పాక్ టూరిజం టు టెర్ర‌రిజం!.. ఏ వార్ ఫేర్

అవి మ‌న‌కు స్వాతంత్రం వచ్చిన రోజులు. భార‌త దేశంలోనే అతి పెద్ద సంస్థానం జ‌మ్మూ- కాశ్మీరం.  క‌శ్య‌ప మ‌హా ముని పేరిట వెల‌సిన  కాశ్మీర్ కి రాజు రాజా హరిసింగ్. వెళ్తూ వెళ్తూ బ్రిటీష్ ఇండియా చేసిన ప‌ని.. ఎవ‌రి  స్వేచ్ఛ‌ మేరకు  వారు భార‌త్- పాక్.. లలో ఏ దేశంలోనైనా అయినా క‌ల‌వ‌చ్చ‌న్న మెలిక పెట్టడం.  

అప్ప‌టికి స్వాతంత్రం పొందిన దేశాలు భార‌త్, పాక్, శ్రీలంక‌, బ‌ర్మా. వీటిలో భార‌త్- పాక్ మ‌ధ్య ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు చాలానే. దానికి తోడు ఇక్క‌డున్న మ‌రో మెలిక ఏంటంటే.. హిందుస్థాన్ లో హిందువులు, పాకిస్థాన్ లో పాకిస్థానీయులు అంటే ముస్లిములు ఉండాల‌న్న‌ది ఒక ష‌ర‌తు కాగా.. మ‌న భార‌త దేశంలో ఇంకా మూడొంతుల్లో ఒక వంతు ముస్లిములు అలాగే ఉండి  పోయారు.  అయినా స‌రే ఇరు వ‌ర్గాల మ‌ధ్య హిందూ- ముస్లిం- సిక్ వంటి జాతుల మ‌ధ్య బీభ‌త్స‌మైన సంఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ్గా ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో 2 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతే స్థాయిలో నిరాశ్ర‌యులు అయ్యారు కూడా.

ఈ లోగా రాజాహ‌రిసింగ్ నేతృత్వంలోని కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల‌పైకి గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపులు పాక్ సైన్యం సాయంతో  దాడులు చేశారు. వీరి బాధ ఏంటంటే రాజా హ‌రిసింగ్ ఎక్క‌డ త‌న సంస్థానాన్ని భార‌త్ లో క‌లిపేస్తాడో అన్న‌దే. పాక్ అత్యుత్సాహం, గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపుల దుందుడుకు త‌నం పెచ్చరిల్లి రాజా హ‌రిసింగ్ కి చిరాకు తెప్పించాయి. ఒక  ర‌కంగా  ఆందోళ‌న క‌లిగించాయి. ఇలాంటి వారి నుంచి ఈ  చ‌ల్ల‌టి క‌శ్మీరం ర‌క్ష‌ణ పొందాలంటే వీరికంటే అమేయ ప‌రాక్ర‌మ‌మైన భార‌త్ ప‌రిధిలో ఈ దేశం ఉండాల‌ని భావించారు రాజా హ‌రిసింగ్. అందులో భాగంగా భార‌త్ వైపే క‌శ్మీర్ సంస్థానం క‌లిసేలా ఒప్పంద పాత్రాల‌పై సంత‌కాలు చేశారు. దీంతో ఐక్య రాజ్య స‌మితి  సైతం తీర్మానం చేసింది.

ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు చిక్కు. పాకిస్థాన్ కి ఒళ్లు మండింది. క‌శ్మీర్ లో అత్య‌ధికంగా ఉన్న ముస్లిమ్ జ‌నాభాను  అనుస‌రించి చూస్తే.. ఈ ప్రాంతం క‌ల‌వాల్సింది పాక్ లో. అంతే కాకుండా వారి మ‌రో కాంక్ష ఏంటంటే.. క‌శ్మీరం భూత‌ల స్వ‌ర్గం. స్విట్జ‌ర్లాండ్ ఆఫ్ సౌత్ ఏషియా. ఈ ప్రాంతం కానీ త‌మ గుప్పెట్లో ఉంటే.. మ‌నం ఎంచ‌క్కా ప‌ర్యాట‌కం ద్వారా విశేష‌మైన ఆదాయాన్ని స‌ముపార్జించుకోవ‌చ్చు. అన్న‌ది వీరి ఆశ. ఆశ‌యం.

