గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..! భగవద్గీత.. మనిషి జీవితంలో కర్మను తప్పక అచరించమని, దాని తాలూకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్పే గ్రంథం. సత్కర్మల గురించి వివరించేది ఇదే.. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భయానికి, వ్యాకులతకు, పిరికితనానికి లోనైన అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనే భగవద్గీత అంటున్నారు. భగవద్గీత అనగా.. భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలు. భగవద్గీతలో 18 అధ్యాయములు ఉన్నాయి. ఈ 18 అధ్యాయములలో 18 యోగములు ఉన్నాయి. భగవద్గీతను వయసైపోయిన వారు చదవే పుస్తకం అనుకుంటారు చాలా మంది. కానీ మంచి నడవడిక కోసం చిన్న పిల్లల నుండి అందరూ చదవవచ్చు. ఉగ్గుపాలతో భగవద్గీత సారాన్ని నేర్పిస్తే పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణి మహిళలు కూడా భగవద్గీత ను చదవవచ్చు. దీని వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. స్త్రీలు గర్బధారణ సమయంలో తల్లి, బిడ్డల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా పనులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం దగ్గర నుండి చేసే పనుల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు బాధపడకూడదని, ఎమోషన్ కు గురవ్వకూడదని అంటారు. అందుకే.. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసం, వారి మనస్సు దృఢంగా ఉండటం కోసం సంగీతం వినడం, మానసికంగా ఆరోగ్యంగా ఉండే కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. వాటి జాబితాలో భగవద్గీత పఠనం కూడా ఒకటి. భగవద్గీత పఠనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక పుస్తకమే కాదు.. గొప్ప ఫిలాసఫి కూడా ఇందులో దాగుంది. ఇది మనిషి జీవితంలో లోతైన విషయాలు చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. మనిషిలో ఉండే బాధ, దుఃఖం, విచారం వంటి వాటిని సున్నితంగా మాయం చేస్తుంది. మనసు శాంతితో, స్థిరంగా ఉండటంలో సహాయపడుతుంది. గర్భవతులు ఈ పుస్తకాన్ని చదివితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గీత శ్లోకాలు చదవడం వల్ల తల్లి మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఇది శారీరక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు. ఉట్టి అల్లరి పిల్లవాడు పుట్టాడు.. లాంటి మాటలు ఎదురుకాకుండా ఎంతో గొప్ప ఆలోచనలు, అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉన్నవారిగా పిల్లలు ఎదుగుతారు. భగవద్గీతలో ధర్మం, కర్మ, యోగ, జ్ఞానం వంటి విషయాలు ఎంతో స్పష్టంగా బోధించారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే జీవితం చాలా మారిపోతుంది. ఇవి గర్భవతులు తెలుసుకోవడం వల్ల గర్భం మోసే దశ చాలా హాయిగా గడిచిపోతుంది. కడుపులో బిడ్డ కూడా ఎలాంటి వికారాలకు లోను కాకుండా, పాజిటివ్ ఆలోచనలతో పుడతారని చెబుతారు. గర్భధారణ సమయంలో మహిళలలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. ప్రతిరోజూ భగవద్గీత పఠించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉండగలుగుతారు. గీత శ్లోకాలు మానసిక ప్రశాంతతను, స్వీయ అంగీకార భావనను పెంపొందిస్తాయి. ఇవి జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించేలా చేస్తుంది. ఇది గర్భవతులకు చాలా అవసరం. గర్భంలో ఉన్న బిడ్డకు 7 వ నెల నుండి వినికిడి శక్తి వస్తుంది. ఆ సమయంలో భగవద్గీతను గట్టిగా చదవడం లేదా ఆ శ్లోకాల గురించి బిడ్డతో చర్చిస్తున్నట్టు, బిడ్డకు చెబుతున్నట్టు చేయడం వల్ల గర్బంలో పిల్లల మానసిక భావోద్వేగాలు చాలా నియంత్రణలో ఉంటాయి. *రూపశ్రీ.
సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.
మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.
Making of Gel & Crushed Candle (Diwali Special) Material required : * gel 1/2kg * gel liquid colors * Color Sand * candle thread * decorative items ( small sea shells , showpiece, mirrors,glitter,etc) Procedure : Place the color sand in layers in a glass, melt the gel in a pan at a normal temperature, add the desired gel liquid color to the gel, place the decorative items to the glass above the sand, pour melted the gel to the glass and place candle thread in middle of the glass. let it dry to settle down and then u can light the candle. Crushed Candle Material required : * Wax 1/2kg * wax colors ( or wax crayons) * candle thread * mould * grater * glass Procedure: Melt the wax in a bowl , add wax colors or crayons in diff parts for diff color combinations, place the candle thread in the mould, pour the melted wax in the mould and let it cool down completely for 1-2 hours. Unmould the candle and grate it . use the grated wax and place it in a glass in diff colors layers after placing the candle thread. now u can light the candle. --Khushboo Agarwal (Khushi Hobby Classes)
ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం పొడిబారితే..... అమ్మతనం గొప్ప వరం. మాతృత్వాన్ని పొందాలంటే ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోక తప్పదు. కొంత మంది నెల తప్పిన దగ్గరనుండి వికారం వాంతులతో బాధపడతారు, మరికొందరికి చర్మం పొడిబారినట్టుగా అయ్యి దురదలు మొదలవుతాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చర్మాన్ని గోక్కోకుండా ఉండలేరు. దాని ఫలితంగా వచ్చే రేషేస్ ఇంకా చికాకు తెప్పిస్తాయి. అసలీ ఇచ్చింగ్ ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తే, మాములుగా ఉన్నప్పటి కన్నా ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలో కొన్ని హార్మోనియల్ చేంజెస్ రావటం వల్ల ఇలా చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఇచ్చింగ్ వస్తుంది. అదీకాక చర్మం సాగుతూ ఉండటం వల్ల చర్మానికి తగినంత తేమ అందక దురదలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రయవసానమే కడుపు మీద చారలు ఏర్పడి అవి ఎప్పటికి అలానే ఉండిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు హాయిగా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించాలి. * ఎక్కువ మందికి కడుపు మీద లేదా మొహం మీద చర్మం పొడిగా అవుతుంది. చర్మం పొడిబారుతోంది అని అనిపించిన దగ్గర నుండి ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్లో కాసిని నీళ్ళు కలిపి దానిని కావాల్సిన చోట రాసుకుంటూ ఉంటే సరిపోతుంది. * అలాగే వెన్న కూడా ఈ సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇంట్లో వెన్న ఉన్నా లేదా పాల మీగడ ఉన్నా దానిని చర్మానికి రాసుకుంటే త్వరిత ఫలితం కనిపిస్తుంది. * రోజూ వాడే సబ్బులు కూడా చర్మం పొడిబారటానికి కారణం అవుతాయి. అందుకే కెమికల్స్ ఎక్కువగా ఉండే సబ్బులు వాడకుండా జాగ్రత్త పడాలి. సబ్బులకి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడటం మంచిది. దీనిని నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పొడి చర్మాన్ని పోగొట్టటానికి పెరుగు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడయితే చర్మం పొడిగా ఉందో అక్కడ పెరుగు రాసుకుని ఒక 10నిమిషాలు ఉంచి తరువాత కడిగేసుకుంటే చాలు. * ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళు కాకుండా కాస్త గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. * చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారయితే. రెండు కోడిగుడ్ల తెల్లసొనలో పావు కప్పు జొన్నపిండి, నాలుగు చెంచాల చక్కెరపొడి వేసి కలిపి రాసుకుని బాగా ఆరిన తరువాత కడిగేసుకుంటే చాలు. * స్నానం తర్వాత చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోండి. అందువల్ల చర్మం ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. అప్పుడు దురదలు కూడా రావు. * అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. మాములుగా ఉన్నప్పటికన్నా ప్రెగ్నేన్సీ తో ఉన్నప్పుడు నీళ్ళు మరిన్ని తాగాలి. అప్పుడు చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ పొడిబారే చర్మానికి కూడా ఇలా చాలా నివారణా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి పాటించి ఇంట్లోనే మన సమస్యని మనమే దూరం చేసుకుని హాయిగా ఉండచ్చు. ...కళ్యాణి
పనులు పెండింగ్ లో పడుతున్నాయా చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది. ..కళ్యాణి
ప్రత్యేకంగా కనపడండిలా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే దుస్తులతో పాటు యాక్ససరీస్ మీదా కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. అతి మామూలుగా డ్రస్ వేసుకున్నా నప్పే యాక్ససరీస్ ఉపయోగిస్తే ఎంతో అందగా కనిపిస్తారు. మరి ఆ యాక్ససరీస్ని ఎంచుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం. * హేండ్ బ్యాగులని మన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. కాస్త ఎత్తు తక్కువ ఉండేవారు పెద్ద బ్యాగుల జోలికి వెళ్లద్దు. అలాగే సన్నగా ఉన్నవారికి వెడల్పాటి బ్యాగులు కన్నాగుడ్రంగా ఉండే బ్యాగులే బాగా నప్పుతాయి. * మెడలో ధరించే నగల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తు తక్కువ ఉన్నప్పుడు, లేదా లావుగా ఉన్నప్పుడు మెడకు దగ్గరగా ఉండే నెక్లెసులు, చోకర్లు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉండే చైన్స్ అయితే బాగుంటాయి. అదే మెడ సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడకి దగ్గరగా ఉండే గొలుసులు వేసుకుంటే బావుంటుంది. * చెప్పులు ఎప్పుడూ మనం వేసుకున్న డ్రస్ ని డామినేట్ చేయకూడదు. వీలయితే మ్యాచింగ్ వేసుకోవచ్చు. లేదంటే బ్రౌన్, బ్లాక్ వంటి సాధారణ రంగుల్లో ఉంటే బాగుంటుంది. * ఆకర్షణీయమైన డ్రస్ వేసుకున్నప్పుడు చెవులకు కొంచం పెద్ద హేంగింగ్స్ పెట్టుకొని, మెడలో మాత్రం సింపుల్ చైన్ వేసుకుంటే బావుంటుంది. అదే డ్రస్ సింపుల్ గా ఉన్నప్పుడు గొలుసు కొంచం గ్రాండ్ గా ఉంటే బావుంటుంది. * చేతికి బంగారం గాజులు, మెడలో ముత్యాలు, ఇలా వైవిధ్యంగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి. యాక్ససరీస్ లో మీదైన ఓ శైలిని ఏర్పరచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఒకే రకమైన బ్యాగులు, నగలు, వంటివి మీదంటూ ఓ ముద్ర వేసేలా చేస్తాయి. మరి మీ స్టైల్ స్టేట్ మెంట్... ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. -రమ
