టెస్టులకు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత తరుపున టెస్ట్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు తనపై చూపిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతానని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 4301 పరుగులు చేశాడు రోహిత్.  ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో భాగంగా ముంబై జట్టు ప్లేయర్ గా ఉన్న కొనసాగుతున్నా రోహిత్ శర్మ తన ఆటలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఊహాగానాలు, చర్చలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. అయితే వాటిని బీసీసీఐ తోసిపుచ్చింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్  తీసుకుంటున్నట్లు హిట్ మ్యాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేశారు.   

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం పొడిగింపు

  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. నూతన సీబీఐ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ పదవీకాలం పొడిగింపునకు అపాయింట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రవీణ్ సూద్ పదవీకాలం వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ గా తన పోలీస్ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.  సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో మే 2023లో సీబీఐ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.  

దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

  దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భద్రతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించమని ఆయన అన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమాయకులను చంపిన వారినే మేము హతం చేశామని అన్నారు. పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులపై భారత సైన్యం తమ సత్తా ఏంటో చూపించింది. పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం చేయలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుత్రువులకు తగిన విధంగా బుద్ది చెప్పామని వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు.  ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధుర్‌లో హనుమంతుడి లంకా దహనాన్నే ఆదర్మంగా తీసుకున్నమని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందన్నారు. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.  

హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్.. నాలుగు ప్రదేశాలలో నిర్వహణ

  దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్‌డీఓ మౌలాలిలోని NFC లో సైరన్లు మ్రోగాయి. రెండు నిమిషాల పాటు సైరన్లు మోగిన తరువాత  మాక్ డ్రిల్ లో  అవగాహన కల్పించారు.  15 నిమిషాల పాటు మాక్ డ్రిల్ కొనసాగుతుందని తెలిపారు. NCC, NSS క్యాడెట్స్, NDRF, SDRF రెస్క్యూ రిహార్సల్ చేపట్టబోతున్నట్టు  సీవీ ఆనంద్ తెలిపారు.  సైరన్ మోగిన తరువాత ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. సైరన్ మోగిన తరువాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటికి రావద్దని సూచించారు. ఒకవేళ బయట ఉన్నవాళ్లు సురక్షిత నిర్మాణాల్లోకి వెళ్లాలని కోరారు. ప్రమాదాలు జరిగితే ఎలా అరికట్టాలని.. అక్కడ వైద్య సిబ్బందిని అంబులెన్స్ లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్రమాద ఎమర్జెన్సీ సమయంలో  ఏ విధంగా వ్యవహరించాలని సూచించారు మాక్ డ్రిల్ లోభవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. మోఢీనా మజాకా!

భారత సైనిక దళాలకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు ప్రపంచానికి శక్తివంతమైన సందేశం పంపారు.  ఉగ్రమూడకలు వారికి అర్ధమయ్యే భాషలో గట్టి హెచ్చరిక చేశారు. దేశంలో మతసామరస్యం పరిఢ విల్లుతోందని ప్రపంచానికి చాటారు. ఎలాగంటే..  భారత సాయుధ దళాలు బుధవారం ( మే 7)  తెల్లవారుజామున పాకిస్తాన్,   పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మల్టిపుల్ టార్గెట్ లపై  మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ దాడులే ఆపరేషన్ సిందూర్. మొత్తం 9 టార్గెట్లను ఈ ఆపరేషన్ ద్వారా ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.  భారత దళాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే ఈ దాడులు నిర్వహించాయి.  అలాగే పౌరలు, పాకిస్థాన్ ఆర్మీ పోస్టుల జోలికి పోకుండా కేవలం   ఉగ్రవాద శిక్షణా శిబిరాలు, స్థావరాలను మాత్రమే లక్ష్యంగా ఎంచుకుని భారత సైన్యం ఈ దాడులను నిర్వహించింది.  పహల్గాం ఉగ్రదాడికి దీటైన బదులుగా ఈ దాడులు నిలిచాయనడంలో సందేహం లేదు. దాడుల అనంతరం వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు భారత ఆర్మీకి చెందిన ఇద్దరు మహిళా అధికారులు పాల్గొన్నారు.   ఆ ఇద్దరు మహిళా అధికారులే ఆపరేషన్ సిందూర్ పై మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. వారిద్దరూ కల్నల్ సోఫియా ఖురేషి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.  ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు అత్యంత శక్తిమంతమైన, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది.   పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తను ఆమె కళ్ల ముందే చంపేసి.. మోడీకి చెప్పుకో మంటూ ఆమెను గేలి చేశారు.  అటువంటి ముష్కరులకు భారత్ ఇద్దరు మహిళల చేత వారికి అర్ధమయ్యే భాషలో బుద్ధి చెప్పింది. అలాగే భారత్ లో మైనారిటీలకు, మహిళలకు సముచిత గౌరవం ఉందన్న సందేశాన్ని కూడా  చాటింది. ఎందుకంటే ఈ మహిళా అధికారులు ఇరువురూ కూడా  మైనారిటీ మతాలకు చెందిన వారే. ఇరువురిలో ఒకరు ముస్లిం, మరొకరు సిక్కు . ఈ విధంగా కూడా దేశంలో  మైనారిటీలకు పూర్తి భద్రత ఉందనీ, వారికి ప్రాధా న్యత ఇస్తున్నామనీ భారత్ చాటింది.  అంతే కాకుండా భారత్ లో మత సామరస్యం పరిఢవిల్లుతోందన్న సందేశాన్ని ఇచ్చింది. ఇక మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్  సోఫియా ఖురేషి  పాకిస్తాన్ దుస్సాహసాలకు ప్రతిస్పందించడానికి, ఎదుర్కొని పీచమణచడానికీ  భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.   నేడు పాకిస్తాన్ ఉగ్రవాదం పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో సైన్యం ప్రదర్శించిన తెగువను, చాకచక్యాన్ని దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకు లందరూ కూడా భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.  పెహల్గాం   ఉగ్ర దాడిలో ఆత్మబంధువులను కోల్పోయిన కుటుంబాలు  భారత్ సైన్యానికి జిందాబాద్  కొడుతూ, తమ వారి మరణాలకు న్యాయం జరిగిందంటున్నాయి.  

సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కి భారీ ఎదురుదెబ్బ

  ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన తీర్పును అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓఎంసీ కేసులో నిన్న  సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జానర్దన్‌రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఏ1 బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ3 అప్పటి గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, ఏ7 మెహఫుజ్‌ అలీ ఖాన్‌ (గాలి వ్యక్తిగత సహాయకుడు)లను దోషులుగా నిర్ధారించిన కోర్టు.. వీరికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. అలాగే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది న్యాయస్థానం. సబితతో పాటు ఈకేసులో విశ్రాంత  ఐఏఎస్‌ కృపానందంను కూడా నిర్దోషిగా తేల్చింది. అయితే ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌తో 2022లో ఈ కేసు నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే. నిందితులకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌కు రూ.2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరుగా ఏడేళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు

ఆపరేషన్‌ సింధూర్‌ నేపధ్యంలో.. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం

  పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్‌.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌ మంగళవారం అర్ధరాత్రి పాక్‌ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన వివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించారు. ఆర్మీ ఆపరేషన్ గురించి వివరాలను వెల్లడించినట్లు సమాచారం. ఆపరేషన్ చేపట్టిన తీరు, మన సైన్యం ధైర్య సాహసాలను రాష్ట్రపతికి ప్రధాని వివరించి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలను వివరించనున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో భాగంగా, పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ధ్వంసం చేసిన వాటిలో ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయని తెలిసింది. భారతదేశంపై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం, వాటిని నిర్దేశించడం వంటి కార్యకలాపాలు ఈ కేంద్రాల నుంచే జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే సైన్యం ఈ దాడులు చేపట్టింది. రెండు వారాల క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక నేపాల్ దేశస్థుడితో సహా 26 మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగిన అనతికాలంలోనే భారత సాయుధ దళాలు ఈ ప్రతిదాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.    

పాక్‌ను ఏమార్చి దెబ్బకొట్టిన భారత్.. మోడీ మార్క్ వ్యూహం!

పహల్గాం ఉగ్ర దాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’  పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కు దిగింది. . ఈ చర్యపై యావత్‌ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్‌ అమలుచేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్‌ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలుచేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్‌ షాక్‌కు గురికాక తప్పలేదు. బాలాకోట్‌ దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే.. వీటిని దాయాది పాకిస్థాన్‌ పసిగట్టడంలో విఫలమైంది. మోడీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనకబడింది. పాక్‌ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్‌ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోడీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన దిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌పంఖ్తుంఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మోడీ దిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి. బాలాకోట్‌ దాడికి ముందు ప్రధాని మోడీ ప్రవర్తన ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే.. దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోడీ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఏబీపీ నెట్‌వర్క్‌ నిర్వహించిన ‘ఇండియా ఎట్‌ 2047 సదస్సులో మోడీ మాట్లాడారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు.  మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్‌ డ్రిల్స్‌ను అంతకు ముందు ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాలతో.. దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోడీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్లాయి. అయితే.. ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని పసిగట్టడంలో.. అప్పుడు బాలాకోట్‌ దాడుల సమయంలోనూ.. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ పాకిస్థాన్‌ పూర్తిగా విఫలమైంది. దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి.