అయితే ఈ ఆశ‌ల‌పై రాజా హ‌రిసింగ్ నీళ్లు కుమ్మ‌రించ‌డంతో వీరికి ఆ నాటి  నుంచి ఈ నాటి వ‌ర‌కూ.. ఆ కోరిక అలాగే ఉండి పోయింది. కార‌ణ‌మేంటంటే వారికి ద‌క్కిన భూభాగమంతా ఎడారిని త‌ల‌పిస్తుంది. పేరుక‌ది ప‌విత్ర దేశ‌మే కానీ అంతా అప‌విత్రం కావ‌డానికి గ‌ల కార‌ణం.. ఆ దేశానికంటూ  సొంత కాళ్ల మీద నిల‌బ‌డే స‌త్తా లేక పోవ‌డం. 

సింధూజ‌లాలు ఎక్క‌డో పుట్టి ఎక్క‌డి  నుంచో త‌మ దేశంలో ప్ర‌వ‌హిస్తేగానీ.. ఇక్క‌డ వారి  పంట‌ల‌కు దిక్కూ మొక్కూ లేదు. అంతే కాదు ఈ జ‌లాల ద్వారా పండే పంట‌లతో ఆ దేశ జీడీపీలో 24 శాతం ఆదాయం మాత్ర‌మే ల‌భిస్తుంది. అదే కాశ్మీర్ కూడా త‌మ సొంత‌మైతే.. వారు ప‌ర్యాట‌కంగానూ విశేష‌మైన ఆదాయ వ‌న‌రుల‌ను పొంద‌వ‌చ్చు. ఇక్క‌డే పాక్ ఆశ‌ల‌కు భారీగా చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది రాజా హ‌రిసింగ్.

అలాగ‌ని ఇది కేవ‌లం ఆయ‌న నిర్ణ‌య‌మ‌ని అనుకోవ‌డానికి వీల్లేదు. ఆ నాడు పాక్ ఇస్లామిక్ ట్రైబ‌ల్ గ్రూపుల‌కు త‌న ద‌ళాల సాయం అందించ‌కుండా ఉండాల్సింది. కానీ, రాజాహ‌రిసింగ్ హిందువు కావ‌డం. దానికి తోడు ఈ ప్రాంతం పేరు కూడా ఒక హిందూ ముని క‌శ్య‌పుడి పేరిట ఉండ‌టంతో.. ఆయ‌న కూడా హిందువులు అత్యధికంగా  ఉన్న హిందుస్తాన్ లో క‌శ్మీర్ క‌ల‌వ‌డ‌మే స‌మంజ‌సం అనుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని క‌శ్మీరీ పండిట్ల‌ను బ‌ల‌వంతానా ఏరి పారేసింది క‌శ్మ‌రీ ముస్లిములు. అదే త‌ర్వాతి రోజుల్లో క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమా వ‌చ్చేలా చేసింది. 

పాకిస్థానీయులు ఇక్క‌డే చావు దెబ్బ తిన్నారు. వారు త‌మ అత్యుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న  చేయ‌కుండా.. దౌత్య ప‌రంగా ఎంతో సంయ‌మ‌నంతో ప్ర‌వ‌ర్తించి ఉండాల్సింది. ఆచీ- తూచి వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింది. రాజు మీద ఒత్తిడి తేకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే.. వారి బిహేవియ‌ర్ న‌చ్చి ఉంటే రాజా హ‌రి సింగ్ మ‌న‌సు మారి ఉండేదేమో కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డే పాకిస్థాన్ కొంప  మునిగింది.

