English | Telugu

ఫీలింగ్స్ ని ఆపుకోలేక విష్ణుప్రియ...అలా చేసిందని అర్థమైంది?

బిగ్ బాస్ సీజన్-8 లో పదకొండో వారం ఫ్యామిలీ వీక్ తో సాగింది. హౌస్ లో మొత్తం పది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ప్రేరణ, టేస్టీ తేజ ఫ్యామిలీ మినహా అందరి ఫ్యామిలీస్ వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ వచ్చాడు. ఇక అతను వచ్చే ముందు గార్డెన్ ఏరియాలో ఫుల్ ఆఫ్ బెలూన్స్ తో చిన్నపాటి వాలెంటైన్స్ డే లా ఏర్పాట్లు చేశాడు.

ఇక ప్రేరణ గ్లామర్ గా రెడీ అయి శ్రీపాద్ కోసం వెయిట్ చేస్తుంటే.. అతను వచ్చాడు. ఇక ప్రేరణ ఎగిరి గంతేస్తూ వెళ్ళి హగ్ చేసుకుంది. ఇక ముద్దులతో ముంచేసింది. అదంతా లోపల ఉన్న హౌస్ మేట్స్ చేశారు. ఇక బయట ప్రేరణ-శ్రీపాద్ కేక్ తినిపచుకుంటు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే లోపల ఉన్నవాళ్ళంతా ఫీల్ అయ్యారు. బిగ్ బాస్ అనూజను పంపించండి అంటు అవినాష్ , అయ్యో బిగ్ బాస్ మా సింగిల్ అమ్మాయిలకి ఎందుకిలా చూపిస్తున్నారంటు యష్మీ తను సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక మన రోత లవర్స్ మళ్ళీ కంపు చేశారు.

విష్ణు ప్రియ ఆపుకోలేక పృథ్వీ దగ్గరకు వెళ్లి.. తన చున్నీ తీసి పృథ్వీని ఆ ముసుగులోపలికి లాక్కుంది. ఇక పక్కనే ఉన్న తేజ.. ఏయ్ ఏం చేస్తున్నారూ.. ఏంటి బ్రో అని గట్టిగా అరవడంతో.. ఆ ముసుగు నుంచి బయటకు వచ్చారు విష్ణూ, పృథ్వీలు. ఇలా చేస్తున్నారేంటని తేజా అనడంతో.. బయట వాళ్ల రొమాన్స్ చూస్తుంటే.. ఆ వేడి ఇక్కడి వరకూ తగులుతుందంటూ తన కరువుని బయటపెట్టింది విష్ణుప్రియ. అది చూసిన అందరికి ఆమె సరదా కోసం చేయలేదని ఫీలింగ్స్ ని ఆపుకోలేక అలా చేసిందని అర్థమైంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.