వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

    దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ నివాళి అర్పించారు.  శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. మురళీ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను డిప్యూటీ సీఎం ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.  అనంతరం కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. కూటమి సర్కార్ తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. మురళీనాయక్‌ కుటుంబానికి ఐదెకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీరజవాను కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని డిప్యూటీ సీఎం కళ్యాణ్ పవన్‌ హామీ ఇచ్చారు.  ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మురళీనాయక్‌ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. మరోవైపు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కల్లితండాకు తీసుకు వస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు. ఆదివారం మురళీ నాయక్‌ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించ నున్నారు.  హోంమంత్రి అనిత, మంత్రులు సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు

పాకిస్థాన్ మేజర్ జనరల్ ష‌రీఫ్ ఎవ‌రో తెలుసా?

భార‌త్.. పాక్, కెనెడాలో  ఉగ్ర‌వాదం ప్రేరేపిస్తోందని అభాండాలు వేశారు పాక్ డీజీ ఐస్ పీఆర్ అహ్మ‌ద్ ష‌రీఫ్. ఈయ‌న మ‌రెవ‌రో కాదు స‌న్నాఫ్ సుల్తాన్ బ‌షీరుద్దీన్. ఈ బషీరుద్దీన్   మ‌రెవ‌రో కాదు.. పాకిస్థాన్ కి రెండో అణుపితామ‌హుడు. ఒసామా బిన్ లాడెన్ కి,  అల్ ఖైదాకి అణ్వాయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేద్దామ‌నుకున్న‌వ్యక్తి. తాలిబ‌న్ చీఫ్ ముల్లా ఓమ‌ర్ ని కూడా క‌లిసిన వాడు.  అత్యంత భ‌యంక‌ర‌మైన ఇస్లామిక్ తీవ్ర‌వాది ఈ సుల్తాన్ బ‌షీరుద్దీన్. ఇత‌డి ఆలోచ‌న ప్ర‌కారం అల్ ఖైదాకు అణ్వాయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసి..  త‌ద్వారా నాగ‌రిక ప్ర‌పంచాన్ని నామ‌రూపాల్లేకుండా చేయ‌డం. అప్ప‌టికే 911 దాడుల‌తో విమాన భ‌ద్ర‌తా నియ‌మాల‌నే మార్చేసిన ఘ‌ట‌న‌కు కార‌కుడైన లాడెన్ తో ఇత‌డి భేటీని చూసి భ‌య‌ప‌డ్డ యూఎస్ వెంట‌నే యూఎన్ దృష్టికి ఇత‌డ్ని తీస్కెళ్లింది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చింది. త‌ర్వాత ఇత‌డి మీద ఐఎస్ఐ చేత ద‌ర్యాప్తు చేయించింది. ఈ ద‌ర్యాప్తులో తాను లాడెన్ని క‌లిసిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పాడు. దీంతో ఒకింత ముందుగానే ఇత‌డు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.  పాక్ యురేనియం వ్య‌వ‌హారాలు ఇంకా ఎన్నో నిషిద్ధ ఆయుధాల త‌యారీకి పాక్ అణు పితామ‌హుడు ఖాదిర్ ఖాన్ త‌ర్వాత ఆ స్థాయి నాయ‌క‌త్వం వ‌హించాడు సుల్తాన్ బ‌షీరుద్దీన్. అయితే త‌న‌కున్న ఇస్లామిక్ తీవ్ర వాదం దృష్ట్యా లాడెన్ వంటి వారికి ద‌గ్గ‌రై.. త‌న ప‌ద‌వి కోల్పోయాడు. ఆపై ఉగ్ర‌వాద అనుకూల సంస్థ యూటీఎన్ ని స్తాపించాడు. త‌ద్వారా.. ఉగ్ర‌వాద వ్యాప్తికి మ‌రింత‌ కృషి చేశాడు. ఇత‌డి సంస్థ కార్యాల‌యంలో శోధ‌నలు చేస్తే అణ్వాయుధ అక్ర‌మ‌ త‌యారీకి సంబంధించి ఎన్నో ప‌త్రాలు ల‌భించాయి.  ఎలాగైనా స‌రే ఉగ్ర‌వాదానికి అణు శ‌క్తిని జోడించాల‌న్న‌ది అహ్మ‌ద్ ష‌రీఫ్ తండ్రి ఎత్తుగ‌డ‌. అలాంటి తండ్రికి పుట్టిన త‌న‌యుడు అహ్మ‌ద్ ష‌రీఫ్ ఈ రోజు పాక్ లో సైనిక ప‌రంగా అత్యంత ఉన్న‌త‌మైన స్థానంలో ఉన్నాడు. పాక్ టాప్ మోస్ట్ మిల‌ట‌రీ అఫిషియ‌ల్స్ లో ఇత‌డు కూడా ఒక‌డు. ఒక ఉగ్ర‌వాది కొడుకు భార‌త్ కి ఉగ్ర‌వాద కోణం అంట‌గ‌డుతుంటే విడ్డూర‌మ‌నిపిస్తుంది. అంతే కాదు ఆ దేశ‌పు సైనిక ఉగ్ర సంబంధం తండ్రీ కొడుకుల బంధ‌మ‌ని కూడా చెప్పాల్సి ఉంటుంది.

పాక్ తో యుద్ధం ముగిసిన‌ట్టేనా?

