English | Telugu

విష్ణుప్రియ నామినేషన్ డొల్ల... మణికంఠ సింపథీ కార్డు!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ల పరంపర నిన్నటితో ముగిసింది. ఇక హౌస్ లో కొంతమంది ఫేవరెటిజం చూపిస్తున్నారని సోనియా, కిర్రాక్ సీత తమ నామినేషన్ లో చెప్పగా నిన్న విష్ణు ప్రియ, మణికంఠ నామినేషన్ ఆసక్తిగా సాగింది.

శేఖర్ బాషా కాస్త లేజీగా ఉన్నారంటూ విష్ణు ప్రియ నామినేట్ చేసింది. అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావంటూ సోనియాను నామినేట్ చేసింది. దీనికి కాసేపు సోనియా గొడవ పెట్టుకుంది. ఇక తనతో వాదించి వేస్ట్ అనుకున్న విష్ణు సర్లే అని వదిలేసింది. ఇక వీరిలో శేఖర్‌‌ను నామినేట్ చేస్తూ యష్మీ డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత ప్రేరణ తన నామినేషన్ చెప్పడానికి వచ్చేసింది. మణికంఠ పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు.. గొడవ పెట్టుకునేంత కాన్సట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బావుండేదంటూ ప్రేరణ నామినేట్ చేసింది. అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెబుతుంటే మణికంఠ తన కన్నీటి పర్యంతం మొదలెట్టాడు. నేను ఒక్కో పాయింట్‌కి ఆన్సర్ చేస్తా అండి.. నాకు అంత జ్ఞాపకశక్తి లేదండి.. నా పేరామీటర్ అయిపోయింది.. 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను.. స్టేప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డా.. అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నా.. నా భార్య దూరమైంది.. నా కూతుర్ని దూరం చేస్తుందంటూ తన బాధలన్ని చెప్పుకుంటు.. ఏం తెలుసని క్లాప్స్ కొడుతున్నారంటూ మణికంఠ ఏడ్చేశాడు.

ఇక తన ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ విని ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా చీఫ్‌ యష్మీ అయితే సీట్లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత ఇంత ఎమోషనల్ డ్యామేజ్ అవసరం లేదంటూ యష్మీ చెప్పుకొచ్చింది. మరి మణికంఠ నామినేషన్ లో మాట్లాడింది కరెక్టేనా.. అతని సింపథీ కార్డు ఫలిస్తుందా లేదా కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.