అలాగ‌ని భార‌త్ కి వ‌రంగా ఏమీ మిగ‌ల్లేదు కాశ్మీర్. అదింకా ర‌క్త స్రావం చేస్తూనే ఉంది. ప్రాణ న‌ష్టానికి కార‌ణం అవుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు యుద్ధాలు జ‌ర‌గ్గా. వీటిలో 1971లో జ‌రిగిన యుద్ధ‌మొక్క‌టే కాశ్మీర్ కేంద్రంగా జ‌ర‌గ‌లేదు. అది తూర్పు పాకిస్థాన్ అలియాస్ బంగ్లాదేశ్ కోసం జ‌రిగింది. అది కూడా ఈస్ట్ వెస్ట్ పాకిస్తానీయులైన ముజ‌బుర్ రెహ‌మాన్, యాహ్యాఖాన్, భుట్టోల మ‌ధ్య సాగిన రాజ‌కీయ పోరు కార‌ణంగా జ‌ర‌గ్గా.. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ ఆవిర్భావ‌మైంది. ఈ ప్రాంతంలోని కోటి మంది బెంగాలీలు భార‌త్ వైపున‌కు బ‌లవంతంగా రావాల్సి వ‌చ్చింది. ఈ యుద్ధ స‌మ‌యంలోనే పాక్ జ‌లంత‌ర్గామి ఘాజీ విశాఖ తీరంలో అనుమానాస్ప‌దంగా మునిగింది.

మిగిలిన అన్ని యుద్ధాలు, ఘ‌ర్ష‌ణ‌ల‌కు క‌శ్మీరే కీల‌కం. అస‌లు 1947- 48లో జ‌రిగిన తొలి ఇండో- పాక్ యుద్ధాన్ని తొలి కాశ్మీర్ వార్ గా పిలుస్తారు. త‌ర్వాత కార్గిల్ వ‌ర‌కూ జ‌రిగిన  యుద్ధాల్లో ఇరు ప‌క్షాల‌కు అపార‌మైన ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఒక్క కార్గిల్ వార్ లోనే పాక్ 4 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ ఆకాంక్ష‌తోనే పాక్ లో ఉగ్ర‌వాదం పురుడు పోసుకుంది. టూరిజం బ‌దులు టెర్ర‌రిజం పుట్టుకొచ్చింది. సౌత్ ఏషియా టెర్ర‌ర్ పోర్ట‌ల్ నివేదిక ప్రకారం ఒక్క పాకిస్తాన్ లోనే 80 నిషిద్ధ టెర్ర‌రిస్టు గ్రూపులుంటే వీటిలో 45 వ‌ర‌కూ ఉగ్ర ముఠాలు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. వీటిలోనూ ల‌ష్క‌రే తోయిబా, జైషే మొహ‌మ్మ‌ద్  భార‌త్ అంటేనే ర‌గిలిపోతాయి. ఈ ఉగ్ర సంస్థ‌లు భార‌త్ పై చేసే యుద్ధ‌మంటే.. దేశం కోసం చేసే యుద్ధంగా భావిస్తాయి. అందుకే వీరి  స‌హాయ స‌హ‌కారాల‌ను ఒక ప‌విత్ర కార్యంగా భావిస్తుంది పాక్ ఆర్మీ. ర‌వూఫ్ లాంటి టెర్ర‌రిస్టులు మ‌ర‌ణిస్తే.. వారికి త‌మ జాతీయ జెండాల‌ను క‌ప్పి మ‌రీ అంత్య‌క్రియ‌ల‌ను లాంఛ‌నంగా నిర్వ‌హిస్తుంది.