పాక్ తోక జాడింపులు ఇక్క‌డితో ఆగిన‌ట్టేనా? భార‌త్ ఇంకా సాధించ‌వ‌ల‌సిన ల‌క్ష్యాలేంటి? భార‌త్ పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు ఏమంటున్నారు? మే 10 సాయంత్రం 5 గంట‌ల నుంచి భార‌త్ పాక్ మ‌ధ్య యుద్ధ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం అమ‌ల్లోకి వ‌చ్చింది. అయినా నాలుగు గంట‌ల అనంత‌రం అంటే రాత్రి 9 గంట‌ల‌కు పాక్ మ‌న స‌రిహ‌ద్దుల వెంబ‌డి మ‌ళ్లీ డ్రోన్ల మోత మోగించ‌డంతో క‌శ్మీర్ సీఎం ఓమ‌ర్ అబ్ధుల్లా కాల్పుల మోత ఆగ‌లేద‌ని.. విర‌మ‌ణ ఒప్పందం అమ‌లు జ‌ర‌గ‌లేద‌న్న ట్వీట్ తో మ‌రోమారు ఉలిక్కి ప‌డింది ప్ర‌పంచం. మ‌రీ ముఖ్యంగా ఇక యుద్ధం ముగిసిందిలే అని ఊపిరి పీల్చుకున్న ఇరు దేశాల ప్ర‌జ‌లు.. అదిరిప‌డ్డారు. ఇక మీడియా అయితే తిరిగి   యుద్ధ తొడుగులు తొడిగి వార్త‌ల‌ను వండి వార్చ‌డం మొద‌లైంది. అంత‌కు ముందు అమెరికా స‌గ‌ర్వ ప్ర‌క‌ట‌న చేసింది. ఇదంతా త‌న‌ వ‌ల్లేన‌ని ట్రంప్ కాల‌ర్ ఎగ‌రేశారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం ఏంటంటే, ట్రంప్ ప‌లికే శాంతి వ‌చ‌నాల‌కు ఒక అర్ధం లేదు. కార‌ణం ఈ దేశం ఉక్రెయిన్- ర‌ష్యా తో యుద్ధంలో ఉండ‌గానే.. అతి పెద్ద ఖ‌నిజ వ‌న‌రుల ఒప్పందం  చేసుకుంది. అంటే ప్రాణాపాయ ప‌రిస్థితుల‌ను సైతం క్యాష్ చేసుకోవ‌డం ఈ అగ్ర ఉగ్ర ప్రేరేపిత దేశానికి గ‌న్నుతో పెట్టిన విద్య అన్న‌మాట‌.  ఇక భార‌త్ పాక్ వ్య‌వ‌హారాల విష‌యంలోనూ ఇదే చేయాల‌ని చూసింది. కానీ మోడీ ఈ విష‌యం ముందే గ్ర‌హించి ట్రంప్ కి చెక్ పెట్టారు. అస‌లు ట్రంప్ మెయిన్ టార్గెట్ ఏంటంటే.. భార‌త్ ని యుద్ధానికి ఎగ‌దోసి.. ఆయుధాలు కొనిపించాలని. కానీ భార‌త్ ఈ విష‌యం ముందే గ్ర‌హించి.. త‌మ ద‌గ్గ‌రున్న ర‌ష్య‌న్ మేడ్ వార్ వెప‌న్స్  మాత్ర‌మే వాడడానికి ఆస‌క్తి చూపింది. ర‌ష్యా నుంచి 35 వేల కోట్ల రూపాయ‌ల డీల్ ద్వారా దిగుమ‌తి చేసుకున్న ఎస్ 400 తో దాదాపు అనుకున్నంత ప‌ని చేసింది.  2018లో ఈ డీల్ కుదురుతున్న‌ప్పుడే యూఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అప్పుడు కూడా ఇదే ట్రంప్ అధికారంలో ఉన్నాడు. మీ మీద ఆంక్ష‌లు గ్యారంటీ అన్నాడు. క‌ట్ చేస్తే భార‌త్ ర‌ష్యాతో త‌న‌కున్న  పాత అనుబంధాన్ని ఈ మాయా స్నేహం కోసం కోల్పోలేదు. ఇప్పుడు కూడా పాక్ కి మిలియ‌న్ డాల‌ర్ల కొద్దీ డబ్బులిచ్చి.. అక్క‌డి ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాలు అందేలా చేసి.. వారి ద్వారా దాడులు చేయించి.. ఒకయుద్ధ వాతావ‌ర‌ణం  క‌ల్పించి.. త‌ద్వారా.. భార‌త్ చేత ఆయుధ అత్య‌యిక ప‌రిస్థితి క‌ల్పించాల‌న్న‌ది ఒక ఎత్తుగ‌డ‌. కానీ భార‌త్ అయితే ర‌ష్యా.. లేకుంటే ఇజ్రాయెల్ మీద ఆధార ప‌డుతుంది కానీ, యూఎస్ మీద కాదు. ఈ విష‌యం గ్ర‌హించిన అమెరికా త‌న‌కున్న పెద్ద‌న్న పాత్ర‌ను వెంట‌నే గుర్తు చేసుకుని.. భార‌త్- పాక్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి కృషి చేశారు. ఇలాగైనా ప‌రువు ద‌క్కించుకుందామ‌ని. ఈ మొత్తం ఎపిసోడ్ లో చైనా సీనేంట‌ని చూస్తే మీ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగితే మేము మ‌ద్ధ‌తునిస్తామ‌ని చెప్పి... త‌న దృష్టినంతా బ‌లూచిస్తాన్ మీదే పెట్టింది. బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.. గానీ బ‌లూచిస్తాన్ ని ఆక్ర‌మించుకుంటే... పాక్ నుంచి విడిపోతే.. త‌మ ఫోక‌స్ మొత్తం షిఫ్ట్  చేద్దామ‌ని చూసింది. అయితే ఆ ప‌ని పూర్తి కాక పోవ‌డంతో తీవ్ర నిరాశ చెందింది డ్రాగ‌న్ దేశం. కార‌ణం త‌మ‌కు కావ‌ల్సింది పాక్ కాదు. పాక్ ఆధీనంలో ఉన్న బ‌లూచిస్తాన్. అక్క‌డున్న అపార‌మైన ఖ‌నిజ వ‌న‌రుల మీదే ఈ దేశ‌పు ధ్యాసంతా. అందుకే తామక్క‌డ‌ గ్వాద‌ర్ పోర్టు నిర్మించింది. అందుకే అక్క‌డ హైబ్రిడ్ రోడ్లు వేసింది. అందుకే అక్క‌డ ఇత‌ర ఎన్నో మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసింది. ఈ విష‌యం గుర్తించిన బ‌లూచీలు.. చైనీయుల‌ను తిప్పి కొడుతుంటే.. కూడా లెక్క చేయ‌క ఎయిర్ పోర్టుల‌ను నిర్మించింది. బ‌లూచీలు కూడా ప‌ట్టు వ‌ద‌ల్లేదు. త‌మ‌ను అడ్డు పెట్టుకుని పాక్ చైనాతో చేస్తున్న దందాను గుర్తించి. ఆ దేశ‌ ట్రైన్ ని హైజాక్ చేశారు. ఆపై క్వెట్టాలోని పాక్ స్థావ‌రాల‌పై దాడి చేశారు. ఇంకా ఎన్నో ర‌కాలుగా పాక్ ని దెబ్బ తీసే య‌త్నం చేశారు. బ‌లూచిస్తాన్ లో మూడొంతుల్లో రెండు వంతుల భూభాగం త‌మ ప‌రం చేసుకున్నారు. ఆ కార్య‌క్ర‌మం కూడా పూర్త‌యి ఉంటే అప్పుడు తెలిసేది  చైనా పూర్తి నైజం. ఇవ‌న్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ కి కూడా లోప‌ల ఏమంత స‌జావుగా లేదు. పార్ల‌మెంటులో ఎంపీల నుంచి బ‌య‌ట సాధార‌ణ  ప్ర‌జ‌ల వ‌ర‌కూ అంద‌రూ క‌ల‌సి ఆ దేశ ప్ర‌భుత్వానికి, సైన్యానికీ త‌మ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఇమ్రాన్ పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం రోడ్ల‌పైకి వ‌చ్చి.. ఇదొక ద‌మ్ములేని ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు. త‌మ అధినేత ఇమ్రాన్ని విడిపించి పాక్ ని ర‌క్షించాల‌ని డిమాండ్ చేశారు.  దానికి తోడు భార‌త్ క‌రాచీ పోర్టు వంటి వాటిని ధ్వంసం చేసి.. దిగుమ‌తుల‌ను సైతం లేకుండా చేయ‌డం.. ఆల్రెడీ దేశంలో ఉన్న క‌రువు కాట‌కాలు. వాటికి తోడు ప్ర‌తిదీ ఎదురు తిర‌గ‌డం. ఉన్న ఆ కొద్ది మంది ఉగ్ర‌వాదులు కూడా చ‌నిపోవ‌డంతో ఏం చేయాలో దిక్కు తోచ‌ని  స్థితిలో ఉంది. ఈ కండీష‌న్లో.. ట్రంప్ ఇలా ఫోన్ చేయ‌డం ఆల‌స్యం అలా.. కాల్పుల విర‌మ‌ణ‌కు ఓకే చెప్పేసింది పాక్. ఆ దేశ మిల‌ట‌రీ డీజీ భార‌త్ మిల‌ట‌రీ డీజీతో డీల్ ఓకే చెప్పేశాడు. అయితే బుద్ధిలేని పాక్ ద‌ళాలు ఎప్ప‌టిలాగానే త‌మ పాత బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తూ.. మ‌న సరిహ‌ద్దుల వెంబ‌డి తిరిగి కాల్పులు జ‌రిపాయి. ఇవ‌న్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ ఈ కాల్పుల విర‌మ‌ణ‌కు త‌లొంచ‌డానికి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు. ఇంత యుద్ధం జ‌రుగుతుంటే త‌మను ఆర్ధికంగా  ఆదుకోమంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టిన దారుణ‌మైన ప‌రిస్థితి.  దీంతో ఈ పాపిష్టి దేశం కాల్పుల‌ను విర‌మించుకోవ‌డంలో ఒక అర్ధ‌ముంది కానీ.. భార‌త్ ఇంకా ప‌ట్టు ప‌ట్టి ఉండాల్సిందంటారు నిపుణులు.  ఈ సారికి పీవోకే స్వాధీనం చేసుకుని ఉండాల్సింది. అక్క‌డి ఉగ్ర మూక‌ల స్తావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో స‌రి పెట్ట‌కుండా ఉండాల్సిందంటారు యుద్ధ నిపుణులు. అంతే కాదు బ‌లూచిస్తాన్ సైతం పాక్ నుంచి వేరు ప‌డి ఉండే వ‌ర‌కూ యుద్ధం  కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఆ దేశ ఉగ్ర ముఖాలైన హ‌ఫీజ్, మ‌సూద్ ల‌ను అప్ప‌గించే వ‌ర‌కూ కాల్పులను విర‌మించ‌మ‌ని తెగేసి చెప్పి ఉండాల్సింది. ఈ మూడు విష‌యాలైనా.. పాక్ తో మ‌నం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా డిమాండ్ చేసి ఉండాల్సిందంటారు పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు.

హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్-2025 పోటీలు

  హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ దేశల నుంచి సుమారు 120 దేశాల అందగత్తెలు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. మిస్ ఇండియా నందినీ గుప్తా భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆప్రారంభ వేడుకలు నిర్వహించారు. 250 మంది పేరిణి నత్య ప్రదర్శన చేశారు. ఈ నెల 31 వరకు పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది.  జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆహూతులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణలతో ర్యాంప్‌పై హోయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారులు ప్రదర్శన విదేశీ అతిథులను ఆకట్టుకున్నది. కరేబియన్ లాటిన్ అమెరికాతో పోటీదారులు రాక మొదలయింది.  ముందుగా అర్జెంటీనా కంటెస్టెంట్ ర్యాంప్ వాక్ చేశారు. రెండవ రౌండ్‌లో ఆఫ్రికా ఖండం, మూడవ రౌండ్‌లో యూరప్ ఖండం ప్రతినిధులు వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. చివరి రౌండ్‌లో ఆసియా ప్రతినిధులు ర్యాంపుపైకి వచ్చారు. మొత్తం 22 దేశాలు నుంచి ప్రాతినిథ్యం వహించాయి. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్ క్రిష్టినా పిజ్కోవా హాజరయ్యారు. 

వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్నికి జన నీరాజనం

  వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తుండగా ప్రజలు రోడ్డు పొడవునా జననీరాజన పలికారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా తండోపతండాలుగా జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతికకాయం వెంట ముందుకు జనం సాగుతున్నారు. ప్రజలు తరలివస్తున్నారు. రేపు వీర జవాను మురళీ నాయక్‌కు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. జమ్మూలో పాక్ జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి, స్వగ్రామానికి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు తరిలించారు.  ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి సవిత వెళ్లారు అక్కడి నుంచి ఆయన స్వగ్రామానికి పంపించారు. మురళి పార్థివ దేహాన్ని ముందుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఇండిగో విమానంలో బెంగళూరు చేరుకున్న ఆయన పార్థివ దేహానికి సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. చిక్కబళ్ళాపురం మీదుగా ఆయన స్వగ్రామం గోరంటలకు పార్థివ దేహాన్ని తరలించారు. రేపు అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేశ్  పాల్గొన్నారు  

కాల్పుల విరమణ అధికారంగా ప్రకటించిన పాకిస్థాన్

  పాకిస్థాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదేశ డిప్యూటీ సీఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పాక్ ఎప్పుడు శాంతి భద్రతలు కోసమే పాటుపడుతుందన్నారు. ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య జరగబోయే చర్చల్లో సరిహద్దుల్లో శాశ్వత శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ సాధ్యమైందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది, ఏ షరతుల మేరకు కుదిరింది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని, ప్రాంతీయ శాంతికి దోహదపడుతుందని భావిస్తున్నారు.  

