దేశంలోనే తొలి మహిళా రాయబారి - ముత్తమ్మ     అవకాశాలని అందిపుచ్చుకుని అందలాలు ఎక్కడం వేరు. అసలు అవకాశం అన్న పదమే లేని చోట తనే ఓ మార్గాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగిపోవడం వేరు. అలాంటి అరుదైన వ్యక్తులు తాము విజయం సాధించడమే కాదు... ముందు తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారు. వారిలో ఒకరే సి.బి.ముత్తమ్మ!   సి.బి. ముత్తమ్మది కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లా. ఆమెకి పట్టుమని పదేళ్లయినా నిండకముందే అటవీశాఖ అధికారిగా చేస్తున్న వాళ్ల నాన్నగారు చనిపోయారు. సహజంగానే అలాంటి పరిస్థితులలో ఏదో ఒకలా ఓ ఒడ్డుకి చేరితే చాలురా భగవంతుడా అనుకుంటాము. కానీ ముత్తమ్మ తల్లి అలా కాదు! తన నలుగరు పిల్లల్నీ ఎలాగైనా సరే బాగా చదివించాలనుకుంది. ముత్తమ్మ కూడా తల్లి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బంగారు పతకాలు సాధిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో చదువు పూర్తిచేశారు.   చదువు పూర్తిచేసిన తరువాత తన తోటివారిలో ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోలేదు. కష్టతరమైన సివిల్‌ సర్వీస్ పరీక్షలకు సిద్ధపడిపోయారు. ఆ పరీక్షలలో నెగ్గిన తొలి భారతీయురాలిగా ముత్తమ్మది ఓ రికార్డు. అందులోనూ ఫారిన్‌ సర్వీస్‌ను ఎన్నుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు ముత్తమ్మ. ఆమెని ఇంటర్వ్యూ చేసిన బోర్డు అధికారులు... ఫారిన్‌ సర్వీసుకి మహిళలు తగరంటూ చాలా నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. ఆడవాళ్లు ఫారిన్‌ సర్వీసుకి పనికిరారంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు అధికారులు. ఒకవేళ ఆమెకు పెళ్లయితే, ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది అన్న షరతు మీద నియామకాన్ని అందించారు. ఓ రెండేళ్ల తరువాత ఈ నిబంధనలైతే మారాయి... కానీ స్త్రీగా ఆమెపట్ల వివక్షలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.   ఎంత కష్టపడినా కూడా తన ప్రతిభకి తగ్గ పదోన్నతలు దక్కకపోవడంతో ముత్తమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. ఆ సమయంలో స్త్రీలకు భిన్నమైన సర్వీస్‌ రూల్ప్‌ ఉండేందుకు భారత ప్రభుత్వం చెప్పిన కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫారిన్‌ సర్వీసులో ఉండేవారికి దేశరక్షణకి సంబంధించి రహస్యాలు తెలిసి ఉంటాయనీ, మహిళలు ఈ సర్వీసులో ఉంటే వారి భర్తలకు సదరు రహస్యాలు తెలిసిపోయే ప్రమాదం ఉంటుందన్నదే ఆ వాదన! కానీ ఫారిన్‌ సర్వీసులో మగవారు ఉంటే ఇలాంటి ప్రమాదం ఎందుకు ఉండదు? అనే సుప్రీం కోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తెల్లమొగం వేయాల్సి వచ్చింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. ‘భారత ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీల పట్ల వివక్షాపూరితంగా ఉన్న నిబంధనలన్నింటినీ మరోసారి పరిశీలించి... ఎలాంటి పక్షపాతం లేనివిధంగా వాటిని సంస్కరించాలన్నదే,’ ఆ తీర్పులోని సారాంశం.     సుప్రీం కోర్టు తీర్పు తరువాత భారత ప్రభుత్వం ముత్తమ్మను హంగేరీకి రాయబారిగా నియమించింది. అలా తొలి మహిళా రాయబారిగా ముత్తమ్మ చరిత్ర సృష్టించారు. దురదృష్టవశాత్తూ తన విధులలో అడుగడుగుగా ముత్తమ్మని ఒక మహిళగానే భావించి, ఆమెను తక్కువ చేసే ప్రయత్నమే చేసింది ప్రభుత్వం. తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కేందుకు ఆమె అనుక్షణం పోరాడాల్సి వచ్చేది. అందుకనే రిటైర్మెంట్‌ తరువాత కూడా భారత సివిల్‌ సర్వీసుల వెనుక దాగిన వివక్షని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. Slain by the System అనే పుస్తకంలో స్త్రీల పట్ల అధికారులలోని పక్షపాతాన్ని ఎండగట్టారు.   ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను నెగ్గిన తొలి మహిళగా, దేశంలోనే తొలి మహిళా దౌత్యవేత్తగా, తొలి భారతీయ మహిళా రాయబారిగా.... ముత్తమ్మ ఎన్నో తొలి ఘనతలను సాధించారు. ఉద్యోగం అంటే ముత్తమ్మకు ఎంత ఇష్టమో వంటలన్నా కూడా అంతే ఇష్టం! అందుకనే కర్ణాటకలోని వంటకాల మీద ఒక పుస్తకం రాశారు. ఇక దిల్లీలో తన పేరు మీద ఉన్న 15 ఎకరాల భూమిని ఓ అనాధాశ్రమానికి ఇచ్చేసి... మనసులో కూడా తనని మించినవారు లేరని నిరూపించారు. ఆమె చనిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా... ఇప్పటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు.     - నిర్జర.

వెకిలి సంభాషణల మీద ఓ హీరో యుద్ధం     ఎవరెన్ని మాటలు చెప్పినా... ఆడవారంటే ప్రపంచానికి చులకనే! మగవాడి సుఖానికి ఉపయోగపడే బొమ్మలాగా, 24/7 పని చేసిపట్టే యంత్రంలాగా ఇప్పటికీ ఆడవారి పట్ల అదే దృక్పథం. పరిస్థితులు కాస్త మారి ఉండవచ్చు. కానీ మగవాడిలో కామం చెలరేగినా, అహం దెబ్బతిన్నా... ఇప్పటికీ అదే పర్యవసానం. ఈమధ్యే కేరళలో ప్రముఖనటి భావన పట్ల జరిగిన లైంగిక వేధింపులే ఇందుకు సాక్ష్యం. భావన పట్ల జరిగిన అత్యాచారం కేరళ సినీరంగంలోని చీకటి కోణాలకు బెయటకు తీసుకువచ్చింది. దేశంలోనే ఉత్తమ చిత్రాలని నిర్మించే పరిశ్రమలో అసలు విలువలే లేవన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేరళ సినీరంగమంతా ఓ మాఫియాగా, రకరకాల గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యపోరుని సాగిస్తోందని చాటింది. కానీ ఈ ఉదంతంలో భావన చూపిన ధైర్యం అసమానం. తనకి జరిగిన అవమానాన్ని దిగమింగి దానిని పోలీసులకి తెలియచేయడం దగ్గర నుంచీ వారు చట్టానికి చిక్కేదాకా ఊరుకునేది లేదంటూ ఆమె చేసిన ప్రతిన వరకూ భావన ప్రతి అడుగులోనూ తెగువ చూపింది. సహజంగానే ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ప్రముఖ నటికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలైంది. కేరళ సినీరంగమంతా భావనకు అండగా నిలిచింది. ప్రముఖ నటులంతా భావనకు అండగా ర్యాలీలు నిర్వహించారు. కానీ ప్రముఖ మలయాళ నటుడు పృధ్వీరాజ్ మాత్రం ఎవరూ సాహసించని కొన్ని భావాలను వ్యక్తపరిచాడు. ఫేస్బుక్ వేదికగా పృధ్వీరాజ్ చెప్పిన ఆ మాటలు ఇప్పుడో సంచలనం! తన జీవితంలో అద్భుతం అనదగిన క్షణాలన్నీ కూడా స్త్రీలతోనే ముడిపడి ఉన్నాయంటూ తన లేఖని మొదలుపెట్టాడు పృధ్వి. తారుమారైన జీవితాన్ని తట్టుకొని తనని పెంచిన తల్లి దగ్గర నుంచీ, తన బిడ్డను కనేందుకు 40 గంటలు ప్రసవవేదన పడ్డ భార్య వరకూ స్త్రీల ఔన్నత్యం ముందు తను తలవంచక తప్పలేదంటూ ఒప్పుకున్నాడు. తన సహనటి భావన చూపించిన తెగువతో మరో అసాధారణమైన స్త్రీని చూసే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడే పృధ్వి లేఖ ఊహించని వాక్యాలను వెల్లడించింది. సినిమాలలో స్త్రీలను చులకను చేస్తూ తాను గతంలో పలికిన సంభాషణలకు క్షమాపణలు చెబుతున్నానంటూ పాఠకులను ఆశ్చర్యపరిచాడు పృధ్వి. ఇకపైన అలాంటి మాటలను పొరపాటున కూడా పలకనని చెప్పుకొచ్చాడు. ఒక నటుడిగా ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు తాను సిద్ధమేననీ... అయితే అందులో భాగంగా స్త్రీలను కించపరిచే సన్నివేశాలను గొప్పగా చూపించే ప్రయత్నం మాత్రం ఎన్నటికీ చేయనని హామీ ఇచ్చాడు. భావన చూపించిన తెగువతో తాను ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసిస్తూ పృధ్వి ఉత్తరం ముగిసింది. కానీ పృధ్వి చూపిన తెగువ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సినిమాల్లో హీరోయిన్లతో పరమరోతగా ప్రవర్తిస్తూ, అదంతా వృత్తిలో భాగమని వెనకేసుకుని వచ్చేవారికి ఆయన ఉత్తరం చెంపపెట్టులా మారింది. నిజానికి సినిమా అంటేనే ఓ పురుషాధిక్య ప్రపంచం. సహజంగానే అందులో ఆడవారిని కేవలం ఓ వినోద వస్తువుగానే చూపిస్తారు. కానీ స్త్రీ స్వేచ్ఛ పెరుగుతోందని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో ఆడవారిని మరింత గౌరవంగా చూపాల్సింది పోయి, వారిని మరింత చులకన చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ‘కమీషనర్ కూతుళ్లకి పెళ్లిళ్లు కావా! వాళ్లకి మొగుళ్లు రారా...’ అని ఓ హీరో వాక్రుచ్చుతాడు. ‘అమ్మాయి అన్నాక మగాడికి పడితీరాలి...’ అంటూ మరో హీరో పేట్రేగుతాడు. తన కన్నుపడిన అమ్మాయితో కాపురం చేసేందుకు పట్టుమంచాన్ని సిద్ధం చేసుకున్నానని వదరుతాడు మరో హీరో! ఒక్క మాటలో చెప్పాలంటే మన హీరోల మాటలు పక్కన రోడ్డు పక్కన కనిపించే పోరంబోకుల మాటలను తలపిస్తాయి. అమ్మాయిల వెంటపడి వేధించడం తప్పుకాదనీ, వాళ్లు మొదట్లో నిరాకరించినా ప్రేమలో పడి తీరతారనీ, అలా వారు ప్రేమలో పడేందుకు ఎంతకైనా తెగించవచ్చనీ హామీ ఇస్తున్నాయి మన సినిమాలు. సహజంగానే ఇలాంటి సన్నివేశాలు కుర్రకారు మీద గాఢమైన ప్రభావం చూపిస్తుంటాయి. అలా ప్రభావం చూపుతాయి కాబట్టే దర్శకులు పదేపదే ఇలాంటి సినిమాల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ ఏదన్నా సంఘటన జరిగితే మాత్రం... అందులో సినిమాల దుష్ఫ్రభావం ఏమాత్రమూ లేదని ముసుగులు కప్పేసుకుంటారు. ఆ మసుగుని తొలగించాడు ఒక హీరో! స్త్రీలను కించపరిచే సన్నివేశాలు సిగ్గుచేటంటూ తొలి గొంతుకని వినిపించాడు. పృధ్వి రాసిన ఈ లేఖ ఇప్పుడు ఫేస్బుక్లో ఓ సంచలనం. 60 వేలకు పైగా లైక్స్, 14 వేల షేర్లు, 3 వేల కామెంట్లతో సమాజంలోకి చొచ్చుకుపోతోంది. అరణ్య కృష్ణన్, శరణ్య మోహన్ వంటి మలయాళ చిత్ర ప్రముఖులంతా ఈ పోస్టుకి ప్రతిస్పందిస్తున్నారు. మరి వెకిలితనానికి మారుపేరు అనదగిన పాత్రలతో తెలుగు చిత్రాలను నింపేసిన క్రియేటివ్ దర్శకులు, ఎనర్జెటిక్ నటులు ఈ పంథాను అనుసరించేందుకు ముందుకు వస్తారా లేకపోతే నిప్పుకోడిలాగా కళామతల్లి ఒడిలో దాక్కొనే ఉంటారా అనేది చూఆల్సిందే!   - నిర్జర.     COURAGE (పృధ్వి లేఖ) Some of the most poignant moments in my life have been punctuated with moments of incredible courage. Courage from what I have now fully realised are God's most benevolent yet intricate creations. WOMEN! From a mother picking up pieces of a suddenly derailed life, to bring up two young boys to be the men they are today..to a wife who at the fag end of a 40 hour labour, just as she was being cut open without an anaesthetic, holding my hand and telling me "It's alright Prithvi"..I have repeatedly been dumbfounded in realising how much of a lesser being I am in the company of the women in my life. And today..as my dear friend walks in to the sets to kick start the shooting of her new film "ADAM", I once again bear witness to an extraordinary moment of courage from an extraordinary woman in my life! Today..she makes a statement..a statement that will echo through time, space and gender..that no one or no incident has control over your life but YOU! A statement that will now be part of counselling sessions and pep talks around the world. A statement that you my friend..are making in a million unheard voices! And to those voices I apologise..for at an age and time when I wasn't wise enough..I have been part of films that celebrated misogyny..I have mouthed lines that vilified regard for your self respect and I have taken a bow to the claps that ensued. NEVER AGAIN..never again will I let disrespect for women be celebrated in my movies! Yes..I'm an actor and this is my craft! I will whole heartedly trudge the grey and black with characters that possess unhinged moral compasses...but I will never let these men be glorified or their actions justified on screen. Once again..ladies and gentlemen..stand up and applaud for her! Behind the gutsy spunk, there is a vulnerable celebrity who knew well enough what this decision of hers would mean to a life under constant scrutiny. But she also knew..that she had to see it through...for that would set an example..light a torch that will show a path for many to follow!Today she makes a statement.. A statement of extraordinary courage! Fanboy for life...dear friend..fanboy for life! Love always, Prithvi.      

