం కంట్రోల్ లో లేదా..ఈ నాలుగు పదార్థాలు వాడితే చాలు..

డయాబెటిస్‌ను 'సైలెంట్ కిల్లర్' అని వర్ణించారు. అంటే ఇది శరీరాన్ని లోపల నుండి దెబ్బతీస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించకపోతే, మధుమేహ రోగులలో గుండె జబ్బులు, కళ్ళు, నరాలతో పాటు తీవ్రమైన కిడ్నీ-కాలేయం వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మధుమేహం సమస్య ఉన్నవారు చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చక్కెర స్థాయిలు  అదుపులో ఉన్నవారు ఆ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి.  చాలామంది మధుమేహం పెద్దవారిలో మ్రమే వస్తుందని అనుకుంటారు. కానీ మధుమేహం ఎవరికైనా వస్తుంది. ముఖ్యంగా  పిల్లల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం  వేగంగా పెరుగుతోందని  వైద్యులు చెబుతున్నారు. అయితే కేవలం నాలుగు నాలుగు పదార్థాలు తీసుకుంటూ ఉంటే చక్కెర స్థాయిలు మ్యాజిక్ వేసినట్టు కంట్రోల్ లో ఉంటాయి.  తిప్పతీగ..  రక్తంలో చక్కెరను నియంత్రించడానికి,  మధుమేహం  సమస్యలను నివారించడానికి, ఆయుర్వేదంలో తిప్పతీగ ను సూచించారు.  ఇది  రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు.. నేరేడు పండు కూడా మధుమేహం సమస్యలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో నేరేడు విత్తనాల పొడి, నేరేడు పండ్లు కూడా   మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో,  డయాబెటిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడే  ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్,  పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ.. ఉసిరి  శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఉసిరికాయ తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.  ఇందులో యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉన్నాయి, ఇది ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడంలో,  ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహంలో కనిపించే ఆక్సీకరణ ఒత్తిడి,  వాపును తగ్గించడంలో  కూడా సహాయపడుతుంది.   కాకరకాయ.. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తీసుకోవలసిన కూరగాయలలో కాకరకాయ తప్పనిసరిగా ఉంటుంది. చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాకరకాయలో చేదు గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంలో,  ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది. కాకరకాయ రసం లేదా దాని గింజల పొడిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి                             *నిశ్శబ్ద.

మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు అలవాట్లు మానేయాల్సిందే...

మెదడు మన మొత్తం శరీరానికి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది మానసిక, శారీరక  ఆలోచనలు, వాటి పరిస్థితులను,  భావోద్వేగాలను నియంత్రిస్తుంది.  మనం చదువుతున్నా, తింటున్నా, ఏదైనా చెప్పాలని అనుకున్నా, కోపం, సంతోషం, బాధ వంటివి ఎక్స్ఫెస్ చేసినా అవన్నీ మెదడు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. దీని ద్వారా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మెదడు అనేది చాలా కీలకమైన అంశం. మెదడు ఆరోగ్యంగా లేకపోతే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంలోకి చాలా సులువుగా జారిపోతుంది. కాబట్టి మనిషి మెదడు ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. కానీ రోజువారీ అలవాట్లలో కొన్ని మనిషి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.  వీటిలో కూడా నాలుగు అలవాట్లు  మెదడు మీద ఒత్తిడి పెంచి దాని సామర్థ్యం కోల్పోయోలా చేస్తాయి. ఆ నాలుగు అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం చాలా మంచింది. జీవనశైలి, పర్యావరణ కారకాలు,  కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదం కాలక్రమేణా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం,  నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి దూరం పెట్టాల్సిన నాలుగు అలవాట్లు తెలుసుకుంటే.. ధూమపానం.. ధూమపానం అనేది మెదడుకు మాత్రమే కాకుండా  మొత్తం శరీరానికి అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటి.  ధూమపానం చేసే అలవాటున్న వ్యక్తులకు సాధారణ  వ్యక్తుల  మెదడు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది.  దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది, ఇది స్ట్రోక్,  అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుంది. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండటానికి,  మెదడు సరిగ్గా పనిచేయడానికి, మీరు ఈ అలవాటును వెంటనే వదిలివేయాలి. తగినంత నిద్ర లేకపోవడం.. మన మెదడుకు అత్యంత ప్రమాదకరంగా భావించే అలవాట్లలో, నిద్రలేమి సమస్య కూడా ప్రముఖమైనది. తగినంత నిద్ర లేకపోవడం  మెదడుకు అనేక రకాల సమస్యలను పెంచుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు, మెదడుకు అవసరమైన విశ్రాంతి లభించదు. ఇది అభిజ్ఞా క్షీణత, జ్ఞాపకశక్తి కోల్పోవడం,  మానసిక స్థితి మార్పులు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.  నిద్ర లేకపోవడం వల్ల డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.  ఒంటరితనం.. చాలా మందికి ఒంటరిగా ఉండటం ఇష్టం. ఒంటరిగా ఉండటం, ఎవరినైనా కలవడానికి, ఎవరితో అయినా మాట్లాడటానికి అసక్తి చూపకపోవడం వంటి అలవాట్లు ఉంటే వారికి   నిరాశ, అల్జీమర్స్  వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఒంటరితనం  కాలక్రమేణా  మేధో సామర్థ్యాలలో క్షీణతకు కారణమవుతుంది. ఒంటరితనం ఉన్నవారి మెదడు పనితీరు  సాధారణ వ్యక్తుల కంటే చాలా తొందరగా సామర్థ్యాన్ని కోల్పోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అతిగా కూర్చోవడం.. నేటి జీవన శైలిలో ఎక్కువగా కూర్చునే ఉండటం కామన్ అయిపోయింది. ఒకే చోట గంటలు గంటలు కూర్చోవడం, కదలకుండా పనిచేసుకోవడం, ఉద్యోగాలు చేయడం మొదలయినవి  శరీరానికి హానికరం. ఇది  మెదడుపై  దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఎక్కువసేపు  కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన  మెదడులోని ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.  తక్కువ చురుకుగా ఉన్నవారికి మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                                    *నిశ్శబ్ద.