మరకలు పోవాలంటే ఇలా... మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. తుప్పు మరకల బట్టలని తీగల మీద లేదా రాడ్స్ మీద ఆరేసేటప్పుడు ఒక్కోసారి తుప్పు అంటుకుని మరక పడుతుంది. ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ రసంతో,లేదా ఉప్పు కలిపిన నిమ్మరసంతో బాగా రుద్ది ఎండలో వేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు మరక మాయం అవుతుంది. నూనె మరకలు బట్టలపై పడే నూనె మరక అంత సులువుగా పోదు. అందుకనే నూనె పడిన వెంటనే ముందుగా పాత న్యూస్ పేపర్ ఆ మరకపై వేసి గట్టిగా వత్తాలి. తర్వాత వేడినీళ్ళు పోస్తూ సబ్బుతో రుద్దితే చాలు. కాఫీ కప్పులపై పడే మరకలు ఎంతో ఖరీదు పెట్టి కొనే కప్పులపైన మరకలు పడి అవి పోవాలంటే వెంటనే ఆ కప్పుని తడిపితే చాలు లేదా ఎండిపోయిన మరక పోవాలంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడిస్తే ఇట్టే పోతాయి. పెయింట్ మరకలు బట్టలపై పెయింట్ మరక పడితే ఆ మరకపై బ్లాటింగ్ పేపర్ వేసి దానిపై ఇస్త్రీ చెయ్యాలి. ఆ వేడికి మరక కరిగి బ్లాటింగ్ పేపర్ కి అంటుకుంటుంది. ఆ తర్వాత మరక మీద కొంచం టాల్కం పౌడర్ చల్లి కాసేపు వెయిట్ చేసి ఆ పేపర్ ని దులిపితే పౌడర్ తో పాటే మరక కూడా వదిలిపోతుంది. బాల్ పెన్ ఇంకు మరకలు పిల్లల స్కూల్ యూనిఫారం కి తరచూ బాల్ పెన్ మరకలు మనం చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని,బ్రాంది లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దితే ఆ మరకలు పోతాయి. పట్టుచీరలపై మరకలు ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కునే పట్టుచీరల మీద మరక పడితే బాదెందుకు? వెంటనే పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది. డ్రై క్లీనింగ్ కి కూడా ఇవ్వక్కర్లెద్దు. చూసారా! ఇన్ని తరుణోపాయాలు మన ముందే ఉంటే మరకను చూస్తే టెన్షన్ అవసరమంటారా? ----కళ్యాణి
ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి! దేవీ నవరాత్రుల వెనుక కేవలం అమ్మవారి ఆరాధన మాత్రమే కాదు.. అమ్మవారి నవదుర్గ రూపాలతో ఆడపిల్లల జీవితానికి చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా అమ్మవారి తొమ్మిది రూపాలు ఆడపిల్లల జీవితాన్ని వ్యక్తం చేస్తాయి. శైలపుత్రి.. ఆడపిల్ల మొదటి రూపం. ఆడపిల్ల పుట్టినప్పుడు శైలపుత్రి అంటారు. ఈ దశలో తల్లిదండ్రులు ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకుంటారు. బ్రహ్మచారిణి.. ఆడపిల్ల జీవితంలో రెండవ దశను ఈ రూపం సూచిస్తుంది. ఈ దశ ఆడపిల్ల బాల్యం నుండి యుక్తవయస్సుకు మారడాన్ని సూచిస్తుంది. చంద్రఘంట.. వివాహం వయసుకు వచ్చిన ఆడపిల్లను చంద్రఘంట దేవి తో పోలుస్తారు. వివాహం తర్వాత ఈ రూపాన్ని తీసుకుంటుంది. కూష్మాండ.. ఆడపిల్లలు వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తన కుటుంబంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పెంచుతూ వెలుగును పంచుతుంది. స్కందమాత.. వివాహం అనంతరం ఒక ఆడపిల్ల స్వయంగా తల్లి అయినప్పుడు ఆమెను స్కందమాతకు ప్రతిరూపంగా పూజిస్తారు. కాత్యాయని.. ఆడపిల్ల కుటుంబాన్ని రక్షించడానికి, ప్రతికూలత నుండి విముక్తి చేయడానికి శ్రమించడం కాత్యాయని అమ్మ రూపంలో స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది. కాళరాత్రి.. మహిళల జీవితంలో ఇబ్బందులు, ప్రతికూల శక్తులను దైర్యంగా ఎదుర్కోవడం, వాటిని నాశనం చేయడంలో కాళరాత్రి రూపాన్ని దర్శించవచ్చు. మహాగౌరి.. జీవితం చివరి దశలో స్వచ్ఛత, త్యాగానికి ప్రతీకగా మహాగౌరి గోచరిస్తుంది. సిద్ధిదాత్రి.. ఆడపిల్ల జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు ముక్తిని పొందే రూపం సిద్ధిదాత్రి.
ఏ దేశమేగినా తప్పని వేధింపులు ఆడది అర్ధరాత్రి నిర్భయంగా సంచరించడం గురించి గాంధీగారు చెప్పిన మాటలు సరేసరి... కనీసం పట్టపగలు ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయా అని అనుమానం కలిగే స్థితిలో ఉన్నాం. ఒళ్లు గగుర్పొడిచే అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా, అలాంటి ఘటనలు ఇక మీదట జరగవంటూ ప్రభుత్వాలు భరోసాను అందిస్తున్నా... పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు బ్రిటన్‌కు చెందిన ‘యాక్షన్ ఎయిడ్’ అనే సంస్థ ఓ పరిశోదనను నిర్వహించింది. బ్రిటన్, ధాయ్‌లాండ్, బ్రెజిల్, ఇండియా... ఈ నాలుగు దేశాలలోనూ యాక్షన్ ఎయిడ్ కొన్ని గణాంకాలను సేకరించింది. సంపన్న దేశాలు మొదల్కొని, పేదరికపు అంచున ఉన్న ప్రాంతాల వరకూ స్త్రీలను వేధించడంలో ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదని ఈ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ నాలుగు దేశాలలోనూ నలుగురిలో ముగ్గురు ఆడవారు ఏదో ఒకరకమైన లైంగిక వేధింపుని ఎదుర్కొంటున్నారని తేలింది. దీంతో ఆడవారిని వేధించడం అనేది ఒక అంటువ్యాధిలా మారిపోయిందని యాక్షన్ ఎయిడ్ హెచ్చరిస్తోంది. అసభ్యమైన పదాలు వాడటం, ఈలలు వేయడం, ఇబ్బంది కలిగించేలా చూడటం... ఇలా ఏదో ఒక తీరున ఆడవారిని వేధించడం మామూలైపోయింది. ఇరుకు సందుల దగ్గర్నుంచీ ప్రభుత్వ రవాణాల వరకూ... స్త్రీలు నడిచే ప్రతిదారిలోనూ వారికి