ముద్రగడ కమెడియన్ అవుతున్నాడా..?

  ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్టు ప్రస్తతం ముద్రగడ పద్మనాభం పరిస్థితి చూస్తుంటే. కాపులకు అన్యాయం జరుగుతుందంటూ... కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ఉద్యమం.. నాలుగైదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి బాగానే ఫేమస్ అయ్యారు. ఆయన చేసిన దీక్షకు ఫలితంగా ప్రభుత్వం తన డిమాండ్లు తీర్చుతానని చెప్పడంతో ఏదో ఒక రకంగా సర్ధి చెప్పడంతో తన దీక్షను విరమించారు. ఇక అంతటితో పరిస్థితి కాస్త చక్కబడింది. అయితే ఆతరువాత ముద్రగడ దీక్షకు వెనుక జగన్ హస్తం ఉందని.. జగన్ వల్లే ముద్రగడ దీక్ష చేశారని పలు ఆరోపణలు వచ్చాయి.   అది అయిపోయిందంటే ఇప్పుడు మరో బాధ. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయిందంటూ..  అదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నన్ను ఓ దొంగ, ద్రోహీ అని టీడీపీ నేతలతో తిట్టించారు అని అన్నారు. నాపై వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేను తప్పానా..?.. కాపు డిమాండ్లను అవహేళన సమంజసమేనా.. అధికారంలో ఉన్నవాళ్లు అబద్దాలు చెబితే నిజమైపోతాయా అంటూ మళ్లీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు ముద్రగడ. అంతేకాదు మరోసారి దీక్ష కూడా చేస్తానని చెప్పారు.   అయితే ఆయన మరోసారి దీక్ష సంగతేమో కానీ దీనివల్ల కాపులకు కాపులకు మధ్య విబేధాలు తెలత్తుతున్నాయి. ఆయన చేపట్టదలచిన దీక్ష నేపథ్యంలో జిల్లాల కాపు సంఘాల నేత‌లతో ముద్రగడ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కొంత మంది ప్రభుత్వానకి వ్యతిరేకంగా మాట్లాడితే.. మరికొందరు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంతో వాగ్వాదం మొదలైంది. దీంతో సమావేశం కాస్త రసాభాసగా తయారైంది. దీంతో ఇక చేసేది లేక ముద్రగడ దీక్షను వాయిదా వేసేశారు.   మొత్తానికి ముద్రగడ పరిస్థితి అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. రాను రాను ఆయన అందరూ ఆడించే బొమ్మలా తయారవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఆయన ఇలానే చేస్తే ప్రభుత్వం కూడా ఆయన డిమాండ్లకు తలొగ్గే పరిస్థితులు ఉండవని.. ఆయన అలానే ఉంటే అందరికి కమెడియన్ లా అవుతారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ముందు ముందు ముద్రగడ పరిస్థితి ఇంకేలా తయారవుతుందో చూడాలి.

అమెరికాలో కాల్పులు... ఐదుగురి మృతి

  అమెరికాలో తుపాకీ సంస్కృతి మరో ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. అక్కడి పిట్సబర్గ్‌ నగరంలో జరుగుతున్న ఒక పార్టీలో ఇద్దరు వ్యక్తులు తుపాకులను పట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పార్టీలో జరిగిన గొడవ ఏదన్నా ఈ కాల్పులకు దారితీసిందా, లేకపోతే ఇది ఉగ్రవాద చర్యా అన్నది ఇంకా తేలలేదు. పిట్సబర్గ్‌లోని విల్కిన్స్‌బర్గ్ అనే ప్రదేశంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తరువాత దుండగులు చల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశమంతా ఖాళీతూటాలతోనూ, రక్తపు మరకలతోనూ భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. దాడిలో తమ ఆప్తులను పోగొట్టుకున్నవారి బంధువుల రోదనతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా ఉంది. అమెరికాలో తుపాకుల సంస్కృతిని అంతమొందిస్తానంటూ ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా శపథం చేసినా, దానికి వెక్కిరింతగా ఏదో ఒక సంఘటన ప్రతి వారమూ బయటపడుతూనే ఉంది.

వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ప్రత్తిపాటి..

  2016-17 సంవత్సరానికి గాను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ. రూ.16,250.58 కోట్లు గా మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో లాభసాటిగా మార్చడమే లక్ష్యమని అన్నారు. ఇంకా ప్రత్తిపాటి ప్రతిపాదించిన అంశాలు   * ఉపాధి హామీకి రూ. 5,094 కోట్లు * ఉచిత విద్యుత్ కు రూ. 3 వేల కోట్లు * తుంపర సేద్యానికి రూ. 369 కోట్లు * వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ. 344 కోట్లు * వడ్డీ లేని రుణాలకు రూ.177 కోట్లు * పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు * రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు * సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ.95 కోట్లు * ఆయిల్ ఫాం మినీ మిషన్ కు రూ. 55 కోట్లు

ముదురుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వివాదం..

ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ నిర్వహించతలపెట్టిన సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించి రాజ్యసభలో ఇప్పటికే దుమారం రేగుతూనే ఉంది. దీనిపై గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రవిశంకర్‌ గురూజీ కార్యక్రమం పర్యావరణానికి హాని కలిగిస్తోందని..ఇంత పెద్ద ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా అని పర్యావరణ మంత్రిత్వ శాఖను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం లోపు రూ.5కోట్లు చెల్లించాలని రవిశంకర్ కు గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. దీనికి రవిశంకర్ మాత్రం జైలుకైనా వెళ్తాను కానీ జరిమానాను చెల్లించనని రవిశంకర్ స్పష్టం చేశారు.

కేసీఆర్, చంద్రబాబుపై జేసీ కామెంట్స్.. ఇద్దరూ ఇద్దరే..

  ప్రతిపక్ష పార్టీపైనే కాదు.. సొంత పార్టీమీద.. సొంత పార్టీ నేతలమీద కామెట్లు చేయాలంటే జేసీ దివాకర్ రెడ్డి తరువాతే. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ తన నోటికి పని చెప్పారు. ఈసారి ఏకంగా తెలుగు రాష్ట్రాల సీఎం గురించి వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరితే కేసీఆర్ పదవులు కాకపోయినా పనులైనా చేసిపెడతారని ఆశించి ఆ పార్టీలోకి చేరుతున్నారు.. కానీ ఏపీలో పరిస్థితి వేరు ఇక్కడ దానికి కుడా అవకాశం లేదని..తాను కూడా ఆకర్షణలో భాగంగానే టిడిపిలో చేరానని చెప్పారు. ఇక వైసీపీ నేతలు టీడీపీలోకి చేరడం గురించి మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనలేదు.. జగన్ తీరు నచ్చకే ఆపార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు అని వ్యాఖ్యానించారు.   ఇంకా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సరికాదని తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి చెప్పానని... దానికి సోనియా 20 ఏళ్ల తర్వాత అయినా రాష్ట్ర విభజన సమర్థనీయమని ప్రజలు చెప్తారని తనతో అన్నారని అన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ కంటే రాయల్ తెలంగాణ ఇచ్చుంటే బావుండేదని.. అప్పుడు సీమకు కష్టాలు వచ్చేవికావని అన్నారు.

కోమటిరెడ్డి జోస్యం.. 2019 ఎన్నికల్లో 95 స్థానాలు..

  ప్రస్తుతం తెలంగాణలోని అధికార పార్టీలోకి వలసలు పర్వం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతలందరూ వరుసపెట్టి.. టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశార. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2017 వరకూ తాము రెస్ట్ లో ఉన్నామని.. 2018 నుండి తిరిగి రంగంలోకి దిగుతామని అన్నారు. అంతేకాదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 95 స్థానాలు గెలుచుకుంటామని జోస్యం కూడా చెప్పారు. మరి వెంకటరెడ్డిగారు ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటో...