పాక్‌తో యుద్దంపై భారత్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన

  భారత్-పాక్  మధ్య యుద్దంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల  విరమణకు ఒప్పందం జరిగిందని భారత్‌, పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, షెహబాజ్‌ షరీఫ్‌, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసిమ్‌ మునీర్‌, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్‌ డోభాల్‌, అసిమ్‌ మాలిక్‌లతో మాట్లాడినట్లు చెప్పారు. తాను, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ  ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్రీ తెలిపారు. ఈనెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు చెప్పారు. 

సరిహద్దు ప్రాంతాల్లోని ఏపీ వాసుల కోసం కంట్రోల్ రూమ్

  భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లు విడుదల చేశారు. పాక్‌తో సరిహద్దు గల రాష్ట్రాలలో నివాసం ఉంటున్న, అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజల సౌకర్యార్థం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 24 గంటలూ పనిచేసే ఈ కంట్రోల్‌ రూమ్‌ నుంచి కావాల్సిన సమాచారం, సహాయం కోసం 011-23387089, 9871999430, 9871999053 నంబర్లతో పాటు, అదనపు సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్‌ ఎంవీఎస్‌ రామారావు (9871990081), లైజన్‌ ఆఫీసర్‌ సురేశ్‌బాబు (9818395787)ను సంప్రదించవచ్చని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ సూచించారు.

కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకారం : ట్రంప్

  భారత్  పాక్ ఉద్రిక్తతల వేళ అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలతో చర్చలు జరిపినట్లు.. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని  ట్రంప్ పోస్ట్ చేశారు. రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే భారత్, పాక్ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో వెనక్కి తగ్గాలని ఇరుదేశాల్నీ వరుసగా విజ్ఞప్తులు చేస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులో ఇరు దేశాల మధ్య నిన్న రాత్రి నుంచీ తాము జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  

భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్ర చర్యనైనా యుద్ధంగా పరిగణిస్తాం..భారత్ సంచలన నిర్ణయం

  భారత్ ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకుంది.  భవిష్యత్‌లో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని ఇండియాపై  యుద్దంగానే పరిణిస్తామని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకు తగినట్లుగానే తీవ్ర ప్రతి చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీవ్రవాద చర్యలను సహించేది లేదు. పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలి” అని ఆయన తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని  ఈ నిర్ణయం తీసుకున్నారు.  సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెంచాలని, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడవద్దని ఆయన సైన్యానికి సూచించారు. ఈ నిర్ణయం ప్రకారం, ఉగ్రవాద దాడులను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా, దేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. దీంతో సైన్యానికి మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు భారత ఆర్మీకి పూర్తి అధికారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌కు స్పష్టమైన హెచ్చరికగా పరిగణించవచ్చు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ స్పష్టం చేసింది. ఇకపై ఉగ్రవాద చర్యలను భారత్ ఏమాత్రం సహించబోదని, దీటుగా బదులివ్వడానికి సిద్ధంగా ఉందని ఈ నిర్ణయం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది.  

మరిన్ని చిక్కుల్లో విడదల రజిని..మాజీ ఎంపీ గోరంట్లకు పట్టిన గతేనా?

  వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజినికి మరో చిక్కుల్లో పడింది. ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్న సమయంలో  విధినిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. వారి విధులకు ఆటంకం కలిగించింది. తన అనుచరుడు అరెస్ట్‌కు కారణం  చెప్పాలని సీఐ సుబ్బారాయుడును నెట్టేశారు. విడదల రజిని ప్రవర్తన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ మాజీ ఎంపీ  గోరంట్ల మాధవ్‌ పోలీసుల అదుపులో ఉన్న  చేబ్రోలు కిరణ్ దాడిచేసి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించారు.  చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా మాధవ్‌ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్‌చల్‌ సృష్టించారు. దీంతో గోరంట్ల పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వరుసగా వైసీపీ నాయకులు పోలీసుల పై వీధి రౌడీలా విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయంలో పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.

ఖజానా ఖాళీ.. సాయం అందే దారి లేదు.. పాక్ కింకర్తవ్యం!

భారత్‌ను కెలికి  పాక్ అన్నిరకాలుగా చావుదెబ్బ తింటోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్‌ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్‌కు ఏ మాత్రం లేదు. పాకిస్తాన్ ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోలు వరకూ అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధార పడే ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవిప్పుడు పూర్తిగా నిండుకున్నాయి. ప్రస్తుతమున్న నిల్వలు మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపో తాయంటున్నారు. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్‌ను ఆర్థికంగా ఆదుకోవటానికి  ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే  సీఈఐసీ ప్రకారం... డిసెంబరు 2024 నాటికి పాకిస్థాన్‌ అప్పు 131 బిలియన్‌ డాలర్లు.  తాజాగా పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది. పాక్‌ జీడీపీలో అప్పుల వాటా ఇప్పటికే 75 శాతానికి చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచదేశాల్లో ముద్ర పడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్‌కు అసాధ్యంగా మారనున్నాయి. మరో వైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు సతమతమవుతున్న దాయాది దేశం.. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదు. పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్థాన్‌కు అంతులేని నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళుతున్న భారత్‌తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అటు ఆర్థిక ఇబ్బందులకు తోడు... రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్‌లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్థాన్‌లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు, సైన్యానికీ సవాలు విసురుతోంది.  తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సిన అనివార్య పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తోంది. ఇటీవల జరిగిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌తో ఆ ప్రాంతంపై పాకిస్థాన్ పట్టు కోల్పోయినట్లయింది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వంతోనూ పాక్‌కు పొసగటం లేదు. ఇంకోవైపు సింధ్‌లో ఇండస్‌ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా పాకిస్థాన్ అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.   దేశ భద్రతలో కీలకమైన రక్షణవ్యవస్థ కూడా బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యంపైనా పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోలు వంటి వాటినీ అవసరాలకు అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్‌ వంటి శక్తిమంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్‌ రక్షణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్‌ రూ.2.50 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని... పాకిస్థాన్‌ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని ముంబయికి చెందిన థింక్‌ ట్యాంక్‌ స్ట్రాటజిక్‌ ఫోర్‌సైట్‌ గ్రూప్‌ విశ్లేషించింది. ఇదే జరిగితే పాక్‌పై కోలుకోలేని భారం పడుతుంది. ఆ దేశంలో ప్రజాజీవనం స్తంభిం చిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

అపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఆపరేషన్ కగార్ స్టాప్.. సరిహద్దులకు భద్రతా దళాలు

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌ నిలిచిపోయింది. మావోయిస్టుల ఏరివేతకు తాత్కాలికంగా విరామం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ కగార్ లో ఉన్న భద్రతా దళాలను వెనక్కు పిలిపించి, వారిని సరిహద్దుల్లో మోహరించనుంది. ఇందు కోసం ఆపరేషన్ కగార్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్థాన్ తో యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.   అపరేషన్ కగార్ లో నిమగ్నమై ఉన్న దాదాపు ఐదు వేల మంది  బలగాలను కేంద్రం వెనక్కు రప్పిస్తోంది. ఇందులో భాగంగానే  కర్రెగుట్టల్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఈ బలగాలు రేపటికల్లా సరిహద్దులకు చేరుకోనున్నాయి.  కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్‌ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ఆగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పాక్ తో యుద్ధం కారణంగా ఈ కూంబింగ్ కు బ్రేక్ పడినట్లైంది. 

విడదల రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్

  మాజీ మంత్రి విడదల రజిని  ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు. రజిని కారులోనే మానుకొండ తిరుగుతున్నాడని పోలీసులకి పక్కా సమాచారంతో మాజీమంత్రి కారులోనే నాదెండ్ల మండలం జంగాలపల్లికి  వచ్చిన శ్రీకాంత్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. ఆయను అరెస్ట్ చేయొద్దని పోలీసులని రజిని అడ్డుకున్నారు.  అతికష్టం మీద వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు  అదుపులోకి  తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా పోలీసులతో  విడదల రజినీ వాగ్వాదానికి దిగింది. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా విడుదల రజిని డిమాండ్ చేశారు. ఇప్పటికే  రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయంలో పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.

జాతీయ రక్షణ నిథికి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విరాళం.. ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ రక్ణణ నిథికి విరాళంగా తన నెల వేతనాన్ని అందజేశారు. ఆన్ లైన్ పేమెంట్ విధానం ద్వారా ఆయన ఈ విరాళాన్ని జాతీయ రక్షణ నిథికి సమర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు తెలియజేసిన ఆయన  ఉగ్రవాద నిర్మూళన కోసం సాయుధ దళాలు అత్యంత సాహసోపేతంగా చేస్తున్న పోరాటం పట్ల ప్రతి భారతీయుడూ గర్వంతో పొంగిపోతున్నారని అన్నారు.  దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు  సంఘీభావంగా తన వంతుగా  నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా  ఇచ్చినట్లు తెలిపారు.  ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్ల చెప్పారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే జాతీయ రక్షణ నిథికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రక్షణ నిథికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రజా ప్రతినిథులకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక రోజు వేతనాన్ని జాతీయ రక్షణ నిథికి విరాళంగా ప్రకటించారు.  

డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ డాక్టర్ అరెస్టు

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌గా సేవలందిస్తున్న ఓ మహిళ.. డ్రగ్స్‌కు బానిసగా మారడం సంచలనం సృష్టిస్తోంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన డాక్టరే వాటిని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక్క సంవత్సరంలోనే సుమారు  70 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను ఆ వైద్యురాలు సేవించినట్లు   పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. కచ్చితమైన సమాచారంతో ఆ వైద్యురాలిపై నిఘాపెట్టి   డ్రగ్స్​ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.   షేక్ పేటలోని ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) ఒమేగా హాస్పటల్ లో సీఈవోగా పని చేస్తున్నారు.  ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్‌ను వాట్సాప్​లో సంప్రదించి ఐదు లక్షల రూపాయల విలువైన  కొకైన్​కు ఆర్డర్ చేశారు. ఆన్​లైన్​లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రాంప్యార్ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు.  కొకైన్ ను రాంప్యార్ నుంచి డాక్టర్ నమ్రత తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   డాక్టర్ నమ్రతతో పాటు రాంప్యార్​ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  పోలీసులు వీరి నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం  చేసుకున్నారు.  

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం : సీవీ ఆనంద్

  హైదరాబాద్ జంట నగరాల్లో బాణా సంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీ పోలీస్ యాక్ట్ 1348 సెక్షన్ 67(C) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమే నగరంలో బాణసంచా కాల్చడాన్ని నిషేదిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేసారు. సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున నగరంలో బాణసంచా కాల్చడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బాణసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలను పోలీఉండటంతో ఇది ప్రజల్లో అనవసరమైన గందరగోళానికి దారితీయవచ్చు. శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిషేదాజ్ఞలు జారీ చేశారు.  ఈ నిషేదం తక్షణమే అమలులోకి వస్తుందని సీపీ వెల్లడించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉందని, నగర ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పోలీస్ శాఖ కోరింది.  బాణసంచా శబ్దాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవచ్చని, పేలుళ్ల శబ్దాలను తలపించి గందరగోళానికి దారితీయవచ్చని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే ఈ నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

