English | Telugu

Illu Illalu Pillalu: శ్రీవల్లిని బెదిరించిన విశ్వ.. ధీరజ్ ఆన్ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-368 లో.. అమూల్య ఎంగేజ్ మెంట్ కి తనకి రింగ్ తీసుకోవడానికి ప్రేమ, ధీరజ్ బైక్ పై వెళ్తారు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ప్రేమ బాగుందని కాంప్లిమెంట్ ఇస్తాడు షాప్ అతడు. అది చూసి ధీరజ్ కుళ్ళుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి గొడవపడుతుంటారు. అది చూసిన‌ షాప్ అతను.. మీది లవ్ మ్యారేజ్ కదా అని అంటాడు. ఎస్ ఎలా కనిపెట్టారని ప్రేమ అనగానే మీ అల్లరి చూసి అని షాప్ అతను అంటాడు.

ఇక ధీరజ్ ఒక రింగ్ సెలెక్ట్ చేసి ఎలా ఉందో చెక్ చేయడానికి ప్రేమ చేతి వేలికి పెడతాడు. ‌ఇక ఆ రింగ్ ప్రేమకి బాగా నచ్చుతుంది. అది వేలికి గట్టిగా ఫిక్స్ అయిందని రావట్లేదని ప్రేమ యాక్ట్ చేస్తుంది. షాప్ అతను కూడా ప్రేమతో కలిసి యాక్ట్ చేస్తాడు. దాంతో ధీరజ్ చేసేదేమీ లేక ప్రేమకి ఆ రింగ్, అమూల్యకి మరో రింగ్ ని తీసుకుంటాడు. ఇక ఇద్దరు అక్కడి నుండి బయల్దేరి వస్తారు.

మరోవైపు శ్రీవల్లి ఏ చీర కట్టుకోవాలని సంబరపడుతుంది. అదే సమయంలో శ్రీవల్లికి విశ్వ కాల్ చేస్తాడు. ఇంట్లో శుభకార్యం జరగకుండా చూసుకోవాలి.. నువ్వే ఈ ఎంగేజ్ మెంట్ ఆపాలని శ్రీవల్లితో విశ్వ అంటాడు. అలా చేయనని శ్రీవల్లి అంటుంది. అయితే నీ ఫోటోలు మీ మామయ్యకి పంపిస్తానని విశ్వ అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతూ అంటుంది. ఈ ఎంగేజ్ మెంట్ జరిగితే.. నీ నిజస్వరూపాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్తానని విశ్వ బెదిరిస్తాడు. ‌దాంతో శ్రీవల్లి సరేనంటుంది.

ఇక అదే కోపంతో భాగ్యంకి కాల్ చేస్తుంది శ్రీవల్లి. నీ వల్లే ఆ బండోడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భాగ్యాన్ని శ్రీవల్లి తిడుతుంది. ‌నువ్వు ఏం టెన్షన్ పడకు బేబీ.. నేను అక్కడికే వస్తున్నాను.. చక్రం తిప్పుతానని భాగ్యం అనగానే సరేనని శ్రీవల్లి అంటుంది.

మరోవైపు ప్రేమ నగలు వేసుకొని రెడీ అవుతుంది. అవి ప్రేమకి వాళ్ళ అమ్మ ప్రేమతో ఇచ్చిన నగలు..‌ కానీ ధీరజ్ వాళ్ళ నాన్న రామరాజు మాటలు పడటానికి కారణం కూడా అవే నగలు.. ఇక ప్రేమ ఆ నగలతో రెడీ అవ్వడం ధీరజ్ చూస్తాడు. వెంటనే వాటిని తీసేయమని ధీరజ్ అంటాడు. ప్రేమ డిజప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.