వేధింపులు తప్పడం లేదని ఈ పరిశోధనలో తేలింది. ఇక అత్యాచారాల సంగతీ సరేసరి. హైస్కూలు కూడా దాటక ముందే బ్రెజిల్‌లో 22 శాతం మంది బాలికలు అత్యాచారానికి లోనవుతున్నారట. కాస్త మంచి బట్టలు వేసుకుని బయటకు రావడానికి కూడా భయపడుతున్నామని అక్కడి అమ్మాయిలు వాపోతున్నారట. అలాగని పోనీ ముసలివారన్నా కామాంధుల కంటపడకుండా ఉన్నారా అంటే అదీ లేదు. ధాయ్‌లాండ్‌లో సేకరించిన లెక్కల ప్రకారం 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో కనీసం 20 శాతం మంది ఆడవారు అత్యాచారానికి లోనైనట్లు తేలింది. నగరజీవితంలో పొంచి ఉన్న వేధింపుల గురించి ప్రచారం చేసేందుకు గత ఏడాది నుంచి మే 20ని ‘Safe Cities for Women Day’గా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వేధింపులు తగ్గాలంటే ఎలాంటి మార్పులు రావాలి అన్నదే అసలు ప్రశ్న! మగవారి ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు ఎలాగూ రావాలి. అదే సమయంలో ఆకతాయిల ఆటలు చెల్లకుండా ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి యాక్షన్ ఎయిడ్ వంటి సంస్థలు. వీధుల్లో సరైన విద్యుత్ వెలుగులు లేకపోవడం, పోలీస్ పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, ప్రభుత్వ రవాణాలో సైతం తగిన రక్షణ లేకపోవడం, ఆకతాయిలను చూసీచూడనట్లు వదిలేయడం... ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే అంటున్నారు. నగర జీవనంలో మగవారితో సమానంగా పరుగులెత్తుతున్న ఆడవారు, తమ కష్టానికి ఫలితంగా వేధింపులను ఎదుర్కోవడం ఎంత దురదృష్టమో కదా! మరి అలాంటి దుస్థితి మీద ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ దృష్టిని సారిస్తాయేమో చూడాలి. - నిర్జర.
చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయిర్రా నాకు అన్నట్టుగా నాగ మణికంఠ భావిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి మణికంఠ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు. అయితే టాస్క్ లో క్లియర్ గా సంఛాలక్ గా చేసే మణికంఠ.. కాస్త వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు. అదే విషయాన్ని చెప్తూ గంగవ్వ ఓ ఆట ఆడుకుంది. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. ఆరు పదుల వయస్సులో సెలబ్రిటీగా మారిన గంగవ్వకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన కల నెరవేర్చుకుంది. అయితే ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు స్టేజ్ మీదే వెల్లడించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ, మెహబూబ్, మణికంఠ, టేస్టీ తేజ గార్టెన్ ఏరియాలో ఉన్నారు. ఇక గంగవ్వ తన మాటలతో , పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఓ పిలగా.. నా భార్య కావాలి.. నా పాప కావాలని ఏడ్చింది నువ్వే నాకు తెలుసు అని గంగవ్వ అనగానే.. అవును కావాలని మణికంఠ అంటాడు. అయితే నామినేషన్ వేస్తా వెళ్ళని అనగానే.. మరి పైసల్ కావాలి కదా.. హౌస్ లోకి వచ్చింది పైసల కోసం కాదా అని గంగవ్వ అంది. అయిన గట్ల ఏడుస్తున్నాడేంది ఈ మగ బాయ్ అని అనుకున్నానంటూ గంగవ్వ అనగానే.. టేస్టీ తేజ, మెహబూబ్ నవ్వుకున్నారు. ఇక అంతకముందు నబీల్, నిఖిల్, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ అందరు గార్డెన్ ఏరియా దగ్గరలోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటన్నారు. కాస్త ఆ పాలు ఇస్తే మేం ఛాయ్ చేసుకుంటామని గంగవ్వ అనగానే.. మిల్క్ లగ్జరీ అని నబీల్ అన్నాడు. మరి అలా చెప్తే మేం పాల ప్యాకెట్లు తెచ్చుకునేవాళ్ళం కదా అని గంగవ్వ అంది. అయిన మా సీజన్ లో ఫుల్ పాలు.. పెద్దదాన్ని కదా నాకు ఇవ్వమని గంగవ్వ అనగానే.. నేను కూడా పెద్దదాన్నే అని అక్కడే ఉన్న రోహిణి అనగానే.. నీకెంత మంది పిల్లలు అని గంగవ్వ అంది. ఇక రోహిణితో పాటు అక్కడివారంతా ఫల్లుమని నవ్వేశారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు గడియారంలో ముల్లుతో సమానంగా పరుగులు పెట్టే మహిళలతో కాస్త మీ గురించి మీరు పట్టించుకోండని ఎవరైనా చెబితే, ఆ చెప్పినవాళ్ళ మీద బోలెడంత కోపం వస్తుంది. ఉరుకులు, పరుగులు పెడుతూ, అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ అన్ని పనులు సమర్థవంతంగా చేయాలనీ, అందరినీ తృప్తిపరచాలనీ హైరానా పడిపోతూ, ఈ హైరానాలో మనకోసం మనం ఆలోచించుకునే తీరిక, కోరిక కూడా వుండదు. కానీ మనకోసం మనం శ్రద్ధ చూపకపోతే ఎలా? అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యం చురుకుదనాన్ని అందిస్తుంది. సో... అందంగా, ఆరోగ్యంగా వుంటే ఆత్మవిశ్వాసం నిండుగా, మెండుగా వుండి, అది మన ప్రవర్తన తీరులో బయటపడుతుంది. అందుకు పెద్దగా సమయం కూడా అక్కర్లేదు. రోజు మొత్తంలో మన రొటీన్‌కి చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది. * మొట్టమొదటగా తప్పనిసరిగా చేయాల్సింది... ఉదయం నిద్ర లేస్తూనే హడావిడిగా మంచం దిగి పని ప్రారంభించకుండా ఓ 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఎక్సర్‌సైజులు వంటివి చేయడానికి టైమ్ వుంటే సరే, లేకపోతే కనీసం శ్వాస ప్రక్రియ పైన దృష్టి పెట్టినా చాలు. ఇక మరో ముఖ్య విషయం... పరగడుపునే రెండు మూడు గ్లాసుల నీటిని తాగడం ద్వారా శరీరం మరింత కాంతిని సంతరించుకుంటుంది. అలాగే రోజులో వీలు