    కరీనాకపూర్‌ని అనుకరించవద్దు     సెలబ్రెటీలు జీవితాలు వేరు. వారికి ఉండే సౌలభ్యాలు వేరు. ఇంటి పనిలో తోడుగా నిలిచే సహాయకుల దగ్గర నుంచీ జలుబు చేసినా వాలిపోయే వైద్యుల వరకూ.... సమస్త సౌకర్యాలూ వారి చెంత ఉంటాయి. కానీ బయటకు కనిపించే వారి జీవిత విధానాన్ని చూసి అలాగే జీవిద్దామని అనుకుంటే కనుక మన బతుకులు ప్రమాదంలో పడక మానవు. ఇప్పుడు అలాంటి చర్చే కరీనాకపూర్‌ గురించి జరుగుతోంది.   కరీనా గత ఏడాది డిసెంబరులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కరీనా దంపతులు ఇద్దరూ బాలీవుడ్ తారలు కావడంతో ఆ సంఘటనకి మీడియా విపరీతమైన ప్రచారం వచ్చింది. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. గర్భవతిగా ఉన్న సమయంలో కరీనా 18 కిలోల బరువు పెరిగిందట. ఈ బరువునంతా తగ్గించుకోవడానికి ఇప్పుడు ఆమె కంకణం కట్టుకుంది. అందుకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా జిమ్‌లో వ్యాయామం చేయడం, కిక్‌ బాక్సింగ్‌ చేయడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాదు! బిడ్డ జన్మించిన మూడు రోజులకే కరీనా ఇంట జరిగిన ఓ పార్టీలో ఉత్సాహంగా పాల్గొనడం, మరికొద్ది రోజులు గడిచేసరికి ర్యాంప్‌ మీద నడవడం, త్వరలోనే ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధపడిపోవడం వంటి చర్యలన్నీ కూడా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్నాయి.   సాధారణంగా తారలు, తల్లయినా కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ రాలేదని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ర్యాంప్ మీద నడుస్తూ, ఫొటో షూట్లు చేస్తూ, ఇంటర్వ్యూలలో కనిపిస్తూ.... తమ అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించే ప్రహసనాలు చేస్తారు. ఇదంతా వారి వ్యక్తిగతమే అయినప్పటికీ... వారిని అనుకరించే ప్రయత్నం చేస్తే మాత్రం, సాధారణ మహిళలకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే-   - బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కనీసం ఆరువారాల విశ్రాంతి కావాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయంలో శాస్త్రీయత ఉందంటున్నారు వైద్యులు. తల్లి అయిన తరువాత స్త్రీ రుతుక్రమం ఆగిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ రుతుక్రమం తిరిగి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకనే వారాల తరబడి విపరీతమైన రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇలా కనీసం ఆరువారాలపాటు నరకయాతను అనుభవించిన తరువాత కానీ ఆమె శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోదు.   - బాలింతరాళ్లకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు వారి మీద చాలా త్వరగా దాడి చేస్తాయి. దాంతో వారు ఎలాగూ ఇబ్బంది పడతారు. కానీ వారి నుంచి తల్లిపాలు తాగుతున్న బిడ్డకు కూడా ఈ అనారోగ్యం వ్యాపించే ప్రమాదం ఉంటుంది. సున్నితమైన పసిపిల్లల శరీరం ఒకోసారి ప్రాణాపాయ స్థితికి చేరుకుటుంది. అందుకనే పెద్దలు బాలింతలను కొన్ని వారాలపాటు బయట తిరగవద్దనీ, చలిగాలి తాకనివ్వద్దనీ చెబుతారు.   - చాలామంది తల్లులు, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత డిప్రెషన్‌కు లోనవుతారు. దీనిని Postpartum Depression అంటారు. ఈ సమయంలో వారు ఉద్వేగపూరితమైన వాతావరణంలోకి అడుగుపెడితే, వారి మానసిక స్థితి మరింత దిగజారిపోతుంది. బిడ్డకు వీలైనంత దగ్గరగా ఉంటూ వారి బాగోగులను గమనించుకోవడం వల్లే ఈ Postpartum Depression నుంచి త్వరగా బయటపడవచ్చని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.   - బిడ్డకు జన్మనిచ్చిన తరువాత శరీరంలో కొన్ని మార్పులు రావడం సహజమే! ఈ సమయంలో వచ్చే అధికబరువుని ఎలాగైనా తగ్గించుకోవాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ ఆశతో తినే ఆహారంలో విపరీతమైన మార్పులు చేయడం, డైటింగ్‌ చేయడం, విపరీతమైన వ్యాయామాలు చేయడం వంటి తొందరపాటు చర్యలతో తల్లీబిడ్డల ఆరోగ్యానికి హాని జరగవచ్చు.   అన్నింటికీ మించి మాతృత్వం అనేది ఒక వరం. ఆ వరంతో వచ్చిన వరాల మూటతో కొద్దివారాలు దగ్గరగా గడపడం మంచిది. ఎందుకంటే బిడ్డ భూమ్మీద పడిన తొలి నెలలు అతని మానసిక, శారీరిక వికాసంలో చాలా ముఖ్యపాత్రని వహిస్తాయట. ఆ సమయంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా, అతని దీర్ఘకాలిక ఎదుగుదల మీద ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తల్లి ప్రేమ, లాలన అందాల్సిన ఈ అవసరాన్ని గుర్తించబట్టే తల్లులకు వీలైనన్ని సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాలు కోరుతుంటాయి. ఇలా తమ బిడ్డలతో గడపడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ అలాంటి అవకాశం ఉన్నవారు మిగతా వ్యాపకాలను పక్కనపెట్టి, బిడ్డ మీద శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే కరీనా జీవితం కరీనాది... మన జీవితం మనది!!!   - నిర్జర.