పిఠాపురంలో క్షుద్ర పూజలు కలకలం..ఐదు నెలల చిన్నారి బలి

  కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు కోసం ఐదు నెలల చిన్నారిని  బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో తల్లి ప్రక్కలో నిద్రిస్తున్న చిన్నారిని తీసుకెళ్లి అర్ధరాత్రి ప్రక్క ఇంటి బావిలో పడేయగా చిన్నారి మృతి చెందింది. అయితే అర్ధరాత్రి తల్లి మేల్కొనగా పాప పక్కన కనిపించలేదు. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడం గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చుట్టుపక్కల వెతుకున్న వారికి ప్రక్కింటి బావిలో చిన్నారి మృతదేహాం లభించింది. ఈ సంఘటనపై స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్రపూజల కోసమే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కుటుంబ సభ్యుల సమాధానాల్లో పొంతన లేకపోవడం, వారి ప్రవర్తన మీద విచిత్ర అనుమానాలు కలుగజేస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. చిన్నారి మృతికి కుటుంబ సభ్యులే కారణమై ఉండొచ్చన్న  కొందరు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రితోపాటు తాయయ్యలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికితీయేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో భయం, వణుకు పుట్టించిన ఈ ఘటనపై అధికారులు మరింత స్పష్టత కోసం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

భారత్‌ అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలు

పాక్‌లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో భారత్‌ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ కోసం భారత్‌ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు.. స్కాల్ప్‌ క్షిపణులు.. హ్యామర్‌ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బహిర్గతం చేయవు. కానీ..  అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు. తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.     ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని.. లక్ష్యాలను గుర్తించి.. వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి.  భారత్‌ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతోపాటు కదలుతున్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించేందుకు వాడతారు.   స్కాల్ప్‌ క్షిపణులను స్ట్రామ్‌షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్‌ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్‌ మిసైల్‌. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రుదేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్‌ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫేల్స్‌ నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.  బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్‌ బాంబులను వినియోగిస్తారు. ఇది స్మార్ట్‌బాంబ్‌ కోవలోకి వస్తుంది. వీటిని లక్ష్యానికి 50-70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీనిని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.  భారత్‌ దాడి చేసిన లక్ష్యాల్లో జేషేకు అత్యంత కీలకమైన బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్‌కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటారు. ఇక లష్కరే హెడ్‌క్వార్టర్‌ అయిన మర్కాజ్‌ తోయిబా కూడా ఉంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. పాక్‌లో ధ్వసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలపై దాడులను ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకొన్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్‌.. మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకొంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో సహకారం అందించింది.

రేవంత్ కామెంట్స్ దేనికి సంకేతం?