2016 -17 ఏపీ బడ్జెట్.. ముఖ్యాంశాలు..

  ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016 -17 కు గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.. * 206-17 బడ్జెట్ - 1,35,688.99 కోట్లు * ప్రణాళికా వ్యయం - 49,134.44 కోట్లు * ప్రణాళికేతర వ్యయం - 86,554.55 కోట్లు * గతేడాది కంటే 20.13 శాతం పెరిగిన ఏపీ బడ్జెట్ * సాగునీటి రంగానికి రూ.. 3,512 కోట్లు * రుణమాఫీకి రూ.. 3,512 కోట్లు, ఇరిగేషన్ రూ.. 7,325 కోట్లు * 10.9 శాతం వృద్దిరేటు లక్ష్యం * 15 నుండి 18 వేల కోట్లు అమరావతి నిర్మాణానికి అవసరం * ఆర్ధిక లోటు 20 వేల 4 వందల 97 కోట్లు * గత ఏడాదితో పోలిస్తే 20.13 శాతం బడ్జెట్ వృద్ధి * తాగునీటికి 3,300 కోట్లు కేటాయింపు * ఏపీ రెవెన్యూ లోటు రూ. 4,868 కోట్లు * వృద్ధి రేటు లక్ష్యం10.9 శాతం * పారిశ్రామిక రంగంలో వృద్ధిరేటు 11.43 శాతం * వ్యవసాయ రంగలో వృద్ధిరేటు 8.4 శాతం * రాష్ట్రాభివృద్దికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు * ఇరిగేషన్ కు రూ. 7,325 కోట్లు * భూపరిపాలనకు రూ.3119 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి రూ.8724 కోట్లు * ఎస్టీ సంక్షేమానికి రూ.3100 కోట్లు * బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.65 కోట్లు * కాపు కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు * సాంఘిక భద్రత పింఛన్ల కోసం రూ.2998 కోట్లు * యువత సాధికారత కోసం రూ.252 కోట్లు * మహిళా సాధికారత కోసం ప్రత్యేక ప్రాజెక్టు * మహిళా సాధికారకతకు రూ.642 కోట్లు * క్రీడాశాఖకు రూ.215 కోట్లు * నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా లక్షమందికి శిక్షణ * ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.377 కోట్లు * ఉపాది హామీ పథకానికి రూ.4,764 కోట్లు *  పట్టణ పరిపాలనకు రూ.4,728 కోట్లు

సుష్మా స్వరాజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన విపక్షాలు..

  పార్లమెంట్ సమావేశాల్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సమావేశాల్లో అధికార పక్షాలు.. విపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అందునా ఇక ఆప్ బీజేపీ సంగతైతే చెప్పనవసరం లేదు.. నిప్పూ, ఉప్పులా ఉండే ఈ రెండు పార్టీలు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాయి.. అలాంటిది ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అందుకు భిన్నంగా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పై విపక్షాలు పొగడ్తల వర్షం కురిపించారు. ఆప్ ఎంపీ భగవంత్ మాన్ సుష్మా గురించి మాట్లాడుతూ.. మన దేశ ప్రజలు విదేశాల్లో ఇబ్బందులు పడ్డ వేళ.. సుష్మా చూపిన చొరవ అభినందనీయం అంటూ.. తమ నియోజక వర్గానికి చెందిన 13 మంది సౌదీలో బానిసలుగా బతుకుతూ ఇబ్బందులు పడుతున్నారని సుష్మా దృష్టికి తీసుకెళ్లామని.. అందుకు ఆమె స్పందిచిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆయన ఒక్కడే కాదు ఇంకా పలువురు ఎంపీలు కూడా సుష్మాపై పొగడ్తలు కురిపించారు. మరో ఎంపీ ధరమ్ వీర్ గాంధీ మాట్లాడుతూ..నేను మిమ్మల్నీ ఏ ప్రశ్నా అడగను.. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి లేచా అని అన్నారు. బిజూ జనతా దళ్ నేత బైజయంత్ పాండా మాట్లాడుతూ.. ఓ మంత్రిగా ఆమె స్పందించే తీరు అత్యద్బుతమని అన్నారు. ఆర్జేడీ సభ్యుడు రాజేష్ రంజన్ కూడా మాట్లాడుతూ.. నేతలు ఇంగ్లీషులో ప్రశ్నలు వేసినా.. ఆమె మాత్రం హిందీలో సమాధానం చెప్పడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. ఇక వీరందరి పొగడ్తలకు ఉబ్బితబ్బిబైన సుష్మా తనను అభినందించిన వారందరికి చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైన ప్రతిపక్షనేతలతో పొగిడించుకోవడం ఎంతైనా గొప్ప విషయమే.