  ఉపగ్రహాలు కూడా మా పిల్లలే – నందిని హరినాథ్     ప్రపంచ అంతరిక్ష రంగంలో ఇస్రో ఓ సంచలనం సృష్టించింది. 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి సెంచురీ కొట్టింది. ఆ సమయంలో ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ఓ ట్వీట్ చేశారు. తాను కేవలం ఇస్రో విషయంలోనే గర్వపడటం లేదనీ, ఈ కీలక విజయంలో ముఖ్యపాత్ర వహించిన మహిళా శాస్త్రవేత్తల విషయంలో కూడా గర్విస్తున్నాననీ సందేశం ఉంచారు.   నిజానికి ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర అంతా ఇంతా కాదు. క్షిపణి రంగంలో మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన టెస్సీ థామస్, మంగళయాన్ ప్రాజెక్టు విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర వహించిన ‘రితు కరిధాల్’, ఇస్రోలో జియోశాట్ కార్యక్రమాలను సమీక్షించే అనురాధ... ఇలా ఇస్రోలో తమ సత్తా చాటుతున్న స్త్రీ శాస్త్రవేత్తల జాబితా చాలా పెద్దగానే ఉంది. అందులో నందిని హరినాథ్ ఒకరు. ఆమె విజయరహస్యాలు ఇవిగో...   గమ్యం ముందుగానే నిర్ణయమైతే   భౌతిక శాస్త్రంలో నిపుణురాలైన నందిని అంతరిక్షపరిశోధనా రంగంలోకి వచ్చేందుకు పెద్దగా కష్టపడలేదు. కారణం! తను ఏం చేయాలనుకున్నారో ముందుగానే నిర్ణయించుకున్నారు. నందిని ఇంట్లో ఎప్పుడు విజ్ఞానం పట్ల అభిరుచి కలిగే వాతావరణం ఉండేదట. తల్లి లెక్కల టీచరు. తండ్రి ఇంజనీరు... దానికి తోడుగా భౌతిక శాస్త్రం అంటే విపరీతమైన అభిమానం ఉన్న మనిషి. దాంతో నందినీకి సహజంగానే ఆ రంగం మీద మక్కువ ఏర్పడింది. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి చూసిన ‘Star Trek’ అనే సీరియల్, ఎలాగైనా సరే తను అంతరిక్షరంగంలోకి ప్రవేశించాలనే పట్టుదలని రగిలించిందని చెబుతారు నందిని.     నాయకత్వం వహించే లక్షణం ఉంటే   ఓ రెండు దశాబ్దాల క్రితం ఇస్రోలో చేరిన నందిని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రాజెక్టు డైరక్టరు స్థాయికి చేరుకున్నారు. దానికి కారణం తన శ్రమే అంటారు నందిని! కెరీర్లో పైకి ఎదగడం ఆడవారి విషయంలో మరింత కష్టమనీ, ఆ కష్టానికి సిద్ధపడితేనే ఎదుగుదల సాధ్యమనీ చెబుతారు. ఆడవారు తమ కుటుంబం ఎక్కడ చేజారిపోతుందో అని కీలక బాధ్యతలని చేపట్టేందుకు జంకుతూ ఉంటారనీ... నిజానికి అటు కుటుంబాన్నీ, ఇటు కెరీర్నీ గమనించుకోవడం సాధ్యమేనని చెప్పుకొస్తారు.   శ్రమించే తత్వమే కీలకం   ఇస్రో అంటేనే యంత్రాల సమాహారం. అందులోనూ ఏదన్నా ప్రాజెక్టు మొదలైందంటే ఇక హడావుడి అంతా ఇంతా ఉండదు. ప్రతి ఒక్క యంత్రమూ, ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రతి ఒక్క క్షణమూ అక్కడ కీలకంగా మారిపోతాయి. ఇక లాంచింగ్ తేదీ దగ్గరపడినప్పటి నుంచీ..... నరాలు తెగిపోయే ఉత్కంఠత నెలకొంటుంది. రోజుకి 14 గంటలు పనిచేసినా ఇంకా తరగనంత పని ఉంటుంది. ఆ కొద్ది వారాలూ తన జీవితం ఎలా గడిచిపోతోందో కూడా తెలియదంటారు నందిని. కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతగా ఉన్నా కూడా, రోజుకి నాలుగుగంటలకు మించి నిద్రపోయే అవకాశం దక్కదు. అయినా శ్రమకి వెరువక ప్రయోగం మీద దృష్టి పెడితేనే విజయం సొంతమవుతుంది.     ఓర్పే సాధనం   నిరంతరం శ్రమించాలన్నా, అనుకున్నది సాధ్యం కాకపోతే తిరిగి అదే పనిని అంతే శ్రద్ధతో చేయాలన్నా ఓర్పే కీలకం అంటున్నారు నందిని. అలాంటి ఓరిమి ఉంటేనే అటు కుటుంబమూ, ఇటు ఉద్యోగమూ ఫలప్రదంగా నిలుస్తాయని సూచిస్తున్నారు. మనిషిలో సహనం కనుక ఉంటే సగం లక్ష్యం చేతికి చిక్కినట్లే అని ఆమె నమ్మకమట. అందుకే అంతే సహనంతో ఆమె యంత్రాలని కూడా రూపొందిస్తారు. ఆ యంత్రాలని కూడా తన బిడ్డలులాగే భావిస్తారు.   ఆడవారు ఇంకా అడుగుపెట్టాలి     మునుపటితో పోలిస్తే అంతరిక్షరంగంలో స్త్రీల సంఖ్య కాస్త పెరిగింది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెలు ఈ రంగంలోకి ప్రవేశించాలనుకుంటే ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ మార్పు సరిపోదంటున్నారు నందిని. ఇప్పటికీ ఇస్రో వంటి సంస్థలలో నాలుగోవంతు కంటే తక్కువ స్త్రీలు ఉన్నారనీ, వారిలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి సంఖ్య ఇంకా తక్కువనీ చెప్పుకొస్తున్నారు. మరి నందినివంటి మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టేవారి సంఖ్య పెరుగుతుందని ఆశిద్దాం. స్త్రీ అంటే ఈ భూమి మీదే కాదు, అంతరిక్షంలో కూడా సగభాగం అని నిరూపిద్దాం. - నిర్జర.    

Priceless gift for your partner on Valentine's Day!     The day to celebrate your love for your dear ones is here. And to think of something to gift them on this occasion to profess your unconditional love for them could be a daunting task. In this day and age you are almost spoilt for choices. Unfortunately, due to commercial and societal pressures, the stress of giving the best gift often can lead to high pressure situations and disappointment.  So here we are to help you make the perfect choice of a priceless gift for your special one. Your time is that unmatchable gift that we are talking about here. Finding time to be with just one another is important to keep the relationship going. Life has become so busy these days. With all the distractions like work, meetings, family commitments, friends, fitness and so on, there are hardly enough hours left in a day for spending time with your partner. Your spouse should be your best friend, and friends enjoy spending time with one another. We only live this life once. Try doing something different to force yourself out of the rut of normal day-to-day living and make time for your significant other. From sneaking out on a date night, to going for a adventurous trek, to indulging in common interests the possibilities are just endless. Experts say that one of the major reasons that most relationships fail is because couples do not give importance to spending enough time together. We must realize that spending quality time with our spouse is like saving money for a rainy day. if you don’t spend time with your partner/spouse you are slowly letting the distance between you grow. So this Valentine's day take a pledge to make it a ritual to spend at least 10 minutes together every morning to kickstart the day on a great note. Also, spending a few minutes together every morning can help you weather out whatever the day has in store for you. And sometime in the night before you retire to bed to share with each other how your day went by.    -Divya

ప్రపంచంలో ఎన్నెన్నో దేశాలున్నాయి. తమ దేశం అంటే ఆయా దేశాల వారికి సహజంగానే భక్తి వుంటుంది. మరి భారతీయుల దేశభక్తిలోని ప్రత్యేకతేంటి? మన ప్రత్యేకత భరతమాత! అవును, భారతదేశం అన్ని దేశాల్లాంటి దేశమే. కాని, భరత మాత మాత్రం అలా కాదు. భరతమాత లాగా పాకిస్తాన్ మాత, బంగ్లాదేశ్ మాత, అమెరికా మాత, చైనా మాత అంటూ మనం ఎప్పుడూ ఎక్కడా వినం. కేవలం భరతమాత మాత్రమే ప్రపంచంలో రూపు దాల్చి సమున్నతంగా, సగర్వంగా నిల్చుంటుంది! ఇది నిజంగా సలక్షణమైన విశేషమే... భరతమాత ఆవిర్భావం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే జరిగింది. ముఖ్యంగా, దుర్గా దేవిని భక్తిగా ఆరాధించే బెంగాల్ లో మొదలైంది. ఆసేతు హిమాచలం వ్యాపించిన భరత భూమిని కేవలం ఒక ప్రాంతంలా కాకుండా ఒకానొక శక్తిగా, కారుణ్యం స్రవించే స్త్రీ మూర్తిగా, మాతృ మూర్తిగా దర్శించటం బెంగాలీ కవులు, రచయితలు, కళకారులు, స్వతంత్ర సమరయోధులు ప్రారంభించారు. వందేమాతర గీతం అప్పట్లో బెంగాల్లీలో మార్మోగిపోయింది. తల్లి వందనం అన్న ఆ గీతమే భరతమాత రూపకల్పనకి ప్రేరణనిచ్చింది. అలా మెల్లమెల్లగా వందేమాతరం గీతంలో కీర్తించిన అమ్మనే భరతమాతగా కవులు వర్ణిస్తూ వచ్చారు. పెయింటర్లు బొమ్మలు గీస్తూ వచ్చారు. తొలినాటి భరతమాత రూపాన్ని ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావాలతో దర్శించారు ఆనాటి వారు. కాషాయ రంగు చీరలో అమ్మ నాలుగు చేతులతో వెలిగిపోతున్నట్టు ధ్యానించారు. ఆ నాలుగు చేతుల్లో జపమాల, వరి మొక్కలు, తాళ పత్ర గ్రంథాలు, తెల్లటి వస్త్రం పట్టుకుని వుండేది భరతమాత. వీటి అర్థం శిక్ష, దీక్ష, అన్నం, వస్త్రం అని. ఈ నాలుగు ప్రధానమైన జీవిత అవసరాలు తీర్చేది కాబట్టే భరత భూమి మనకు భరతమాత అయింది! తరువాతి కాలంలో భరతమాత వాహనంగా సింహం చేర్చారు. కొన్ని చోట్ల నాలుగు చేతుల బదులు రెండు మాత్రమే వుంచి త్రివర్ణ పతాకాన్ని జత చేశారు. ప్రస్తుతం దేశంలోని నాలుగు చోట్ల ప్రసిద్ధ భరతమాత విగ్రహాలున్నాయి. మహా పవిత్ర క్షేత్రం వారణాసిలో మహాత్మ గాంధీ చేత ప్రారంభోత్సవం జరుపుకున్న భరతమాత ఆలయం వుంది. అలాగే, హరిద్వార్ లో ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన భరతమాత ఆలయం వుంది. కోల్ కతాలో 2015లో ఒక భరతమాత ఆలయం ప్రారంభింపబడింది. ఈ మూడు ఆలయాలే కాక కన్యాకుమారిలో కూడా ప్రసిద్ధమైన భరతమాత విగ్రహం దర్శనమిస్తుంది! మొత్తం ప్రపంచలోనే స్త్రీని దేవతగా ఆరాధించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే మిగిలి వుంది. ఇక దేశాన్ని కూడా తల్లిగా, దేవతగా పూజించే సంస్కృతి అయితే ఎక్కడా కనిపించదు. ఇది భారతీయ సమాజంలో స్త్రీ స్థానాన్ని చెప్పకనే చెబుతుంది...  