ఆ వ్యాఖ్యలకు ఓ లెక్కుంది.. అదేంటంటే?  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా అప్పులు పుట్టని అధ్వాన స్థితిలో రాష్ట్రం వుందా ? తెలంగాణ పేరు చెపితే, ఛీ’ పో అనే   స్థితిలో  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వుందా ?  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగానే అంత అధ్వాన స్థితిలో ఉందనే అనుకున్నా.. ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలియదా? అయినా, ముఖ్యమంత్రి అంతగా కడుపు చించుకోవడం ఎందుకు? ఇది దేనికి సంకేతం? అప్పులకోసం వెళితే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయని, ,ఢిల్లీలో అప్పాయింట్ కూడా దొరకడం లేదని,   దొంగల్లా  చూస్తున్నారని, ఇంకా రకరకాలుగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా, స్వయంగా ముఖ్యమంత్రి కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేఉకోవాలి ? ఆర్థిక పరిస్థితి అసలేం బాగా లేదని, అంత వివరంగా, విపులంగా వివరించ వలసిన అవసరం ఏమొచ్చింది?   ఎందుకు వివరించారు? చివరకు, ఇక సమరమే అంటూ ప్రభుత్వం పై సమ్మె శంఖం పూరించిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను ఏమి చేసుకుంటారో చేసుకోండి .. నన్ను కోసుకుని, వండుకు తిన్నా సరే..  ఇప్పడున్న పరిస్థితిలో ఉద్యోగుల డిమాండ్లు ఏవీ ఆమోదించడం సాధ్యం కాదని అంతలా ఎందుకు విరుచుకు పడినట్లు? ఎందుకు? పరోక్షగా ఉద్యోగ సంఘాలను సమ్మెకు ఉసిగొలిపే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలా చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? వ్యూహం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలు రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి.   అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఇదే తొలిసారి కాదు.  గతంలోనూ ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇవే లెక్కలు వినిపిస్తూ వచ్చారు. రాష్ట్ర నెలసరి ఆదాయం రూ.18,500 కోట్లు, వ్యయం రూ. 22,500 కోట్లు, నెలసరి లోటు రూ. 4,000 కోట్లు అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పలు సందర్భాలలో అనేక వేదికల నుంచి  రేవంత్ రెడ్డి వివరిస్తూనే ఉన్నారు.అలాగే.. ఆ పరిస్థితికి   గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులే కారణమని కూడా అంతే స్పష్టంగా చెపుతూనే ఉన్నారు.  అయితే..  గతానికి  ప్రస్తుత సందర్భానికి కొంత తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే,ముఖ్యమంత్రి పర్యవసానాలను ఆలోచించకుండా అనాలోచితంగా, అవగాహన లోపంతో గుప్పిట విప్పారా, దాపరికం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని  ప్రజల ముందు ఉంచారా అన్న చర్చ కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో జరుగుతోంది. అదే సమయంలో  ముఖ్యమంత్రి అనాలోచితంగానో, అనుభవ రాహిత్యంతోనో గుప్పిట విప్పలేదని, లోగుట్టు బయట పెట్టలేదని అంటున్నారు.  లెక్కలు, మరీ ముఖ్యంగా రాజకీయ లెక్కలు చూసుకునే గుప్పిట విప్పారని అంటున్నారు.  అయితే.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల వెనక ఏముంది అనే విషయంలో రాజకీయ పండితులు విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా హామీల అమలు కోసం  సమ్మెకు సిద్దమవుతున్న ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేసే ఎత్తుగడలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  నగ్న స్వరూపాన్ని ఉద్యోగుల ముందు ఉంచారనీ,  అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోరికలు తీర్చాలంటే, పెట్రోల్ మొదలు ఉప్పు పప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు చేయడం, లేదంటే వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మివంటి ఇతర సంక్షేమ పధకాలకు కోత విధించడం తప్ప మరో మార్గంలేదనీ,  ఏ పథకాలను ఎత్తేయాలో మీరే చెప్పండని బంతిని చాకచక్యగా ఉద్యోగుల కోర్టులోకి నెట్టేశారని అంటున్నారు. అలాగే..  ముఖ్యమంత్రి ప్లే చేసిన  ఈ ఎత్తుగడ ఆర్టీసీ ఉద్యోగ కార్మిక  సంఘాలు సమ్మెను వాయిదా వేసుకోవడంతో కొంతవరకు సక్సెస్ అయిందని కూడా అంటున్నారు.   అదొకటి అయితే..  అంతకంటే ముఖ్యంగా తమ కుర్చీని కాపాడుకునే ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి మార్పు గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతన్న నేపధ్యంలో  కాంగ్రెస్ అధిష్టానం ముందరి కాళ్ళకు ఆర్ధిక బంధం వేసే ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆర్ధిక ఆస్త్రాన్ని సంధించి ఉండవచ్చని అంటున్నారు.  ఓ వంక కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేని  రోల్ మోడల్ గా  చూపించి దేశ వ్యాప్తంగా రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తున్న సమయంలో.. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక  అధ్వాన పరిస్థితిని  దేశం ముందు ఉంచడం ద్వారా బీజేపీకి ఒక బలమైన అస్త్రాన్ని అందిచారని అంటున్నారు. నిజానికి  కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా, బీజేపే నాయకులు ఇప్పటికే, తమ అస్త్రాలను ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా పైకి సంధించారు.  అలాగే.. రాష్ట్రంలో రజతోత్సవ వేడిలో జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అస్త్రాన్ని అందించారని అంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి లెక్కలు తప్పని చెప్పడమే కాకుండా..  కాంగ్రెస్ పార్టీని అనేక కోణాల్లో కార్నర్ చేశారు. ముఖ్యంగా, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చి వేస్తోందంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు. అలాగే..  ఆరు గ్యారెంటీలు,420 హామీలకు శాశ్వత సమాధి కట్టే ఉద్దేశంతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉచితాలే సర్వ అనర్ధాలకు మూలం  ఆని తీర్మానించారు. ఉచితాలపై పునరాలోచన చేయవలసిన సమయం ఆసన్నమైందని  అన్నారు. అంటే , ఉచితాలకు కాలం చెల్లిందని మంత్రి తుమ్మల చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క చూసుకునే చిట్టా విప్పారని అంటున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనాలోచితం అనుకున్నా  దానికో లెక్కుందని అంటున్నారు.     నిజం ఏమిటి అన్నది నిలకడ మీద గానీ  తెలియదనీ అయితే  ముఖ్యమంత్రి కామెంట్స్   కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే గట్టిగా దెబ్బ కొట్టాయనీ, అందుకే ఢిల్లీలో ఉన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ముఖ్యమంత్రి కామెంట్స్ పై సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని అంటున్నారు.  సో ... ముఖ్యమంత్రి మనసులో ఏముంది? రేపటి పరిణామాలు ఏమిటి, అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ..అయినా, ఆయన వ్యాఖ్యలకు ఓ లెక్కయితే వుందని విశ్లేషకులు అంటున్నారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసును క్వాష్ చేసిన హైకోర్టు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఏసీబీ కేసును హైకోర్టు క్వాష్ చేసింది. ఏబీవెంటటేశ్వరరావు ఏపీ  ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన  హైకోర్టు గతంలోనే తీర్పు రిజర్వ్ చేసింది. ఆ సపంద్భంగా.. తుది తీర్పు వెలువడే వరకూ   విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై కూడా స్టే విధించింది.  ఇంతకీ ఏబీ వెంకటేశ్వరరావుపై అప్పట్లో నమోదైన కేసేంటంటే.. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో ఏబీవీ అవకతవకలకు పాల్పడ్డారని. అప్పటి జగన్ సర్కార్   ఆ ఆరోపణలతోనే ఏబీవీని  విధుల నుంచి సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీవీ అలుపెరుగని న్యాయపోరాటం చేశారు.   తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో అప్పటి జగన్ సర్కార్ కు ఏబీవీ సస్పెన్షన్ ను ఎత్తివేయడం వినా మరో గ్యతంతరం లేకపోయింది. అయితే ఆయనను సర్వీసులోకి తీసుకున్నట్లే తీసుకుని ఆ మరుసటి రోజే మళ్లీ జగన్ సర్కార్ ఆయనను అవే అభి యోగాలతో సస్పెండ్ చేసింది.  దీంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేయడంతో నాటి ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన మరలా ప్రింటింగ్ అండ్ స్పేషనరీ విభాగం అడిషనల్ డీజీగా బాధ్యతలు చేపట్టి అదే రోజు పదవీ విరమణ చేశారు. అదలా ఉంటే తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఏబీవీ 2022లో హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి.. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. ఇప్పుడు ఆయనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురు నిందితులు.. ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మంగళవారం (మే 6) మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొన్న సిట్ తాజాగా ఆ జాబితాలో జగన్ హయంలో పీఎంవో  కార్యదర్శిగా పని చేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను చేర్చింది.  జగన్ హయాంలో దాదాపు 2600 కోట్ల రూపాయల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. ఈ కేసులో తాజాగా ముగ్గురిని చేర్చడంతో నిందితుల సంఖ్య 33 కు పెరిగింది. ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలు, జగన్ హయాంలో కీలక స్థానాలలో పని చేసిన ఉన్నత స్థాయి అధికారులు నిందితులుగా ఉండటం గమనార్హం.  ఈ కేసులో  ఇప్పటికే సిట్ రాజ్ కేసిరెడ్డి, ఆయన సహాయకుడు సహా నలుగురిని అరెస్టు చేసింది. వారి రిమాండ్ రిపోర్టుల్లో కూడా  సిట్  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి పేర్కొంది. ఈ ముగ్గురు సాక్ష్యులను, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కోర్టులను ఆశ్రయించినప్పటికీ అక్కడ వారికి చుక్కెదురైంది. సుప్రీం కోర్టు అయితే చట్ట ప్రకారం వారికి అరెస్టు చేయవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురినీ దర్యాప్తు అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