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణానికి పెనుముప్పు!

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. కాలేయం యొక్క ప్రధాన విధి రక్తంలో రసాయన స్థాయిలను నియంత్రించడం, అలాగే బైల్ అనే ముఖ్యమైన జీర్ణ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం. అంతే కాకుండా రక్తాన్ని శుభ్రపరిచే పని, గ్లైకోజెన్ అనే చక్కెర రూపంలో శక్తిని నిల్వ చేసే పని కూడా కాలేయం ద్వారానే జరుగుతుంది. ఇంత ముఖ్యమైన భాగం దెబ్బతింటే  అప్పుడు శరీరంలో జరిగేదేంటో ఊహించండి? కాలేయం దెబ్బతింటే అది క్రమంగా మనిషి మరణానికి కారణమవుతుంది. దాని లక్షణాలను సకాలంలో గుర్తించి వాటి చికిత్స ప్రారంభించినట్లయితే, కాలేయం పూర్తీ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది ఏ సంకేతాల ఆధారంగా గుర్తించబడుతుందో, లివర్ తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుంటే.. చాలా మంది దగ్గర లివర్ పెయిల్యూర్ అనే మాట వింటూ ఉంటాం. లివర్ ఫెయిల్యూర్ అంటే అది తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడమే. ఇది చాలాప్రమాదకరమైన పరిస్థితి, అంటే రోగికి తక్షణ వైద్య సహాయం అవసరం అవుతుంది.  లివర్ పాడైనప్పుడు  కొన్ని లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తించవచ్చు, వాటికి అనుగుణంగా నివారణ పద్ధతులను ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. కాలేయం దెబ్బతినే అవకాశం ఉన్న వ్యక్తులలో రక్తం వాంతులు, అలసట, కామెర్లు,  నిరంతర బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.   ఈ సమస్యల వల్ల కాలేయం దెబ్బతింటుంది..  సాధారణంగా హెపటైటిస్‌ బి, లివర్‌ సిర్రోసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారిలో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, మద్యం లేదా కొన్ని మందులు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుంది . నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయం దెబ్బతినే సమస్య అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కాలేయం బలహీనంగా మారడంతో పరిస్థితి తీవ్రంగా మారుతుంది.  దీన్ని ఎలా నివారించాలంటే.. కాలేయ వ్యాధి ఉన్నవారు లేదా కాలేయం దెబ్బతినే లక్షణాలను కలిగున్న వ్యక్తులు మొదట ఆల్కహాల్ తీసుకోవద్దని  వైద్యులు  సలహా ఇస్తున్నారు. ఇది కాకుండా అధిక రక్తపోటు,  మధుమేహాన్ని నియంత్రణలో ఉంటుకోవాలి సలహా ఇస్తారు.  ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడంతో పాటు ఎర్రమాంసం, చీజ్ మరియు గుడ్లు తీసుకోవడం తగ్గించుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.

