English | Telugu

Brahmamudi : తప్పు ఒప్పుకున్న సాండి.. కావ్య పాపని మార్చేశారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -930 లో.... కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. బావ అలా స్టేషన్ నుండి తప్పించుకొని మరొక కేసులో ఇరుకున్నాడని అప్పు ఇంట్లో వాళ్ళతో అంటుంది. ఏంటే నువ్వు చేసే డ్యూటీ.. గొప్ప సిన్సియర్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నవా అని అప్పుపై ఇందిరాదేవి కోప్పడుతుంది. నువ్వు అంత నిజాయితీగా పని చేస్తే.. రాజ్ ని అరెస్ట్ చెయ్యడం కాదు.. వాడు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించమని ఇందిరాదేవి అంటుంది.

అ తర్వాత అప్పు బయటకు వెళ్తుంది. కళ్యాణ్ తన వెంటే వెళ్తాడు. ఆ తర్వాత స్టేషన్ లో ఉన్న సాండి దగ్గరికి అప్పు, కళ్యాణ్ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడే ఇన్‌స్పెక్టర్ వస్తాడు. మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు లీవ్ లో ఉన్నావని అంటాడు. మా బావ గారిని అరెస్ట్ చెయ్యమన్నప్పుడు కూడా నేను లీవ్ లోనే ఉన్నాను కదా సర్.. ఇప్పుడు లీవ్ అని అంటున్నారని అప్పు అనగానే ఇన్‌స్పెక్టర్ సైలెంట్ అవుతాడు. మీరు FIR లో పదో తేదీ నా ఆఫీస్ కి వచ్చి మా బావకి ఇతను డబ్బు ఇచ్చినట్లు రాసాడు కానీ అ రోజు మా ఇంట్లో శ్రీమంతం జరిగింది ఎలా పాజిబుల్ అవుద్దని శ్రీమంతం రోజు ఫొటోస్ చూపిస్తుంది అప్పు. అ తర్వాత సాండి నేనే తప్పు చేసానని ఒప్పుకుంటాడు.

మరొకవైపు కావ్యకి పాప పుడుతుంది. పాప వెయిట్ తక్కువ గా ఉంది. ఇంకుబేటర్ లో పెట్టాలని డాక్టర్ అంటుంది. ఒకసారి చూపించండి అని కావ్య అనగానే డాక్టర్ చూపిస్తుంది. మరొకవైపు మినిస్టర్ భార్యకి కూడా పాప పుడుతుంది. ఆ పాప పుట్టినప్పుడు ఏడవదు. దాంతో తనని కూడా ఇంకుబేటర్ లో పెడుతారు. తరువాయి భాగంలో కావ్యకి తన పాపని ఇస్తారు. తనని చూసి ఈ పాప నా పాప కాదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.