విశాఖ మన్యంలో మావోల కదలికలు!

ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో మావోల కదలికలు పెరిగాయి. దీంతో మన్యం ప్రాంతంలో అలజడి పెరిగింది, యుద్ధ వాతావరణం నెలకొంది. కొయ్యూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టు సీనియర్ నాయకులు తృటిలో తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.   ఆపరేషన్ కగార్ పేరిట గత కొన్ని నెలలుగా భద్రత దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి విదితమే. చత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత కీలకమైన ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టలు హతమయ్యారు.  ఈ  నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్ర ఒడిశా బార్డర్ వైపు వచ్చారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే   గూడెం కొత్త వీధి క, య్యూరు మండలాల్లో గత రెండు వారాలుగా మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయంటున్నారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందడంతో  ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఏవోబీ అడవులను మావోయిస్టుల కోసం  జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  సోమవారం( మే 5)  ఒక్కరోజే  రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. కొయ్యూరు మండలం మందపల్లి పుట్టకోట కంటారాం పరిసరాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి కానీ భద్రతా బలగాల వైపు నుంచి కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.  ఈ ప్రాంతం పై మావోయిస్టు నాయకులకు పూర్తిస్థాయిలో పట్టు ఉండటం, గిరిజన గ్రామాల వారి పట్ల సానుభూతి ఉండటంతో  వారి జాడ తెలుసుకోవడం భద్రతా దళాలకు ఒకింత కష్టంగా మారిందంటున్నారు.  కాగా సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ల నుంచి సీనియర్ మావోయిస్టు నేతలు తప్పించుకున్నట్లు పోలీసులు  

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో నక్సలిజం అణచివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం (మే 7) ఉదయం కర్రెగుట్టలపై భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కనీసం 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే మంగళవారం కూడా ఇదే కర్రెగుట్టలలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మహిళా మావోయిస్టు హతమైంది.  కర్రెగుట్టలలో గత కొంత కాలంగా జరుగుతున్న కూంబింగ్ లో  భాగంగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఇప్పటి వరకూ నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు.  భద్రతా బలగాలు వందల సంఖ్యలో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశాయి.  బీఎస్‌ఎఫ్, ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు సంయుక్తంగా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు వారాలుగా  కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు సాగుతున్నాయి.  