ఎప్పుడైతే  కాశ్మీర్ టూరిజం కోల్పోయిందో పాకిస్థాన్.. ఈ అంశం ద్వారా ల‌బ్ధి పొందాల్సింది కాస్తా.. టెర్ర‌రిజం అనే దానికి కేంద్ర స్థానంగా నిలిచింది. దీంతో ప్ర‌పంచానికి టెర్ర‌రిస్టుల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీగా మారింది. ర‌ష్యాతో యురోపియ‌న్ దేశాల పోరులో యురోపియ‌న్ల వైపు నిలిచి.. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా త‌న టెర్ర‌రిస్టు కార్య‌క‌లాపాల‌ను అరువుగా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇదే యురోపియ‌న్ దేశాలు పాక్ అంటేనే మండి ప‌డుతున్నాయ్. లాడెన్ అయితే ఈ కక్ష కొద్దీ.. అమెరికాపై దాడులు నిర్వ‌హించి.. త‌ద్వారా అమెరికా త‌దిత‌ర దేశాల‌కు బ‌ద్ధ శ‌తృవుగా మారాడు. యూఎస్ ఆర్మీ పాకిస్తాన్  అబోతాబాద్ లో ఆశ్ర‌యం పొందుతున్న అత‌డ్ని మ‌ట్టుబ‌ట్టి త‌మ క‌డుపుమంట చ‌ల్లార్చుకుంది.

ప్ర‌స్తుతం ఈ దేశ టెర్ర‌రిజానికి రెండు క‌ళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్.. కాగా.. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన అకృత్యాల కార‌ణంగా భార‌త్ కి కొన్ని వంద‌ల సంఖ్య‌లో ప్రాణ‌హాని జ‌రిగింది. మ‌న పార్ల‌మెంటు దాడి, ముంబై దాడి, పుల్వామా దాడి, తాజాగా జ‌రిగిన ప‌హల్గాం దాడి.. అన్నిటికీ వీరే బాధ్యులు. ఈ ఇద్ద‌ర్ని భార‌త్ కు అప్ప‌గించాల్సిందిగా పాక్ ను డిమాండ్  చేస్తోంది భార‌త్. అప్పుడే ఈ ఆప‌రేష‌న్ సిందూర్ ని ఆపుతామ‌న్న అల్టిమేటం జారీ చేస్తోంది.

అయితే మ‌సూద్ అజ‌ర్ త‌న త‌మ్ముడు, అక్క‌తో స‌హా దాదాపు త‌న కుటుంబాన్ని కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. హ‌ఫీజ్ స‌యీద్ సైతం త‌న  కొడుకు త‌ల్హాను ముజ‌ఫ‌రాబాద్ దాడుల్లో కోల్పోయాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌ఫీజ్ సైతం ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చ‌న్న రిపోర్టులు అందుతున్నాయి. మ‌రి చూడాలి.. ఈ యుద్ధం ముగిసేనాటికి పాక్ కి ఏం మిగులుతుందో. భార‌త్ ఎలాంటి విజ‌యం సాధిస్తుందో తేలాల్సి ఉంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అనేక యుద్ధాలు, సంఘ‌ర్ష‌ణ‌ల్లో పాక్ ది ఘోర ప‌రాజాయ‌ల ప‌రంప‌రే సాగుతోంది. ప్ర‌స్తుతం కూడా ఆ దేశ పార్ల‌మెంటులో ఒక ఎంపీ ఇదే అంశాన్ని నిల‌దీశాడు. పాక్ ప్ర‌ధాని ఓ పిరికిపంద‌గా అభివ‌ర్ణించాడు. అంతే కాదు ఆ దేశ సైన్యాధ్య‌క్షుడు మునీర్ అసీం అల్లాపై భారం వేశాడు. నో ప్లాన్స్.. ఓన్లీ ప్రేయ‌ర్స్ అంటూ చేతులెత్తేశాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ అనుచ‌రులైతే.. మీకంత ద‌మ్ము లేదు కానీ మా ఇమ్రాన్ని విడుద‌ల చేసి పాక్ ని కాపాడండీ అంటూ నినాదాలు జారీ చేస్తున్నారు.