చిక్కినప్పుడల్లా మంచి నీటిని తాగటానికి ప్రయత్నించండి. ఇది పెద్ద విషయమా అనుకోకండి. రోజు మొత్తంలో ఎంత మంచినీరు తాగుతున్నారో ఒక్కసారి గమనించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే అందానికి, ఆరోగ్యానికి కూడా మంచింది. * చాలామంది బ్యూటీ పార్లర్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంతమాత్రాన మనపై మనం శ్రద్ధ పెట్టకుండా ఉంటే ఎలా? చిన్న చిన్నవే... ఉదాహరణకి స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆయిల్ వేసుకోవడం, మంచి బాడీ లోషన్ అప్లయ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే చాలు... వయసు ప్రభావం కనిపించకుండా చూసుకోవచ్చు. మరో విషయం... ఎండలోకి వెళ్ళేముందు నన్‌స్క్రీన్ లోషన్ వంటివి అప్లయ్ చేసుకోవడం, చలువ అద్దాలు వాడటం వంటివి చాలా చిన్న విషయాలే. కానీ, చాలామంది శ్రద్ధ పెట్టని విషయాలు కూడా. * సాధారణంగా బయటి నుంచి ఇంట్లోకి అడుగు పెడుతూనే చేయాల్సిన పనులని తలుచుకుంటూ పనిలో పడతాం. కానీ, ఇంటికి రాగానే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుని, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. బయట పొల్యూషన్ ప్రభావం మన ముఖంపైనుంచి పోవడానికి. ఇక వారానికి ఒక్కసారైనా ఒక చెంచా తేనెలో కొంచెం వెనిగర్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగి చూసుకోండి. అట్టే సమయం పట్టదు సరికదా, మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇక ఆడవారిలో ఒత్తిడిని, వయసుని బయటపెట్టేవి కళ్ళకింద నల్లటి చారలు. రోజూ పడుకునే ముందు రెండు కీరా ముక్కల్ని కళ్ళపై పెట్టుకునే అలవాటు చేసుకుంటే చాలు నల్లటి వలయాలు కొన్నాళ్ళలో మాయమవటానికి. * రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేశాక నిద్రకి ఉపక్రమించే ముందు మీకోసం మీరు ఓ 5 నిమిషాలు ఇచ్చుకోగలిగితే చాలు. గోరువెచ్చని నీటిలో పాదాలని ఉంచి, మీకు ఇష్టమైన పుస్తకాన్ని తిరగేయండి. రోజంతటి శ్రమని మర్చిపోవచ్చు. ఇక ఆఖరిది, ముఖ్యమైనది... తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఏ ఫేస్‌ప్యాక్‌లూ, మేకప్‌లూ అది ఇచ్చే ఆరోగ్యాన్ని, అందాన్ని అందించలేవు నిజానికి. ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ చాలా చిన్న చిన్నవే. కానీ, మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టనివి కూడా. ఈ చిన్న జాగ్రత్తలతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రోజూ చేయగలిగితే అలవాటుగా కూడా మారుతుంది.. ఏమంటారు? -రమ
వాటర్ బాటిల్స్ తో కలర్ ఫుల్ లైట్స్ మనం వాడేసిన వాటర్ బాటేల్స్ డస్ట్ బిన్ లో పడేయకుండా అందమైన కలర్ ఫుల్ లైట్స్ ఎలా చేసుకోవాలో క్రింద ఇచ్చిన 6 స్టెప్స్ తో చూపించాం.. కావలసినవి : వాటర్ బాటేల్స్ అక్రోలిక్ పైంట్స్ కత్తెర సిరియల్ లైట్స్ · 1. కాళీ వాటర్ బాటేల్స్ తీసుకుని మూత తీయకుండా ఫోటోలో చూపించినట్టు కొంత పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. 2. ఆ కట్ చేసుకున్న పార్ట్ ని నిలువుగా ఫ్లవర్ కి ఎన్ని పెటెల్స్ కావాలో అన్నింటిని సమానంగా కోలుచుకుని కత్తెరతో కట్ చేసుకోవాలి. 3. అలా కట్ చేసుకున్న పార్ట్స్ ని వెనక్కి బెండ్ చేసుకోవాలి. ఫోటో లో చూపించినట్టుగా అన్ని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు అది చూడడానికి ఫ్లవర్ లా వుంటుంది. 4. ఇలా కట్ చేసుకున్న వాటికి మనకు నచ్చిన కలర్ వేసుకోవాలి. ఏ కలర్ అయితే మనం వేస్తామో అదే కలర్ మనం లైట్ వేసినపుడు వెలిగుతుంది. పెటల్స్ కి కలర్ వేసిన తరువాత రెండు గంటలు డ్రై అవ్వనివ్వాలి. 5. ఇప్పుడు వాటికున్న బాటిల్ మూతకూ రంధ్రం చేసి లైట్స్ ని మూతలో సెట్ చేసుకోవాలి. 6. ఇప్పుడు సిరియల్ లైట్స్ ని మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకుని పండగలకి,పార్టీలకి డెకరేట్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేస్తారు గా మరీ
బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా ‘నేను పుష్టిగా భోజనం చేసినా మా బాబుకి పాలు సరిపోవట్లేదు’ అని కొత్తగా తల్లయిన వాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. అన్నం ఎక్కువగా తినేస్తే పాలు సమృద్దిగా పడతాయి అనుకోవటం పొరపాటే. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు ఇక ఏ దిగులు ఉండదు. మెంతులు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం. బాలింతకు ఎక్కువగా మెంతిపొడి, మెంతికూర మొదలైనవి పెట్టాలి. నార్త్ ఇండియన్స్ అయితే మెంతులతో చేసిన హల్వా తినిపిస్తూ ఉంటారు. మెంతులను నేతిలో వేయించి, పోసి చేసి వంతులు గోధుమ పిండిని కలిపి వాటిలో పంచదారపొడి వేసి హల్వా లా తయారు చేస్తారు. సోంఫు కూడా బాలింతలకు మంచిది. పాలు తాగే పిల్లలకి కడుపులో నొప్పి లేదా గ్యాస్ కు సంబందించిన సమస్యలు దీని వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. తల్లి ఈ సోంఫుని ఎంత తింటే పిల్లలకి అంత మంచిది. దీనిని పొడిగా చేసుకుని కూరల్లో తినచ్చు లేదా నీళ్ళల్లో వేసి కాచుకుని కషాయంలా కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకే కాదు పాలకు మంచి రుచిని కూడా తెచ్చిపెడుతుందని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. వెల్లుల్లి తిన్న తల్లుల పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగారట. ఈ వెల్లుల్లిని బాలింత తినే అన్ని వంటకాల్లో కలుపుకోవచ్చు. అలాగే వాము కూడా పాలు పడటంలో ఎక్కువ సహాయం చేస్తుంది. వాము పొడిలో కాని కషాయంలో కాని తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.