80 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సింధూర్ కు ప్రపంచ దేశాల మద్దతు!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం (మే 6) అర్ధరాత్రి తరువాత భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపుదాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరం చేసింది. కచ్చితమైన లక్ష్యాలపై అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ డాడుల్లో  కనీసం 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.   ఐక్యరాజ్యసమితి నిషేధించిన   జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థలకు చెందిన మొత్తం   తొమ్మిది స్థావరాలు  లక్ష్యంగా జరిగిన ఈ దాడులు విజయవంతమయ్యాయి.   అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు  జైషే మహమ్మద్‌కు బలమైన పట్టున్న బహవల్పూర్, లష్కరే తోయిబా కీలక కేంద్రమైన మురిడ్కేలోని మసీద్ వా మర్కజ్ తైబాపై జరిగిన దాడుల్లో  పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.  ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు50 నుంచి 60 మంది  ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా.  లక్షిత దాడులకు గురైన   ప్రాంతాల్లో మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ధృవీకరించాల్సి ఉంది. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి భద్రతా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్ లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.  ఈ దాడులను పాకిస్థాన్ ధృవీకరించడమే కాకుండా తీవ్రంగా ఖండించింది. దీనిని యుద్ధ చర్యగా అభివర్ణించింది.  ఈ దాడుల్లో ఒక చిన్నారితో సహా ఎనిమిది మంది పౌరులు మరణించారని ఆరోపించింది. ఈ దాడుల అనంతరం, పాకిస్థాన్ దళాలు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భారీగా కాల్పులకు, మోర్టార్ల దాడులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు కూడా దీటుగా స్పందించాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.  కాగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను అగ్రరాజ్యం అమెరికా సమర్ధించింది.  ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ భారత్ కు మద్దతు ఇవ్వాలని సూచించింది. కాగా ఆపరేషన్ సింధూర్ పై భారత్ ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చింది. నిషేధిత ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ సక్సెస్ ఫుల్ గా దాడులు చేసినట్లు తెలిపింది.  భారత్ ఆపరేషన్ సింధూర్ ను ఇజ్రాయెల్ సమర్ధించింది. భారత్ ఆత్మరక్షణ కోసమే దాడి చేసిందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి పేర్కొన్నారు.  అయామకులపై దాడులు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని ఉగ్రవాదులు గ్రహించాలని పేర్కొన్నారు.  

దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై ఉక్కుపాదం!

