English | Telugu

'గోరింటాకు'లో ఏడుపు సీన్ల హీరోయిన్‌ శ్రీవల్లి బ్యాగ్రౌండ్ తెలుసా?

'పెళ్లి ఎప్పుడు?' - ప్రతి అమ్మాయి ఏదొక సమయంలో ఈ ప్రశ్న ఎదుర్కొంటుంది. కావ్యశ్రీకీ ఎదురైంది. ఇంట్లో వాళ్ళ నుండి. "నాకు పాతికేళ్ళు వచ్చేవరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావొద్దని మా ఇంట్లోవాళ్ళకు చెప్పాను. అప్పటివరకూ కెరీర్ మీద దృష్టి పెడతానని చెప్పా. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళతా. అలాగని, నాకు పెద్ద లక్ష్యాలు ఏమీ లేవు" అని కావ్యశ్రీ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త మంచివాడు అయితే చాలు అని, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదని అంటోంది.

స్టార్ మా సీరియల్ 'గోరింటాకు'తో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న కావ్యశ్రీ తెలుగు అమ్మాయి కాదు. బెంగళూరు ముద్దుగుమ్మ. కావ్యశ్రీ బ్యాగ్రౌండ్ ఏంటంటే...

○ కావ్యశ్రీకి డాన్స్ అంటే ఎంతోఇష్టం. స్కూల్, కాలేజ్... ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగితే కావ్యశ్రీ గ్రూప్ డాన్స్ కంపల్సరీ. అమ్మాయి డాన్స్ చూసిన తల్లితండ్రులు సీరియళ్ళలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అప్పటివరకు నటన గురించి ఆలోచించని కావ్యశ్రీకి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.

○ ఇంటర్ సెకండియర్ చదివే సమయం నుండి ప్రయత్నాలు ప్రారంభించింది. నాలుగేళ్ళ తర్వాత, బీఎస్సీ పూర్తి చేశాక అవకాశం వచ్చింది. కన్నడ సీరియల్ 'నీలి'లో సెకండ్ హీరోయిన్ రోల్ దక్కింది. అందులో 200 ఎపిసోడ్లు చేసింది.

○ కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో తెలుగు ఛానల్ 'స్టార్ మా' నుండి పిలుపు రావడంతో హైదరాబాద్ వచ్చింది. 'గోరింటాకు'లో శ్రీవల్లి పాత్ర చేసే అవకాశం దక్కింది. అందులో ఆమెవి ఎప్పుడూ ఏడుపు సీన్లే. దాంతో మీమ్ పేజీల్లో పాపులర్ అయ్యింది.

○ 'గోరింటాకు' తర్వాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ' సీరియల్ చేసే అవకాశం అందుకుంది. సోమవారం (జూలై 19) నుండి ఈ సీరియల్ ప్రసారం అవుతుంది.

○ సీరియళ్ళు చేస్తూనే సినిమాల్లో ప్రయత్నించింది కావ్యశ్రీ. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన 'అంజనీపుత్ర'లో ఇంపార్టెంట్ రోల్ చేసింది. సీరియళ్ళతో పోలిస్తే సినిమా వాతావరణం భిన్నంగా ఉందని, అది తనకు నచ్చలేదని చెప్పింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.