యుటరస్ కి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా అది కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనడి బొప్పాయి పండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దీన్ని అస్సలు తినకూడదని చెప్తారు అదే పండు డెలివరీ అయ్యాకా మాత్రం ఎక్కువగా తినాలి. ఇందులో తగినన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటమే కాకుండా పాలు సమృద్దిగా తయారుకావటానికి దోహదం చేస్తాయి. బాలింతలు దీన్ని ఎంత తింటే అంత మంచిది. ఓట్స్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా విటమిన్ బి ఎక్కువగా ఉండటంవల్ల దీనిని తీసుకుంటే డిప్రెషన్ కూడా తగ్గుతుందిట. కొత్తగా తల్లి అయిన వాళ్ళలో తెలియని భయం ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ ఓట్స్ తినటం వల్ల పోతాయని తేల్చి చెప్పాయి కొన్ని అధ్యయనాలు. వీటితో పాటు బ్రెడ్ తింటే కూడా మంచిది. తల్లులు తీసుకునే ఆహారంలోనే ఏది పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో తెలుసుకుని తీసుకుంటే చాలు, పిల్లలకి పోత పాలు పట్టాల్సిన పని ఉండదు. ..కళ్యాణి
ఇంట్లోనే బుల్లి బొజ్జగణపతి వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఓ బుల్లి వినాయకుడు ఉండాల్సిందే. ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి మనం ఇంట్లో పెట్టుకునే వినాయకుడిని బయట కెమికల్స్ వేసి తయారు చేసే వినాయకుడిని పెట్టుకోవడం కన్నా మట్టితో చేసే వినాయకుడిని పెట్టుకుంటే ఎంతో మంచిది. ఈ బుల్లి వినాయకుడిని మన ఇంట్లో ఉండే పిల్లలతోనే తయారు చేయిస్తే వారు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరి తయారుచేయడం ఏలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతోంది.
తొడల కొవ్వు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా.. ఈ అయిదు టిప్స్ ఫాలో అయిపోండి! శరీర సౌష్టవం బాగుంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది. శరీర సౌష్టవం సరిగా లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. బాడీ షేమింగ్ పట్టించుకోనక్కర్లేదు.. అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు శరీర సౌష్టవం దెబ్బతింటే దాన్నలాగే ఎందుకు వదిలేయాలి. నిజానికి శరీరాకృతి మారిపోయిన శరీరంలో ఏదో ఒక అసౌకర్యం, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటాయి. అందుకే శరీరాన్ని చక్కని రూపానికి తెచ్చుకోవడం మంచిది. మహిళలలో ఎక్కువగా తుంటి భాగంలో కొవ్వు పేరుకుని పోతుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి కష్టపడుతుంటారు. అయితే తుంటి కొవ్వు తగ్గించుకోవడానికి ఐదెంటే ఐదే టిప్స్ ఫాలో అయితే చాలు.. లోయర్ బాడీ వ్యాయామాలు.. తుంటి కొవ్వు తగ్గాలంటే లోయర్ బాడీ అంటే దిగువ శరీరం వ్యాయామాలు ఫాలో కావాలి. హిప్స్, గ్లుట్ లను చక్కని ఆకృతిలోకి తీసుకురావడానికి లంగ్స్, స్క్వాట్ ల, లెగ్ రైజ్ లు వంటి దిగువ శరీర వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. కౌంట్ పెంచాలి.. వ్యాయామంలో భాగంగా చాలామంది నడవడం, జాగింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం మొదలైనవి ఫాలో అవుతారు. వీటిని సాధారణంగా చేయడం కంటే మరికాస్త ఎక్కువ సమయం పొడిగించి చేయాలి. ఇవి హిప్ కండరాలను బిగించి చక్కని ఆకృతి రావడంలో సహాయపడతాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు అదనపు కేలరీలు వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఈ ఫుడ్ కు దూరం.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అసంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలు ఉంటాయి. ఇవి తుంటి భాగంలో పేరుకుని పోతాయి. వీటని తింటూ ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం శూన్యం. వీటికి బదులుగా బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పైబర్ ఆహారానికి పెద్ద పీట వేయాలి. నీరు.. నీరు శరీరానికి ఇంధనం వంటిది. ప్రతిరోజూ శరీరానికి తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్ లు బయటకు పోతాయి. శరీరంలో అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిద్ర.. శరీరంలో కణాల మరమ్మత్తు జరగడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. శరీరంలో పేరుకున్న కొవ్వు కోల్పోవడానికి నిద్ర ప్రముఖ పాత్ర వహిస్తుంది. నిద్ర శరీరానికి ఊరటనిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి శరీరం చురుగ్గా ఉంటుంది. *నిశ్శబ్ద