పాక్ టూరిజం టు టెర్ర‌రిజం!.. ఏ వార్ ఫేర్

అవి మ‌న‌కు స్వాతంత్రం వచ్చిన రోజులు. భార‌త దేశంలోనే అతి పెద్ద సంస్థానం జ‌మ్మూ- కాశ్మీరం.  క‌శ్య‌ప మ‌హా ముని పేరిట వెల‌సిన  కాశ్మీర్ కి రాజు రాజా హరిసింగ్. వెళ్తూ వెళ్తూ బ్రిటీష్ ఇండియా చేసిన ప‌ని.. ఎవ‌రి  స్వేచ్ఛ‌ మేరకు  వారు భార‌త్- పాక్.. లలో ఏ దేశంలోనైనా అయినా క‌ల‌వ‌చ్చ‌న్న మెలిక పెట్టడం.   అప్ప‌టికి స్వాతంత్రం పొందిన దేశాలు భార‌త్, పాక్, శ్రీలంక‌, బ‌ర్మా. వీటిలో భార‌త్- పాక్ మ‌ధ్య ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు చాలానే. దానికి తోడు ఇక్క‌డున్న మ‌రో మెలిక ఏంటంటే.. హిందుస్థాన్ లో హిందువులు, పాకిస్థాన్ లో పాకిస్థానీయులు అంటే ముస్లిములు ఉండాల‌న్న‌ది ఒక ష‌ర‌తు కాగా.. మ‌న భార‌త దేశంలో ఇంకా మూడొంతుల్లో ఒక వంతు ముస్లిములు అలాగే ఉండి  పోయారు.  అయినా స‌రే ఇరు వ‌ర్గాల మ‌ధ్య హిందూ- ముస్లిం- సిక్ వంటి జాతుల మ‌ధ్య బీభ‌త్స‌మైన సంఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ్గా ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో 2 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతే స్థాయిలో నిరాశ్ర‌యులు అయ్యారు కూడా. ఈ లోగా రాజాహ‌రిసింగ్ నేతృత్వంలోని కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల‌పైకి గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపులు పాక్ సైన్యం సాయంతో  దాడులు చేశారు. వీరి బాధ ఏంటంటే రాజా హ‌రిసింగ్ ఎక్క‌డ త‌న సంస్థానాన్ని భార‌త్ లో క‌లిపేస్తాడో అన్న‌దే. పాక్ అత్యుత్సాహం, గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపుల దుందుడుకు త‌నం పెచ్చరిల్లి రాజా హ‌రిసింగ్ కి చిరాకు తెప్పించాయి. ఒక  ర‌కంగా  ఆందోళ‌న క‌లిగించాయి. ఇలాంటి వారి నుంచి ఈ  చ‌ల్ల‌టి క‌శ్మీరం ర‌క్ష‌ణ పొందాలంటే వీరికంటే అమేయ ప‌రాక్ర‌మ‌మైన భార‌త్ ప‌రిధిలో ఈ దేశం ఉండాల‌ని భావించారు రాజా హ‌రిసింగ్. అందులో భాగంగా భార‌త్ వైపే క‌శ్మీర్ సంస్థానం క‌లిసేలా ఒప్పంద పాత్రాల‌పై సంత‌కాలు చేశారు. దీంతో ఐక్య రాజ్య స‌మితి  సైతం తీర్మానం చేసింది. ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు చిక్కు. పాకిస్థాన్ కి ఒళ్లు మండింది. క‌శ్మీర్ లో అత్య‌ధికంగా ఉన్న ముస్లిమ్ జ‌నాభాను  అనుస‌రించి చూస్తే.. ఈ ప్రాంతం క‌ల‌వాల్సింది పాక్ లో. అంతే కాకుండా వారి మ‌రో కాంక్ష ఏంటంటే.. క‌శ్మీరం భూత‌ల స్వ‌ర్గం. స్విట్జ‌ర్లాండ్ ఆఫ్ సౌత్ ఏషియా. ఈ ప్రాంతం కానీ త‌మ గుప్పెట్లో ఉంటే.. మ‌నం ఎంచ‌క్కా ప‌ర్యాట‌కం ద్వారా విశేష‌మైన ఆదాయాన్ని స‌ముపార్జించుకోవ‌చ్చు. అన్న‌ది వీరి ఆశ. ఆశ‌యం. అయితే ఈ ఆశ‌ల‌పై రాజా హ‌రిసింగ్ నీళ్లు కుమ్మ‌రించ‌డంతో వీరికి ఆ నాటి  నుంచి ఈ నాటి వ‌ర‌కూ.. ఆ కోరిక అలాగే ఉండి పోయింది. కార‌ణ‌మేంటంటే వారికి ద‌క్కిన భూభాగమంతా ఎడారిని త‌ల‌పిస్తుంది. పేరుక‌ది ప‌విత్ర దేశ‌మే కానీ అంతా అప‌విత్రం కావ‌డానికి గ‌ల కార‌ణం.. ఆ దేశానికంటూ  సొంత కాళ్ల మీద నిల‌బ‌డే స‌త్తా లేక పోవ‌డం.  సింధూజ‌లాలు ఎక్క‌డో పుట్టి ఎక్క‌డి  నుంచో త‌మ దేశంలో ప్ర‌వ‌హిస్తేగానీ.. ఇక్క‌డ వారి  పంట‌ల‌కు దిక్కూ మొక్కూ లేదు. అంతే కాదు ఈ జ‌లాల ద్వారా పండే పంట‌లతో ఆ దేశ జీడీపీలో 24 శాతం ఆదాయం మాత్ర‌మే ల‌భిస్తుంది. అదే కాశ్మీర్ కూడా త‌మ సొంత‌మైతే.. వారు ప‌ర్యాట‌కంగానూ విశేష‌మైన ఆదాయ వ‌న‌రుల‌ను పొంద‌వ‌చ్చు. ఇక్క‌డే పాక్ ఆశ‌ల‌కు భారీగా చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది రాజా హ‌రిసింగ్. అలాగ‌ని ఇది కేవ‌లం ఆయ‌న నిర్ణ‌య‌మ‌ని అనుకోవ‌డానికి వీల్లేదు. ఆ నాడు పాక్ ఇస్లామిక్ ట్రైబ‌ల్ గ్రూపుల‌కు త‌న ద‌ళాల సాయం అందించ‌కుండా ఉండాల్సింది. కానీ, రాజాహ‌రిసింగ్ హిందువు కావ‌డం. దానికి తోడు ఈ ప్రాంతం పేరు కూడా ఒక హిందూ ముని క‌శ్య‌పుడి పేరిట ఉండ‌టంతో.. ఆయ‌న కూడా హిందువులు అత్యధికంగా  ఉన్న హిందుస్తాన్ లో క‌శ్మీర్ క‌ల‌వ‌డ‌మే స‌మంజ‌సం అనుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని క‌శ్మీరీ పండిట్ల‌ను బ‌ల‌వంతానా ఏరి పారేసింది క‌శ్మ‌రీ ముస్లిములు. అదే త‌ర్వాతి రోజుల్లో క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమా వ‌చ్చేలా చేసింది.  పాకిస్థానీయులు ఇక్క‌డే చావు దెబ్బ తిన్నారు. వారు త‌మ అత్యుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న  చేయ‌కుండా.. దౌత్య ప‌రంగా ఎంతో సంయ‌మ‌నంతో ప్ర‌వ‌ర్తించి ఉండాల్సింది. ఆచీ- తూచి వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింది. రాజు మీద ఒత్తిడి తేకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే.. వారి బిహేవియ‌ర్ న‌చ్చి ఉంటే రాజా హ‌రి సింగ్ మ‌న‌సు మారి ఉండేదేమో కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డే పాకిస్థాన్ కొంప  మునిగింది. అలాగ‌ని భార‌త్ కి వ‌రంగా ఏమీ మిగ‌ల్లేదు కాశ్మీర్. అదింకా ర‌క్త స్రావం చేస్తూనే ఉంది. ప్రాణ న‌ష్టానికి కార‌ణం అవుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు యుద్ధాలు జ‌ర‌గ్గా. వీటిలో 1971లో జ‌రిగిన యుద్ధ‌మొక్క‌టే కాశ్మీర్ కేంద్రంగా జ‌ర‌గ‌లేదు. అది తూర్పు పాకిస్థాన్ అలియాస్ బంగ్లాదేశ్ కోసం జ‌రిగింది. అది కూడా ఈస్ట్ వెస్ట్ పాకిస్తానీయులైన ముజ‌బుర్ రెహ‌మాన్, యాహ్యాఖాన్, భుట్టోల మ‌ధ్య సాగిన రాజ‌కీయ పోరు కార‌ణంగా జ‌ర‌గ్గా.. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ ఆవిర్భావ‌మైంది. ఈ ప్రాంతంలోని కోటి మంది బెంగాలీలు భార‌త్ వైపున‌కు బ‌లవంతంగా రావాల్సి వ‌చ్చింది. ఈ యుద్ధ స‌మ‌యంలోనే పాక్ జ‌లంత‌ర్గామి ఘాజీ విశాఖ తీరంలో అనుమానాస్ప‌దంగా మునిగింది. మిగిలిన అన్ని యుద్ధాలు, ఘ‌ర్ష‌ణ‌ల‌కు క‌శ్మీరే కీల‌కం. అస‌లు 1947- 48లో జ‌రిగిన తొలి ఇండో- పాక్ యుద్ధాన్ని తొలి కాశ్మీర్ వార్ గా పిలుస్తారు. త‌ర్వాత కార్గిల్ వ‌ర‌కూ జ‌రిగిన  యుద్ధాల్లో ఇరు ప‌క్షాల‌కు అపార‌మైన ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఒక్క కార్గిల్ వార్ లోనే పాక్ 4 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.   