English | Telugu

అన్ స్టాపబుల్ కొత్త సీజన్ ట్రైలర్.. ఒక చిన్న సినిమా కథే!

తెలుగు ఓటీటీ టాక్ షోస్‌ లో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నది ఆహా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లోకి ఎంట్రీ ఇస్తోంది. దసరా పండగను సందర్భంగా కొత్త సీజన్ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదొక యానిమేషన్ ట్రైలర్. ఇందులో బాలయ్య సూపర్ హీరోగా కనిపించాడు. సుమారు నాలుగు నిమిషాలు ఉన్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

అక్టోబరు 24వ నుంచి అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది. ప్రతీ ఎపిసోడ్ పండగలా ఉండబోతోంది. ఈ షో దెబ్బకు థింకింగ్ మారి తీరాలా. వచ్చే అతిధులకు ప్రశ్నల ఘాటు పెంచుతాం అని బాలయ్య చెప్పారు. వాళ్లకు మర్చిపోలేని ఆతిథ్యం ఇస్తాం అని కూడా అన్నారు. గత సీజన్ల కంటే సీజన్‌ 4 అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇక ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఒక రాజ్యం అందులో ..ఆ రాజ్యంలో కొంతమంది ప్రజలను బానిసల్లా చూస్తూ ఉంటారు. ఇంతలో మెరుపులు మెరవడం వాళ్ళను కాపాడడానికి బాలయ్య వస్తున్న ఇండికేషన్స్ ఇవ్వడం నిజంగా ఒక చిన్న సినిమా కథలా ఉంది ఈ ట్రైలర్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.