మహిళలలో వెజినల్ యాక్నే ఎందుకొస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే! చాలామంది మహిళలు బయటకు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడే అంశం ప్రైవేట్ పార్ట్స్ గురించి. ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉన్నా, ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చాలావరకు మౌనంగా భరించడానికే మొగ్గుచూపుతారు. సాధారణంగా చాలామంది మహిళలలో యోనికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో యోని ప్రాంతంలో మొటిమల్లాంటివి రావడం కూడా ఒకటి. అసలు యోని ప్రాంతంలో ఇలా యాక్నే లేదా మొటిమలు ఎందుకొస్తాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? తెలుసుకుంటే.. వెజినల్ యాక్నే కు కారణాలు.. యోని ప్రాంతంలో కూడా సహంజంగానే వెంట్రుకల పెరుగుదల ఉంటుంది. ఈ వెంట్రుకల కుదుళ్లు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియా తో నిండినప్పుడు సాధారణంగా ముఖం మీద వచ్చే ఎరుపు, వాపును పోలిన మొటిమల్లాంటి గడ్డలు వస్తాయి. ప్రైవేట్ పార్స్ట్ లో గాలి చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అధిక తేమ కారణంగా ఆ ప్రాంతంలో వచ్చే మొటిమలు కూడా అంత తొందరగా తగ్గవు. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంటువ్యాధులు, వాపులు మొదలైన సమస్యలకు కారణం అవుతాయి. దీనికి మరొక కారణం. ఆ ప్రాంతంలో చెమట గ్రంధుల నుండి అధికంగా చెమట విడుదల కావడం. ఆ ప్రాంతంలో అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి వ్యాక్సింగ్, షేవింగ్ వంటి ప్రక్రియలు ఎక్కువగా చేయడం కూడా దీనికి కారణం అవుతుంది. ట్రీట్మెంట్ ఏంటంటే.. వెజినల్ ప్రాంతంలో మొటిమలు రావడం అనేది అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎక్కువ శాతం మంది ఈ సమస్య వచ్చినా బయటకు చెప్పుకోలేరు. కొన్ని రోజుల్లో అవే తగ్గిపోతాయని అనుకుంటూ వాటిని అలాగే భరిస్తారు. అయితే ఇవి తగ్గించుకోవడానికి, ఇకమీదట రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. యోని ప్రాంతంలో తగినంత గాలి ఆడేలా కాస్త వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. బిగుతుగా ఉన్నవాటిని నివారించాలి. కాటన్ దుస్తులు అయితే మంచిది. ఆ ప్రాంతంలో ఎక్కువ తేమ ఉండకుండా జాగ్రత్త పడాలి. మొటిమలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకునే క్రమంలో సున్నితంగా వ్యవహరించాలి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు, మొటిమల నొప్పి నివారణకు వెచ్చని కంప్రెసర్ లు ఉపయోగించవచ్చు. ఈ మొటిమల ప్రభావం చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే మాత్రం చర్మ సంబంధ నిపుణులను కలవడం మంచిది. ఇక అమ్మాయిలు ఆ ప్రాంతంలో అవాంచిత రోమాల తొలగించుకోవడానికి సేఫ్టీ పద్దతులు ఫాలో అవ్వాలి. ఆహారం విషయంలోనూ, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొటిమలు వచ్చినప్పుడు అతి జాగ్రత్తతో మొటిమలను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. శరీరంలో వేడి పెరగడం వల్ల కూడా ఆ ప్రాంతంలో మొటిమలు వస్తుంటాయి. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత లేకుండా జాగ్రత్త పడాలి. *నిశ్శబ్ద.
స్త్రీలు తెలుసుకోవలసిన జనన నియంత్రణ మార్గాలు..! సెక్స్, అబార్షన్, గర్భనిరోధకం, ఈ మూడు అంశాలు నేటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. గర్భాన్ని నిరోధించడానికి గర్భనిరోధకాలు వాడతారన్నది నిజం. కానీ వాటి ఉపయోగం ఒకే ప్రయోజనానికి పరిమితం కాదు. వారి స్వంత ప్రాణశక్తి ప్రకారం అనుసరించడానికి ఏ మార్గం అనుకూలంగా ఉంటుంది? లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను ఎలా నివారించాలి? వాటిని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా? అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి?సురక్షితమైన సెక్స్ కోసం గర్భనిరోధక పద్ధతులను ఎంచుకునే ముందు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. బాహ్య కండోమ్: కండోమ్ అంటే సాధారణంగా బాహ్య కండోమ్ అని అర్థం. ఇది మగ జననేంద్రియాల పైన అమర్చబడుతుంది. ఈ కండోమ్ రబ్బరుతో తయారు చేయబడింది. వీటి వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గర్భధారణను నివారించడమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా నిరోధిస్తాయి. వీటి వల్ల అలర్జీలు రావచ్చు. అంతర్గత కండోమ్: ఇది మహిళల కోసం తయారు చేయబడింది. చాలా బాహ్య కండోమ్‌లు రబ్బరు పాలుతో తయారు చేస్తారు. అంతర్గత కండోమ్‌లలో రబ్బరు పాలు ఉండవు. వీటిని మహిళలు తమ ప్రైవేట్ పార్ట్‌లలో ధరిస్తారు. కాపర్టీ: IUD అనేది స్వచ్ఛమైన రాగి లోహంతో తయారు చేయబడిన పరికరం. దీనికి ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇది గర్భాశయం లోపల అమర్చబడుతుంది. ఈ సాధనం నైలాన్ థ్రెడ్‌ను కలిగి ఉంది. ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే 10 సంవత్సరాల వరకు సరిగ్గా పని చేస్తుంది. ఇవి 99% గర్భాన్ని నివారిస్తాయి. గర్భనిరోధక మాత్ర: ఇవి అత్యంత ప్రాచుర్యం పొందిన జనన నియంత్రణ పద్ధతుల్లో ఒకటి. ఇది రోజుకు ఒకసారి తీసుకోవలసిన చిన్న మాత్ర. ఈ మాత్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ మాత్రను సమయానికి తినడం మర్చిపోకుండా తీసుకోవడం చాలా అవసరం. చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది సెక్స్ చర్యతో జోక్యం చేసుకోదు. ఈ మాత్రను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలి. అందువల్ల, వైద్యుడిని చూడటం చాలా అవసరం.ఇవి సురక్షితమైనవి అయినప్పటికీ, దుష్ప్రభావాలు కలిగిస్తాయి.