ఈ ఆకాంక్ష‌తోనే పాక్ లో ఉగ్ర‌వాదం పురుడు పోసుకుంది. టూరిజం బ‌దులు టెర్ర‌రిజం పుట్టుకొచ్చింది. సౌత్ ఏషియా టెర్ర‌ర్ పోర్ట‌ల్ నివేదిక ప్రకారం ఒక్క పాకిస్తాన్ లోనే 80 నిషిద్ధ టెర్ర‌రిస్టు గ్రూపులుంటే వీటిలో 45 వ‌ర‌కూ ఉగ్ర ముఠాలు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. వీటిలోనూ ల‌ష్క‌రే తోయిబా, జైషే మొహ‌మ్మ‌ద్  భార‌త్ అంటేనే ర‌గిలిపోతాయి. ఈ ఉగ్ర సంస్థ‌లు భార‌త్ పై చేసే యుద్ధ‌మంటే.. దేశం కోసం చేసే యుద్ధంగా భావిస్తాయి. అందుకే వీరి  స‌హాయ స‌హ‌కారాల‌ను ఒక ప‌విత్ర కార్యంగా భావిస్తుంది పాక్ ఆర్మీ. ర‌వూఫ్ లాంటి టెర్ర‌రిస్టులు మ‌ర‌ణిస్తే.. వారికి త‌మ జాతీయ జెండాల‌ను క‌ప్పి మ‌రీ అంత్య‌క్రియ‌ల‌ను లాంఛ‌నంగా నిర్వ‌హిస్తుంది. ఎప్పుడైతే  కాశ్మీర్ టూరిజం కోల్పోయిందో పాకిస్థాన్.. ఈ అంశం ద్వారా ల‌బ్ధి పొందాల్సింది కాస్తా.. టెర్ర‌రిజం అనే దానికి కేంద్ర స్థానంగా నిలిచింది. దీంతో ప్ర‌పంచానికి టెర్ర‌రిస్టుల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీగా మారింది. ర‌ష్యాతో యురోపియ‌న్ దేశాల పోరులో యురోపియ‌న్ల వైపు నిలిచి.. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా త‌న టెర్ర‌రిస్టు కార్య‌క‌లాపాల‌ను అరువుగా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇదే యురోపియ‌న్ దేశాలు పాక్ అంటేనే మండి ప‌డుతున్నాయ్. లాడెన్ అయితే ఈ కక్ష కొద్దీ.. అమెరికాపై దాడులు నిర్వ‌హించి.. త‌ద్వారా అమెరికా త‌దిత‌ర దేశాల‌కు బ‌ద్ధ శ‌తృవుగా మారాడు. యూఎస్ ఆర్మీ పాకిస్తాన్  అబోతాబాద్ లో ఆశ్ర‌యం పొందుతున్న అత‌డ్ని మ‌ట్టుబ‌ట్టి త‌మ క‌డుపుమంట చ‌ల్లార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ దేశ టెర్ర‌రిజానికి రెండు క‌ళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్.. కాగా.. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన అకృత్యాల కార‌ణంగా భార‌త్ కి కొన్ని వంద‌ల సంఖ్య‌లో ప్రాణ‌హాని జ‌రిగింది. మ‌న పార్ల‌మెంటు దాడి, ముంబై దాడి, పుల్వామా దాడి, తాజాగా జ‌రిగిన ప‌హల్గాం దాడి.. అన్నిటికీ వీరే బాధ్యులు. ఈ ఇద్ద‌ర్ని భార‌త్ కు అప్ప‌గించాల్సిందిగా పాక్ ను డిమాండ్  చేస్తోంది భార‌త్. అప్పుడే ఈ ఆప‌రేష‌న్ సిందూర్ ని ఆపుతామ‌న్న అల్టిమేటం జారీ చేస్తోంది. అయితే మ‌సూద్ అజ‌ర్ త‌న త‌మ్ముడు, అక్క‌తో స‌హా దాదాపు త‌న కుటుంబాన్ని కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. హ‌ఫీజ్ స‌యీద్ సైతం త‌న  కొడుకు త‌ల్హాను ముజ‌ఫ‌రాబాద్ దాడుల్లో కోల్పోయాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌ఫీజ్ సైతం ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చ‌న్న రిపోర్టులు అందుతున్నాయి. మ‌రి చూడాలి.. ఈ యుద్ధం ముగిసేనాటికి పాక్ కి ఏం మిగులుతుందో. భార‌త్ ఎలాంటి విజ‌యం సాధిస్తుందో తేలాల్సి ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అనేక యుద్ధాలు, సంఘ‌ర్ష‌ణ‌ల్లో పాక్ ది ఘోర ప‌రాజాయ‌ల ప‌రంప‌రే సాగుతోంది. ప్ర‌స్తుతం కూడా ఆ దేశ పార్ల‌మెంటులో ఒక ఎంపీ ఇదే అంశాన్ని నిల‌దీశాడు. పాక్ ప్ర‌ధాని ఓ పిరికిపంద‌గా అభివ‌ర్ణించాడు. అంతే కాదు ఆ దేశ సైన్యాధ్య‌క్షుడు మునీర్ అసీం అల్లాపై భారం వేశాడు. నో ప్లాన్స్.. ఓన్లీ ప్రేయ‌ర్స్ అంటూ చేతులెత్తేశాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ అనుచ‌రులైతే.. మీకంత ద‌మ్ము లేదు కానీ మా ఇమ్రాన్ని విడుద‌ల చేసి పాక్ ని కాపాడండీ అంటూ నినాదాలు జారీ చేస్తున్నారు. ఇటు చూస్తే బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ అయితే పాక్ ని ఇదే అదునుగా చావు దెబ్బ తీయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే క్వెట్టాతో స‌హా మూడింట రెండొంతులు తాము స్వాధీన  ప‌రుచుకున్నామ‌ని అంటోంది. ఈ క్ర‌మంలో అంత‌ర్యుద్ధం సైతం పాక్ ఫేస్ చేస్తోంది. ప్ర‌జ‌ల్లో కూడా ప్ర‌భుత్వం, సైన్యం మ‌ధ్య తీవ్ర నిరాశా నిస్పృహ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ర‌క్ష‌ణ మంత్రి ని పార్ల‌మెంటు ప్ర‌శ్నించ‌గా.. వ్యూహాత్మ‌కంగానే తాము భార‌త దాడులు తిప్పి కొట్ట‌డం లేద‌న్న డొల్ల స‌మాధానాలు చెబుతున్నాడు. ఇక  ఆర్ధికంగా మాకు సాయం చేయండంటూ చందాలు కోరుతూ.. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టి మ‌రింత అభాసు పాలైంది.. పాకిస్థాన్. ఇలా ఎవ‌రైనా దేబిరిస్తారా? అని నిల‌దీస్తే.. త‌మ అఫిషియ‌ల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయిస్తోంది. ఇలా ఏ కోణంలో చూసినా కూడా పాకిస్థాన్ ప్ర‌స్తుతం స‌జావుగా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ మందుగుండు సామాగ్రి కొర‌త‌తో కొట్టుమిట్టాడుతోంది. ఒక ప‌క్క చూస్తే మ‌న  ఐఎన్ఎస్ విక్రాంత్ క‌రాచీ పోర్టును ధ్వంసం  చేసింది. కేవ‌లం ట‌ర్కీ ఇచ్చిన డ్రోన్ షూట‌ర్ల సాయంతో భార‌త్ ను ఇరుకున  పెట్టాల‌న్న కోణంలో తీవ్ర య‌త్నాలు చేస్తోంది పాక్. వాటిని కూడా మ‌న ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ ధ్వంసం  చేస్తున్నాయ్. చైనా స‌హ‌కార‌మూ అంతంత మాత్ర‌మే. అవి ఇచ్చిన ఆయుధాలు ఎంత మాత్రం ప‌ని చేయ‌డం లేదు. పైపెచ్చు పేల్చిన చోటే పేలిపోతున్నాయ్... ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ప్ర‌స్తుత ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రం. ఇక మిగిలింది  అణుబాంబు. నేష‌న‌ల్ ఫుడ్ జ‌ర్న‌ల్ రిపోర్ట్ ప్ర‌కారం ఈ రెండు దేశాల మ‌ధ్య అణుయుద్ధం వ‌స్తే జ‌రిగే  ప్రాణ న‌ష్టం 2 బిలియ‌న్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే  200 కోట్ల మేర ప్రాణ న‌ష్టం సంభ‌విస్తుందని అర్ధం. ఇలా భార‌త్ పాక్ మ‌ధ్య గొడ‌వ టూరిజం  నుంచి మొద‌లై టెర్ర‌రిజం వ‌ర‌కూ వ‌చ్చి.. ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ సిందూర్ క్లైమాక్స్ ఏంటో అర్ధంకాని ప‌రిస్థితి వ‌ర‌కూ వ‌చ్చింది. త‌ర్వాత ఏం  జ‌రుగుతుందో ఆ దేవుడికే  ఎరుక‌!!!

