Read more!

మీకూ ఈ లక్షణాలుంటే పొగాకు వ్యసనంగా మారినట్టే!

ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు పొగాకు ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది.. 'మనకు ఆహారం పొగాకు కాదు. పొగాకు ఉత్పత్తి చేసే రైతులను ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించడమే దీని లక్ష్యం' అనే థీమ్ ను ప్రజలముందుకు తెచ్చింది.

 పొగాకు ఉత్పత్తులను గుట్కా, ఖైనీ, సిగరెట్ల రూపంలో తీసుకుంటే వెంటనే మానేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవన్నీ మన శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనే విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. 

పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు సమస్యలు  వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అయితే ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త నాళాల విస్తరణ ప్రమాదాన్ని పెంచుతుంది . పొగాకు అనేది ఒక వ్యసనం, దీని నుండి బయటపడటానికి ప్రయత్నాలు అవసరం, లేకుంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది 

పొగాకు వ్యసనంగా మారిందని తెలుసుకోవడం ఎలా??

పొగాకు-సిగరెట్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతే.. దాని వ్యసనానికి బలి అయ్యారనే సంకేతం. అయితే ఈ వ్యసనం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

పొగాకులో నికోటిన్ ఉంటుంది, ఈ రసాయనం వ్యసనానికి ప్రధాన కారణం. నమలడం లేదా ధూమపానం చేయడం ద్వారా పొగాకు రక్తప్రవాహంలోకి శోషించబడినప్పుడు, అది అడ్రినలిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. నికోటిన్, మరోవైపు, డోపమైన్ హార్మోన్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది మెదడును సంతోషపెట్టే హార్మోన్.  దీని కారణంగా చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. పదే పదే ఈ సంతోషం కోసమే పోగాకుకు అలవాటు పడతారు.

పొగాకు వ్యసనం లక్షణాలు.. 

పొగాకు వ్యసనం లక్షణాలు  పైకి స్పష్టంగా కనబడతాయి.  పొగాకు మానేయడానికి ప్రయత్నించినప్పటికీ ధూమపానం లేదా పొగాకు నమలడం ఆపలేకపోవడం. ఒకరోజైనా  వదిలేయాలని ప్రయత్నించినప్పుడు, చేతి వణుకు, చెమటలు పట్టడం, అశాంతి, గుండె వేగం పెరగడం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. భోజనం తర్వాత ధూమపానం చేయాలని, పొగాకు నమలాలని అనిపించడం. 

పొగాకు వ్యసనం, దాని  లక్షణాలు, పొగాకు వల్ల ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ తెలుసుకుని స్ఫూర్తి వంతంగా పోగాకుకు దూరమైతే ఆరోగ్యం బాగుంటుంది.

                                       ◆నిశ్శబ్ద.