కాబోయే భర్తతో అమ్మాయిలు తప్పక మాట్లాడాల్సిన విషయాలివి! పెళ్లిళ్లు.. నిశ్చితార్థాల సందడి మొదలైపోయింది. పెళ్లిళ్లు అంటే ఇక ఎలాగూ పెద్దవాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతాయి. కానీ ముడిపడిన తరువాత జీవితాన్ని డీల్ చేసుకోవాల్సింది అమ్మాయి, అబ్బాయే.. అయితే పెళ్లి తరువాత ఇలా జరగాల్సింది, ఇలా జరుగుతుందని అనుకున్నాను, ఇలా ఉండాల్సింది కానీ అలా లేదు, అంతా నీ ఇష్టమేనా?? నాకు విలువ లేదు, నువ్వు చెప్పినట్టే వినాలా?? బాద్యతలన్నీ ఒక్కరే మోయాలా?? నేను విసిగిపోయాను.. నీతో వేగలేను.. లాంటి మాటలతో ఒకరినొకరు బాధపెట్టుకుని బంధాన్ని తెంచుకునే వరకు వెళతారు చాలామంది. మరీ ముఖ్యంగా పెళ్లి తరువాత అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. బాధ్యతల దగ్గర నుండి కెరీర్ వరకు ఎన్నో విషయాలు కాబోయే జీవితభాగస్వామితో చర్చించడం ఎంతో అవసరం. చాలా వరకు విషయాలను లైఫ్ పార్టనర్ తోనే చెప్పగలరు. కాబట్టి అమ్మాయిలు కాబోయే భర్తతో ఈ కింది విషయాలను తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. నిశ్చితార్థం, పెళ్లికి మధ్య సమయంలో భాగస్వామితో మాట్లాడటం ద్వారా వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెళ్లి తర్వాత ఒకరినొకరు నిందించుకోకుండా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే బాధ్యతల గురించి మాట్లాడాలి.. నిశ్చితార్థం తర్వాత, భాగస్వామితో కుటుంబం మరియు సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాలి. భవిష్యత్తులో ఎవరు ఏ బాధ్యతను నిర్వర్తించాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. పెళ్లి తర్వాత ఇది చాలా సులభం అవుతుంది. ఈ విషయం మాట్లాకపోతే పెళ్లి తరువాత ఒకరిమీధ ఒకరు నిందలేసుకునేదాకా సమస్య వెళుతుంది. అడ్జెస్మెంట్ గూర్చి మాట్లాడకపోతే అట్టర్ ప్లాప్ అవుతారు.. పెళ్లికి ముందు అడ్జస్ట్‌మెంట్ గురించి మాట్లాడాలి . మీ సమస్యలతో పాటు, మీ భాగస్వామికి మీ మనసును విప్పి చెప్పాలి. ఇష్టాఇష్టాలు, ఇష్టం లేని విషయాలు మాట్లాడటం చాలా ముఖ్యం. అవతలి వారి ఇష్టాలు తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. కెరీర్ చాలా ముఖ్యం.. ఈ అంశం అమ్మాయిలకు చాలా ముఖ్యమైనది. అసలే నేటికీ చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు చేయడం లేదు. అబ్బాయిలు కూడా మొదట ఒకే చెప్పి ఆ తరువాత వొద్దు నాటారు. దానివల్ల చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఇలా జరగకూడదు అంటే ముందుగానే కెరీర్ గురించి ఫైనల్ చేయాలి. ఉద్యోగం గురించి, ఆర్థిక అవసరాల గురించి ధైర్యంగా చెప్పాలి. కుటుంబ నియంత్రణ.. పెళ్లయిన కొద్ది రోజుల వరకు పిల్లలు వొద్దని ప్రఝీ జంట అనుకుంటారు. కానీ పెద్దలు మాత్రం పెళ్లయ్యక అమ్మాయి ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ విషయం గురించి గురించి కాబోయే భార్యాభర్తలు ముందుగానే మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు, వారికి మంచి కెరీర్ ఇవ్వవడానికి ఆర్థిక భరోసా ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది. తల్లిదండ్రుల బాధ్యత నేటి కాలంలో అమ్మాయిలు కూడా వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ భాగస్వామితో ముందుగానే దాని గురించి మాట్లాడాలి. తద్వారా తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే అమ్మాయిలకు తమ తల్లిందండ్రుల విషయంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ◆నిశ్శబ్ద.





