వర్షాకాలంలో వచ్చే దురదలు.. దద్దుర్లకు చక్కని చిట్కాలు ఇవిగో..

వర్షాకాలంలో  అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. దోమలు విజృంభించడం వల్ల  అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు వర్షాకాలంలోనే మొదలవుతాయి. ఈ సీజన్‌లో స్కిన్ అలర్జీలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు సర్వసాధారణం. ఉష్ణోగ్రత, గాలి నాణ్యత, ధూళి,  తేమ కారణంగా వర్షాకాలంలో మెడ, మోచేతులు, చేతులు, రొమ్ము కింద, గజ్జ చర్మం మొదలైన ప్రాంతాల్లో చెమట ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా, బ్యాక్టీరియా,  వైరస్లు పుడతాయి. ఇది   అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంటర్‌ట్రిగో, రింగ్‌వార్మ్, తామర, చర్మపు దద్దుర్లు, గొంతు నొప్పి, తామర, జలుబు,  జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది.  చర్మంలో తేమ కారణంగా చెమట పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపించి దురద మొదలవుతుంది. ఇది మాత్రమే కాకుండా దోమలు కుట్టడం, వర్షం కారణంగా కొన్ని పురుగులు స్వేచ్చగా సంచరిస్తూ కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది చర్మం దురద, లేదా రాషేష్ కు కారణం అవుతుంది. ఇలాంటి  పరిస్థితిలో వర్షాకాలంలో దురద  దద్దుర్లు  తగ్గడానికి ఇంటి  చిట్కాలను  అనుసరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.  ఈ నాలుగు పదార్థాలు ఉపయోగించడం ద్వారా దద్దుర్లు తగ్గించుకోవచ్చు.  గంధపు పేస్ట్.. వర్షాకాలంలో చర్మంపై దురద ఎక్కువగా ఉంటే, అప్పుడు గంధపు పేస్ట్ చర్మానికి బాగా పనిచేస్తుంది. చందనం చర్మానికి మేలు చేస్తుందని ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో పేర్కొన్నారు. కాబట్టి నేరుగా గంధం చెక్కనుండి  తీసిన పేస్ట్ లేదా మార్కెట్ లో లభించే గంధం పొడి ఉపయోగించవచ్చు. కొద్దిగా రోజ్ వాటర్ ను ఉపయోగించి గంధం  పేస్టు తయారుచేసుకోవాలి. దీన్ని  దురద ఉన్న చోట అప్లై చేయాలి. రెగ్యులర్ ఇల్ అప్లై  చేస్తుంటే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. పనిలో పనిగా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కొబ్బరి నూనె కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించడంతో పాటు ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో దురద వస్తే కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. ముందే చర్మానికి రాసుకుంటూ ఉంటే దద్దుర్లు, దురదలు రావు. నిమ్మకాయ, బేకింగ్ సోడా.. నిమ్మకాయ చర్మానికి మేలు చేస్తుంది. వర్షంలో చర్మంపై తేమ వల్ల దురద వస్తే రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత చర్మాన్ని కడగాలి. దీన్ని రోజుకు ఒకసారి చేయడం వల్ల దురద నుండి బయటపడవచ్చు. వేప.. వేప చాలా ప్రయోజనకరమైన ఆయుర్వేద ఔషధం. చర్మ సంబంధిత సమస్యలలో వేపను ఉపయోగించడం మేలు చేస్తుంది. దురద సమస్య తొలగిపోవాలంటే వేప ఆకులను మెత్తగా చేసి చర్మానికి రాసుకోవాలి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                  *నిశ్శబ్ద.

వర్షాకాలం ఆరోగ్య సూత్రాలు

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1. వర్షాకాలంలో తగినంత నీరు త్రాగాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ శరీరానికి నీరు అవసరం. వర్షం వల్ల వచ్చే అధిక తేమ కారణంగా డీహైడ్రేట్‌కు కారణం అవుతుంది. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండవచ్చు . 2. వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, సూప్‌లు తాగాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ, హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 3. సీజన్‌లో లభించే పండ్లను తినాలి. యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను నిరోధిస్తాయి. 4. రోగనిరోధక శక్తి ని బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి. నిమ్మకాయలు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్‌లో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి కాపాడుతాయి. 5. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. చికెన్, చేపలు, వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి. కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 6. వెల్లుల్లి, ఉల్లిపాయలు సహజంగా యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తాయి. వర్షాకాలంలో బయటి ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా బయటి ఫుడ్స్‌ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అలాగే శీతల పానీయాలు కూడ మానేస్తే మానేస్తే మంచిది . లేదంటే జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి.

