వేప చేసే అద్భుతాలు

 

 

పకృతి వేప వాసనని వెదచల్లితే ఉగాది పండుగ దగ్గరపడుతోందని అర్ధమైపోతుంది. వేపచెట్టు వల్ల కలిగే ఉపయోగాలు కేవలం ఈ కాలానికి మాత్రమే పరిమితమైపోలేదు. సంవత్సరంలో 365 రోజులు వేప మనకి మేలు చేస్తూనే ఉంటుంది.  శరీరం బరువు తగ్గలన్నా, శరీరంలోని రక్తం శుద్ది కావాలన్నా, చర్మంపై వచ్చే కురుపులు, ఎలర్జీలు తగ్గాలన్నా, చుండ్రు పోవాలన్నా, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలన్నా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి వేప ఒక దివ్యౌషదం. ఆఖరికి కాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాదిని కూడా తగ్గించగలదు.


సర్వరోగ నివారిణి అని సంస్కృతంలో వర్ణించబడిన వేప చెట్టు ప్రతి అణువులోనూ రోగనిరోధక శక్తి దాగి ఉంది. ఆయుర్వేద నిపుణులు దాని వేర్లని, బెరడుని, ఆకులని, పువ్వులని, పళ్ళని అన్నిటినీ ఉపయోగించి ఎన్నో రకాల మందుల్ని తయారుచేస్తారు. వాళ్ళే కాదు మనం కూడా వేప గురించి తెలుసుకుని అవసరమైన రీతిలో వాడుకోవచ్చు.

 

 

*  బరువు తగ్గటానికి

ఒక గుప్పెడు వేప పువ్వులని చేతిలో వేసి నలిపి, అందులో ఒక చెంచాడు తేనే అరచెంచా నిమ్మరసం కలిపి పరగడుపునే తాగితే ఒంటిలోని ఎక్కువగా ఉన్న కొవ్వు కరుగుతుందిట.

* దోమల నివారణకి

దోమలు కుట్టకుండా మనం కొన్ని ఆయింట్మెంట్ లు వాడతాం, దాని బదులు ఒక చెంచా వేపనూనేలో మరొక చెంచా కొబ్బరి నూనే కలిపి దానిని ఒంటికి రాసుకుని పడుకుంటే దోమలు కుట్టవు.

*  పేలను అరికట్టటానికి

స్కూల్ కి వెళ్ళే ఆడపిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య పేలు, వీటిని తగ్గించుకోటానికి కొన్ని వేప ఆకుల్ని మెత్తగా రుబ్బి దానిని తలకు పట్టించి కాసేపు ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీలతో కడిగేసుకుంటే పెళ బాధ తగ్గుతుంది.

*  వేప నూనే

విటమిన్ ఈ పుష్కలంగా ఉండే వేప నూనెలో చర్మానికి మెరుపు తెచ్చే శక్తి కూడా ఉంది. ఇది చర్మానికి పట్టించగానే  చర్మంలో ఇంకిపోయి, చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. మొహం మీద ముడతలు కూడా పోయి  ఉట్టిపడుతూ ఉంటుంది.

*  షుగర్ వ్యాదికి

షుగర్ వ్యాదితో బాధపడేవాళ్ళు పరగడుపునే లేత వేప ఆకుల్ని నమిలినా లేదా వాటి రసం తాగినా చక్కటి ఫలితం లబిస్తుంది. ఇది రక్తప్రసరణ సరిగా జరిగేలా చూడటమే కాదు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది.

*  కడుపులో నులి పురుగులకి

చిన్న పిల్లలకి కడుపులో నులి పురుగులు ఉండటంవల్ల సన్నగా తయారవుతారు. మొహంపైన తెల్లటి మచ్చలు కూడా వస్తుంటాయి. అలా ఉన్నవాళ్ళకి వేప పువ్వులని వెన్నలో వేయించి పొడి చేసి ఆ పొడిని ఒక 3-4 రోజులు అన్నంలో కలిపి పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

*  గొంతు నొప్పికి

గొంతు ఇంన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేప ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి ఆ నీటితో గొంతు పుక్కలించుకుంటే రెండు రోజుల్లోనే మంచి గుణం కనిపిస్తుంది.

మన ముందు తరాల అందుకే వేపని ఎక్కువగా వాడుతూ ఉండేవారు. వేప పుల్లతో పళ్ళు తోముకునేవారు. వేపపళ్ళని తినేవారు. అన్ని భాగాల్లోనూ సహజసిద్దమైన వ్యాదినివారణ గుణాలతో నిండి ఉన్న వేపను మనం కూడా నిర్లక్ష్య దొరనితో చూడకుండా ఉపయోగించుకుందాం.

...కళ్యాణి