ఈ అమ్మాయిలు హీరోలను మించిపోయారు     అనగనగా ఓ విలన్‌. అభం శుభం ఎరుగని అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేయడమే అతని అకృత్యం. అతని వలలో పడినవారి జీవితాలు నిశ్శబ్దంగా నాశనం అయిపోతుంటాయి. ఇంతలో హీరో వస్తాడు. తన సాహసంతో విలన్ ఆటను కట్టించి, అతని చెరలోంచి అమ్మాయిలను విడిపిస్తాడు. కనీసం పదిశాతం కమర్షియల్‌ సినిమాల్లో కనిపించే కథే ఇది. కానీ ఇదే కథను ఇద్దరు అమ్మాయిలు నిజం చేశారు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు చెందిన తేజశ్వీతా ప్రధాన్‌, శివానీ గోండ్ ఇద్దరూ స్నేహితురాళ్లు. Mankind in Action for Rural Growth (MARG) అనే స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలను అక్రమరవాణా చేయడానికి వ్యతిరేకంగా MARGలో ఒక విభాగం ఉంది. దానిపేరు Students Against Trafficking Club (SATC). తేజశ్వీతా, శివానీ ఇద్దరూ ఈ క్లబ్ సభ్యులు. పశ్చిమబెంగాల్లో మైనర్‌ బాలికలను మోసం చేసి వారిని వేశ్యావృత్తిలోకి దించే వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఈ అప్రతిష్టలో పశ్చిమబెంగాల్‌ది దేశంలోనే మూడో స్థానం. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గత కొద్ది సంవత్సరాలుగా పోలీస్, సీబీఐలు ఎంతగా ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది సరికదా... ఏడాది ఏడాదికీ ఇలాంటి కేసుల శాతం పెరిగిపోసాగింది. తేజశ్వీతా, శివానీలు ఈ పరిస్థితి మీద దృష్టి పెట్టారు. అలాంటి సమయంలో వారికి నేపాల్‌ నుంచి తప్పిపోయిన ఒక అమ్మాయితో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసే అవకాశం చిక్కింది. ఆ అమ్మాయితో నిదానంగా స్నేహం చేసుకున్నారు. ఆ అమ్మాయి వ్యభిచార వృత్తిలోకి దిగేందుకు ఇంటి నుంచి పారిపోయినట్లు మాటల్లో తేలింది. తాము కూడా ఇంటి నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామనీ, తమకి కూడా ఓ ‘అవకాశాన్ని’ కల్పించమనీ ఆ అమ్మాయిని అడగడం మొదలుపెట్టారు తేజశ్వీతా, శివానీలు. వీరి ఉత్సాహం చూసి ఆ అమ్మాయి వెనుక ఉన్న సూత్రధారులు ముందుకు వచ్చారు. అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులతో రోజుల తరబడి మాట్లాడిన తరువాత వారిలో కొంత నమ్మకం కలిగింది. ఇందుకోసం తేజశ్వీతా, శివానీలు తమ ఫొటోలని కూడా పంపవలసి వచ్చింది. ఎట్టకేలకు వారిద్దరినీ తీసుకువెళ్లేందుకు సూత్రధారులు ఒప్పుకున్నారు. భారత్‌- నేపాల్‌ సరిహద్దులో ఉన్న ఫలానా చోటకి రమ్మంటూ ఇద్దరికీ కబురు పంపారు. అంతే! వారి ఆట కట్టించే సమయం వచ్చేసిందని స్నేహితురాళ్లకి అర్థమైపోయింది. సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు మారువేషాల్లో ఆ చుట్టపక్కల కాపు కాశారు. సూత్రధారులు చెప్పిన చోటకి స్నేహితురాళ్లిద్దరూ చేరుకున్నారు. అరగంట, గంట, రెండు గంటలు... ఓ పక్క సమయం పరిగెడుతోంది. కానీ ఎక్కడా తమని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముఠా సభ్యులు రాకపోవడం చూసి వారిద్దరికి ముచ్చెమటలు పట్టాయి. ఆ దుర్మార్గులు తమ పథకాన్ని ఏమాత్రం పసిగట్టినా కూడా ప్రాణానికే ప్రమాదం అని తెలుసు. చుట్టూ పోలీసులు ఉన్నా కూడా ఎందుకో వారి గుండెలు దడదడలాడిపోయాయి. ఎట్టకేలకు నాలుగు గంటల తరువాత ఆ ముఠా సభ్యులలో ఒకరు కనిపించారు. అంతే! చుట్టూ ఉన్న పోలీసులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. పట్టుబడిన ముఠా సభ్యురాలు అందించిన సమాచారంతో ఇతర సూత్రధారులని కూడా అరెస్టు చేశారు పోలీసులు. వారి చెరలో ఉన్న అమ్మాయిలకు కూడా విముక్తిని కల్పించారు. తేజశ్వీతా, శివానీల సాహసం భారత ప్రభుత్వం దృష్టికి రావడంతో వారిని ఈ ఏడాది సాహసబాలుర అవార్డుకి ఎంపికచేశారు. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 25 మంది బాలబాలకలకు ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఆశ్చర్యకరంగా ఈసారి అవార్డుకి ఎంపికైనా 25 మందిలో బాలికలే (13) ఎక్కువగా ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిసారీ తోటి పిల్లలను కాపాడటం, దొంగలను పట్టుకోవడం వంటి సంఘటనలే ఎక్కువగా కనిపించేది. ఏకంగా ఒక వ్యభిచార ముఠాను పట్టించడం అనేది ఇదే తొలిసారి. మరి ఇది మరీమరీ చెప్పుకోవాల్సిన వార్తే కదా!     - నిర్జర.

  ఆడవారు ఉద్యమించేందుకు చిట్కా   అదేం విచిత్రమో కానీ సబ్బు బిళ్ల గురించి ప్రకటన వస్తే, అందులో ఆడవాళ్లు స్నానం చేస్తూ కనిపించాల్సిందే. పరుపు గురించి ప్రకటన చేసినా, దాని మీద ఆడవాళ్లు చాలీచాలని దుస్తులతో ఉండాల్సిందే. ఆఖరికి స్పోర్ట్స్‌ కారు, కూల్‌డ్రింకు ప్రకటనలలో కూడా ఆడవాళ్లు సదరు వస్తువుల పక్కనే బికినీ ధరించి నిలబడాల్సిందే! ఆడవాళ్లని ఇలా అంగడి బొమ్మల్లాగా చూపించి రూపాయి సంపాదించాలనుకోవడం అన్ని చోట్లా కనిపించేదే! స్త్రీలను విలాస వస్తువులుగా చూపించడం వల్ల, సరుకులు అమ్ముడుపోవడం సంగతేమో కానీ... వాటిని గమనించే ప్రేక్షకుల మనసులో ఆడవారి పట్ల చాలా చులకనైన అభిప్రాయం ఏర్పడుతుంది. వారు ఆడవారికి ఇచ్చే గౌరవం, స్త్రీలతో ప్రవర్తించే తీరు మీద ఇలాంటి ప్రకటనలు చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఇలాంటి ధోరణి పట్ల స్త్రీలను జాగృతం చేసే అవకాశం ఉందా! అంటే దానికో సులువైన మార్గం ఉందంటున్నారు పరిశోధకులు. స్త్రీలని సెక్సు వస్తువులుగా చూపించే సంప్రదాయానికి విరుద్ధంగా చైతన్యం కలిగించేందుకు ఇటలీకి చెందిన పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు 78 మగవారినీ, 81 మంది ఆడవారినీ ఎన్నుకొన్నారు. వీరిలో కొందరికి స్త్రీలను నీచంగా చూపిస్తూ సాగే వీడియోలను చూపించారు, మరి కొందరికి అదే వీడియోను చూపిస్తూ... అందులో స్త్రీలను కించపరుస్తున్నారంటూ నేపథ్యంలో ఓ విశ్లేషణను వినిపించారు. ఇలా రెండురకాల వీడియోలను వీక్షించిన తరువాత తమ అభిప్రాయాన్ని చెప్పమంటూ ప్రేక్షకులని అడిగారు. స్త్రీలను అవమానకరంగా చూపిస్తున్నారని చెబుతూ సాగిన వీడియో గమనించిన ఆడవారిలో, అలాంటి చర్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. సమాజం స్త్రీల పట్ల ప్రదర్శిస్తున్న చులకన భావంతో వారు కోపోద్రిక్తులైపోయారు. అలాంటి తీరుకి వ్యతిరేకంగా ఏదన్నా ఉద్యమం జరిగితే, అందులో పాల్గొనేందుకు సిద్ధపడిపోయారు. మగవారిలో మాత్రం ఎలాంటి వీడియోని చూపించినా కూడా పెద్దగా మార్పు కనిపించలేదు. ఒకే వీడియోని రెండు విధాలా చూపించడం వల్ల ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందన్నదానికి పరిశోధకులు ఓ కారణం చెబుతున్నారు. అలవోకగా ఏదో ఒక విషయాన్ని తరచూ ప్రసార మాధ్యమాలలో చూడటం వల్ల, అదేదో సహజమేలే అన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ తాము చూస్తున్నదానిలో ఏదో లోపం ఉందని ఎవరో ఎత్తి చూపడం వల్ల, ఆలోచన చెలరేగుతుంది. ఇటలీ పరిశోధకులు చేసిన పరిశోధన చాలా చిన్నదే అయినా ఈ తరహా పరిశోధనల్లో ఇదే ప్రథమం కావడం అభినందనీయం. పైగా స్త్రీల పట్ల సాగుతున్న వివక్షను ఎండగడుతూ వీడియోలను రూపొందించడం వల్ల, మహిళలను సులువుగా జాగృతం చేయవచ్చన్న సూచననీ అందిస్తోంది. - నిర్జర.  

