English | Telugu

సుధీర్ మళ్ళీ రాబోతున్నాడా ?

బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్. ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా హీరో కి కూడా ఉండరు. ఏ షోలో చేస్తాడో ఆ షోకి ఫుల్ రేటింగ్ గ్యారెంటీ. పదేళ్లుగా జబర్దస్త్ షోలో ఎంటర్టైన్ చేస్తూ ఇటీవలే అక్కడ నుంచి వెళ్లిపోయే ఇంకొన్ని షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, నాగబాబు, రోజా, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, గెటప్ శీను, హైపర్ ఆది, ధనరాజ్, వేణు వంటి సీనియర్స్ అందరూ వెళ్లిపోయేనారు. ఆ తర్వాత జబర్దస్త్ లో అసలు లోపలేం జరుగుతోంది అనే విషయాలపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్ కాక పుట్టించాయి.

ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఓపెనప్ అయ్యి కొంతమంది ఆర్పీ కామెంట్స్ కి ఖండించారు , ఇంకొందరు అవే నిజలాంటూ చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా సుధీర్ వెళ్లిపోయేసరికి రష్మీ ఆ షోని హ్యాండిల్ చేస్తోంది. ఐతే మల్లెమాల నుంచి కొంతమంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు మొత్తం మళ్ళీ ఈ షోకి తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా కోరారు అలాగే వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట.

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో అక్క బావెక్కడ అంటూ రష్మిని అనడం చూస్తూ ఉంటె సుధీర్ ని త్వరలో ఈ షోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సుధీర్ తిరిగి వస్తాడో రాడో అనే విషయాన్ని పక్కన పెడితే రెండు చోట్ల షోస్ చేయడం కుదరక, అగ్రిమెంట్ టైం కూడా ఐపోవడంతో వెళ్లిపోయాడని ఆది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఈ సుధీర్ ఎంట్రీ గురుంచి ఈ ప్రోమో ద్వారా చెప్పిద్దామని చూసారా ? లేదా నిజంగానే వస్తాడా అనే విషయం తెలియాలంటే కొంత కలం వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.