ఇక‌పై దేశ వ్య‌తిరేక పోస్టులు పెట్టేవారికిగానీ, జ‌నాన్ని రెచ్చ‌గొట్టేలాంటి వీడియోలు చేసే వారికి గానీ చుక్కలు చూపించేందుకు రెడీ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ యాక్ట్-2000 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తమౌతోంది.   ప్ర‌స్తుతం ప‌హల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశమంతటా ఒక విధమైన ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. ఉగ్రదాడికి పాల్పడిన వారు, వారికి సహకరించిన వారు, సహకారం అందించిన వారూ ఎవరినీ వదలేది లేదన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర పేరుతో సర్జికల్ స్ట్రైక్ జరిపంది. ఈ స‌మ‌యంలో ఎవ‌రంటే వారు.. ఎలా ప‌డితే అలా.. ఏది ప‌డితే అది.. వాగేస్తూ, సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతూ లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరిస్తే కుదరదు. అటువంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదనీ, అలాంటి వారి ఖేల్ ఖతం చేసి దుకాణ్ బంద్ పెట్టేస్తామని హెచ్చిరిస్తోంది కేంద్రం.  ఇలా దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారు ఎవరైనా ఎరుకలో ఉంటే వారి వివరాలను, వారి సోషల్ మీడియా అక్కౌంట్ వివరాలను comit@sansad.nic.inకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది.  గ‌త ఎన్నికల్లో తాము అనుకున్న ఫ‌లితం సాధించ‌లేక పోవ‌డానికి ఇలాంటి ఇన్ ఫ్లూయెన్ష‌ర్లే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని న‌మ్ముతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఇలాంటి వారికి ఎ  గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌నుకున్న కేంద్రానికి పహల్గాం ఉగ్రదాడి, తదననంతర పరిణామాలు కలిసివచ్చాయి. ఎలాగైనా సరే దేశ వ్యతిరేక ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కొరడా ఝుళిపించడానికి రెడీ అయిపోయింది.   ఇంత‌కీ ఈ ఇన్ ఫ్లూయెన్ష‌ర్లు ఎవ‌రు? వారు ఎలాంటి వీడియోలు చేయ‌కూడ‌దు అన్న విషయానికి వస్తే..  ఫ‌స్ట్ దేశ భ‌ద్ర‌త విష‌యంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం, అలాగే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులలో కామెంట్లు   హింస‌ను ప్రేరేపించేలా ఉండటం వంటివి చేసే వారి సోషల్ మీడియా అక్కౌంట్లను సీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.   ఈ దాడుల వెన‌క ఫ‌లానా పార్టీ ఉంద‌ని.. సెక్యూరిటీ విష‌యంలో మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు ఫెయిల్ అయ్యాయ‌నీ.. సంబంధిత శాఖా మంత్రి రాజీనామా చేయాల‌ని.. ఇలా ప‌లు ప‌లు విధాలుగా కేంద్ర ప్ర‌భుత్వ ప‌ని తీరును ఇర‌కాటంలోకి నెట్ట‌డం.. ఈ దిశ‌గా దేశ ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌లోకి నెట్ట‌డం.. దేశ సార్వ‌భౌమాధికారానికే భంగం క‌లిగేలా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం ఇక నుంచి కుదరని పని. ఎవరైనా సరే అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. కుట్రవెనుక ఫలానా వారు ఉన్నారంటూ ఆధారరహిత సమాచారాన్ని వ్యాప్తి చేసినా మీరుగానీ ఇలాంటి రెచ్చ‌గొట్టుడు వ్యాఖ్య‌లు చేసే ప‌నైతే.. ఈ కుట్ర వెన‌క ఫ‌లానా వారున్నారంటూ లేని పోని సమాచారాన్ని ఎలాంటి ఆధారాల్లేకుండా ఊహాగానాల‌ను వ్యాప్తి చేసిన వారి ప‌ని ఇక అయిపోయినట్ల... ఇలాంటి వారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్ప‌టికే ఒక ముసాయిదా త‌యారు చేసిన కేంద్రం.. దాన్ని ఎలాగైనా స‌రే క‌ట్ట‌డి చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సో ఇన్ ఫ్లూయెన్ష‌ర్స్.. బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్ప‌టి వ‌ర‌కూ మీరు ఆడింది ఆట పాడింది పాట‌గా సాగిందేమో.. ఇక‌పై  దేశ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను నిల‌దీస్తూ మీరేదైనా పోస్టు పెట్టినా.. మీ కంటెంట్ ని ఎవ‌రైనా షేర్ కొట్టినా.. ఇటు కంటెంట్ క్రియేట‌ర్లైన మీతో పాటు షేర్ కొట్టే వారిని సైతం వద‌ల‌క వెంటాడి వేటాడి మ‌రీ మిమ్మ‌ల్ని అరెస్టు చేస్తారు. ఇక‌పై మీ సోష‌ల్ మీడియా ఖాతాలు జ‌ప్త‌యిపోతాయి ఖ‌బ‌డ్దార్ అంటోంది కేంద్రం.  మ‌ళ్లీ మేము కొత్తగా మా అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని మీరు లైట్ తీస్కోవ‌చ్చేమో.. ఒక్క‌సారి బ్లాక్ మార్క్ ప‌డితే త‌ర్వాతి కాలంలో మీకు సోష‌ల్ మీడియా అకౌంట్ తెరుచుకోక పోవ‌చ్చు. ఎందుకంటే ఇది దేశ భ‌ద్ర‌తకు సంబంధించే విష‌యం. కాబ‌ట్టి ఉపేక్షించే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెబుతున్నారు అధికారులు జాగ్ర‌త్త‌! మీ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా మిమ్మ‌ల్ని ఐడెంటిఫై చేసి.. ఇక‌పై మీరెలాంటి సోష‌ల్ మీడియా యాక్టివిటీస్ న‌డ‌ప‌కుండా క‌ట్ట‌డి చేస్తారు బీ కేర్ ఫుల్ అన్న‌ది కేంద్రం నుంచి వ‌స్తోన్న   వార్నింగ్.

ఆప‌రేష‌న్ సింధూర్.. ఈ పేరు ఎందుకు పెట్టారంటే?