ఆడదే ఆధారం..!   1947 ఆగష్టు 15న అర్థరాత్రి ప్రపంచమంతా నిద్రపోతుండగా భారతదేశం స్వాతంత్రంతో మేల్కొంది. స్వాతంత్ర్యంతో పాటే భారతీయ మహిళ కూడా మేల్కొన్నదనే చెప్పాలంటారు దేశ ప్రథమ ప్రధాని పండిట్  జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన అన్నమాట అక్షర సత్యం..రోజులు మారినా..పరిస్థితుల్లో తేడా వచ్చినా ఇంకా పురుషాధిక్య సమాజంలో కడగండ్లను ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. పేద, ధనిక అనే వ్యత్యాసం ఉండటం లేదు.సమాజంలోని అన్ని వర్గాల్లోను మహిళలు ఇంకా వివక్షకు గురవుతున్న సందర్భాలు అనేకం. తల్లిగా, భార్యగా, చెల్లిగా, కుటుంబం కోసం సర్వస్వం ధారబోసే సహనశీలిగా ఉన్నప్పటికి  స్త్రీలంటే ఇంకా చిన్నచూపే. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నా..భర్త కన్నా భార్య ఎక్కువ సంపాదిస్తున్నా..ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోగా..ఇంట్లో తన మాటకు విలువ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పని పడితే భార్యాభర్తల్లో ఎవరు సెలవు పెడతారు..? ఎన్ని తెలివి తేటలు ఉన్నా..ఎంతటి మేధాసంపత్తి ఉన్నా అవి వెలుగులోకి రాని మహిళలు ఎందరో..!  స్త్రీ లేనిదే పుట్టుక లేదు, సృష్టి లేదు. ఎక్కడైతే స్త్రీలు 'నిర్భయం'గా సంచరించగలరో, ఎక్కడైతే మహిళల ఆక్రందన వినబడదో, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు. సిరిసంపదలు కళకళలాడతాయి. సర్వ సమన్విత, సర్వగుణగీతిక, శక్తిమూర్తి రూపిక స్త్రీ. విద్యకు సరస్వతి, ధనానికి లక్ష్మి, సౌభాగ్యానికి పార్వతి గా మన పెద్దలు అధిదేవతలుగా వర్ణించి, స్త్రీ ఉన్న చోట సకల విద్యాధనసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని చెప్పకనే చెప్పారు. సర్వశక్తిసమన్వితమైన స్త్రీకి సముచిత స్థానం ఇవ్వడం సమాజానికి విధి. అప్పుడే మనం అభివృద్ధిలో పయనిస్తున్నట్టు. దేశానికి స్వతంత్రం లభించినట్టు. ఆ నిజమైన స్వాతంత్రం కోసం కృషి చేయడమే మనముందున్న కర్తవ్యం.

    వనితా... నీకు వందనం     డాటర్ ఈజ్ నాట్ ఏ టెన్షన్..డాటర్ ఈజ్ ఈక్వల్ టూ టెన్ "సన్స్"  ఈ మధ్య కాలంలో తరచూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ లక్షల్లో లైకులు, షేర్లు కొట్టించుకుంటోంది ఈ కొటేషన్. వినడానికి, చదవడానికే కాదు ఈ కొటేషన్ అక్షర సత్యం కూడా. మన సమాజంలో ఆనాదిగా వస్తోన్న కొడుకుల ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతోంది. తల్లిదండ్రులు కుమార్త-కుమారులను వేర్వేరుగా చూడటం తగ్గుతోంది ఈ మధ్య. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సమాజం నుంచి వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మగవారికి పోటిగా వ్యవస్థలను సైతం శాసించే స్థాయికి అతివలు పోటీపడుతూ ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో భారతీయ మహిళలు కూడా స్థానం సంపాదించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుకు మొదటి మహిళా ఛైర్మన్‌..అంతేకాదు ఈ స్థాయికి చేరిన అతి పిన్న వయస్కురాలు అరుంధతి భట్టాచార్య. ఆమె నాయకత్వంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి వృద్ధి సాధిస్తోంది.   ఎన్నో ఆశలతో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారులంతా ఒట్టి చేతులతో దేశానికి తిరిగి వస్తే..ముగ్గురమ్మాయిలు ఇండియా పరువు కాపాడారు. వారే పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌ వీరి ప్రతిభ కారణంగా దేశం సగర్వంగా తలెత్తుకోగలిగింది.  ఈ విజయాలన్ని ఊరకే రాలేదు..అవమానాలు..ఛీత్కారాలు..ఆడపిల్లలని చిన్నచూపులు..అన్నింటిని మౌనంగా భరిస్తూ కసిగా ముందుకు వెళ్లారు. నిరాశ, నిస్పృహలకు గురికాకుండా లక్ష్యాలను ఎంపిక చేసుకుని సాధించే వరకు కృషి చేస్తే ఏదో ఒక రోజు మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నది వీరు నేర్పే పాఠం. ఓటములు, అవమానాలు ఎదురైన ప్రతిసారి నేలకు కొట్టిన బంతిలా మరింత ఉత్సాహంగా కృషి చేస్తే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. వీరి ప్రేరణతో కొత్త సంవత్సరంలో మహిళలు తమ తమ రంగాల్లో విజయబావుటా ఎగురవేయాలని తద్వారా దేశానికి పేరు తీసుకురావాలని ఆశిద్దాం.

    ఆమె తన భర్తని ఎలా ఎంచుకుందంటే....   పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నిండు నూరేళ్లపాటు కలిసి ఉండాల్సిన భాగస్వామిని ఎన్నుకోవడంలో ఆడవాళ్లకి ఎంత వరకు స్వేఛ్ఛ ఉంది అన్న ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమే! అందుకే ‘నాజరీన్ ఫజల్‌’ అనే యువతి తనకు కాబోయే భర్త, తన ఊహలకి తగినవాడో కాడో తెలుసుకునేందుకు ఓ మార్గాన్ని ఎంచుకున్నారు.   నాజరీన్‌ లండన్ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. సంప్రదాయ ముస్లిం కుటుంబం కావడంతో... చదువు పూర్తికాగానే తల్లిదండ్రులు ఆమెకు ఓ వరుడిని నిశ్చయించేశారు. అక్కడే నాజరీన్‌ తనదైన శైలిలో స్పందించారు. ఫలానా వ్యక్తితో నీకు వివాహాన్ని తలపెట్టాము అని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పారో వెంటనే అతనికి ఓ మెయిల్‌ పంపారు. అందులో ఒక పేజి నిండా తన గురించిన పరిచయం రాశారు. మరో పేజిలో తనకి కాబోయే జీవితభాగస్వామి నుంచి ఏం ఆశిస్తోందో తెలియచేశారు.   నాజరీన్ ముక్కుసూటితనం ఆమెకి కాబోయే భర్త ‘అమీన్‌’కు నచ్చినట్లే ఉంది. వెంటనే తన గురించి ఓ మూడు విషయాలు చెప్పి బదులుగా మరో మూడు ప్రశ్నలని సంధించాడు. అక్కడి నుంచి వారి మధ్య లేఖల పరంపర మొదలైంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నమూ ముందుకు సాగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు... దాదాపు 80 మెయిల్స్‌ వారి మధ్య నడిచాయి.   తను తన భర్తని ఎలాంటి ప్రశ్నలు అడిగిందీ, వాటికి అతను ఎలాంటి జవాబులు చెప్పిందీ నాజరీన్‌ వ్యక్తిగతం. కానీ ఆడవారి ఉద్యోగాల దగ్గర నుంచీ వారి మీద జరిగే అత్యాచారాల వరకూ అతని అభిప్రాయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేశానంటారు నాజరీన్‌. వాటికి అతను చెప్పిన జవాబులు ఆమెకు సంతృప్తికరంగానే తోచాయట. తన మనసులో ఉన్న ప్రతి సందేహాన్నీ అతని ముందు వ్యక్తపరిచాననీ, వాటికి అతను ఓపికగా జవాబులు అందించాడనీ అంటారు నాజరీన్‌. దాంతో అమీన్‌తో నిఖాకు మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నారట.   ఇదంతా జరిగి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. ప్రస్తుతం నాజరీన్ తన భర్త అమీన్‌తో హాయిగా కుటుంబజీవనాన్ని గడుపుతున్నారు. కాకపోతే ఆనాటి విషయాలను తన ఫేస్‌బుక్‌లో పంచుకోవడం వల్ల ఇప్పుడు నాజరీన్‌ వివాహం వార్తల్లో నిలుస్తోంది. బీబీసీ వంటి పత్రికల దృష్టిని సైతం ఆమె ఆకర్షిస్తోంది. ఇంతకీ నాజరీన్‌ తనకు కాబోయే భర్త అభిప్రాయాలని ఎందుకు తెలుసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని ఇప్పుడు ఫేస్‌బుక్‌ ద్వారా ఎందుకు పంచుకోవాలనుకుంది అంటే- ‘మనం రెస్టారెంట్లో ఏం ఆర్డరు ఇవ్వాలనే విషయం మీద కూడా ఎంతోసేపు ఆలోచిస్తాం. అలాంటిది ఏమీ తెలియకుండానే ఒక వ్యక్తిని మన జీవితభాగస్వామిగా ఎలా నిర్ణయించుకోగలం. మరీ దారుణం ఏమిటంటే, చాలామంది తమ జీవితసహచరిని కేవలం పెళ్లిరోజే కలుసుకుంటారు. ఇద్దరూ ఒకరికొకరు తగినవారో కాదో తెలియకుండానే ఇలాంటి ప్రయత్నం ఎలా చేయగలం! కాబట్టి ‘పెళ్లి’ గురించి ఆలోచించేకన్నా ‘వివాహబంధం’ గురించి ఆలోచించాలి. నేను ఆ ప్రయత్నమే చేశాను. నాలాగా ఇతరులు కూడా చొరవ చూపాలి,’ అంటున్నారు నాజరీన్‌. సంప్రదాయ వివాహపద్ధతులకు కాస్తంత స్వేచ్ఛని జోడించిన నాజరీన్ ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా తెగ మెచ్చుకుంటోంది.     - నిర్జర.  