డెంగీ జ్వరంలో ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గుతాయి?

వర్షాకాలంలో దోమలు విజృంభించడం వల్ల  వచ్చే జ్వరాలలో డెంగీ ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైనది. సరైన ట్రీట్మెంట్ లేకపోవడం డెంగీ జ్వరాన్ని ప్రాణాంతకంగా మారుస్తుంది. డెంగీ వచ్చినవారిలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోతుందనే విషయం  అందరూ వినే ఉంటారు. ఇలా ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం  మరణానికి తలుపులు తెరవడమే.. అసలు ఈ ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గిపోతాయి? దీనికి  కారణం ఏంటి? ప్లేట్ లెట్స్ పెంచడానికి ఏం చేయాలి? మొదలైన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్లేట్ లెట్స్  ఎంత ఉండాలి? ప్లేట్‌లెట్స్, లేదా థ్రోంబోసైట్‌లు, మన రక్తంలోని  రంగులేని, చిన్న  కణ శకలాలు. ఇవి గాయం తగిలినప్పుడు రక్తస్రావం అయ్యేటప్పుడు రక్తం గడ్డ  కట్టేలా చేస్తాయి. ఈ కారణంగా రక్తస్రావాన్ని ఆపుతాయి. ఈ ప్లేట్ లెట్స్  ఎముక మజ్జలో  తయారవుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ప్లేట్‌లెట్ కౌంట్ మైక్రోలీటర్ రక్తంలో 1,50,000 నుండి 4,50,000  వరకు ఉంటుంది. 450,000 కంటే ఎక్కువ ప్లేట్‌లెట్‌లను కలిగి ఉండటాన్ని థ్రోంబోసైటోసిస్ అని,  150,000 కంటే తక్కువ ప్లేట్‌లెట్లను థ్రోంబోసైటోపెనియా అని పిలుస్తారు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి థ్రోంబోసైటోపెనియా అనే సమస్య  శరీరంలో ఏర్పడుతుంది. ప్లేట్ లెట్స్ తగ్గడానికి ఇదే కారణం.. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మన ఎముక మజ్జ అణచివేయబడుతుంది, ఫలితంగా ప్లేట్‌లెట్ ఉత్పత్తి తగ్గుతుంది. డెంగ్యూ వైరస్ బారిన పడిన రక్తకణాలు ప్లేట్‌లెట్లను దెబ్బతీసి వాటిని నాశనం చేయడం ప్రారంభిస్తాయి. డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఏర్పడే  యాంటీబాడీల వల్ల ప్లేట్‌లెట్స్ కూడా తగ్గడం ప్రారంభిస్తాయి. ప్లేట్ లెట్స్ తగ్గితే శరీరంలో జరిగేది ఇదే.. డెంగ్యూ వ్యాధి వచ్చిన 3వ-4వ రోజు వరకు ప్లేట్‌లెట్ కౌంట్ సాధారణంగా తక్కువగా ఉంటుంది.  ఆ తరువాత జరిగే ట్రీట్మెంట్ వల్ల ఎనిమిది నుండి తొమ్మిదవ రోజులో మెరుగుదల  ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి డెంగ్యూ  జ్వరం వచ్చినప్పుడు మొదటి  8రోజులు చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి.  ప్లేట్‌లెట్స్ రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి కాబట్టి, శరీరంలో వాటి లోపం వల్ల డెంగ్యూ కేసుల్లో రక్తపు వాంతులు లేదా రక్తపు మలం జరుగుతుంది. ప్లేట్‌లెట్స్  ఎలా పెంచుకోవాలి? డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం తీవ్రమైన వ్యాధికి సంకేతం. రోగిని ఆసుపత్రిలో చేర్చాలి, తద్వారా ఇతర లక్షణాలతో పాటు రక్తస్రావం సమస్యను నియంత్రించవచ్చు. వైద్యులు దానిని మందుల ద్వారా మెరుగుపరుస్తారు. ఇది కాకుండా, ఒమేగా -3, విటమిన్లు, ఐరన్ మరియు ఇతర మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడతాయి, డెంగ్యూలో ప్లేట్‌లెట్ల సంఖ్యను కూడా పెంచుతాయి. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.   *నిశ్సబ్ద.

