English | Telugu

ఓటింగ్ లో టేస్టీ తేజ టాప్.. డేంజర్ జోన్ లో విష్ణుప్రియ!

బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం జరిగిన నామినేషన్ లో కన్నడ బ్యాచ్ ప్రేరణ, యష్మీ, నిఖిల్, పృథ్వీ కలిసి టేస్టీ తేజ, అవినాష్ ని టార్గెట్ చేశారు. ఇక దాని ఇంపాక్ట్ ఓటింగ్ లో తెలుస్తుంది. కన్నడ బ్యాచ్ కి అసలు ఓటింగే పడటం లేదు.

టాప్ లో టేస్టీ తేజ ,గౌతమ్ ఉండగా.. లీస్ట్ లో పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ ఉన్నారు. ఇక బిగ్ బాస్ చూడటానికే అసహ్యం కలిగించేలా చేస్తున్న విష్ణుప్రియకి నెట్టింట రోజు రోజుకి ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పిన మారలేదు విష్ణుప్రియ.. రోహిణి పక్కకి పిలిచి చెప్పిన మారలేదు.. ఇక ఈ ఫ్యామిలీ వీక్ లో విష్ణుప్రియ వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పినా వింటదనే గ్యారెంటీ మాత్రం లేదు. ఎందుకంటే తను పృథ్వీకి బాగా కనెక్ట్ అయ్యింది. ఎంతలా అంటే మొన్న నామినేషన్ లో రోహిణి తనకి సపోర్ట్ చేయలేదని చెప్పగానే నాకు పృథ్వీకి ఎన్ని గొడవలున్నా అల్టిమేట్ గా నాకు పృథ్వీ అంటేనే ఎక్కువ ప్రియారిటీ అని అందరి ముందు చెప్పింది. అయితే ఇది బిగ్ బాస్ మామ ఎడిటింగ్ లో లేపేస్తాడేమో అని లైవ్ చూసిన వాళ్ళంతా అనుకున్నారు కానీ ఎడిటర్స్ విష్ణుప్రియ గురించి నెగెటివ్ కంటెంట్ ఎంత లేపేసిన తన బిహేవియర్ అలానే ఉండటంతో ఆమె చెప్పింది అలానే ఉంచేశారు.

ఇక హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు అవినాష్‌.. కానీ తనకే ఓటింగ్ పడటం లేదు. ఎందుకంటే విష్ణుప్రియ అందాలని ఆరాధించే కొంతమంది బ్యాచ్ అంతా కలిసి తనకి ఓట్ చేయడంతో హౌస్ లో జెన్యున్ గా ఉండే రోహిణి, అవినాష్, నబీల్, తేజ లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మరి బిగ్ బాస్ ఈ వారం కన్నడ బ్యాచ్ నుండి ఒక్కరినైనా బయటకి పంపిస్తాడా లేక ఎప్పటిలాగ తెలుగు కంటెస్టెంట్స్ ని బయటకు పంపిస్తాడో చూడాలి మరి. తేజ, గౌతమ్ అత్యధికంగా అరవై శాతంతో మొదటి, రెండు స్థానాలలో ఉండగా.. ఇక డేంజర్ జోన్ లో అవినాష్, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.