    Why Its Best To Avoid Wearing Heels During Pregnancy     A fabulous pair of stilettos is something that we just can't avoid with a pretty outfit while stepping out. But while its almost ok to wear them during a regular day, it might just not be the right option for you if you are pregnant and planning to step into those lovely pair of heels. The first reason is due to the fact that pregnancy hormones, like progesterone, fill the bloodstream and loosen ligaments in the lower back and abdomen to allow the stomach room to grow. The bloodstream does not stop at abdomen, however. The same pregnancy hormones that loosen ligaments to accommodate pregnancy growth will also pass through other areas of the body like the lower legs, feet and ankles. This makes wearing high heels riskier and less comfortable than before than before. Lower back ligaments are also affected meaning that there can be additional stress on lower back muscles with added pain and strain. During your first trimester it could just be fine but as your pregnancy progresses it does pose a risk to wear them.   In the second trimester, your body ramps up production of the hormone relaxin, which loosens your ligaments so your baby can pass through your pelvis more easily. However, this loosening can also cause your pelvic, hip, and back joints to shift uncomfortably. Donning high heels disrupts your body's alignment to begin with, but wearing them when your joints are already shifty will likely result in extra back and hip pain.  Swelling is very common during pregnancy, especially in your third trimester. This will make heels particularly uncomfortable, especially if you’re at work or at an event where you haven’t got something more comfortable to slip into.   But it’s not only high heels that cause problems for pregnant women. Very flat shoes like ballet pumps or sandals offer very little support to the foot and can cause Achilles pain, calf strain and flattening of the arches which can lead to plantar fasciitis. Experts say the optimum height for a shoe during pregnancy is around two inches - although the exact height depends on the structure of each individual’s foot. So chose the footwear that you wear as per your comfort and stay safe and stylish during your pregnancy.   ..Divya  

    400 కుక్కలకు ఆసరాగా... ఓ పేదరాలు!   ఆమె తన జీవితంలో అనేక కష్టాలని ఎదుర్కొంది. కాచుకుని ఉండాల్సిన అత్తవారింట కఠినత్వాన్ని చవిచూసింది. చివరికి ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి నానా అగచాట్లూ పడింది. ప్రస్తుతానికి చెత్త ఏరుకుంటూ జీవనోపాధిని సాగిస్తోంది. మనిషి మనసులో ఇంతటి చీకటిని, జీవితంలో అంతటి అగాధాలనీ చూసి తరువాత ఆమెకు మనుషులంటేనే విరక్తి పుట్టిందేమో... వందలాది కుక్కలకు ఆసరాగా నిలుస్తూ, వాటిలో ప్రేమని వెతుక్కుంటోంది. ఆమే- ప్రతిమాదేవి!   ఆది నుంచీ కష్టాలే ప్రతిమాదేవిది పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్‌ చెందిన ఓ పేద కుటుంబం. ఇంటికి భారంగా ఉందనో ఏమో, ప్రతిమకు ఏడేళ్ల వయసులోనే పెళ్లిచేసిపారేశారు. ప్రతిమ తన అత్తవారింట నానా అగచాట్లూ పడింది. భర్త పచ్చి తాగుబోతు. రోజూ తాగడం, తాగాక తన ప్రతాపాన్నంతా భార్య మీద చూపించడం... ఇదే అతని దినచర్య! ప్రతిమకు 14 ఏళ్లు వచ్చేసరికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో... ఇక అతని నుంచి విడిపోయి నాలుగిళ్లలో పాచిపని చేసుకోవడం మొదలుపెట్టింది.     దిల్లీకి ప్రయాణం ప్రతిమ పెద్దకొడుకు పని వెతుక్కుంటూ దిల్లీ చేరుకోవడంతో, ప్రతిమ కూడా మిగిలిన ఇద్దరు కొడుకులతో కలిసి దిల్లీ చేరుకుంది. ప్రస్తుతం తెలుగులో కూడా పెద్ద విలన్‌గా చెలామణీ అవుతున్న రాహుల్‌ దేవ్‌ ఇంట్లో పనిమనిషిగా కుదురుకుంది. ఆ తరువాత దక్షిణ దిల్లీలోని సాకేత్ అనే నివాసప్రాంతంలో ఓ టీకొట్టుని నడపసాగింది. ఆ టీకొట్టు పక్కనే తన నివాసాన్నీ ఏర్పరుచుకొంది. ఆ సమయంలోనే కుక్కలను దగ్గరకు తీసే అలవాటు మొదలైంది.   తగలబెట్టేశారు ఊరకుక్కల పట్ల ప్రతిమ చూపే కరుణ సహజంగానే చుట్టుపక్కలవారికి కంటగింపుగా మారింది. దగ్గరలో ఉండే ఒక షాపు యజమాని ఆమె టీకొట్టునీ, ఇంటినీ తగలబెట్టించాడు. ఆ మంటలకి ప్రతిమ తీవ్రంగా గాయపడింది కూడా. అయినా కుక్కలని చేరదీయడం మానలేదు. చెత్తాచెదారం ఏరుకోగా వచ్చిన డబ్బుతో ఆమె వందలాది కుక్కలకు రోజూ ఆహారం పెడుతూ ఉంటుంది. పది లీటర్ల పాలు, 12 కిలోల బియ్యం, ఐదు కిలోల మాంసం... ఇలా ప్రతిమాదేవి పెట్టే ఆహారంతో సాకేత్ చుట్టుపక్కల ఉండే దాదాపు 400 కుక్కల ఆకలి తీరుతుంటుంది. వాటిలో ఓ 200 కుక్కలైతే నిరంతరం ప్రతిమాదేవి ఇంటి దగ్గరే ఉంటాయి. వాటన్నింటికీ రేబిస్‌ టీకాలు వేయించడంతో, వాటి వల్ల ఇతరులకు ఏమాత్రం ప్రమాదం లేదంటారు ప్రతిమ.     కొడుకులను సైతం కాదని ప్రతిమాదేవి ఆ మధ్య ఓ ఇంటిని తీసుకున్నారు. అయితే కుక్కలతో సహా ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేందుకు కొడుకులు ఒప్పుకోలేదు. ‘నేను లేకపోతే ఈ కుక్కలను ఎవరు చూసుకుంటారు?’ అన్నది ప్రతిమ అనుమానం. అందుకనే కొత్త ఇంటిని పిల్లలకే వదిలిపెట్టేసి, తన పాత రేకులషెడ్డులోనే జీవనాన్ని సాగిస్తున్నారు. కుక్కల పట్ల ఆమెకు ఉన్న అనురక్తిని గమనించిన జనం కూడా ప్రతిమకు చేతనైనంత సాయం చేయడం మొదలుపెట్టారు. ప్రతిమలోని కరుణ పట్ల సమాజానికి నమ్మకం కుదిరినట్లే ఉంది. కానీ సమాజం పట్ల ప్రతిమ కోల్పోయిన విశ్వాసం మళ్లీ పాదుకుంటుందా! అన్నదే ప్రశ్న. అప్పటి వరకూ ఆమెకు కుక్కలు చూపే విశ్వాసంలోనే సాంత్వన లభిస్తుందేమో!   - నిర్జర.

    అక్కడి వ్యాపారులంతా ఆడవారే!   ఆకాశంలో ఎగరాలన్నా, వీధిలో నిలబడి వ్యాపారం చేయాలన్నా అది మగవాడికే సాధ్యం అని ఇంకా నమ్ముతున్న రోజులివి. ఆడవాళ్లంటే డైలీ సీరియల్స్‌ చూసేవారేననీ, ఆ డైలీ సీరియల్స్‌లో పాత్రలలాగానే వారి మనస్తత్వాలూ ఉంటాయని హేళన చేస్తున్న సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో ఓ ఐదువందల సంవత్సరాలుగా ఆడవారే వ్యాపారస్తులుగా సాగుతున్న ఓ వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకోక తప్పదు.   తల్లుల వ్యాపారం అది మణిపూర్‌ రాజధాని ఇంఫాల్. అక్కడికి వెళ్లి ఊళ్లో ‘ఇమా కేతెల్‌’ ఎక్కడ అంటే ఎవరైనా చెబుతారు. అంతా మహిళా వ్యాపారస్తులే కనిపించే ఒక బజారే ఈ ఇమా కేతెల్‌! ‘ఇమా’ అంటే మణిపురి భాషలో తల్లి అనీ, ‘కేతెల్’ అంటే బజారు అనీ అర్థం. అలాగని ఇక్కడ పదిమందో వందమందో మహిళా వ్యాపారస్తులు కనిపిస్తారనుకుంటే పొరపాటే! ఇక్కడ ఏకంగా 4000 మందికి పైగా మహిళలు రోజూ వ్యాపారాన్ని సాగిస్తుంటారు.   వందల ఏళ్ల చరిత్ర ఇమా కేతిల్‌ స్త్రీలను ప్రోత్సహించేందుకు ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజారు కాదు. మణిపురి స్త్రీలంతా వందల ఏళ్లుగా ఒక చోట గుమికూడి చేసుకుంటున్న కూడలి. ఈ బజారు గురించి దాదాపు ఐదువందల సంవత్సరాల క్రితమే మణిపురి సాహిత్యంలో ప్రస్తావనలు కనిపిస్తాయి. 1786లోని బ్రిటిషర్ల గెజెట్‌లో అయితే ఇంఫాల్‌ మధ్యలోంచి ప్రవహించే నంబుల్‌ నదీతీరంలో ఆడవారే వ్యాపారస్తులుగా సాగే లావాదేవీల గురించి వివరణ ఉంది.     వ్యాపారానికి పునాది 500 ఏళ్ల క్రితం మణిపురి సమాజం భిన్నంగా ఉండేది. చాలామంది మగవారు పొలం పనుల పేరుతోనో, సైన్యంలో పనిచేసేందుకో... పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు. మరి ఆ సమయంలో ఇంట్లో మిగిలిన కుటుంబసభ్యులు బతికేదెలా! అందుకే ఆడవారు నిదానంగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యతని మహిళలే తీసుకున్నారు. బొమ్మలు చేయడం, బట్టలు అల్లడం, ఆభరణాలు రూపొందించడం... ఇలా తమకు నైపుణ్యం ఉన్న పనిలో వస్తువులని రూపొందించి వాటిని అమ్మేవారు. రానురానూ ఇలా ఒక చోటకి చేరిన ఆడవారితో ‘ఇమా కేతెల్‌’ రూపుదిద్దుకొంది.     కష్టాలను తట్టుకొని 21వ శతాబ్దంలోనే ఆడవారంటే చులకన ఉన్నప్పుడు ఇక వందల ఏళ్ల క్రితం సంగతి చెప్పేదేముంది! స్థానిక వ్యాపారస్తులంతా ఎప్పుడెప్పుడు వీరిని తరిమికొడదామా అని ఎదురుచూసేవారు. ఇక బ్రిటిషర్ల కాలంలో అయితే వీరిని ఖాళీ చేయించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ తన చోటుని వదిలుకొనేందుకు స్త్రీలు ఇష్టపడలేదు. నల్లదొరలైనా, తెల్లదొరలైనా... తమ జోలికి ఎవరు వచ్చినా తలవంచలేదు. వ్యాపారాన్ని అంగుళం కూడా వదులుకోలేదు. ఇప్పటికీ ఇక్కడి ఆడవారిలో అదే సామరస్యం కొనసాగుతోంది. పైగా వీరంతా కలసి కష్టాలలో ఉన్న మహిళలకు రుణాలను అందించేందుకు ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.     ప్రపంచంలోనే అతి పెద్దది కేవలం మహిళలలే కనిపించే బజార్లలో ‘ఇమా కేతెల్‌’ అతి పెద్దది అని ఓ అంచనా. ఈ కూడలి ప్రత్యేకతను గ్రహించిన మణిపుర్‌ ప్రభుత్వం వారు వ్యాపారం చేసుకునేందుకు పక్కా భవనాలను నిర్మించి ఇచ్చింది. నెలకి ఓ నలభై రూపాయలు చెల్లిస్తే చాలు మహిళలు ఇక్కడ నిరాటంకంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఎండుచేపల దగ్గర్నుంచీ బట్టల దాకా ఇక్కడ లభించని వస్తువంటూ ఉండదు. పైగా ఇక్కడ వ్యాపారం సాగించే ఆడవారు కూడా చాలా చైతన్యంగా ఉంటారని చెబుతారు. వారు ఇంటింటి రామాయణాల గురించి కాకుండా సామాజిక అంశాల గురించీ, సమకాలీన రాజకీయాల గురించీ చర్చించుకునేందుకే ఎక్కువ ఇష్టపడతారట.     - నిర్జర.  