పెళ్లయిన మూడు రోజులకే ఆర్మీ జవాన్‌కు పిలుపు.. నా సిందూరాన్ని పంపుతున్నా భార్య ఉద్వేగం

  భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా  వివాహ సెల‌వుల‌కు ఇంటికొచ్చిన జ‌వాన్‌కు పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు వచ్చింది. దీంతో పెళ్ల‌యిన మూడు రోజుల‌కే భార్య‌ను వ‌దిలి విధుల కోసం దేశ స‌రిహ‌ద్దుకు వెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న పెళ్లి జరిగింది. అయితే, మంగళవారం యుద్ధంలాంటి పరిస్థితిలో, వెంటనే విధుల‌కు హాజరు కావాలని అతనికి ఆదేశం వ‌చ్చింది.  ఆ ఆదేశం మేర‌కు మే 8న  బార్డ‌ర్‌కు బయలుదేరాడు. జ‌వాన్ పాటిల్‌కు వీడ్కోలు పలికేందుకు నూతన వధువు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పచోరా రైల్వే స్టేషన్‌కు వ‌చ్చారు. దేశాన్ని రక్షించడానికి తన సిందూరాన్ని పంపుతున్నానని నూతనవ‌ధువు యామిని పాటిల్ కు వీడ్కోలు పలుకుతూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.