ముస్లిం చట్టాలపై న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు

  ముస్లింలు అనుసరించే నిబంధనలు (షరియా) గురించి కేరళ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు, అక్కడ పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి. కమాల్‌ పాషా అనే సదరు న్యాయమూర్తి ఒక సమావేశంలో మాట్లాడుతూ... షరియాలోని అనేక అంశాలు స్త్రీల పట్ల పక్షపాతం కలిగి ఉన్నాయనీ, అందుకని దేశంలోని మిగతా ప్రజలందరి కోసం నియమించి ‘ఏకరీతి పౌర నిబంధన’ (యూనిఫాం సివిల్ కోడ్‌)ను వ్యతిరేకించడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడం లేదని పాషా వాపోయారు. కమాల్ పాషా వ్యాఖ్యలు కేరళలో సంచలనం సృష్టించాయి. కేరళలో ఉన్న ముస్లిం సంస్థలు అన్నీ కూడా ఏకతాటిన ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. కమాల్‌ మాట్లాడిన మాటలు హిందూ అతివాద సంస్థల ప్రకటనల్లా ఉన్నాయని మండిపడుతున్నాయి. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న కేరళలో, ఈ ప్రకటన మరింత వివాదాన్ని రాజేసే ప్రమాదం లేకపోలేదు.

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం..

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో తెలంగాణ ఏర్పడింది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది.. ప్రభుత్వ కార్యక్రమాలు జాతీయదృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామి అన్నారు.. ఇంకా పలు అంశాల గురించి గవర్నర్ ప్రస్తావించారు అవి.. *  కాలేజీ విద్యార్ధులకు కూడా సన్న బియ్యం అమలు చేస్తాం *  వ్యవసాయం 0.8, పరిశ్రమలు 8.3 *  డబుల్ బెడ్ రూం పథకానికి భారీ కేటాయింపులు చేశాం *  మిషన్ ఇంద్రధనస్సులో దేశంలో తెలంగాణ అగ్రస్థానం.. మిషన్ బగీరథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం *  స్వచ్చ భారత్ ను పెద్ద ఎత్తున చేపడతాం *  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 11.7 శాతం అభివృద్ధి సాధిస్తాం *  ఈ ఏడాది నుండి బీసీలకు కల్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తాం *  సేవారంగం 14.9 వృద్ధి సాధిస్తాం *  ములుగులో ఉద్యానవన యూనివర్శిటీ నెలకొల్పుతాం *  గోదావరి జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాం..

పవన్ కళ్యాణ్, రామోజీరావు సీక్రెట్ మీటింగ్.. ఎందుకో..?

  సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియా మొగల్ రామోజీరావుతో సీక్రెట్ గా మీటింగ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ భేటీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న గబ్బర్ సింగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న నేపథ్యంలో పవన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి.. తమ పార్టీకి సంబంధించిన విషయాల గురించి.. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న భూదందాపై చర్చించినట్టు తెలుస్తోంది.   కాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.