    కష్టంలో ఉన్న మహిళను చూసి నవ్వుకున్నాం   పదిహేను రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అప్‌లోడ్‌ అయ్యింది. ‘Fastest cashier in the world’ పేరుతో అప్‌లోడ్ అయిన ఆ వీడియోలో ఓ మహిళా క్యాషియర్‌ చాలా నిదానంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంచుమించు స్లోమోషన్‌లాగా కనిపించిన ఈ వీడియోని చూసి జనం వెర్రెత్తిపోయారు. నవ్వీనవ్వీ తెగ లైకులు కొట్టారు. ఇంతకీ ఆ వీడియో వెనుక ఉన్న నిజం ఏమై ఉంటుంది అన్న ఆలోచన మాత్రం ఒక్కరికి కూడా రాలేదు. కుందన్‌ శ్రీవాస్తవ అనే సామాజిక కార్యకర్తకి మాత్రం ఆ ఆలోచన వచ్చింది.   వీడియోలోని మహిళ పూనేలోని మహారాష్ట్ర బ్యాంక్‌లో పనిచేస్తున్నట్లు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒక్క వివరం ఆధారంగా శ్రీవాస్తవ ఆమె వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో బయటపడిన నిజాలతో ఆయన మనసు భారమైపోయింది. మన కళ్లకు కనిపించే దృశ్యానికీ, ఆ దృశ్యం వెనుక ఉన్న నిజానికీ మధ్య ఎంత వ్యత్యాసం ఉండవచ్చో అర్థమైంది. ఇంతకీ ఆ వీడియోలో కనిపించిన మహిళ పేరు ‘ప్రేమలతా షిండే’. ఆమె అంత నిదానంగా పనిచేయడానికి కారణం లేకపోలేదు. ప్రేమలత ఒక హృద్రోగి. ఇప్పటికే ఆమె రెండుసార్లు వచ్చిన గుండెపోటుని తట్టుకొని నిలబడ్డారు. ఒకసారి పక్షవాతంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. తీవ్ర అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రేమలత విధులు నిర్వహిస్తున్నారు.   నిజానికి ప్రేమలత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయిపోతున్నారు. అప్పటివరకూ ఇంటివద్దనే ఉండి విశ్రాంతి తీసుకునేందుకు ఆమెకు కావల్సినన్ని సెలవలు ఉన్నాయి. కానీ ఆమెకు అలా ఇష్టం లేదట. పనిచేస్తూ గౌరవంగా తన విధుల నుంచి విరమించుకోవాలన్నది ప్రేమలత కోరిక. అందుకనే ఓపిక చేసుకుని మరీ విధులను నిర్వహిస్తున్నారు.   అనారోగ్యం ప్రతి ఒక్కరినీ బాధిస్తుంది. దానిని తట్టుకొంటూనే విధులు నిర్వహించాలనుకోవడం గొప్ప కాకపోవచ్చు. కానీ ప్రేమలత కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె భర్త చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు విదేశాలలో ఉంటున్నాడు. అయినా అధైర్యపడకుండా ఒంటరిగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ప్రేమలత. ఆవిడ స్థైర్యాన్ని గమనించిన బ్యాంక్‌ ఉన్నతాధికారులు పనిలో కొనసాగేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు ఆమె వలన పని కుంటుపడకుండా ఉండేందుకు మరో కౌంటరును ఏర్పాటుచేశారు. ప్రేమలత వీడియో వెనుక ఇంత కథ ఉంది. అదేమీ గమనించకుండా పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు 50 లక్షల మంది ఈ వీడియోను చూశారు. లక్షన్నర మంది తమ మిత్రులతో షేర్‌ చేసుకున్నారు. ఇక వేలాదిగా వచ్చిన కామెంట్ల గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రభుత్వోద్యోగుల అసమర్థత గురించీ, అందునా మహిళా ఉద్యోగుల నిదానం గురించి ‘అమూల్యమైన’ అభిప్రాయాలెన్నో వ్యక్తమయ్యాయి. సాటి మనుషుల పట్ల మన దృక్పధం ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే! ఇక ఆ మనిషి ఆడది అయితే నవ్వుకొనేందుకు అడ్డేముంది. ఇలాంటి చేతగాని పనులు మహిళలే చేస్తారన్నది జనాల నమ్మకం. అలాంటివారికి ప్రేమలతా కథ ఒక కనువిప్పుగా మారితే సంతోషం. కనీసం మున్ముందైనా తొందరపడి ఏదో చూసి మరేదో అభిప్రాయానికి రాకుండా ఉంటారు.   చివరగా ప్రేమలత కష్టాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. కుందన్‌ శ్రీవాస్తవ మాటల్లో చెప్పాలంటే- ‘మన జీవితాలనీ, ఈ దేశాన్నీ ముందుకు నడిపించేందుకు శ్రమిస్తున్న ఇలాంటి ఆడవారందరికీ అభివాదం చేయాల్సిందే!’     - నిర్జర.

    మోదీ సైతం ఆమెకు తలవంచారు   ‘‘మీరు నా గురించి కాదు, ఈమె గురించి రాయండి. దేశమంతా ఈమె కథను ప్రచారం చేయండి,’’ అంటూ గత ఫిబ్రవరిలో మీడియాకు సూచించారు మోదీ. ఇంతకీ ఆమె క్రీడల్లో పతకం తెచ్చి వెలిగిపోయిన మహిళకాదు, దుర్మార్గుల భరతం పట్టిన వీరనారి అంతకంటే కాదు... ఒక 105 ఏళ్ల వృద్ధురాలు. మేకల మీద బతికే కడు పేదరాలు! కానీ ఆమె ఆశయమే గ్రామీణ ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ‘కున్వర్‌బాయ్‌ యాదవ్‌’.     సిగ్గు సిగ్గు ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న రికార్డుల గురించి తరచూ చెప్పుకుంటాం. కానీ బహిరంగ మల విసర్జనలో మనది మొదటి స్థానం అన్న విషయం ఏ పత్రికా ఉట్టంకించదు. భారత ప్రజానీకంలో దాదాపు మూడోవంతు మంది ఇంకా మల విసర్జన కోసం బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిందే! కోట్లాది మహిళలు సిగ్గు విడిచి ఊరి బయటకు పోవాల్సిందే. ఇలాంటి అలవాటులో ఉన్న సభ్యత మాట అటుంచితే... డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి ఏటా లక్షలాది మరణాలకు కారణం అవుతోంది.   కాలం మారలేదు ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని సబ్సిడీలను అందించినా, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. పెళ్లిల్లు, పెదకర్మలు నిర్వహించేందుకు ఆర్భాటంగా లక్షలాది రూపాయలు ఖర్చుచేసే జనం ఇంటి ఆడపడుచులను నిస్సంకోచంగా వీధుల్లోకి పంపుతూనే ఉన్నారు. అందుకనే 2014లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు, బహిరంగ మల విసర్జనని సమూలంగా నిర్మూలించాలని నిశ్చయించింది ప్రభుత్వం.   అనుకోని స్పందన చత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో కోటబర్రి అనే గ్రామం ఉంది. మన దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లాగానే ఇది కూడా అభివృద్ధికి అందనంత దూరంలో ఉంది. ఆ గ్రామంలో ఉన్న దాదాపు 400 ఇళ్లలో 80 శాతం ఇళ్లలో మరుగుదొడ్లే లేవు. అలాంటి ఒక ఇల్లు కున్వర్‌బాయ్‌ యాదవ్‌ది. ఆమె టీవీ చూడదు, పేపర్‌ చదవదు... కానీ ఒకరోజు జిల్లా కలెక్టరు బడిలో ఉపన్యాసం ఇస్తుండగా ‘స్వచ్ఛభారత్‌’ అనే పదాన్ని విన్నది. కున్వర్‌బాయ్‌కి ఎందుకో ఆ పదం నచ్చింది. దాని వలన జరిగే మేలు నచ్చింది. అందులో భాగంగా ఇంట్లోనే మరుగుదొడ్డి నిర్మించుకోవాలి అన్న పిలుపు నచ్చింది. అయితే దాన్ని నిజం చేయడం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టింది!   మేకలు అమ్మి కున్వర్‌బాయ్‌కి ఉన్న ఆస్తల్లా చిన్న ఇల్లు, ఓ పాతిక మేకలు! భర్త ఎప్పుడో చనిపోయినా, చెట్టంత కొడుకులు మృత్యు ఒడి చేరుకున్నా కోడలితో కలిసి గుట్టుగా గడుపుకొస్తోంది కున్వర్‌బాయ్‌. మరి ఇప్పుడు ఇంట్లో మరుగుదొడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తనకి ఉన్న మేకలలో కొన్నింటిని అమ్మేసి ఓ 18 వేలు కూడబెట్టింది. రోజుకూలీకి వెళ్లే కోడలు తన వంతుగా ఓ నాలుగువేలు పోగుచేసింది వెరసి ఓ 22 వేలతో మరుగుదొడ్డి పూర్తయ్యింది.   జిల్లానే మారిపోయింది కున్వర్‌బాయ్‌ చేసిన ఈ పని ఒక వార్తలా మారింది. ‘అప్పటివరకూ మేం పేదవారం. మాకు సొంత మరుగుదొడ్డి కట్టుకునే స్తోమత ఎక్కడిది’ అనేవారందరి నోళ్లు మూతబడిపోయాయి. ఏడాది గడిచేసరికి కోటబర్రి గ్రామంలో ప్రతిఒక్కరూ మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. ఈ మార్పు కున్వర్‌బాయ్‌ ద్వారానే వచ్చిందని గ్రహించిన ప్రభుత్వం ఆమెను సత్కరించింది. అయితే కున్వర్‌బాయ్ ప్రభావం ఇక్కడితో ఆగలేదు. మోదీ ఆమెకు శిరసు వంచి నమస్కరించడం చూసిన ధామ్‌తరి జిల్లావాసులంతా ఆలోచనలో పడిపోయారు. కున్వర్‌బాయ్ చేసిన పని తామెందుకు చేయలేం అనుకున్నారు. ఫలితం! ఏడులక్షలకు పైగా జనాభా ఉన్న ధామ్‌తరి జిల్లాలో ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక మరుగుదొడ్డి ఉంది. చత్తీస్‌గఢ్‌ జిల్లాలో బహిరంగ మలవిసర్జన లేని తొలి జిల్లాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.   కున్వర్‌బాయ్‌ చేసిన పని కొందరికి చాలా సాధారణంగా తోచవచ్చు. ‘మరుగుదొడ్డి కోసం మేకలు అమ్మడం’ లాంటి వాక్యాలు నవ్వు తెప్పించవచ్చు. కానీ ఒక పని పూర్తిచేయాలన్న సంకల్పం ఉంటే, దానికి ఏదో ఒక తోవ కనిపిస్తుందనీ... ఆ తోవలో నడిచినవారు మిగతావారికంటే ముందుంటారనీ కున్వర్‌బాయ్‌ కథతో తేలిపోతోంది.     - నిర్జర.  