ఏప్రిల్ 22న ప‌హెల్గాం బైస‌ర‌న్ వ్యాలీలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో.. ముష్క‌రులు ఒక ప‌థ‌కం  ప‌న్నారు. మ‌న ఆడ‌ప‌డుచుల‌ను, వారి పిల్ల‌ల్ని వేరు చేసి.. వారి భ‌ర్త‌ల‌ను మ‌తాన్ని అడిగి మ‌రీ కాల్చి చంపారు. ఈ క్ర‌మంలో హిమాన్షులాంటి  ఎంద‌రో ముత్త‌యిదువ‌లు.. త‌మ నుదుటి సింధూరాన్ని కోల్పోయారు. మ‌రీ ముఖ్యంగా హిమాన్షు అయితే పెళ్లి జ‌రిగింది  ఏప్రిల్ 19న, ఆమె త‌న భ‌ర్త‌ను కోల్పోయింది ఏప్రిల్ 22న‌. ప‌ట్టుమ‌ని వారం కూడా నిలువ‌ని సింధూరం ఆమెది. ఆమె త‌న భ‌ర్త శ‌వ‌పేటిక ముందు కూర్చుని ప‌దే ప‌దే విల‌పించడం చూసి యావ‌త్ భార‌త దేశం చ‌లించి పోయింది . మ‌రో బాధిత మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపిన ఆ ఉగ్ర‌వాదితో.. త‌న‌నూ త‌న కుమారుడ్ని కూడా చంపేయ‌మ‌ని ప్రార్ధించ‌గా.. మీ మోడీకి వెళ్లి  చెప్పుకోమ‌న్నాడా ముష్క‌ర‌ుడు.  ఇలాంటి 26 మంది భార‌తీయ మ‌హిళ‌ల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్ర‌దాడి ఇది. దాడి జ‌ర‌గ‌డాకి మూడు రోజుల‌ ముందు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అసీం హిందూ భార‌త్ తో మ‌నం పౌర యుద్ధం చేయాల్సి ఉంద‌న‌డం.. వారెలా మ‌న భార‌తీయ‌త మీద దెబ్బ తీయాల‌నుకున్నారో స్ప‌ష్టం చేస్తుంది. అలా మ‌న భార‌తీయ మ‌హిళ‌లు కోల్పోయిన ఐద‌వ త‌నానికి చిహ్నంగా ఆప‌రేష‌న్ సింధూర్ అనే పేరు పెట్టింది  భార‌త సైన్యం. అంతే కాదు సింధూరం అంటే ఎర్ర‌టి వ‌ర్ణం అని అర్ధం. ఒక ర‌కంగా చెబితే ఎరుపు రంగు ర‌క్తానికి చిహ్నం.. ఇక్క‌డ మ‌న వారిని చంపి ప‌చ్చ‌టి ప‌చ్చిక బైళ్ల‌ను ర‌క్త సిక్తం చేసినందుకు గుర్తుగానూ.. సింధూర్ అన్న  పేరు పెట్టి ఉంటుంది ఇండియ‌న్ ఆర్మీ. మ‌న వాళ్లు ఒక్కో ఆప‌రేష‌న్ కి ఒక్కో పేరు పెడుతుంటారు. గ‌తంలో ఆప‌రేష‌న్ బ్లూస్టార్ వంటి ఎన్నో నామ‌క‌ర‌ణాలు చేసి ఉన్నారు. అందులో భాగంగా ఈ ఆప‌రేష‌న్ కి మాత్రం ఆప‌రేష‌న్ సింధూర్ అని పెట్టి.. మొత్తం 9 ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు నిర్వ‌హించారు. వీటి  ద్వారా భారీ ఎత్తున ఉగ్ర‌మూక‌ల‌ను, వారి వారి  మౌలిక స‌దుపాయాల‌ను ధ్వంసం చేసింది  భార‌త  సైన్యం. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఇక్క‌డ మ‌న వాళ్లు పాటించిన మ‌రో నియ‌మం.. కేవ‌లం ఉగ్ర స్థావ‌రాల‌పై త‌ప్ప‌.. పాక్ ప్ర‌జ‌ల‌పై గానీ, వారి సైనిక స్థావ‌రాల‌పై గానీ ఇండియ‌న్ ఆర్మీ దాడులు చేయలేదు.  ఆప‌రేష‌న్ సింధూర్ లో ఇది  గుర్తించాల్సిన అంశ‌ం.  అందుకే మ‌న ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భార‌త్ మాతాకీ జై అని ట్వీట్ చేశారు. మ‌న ఆర్మీ న్యాయం జ‌రిగింద‌ని అన‌డంలోనూ అర్ధ‌మిదే. మ‌న ఆడ‌ప‌డుచుల సింధూరం అంటే నుదుట బొట్టు కోల్పోయేలా చేసిన వారి పీచ‌మ‌ణిచాం అన్న అర్ధం ధ్వ‌నించేలా వీరీ  ప్ర‌క‌ట‌న‌లు వీరు చేసిన‌ట్టుగా భావిస్తున్నది స‌మ‌స్త భార‌త ప్ర‌జానీకం.