ఇటు చూస్తే బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ అయితే పాక్ ని ఇదే అదునుగా చావు దెబ్బ తీయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే క్వెట్టాతో స‌హా మూడింట రెండొంతులు తాము స్వాధీన  ప‌రుచుకున్నామ‌ని అంటోంది. ఈ క్ర‌మంలో అంత‌ర్యుద్ధం సైతం పాక్ ఫేస్ చేస్తోంది. ప్ర‌జ‌ల్లో కూడా ప్ర‌భుత్వం, సైన్యం మ‌ధ్య తీవ్ర నిరాశా నిస్పృహ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ర‌క్ష‌ణ మంత్రి ని పార్ల‌మెంటు ప్ర‌శ్నించ‌గా.. వ్యూహాత్మ‌కంగానే తాము భార‌త దాడులు తిప్పి కొట్ట‌డం లేద‌న్న డొల్ల స‌మాధానాలు చెబుతున్నాడు. ఇక  ఆర్ధికంగా మాకు సాయం చేయండంటూ చందాలు కోరుతూ.. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టి మ‌రింత అభాసు పాలైంది.. పాకిస్థాన్. ఇలా ఎవ‌రైనా దేబిరిస్తారా? అని నిల‌దీస్తే.. త‌మ అఫిషియ‌ల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయిస్తోంది.

ఇలా ఏ కోణంలో చూసినా కూడా పాకిస్థాన్ ప్ర‌స్తుతం స‌జావుగా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ మందుగుండు సామాగ్రి కొర‌త‌తో కొట్టుమిట్టాడుతోంది. ఒక ప‌క్క చూస్తే మ‌న  ఐఎన్ఎస్ విక్రాంత్ క‌రాచీ పోర్టును ధ్వంసం  చేసింది. కేవ‌లం ట‌ర్కీ ఇచ్చిన డ్రోన్ షూట‌ర్ల సాయంతో భార‌త్ ను ఇరుకున  పెట్టాల‌న్న కోణంలో తీవ్ర య‌త్నాలు చేస్తోంది పాక్. వాటిని కూడా మ‌న ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ ధ్వంసం  చేస్తున్నాయ్. చైనా స‌హ‌కార‌మూ అంతంత మాత్ర‌మే. అవి ఇచ్చిన ఆయుధాలు ఎంత మాత్రం ప‌ని చేయ‌డం లేదు. పైపెచ్చు పేల్చిన చోటే పేలిపోతున్నాయ్...

ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ప్ర‌స్తుత ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రం. ఇక మిగిలింది  అణుబాంబు. నేష‌న‌ల్ ఫుడ్ జ‌ర్న‌ల్ రిపోర్ట్ ప్ర‌కారం ఈ రెండు దేశాల మ‌ధ్య అణుయుద్ధం వ‌స్తే జ‌రిగే  ప్రాణ న‌ష్టం 2 బిలియ‌న్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే  200 కోట్ల మేర ప్రాణ న‌ష్టం సంభ‌విస్తుందని అర్ధం.

ఇలా భార‌త్ పాక్ మ‌ధ్య గొడ‌వ టూరిజం  నుంచి మొద‌లై టెర్ర‌రిజం వ‌ర‌కూ వ‌చ్చి.. ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ సిందూర్ క్లైమాక్స్ ఏంటో అర్ధంకాని ప‌రిస్థితి వ‌ర‌కూ వ‌చ్చింది. త‌ర్వాత ఏం  జ‌రుగుతుందో ఆ దేవుడికే  ఎరుక‌!!!

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.   

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.

2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?

 2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.  అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి.  పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు  2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు  అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.  ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో  ఉంది.  ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి.  ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ  సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.   బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా  పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.   ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.  ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.  ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.   అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా,  మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది.  ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

అందెశ్రీ కుటుంబానికి అండ!

ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసన సభలో శనివారం (జనవరి 3) ప్రవేశపెట్టింది.  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం  అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టామన్నారు. 1994 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం 7991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి గతం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ఆర్డర్ తెచ్చారని ప్రస్తావించారు మల్లు భట్టి విక్రమార్క. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 573/225, 1.1.1995కి ఇది విరుద్ధమని చెప్పుకొచ్చారు. వెనుక తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఏపీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్‌గా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 25.11.2025న ప్రాస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డినెన్స్ 88 తెచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్సును బిల్ నంబర్ 7ద్వారా సభ ఆమోదం కోరుతున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 4)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 5) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ బీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.