    క్షిపణి మహిళ - టెస్సీ థామస్‌     రక్షణ రంగం అంటేనే పురుషుల ఆధిపత్యానికి పట్టుగొమ్మ. అందులోనూ క్షిపణులని అభివృద్ధి చేసే విభాగంలో మహిళలు అడుగుపెట్టడమే అసాధ్యం అనుకుంటారంతా! కానీ అడుగు మోపడమే కాదు... తనతోపాటుగా దేశాన్ని కూడా నాలుగడుగులు ముందుకు నడిపించిందో మహిళ. క్షిపణి మహిళగా అంతర్జీతీయ ఖ్యాతినందుకుంది. ఆమే టెస్సీ థామస్‌!     కేరళలో మొదలు టెస్సీ 1963లో కేరళలోని అలెప్పీ అనే పట్టణంలో జన్మించారు. తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి (IFS). సాఫీగా సాగిపోయే జీవితం. టెస్సీ తనకి అందుబాటులో ఉన్న సదుపాయాలను పూర్తిగా వినియోగించుకున్నారు. చదువుల రాణిగా, బాడ్మింటన్‌ విజేతగా ఆమె ఎదురుపడిన మెట్లన్నింటినీ అనాయాసంగా ఎక్కేశారు. త్రిసూర్‌లో బీటెక్‌, పుణెలో ఎంటెక్ పూర్తిచేశారు. టెస్సీ కూడా తన తండ్రిలాగానే సివిల్‌ సర్వీసులో చేరుతుందని అందరూ ఆశించారు. కానీ ఆమెకి చిన్నప్పటి నుంచి అంతరిక్ష పరిశోధనలంటే మహా ఆసక్తిగా ఉండేది. అందుకే ఆమె ఎంటెక్‌లో ‘గైడెడ్‌ మిసైల్‌ టెక్నాలజీ’ పాఠ్యంశాన్ని ఎన్నుకొన్నారు. అదే ఆసక్తితో 1988లో భారతీయ రక్షణ పరిశోధనా సంస్థ అయిన DRDOలో శాస్త్రవేత్తగా కాలుమోపారు.     అగ్నిలో అడుగు టెస్సీ పనితీరుని గమనించిన అబ్దుల్‌ కలాం ఆమెను ‘అగ్ని’ క్షిపణులకి సంబంధించిన ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా భారతీయ క్షిపణిరంగంలోకి ప్రవేశించిన తొలి మహిళా శాస్త్రవేత్తగా టెస్సీ రికార్డు సాధించారు. అయితే టెస్సీ ఆ ప్రాజెక్టులో ఒక సాధారణ శాస్త్రవేత్తగా మిగిలిపోలేదు. ఆమె అగ్నిలో అడుగుపెట్టే సమయానికి ప్రాజెక్టు ముందు ఎన్నో సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. పైగా 2006లో ఎన్నో అంచనాలతో ప్రయోగించిన అగ్ని-III మిసైల్ వైఫల్యం చెందడంతో, మన రక్షణ రంగపు సామర్థ్యం మీద సందేహాలు తలెత్తాయి. కానీ పది నెలలు తిరగకుండానే అదే అగ్ని-III మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించగలిగారు శాస్త్రవేత్తలు.     మరింత ముందుకు అగ్ని-III విజయంలో టెస్సీ పాత్ర ముఖ్యమని గమనించడంతో, అగ్ని-IVకు ఆమెనే ప్రాజెక్టు డైరక్టరుగా నియమించింది ప్రభుత్వం. అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు, వాటిని వీలైనంతగా ఉపయోగించుకోవడమూ టెస్సీకి తెలుసు. అందుకే అగ్ని-IVనీ ఆ తరువాత అగ్ని-Vనీ విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతానికి అగ్ని క్షిపణి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఒక దివ్యాస్త్రం. ఖండాలను దాటుకుని అణ్వాయుధాలను మోసుకువెళ్లగల సామర్థ్యం అగ్ని సొంతం.     కుటుంబంలోనూ టెస్సీ పుణెలో చదివే రోజుల్లో తన తోటి విద్యార్థి సరోజ్‌కుమార్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరి మతాలూ వేర్వేరైనా కూడా అది వారి వివాహానికి కానీ దాంపత్యానికి కానీ అడ్డురాలేదు. సరోజ్‌కుమార్‌ భారతీయ నౌకాదళంలో ఉన్నతశ్రేణి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఆయన ఇంటికి దూరంగా ఉండటంతో వారి కొడుకు తేజస్‌ పూర్తి బాధ్యత కూడా టెస్సీ మీదే ఉండేది. ఒక పక్క ఒత్తిడితో కూడిన ఉద్యోగం, మరో పక్క తల్లిగా విస్మరించలేని బాధ్యత. ఈ రెండు పాత్రలనూ సమర్థవంతంగా నిర్వహించారు టెస్సీ. తేజస్‌ కూడా ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.   క్షిపణి రంగంలో టెస్సీ కృషికిగాను ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులూ దక్కాయి. లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అవార్డు, నాయుడమ్మ అవార్డు, గ్వాలియర్‌ ITM విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వంటి గుర్తింపులు చాలానే లభించాయి. కానీ టెస్సీ మాత్రం తన విజయాలతో పొంగిపోరు.  దేశానికి ఎంత చేసినా కూడా తక్కువేనన్నది ఆమె అభిప్రాయం. టెస్సీ తల్లిదండ్రులకి మదర్‌ థెరిసా అంటే చాలా ఇష్టం. ఆ కారణంగానే వారు ఆమెకు టెస్సీ అన్న పేరు పెట్టారు. టెస్సీ మదర్‌ థెరిసాలాగా పేదలకు సేవ చేసి ఉండకపోవచ్చు. కానీ దేశం గర్వించదగ్గ మనిషిగా మాత్రం తప్పకుండా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.     - నిర్జర.  

    Nail Polish Arts and Crafts     There is no limit to being Artistic and creating innovative crafts..one such is the increasing trend of Arts and Crafts with Nail Polish. Got an old Nail polish bottle of your favorite color or shade, dont worry that its past the expiry date..just use the color to paint a small souveneir for yourself or give a touch up to a cracked mural or even paint a small pebble for memoire. Just type the word 'Nail polish crafts' in the websearch and explore tons of ideas, HOW-TOs, DIY procedures to the biggest canvas paintings to the smallest stone painting using Nail Polish.     One fool proof purpose to keep a transparent top coat nail polish bottle even after its expiry date, at home, handy  in repair projects..it saves you a trip to the hardware store to buy a Varnish Can, at times, for petty projects. Those little nail polish bottles that serve only for 'a party or just two' purpose are best for craft projects like painting a DIY clay pendent or an ear hanging you made, those bottles are inexpensive and not much for wastage.     Easter Egg Hunt and you want an easy solution for coloring the eggs? Simply pour a few generous drops of polish in a bowl of water and dip the eggs..now to pull them out without smudging the color is your knack....or just dip half egg into the water,while holding the other half egg with hands tucked in gloves.   For a quick Gift idea, bring a plain coffee cup and follow the same idea..dip it bottom facing down in a bowl of water with nail polish drops...that swirly, wavy color pattern looks amazing on a white coffee mug. It may not be used to drink coffee or for use in a microwave nor fit for scrubbing while washing...these coffee mugs and cups are strictly for decoration, memorabilia or desk organisation.     With all these ideas flowing in...there may be one or two nail polish art or craft pieces in your home soon..but just make sure to cover your nose with a mask while using nail polish for longer and on large surfaces..and remember to arrange the craft items in a well ventilated space just to avoid inhaling the toxins emitting especially from an expired nail polish.       ..Prathyusha