ఏ జ్వరం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయంటే...

వర్షాకాలంలో  దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం, వరదలు, నీరు కలుషితమవడం వంటివి  దోమల సంతానోత్పత్తికి అత్యంత అనుకూలమైనవి, అందుకే డెంగ్యూ-మలేరియా,  చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రభలుతాయి. వీటి బాధితుల సంఖ్య వర్షాకాలంలో,  ఆ తర్వాత కొన్ని నెలల వరకు కూడా  నమోదవుతుంది. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా  జ్వరాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఓ దశ దాటితే ప్రణాలను చాలా సులువుగా లాగేసుకుంటాయి. ఈ వ్యాధుల కారణంగా ఏటా వందల మంది మరణిస్తున్నారు. అందుకే ఈ వ్యాధుల తీవ్రతను అర్థం చేసుకోవడం, వీటి నివారణ చర్యలపై శ్రద్ధ వహించడం అవసరం. డెంగ్య, మలేరియా, చికున్‌గున్యా వీటి  మధ్య తేడాను ఎలా గుర్తించాలంటే.. డెంగ్యూ.. డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ (DENV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ సోకిన దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి, అందుకే  వర్షాకాలంలో  ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించడం మంచిది. తేలికపాటి డెంగ్యూలో అధిక జ్వరం,  ఫ్లూ-వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే  డెంగ్యూ తీవ్రరూపం దాలిస్తే అది  హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది, ఇది తీవ్రమైన రక్తస్రావం, రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం, షాక్ కు లోనవడం, తద్వారా  మరణానికి కూడా దారి తీస్తుంది. డెంగ్యూ జ్వరంలో బ్లడ్ ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ సోకిన వ్యక్తి దగ్గర ఉండటం వల్ల మీకు డెంగ్యూ జ్వరం రాదు. దీని నివారణకు దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. మలేరియా.. డెంగ్యూ మాదిరిగానే మలేరియా కూడా తీవ్రమైన వ్యాధి. మలేరియా అనేది పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధి. ఈ పరాన్నజీవులు సోకిన దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తాయి. మలేరియా ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక జ్వరం, చలి ని అనుభవిస్తారు. మలేరియా కూడా తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. మలేరియా వల్ల ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి  కిడ్నీకాలేయం ను  కూడా దెబ్బతీస్తుంది. మలేరియాను మందులతో నయం చేయవచ్చు. చికున్‌గున్యా .. చికున్‌గున్యా అనేది చికున్‌గున్యా వైరస్ (CHIKV) వల్ల దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి  మొదటి లక్షణాలు సాధారణంగా జ్వరం,  చర్మపు దద్దుర్లు రూపంలో కనిపిస్తాయి. ఇది కాకుండా, రోగులకు అకస్మాత్తుగా అధిక జ్వరం (సాధారణంగా 102°F పైన), కీళ్ల నొప్పులు, తలనొప్పి, వికారం,  వాంతులు కూడా ఉండవచ్చు. చికున్‌గున్యాకు నిర్దిష్ట యాంటీవైరల్ మందు లేదు, కాబట్టి చికిత్స లక్షణాలను తగ్గించడానికి,  సమస్యలను నివారించడానికి ప్రయత్నిస్తారు. దీని చికిత్సలో  రోగి పుష్కలంగా ద్రవాలు త్రాగుతూ  ,  విశ్రాంతి బాగా తీసుకోవాలి. నివారణ ఎలాగంటే.. దోమల వల్ల వచ్చే వ్యాధులన్నింటిని అరికట్టాలంటే దోమ కాటును నివారించే పద్ధతులను అవలంబించడం ఉత్తమమైన మార్గమని వైద్యులు చెబుతున్నారు. పొడవాటి చేతుల బట్టలు ధరించాలి. రాత్రి పడుకునేటప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచి, దోమతెరలు వాడాలి. దోమల వికర్షక కాయిల్స్ అనేక విధాలుగా హానికరం అని కనుగొనబడింది, కాబట్టి వాటిని చాలా తక్కువగా వాడాలి. దోమల నివారణకు సహజ మార్గాలు ఫాలో అవ్వాలి.                                                          *నిశ్శబ్ద.